ప్రముఖ టీవీ నటి, ‘థప్‌కీ ప్యార్ కీ’ సీరియల్ ఫేం జయా భట్టాచార్యకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి జయ మరణించారంటూ కొంతమంది నెటిజన్లు ఆమెకు నివాళులు అర్పించారు. మహమ్మారి కారణంగా మరో గొప్ప నటిని కోల్పోయామంటూ సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆమె ఫొటోలను షేర్ చేశారు. ఇక ఈ విషయంపై స్పందించిన జయా భట్టాచార్య.. తాను బతికే ఉన్నానని ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు. ఆరోగ్యంగా ఉన్న తన గురించి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం తగదని.. ఏదైనా పోస్టు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలంటూ అసహనం వ్యక్తం చేశారు. ( జుట్టు తీసేస్తే అందం పోతుంది మేడమ్.. పర్లేదు!)
కాగా జంతు ప్రేమికురాలైన జయా భట్టాచార్య.. లాక్‌డౌన్ కాలంలో ఆహారం దొరకక వీధుల్లో తిరుగుతున్న మూగజీవాల ఆకలి తీర్చేందుకు స్నేహితులతో కలిసి నడుం బిగించారు. లాక్‌డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సేవా గుణాన్ని వీడలేదు. నోరులేని మూగ ప్రాణులకే కాకుండా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ సెక్స్ వర్కర్లు, ట్రాన్స్‌జెండర్లకు సైతం ఆహారం అందిస్తున్నారు. అంతేకాదు వారితో కలిసి భోజనం చేసి ట్రాన్స్‌జెండర్లు కూడా మనలాంటి మనుషులేనంటూ గొప్ప మనసు చాటుకున్నారు. కాగా ముప్పైకి పైగా సీరియళ్లలో నటించిన.. జయ పది సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఆమె.. సామాజిక సేవను మరింత విస్తృతం చేశారు. ఈ ప్రయాణంలో ఆమె ఎంతో మంది అండగా నిలుస్తున్నారు.
Include caption By using this embed, you agree to Instagram's API Terms of Use .
Comments
Please login to add a commentAdd a comment