ప్రభుత్వ ఉద్యోగులకు అమ్మ పండుగ కానుక
చెన్నై: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు పండుగ బోనస్ ప్రకటించింది. రాబోయే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జయలిలత వివిధ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు బుధవారం ఈ తీపికబురు అందించారు. 3.67 లక్షల మంది అర్హతగల ఉద్యోగులకు రూ 476,71 కోట్ల రూపాయల మేర బోనస్ ప్రకటించారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి కనీసం రూ 8,400 గరిష్టంగా రూ 16,800 వరకు బోనస్ చెల్లించనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో చెప్పారు.
అలాగే బోనస్ పథకం కిందికి రాని కో-ఆపరేటివ్ సొసైటీస్ తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగులకు రూ .4,000 బోనస్ పౌర సరఫరాల కార్పొరేషన్ తాత్కాలిక కార్మికులకు రూ 3,000 ఇవ్వనున్నట్టు జయలలిత ప్రకటించారు.