
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన అన్నా
మార్కాపురం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ మార్కాపురం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని వివరించారు. ఈయన వెంట ఏపీ మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ మీర్జా షంషేర్ ఆలీబేగ్‌తో పాటు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఇంటి గోడపై పిడుగు
● 10 గృహాల్లో కాలిపోయిన విద్యుత్ పరికరాలు
మార్కాపురం: పట్టణంలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, పిడుగులతో కురిసిన వర్షం ప్రభావం చూపింది. 5 గంటల సమయంలో జవహర్‌నగర్ కాలనీలో రిటైర్డు టీచర్ బి.వెంకటేశ్వరరెడ్డి ఇంటిబయట గోడలపై పిడుగు పడింది. ఆ తీవ్రతకు ఆయన ఇంట్లోని విద్యుత్ ఉపకరణాలైన ఫ్రిజ్, టీవీ, ఏసీలతో పాటు సమీపంలో ఉండే మరో తొమ్మిది గృహాల్లో కూడా విద్యుత్ గృహోపకరణాలు కాలిపోయాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. పిడుగు తీవ్రతకు గోడ సగభాగం దెబ్బతింది.
అంబులెన్స్ ఢీకొని వ్యక్తి మృతి
గిద్దలూరు రూరల్: అంబులెన్స్ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణం సమీపంలోని హైవేరోడ్డులో చాణిక్యస్కూల్ వద్ద గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..రాచర్ల మండలం సత్యవ్యోలు గ్రామానికి చెందిన కత్తి కిషోర్(33) బైక్‌పై గిద్దలూరుకు వస్తున్న సమయంలో అంబులెన్స్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అతడి తలకు తీవ్రగాయాలై రక్తస్రావమైంది. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం తొలుత పట్టణంలోని ఏరియావైద్యశాలకు తరలించారు. వైద్యుల సలహామేరకు మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సీఐ కె.సురేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మూడేళ్ల చిన్నారి అపహరణ
సింగరాయకొండ: బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తానని చెప్పి మూడేళ్ల చిన్నారిని అపహరించారు. ఈ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం..పాతసింగరాయకొండ పంచాయతీ బాలిరెడ్డినగర్‌కు చెందిన చిలకూరి రాజేశ్వరి బుధవారం మధ్యాహ్నం తన మనమరాలు చిలకూరి ఐశ్వర్యను తీసుకుని స్థానిక రైల్వేస్టేషన్ వద్దకు వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఇద్దరు కుర్రాళ్లు పాపను ఆడిస్తూ బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తానని చెప్పి తీసుకుని వెళ్లి తీసుకురాలేదు. ఆ కుర్రాడి కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి గురువారం ఉదయం పాత తండ్రి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. పాపను తీసుకెళ్లిన వ్యక్తి లింగసముద్రం అని నాయనమ్మ రాజేశ్వరి చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నాయనమ్మ రాజేశ్వరి బుధవారం పాపను తీసుకుని వచ్చి బొట్టుబిళ్లలు, డైపర్లు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని, ఎస్సై తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేసి పాపను రక్షించి కుటుంబసభ్యులకు అప్పగిస్తామని ఎస్సై పేర్కొన్నారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన అన్నా

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన అన్నా

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన అన్నా

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన అన్నా