
జీవన ప్రమాణాలు పెంపొందేలా విజన్ ప్లాన్
ఒంగోలు సబర్బన్: ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందేలా నియోజకవర్గ స్థాయి విజన్ ప్లాన్‌ను రూపొందించడంలో ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. ఒంగోలులోని ఎన్జీఓ హోంలో స్వర్ణాంధ్ర– 2047 విజన్ డాక్యుమెంట్‌లో భాగంగా నియోజకవర్గాల విజన్ డాక్యుమెంట్ రూపకల్పన, ముఖ్య నిర్దేశిత లక్ష్యాలపై ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు సంబంధించి సోమవారం ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో కలెక్టర్ కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పాల్గొని మాట్లాడారు. జిల్లా విజన్ ప్లాన్‌ను రూపొందించారన్నారు. నియోజకవర్గ స్థాయి పరిస్థితులను, వనరులను పూర్తిగా అధ్యయనం చేసి, వాటికి తగ్గట్టుగా సృజనాత్మకంగా ఆలోచించి, ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా విజన్ డాక్యుమెంట్‌ను తయారు చేసేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వటానికి వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒక నియోజకవర్గంలో రానున్న సంవత్సరాల్లో ఏ సెక్టార్‌లో అభివృద్ధి, వృద్ధి రేటు ఎలా ఉంటుంది, వాటిని ఎలా అభివృద్ధి చేయాలన్న అంశాలపై నియోజకవర్గాల వారీగా యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గ స్థాయి పరిస్థితులను, వనరులను పూర్తిగా అధ్యయనం చేసి, వాటికి తగ్గట్టుగా సృజనాత్మకంగా ఆలోచించి ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ఈ వర్క్ షాప్‌లో ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల సీపీఓలు వెంకటేశ్వరరావు, రఘురామయ్య, ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ సలహాదారు సీతాపతి, రెండు జిల్లాలకు చెందిన నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, సీవీఏపీ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ స్థాయి పరిస్థితులపై అధ్యయనం ప్రకాశం, నెల్లూరు జిల్లాల స్వర్ణాంధ్ర–2047 విజన్ డాక్యుమెంట్‌పై వర్క్‌షాప్‌లో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా