Jaya
-
డియోర్ బ్యాగ్‌పై క్లారిటీ.. ఎవరీ జయ కిషోరి
ఢిల్లీ: ఆధ్యాత్మిక వక్త జయ కిషోరి సుమారు రూ.2 లక్షల విలువైన డియోర్ బ్యాగ్‌తో ఇటీవల ఎయిర్‌పోర్టులో కనిపించారు. దీంతో నిరాడంబర జీవితం గడపాలని బోధనలు చేసే.. ఆమె ఇలా ఖరీదైన బ్యాగ్‌తో కనిపించిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆమె ఖరీదై బ్యాగ్ వాడటంపై ఫాలోవర్లు, నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలపై 29 ఏళ్ల జయ కిషోరీ తాజాగా స్పందించారు.‘‘నేను కూడా సాధారణ అమ్మాయినే. సాధారణమైన ఇంట్లోనే ఉంటున్నా. కుటుంబంతో కలిసి జీవిస్తున్నా. యువత కష్టపడాలి. కష్టపడి డబ్బులు సంపాదించాలి. మంచి జీవితం కోసం ఖర్చు పెట్టుకోవాలి. కుటుంబానికి ఇవ్వాలి. మీ కలలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పాను. ఈ బ్యాగ్ కస్టమైజ్డ్. అందులో లెదర్ ఉపయోగించలేదు. కస్టమైజ్డ్ అంటే మన ఇష్ట ప్రకారం తయారు చేసుకోవచ్చు. దానిపై నా పేరు కూడా రాసి ఉంది. ...నేనెప్పుడూ లెదర్ వాడలేదు, వాడను కూడా. నేను దేనినీ వదులుకోలేదు. కాబట్టి నేను అలా చేయమని మీకు ఎలా చెప్పగలను?. నేను సన్యాసిని, సాధువు లేదా సాధ్విని కాదని మొదటి రోజు నుంచే స్పష్టంగా చెబుతున్నా’’ అని ఆమె వివరించారు. జయ కిషోరికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను 12.3 మిలియన్లకు ఫాలో అవుతున్నారు.Jaya Kishori ji Said I'm not BABa or SANT, I'm just ordinary girl !!Waah kya Acting hai phle Dharm k naam pr paisa chapo or fir ye gyaan do . waah DIDI waah 🫡 pic.twitter.com/bCQjD4zedE— Yogesh (@yogesh_xrma) October 29, 2024ఎవరీ జయ కిషోరి..యువ ఆధ్యాత్మిక వక్తగా జయ కిషోరి తన ప్రేరణాత్మక సందేశాల ద్వారా వార్తల్లో నిలిచారు. ఆమె ఆధ్యాత్మిక కథలు చెప్పటంతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆమె వక్తనే కాకుండా సంగీత కళాకారిణీ, కథకురాలు కూడా. జయ కిషోరి 13 జూలై, 1996న కోల్‌కతాలో జన్మించారు. కోల్‌కతాలోని మహాదేవి బిర్లా వరల్డ్ అకాడమీ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఓపెన్ స్కూల్ ద్వారా బి.కామ్ పూర్తి చేశారు. ఆమె ఫాలోవర్స్ ద్వారా 'ది మీరా ఆఫ్ మోడర్న్ వరల్డ్', 'కిషోరి జీ'గా ప్రసిద్ధి చెందారు. జయ కేవలం ఏడేళ్ల వయస్సులోనే బహిరంగంగా ఉపన్యాసం ఇవ్వటం ప్రారంభించారు. ఆమె తన 7 రోజుల నిడివి గల మానసిక కథ 'శ్రీమద్ భగవత్ గీత', 3 రోజుల నిడివి గల 'కథా నాని బాయి రో మేరో'తో గుర్తింపు పొందారు. మరోవైపు.. ఆమె శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఆమె భజనలు యూట్యూబ్‌లో కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. ఆమె జూలై 24, 2021న ‘జయ కిషోరి ప్రేరణ’ అనే కొత్త యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. ఆమె ఛానెల్‌కు దాదాపు 9 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ప్రసిద్ధ పాటల్లో ‘శివ్ స్తోత్ర’, ‘మేరే కన్హా’, ‘సాజన్ మేరో గిర్ధారి’ వంటివి ఉన్నాయి.చదవండి: టికెట్ నిరాకరణ, సిట్టింగ్ ఎమ్మెల్యే అదృశ్యం.. ‘తగిన శాస్తి జరిగిందంటూ’... -
అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం
చిలకలపూడి (మచిలీపట్నం): అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జయ బాడిగ నియమితులయ్యారు. 2022 నుంచి ఆమె కోర్టు కమిషనర్‌గా పనిచేసి ఫ్యామిలీ లా నిపుణురాలిగా పేరొందారు. కుటుంబ న్యాయ సలహాల రంగంలో పలువురికి మార్గదర్శకురాలిగా వ్యవహరించారు. ఏపీలోని విజయవాడలో ఆమె జన్మించారు. 1991–94 మధ్య ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీలో సైకాలజీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులతో బీఏ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. శాంటాక్లారా వర్సిటీ నుంచి లా పట్టాను పొందారు. కాలిఫోర్నియాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అటారీ్నగా, గవర్నర్ కార్యాలయం అత్యవసర సేవల విభాగంలో పనిచేశారు. జయ బాడిగ మంగళవారం న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె తండ్రి బాడిగ రామకృష్ణ 2004–09 వరకు మచిలీపట్నం ఎంపీ (కాంగ్రెస్)గా పనిచేశారు. గర్వకారణంగా ఉంది నాతో పాటు మా కుటుంబ సభ్యులందరికీ గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా తెలుగువారందరు గర్వపడేలా నా కుమార్తె జయ ఘనకీర్తి సాధించటం ఎంతో సంతోషంగా ఉంది. ఆమె ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. తెలుగువారందరు గరి్వంచే విధంగా పనిచేస్తానని జయ చెప్పింది. – బాడిగ రామకృష్ణ, మాజీ ఎంపీ -
పంట సాగుకై.. గుర్రాల విసర్జితాలతోనూ జీవామృతం!
ప్రకృతి వ్యవసాయానికి ముఖ్యంగా అవసరమైనది జీవామృతం. దేశీ ఆవుల పేడ, మూత్రం, బెల్లం తదితర పదార్థాలతో తయారు చేసే జీవామృతం ప్రభావశీలంగా పనిచేస్తుందన్న భావన ఉంది. అయితే, రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో రాజస్థాన్‌కు చెందిన మహిళా రైతు ‘జయ దగ’ అందుకు భిన్నంగా.. గుర్రాల పేడ, మూత్రంతో కూడా ద్రవ జీవామృతాన్ని తయారు చేస్తున్నారు. గిర్ ఆవుల విసర్జితాలతోనే కాకుండా.. గుర్రాల విసర్జితాలతో కూడా ఆమె వేర్వేరుగా ద్రవ జీవామృతం తయారు చేసి తమ పొలాల్లో వివిధ పంటల సేంద్రియ సాగులో ఆమె వాడుతున్నారు.అహ్మదాబాద్‌కు చెందిన మహేశ్ మహేశ్వరి అభివృద్ధి చేసిన ట్యూబ్ పద్ధతిలో అధిక కర్బనంతో కూడిన అడ్వాన్స్డ్ ద్రవ జీవామృతాన్ని ఈ రెండు రకాలుగా జయ గత 8 నెలలుగా తయారు చేసి వినియోగిస్తున్నారు. ఈ జీవామృతంతో తమ వ్యవసాయ క్షేత్రాల్లో నేపియర్ గడ్డి, మునగ, మామిడి తదితర పంటలను సేంద్రియంగా సాగు చేస్తున్నారు.ఆవుల జీవామృతంతో పోల్చితే గుర్రాల విసర్జితాలతో తయారైన జీవామృతం పంటల సాగులో మరింత ప్రభావశీలంగా పనిచేస్తోందని జయ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. అయితే, గుర్రాల జీవామృతాన్ని ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న వేసవి కాలంలో పంటలకు వాడకూడదని, ఇతర కాలాల్లో ఏ పంటలకైనా వాడొచ్చని ఆమె సూచిస్తున్నారు.గుర్రాల పెంపక క్షేత్రాలు..రాజస్థాన్‌కు చెందిన జయ దగ కుటుంబీకుల ప్రధాన వ్యాపారం గుర్రాల ద్వారా ఔషధాల ఉత్పత్తి. ఇందుకోసం సుమారు 2 వేల వరకు గుర్రాలను రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌తో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని ముత్పూర్, రాజాపూర్ గ్రామాల్లో గల తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఆమె పెంచుతున్నారు. పాములు, తేళ్లు కాటు వేసినప్పుడు విరుగుడుగా వాడే ఇంజక్షన్లతో పాటు.. కుక్క కాటు వేసినప్పుడు రేబిస్ సోకకుండా వేసే ఇంజక్షన్లను సైతం పోనిల ద్వారా దాదాపు మూడు దశాబ్దాలుగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఇంజక్షన్లను భారత ప్రభుత్వానికి విక్రయించటంతో పాటు.. అనేక ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు తమ విన్స్ బయో ప్రోడక్ట్స్ సంస్థ ద్వారా ఎగుమతి చేస్తున్నట్లు జయ దగ వివరించారు.అహ్మదాబాద్‌కు చెందిన ఆవిష్కర్త మహేశ్ మహేశ్వరి వద్ద నుంచి పొందిన టెక్నాలజీ ద్వారా జయ ట్యూబ్ పద్ధతిలో అడ్వాన్స్డ్ జీవామృతాన్ని తమ క్షేత్రంలో గత 8 నెలలుగా తయారు చేస్తున్నారు. ట్యూబ్ ద్వారా ప్రత్యేక పద్ధతిలో తయారవుతున్న ఈ అడ్వాన్స్డ్ జీవామృతం తమ పొలాల్లో మంచి ఫలితాలనిచ్చిందని ఆమె సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 43 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఆమె క్షేత్రంలో పెరుగుతున్న నేపియర్ గడ్డి, మునగ తోటలు చాలా ఆరోగ్యంగా, ఆకుపచ్చగా ఆకర్షణీయంగా ఉండటం విశేషం. నేపియర్ గడ్డి, మునగ ఆకు ముక్కలతో పాటు బార్లీ, సోయా, మొక్కజొన్నల మొలకలు, గోధుమ తవుడుతో కూడిన దాణాను కూడా ఆవులు, గుర్రాలకు ఆమె మేపుతున్నారు.50 వేల లీటర్ల ట్యూబ్‌లు రెండు..గుర్రాలు, పోనిలతో పాటు వందలాది గిర్ ఆవుల పోషణ కోసం గత 8 నెలల నుంచి తిమ్మాపూర్ వ్యవసాయ క్షేత్రంలో అనేక ఎకరాల్లో నేపియర్ గడ్డిని, మునుగ ఆకును జయ దగ సేంద్రియ పద్ధతిలో చేస్తున్నారు. ఇందుకోసం 50,000 లీటర్ల సామర్థ్యం గల ట్యూబ్‌లు రెండిటిని ఆమె ఏర్పాటు చేసుకున్నారు. ఒక దాని ద్వారా గిర్ ఆవుల పేడ, మూత్రంతో.. రెండో దానిలో గుర్రాల పేడ, మూత్రంతో అడ్వాన్స్డ్ జీవామృతం తయారు చేస్తున్నారు. ఒక్కొక్క ట్యూబ్ రోజుకు వెయ్యి లీటర్ల అడ్వాన్స్డ్ జీవామృతాన్ని తయారు చేస్తున్నారు.అడ్వాన్స్డ్ జీవామృతం 30 రోజుల్లో తయారవుతుంది!సాధారణ జీవామృతం తయారీ ప్రక్రియకు.. ట్యూబ్ ద్వారా అడ్వాన్స్డ్ జీవామృతం తయారీ ప్రక్రియకు చాలా వ్యత్యాసం ఉంది. ట్యాంకు లేదా డ్రమ్ములో వేసి నీటిలో నాటు ఆవు పేడ, మూత్రం, పప్పులపిండి, బెల్లం, పిడికెడు మంచి మట్టిని కలిపితే.. సాధారణ జీవామృతం 48 గంటల్లో వాడకానికి సిద్ధమవుతుంది. ఇందులో పిప్పి, పీచు, నలకలు అలాగే ఉంటాయి.అయితే, ట్యూబ్‌లో అడ్వాన్స్డ్ జీవామృతం తయారు కావటానికి 30 రోజులు పడుతుంది. ట్యూబ్‌ను ఏర్పాటు చేసుకొని, ఆ ట్యూబ్ పరిమాణాన్ని బట్టి నిర్ణీత పరిమాణంలో పేడ, మూత్రం, కూరగాయలు, పండ్ల వ్యర్థాలు తదితరాలను ద్రవ రూపంలోకి మార్చి ట్యూబ్‌లోకి వేస్తూ ఉంటారు. దీనికి తోడు మహేశ్ మహేశ్వరి రూపొందించిన ప్రత్యేక మైక్రోబియల్ కల్చర్‌ను కూడా తగిన మోతాదులో కలిపి వేస్తూ ఉంటారు. ఇలా ప్రతి రోజూ ట్యూబ్ లోపలికి వేస్తూనే ఉండాలి.30 రోజులు వేసిన తర్వాత నుంచి ప్రతి రోజూ ఎటువంటి పిప్పి, పీచు, నలకలు లేని శుద్ధమైన అడ్వాన్స్డ్ జీవామృతం ట్యూబ్ నుంచి వెలికివస్తుంది. ప్రతి రోజూ ఎంత పరిమాణంలో పేడ తదితరాలను ట్యూబ్‌లో ఒక వైపు నుంచి వేస్తూ ఉంటామో.. ట్యూబ్ వేరే వైపు నుంచి అంతే మోతాదులో అడ్వాన్స్డ్ జీవామృతం బయటకు వస్తుంది. సాధారణ ద్రవ జీవామృతాన్ని 15 రోజుల్లో వాడేయాలి. అయితే, ఈ అడ్వాన్స్డ్ జీవామృతం ఏడాదిన్నర వరకు నిల్వ ఉంటుందని.. అధిక కర్బనం, సూక్ష్మజీవుల జీవవైవిధ్యంతో కూడినదైనందు వల్ల ఎంతో ప్రభావశీలంగా పనిచేస్తుందని మహేశ్ మహేశ్వరి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు.అడ్వాన్స్డ్ జీవామృతం తయారుచేసే ట్యూబ్లుఆర్గానిక్ పురుగుల మందు కూడా..ఆర్గానిక్ పురుగుల మందును కూడా 200 లీటర్ల ట్యూబ్ ద్వారా మహిళా రైతు జయ దగ తయారు చేస్తున్నారు. మహేశ్ మహేశ్వరి నుంచి తెచ్చిన మైక్రోబియల్ కల్చర్ 2 లీటర్లు, 2 కిలోల దేశీ ఆవు పేడ, 10 కిలోల పెరుగుతో చేసిన మజ్జిగ, 40 లీటర్లు దేశీ ఆవు మూత్రం కలిపి ట్యూబ్‌లో పోస్తారు. 30 రోజులు ఇలా పోస్తూనే ఉండాలి. 30 రోజుల తర్వాత ట్యూబ్ నుంచి ఆర్గానిక్ పురుగుమందును తీసుకొని వాడుకోవచ్చు. ఈ పురుగు మందును నేరుగా పంటలపై చల్లకూడదు. 1 లీ. పురుగుమందును 1 లీ. నాటు ఆవు మూత్రం, 1 లీ. పుల్ల మజ్జిగ, 17 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి. ఈ ఆర్గానిక్ పురుగుమందును పిచికారీ చేసిన రోజు జీవామృతం పిచికారీ చేయకూడదని జయ తెలిపారు.అడ్వాన్స్డ్ జీవామృతం అరెకరానికి ఉచితం!రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లోని తమ క్షేత్రానికి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న రైతులు ఎవరైనా సేంద్రియ వ్యవసాయం చెయ్యాలనుకుంటే.. ఒక్కో రైతుకు అరెకరానికి సరిపోయే అడ్వాన్స్డ్ జీవామృతాన్ని ఉచితంగా ఇస్తాను. వరి లేదా పత్తి వంటి పంటలకు ఎకరానికి 400 లీటర్ల అడ్వాన్స్డ్ జీవామృతం అవసరం ఉంటుంది. ఒక్కో రైతుకు అరెకరానికి సరిపడా 200 లీటర్లను రెండు దఫాలుగా ఇస్తాను. గిర్ ఆవుల జీవామృతం లీటరు రూ. 10, గుర్రాల జీవామృతం లీటరు రూ. 15, ఆర్గానిక్ పురుగుల మందు లీటరు రూ. 20కి విక్రయిస్తున్నాం. వీటితో సాగు చేసిన నేపియర్ గడ్డి మేపిన తర్వాత గిర్ ఆవు పాలలో కొవ్వు శాతం 3.4 నుంచి 4.7కు పెరిగింది. ఇతర వివరాలకు డాక్టర్ వెంకటేశ్ (98482 09696)ను సంప్రదించవచ్చు. – జయ దగ, మహిళా రైతు, తిమ్మాపూర్, రంగారెడ్డి జిల్లా, jsd@vinsbio.inరోజూ వెయ్యి లీటర్లు..50 వేల లీటర్లు పట్టే ట్యూబ్ నుంచి మహిళా రైతు జయ దగ వెయ్యి లీటర్ల జీవామృతం పొందుతున్నారు. అంతే మొత్తంలో లోపలికి పోస్తున్నారు. ప్రతి బ్యాచ్‌లో 30 కేజీల ఆవులు లేదా గుర్రాల పేడ, 40 లీ. మూత్రం, 20 కిలోల బెల్లం, 10 కిలోల పండ్లు, 20 కిలోల కూరగాయలు, 10 కిలోల కలబంద జ్యూస్, 300 లీటర్ల జీవామృతంతో పాటు మిగతా 430 లీటర్ల నీటిని కలిపి ట్యూబ్‌లో పోస్తున్నారు. ఈ రోజు పోసింది నెలరోజుల తర్వాత అడ్వాన్స్డ్ జీవామృతంగా మారి బయటకు వస్తుంది. ఏడాదిన్నర నిల్వ ఉంటుంది..సాధారణ జీవామృతంలో నలకలు పిప్పి ఉంటుంది. అయితే, ట్యూబ్‌లో గాలి తగలకుండా 30 రోజులు మగ్గిన తర్వాత అసలు ఏ నలకలూ, చెత్త లేని జీవామృతం వెలువడుతుంది. ఇందులో కర్బనం 15% వరకు ఉంటుందని, అందువల్ల ఇది సాధారణ జీవామృతం కన్నా ప్రభావశీలంగా పనిచేస్తుందని మహేశ్ మహేశ్వరి చెబుతున్నారు.సాధారణ జీవామృతం 15 రోజుల తర్వాత పనికిరాదు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం కలియతిప్పాలి. అయితే, ట్యూబ్ జీవామృతం కనీసం ఒక ఏడాది నుంచి ఏడాదిన్నర కాలం వరకు నిల్వ ఉంటుంది. ప్రతి రోజూ కలియతిప్పాల్సిన అవసరం లేదు. బ్యారెల్స్‌లో నింపుకొని నిల్వ చేసుకుంటే చాలు. మరో విషయం ఏమిటంటే.. ట్యూబ్‌ని కానీ, దానిలో తయారైన జీవామృతాన్ని గానీ నీడలోనే ఉంచాలన్న నియమం లేకపోవటం మరో విశేషం అని జయ దగ చెబుతున్నారు. ఈ ప్రత్యేకతల వల్ల అడ్వాన్స్డ్ జీవామృతాన్ని ఒక చోట తయారు చేసి, దూర ప్రాంతాలకు కూడా రవాణా చేసుకొని అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు. ట్యూబ్ టెక్నాలజీ వల్ల తమకు గడ్డి సమస్య శాశ్వతంగా తీరిపోయిందని ఆమె సంతోషిస్తున్నారు. – పంతంగి రాంబాబు, సాక్షి, సాగుబడి డెస్క్ -
హాంగ్‌కాంగ్‌లో బుజ్జాయిలతో భోగిపండ్లు
ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య స్థాపించక ముందు నుంచే దాదాపు రెండు దశాబ్దాలుగా భోగిపండ్లు వేడుకని చేస్తున్న, వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి తమ సంతోషాన్ని తెలుపుతూ ఈ సంవత్సర నిర్వహించిన భోగిపండ్ల సరదాల విశేషాలు తెలిపారు. ముఖ్య అతిధులు స్థానిక యునెస్కో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు శ్రీ తిరునాచ్ దంపతులు మరియు బాలవిహార్ గురువు శ్రీమతి చిత్ర జికేవీ దంపతులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా పిల్లలకు భోగి పండ్లు పొసే అంశాన్ని కొనసాగించారు. పిల్లలు సందడిగా చాకోలెట్లు ఏరుకొంటూ, మరి కొందరు అవి తినే ప్రయత్నం చేస్తుంటే వారి అమ్మ నాన్నలు వద్దని ఆరాట పడుతుంటే చూడ ముచ్చట కొలిపింది. మరింత ఆనందంగా కొనసాగింది పిల్లల కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం. ముఖ్య అతిధులు కూడా పిల్లలకు భోగి పండ్లు పోసీ ఆశీర్వదించి చాలా సంతోశాన్ని తెలిపారు. తమకి ఇటువంటి అనుభవం ఎప్పుడు కలగలేదని అన్నారు. అలాగే మరి కొందరూ.. తమకి ఈ వేడుక అనుభవం తొలిసారిదని, తమ పిల్లలకి అందరితో కలిపి చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. కార్యవర్గ సభ్యులందరు శ్రీమతి రమాదేవి, శ్రీ రమేష్, శ్రీ రాజశేఖర్ అలాగే శ్రీమతి మాధురి అధ్యక్షులు శ్రీమతి జయతో కలసి కార్యక్రమాన్ని నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. విచ్చేసిన సభ్యులందలందరితో పాటు కొందరు పిల్లలు కూడా తమ వంతు సహాయాన్నిఈ కార్యక్రమ నిర్వాహణలో అందించారు. ఈ విషశేషాలను తమ కెమెరాలో అద్భుతమైన జ్ఞాపకికాలుగా అందించారు శ్రీ రవికాంత్. వచ్చే వారం తమ వార్షిక తెలుగు కల్చరల్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నామని, పిల్లలు తమ సంగీత నాట్య కళలను ప్రదర్శించనున్నారని ఉత్సాహంగా తెలిపారు. ఆత్మీయ పాఠకులందరికి మా హాంగ్ కాంగ్ తెలుగు వారి సంక్రాతి పండుగ శుభాకాంక్షలు! ఇవి చదవండి: సందేశాన్నిచ్చిన సంక్రాంతి ముగ్గు.. 'డోంట్ బి అడిక్టెడ్' -
జయకు పాస్‌పోర్ట్ వచ్చిం... దహో!
హమ్మయ్య! జయకు పాస్‌పోర్ట్ అండ్ వీసా వచ్చింది. జయ ఇక హాయిగా నెదర్లాండ్స్‌కు వెళ్లవచ్చు. కొత్త జీవితాన్ని మొదలు పెట్టవచ్చు. ఇంతకీ సదరు జయ మనిషి కాదు. వీధి శునకం. ల్యాబ్రడార్, జర్మన్ షెప్పర్డ్, పమేరియన్లను ముద్దు చేసే వాళ్లలో చాలామంది వీధికుక్కలను మాత్రం ‘అసుంట’ అంటారు. మెరల్ మాత్రం అలా అనుకోలేదు. నెదర్ ల్యాండ్స్‌కు చెందిన మెరల్ మన దేశానికి వచ్చింది. వారణాసిలో ఆమెకు ఒక వీధికుక్క కనిపించింది. ఈ శునకంపై వేరే శునకాలు దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు వాటి బారినుంచి మెరల్ దానిని కాపాడింది. ఆ కృతజ్ఞతతో మెరల్ ఎటు వెళితే అటు వచ్చేది కుక్క. ఆ కుక్కను చూస్తే మెరల్‌కు జాలిగా అనిపించింది. దాని చురుకుదనం, అందం మెరల్‌కు నచ్చి, ఆ కుక్కను దత్తత తీసుకొని నెదర్లాండ్స్‌కు తీసుకు పోవాలని డిసైడైపోయింది. దత్తత, పాస్‌పోర్ట్, వీసా ప్రక్రియ కోసం కొంతకాలం అదనంగా మన దేశంలో ఉంది. ‘పెద్ద ప్రక్రియ పూర్తయి పోయింది. ఎట్టకేలకు జయను నాతోపాటు తీసుకువెళుతున్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్ పెట్టింది మెరల్. -
సీఎం వైఎస్ జగన్‌కు రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు
సాక్షి, అమరావతి: రక్షాబంధన్(రాఖీ పౌర్ణమి) సందర్భంగా గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి బ్రహ్మకుమారీస్ స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు జయ, పద్మజ, రాధ రాఖీలు కట్టారు. బ్రహ్మకుమారీస్ ప్రధాన కార్యాలయం మౌంట్ అబూలో సెపె్టంబరులో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి సీఎం జగన్‌ను వారు ఆహ్వనించారు. సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన హౌస్ కీపింగ్ సిబ్బంది రాఖీ పండుగ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో హౌస్ కీపింగ్ విధులు నిర్వర్తిస్తున్న మహిళా సిబ్బంది గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారిని ఆప్యాయంగా పలకరించారు. సీఎం జగన్ చేతికి రాఖీలు కట్టి మహిళా సిబ్బంది తమ అభిమానాన్నిచాటుకున్నారు. -
హాంకాంగ్‌లో ‘సురభి ... ఏక్ ఎహసాన్ ’
దేశభక్తిని ప్రబోధించే ‘సురభి ఏక్ ఎహసాన్ హాంకాంగ్‌లో ప్రవాస భారతీయుల ప్రత్యేక కార్యక్రమం. అమరవీరులైన సైనికుల స్ఫూర్తిని చాటిన జయ పీసపాటి టోరీ రేడియోల ప్రసారం సాక్షి, సిటీబ్యూరో టోరీ రేడియో పరిచయాల ద్వారా సైనికుల త్యాగాలు, వారి కుటుంబాలపైన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, విశేషాలను సామాన్య ప్రజలకు విస్తృతంగా పరిచయం చేశారు. ఆ జయ పీసపాటి...మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌కు చెందిన ఆమె హాంకాంగ్‌లో నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచే చాలాకాలంగా ఆమె టోరి రేడియో వ్యాఖ్యాతగా సేలందజేస్తున్నారు. తాజాగా ‘సురభి ... ఏక్ ఎహసాన్ ’ అనే పేరుతో మరో ప్రత్యేక కార్యక్రమాన్ని టోరి రేడియో ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటీవల హాంకాంగ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనేక మంది ప్రవాస భారతీయులు పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. పిల్లలు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశ భక్తి పాటలలు, నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో ప్రవీణ్ అగర్వాల్, సౌరభ్ రాఠీలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మంజరి గుహ, నేహా అగర్వాల్ , సాక్షి గోయల్ , సుగుణ రవి, కొరడ భరత్ కుమార్, ప్రశాంత్ పటేల్, శ్రీదేవి బొప్పన, లక్ష్మి యువ,సంజయ్ గుహ, తదితరులు స్వచ్ఛంద సేవకులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయ పీసపాటి నిర్వహించిన ‘ జై హింద్ ’ టాక్ షోలో ఉమేష్ గోపీనాథ్ జాదవ్ పాల్గొని ప్రసంగించారు. ‘సురభి ఏక్ ఎహసాన్‘కార్యక్రమానికి ఆయన అభినందలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘బి ది చేంజ్’ సంస్థ వ్యవస్థాపకులు పూనమ్ మెహతా, రిటైర్డ్ సివిల్ సర్వెంట్ నీనా పుష్కర్ణ, రుట్టోంజీ ఎస్టేట్స్ కంటిన్యూయేషన్ లిమిటెడ్ డైరెక్టర్ రానూ వాసన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతీయ సంఘాల నుంచి పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.కార్గిల్ యుద్ధంలో భారతీయ సైనికులు ప్రదర్శించిన అద్భుతమైన ధైర్యసాహసాలు, పరాక్రమాన్ని శ్లాఘిస్తూ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపాయి. సాయుధ దళాల వైద్య కళాశాలలో చదవాలనే ఆశయాన్ని సాధించలేకపోయినప్పటికీ టోరి రేడియో వ్యాఖ్యాతగా అనేక దేశభక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్న జయ పీసపాటి ‘‘జై హింద్’’ అనే టాక్ షో ద్వారా ఆమె పలువురు సాయుధ దళాల అధికారులు, విశ్రాంత అధికారులు, అమర వీరుల కుటుంబ సభ్యులతో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించి ప్రపంచలోని ప్రవాస తెలుగు వారికి పరిచయం చేశారు. (చదవండి: శాన్ఫ్రాన్సిస్కోలో భారత నూతన కాన్సులేట్ జనరల్‌గా తెలుగు వ్యక్తి!) -
రూ. 750 అద్దె ఇంట్లో నివాసం, సీనియర్ నటి దీనస్థితి.. మంత్రి పరామర్శ
సీనియర్ నటి జయకుమారిని(70) తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ ఆదివారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లో ఐటెం సాంగ్‌ల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది నటి జయకుమారి. ఆ పాటలకు అప్పట్లో అధిక పారితోషికం వస్తుండడంతో తాను శృంగార తారగా మారానని జయ కుమారి ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. 400 పైగా చిత్రాల్లో నటించారు. అయినా ఈమెకు సొంత ఇల్లు కూడా లేదు. ఇప్పుడు రూ. 750కు అద్దె ఇంట్లో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఆమె 2 కిడ్నీలు దెబ్బతినడంతో వైద్యం కోసం స్థానిక కీల్పాక్కంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి ఎం.సుబ్రమణియన్ ఆదివారం ఆమెను పరామర్శించారు. ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా ఆదేశించారు. ఆమెకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం, సొంత ఇంటిని ఏర్పాటు చేసే విషయమై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
దీన స్థితిలో సీనియర్ నటి జయకుమారి.. కిడ్నీలు దెబ్బతినడంతో
చెన్నై: రెండు కిడ్నీలు దెబ్బతినడంతో సీనియర్ నటి జయకుమారి (70) చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం చేరారు. వివరాలు.. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించారు. తమిళంలో నాడోడి చిత్రంతో నటిగా పరిచయం అయిన ఆమె ఎంగిరిందో వందాళ్, గౌరవం, నూట్రుక్కు నూరు, అనాథై ఆనందన్ వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. జయకుమారి భర్త పేరు నాగపట్టినం అబ్దుల్లా. ఈయన చాలాకాలం క్రితమే కన్నుమూశారు. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జైయకుమారి చెన్నై, వేలచ్చేరిలోని అద్దె ఇంట్లో నివశిస్తున్నారు. కాగా ఈమెకు కిడ్నీలు దెబ్బతినడంతో చికిత్స చేసుకునే ఆర్థిక స్థోమత లేక చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. చదవండి: పుష్ప భామకు మరో భారీ ఆఫర్.. బాలీవుడ్‌లోనూ తగ్గేదేలే..! -
నాలుగు గోడల మధ్య నరకాలు నడిచొచ్చిన చోట...
కొన్ని చిత్రాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి... కొన్ని చిత్రాల చిత్రజైత్రయాత్ర మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ‘కేజ్డ్’ అనే లఘుచిత్రం కూడా ఇలాంటిదే! దీనిలో ఎలాంటి కమర్షియల్ గిమ్మిక్కులు లేవు... కన్నీటిబొట్లు ఉన్నాయి. వాటిలోకి ఒకసారి తొంగిచూస్తే మన ఊరు,వాడ, ఇల్లు కనిపిస్తాయి. కరోనా కాలంలో... ముఖ్యంగా లాక్డౌన్ టైమ్‌లో... ఒక ఊళ్లో ఒక భర్త: ‘చికెన్ బిర్యానీ వండిపెట్టమని రెండురోజుల నుంచి చెబుతున్నాను. పుట్టింటి వాళ్లతో మాట్లాడడానికి టైమ్ ఉంటుందిగానీ నేను అడిగింది చేసి పెట్టడానికి మాత్రం టైమ్ ఉండదు. మగాడికి విలువ లేకుండా పోయింది’ మరో ఊళ్లో ఒక భర్త: ఈయన ఇంట్లో ఉండడం కంటే ఆఫీసులో ఉండడమే ‘కుటుంబ సంక్షేమం’ అనుకుంటారు కుటుంబసభ్యులు. ఈ భర్త చాదస్తాల చౌరస్తా. ‘ఇది ఇల్లా అడవా? ఏంచేస్తున్నావు? ఎక్కడి వస్తువులు అక్కడే పని ఉన్నాయి’ అని గర్జించే ఈ భర్తకి టీవికి ఠీవీగా ముఖం అప్పగించడం తప్ప చిన్నచిన్న పనులలో కూడా భార్యకు సహాయం చేయడానికి మనసు రాదు. ఇంకో ఊళ్లో ఇంకో భర్త: ఈయనకు ఏమాత్రం టైమ్ దొరికినా అత్తింటివాళ్లు బాకీపడ్డ అదనపు కట్నం గురించి అదేపనిగా గుర్తొస్తుంది. అలాంటిది లాక్డౌన్ పుణ్యమా అని అతడు రోజంతా ఇంట్లోనే ఉన్నాడు. మాటలతోనే ఇంట్లో వరకట్న హింసను సృష్టించాడు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. లాక్డౌన్ టైమ్‌లో ప్రపంచవ్యాప్తంగా మహిళలు రకరకాల హింసలు ఎదుర్కొన్నారు. ఈ హింసపై ఐక్యరాజ్య సమితి సాధికారికమైన నివేదికను ప్రచురించింది. దీనిని ఆధారం చేసుకొని అమెరికాలో స్థిరపడిన మలయాళీ డైరెక్టర్ లీజా మాథ్యూ ‘కేజ్డ్’ పేరుతో షార్ట్‌ఫిల్మ్ రూపొందించింది. లాక్డౌన్ టైమ్‌లో అక్షరజ్ఞానం లేని మహిళలతో పాటు బాగా చదువుకున్న మహిళలు, ఇంటిపనులకే పరిమితమైన వారితో పాటు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఎదుర్కున్న మానసిక, శారీరక, భావోద్వేగ హింసకు ‘కేజ్డ్’ అద్దం పడుతుంది. చిత్రంలో సంద్ర, జయ, విను, క్లైర్ ప్రధాన పాత్రలు. ప్రాంతం, దేశంతో సంబంధం లేకుండా ప్రపంచంలోని వివిధ రకాల హింస బాధితులకు వీరు ప్రతీకలు. నిజానికి వీరు చిత్రం కోసం బాధితుల అవతారం ఎత్తిన వారు కాదు. నిజజీవితంలోనూ బాధితులే. సంద్ర, జయ, విను, క్లైర్ పాత్రలు పోషించిన సచిన్మై మేనన్, దివ్య సంతోష్, శిల్పఅరుణ్ విజయ్, రిలే పూల్‌లు భిన్నరకాల హింస బాధితులే. రిలే పూల్ విషయానికి వస్తే నిజజీవితంలోనూ ట్రాన్స్జండరే. ‘యువ అమెరికన్లపై హింస జరిగితే, తేరుకొని తిరిగిపోరాడతారు. మనదేశంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా గృహహింసకు సంబంధించిన కేసుల్లో చాలామంది మౌనంగా ఉంటున్నారు. మానసికహింస భౌతికహింస కంటే తక్కువేమీ కాదు’ అంటుంది లీజా మాథ్యూ. కొట్టాయం (కేరళ)కు చెందిన లీజా మాథ్యూ గత పదిసంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడింది. పద్దెనిమిది నిమిషాల నిడివి గల ‘కేజ్డ్’ మానసిక హింస నుంచి లైంగిక హింస వరకు మహిళలు ఎదుర్కొన్న రకరకాల హింసలను బయటపెడుతుంది. మొన్న మొన్నటి ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫెస్టివల్తో సహా లండన్ ఇండీ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్, నయాగరా ఫాల్స్ షార్ట్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్... ఎన్నో చిత్రోత్సవాలలో ప్రదర్శితమై రకరకాల ప్రగతిశీల చర్చలకు కేంద్ర బిందువుగా నిలిచింది. -
నిన్ను చూసి గర్వపడుతున్నా: చహర్ కాబోయే భార్య భావోద్వేగం
‘‘ప్రతిరోజూ ఉదయమే నిద్రలేచి ప్రాక్టీసుకు వెళ్తావు. దేశం కోసం ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ నీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే తపనతో ఉంటావు. నిన్నటి మ్యాచ్‌లోనూ ఈ విషయాన్ని గమనించాను. క్లిష్ట పరిస్థితుల్లోనూ కఠిన శ్రమకు ఓర్చి.. అంకితభావంతో.. ఆట పట్ల నిబద్ధతతోనువ్వు ముందుకు సాగే విధానమే నిన్ను చాంపియన్‌గా నిలుపుతుంది. ఆటలో గెలుపోటములు సహజం. అయితే, గెలిపించేందుకు నువ్వు చేసిన కృషి మాత్రం ఎల్లప్పుడూ దేశాన్ని గర్వపడేలా చేస్తుంది. నీ దేశం కోసం... జట్టు కోసం ఎంతటి కఠిన యుద్ధానికైనా సిద్ధమని చెప్పావు. పట్టుదలగా నిలబడ్డావు. నిన్ను చూసి గర్వపడుతున్నాను. జై హింద్’’ అంటూ టీమిండియా ఆటగాడు దీపక్ చహర్ కాబోయే భార్య జయా భరద్వాజ్ భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశారు. ఆట పట్ల దీపక్‌కు ఉన్న నిబద్ధతతను అక్షరాల రూపంలో పేర్చి అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన ఆఖరి వన్డేలో దీపక్ చహర్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. రెండు కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు 34 బంతుల్లో 54 పరుగులు సాధించి... టీమిండియా ఆఖరి వరకు పోరాటం సాగించడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ 4 పరుగుల తేడాతో రాహుల్ సేన ఓటమి పాలు కావడంతో దీపక్ చహర్ అద్భుత ఇన్నింగ్స్ వృథాగా పోయింది. దీంతో అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడితో పాటే దక్షిణాఫ్రికాలో ఉన్న జయ కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో కాబోయే భర్తను ప్రశంసిస్తూ ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా నోట్ షేర్ చేయడం గమనార్హం. -
వదంతులపై నటి అసహనం..!
ప్రముఖ టీవీ నటి, ‘థప్కీ ప్యార్ కీ’ సీరియల్ ఫేం జయా భట్టాచార్యకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి జయ మరణించారంటూ కొంతమంది నెటిజన్లు ఆమెకు నివాళులు అర్పించారు. మహమ్మారి కారణంగా మరో గొప్ప నటిని కోల్పోయామంటూ సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆమె ఫొటోలను షేర్ చేశారు. ఇక ఈ విషయంపై స్పందించిన జయా భట్టాచార్య.. తాను బతికే ఉన్నానని ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు. ఆరోగ్యంగా ఉన్న తన గురించి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం తగదని.. ఏదైనా పోస్టు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలంటూ అసహనం వ్యక్తం చేశారు. ( జుట్టు తీసేస్తే అందం పోతుంది మేడమ్.. పర్లేదు!) కాగా జంతు ప్రేమికురాలైన జయా భట్టాచార్య.. లాక్డౌన్ కాలంలో ఆహారం దొరకక వీధుల్లో తిరుగుతున్న మూగజీవాల ఆకలి తీర్చేందుకు స్నేహితులతో కలిసి నడుం బిగించారు. లాక్డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సేవా గుణాన్ని వీడలేదు. నోరులేని మూగ ప్రాణులకే కాకుండా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ సెక్స్ వర్కర్లు, ట్రాన్స్జెండర్లకు సైతం ఆహారం అందిస్తున్నారు. అంతేకాదు వారితో కలిసి భోజనం చేసి ట్రాన్స్జెండర్లు కూడా మనలాంటి మనుషులేనంటూ గొప్ప మనసు చాటుకున్నారు. కాగా ముప్పైకి పైగా సీరియళ్లలో నటించిన.. జయ పది సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఆమె.. సామాజిక సేవను మరింత విస్తృతం చేశారు. ఈ ప్రయాణంలో ఆమె ఎంతో మంది అండగా నిలుస్తున్నారు. View this post on Instagram Ha Ha Ha Ha I am alive and kicking Please guy before putting up a post can you cross check Damn....😂😂😂😂 A post shared by Jaya Bhattacharya (@jaya.bhattacharya) on Jun 18, 2020 at 12:13am PDT Include caption By using this embed, you agree to Instagram's API Terms of Use . -
సెక్స్ వర్కర్ల కోసం అందం వద్దనుకుంది !
ఏమిటీ బెదిరింపు! దాదా కూతురైతే మాత్రం?! బెదిరింపు కాదు. దాదా కూతురు దాదాలానే ఉండాలట.వీధిలో చేతులు పైకి మడవాలి. ఆటోవాలాతో గొడవకు దిగాలి.పెట్స్‌ని వదిలేసిన వారి పని పట్టాలి. ‘‘దాదా కూతుర్ని నేను.. అంటోంది జయ. అందం వద్దనుకుంది.దాదాలా ఆదుకునే గుణం ముఖ్యమంది. కరోనా వచ్చిపడింది. మనుషులే ఆఖరి గింజ కోసం బియ్యం డబ్బాలను బోర్లించుకుంటుంటే, వీధుల్లో తిరిగే మూగప్రాణులకు మెతుకులు ఆకాశం నుంచి రాలిపడతాయా? కరోనా ముందు నుంచే.. ఇరవై ఏళ్లుగా స్ట్రీట్ యానిమల్స్‌ని చేరదీసి పోషిస్తున్న జయా భట్టాచార్య దగ్గర కూడా లాక్డౌన్ కాలంలో చివరి మూడు వేల రూపాయలు మాత్రమే అకౌంట్లో మిగిలాయి. అవైనా ఆమె తండ్రికి వచ్చిన పెన్షన్ డబ్బులు. నిమోనియాతో బాధపడుతున్న తొంభై ఏళ్ల తన తండ్రికి చికిత్స చేయించడం కోసం ఆసుపత్రులు తిరుగుతున్నప్పుడే.. ఆమె దాచుకున్న డబ్బంతా కరిగిపోయింది. ముంబైలోని కలిగిన కుటుంబాలలో ఆమెకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. యానిమల్ వెల్ఫేర్ కోసం జయతో వాళ్లు రెండు దశాబ్దాలపాటు చేతులు కలిపి ఉన్నారు కాబట్టి ఈ కరోనా కాలంలో మూగజీవులకు లోటు లేకుండా గడిచిపోతుంది. చేతిలో ఉన్న మూడు వేల రూపాయలతో తనేం చేయగలనని జయ ఆలోచన చేసింది మాత్రం.. సెక్స్ వర్కర్ల కోసం! సెక్స్ వర్కర్ల కోసం భోజనం ప్యాక్ చేస్తున్న జయ లాక్డౌన్లో డొక్కలెండి మూలుగుతున్న జంతువులకు ఆహారం, నీళ్లు ఇవ్వడానికి అనుమతి ఇమ్మని పోలీసులను కోరేందుకు వెళ్లినప్పుడు రోజుల తరబడి తిండి లేక బలహీనంగా ఉన్న మహిళలు కొందరు జయ కంట్లో పడ్డారు. వాళ్లంతా ‘ఉపాధి’ కోల్పోయిన సెక్స్‌వర్కర్లు. తక్షణం వాళ్లకు ఎవరైనా చేయవలసిన సహాయం ఇంత ముద్ద పెట్టడం. జయ తన దగ్గరున్న డబ్బుతో కిచిడీ చేయడానికి అవసరమైన సరకులు కొని, తన సహాయకులతో కలిసి తమ అపార్ట్మెంట్లోనే వండించి సెక్స్ వర్కర్లు ఉన్న చోటుకు తీసుకు వెళ్లారు. వాళ్లకు పెట్టి, వీళ్లూ వారితో కలిసి తిన్నారు. కూర్చోడం దూరంగానే అయినా మాటలు కలబోసుకోడానికి అదేమీ దూరం కాలేదు. అప్పుడే ట్రాన్స్జెండర్లు పడుతున్న ఇక్కట్ల గురించీ జయకు తెలిసింది. అడిగిన వారికి ఇవ్వడం తేలికే. అడగలేని వాళ్ల దగ్గరకు వెళ్లి ఇవ్వడంలోనే ఇబ్బంది ఎదురౌతుంది.. వాళ్లెలా రియాక్ట్ అవుతారోనని. వాళ్ల రియాక్షన్ తర్వాత. చూసేవాళ్లూ?! సెక్స్ వర్కర్లు. ట్రాన్స్జెండర్లు అసలు మనుషులే కాదన్నట్లు ఉంటాయి చూపులు. జయ ఆ చూపుల్ని పట్టించుకోలేదు. తనకున్న ఫ్రెండ్స్ నెట్‌వర్క్‌తో సమీప ప్రాంతాల్లోని ఆ రెండు కమ్యూనిటీల వారికి అవసరమైన సహాయం అందేలా చేయగలిగారు. అక్కడితో ఆగిపోకూడదని కూడా అనుకున్నారు. మంచి పని తలపెట్టినప్పుడు ఎండ పూట కూడా నాలుగు చల్లటి చినుకులు పడతాయేమో! అమెరికాలోని డాలస్ నుంచి జయ అకౌంట్లోకి కొంత డబ్బొచ్చి పడింది. పూర్వపు స్నేహితుడు! ఇక్కడ ఈమె చేస్తున్న పని గురించి అక్కడికి తెలిసింది. ‘నన్నూ హెల్ప్ చెయ్యనివ్వు’ అని డబ్బు పంపాడు. జయ స్ఫూర్తితో టర్కీలో ఒకరు అక్కడి సెక్స్‌వర్కర్లకు, ట్రాన్స్జెండర్లకు సహాయం చేస్తూ ఆ ఫొటోలను జయకు పంపారు. జయ ఆశ్చర్యపోయారు. ఇంకా ఆశ్చర్యం.. ఆమె ఎవర్నీ నోరు తెరిచి అడక్కుండానే రేణుకా సహానే, సుహాసినీ మూలే, సునీతా రజ్వార్, అంకిత్ బాత్లా, ఇంకా.. తన క్లాస్మేట్స్, టీవీ ఫీల్డ్‌లో తనకు జూనియర్లు, సీనియర్లు జయకు డబ్బు పంపారు. జయ కొన్నాళ్ల క్రితం వరకు ‘థ్యాంక్యూ ఎర్త్’ అనే ఎన్జీవోను నడిపారు. 2010లో అది రిజిస్టర్ అయింది. మధ్యలో ఆర్థిక ఇబ్బందులొచ్చి బ్రేక్ పడింది. ఇప్పుడీ ఆర్థిక ప్రోత్సాహంతో సంస్థను మళ్లీ తెరిచే ఉద్దేశంలో ఉన్నారు. ఫ్రెండ్స్ అయినప్పటికీ వారు పంపిన డబ్బులో ఎంత వాడిందీ, దేనికి వాడిందీ ఎప్పటì కప్పుడు లెక్కరాసి పంపుతుంటారు జయ. జయా భట్టాచార్య (41) టీవీ నటి. ‘క్యూంకీ సాస్ భి కభి బహు థీ’ సీరియల్లో పాయల్గా వీక్షకులకు గుర్తుండే ఉంటుంది. ముప్పైకి పైగా సీరియళ్లలో నటించారు. పది సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు వేశారు. ప్రస్తుతం లాక్డౌన్లో సోషల్ వర్కర్‌గా తనకై తాను స్క్రిప్టు లేని పాత్రను పోషిస్తున్నారు. ఆదరణ కోసం ఎదురు చూస్తున్న సెక్స్ వర్కర్లు, ట్రాన్స్జెండర్లే ఆమె చేత ఆ పాత్రను డైరెక్ట్ చేయిస్తున్నారు. పాత్రకు అడ్డుపడుతోందని ఇటీవలే ఆమె గుండు చేయించుకున్నారు! ఆమె సహాయకుడు మొదట అందుకు అంగీకరించలేదు. రెండు రోజులు ఆగితే జయ మనసు మారుతుందని వాయిదా వేసి, ఇక లాభం లేదని ఆమె చెప్పినట్లు చేశాడు. ‘‘జుట్టు తీసేస్తే అందం పోతుంది మేడమ్ అని బాధపడ్డాడు అతను. ముఖం మీద, కళ్ల మీద పడుతుంటే ఎలా పని చేయడం అన్నాను. అయినా మా నాన్న దాదా. చుట్టు పక్కల ఆయనంటే టెర్రర్. ఆయన కూతురిగా నేను కళ్ల ముందు జరుగుతున్న తప్పుల్ని సరిచెయ్యాలి. అవసరం అయితే వీధుల్లో తగాదా పడాలి. సీనియర్ సిటిజన్స్‌ని ఎక్కించుకోకపోతే ఆటోవాలాలను గదమాయించాలి. పెట్స్‌ని ఎవరైనా వదిలించుకుంటే వారి పని చెప్పాలి. అందం కోసం చూసుకుంటే ఎలా..’’ అంటారు జయ.. అందంగా నవ్వుతూ. -
తెలుగు రాష్ట్రంలో తలైవి
ప్రముఖనటి, తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత జీవితం ఆధారంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తలైవి’ (హిందీలో ‘జయ’ అనే టైటిల్ అనుకుంటున్నారు). ఇందులో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీ¯Œ కంగనా రనౌత్ నటిస్తున్నారు. ప్రకాష్‌రాజ్, అరవిందస్వామి కీలకపాత్రలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల మైసూర్లో ముగిసిన సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్ భాగ్యనగరంలో(హైదరాబాద్) ప్రారంభం కానుంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్లు రెడీ చేశారు. ఇక్కడి షెడ్యూల్ దాదాపు 25 రోజులు సాగుతుందని సమాచారం. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 26న విడుదల చేయాలనుకుంటున్నారు. -
క్లిక్ చేస్తే సారొస్తారు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ వంటివే కాదు ప్లంబర్, పెయింటర్లను కూడా ఆన్లైన్లో బుక్ చేసే రోజులివి. అయితే వీటిల్లో ఏ సేవలకైనా సరే ఇంటికొచ్చే వ్యక్తి గురించి మనం ఎంక్వయిరీ చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే? ఆర్డర్లను డెలివరీ చేయటం వరకే వారి పని. మరి, హోమ్ ట్యూషన్స్ చెప్పే ట్యూటర్స్‌ను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే? తల్లిదండ్రులు చాలానే ఆలోచించాలి. ఎందుకంటే ట్యూటర్ మేధస్సే కాదు అతని వ్యక్తిత్వం, ప్రవర్తన కూడా ముఖ్యం. ఒక తల్లిగా తనకెదురైన ఇలాంటి సమస్య... ఇంకెవరికీ రాకూడదని నిర్ణయించుకుంది జయ. అంతే! ట్యూటర్స్ప్రైడ్.కామ్‌ను ప్రారంభించింది. అకడమిక్ ట్యూటర్స్ మాత్రమే కాక నాన్–అకడమిక్లోనూ ట్యూటర్స్ అందుబాటులో ఉండటమే దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు కె.ఎం.ఈ.జయ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది తూర్పు గోదావరి జిల్లా. పెళ్లయ్యాక హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. ఎంఫిల్ చదివా. సిటీలోని ఒకటిరెండు స్కూల్స్, కాలేజీల్లో టీచర్‌గా పనిచేశా. యూఎస్, యూకేలోని పలువురు స్టూడెంట్స్‌కు ఆన్లైన్లో పాఠాలు చెప్పేదాన్ని. మా రెండో అబ్బాయి జాతీయ స్థాయిలో టెన్నిస్ ప్లేయర్. దీంతో రోజూ స్కూల్‌కెళ్లడం ఇబ్బందయ్యేది. పరీక్షల సమయంలో నేను, మా ఆయన ఒకటిరెండు సబ్జెక్ట్‌లు తప్ప చెప్పలేకపోయాం. ప్రైవేట్ ట్యూషన్ పెట్టిద్దామని ప్రయత్నించాం. లాభం లేకుండా పోయింది. ఆ సమస్యకు పరిష్కారం వెతికే పనిలోనే ట్యూటర్స్ ప్రైడ్కు బీజం పడింది. రూ.10 లక్షల పెట్టుబడితో గతేడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం రోజున ‘ట్యూటర్స్ ప్రైడ్.కామ్’ను ప్రారంభించాం. స్కూల్స్, కాలేజీలకు కూడా సేవలు.. ప్రస్తుతం ట్యూటర్స్ ప్రైడ్‌లో హోమ్ ట్యూషన్ సేవలు, ఆన్లైన్ కోర్సుల విక్రయం, వీడియో పాఠాలు అందుబాటులో ఉన్నాయి. వచ్చే 6 నెలల్లో వాట్సాప్ వీడియో కాల్స్, వీడియో లైవ్ స్ట్రీమింగ్ సేవలను అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం 66 వేల రకాల కోర్సులున్నాయి. స్కూల్, కాలేజీ సబ్జెక్ట్ ట్యూటర్స్ మాత్రమే కాక స్పోకెన్ ఇంగ్లిష్, పోటీ పరీక్షలు, కంప్యూటర్ కోర్సుల ట్యూటర్స్‌తో పాటూ సంగీతం, నృత్యం, డ్రాయింగ్, పెయింటింగ్, గుర్రపు స్వారీ, పర్సనల్ జిమ్ ట్రెయినర్స్, మెజీషియన్స్, ఫొటోగ్రఫీ, జ్యోతిష్యం, ఫిజియోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాసం, కుకింగ్, స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ వంటి నాన్ అకడమిక్లోనూ శిక్షకులుంటారు. తల్లిదండ్రులే కాకుండా స్కూల్స్, కాలేజీలు కూడా మా ట్యూటర్స్ సేవలను వినియోగించుకుంటున్నాయి. తనిఖీ చేశాకే ట్యూటర్స్ నమోదు.. ట్యూటర్స్ నమోదు ఉచితమే. కానీ, పలు రకాల తనిఖీలు, పరీక్షలు నిర్వహించాకే వారిని నమోదు చేస్తాం. ముందుగా ఇంటర్వ్యూ.. తర్వాత వీడియో డెమో క్లాస్‌లు, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత సర్టిఫైడ్ ఆన్లైన్ ట్యూటర్ (సీఓటీ) పరీక్ష ఉంటుంది. గంటలు, రోజుల లెక్కల చొప్పున లేదా సబ్జెక్ట్‌ల వారీగా కాకుండా పాఠాల వారీగా, చాప్టర్ల వారీగా కూడా ట్యూటర్స్‌ను నియమించుకునే వీలుంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6 లక్షల మంది ట్యూటర్స్ నమోదయ్యారు. ఇందులో అకడమిక్‌లో 70 శాతం, నాన్–అకడమిక్‌లో 30 శాతం ఉంటారు. రూ.20 కోట్ల ఆదాయం లక్ష్యం.. యూజర్లు మా సేవలను వినియోగించుకోవాలంటే ఏడాది సబ్స్క్రిప్షన్ రుసుము రూ.2,999. ప్రస్తుతం 46 వేల యూజర్లున్నారు. వీరిలో 1,500 మంది సబ్స్క్రిప్షన్ యూజర్లు. ఏడాదిలో 2 లక్షల యూజర్లకు చేరాలనేది లక్ష్యం. నెలకు 600 మంది మా సేవలను వినియోగించుకుంటున్నారు. గత ఏడాది రూ.40 లక్షల వ్యాపారాన్ని చేరుకున్నాం. 2020 నాటికి రూ.20 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. రూ.100 కోట్ల నిధుల సమీకరణ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ప్రతి వారం పేరెంట్స్ కౌన్సెలింగ్ సమావేశాలు, పలు విద్యా సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు రూ.3 కోట్ల పెట్టుబడి పెట్టాం. ప్రస్తుతం మా సంస్థలో 27 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో వంద మందిని నియమించుకుంటాం. ఇందులో 60 శాతం మంది మహిళ ఉద్యోగులే ఉంటారు. వచ్చే ఏడాది కాలంలో రూ.100 కోట్ల నిధులను సమీకరించాలన్నది లక్ష్యం’’ అని జయ వివరించారు. -
మ్యాజిక్ మీ చేతుల్లోనే...
మహిళకు తండ్రి... భర్త మర్రి చెట్టులాంటి వారు. ఆ నీడ చల్లగా ఉంటుంది. కానీ... కాంతిని మింగేస్తుంది. ప్రతి వనిత... స్వయం ప్రకాశిత. ఆ మ్యాజిక్ అర్థం చేసుకుంటే తనూ ఓ మహావృక్షమే. పిల్లల పెంపకం దగ్గర నుంచి వ్యక్తిత్వ వికాసం వరకు... ఇలాంటి ఎన్నో విషయాలను సాక్షితో పంచుకున్నారు... ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ జయశేషు పట్టాభిరామ్. బీవీ పట్టాభిరామ్ మీ పెళ్లి నాటికే మెజీషియన్ కదా! మిమ్మల్ని మ్యాజిక్‌తో ఇంప్రెస్ చేసేవారా? అవును, చాలా. మోచేతి దగ్గర కాయిన్ పెట్టి రుద్దేవారు. కాయిన్ మాయమయ్యేది. ఏమైందో చెప్పమనే వారు. కొంతసేపటికి తీసి చూపించేవారు. ఎలా మాయం చేశారో, మళ్లీ ఎలా తీశారో ఎంత ఆలోచించినా తెలిసేది కాదు. రెండేళ్ల పాటు అదే కాయిన్ మ్యాజిక్‌తో ఆటపట్టించారు. మిమ్మల్ని ఎప్పుడైనా హిప్నటైజ్ చేశారా? ఆ గొంతులోనే ఏదో మాయ ఉంది. మామూలుగా చెప్పినా సరే హిప్నటైజ్ అయిపోతాం. ఇక పని గట్టుకుని హిప్నటైజ్ చేయాల్సిన అవసరమే రాలేదు. అంటే ఎప్పుడో పెళ్లయిన కొత్తలోనే... అది హిప్నటిజం అని మీకు తెలియక ముందే మిమ్మల్ని హిప్నటైజ్ చేసినట్లున్నారు. మీరింకా బయటపడలేదా ఆ మాయ నుంచి? (నవ్వేసి...) ఏమో? ఏం మాయ చేశారో! ఎలా మాయ చేశారో తెలియడం లేదు. తెలివైన భర్తతో సంసారం కష్టమా, సౌకర్యమా? ఆయన తెలివితేటల ప్రదర్శన అంతా బయటే. ఇంట్లో చాలా మామూలుగా ఎదుటి వారిని అర్థం చేసుకునే మనిషిగా ఉంటారు. అందుకే నాకెటువంటి కష్టం రాలేదు. నేను ఆయనకు భార్యను మాత్రమే కాదు, స్టూడెంట్‌ని, ఆయన రచనలకు తొలి రీడర్ని. క్రిటిక్‌ని కూడా. సైకాలజిస్ట్‌గా మీ కెరీర్ ఎప్పుడు మొదలైంది? పెళ్లికి ముందేనా? లేదు, మాది కాకినాడ. మా నాన్న ఇంజనీర్. అమ్మ మా చిన్నప్పుడే పోవడం వల్ల టెన్త్‌తో చదువాపేయాల్సి వచ్చింది. నాలో ఆ కొరత అలాగే ఉండిపోయింది చాలా కాలంపాటు. మా అబ్బాయి స్కూలుకెళ్లసాగిన తర్వాత మళ్లీ చదవడం మొదలుపెట్టాను. ఓపెన్ యూనివర్శిటీలో బి.ఎ, బిఈడీ, డబుల్ ఎం.ఎ (తెలుగు లిటరేచర్, సైకాలజీ) చేశాను. ఆ తర్వాత సైకాలజిస్టుగా కెరీర్ మొదలుపెట్టాను. పెళ్లికి ముందు చదువుకుని ఉంటే ఇప్పుడిలా నిరంతర విద్యార్థిగా మారేదాన్ని కాదేమో. ఇప్పటికీ సైకాలజీలో కొత్తగా ఏ కోర్సు వచ్చినా చదువుతున్నాను. ఆల్రెడీ ఇంట్లో ఒక సైకాలజిస్ట్ ఉండగా మళ్లీ మీరు అదే కోర్సు ఎందుకు చేశారు? నేను ఇంట్లో ఖాళీగా ఉండటం అనేదే ఉండదు. బాలవికాస్ ట్రైనింగ్ వంటి ఏదో ఒక పనిలోనే ఉంటాను. మధ్యలో ఎప్పుడు కొంచెం ఖాళీగా కనిపించినా సరే... సైకాలజీ మీద పబ్లిష్ అయిన ఆర్టికల్స్ ఇచ్చి, పాయింట్స్ రాసిపెట్టమని అడిగేవారు. అలా చైల్డ్ సైకాలజీ మీద ఆసక్తి కలిగింది. అప్పట్లో మా వారి కౌన్సెలింగ్ సెంటర్ ఇంట్లోనే. ఆయన కౌన్సెలింగ్ ఇవ్వడం చూసి ఈ ప్రొఫెషన్ బాగుందనుకున్నాను. పైగా ఇందులో నాకు బాస్ నేనే! ఇరవై ఏళ్ల అనుభవంలో పిల్లల్లో మీరు గమనించిన మార్పు ఉందా? ఉంది. తరం మారింది. ఇంటి ముఖచిత్రం మారిపోయింది. అలాగే పిల్లలూ మారిపోయారు. ఇరవై ఏళ్ల కిందట పేరెంట్స్ నుంచి ‘మా పిల్లలు టీవీకి అతుక్కుపోతున్నారు. చదువు మీదకు మళ్లించడం మా వల్ల కావడం లేదు’ అంటూ వచ్చేవాళ్లు. అప్పట్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ప్రభావం పెద్దగా లేదు పిల్లల మీద. ఇప్పటి పేరెంట్స్ పిల్లలు ‘స్మార్ట్‌ఫోన్ వదలట్లేదు’ అంటున్నారు. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్‌లతో ఫేస్బుక్, వాట్సప్ చాటింగ్‌తోనే గడుపుతున్నారు, ఎలా మానిపించాలో తెలియట్లేదని వస్తున్నారు. పిల్లల్ని సున్నితంగా డీల్ చేయగలిగిన మ్యాజిక్ పేరెంట్స్‌లో ఉంటుంది. ఎటొచ్చీ వాళ్లు ఆ స్కిల్‌ని బయటకు తీయగలగాలంతే. అప్పటికీ ఇప్పటికీ అలాగే కొనసాగుతున్న సమస్య ఏదీ లేదా? అప్పుడూ ఇప్పుడూ కామన్ కంప్లయింట్ మెమరీ గురించి. ‘మా పిల్లలకు మెమొరీ తక్కువగా ఉంది. కాన్సెంట్రేషన్ చేయలేకపోతున్నారు, చదివినా గుర్తుండటం లేదు. జ్ఞాపకశక్తి పెరగడానికి మందులుంటాయా’ అని అడుగుతుంటారు. నిజానికి అందరి మెమొరీ ఒకటే. ట్రైన్డ్ మెమొరీ, అన్ట్రైన్డ్ మెమొరీ మాత్రమే ఉంటాయి. మెదడును వాడకపోతే జ్ఞాపకశక్తి మసకబారుతుంది. వాడుతుంటే చురుగ్గా ఉంటుంది. మా చిన్నప్పుడు అందరికీ ఎక్కాలు కంఠతా వచ్చేవి. కాలిక్యులేటర్ వచ్చిన తర్వాత ఎక్కాలు మర్చిపోయాం. ఇంటర్నెట్ అరచేతిలోకి వచ్చాక అన్నింటినీ మర్చిపోతున్నాం. మనకు స్వాతంత్య్రం వచ్చి ఎన్నేళ్లయింది అని అడిగితే... బుర్రను వాడి, వేళ్లతో లెక్క వేయడం లేదు. గూగుల్‌ని అడుగుతున్నాం. బ్రెయిన్‌ని ఎలక్ట్రానిక్ టూల్స్ వాడే సాధనంగా మార్చేస్తున్నాం. బ్రెయిన్‌ను వాడాలి, ప్రాక్టీస్‌లో ఉంటేనే చురుగ్గా ఉంటుంది. పిల్లలను నొప్పించకుండా చానలైజ్ చేయడం సాధ్యం కాదంటారా! నొప్పించకుండా నేర్పిస్తేనే సాధ్యమవుతుంది. ‘ఇది చేయవద్దు’ అని ఎప్పుడూ చెప్పకూడదు. ఏది చేయాలో అంత వరకే చెప్పి వాళ్లు ఎలా చేస్తారో అలా చేయనివ్వాలి. క్లాస్‌లో నేనిచ్చే యాక్టివిటీలు కూడా అలాగే ఉంటాయి. అద్దంలో చూస్తూ స్టార్ గీయడం, టూత్‌పిక్స్‌ని బోర్డు మీద అమర్చడం వంటివి చేస్తున్నంత సేపు పిల్లలకు మరో లోకం ఉండదు. అంతగా నిమగ్నమవుతారు. అది అలవాటుగా మారితే ప్రతి పనినీ అంతే ఏకాగ్రతతో చేస్తారు. తల్లి పిల్లలతో టైమ్ గడపకుండా తానో ఫోన్లో ఉంటే పిల్లలు మరో ఫోన్లో మునిగిపోతారు. అమ్మ ‘నో’ అంటే నాన్నతో కొనిపించుకుంటారు. దీనిని నివారించి తీరాల్సిందే. ఇది మా అబ్బాయి విషయంలో మేము పాటించిన సూత్రం కూడా. పెంకిగా ఉన్న మా పిల్లవాడు ఇప్పుడు అమెరికాలో పెద్ద హోదాలో ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లలు పాడయిపోతున్నారని తరచూ వింటున్నాం మరి! తల్లిదండ్రులు పిల్లలతో గడపకపోతే ఏ పిల్లలైనా సరే పాడయిపోతారు. పిల్లలతో గడపడం ఎందుకంటే వాళ్ల దృష్టి ఎప్పుడు ఎటు మరలుతుందో తెలుసుకోవడానికే. ప్రాజెక్ట్ వర్క్ కోసం ఇంటర్నెట్ ఓపెన్ చేస్తారు. గదిలో కూర్చుని పని చేసుకుంటున్నారని పూర్తిగా వదిలేస్తారు పెద్దవాళ్లు. ఇంటర్నెట్లో పిల్లలకు అవసరమైన విజ్ఞానంతోపాటు పెడదారి పట్టించే సైట్లు బ్లింక్ అవుతుంటాయి. వాటిని క్లిక్ చేయకుండా ఉండలేరు. నిఘా పెట్టకూడదు, కలివిడిగా ఉంటూనే ఓ కంట గమనించాలి. చూడకూడని సైట్ ఓపెన్ అయి ఉన్నట్లు గమనించినా సరే ఆ క్షణంలోనే కోప్పడి నానా గందరగోళం చేయకూడదు. తర్వాత నిదానంగా చెప్పాలి. పిల్లలతో పేరెంట్స్ ఆటలాడే అలవాటు ఉంటే చాలా సమస్యలు ఆ ఇంటి ఛాయలకు కూడా రావు. వంటగదిలో పిల్లల సహాయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ తరం భార్యాభర్తల్లో చాలా గొడవలకు కారణం వంటే అవుతోంది. ఏ పిల్లలైనా సరే అమ్మానాన్నలు శ్రద్ధ పెడితే చక్కగా పెరుగుతారు. మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములవుతారు. ఒక ఆడమగ పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనడం ప్రకృతి ధర్మం. వాళ్లను సరిగ్గా పెంచడం సామాజిక ధర్మం. లోపాలు లేని మనిషి అంటూ ఉండరు. అయితే లోపాలను అధిగమించాలనే సంకల్పం ఉండాలి. తప్పులు పెద్దవాళ్లవే! కౌన్సెలింగ్‌తో జీవితాలు బాగుపడటం చూశాక ఈ ప్రొఫెషన్ మీద గౌరవం కలిగింది. పిల్లలతో గడిపే అవకాశం ఉండటంతో ఈ కెరీర్ చాలా సంతోషాన్నిస్తోంది. పరివర్తన తేవడానికి నేనిచ్చే టైమ్ షెడ్యూల్స్‌ని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. నిజానికి ఎప్పుడూ తప్పు పిల్లల్లో ఉండదు. వాళ్లను ఎలా డీల్ చేయాలో తెలియని పెద్దవాళ్లదే సమస్య. చైల్డ్ సైకాలజిస్ట్‌గా నేను కౌన్సెలింగ్ ఇచ్చేది కూడా పేరెంట్స్‌కే. మీ వారిలో మీరు చూసిన పర్సనాలిటీ డిఫెక్ట్స్? నేను ఆయనను కరెక్ట్ చేయాల్సిన సందర్భాలు ప్రత్యేకంగా చెప్పుకోదగినవేమీ లేవు. కానీ టైమ్ మేనేజ్మెంట్ విషయంలో ఒత్తిడికి లోనవుతుంటారు. అలాంటప్పుడు ‘టెన్షన్ వద్దు, యు కెన్ మేనేజ్ సచ్ థింగ్స్ ప్రాపర్లీ’ అని చెప్తుంటాను. మీ వారిలో మీకు నచ్చని విషయాలు... కాఫీ ఇచ్చిన తర్వాత చల్లారే వరకు తాగరు. అరగంట తర్వాత నేను మళ్లీ ఆ గదిలోకి వస్తే... ఆయన మాత్రం నేను కాఫీ తెచ్చినప్పుడు ఏ పుస్తకంలో మునిగిపోయి ఉన్నారో, అదే భంగిమలో ఉంటారు. ‘కాఫీ చల్లారిపోయింది’ అంటే ‘ఊ’ అంటారు. కాఫీ ఇచ్చినప్పుడు ఒక ‘ఊ’, చల్లారిపోయినప్పుడు ఒక ‘ఊ’ అంతే. మరొకటి ఏమిటంటే... ఆయన ఎప్పుడూ ఒకేలా డ్రస్ వేసుకోవడం. ‘అవే సూట్, సఫారీల్లో చూసి చూసి విసుగొస్తోంది, మార్చండి’ అనేదాన్ని. చివరికి మా అబ్బాయి పెళ్లికి మాత్రం పట్టుపట్టి కుర్తా, పైజామా వేయించగలిగాను. (భర్త బీవీ పట్టాభిరామ్‌తో...) – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
‘హలో హాంకాంగ్’లో రేడియో జాకీగా..
‘భాష అందరి జన్మహక్కు. తల్లి భాషను అందరూ నేర్వాలి. రోజులో తొలి పలుకు అమ్మ భాషదే కావాలి. అప్పుడే కన్నవారికి, విద్య నేర్పిన గురువుకు, పుట్టిన గడ్డ రుణం తీసుకొన్న వాళ్లం అవుతాం. ఖండంతరాల్లో స్థిరపడ్డా అమ్మ.. అమ్మే కదా.! నేను ఎక్కడ ఉన్నా నా మూలాలు తెలుగు నేలపైనే ఉన్నాయి’.. అంటున్నారు జయ పీసపాటి. హాంకాంగ్‌లో తెలుగు భాష అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న ఆమె సిటీకి వచ్చిన సందర్భంగా శుక్రవారం ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నారు. అవి జయ మాటల్లోనే.. సాక్షి,సిటీబ్యూరో: మా నాన్న యుద్ధనపూడి నాగేశ్వరరావుది విజయవాడ దగ్గర యుద్ధనపూడి, అమ్మ శ్యామలాదేవిది మచిలీపట్నం. నాన్న రైల్వేలో ఉన్నతోద్యోగి. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర పనిచేశారు. నా పదేళ్ల వయసులో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాం. నా చదవువంతా ఇక్కడే సాగింది. సెంట్రల్ యూనివర్శిటీ నుంచి ఎంఏ పట్టా పొందా. 2002లో హాంకాంగ్‌కు పయనం నా భర్త రవిశంకర్ పిసపాటి మర్చంట్ నేవీలో మెరైన్ ఇంజినీర్. బాంబే, గోవాల్లో పనిచేశారు. 2002లో ఉద్యోగ రీత్యా హాంకాంగ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాం. ఇద్దరు పిల్లలు. బాబు కృష్ణ ఇంజినీరింగ్ పూర్తి చేసి జాబ్ చేస్తున్నాడు. పాప సాహితి అక్కడే పదో తరగతి చదువుతోంది. తెలుగువారి కోసం వెతికా.. హాంకాంగ్‌లో నా భర్త డ్యూటీకి వెళితే రెండుమూడు నెలలుకు గాని రారు. ఓ రోజు అత్యవసర అవసర పనిపడింది. అక్కడ తెలుగువారి కోసం ఎంత వెదికినా కనిపింలేదు. ఎలాంటి తెలుగు అసోషియేషన్స్ కూడా లేవు. ఓ ఏడాది గాలించాక.. అక్కడే వర్శిటీలో పనిచేసే కేపీ రావు 15 తెలుగు కుటుంబాల వారిని వనభోజనాలకు పిలిచారు. అక్కడే మనవారిని కలిసి పరిచయం చేసుకున్నాను. హాంకాంగ్‌లో సమాఖ్య ఏర్పాటు చేశా.. తెలుగు వారి చిరునామాలు, ఈ మెయిల్స్, ఫేస్బుక్ ద్వారా అందరినీ కలిసేదాన్ని. అలా 2006లో ‘ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య’ ఏర్పాటు చేశా. అప్పుడు 40 కుటుంబాలు అందులో చేరాయి. ఇప్పుడు ఆ సంఖ్య 200 కుటుంబాలకు పెరింగింది. ఉద్యోగ, విద్య, వ్యాపార రీత్యా ఎవరు హాంకాంగ్ వచ్చినా తొలుత తెలుగు సమాఖ్యను సంప్రదిస్తారు. అందరి ఆలోచనలు మేరకు ఏటా వనభోజనాలు, ఉగాది, నవరాత్రులు, సంక్రాంతి, సత్యనారాయణ వ్రతాలు చేస్తాం. అన్ని తెలుగు పండుగులు చేస్తాం. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పిల్లలకు బహుమతులు ఇస్తుంటాం. చైనీయులకు తెలుగు నేర్పుతున్నా.. నేను ఉడ్‌ల్యాండ్ ఇంటర్నేషనల్ ప్రి స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నా. అక్కడ అంతా ఇంగ్లీషు మీడియమే. హాంకాంగ్ వెళ్లినప్పటి నుంచి ఏటా తెలుగు క్లాసులు చెబుతున్నాను. మన వారితో పాటు చైనీయులు కూడా వచ్చి మన భాష నేర్చుకుంటున్నారు. కారణం ఏంటంటే.. అక్కడి చైనీస్ మన కూచిపూడి నాట్యం నేర్చుకొని నృత్య ప్రదర్శనలు ఇస్తుంటారు. ఆ నాట్యం కోసం మన తెలుగును కూడా నేర్చుకుంటున్నారు. అమెరికాలో మన తెలుగు కవి, రచయిత చిట్టెం రాజు పరిచయమయ్యారు. సిలికానాంధ్ర వారి ‘మనబడి’ని పరిచయం చేశారు. 2013 నుంచి 16 వరకు వారి తెలుగు తరగతులు నడిచాయి. తెలుగు సర్టిఫికెట్ కోర్సు కోసం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిని కలిశారు. వారు 50 మంది మినిమం ఉండాలన్నారు. ఇప్పుడు నేనే సొంతంగా తెలుగు తరగతులు తీసుకుంటున్నా. ‘హలో హాంకాంగ్’లో రేడియో జాకీగా.. ఎన్ఆర్ఐ వెబ్‌పోర్టల్‌లో తెలుగు వన్ డాట్ కామ్ ఉంది. దానికి అనుసంధానంగా ‘తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్’ నడుస్తోంది. అందులో ‘హలో హంకాంగ్’ లైవ్ కార్యక్రమం శని, ఆదివారాల్లో చేస్తారు. రేడియో జాకిగా పనిచేస్తున్నా. నేను వివిధ అంశాలపై తెలుగులో ఉపన్యాసం ఇస్తాను. ఇప్పటి వరకు సైనికుల కోసం జైహింద్, తెలుగు విశిష్టతపై సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చా. ఈ గ్లోబల్ రేడియో హైదరాబాద్ నుంచే రన్ అవుతోంది. భాషపై ప్రేమతో... నా భాషకు, దేశానికి ఏదో చేయాలనే తపన ఉంది. లలితమైన భాష రమ్యమైన భావం తెలుగుది. ఈ భాషలో ఉన్న మాధుర్యాన్ని వర్ణించలేం. భాష అందరి జన్మహక్కు.. అందుకే భాషా యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నా. తెలుగు భాషను పదిమందికి నేర్పడం నా సంకల్పం. నా తుది వరకు హాంకాంగ్ వేదికగా ఈ యజ్ఞం కొనసాగిస్తాను.. అంటూ ముగించారు. -
‘ఐటీ దాడులు ముగిసినట్టే’
సాక్షి,చెన్నై: జైలు శిక్ష అనుభవిస్తున్న ఏఐఏడీఎంకే నేత వీకే శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ సహా కుటుంబ సభ్యుల నివాసాలు, కార్యాలయాలు, ఆస్తులపై జరుగుతున్న ఐటీ దాడులు దాదాపు ముగిశాయని ఐటీ వర్గాలు వెల్లడించాయి. సోదాల్లో ఎంత మేర నగదు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారనే వివరాలను తెలిపేందుకు ఐటీ అధికారులు నిరాకరించారు. సోదాలు పూర్తయ్యాయని, సోదాల్లో లభించిన పత్రాలు, ఆధారాల ఆధారంగా స్టేట్మెంట్లను నమోదు చేసుకోవడం, సంబంధితులను ప్రశ్నించడం మిగిలిఉందని ఐటీ అధికారి ఒకరు తెలిపారు. ఆపరేషన్ క్లీన్ మనీ కింద చేపట్టిన ఈ సోదాలు మొత్తం 187 ప్రాంతాల్లో పూర్తయిందని చెప్పారు. నవంబర్ 9న ప్రారంభించిన ఐటీ సోదాలు ఏకకాలంలో బెంగుళూర్, హైదరాబాద్, ఢిల్లీల్లో కొనసాగాయి. వేయి మంది అధికారులు 12 బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి అందించిన సమాచారం సహా పలు కోణాల్లో లభించిన సమాచారం ఆధారంగా సోదాలు సాగాయని ఐటీ వర్గాలు వెల్లడించాయి. తమిళ చానెల్ జయ టీవీ, దినకరన్ పార్మ్‌హౌస్ సహా శశికళ బంధువులకు చెందిన ఆస్తులపై పలు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. కాగా రాజకీయాల నుంచి తనను, శశికళను బయటకు పంపేందుకే ఐటీ సోదాల పేరుతో కుట్రకు పాల్పడుతున్నారని దినకరన్ ఆరోపించారు. -
మహిళా తారలతోనే...
హర్షిణి, రోజా, భారతి, మేఘనా రమి, జయ, ప్రవల్లిక ముఖ్య తారలుగా కేఆర్ ఫణిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘బటర్ ఫ్లైస్’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సన్నివేశానికి జీవితా రాజశేఖర్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ అంబికా కృష్ణ క్లాప్ ఇచ్చారు. నల్లమల్లు రాధ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మహిళా ఆర్టిస్టులతోనే సినిమా తీయడం మంచి ప్రయత్నం’’ అన్నారు అంబికా కృష్ణ. ‘‘మహిళా తారలతోనే చేస్తున్న తొలి చిత్రమిది’’ అన్నారు ఫణిరాజ్. ‘‘మహిళలకు ఎదురయ్యే కష్ణనష్టాలను చూపించబోతున్నాం’’ అన్నారు రామసత్యనారాయణ. ఈ చిత్రానికి సంగీతం: ప్రత్యోదన్ స్వరకర్త. -
ప్రభుత్వ ఉద్యోగులకు అమ్మ పండుగ కానుక
చెన్నై: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు పండుగ బోనస్ ప్రకటించింది. రాబోయే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జయలిలత వివిధ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు బుధవారం ఈ తీపికబురు అందించారు. 3.67 లక్షల మంది అర్హతగల ఉద్యోగులకు రూ 476,71 కోట్ల రూపాయల మేర బోనస్ ప్రకటించారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి కనీసం రూ 8,400 గరిష్టంగా రూ 16,800 వరకు బోనస్ చెల్లించనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో చెప్పారు. అలాగే బోనస్ పథకం కిందికి రాని కో-ఆపరేటివ్ సొసైటీస్ తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగులకు రూ .4,000 బోనస్ పౌర సరఫరాల కార్పొరేషన్ తాత్కాలిక కార్మికులకు రూ 3,000 ఇవ్వనున్నట్టు జయలలిత ప్రకటించారు. -
‘కూడంకుళం’ జాతికి అంకితం
♦ అణు విద్యుత్ ప్లాంట్‌లోని తొలి యూనిట్‌ను ♦ అంకితం చేసిన మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, జయ ♦ భారత్-రష్యా సంబంధాల్లో మైలురాయిగా అభివర్ణన ♦ వెయ్యి మెగావాట్ల యూనిట్ గర్వకారణం: మోదీ సాక్షి ప్రతినిధి, చెన్నై : భారత్.. రష్యా సాంకేతిక సహకారంతో తమిళనాడులో నిర్మించిన ప్రతిష్టాత్మక కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం(కేఎన్‌పీపీ) జాతికి అంకితమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, తమిళనాడు సీఎం జయలలితలు సంయుక్తంగా బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్లాంటులోని మొదటి యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. మోదీ ఢిల్లీ నుంచి, పుతిన్ మాస్కో నుంచి, జయ చెన్నైలోని సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యూనిట్ భారత్, రష్యాల సంబంధాల్లో మైలురాయి అని మోదీ, పుతిన్‌లు పేర్కొన్నారు. ఇదుదేశాల వ్యూహాత్మక, ప్రత్యేక భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. ప్లాంటు నిర్మాణంలో పాల్గొన్న శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు. అతిపెద్ద యూనిట్: మోదీ వెయ్యి మెగావాట్ల సామర్థ్యమున్న ఈ యూనిట్ దేశ విద్యుత్ రంగంలో అతిపెద్ద యూనిట్ అని, స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిని భారీగా పెంచాలన్న భారత లక్ష్యాల్లో మైలురాయి అని మోదీ పేర్కొన్నారు. ఇందుకు భారతీయులు రష్యాకు రుణపడి ఉన్నారన్నారు. ‘ఒకేచోట వెయ్యిమెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే తొలి యూనిట్ ఇదే కావడం గర్వకారణం. కూడంకుళం-1తో భారత్-రష్యా సంబంధాల్లో మరో చారిత్రక ముందుడుగు వేశాం. ఇది ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికే కాక, దృఢమైత్రికీ వేడుకలాంటిది. పారిశ్రామిక ప్రగతి స్వచ్ఛ ఇంధనంతో ముందుకు సాగాలి. అణు విద్యుత్ ఉత్పత్తి ఎజెండాను ముందుకు తీసుకెళ్తాం. రష్యా సహకారంలో కూడంకుళంలోనే ఇలాంటి మరో ఐదు భారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని తమిళంలో జయను ఉద్దేశించి చెప్పారు. భారత్-రష్యా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం శాశ్వతంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు పుతిన్‌ను ఉద్దేశించి రష్యన్లో అన్నారు. ఉన్నత ప్రమాణాలు: పుతిన్ అత్యాధునిక రష్యా సాంకేతిక పరిజ్ఞానం, ఉన్నతస్థాయి భద్రతా ప్రమాణాలతో ఈ యూనిట్‌ను నిర్మించినట్లు పుతిన్ చెప్పారు. కూడంకుళం ప్రాజెక్టు సాకారం కావడానికి తాను సీఎంగా ఉన్న పదేళ్ల కాలంలో ఎల్లప్పుడూ మద్దతిచ్చానని జయ పేర్కొన్నారు. ప్రాజెక్టు భద్రతకు సంబంధించిన స్థానికుల భయాందోళనలు తొలగించేందుకు, వారికి నచ్చజెప్పేందుకు ప్రాధ్యాన్యమిచ్చానని ఆమె పేర్కొన్నారు. ప్రాజెక్టు విశేషాలు.. కూడంకుళం ప్రాజెక్టు నిర్మాణం కోసం 1988లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ, సోవియట్ యూనియన్ అధ్యక్షుడు గోర్బచెవ్లు ఒప్పందంపై సంతకాలు చేశారు. అసలు కార్యాచరణ 1997లో మొదలైంది. భారత అణువిద్యుత్ కార్పొరేషన్, రష్యాకు చెందిన రోసాటమ్ సంస్థలు కేఎన్‌పీపీని నిర్మించాయి. శుద్ధి చేసిన యురేనియంతో పనిచేసే వీవీఈఆర్ రకం అణు రియాక్టర్లను ఇందులో నెలకొల్పారు. మొదటి, రెండో యూనిట్లను రూ. 21 వేల కోట్ల ఖర్చుతో నిర్మించారు. రెండో యూనిట్ ఈ ఏడాదిలోనే ఉత్పత్తి ప్రారంభించే అవకాశముంది. ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్‌లో అత్యధిక భాగం తమిళనాడు, మిగతా భాగం కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలు పంచుకుంటాయి. -
'అమ్మా' రక్షించు.. శివశంకర్ మాస్టర్ విన్నపాలు!
చెన్నై: తెలుగు ప్రేక్షకులకు శివశంకర్ మాస్టర్ గా సుపరిచితమైన డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్... శివశంకర్.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు లేఖ రూపంలో విన్నపాలను పంపారు. తమ కుటుంబానికి ఆత్మ హత్య చేసుకోవడం తప్పించి మరో దారి లేదని, తమ కేసును ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించే ప్రయత్నం చేయాలంటూ ఆయన తన లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనదైన శైలిలో.. ప్రత్యేక అభినయంతో.. సూపర్ ఛాలెంజ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ శివశంకర్ ప్రసాద్ కష్టాల్లో పడ్డట్టు తెలుస్తోంది. ఆయన కుమారుడు విజయ కృష్ణ ప్రసాద్ తో భార్య జ్యోతి... విడాకులు తీసుకున్నప్పటికీ తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని, తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందంటూ ఆయన అమ్మకు (తమిళనాడు సీఎం జయలలిత) రాసిన ఉత్తరంలో తన గోడును వెళ్ళబోసుకున్నారు. చట్ట ప్రకారం విడాకులు తీసుకుని మరీ తమను ఏడిపించాలని చూస్తోందని, పది కోట్లు చెల్లించాలని డిమాండ్ చేయడంతోపాటు, తమ కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టి ఇంటిని లాక్కోవాలని చూస్తోందంటూ జయలలితకు శివశంకర్ ప్రసాద్ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 2013 సంవత్సరంలో శివశంకర్ మాస్టారి కుమారుడు విజయశంకర్ ప్రసాద్ బెంగళూరుకు చెందిన జ్యోతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇద్దరి మధ్యా వచ్చిన విభేదాలతో డైవర్స్ తీసుకున్నారు. అయితే అప్పట్నుంచీ శివశంకర్ మాస్టారి కుటుంబాన్ని పలు రకాలుగా వేధిస్తున్న జ్యోతి... తాజాగా వారిపై కేసు పెట్టింది. ఇటీవల తమ ఇంటిముందు ఆందోళనకు దిగి పదికోట్ల డబ్బును డిమాండ్ చేసిందని, ఆమె టార్చర్ భరించలేక తమ కుటుంబం కొన్ని రోజులపాటు అజ్ఞాతంలోకి పోవాల్సిన పరిస్థితి వచ్చిందని శివశంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తమ కుటుంబంపై అక్రమ కేసును బనాయించిందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని, లేదంటే కుటుంబం మొత్తం ఆత్మ హత్య చేసుకోవడం తప్ప మరోదారి లేదని తెలిపారు. మరి మాస్టారి విషయంలో అమ్మ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
కెప్టెన్‌పై సీఎం పరువునష్టం దావా
చెన్నై : డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌పై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరువునష్టం కేసు దాఖలు చేశారు. జయ తరఫున ప్రభుత్వ న్యాయవాది ఎంఎల్ జగన్ సెషన్స్ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల మూడో తేదీన డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ విడుదల చేసిన ప్రకటనలో చెన్నైలో గతేడాది సంభవించిన వరదలు కృత్రిమంగా సృష్టించబడ్డాయని ఆరోపించారు. అంతేకాకుండా ఈ వరద నష్టాన్ని జయలలిత పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మరునాడు అంటే నాలుగో తేదీ పత్రికలో ప్రకటన వచ్చింది. విజయకాంత్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జయలలిత పేరు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఉందని, వాస్తవాలకు విరుద్ధమని జయ తరఫు న్యాయవాది జగన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయనపై పరువునష్టం కింద చర్యలు తీసుకునేందుకు ఉత్తర్వులివ్వాలని ఆయన న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ అడిషనల్స్ సెషన్స్ కోర్టులో త్వరలో విచారణకు రానుంది. ఇదేవిధంగా వరద ముప్పు గురించి డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రకటనను విడుదల చేసిన మురసోలి పత్రిక సంపాదకులు సెల్వంపై రెవెన్యూ శాఖా మంత్రి ఉదయకుమార్ తరఫున పరువునష్టం పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. -
మెట్రో వార్
♦ జయపై కరుణ ఫైర్ ♦ చార్జీలు తగ్గించాలన్న బీజేపీ ♦ మెట్రోలో ప్రయాణించిన ఎమ్మెల్యేలు చెన్నై, సాక్షి ప్రతినిధి : చెన్నై నగరంలో ట్రాఫిక్ రద్దీ సమస్యకు పరిష్కారంగా మెట్రోరైలు సేవలు ప్రవేశించాయి. డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాల హయాంలో మెట్రో పనులు ప్రారంభం, పూర్తికావడం, ప్రారంభానికి నోచుకోవడం జరిగింది. అయితే మెట్రోరైలు సేవలు ప్రారంభమై వారం రోజులు కావస్తున్నా నగర ప్రజలకు సౌకర్యాన్ని చేకూర్చిందా లేదా అనే అంశమే చర్చకు రాలేదు. నగరంలో 45 కిలో మీటర్ల దూరం పరుగులు పెట్టేలా రూపొందిన మెట్రోరైలు పథకంలో తొలి విడతగా కేవలం 10 కిలో మీటర్ల ప్రయాణం ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. 10 కిలోమీటర్లకు రూ.40 గా టిక్కెట్లు చార్జీలు నిర్ణయించడం విమర్శలకు దారితీసింది. జయ, కరుణల మెట్రో పోరు: మెట్రో ప్రయాణం బాగున్నా చార్జీలు మాత్రం భారమంటూ వచ్చిన విమర్శలకు సహజంగానే ప్రతిపక్ష డీఎంకే తీవ్రంగా స్పందించింది. ఇదే అదనుగా అధికార అన్నాడీఎంకేను దుమ్మెత్తి పోయడం ప్రారంభించింది. పథకానికి శ్రీకారం చుట్టింది తామైనా చార్జీల నిర్ణయం డీఎంకే హయాంలోనే జరిగిందని కరుణ విమర్శలను జయ తిప్పికొట్టారు. దీంతో తీవ్రంగా మండిపడిన కరుణ శుక్రవారం ఒక ప్రకటనలో జయపై విరుచుకుపడ్డారు. అన్నాడీఎంకేనే మెట్రో పథకానికి అంకురార్పణ చేసిన పక్షంలో ఎపుడు శంకుస్థాపన జరిగిందో తేదీ చెప్పగలరా అంటూ కరుణ నిలదీశారు. 2006లో డీఎంకే ప్రభుత్వం రాగానే తన నేతృత్వంలో మెట్రోకు నిర్ణయం జరిగింది, 2007 నవంబరు 1న అధికారిక ప్రకటన, 7 వ తేదీన మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం జరిగిందని కరుణ చెప్పారు. అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత మెట్రో పనులను ఆపేందుకు విఫలయత్నం చేసిందని ఆయన ఎద్దేవా చేశారు. ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ మెట్రో పనులకు శంకుస్థాపన చేశారని ఆయన తెలిపారు. చార్జీల బాధ్యత ప్రభుత్వానిదే: బీజేపీ మెట్రో చార్జీల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం వ్యాఖ్యానించారు. చార్జీల భారం వల్ల మెట్రోరైలు పట్ల ప్రజల్లో విముఖత ఏర్పడిందని అన్నారు. చార్జీలను తగ్గించే అధికారాన్ని వినియోగించి ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని రాష్ట్రప్రభుత్వానికి వారు హితవు పలికారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యేలు శరత్‌కుమార్, కృష్ణస్వామి శుక్రవారం మెట్రోరైలులో ప్రయాణించి ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. చార్జీల భారం మాత్రమేకాదు ఇందులోని వసతులను సైతం పరిగణనలోకి తీసుకోవాలని శరత్‌కుమార్ అన్నారు. -
జయ, లాలు బాటలోనే బాబూ నడవాలి
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తక్షణమే రాజీనామా చేయాలని టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటి అవినీతి ఆరోపణలు వచ్చినపుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, బీహార్ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ తమ తమ పదవులకు రాజీనామా చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు కూడా వారి బాటలోనే నడవాలని, పదవి నుంచి తప్పుకోవాలని ఆయన సూచించారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు బాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే గవర్నర్ నరసింహన్ పై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారని నోముల విమర్శించారు. గవర్నర్ తప్పుకోవాలంటూ టీ-టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే.