
లారీ ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి
సింగరాయకొండ: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతిచెందిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం జాతీయ రహదారిపై మండలంలోని శానంపూడి జంక్షన్ వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శానంపూడి జంక్షన్ వద్ద నలభై ఏళ్ల వయసున్న గుర్తుతెలియని మహిళ రోడ్డు దాటుతుండగా, కావలి నుంచి ఒంగోలువైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఆమె తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని 108 అంబులెన్స్‌లో కందుకూరు ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు.

లారీ ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి