దేశభక్తిని ప్రబోధించే ‘సురభి ఏక్ ఎహసాన్ హాంకాంగ్‌లో ప్రవాస భారతీయుల ప్రత్యేక కార్యక్రమం. అమరవీరులైన సైనికుల స్ఫూర్తిని చాటిన జయ పీసపాటి టోరీ రేడియోల ప్రసారం సాక్షి, సిటీబ్యూరో టోరీ రేడియో పరిచయాల ద్వారా సైనికుల త్యాగాలు, వారి కుటుంబాలపైన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, విశేషాలను సామాన్య ప్రజలకు విస్తృతంగా పరిచయం చేశారు. ఆ జయ పీసపాటి...మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌కు చెందిన ఆమె హాంకాంగ్‌లో నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచే చాలాకాలంగా ఆమె టోరి రేడియో వ్యాఖ్యాతగా సేలందజేస్తున్నారు. తాజాగా ‘సురభి ... ఏక్ ఎహసాన్ ’ అనే పేరుతో మరో ప్రత్యేక కార్యక్రమాన్ని టోరి రేడియో ద్వారా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇటీవల హాంకాంగ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనేక మంది ప్రవాస భారతీయులు పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. పిల్లలు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశ భక్తి పాటలలు, నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో ప్రవీణ్ అగర్వాల్, సౌరభ్ రాఠీలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మంజరి గుహ, నేహా అగర్వాల్ , సాక్షి గోయల్ , సుగుణ రవి, కొరడ భరత్ కుమార్, ప్రశాంత్ పటేల్, శ్రీదేవి బొప్పన, లక్ష్మి యువ,సంజయ్ గుహ, తదితరులు స్వచ్ఛంద సేవకులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయ పీసపాటి నిర్వహించిన ‘ జై హింద్ ’ టాక్ షోలో ఉమేష్ గోపీనాథ్ జాదవ్ పాల్గొని ప్రసంగించారు.
‘సురభి ఏక్ ఎహసాన్‘కార్యక్రమానికి ఆయన అభినందలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘బి ది చేంజ్’ సంస్థ వ్యవస్థాపకులు పూనమ్ మెహతా, రిటైర్డ్ సివిల్ సర్వెంట్ నీనా పుష్కర్ణ, రుట్టోంజీ ఎస్టేట్స్ కంటిన్యూయేషన్ లిమిటెడ్ డైరెక్టర్ రానూ వాసన్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతీయ సంఘాల నుంచి పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.కార్గిల్ యుద్ధంలో భారతీయ సైనికులు ప్రదర్శించిన అద్భుతమైన ధైర్యసాహసాలు, పరాక్రమాన్ని శ్లాఘిస్తూ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపాయి. సాయుధ దళాల వైద్య కళాశాలలో చదవాలనే ఆశయాన్ని సాధించలేకపోయినప్పటికీ టోరి రేడియో వ్యాఖ్యాతగా అనేక దేశభక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్న జయ పీసపాటి ‘‘జై హింద్’’ అనే టాక్ షో ద్వారా ఆమె పలువురు సాయుధ దళాల అధికారులు, విశ్రాంత అధికారులు, అమర వీరుల కుటుంబ సభ్యులతో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించి ప్రపంచలోని ప్రవాస తెలుగు వారికి పరిచయం చేశారు.
(చదవండి: శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత నూతన కాన్సులేట్ జనరల్‌గా తెలుగు వ్యక్తి!)
Comments
Please login to add a commentAdd a comment