jai hind
-
హాంకాంగ్‌లో ‘సురభి ... ఏక్ ఎహసాన్ ’
దేశభక్తిని ప్రబోధించే ‘సురభి ఏక్ ఎహసాన్ హాంకాంగ్‌లో ప్రవాస భారతీయుల ప్రత్యేక కార్యక్రమం. అమరవీరులైన సైనికుల స్ఫూర్తిని చాటిన జయ పీసపాటి టోరీ రేడియోల ప్రసారం సాక్షి, సిటీబ్యూరో టోరీ రేడియో పరిచయాల ద్వారా సైనికుల త్యాగాలు, వారి కుటుంబాలపైన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, విశేషాలను సామాన్య ప్రజలకు విస్తృతంగా పరిచయం చేశారు. ఆ జయ పీసపాటి...మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌కు చెందిన ఆమె హాంకాంగ్‌లో నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచే చాలాకాలంగా ఆమె టోరి రేడియో వ్యాఖ్యాతగా సేలందజేస్తున్నారు. తాజాగా ‘సురభి ... ఏక్ ఎహసాన్ ’ అనే పేరుతో మరో ప్రత్యేక కార్యక్రమాన్ని టోరి రేడియో ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటీవల హాంకాంగ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనేక మంది ప్రవాస భారతీయులు పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. పిల్లలు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశ భక్తి పాటలలు, నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో ప్రవీణ్ అగర్వాల్, సౌరభ్ రాఠీలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మంజరి గుహ, నేహా అగర్వాల్ , సాక్షి గోయల్ , సుగుణ రవి, కొరడ భరత్ కుమార్, ప్రశాంత్ పటేల్, శ్రీదేవి బొప్పన, లక్ష్మి యువ,సంజయ్ గుహ, తదితరులు స్వచ్ఛంద సేవకులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయ పీసపాటి నిర్వహించిన ‘ జై హింద్ ’ టాక్ షోలో ఉమేష్ గోపీనాథ్ జాదవ్ పాల్గొని ప్రసంగించారు. ‘సురభి ఏక్ ఎహసాన్‘కార్యక్రమానికి ఆయన అభినందలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘బి ది చేంజ్’ సంస్థ వ్యవస్థాపకులు పూనమ్ మెహతా, రిటైర్డ్ సివిల్ సర్వెంట్ నీనా పుష్కర్ణ, రుట్టోంజీ ఎస్టేట్స్ కంటిన్యూయేషన్ లిమిటెడ్ డైరెక్టర్ రానూ వాసన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతీయ సంఘాల నుంచి పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.కార్గిల్ యుద్ధంలో భారతీయ సైనికులు ప్రదర్శించిన అద్భుతమైన ధైర్యసాహసాలు, పరాక్రమాన్ని శ్లాఘిస్తూ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపాయి. సాయుధ దళాల వైద్య కళాశాలలో చదవాలనే ఆశయాన్ని సాధించలేకపోయినప్పటికీ టోరి రేడియో వ్యాఖ్యాతగా అనేక దేశభక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్న జయ పీసపాటి ‘‘జై హింద్’’ అనే టాక్ షో ద్వారా ఆమె పలువురు సాయుధ దళాల అధికారులు, విశ్రాంత అధికారులు, అమర వీరుల కుటుంబ సభ్యులతో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించి ప్రపంచలోని ప్రవాస తెలుగు వారికి పరిచయం చేశారు. (చదవండి: శాన్ఫ్రాన్సిస్కోలో భారత నూతన కాన్సులేట్ జనరల్‌గా తెలుగు వ్యక్తి!) -
స్వాతంత్య్ర సంగ్రామ స్పూర్తితో.. విశాఖలో జేపీఎల్
సాక్షి, విశాఖపట్నం: క్రీడలతో సనాతన ధర్మం సందేశంలో భాగంగా సేవ్ టెంపుల్స్ భారత్ ఆధ్వర్యంలో అజాదీ కా అమృత్ మహోత్సవాల స్పూర్తితో డా. గజల్ శ్రీనివాస్ ‘‘జైహింద్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్)’’ నిర్వహించడం స్ఫూర్తి దాయకమని శాసన మండలి సభ్యులు పీవీ మాధవ్ అన్నారు. ఈ క్రీడలు నిర్వహించడం ద్వారా సనాతన ధర్మ, దేశ భక్తిని ప్రచారం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. జైహింద్ ప్రీమియర్ లీగ్ ఇన్విటేషన్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ విశాఖపట్నంలోని పి.ఎమ్.పాలెం, బి. గ్రౌండ్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌ను శ్రీ శ్రీ శ్రీ శ్రీనివాసానంద స్వామి గోపూజ నిర్వహించి ప్రారంభించారు. పరిమిత ఓవర్ల టోర్నమెంట్లో షహీద్ వీర సావర్కర్ లెవెన్, షహీద్ అల్లూరి లెవెన్, షహీద్ భగత్ సింగ్ లెవెన్, షహీద్ చంద్ర శేఖర్ ఆజాద్ లెవెన్ శ్రీ బిర్సా ముండా లెవెన్ జట్లు ఆడుతున్నాయని సేవ్ టెంపుల్స్ భారత్, జైహింద్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ డా. గజల్ శ్రీనివాస్, జేపీఎల్ కన్వీనర్ శ్రీ ఫణీంద్ర తెలిపారు. భారతీయ క్రీడా సుహృద్భావం, స్వాతంత్య్ర సంగ్రామ, సనాతన ధర్మ ప్రచారాలు ముఖ్య లక్ష్యంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. అనేకమంది సాధు, సంత్ పరివారం ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషమని జేపీల్ డైరెక్టర్స్ శ్రీ ఎ. హేమంత్ శర్మ, శ్రీ మేడికొండ శ్రీనివాస్, శ్రీ డి.ఎస్ వర్మ, సంచాలకులు శ్రీ పట్టా రమేష్ తదితరులు తెలిపారు. -
జవాన్ల గ్రామం.. ఊరి తల్లిదండ్రులకు పాదాభివందనం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దుల్లో పహారా కాసే జవాన్లుగా ప్రత్యక్షంగా దేశసేవ చేస్తూ తమ ఊరికే కాక నిజామాబాద్ జిల్లాకే గర్వకారణంగా నిలుస్తున్నారు ఈ యువకులు. మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి నుంచి గత 21 ఏళ్లలో సగటున ఏడాదికొకరు చొప్పున 21 మంది యువకులు ఆర్మీ, ఐటీబీపీ (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్) దళాల్లోకి వెళ్లారు. మొత్తం ఉత్తర తెలంగాణలోనే ఈ ఊరి ప్రత్యేకతను చాటుతున్నారు. దీంతో ఈ గ్రామాన్ని ‘అడవి మామిడిపల్లి’ అని కాకుండా ‘జైహింద్ మామిడిపల్లి’ అని మార్చాలనే స్ఫూర్తిని కలిగిస్తోంది. ఇక ఊరిలోకి అడుగుపెట్టగానే స్వామి వివేకానంద విగ్రహం కనిపిస్తుంది. ఊరి మధ్యలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలు దర్శనమిస్తాయి. దేశభక్తి స్ఫూర్తిగా విగ్రహాలు నెలకొల్పడంతో పాటు తమ బిడ్డలను దేశ రక్షణ కోసం సరిహద్దుల పహారాకు పంపుతున్న ఆ ఊరి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలని పలువురు చెబుతుండడంలో అతిశయోక్తి లేదు. చాలాసార్లు ఏడుపొస్తుంది మా కుమారుడు కల్లెడి సాయికుమార్ 2012లో ఆర్మీలోకి వెళ్లాడు. ఉన్న ఎకరం అమ్మి కుమార్తె పెళ్లి చేశాం. మాకు ఇల్లు లేదు. అద్దెకు ఉంటున్నాం. ఇంటర్ తర్వాత చదివించలేకపోయాం. ఉన్న ఒక్క కొడుకు పట్టుబట్టి ఆర్మీలోకి వెళ్లాడు. ఒక్కడే కొడుకు కావడంతో బాధతో చాలాసార్లు ఏడుస్తాం. అయినా దేశానికి సేవ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఫోన్ చేసి ఏడవద్దని ఓదారుస్తాడు. మా కోడలి డెలివరీకి సైతం అతి కష్టంమీద సెలవు తీసుకుని వచ్చి వెళ్లాడు. –కల్లెడి జయ, నారాయణ దంపతులు అగ్నిపథ్‌కు ముందుకొస్తున్నారు.. మా ఊరి నుంచి యువకులు సైన్యంలోకి వెళ్లడం 2000 సంవత్సరం నుంచి మొదలైంది. ఇప్పటి వరకు 21 మంది యువకులు ఆర్మీ, ఐటీబీపీ విభాగాల్లోకి వెళ్లారు. ముగ్గురు ఇప్పటికే ఆర్మీ నుంచి రిటైర్ కాగా మిగిలినవారు సర్వీసులో ఉన్నారు. మరో ఎనిమిది మంది యువకులు అగ్నిపథ్‌కు దరఖాస్తులు చేసుకున్నారు. 600 గడపలు ఉన్న మా ఊరి నుంచి క్రమం తప్పకుండా యువకులు సైన్యంలోకి వెళుతుండడం ఊరంతటికీ గర్వకారణం. – గంగోని సంతోష్, మాజీ సర్పంచ్ ఎన్ఎస్జీలో పనిచేశాను.. దేశ సేవ చేయాలని ఆర్మీలోకి వెళ్లాను. అసోంలో పనిచేసే సమయంలో కఠినంగా సాధన చేసి ఎన్ఎస్జీ(నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్)కి ఎంపికయ్యా. ఎన్ఎస్జీలో మూడేళ్లు పనిచేశా. 90 రోజుల కఠిన శిక్షణలో నెగ్గితేనే దీనికి ఎంపిక చేశారు. మిలిటెంట్ ఆపరేషన్, వీఐపీ పర్యటనలు, బాంబ్ స్క్వాడ్ విధుల్లో పాల్గొన్నాను. 16 ఏళ్ల సర్వీసు పూర్తయ్యాక ఊరికి వచ్చి కౌలు వ్యవసాయం చేస్తున్నా. ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగావకాశాలు ఇవ్వడం లేదు. – కాపుకారి జానకీరాం, మాజీ జవాన్ శ్రీనగర్‌లో హవల్దార్‌గా.. గత 19 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తున్నా. సిపాయిగా ఎంపికై లాన్స్‌నాయక్, నాయక్‌గా ఉన్నతి పొంది ప్రస్తుతం హవల్దార్‌గా ఉన్నాను. ప్రస్తుతం శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్నాను. పలుసార్లు తీవ్ర మంచులో ఆపరేషన్లలో పనిచేశాను. రోడ్లు ధ్వంసమై, కొండచరియలు విరిగిపడిన సందర్భాల్లో నెలలతరబడి బయటకు రాలేని పరిస్థితి. కనీసం ఎవరితోనూ కమ్యూనికేషన్ లేకుండా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. – కేతావత్ రవీందర్ పెద్దనాన్న మృతి సైతం తెలియలేదు.. 2011లో ఆర్మీలో చేరాను. ప్రస్తుతం జమ్ములో నాయక్ హోదాలో పనిచేస్తున్నా. మహారాష్ట్ర, రాజస్థాన్, సికింద్రాబాద్, కశ్మీర్‌లలో పనిచేశాను. మేం మరణించినా సరే శత్రువును చంపడమే లక్ష్యంగా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. కొన్ని సందర్భాల్లో 3 నెలల పాటు కుటుంబ సభ్యులతో పాటు మరెవరితోనూ కమ్యూనికేషన్ లేదు. నా పెద్దనాన్న మృతి గురించి కూడా తెలియకుండా అయింది. – బాణావత్ నరేశ్ ఆర్టికల్ 370 రద్దు తరువాత.. 2012లో ఆర్మీలో చేరి ప్రస్తుతం జమ్ములో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నా. ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో మూడు నెలల పాటు ఏమాత్రం కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయింది. బయటి ప్రపంచంతో సంబంధం లేని లేకుండా విధులు నిర్వహించాం. ఆర్మీలో పనిచేయడం ఆనందంగా ఉంది. – సంగెం అనిల్ 17 ఏళ్ల సర్వీసు పూర్తి.. మా ఊరి నుంచి మొదటిసారి 2000 సంవత్సరంలో చంద్రశేఖర్ ఆర్మీలోకి వెళ్లారు. ఆయన స్ఫూర్తితో నేను సైతం దేశ సేవ చేసేందుకు 2004లో ఆర్మీలో చేరాను. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేశాను. 17ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 2021లో వచ్చాను. అప్పటినుంచి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నా. – మావూరి రవీందర్, మాజీ జవాన్ భర్త గురించి టెన్షన్ పడ్డా.. నా భర్త జానకీరాం ఆర్మీలో చేసే సమ యంలో నేను కూడా పంజాబ్, ఢిల్లీ, జమ్ము కశ్మీర్, హైదరాబాద్ క్వార్టర్స్‌లో ఉన్నా. అయితే అభినందన్ వర్ధమాన్ ఘటన నేపథ్యంలో నా భర్త కిట్ బ్యాగులతో వెళ్లిన సందర్భంలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందాను. నా భర్త ఏ విషయం చెప్పకపోవడంతో బాగా టెన్షన్ కలిగింది. ప్రస్తుతం సర్వీసు పూర్తి చేసుకుని ఊర్లోనే ఉంటున్నాం. – కాపుకారి భవిత గర్వంగా ఉంది.. నా భర్త అనిల్ ఆర్మీ లో పనిచేస్తున్నాడంటే ఏదో ఉద్యోగం అనుకున్నా. అయితే ఇది దేశం కోసం చేసే అత్యంత రిస్క్ అని తెలిసి ఆందో ళన చెందినప్పటికీ గర్వంగానే ఉంటోంది. కు టుంబాన్ని మిస్ అవుతున్నప్పటికీ మాకు గర్వమే. గతంలో ఢిల్లీలో ఉన్నాను. ఇప్పుడు నా భర్త జమ్ములో పనిచేస్తుండగా, నేను ఇద్దరు పిల్లలు, అత్త, మామలను చూసుకుంటూ ఊర్లోనే ఉంటున్నా. – సంగెం వాణి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది మాకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఏకైక కుమారుడు అనిల్ జమ్ము లో ఆర్మీలో పనిచేస్తున్నాడు. అందరికీ పెళ్లిళ్లు చేశాను. ఒక్కగానొక్క కొడుకును ఆర్మీలోకి ఎలా పంపావని చాలామంది అడుగుతుంటే, జమ్ము కశ్మీర్లో విధ్వంసకర వార్తలు వస్తుంటే బాధ కలుగుతుంది. అయినప్పటికీ మా కొడుకు విషయంలో గర్వంగా ఉంటోంది. – సంగెం చిన్న హనుమాండ్లు -
శతమానం భారతి: లక్ష్యం 2047 పట్టణీకరణ
ప్రపంచ స్థూల ఉత్పత్తిలో 60 శాతం వాటా పట్టణాలదే. అభివృద్ధి చెందిన దేశాల్లో పట్టణీకరణ 16వ శతాబ్దం నుంచే ప్రారంభమవడానికి కారణం పారిశ్రామిక విప్లవమే. భారతదేశంలో పట్టణీకరణ స్వాతంత్య్రానంతరమే వేగం పుంజుకొంది. 2011 లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లలో పట్టణాల్లో నివసించే వారు 37.71 కోట్లు.. అంటే 31.16 శాతం. 2030 నాటికి దేశ జనాభాలో పట్టణ ప్రజల వాటా 50 శాతానికి చేరుతుందని ’ప్రపంచ బ్యాంకు, మెకిన్సే’ నివేదికలు వెల్లడించాయి. 1951లో దేశంలో పది లక్షలకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల సంఖ్య తొమ్మిది. 2011 నాటికి అది 53 కు పెరిగింది. అందులో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ ఉన్నాయి. దేశంలోని పట్టణ జనాభాలో 37 శాతం మెట్రోపాలిటన్ నగరాల్లోనే నివసిస్తోంది. ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లలో జనాభా 40 లక్షల పైమాటే కాబట్టి, వాటిని మెగా నగరాలుగా వర్గీకరించారు. భారతదేశంలో పట్టణీకరణ విధానాలన్నీ స్వాతంత్య్రానంతరం రూపుదిద్దుకొన్నవే. 75 సంవత్సరాల పట్టణీకరణ విధానాలు, ప్రణాళికల వల్ల భారత స్థూల దేశీయోత్పత్తిలో పట్టణాల వాటా పెరిగింది. చండీగఢ్ తొలి పంచవర్ష ప్రణాళికా కాలంలో నిర్మితమైంది. పట్టణీకరణకు ఊతమిచ్చే వ్యవస్థలను, సంస్థలను వివిధ ప్రణాళికా కాలాల్లోనే ఏర్పాటు చేశారు. అమెరికా, యూరప్ దేశాల్లో ’నవీన పట్టణీకరణ’ ప్రాచుర్యం పొందుతోంది. అక్కడి పట్టణీకరణ ఒక క్రమ పద్ధతిలో సుస్థిరంగా రూపుదిద్దుకొంది. ఈ తరహా విధానాలను మన ప్రభుత్వాలు కూడా పరిశీలించాలి. -
గోఖలేనే లేకుంటే.. గాంధీనే రాకుంటే
‘‘ఏప్రిల్‌లో నేను భారతదేశానికి బయలుదేరాలని నిశ్చయించుకున్నాను. నేనిక మీ చేతులలోనే ఉంటాను...’’ ఫిబ్రవరి 27,1914 న దక్షిణాఫ్రికా నుంచి తన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలేకు గాంధీజీ రాసిన లేఖలోని తొలి వాక్యాలివి. దక్షిణాఫ్రికాను శాశ్వతంగా వీడి భారతదేశం రావలసిందని గోఖలే పలుమార్లు కోరిన తరువాత గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. 1896లో గాంధీజీ భారతదేశం వచ్చినప్పుడు పూనాలో మొదటిసారి గోఖలేను చూశారు. తరువాత 1901 నాటి కలకత్తా కాంగ్రెస్ సమావేశాల కోసం ఇద్దరూ దాదాపు నెలరోజులు కలసి ఉన్నారు. అప్పుడే గోఖలే తన మనసులోని మాటను గాంధీకి చెప్పారు. దక్షిణాఫ్రికా భారతీయుల హక్కుల ఉద్యమానికి చేస్తున్న సేవలకు గాను 1911 నాటి కలకత్తా కాంగ్రెస్ సమావేశాలు గాంధీని అభినందించాయి కూడా. గోఖలే జాంజిబార్ (టాంజానియా) పర్యటనలో ఉన్నప్పుడు గాంధీ వెళ్లి కలుసుకున్నారు. అప్పుడే భారత్‌కు వచ్చేయమని గోఖలే కచ్చితంగా చెప్పారు. ఆఖరికి 21 ఏళ్ల మజిలీ తరువాత జూలై 18, 1914 న గాంధీ కేప్టౌ¯Œ నుంచి భారత్‌కు బయలుదేరారు. ఇంగ్లిష్ చానల్ దాటగానే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. కొద్దికాలం ఇంగ్లండ్‌లో చిక్కుకుపోయారు. అప్పుడే వైద్యం కోసం ఫ్రా¯Œ ్సలోని విచీ ప్రాంతానికి గోఖలే వెళ్లారు. అక్కడ మళ్లీ ఇద్దరూ కలుసుకున్నారు. చివరికి డిసెంబర్ 19, 1914న గాంధీ, కస్తుర్బా ఇంగ్లండ్‌లో ఎస్ఎస్ అరేబియా ఓడ ఎక్కారు. జనవరి 9, 1915 న ఉదయం 7.30 లకి ఆ ఓడ బొంబాయి తీరంలోని అపోలో బందర్ చేరుకుంది. గుజరాతీ కట్టూబొట్టూతో దిగిన గాంధీకి ఘనస్వాగతం లభించింది. అదీ నెటాల్.. ఇది నేషనల్ గాంధీజీ ఇండియా వచ్చి స్థిరపడే నాటికే దక్షిణాఫ్రికాలో శాంతియుత సత్యాగ్రహోద్యమంతో ప్రిటోరియా ప్రభుత్వాన్ని లొంగదీసిన ఉద్యమకారునిగా భారతీయులకు చిరపరిచితులు. నాయకుల దృష్టిలో ఒక విశిష్ట ఉద్యమకారుడు. కానీ భారత స్వాతంత్య్ర సమరం రూపురేఖలు, పంథా ఎలా ఉన్నాయో చూడండి. జాతీయ కాంగ్రెస్ స్థాపనకు ముందు నాటి రాజకీయ అనైక్యత జాడలు కనిపిస్తున్నాయి. జాతీయోద్యమం మితవాద, అతివాద వర్గాల మధ్య నలుగుతున్నది. తీవ్ర జాతీయవాదంతో, వ్యక్తిగత హింసాపథంతో భీతిల్లుతున్న బ్రిటిష్ ప్రభుత్వం దేశవాసులందరి మీద అణచివేతను తీవ్రతరం చేసింది. అయినా జాతీయోద్యమం శాంతి పథాన్ని వీడరాదన్నదే నాయకుల అభిమతం. జాత్యహంకారం, అణచివేతలకు పేర్గాంచిన దక్షిణాఫ్రికా శ్వేతజాతి పాలన మీద ‘నెటాల్ ఇండియ¯Œ కాంగ్రెస్’ సంస్థతో గాంధీ సాధించిన విజయాలు శాంతియుత పంథాలోనే సాధ్యమైనాయి. హింస, ప్రతిహింస లేవు. అదే గోఖలేని ప్రభావితం చేసి, గాంధీజీని భారత దేశం రప్పించింది. భారత స్వాతంత్య్ర పోరాటాన్ని ఐక్యంగా సాగించగల నాయకుడిని గోఖలే గాంధీలో చూశారని అనిపిస్తుంది. పెరుగుతున్న ముస్లిం లీగ్ ప్రాబల్యం జాతీయోద్యమానికి ఉపకరించేటట్టు మలచడం నాటి అవసరం. 1893లో ఎస్ఎస్ సఫారీ ఓడ మీద దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీ కుల,మత, ప్రాంత విభేదాల ప్రసక్తి లేకుండా అక్కడ మొత్తం భారతీయులందరికి ఆమోదయోగ్యుడయ్యారు. 50,000 మంది భారతీయుల హక్కుల కోసం సాగిన ఆ పోరాటంలో హిందువులు, ముస్లింలు కలసికట్టుగా ఉన్నారు. క్రైస్తవుల వివాహ హక్కు గురించి కూడా గాంధీ ఉద్యమించారు. లక్ష్య సాధనలో అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లడం అనే విద్య గాంధీలో ఉంది. దక్షిణ భారతదేశం వారు, ఉత్తర భారతం వారు కూడా ఆయన వెంట నడిచారు. గాంధీకి ముందే.. మహామహులు! దక్షిణాఫ్రికా నుంచి గాంధీ ఇండియాకు వచ్చేవరకు ఇక్కడ జాతిని కదిలించే స్థాయిలో ఉద్యమం ఆరంభం కాలేదని అనుకోడాని లేదు. ఒక శక్తిమంతమైన స్వాతంత్య్ర పోరాట జాడలు సుస్పష్టంగా ఉన్నాయి. దాదాభాయ్ నౌరోజీ, రెనడే, గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, లాల్, పాల్, బాల్, ఫిరోజ్‌షా మెహతా, మదన్ మోహన్మాలవీయ, సరోజినీనాయుడు, మోతీలాల్ వంటివారు నిర్వహించిన ఉద్యమమది. అయినా అది వేరు, గాంధీ రాక తరువాతి పోరాట స్వరూపం వేరు. గాంధీ ఉద్యమ రూపం వేరైనా, అంతకు ముందు జరిగిన ఉద్యమాన్ని తక్కువ చేయడం చారిత్రక దృష్టి కాబోదు. మైదాన ప్రాంత స్వరాజ్య సమరంతో పాటు, రైతాంగ ఉద్యమాలు, కొండలలో గిరిజనోద్యమాలు జరిగాయి. విదేశాలు కేంద్రంగా తీవ్ర జాతీయవాదంతో భారత్ స్వేచ్ఛ కోసం గదర్ పార్టీ ఉద్యమించిన కాలం కూడా అదే. వీటితో భారతీయులు సాధించిన కొన్ని విజయాలూ ఉన్నాయి. – డా. గోపరాజు నారాయణరావు -
‘జై హింద్’ నినాదకర్త మనోడే!
‘జై హింద్’ నినాదాన్ని ప్రతిపాదించింది హైదరాబాద్ నివాసి సయ్యద్ ఆబిద్ హసన్ సఫ్రాని అని విన్నప్పుడు ఆశ్చర్యం కలగక మానదు. 1911 ఏప్రిల్ 11న ఫఖ్రుల్ హాజియా బేగం, అమీర్ హసన్ దంపతులకు జన్మించారు ఆబిద్. ఆయన తల్లి స్వాతంత్య్ర సమర యోధురాలు కావడంతో ఆమె బాటలో నడుస్తూ జాతీయ పతాకాన్ని చేతబట్టారు. మహాత్ముని పిలుపు మేరకు చదువుకు స్వస్తి పలికి 1931లో సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ తరువాత నాసిక్ జైలుకు చెందిన రిఫైనరీని నాశనం చేయ తలపెట్టిన విప్లవకారులతో పనిచేసి కారాగార శిక్షకు గురైనారు. ‘గాంధీ–ఇర్విన్ ఒడంబడిక’ ఫలితంగా జైలు నుండి విడుదలయ్యారు. ఆ తర్వాత జాతీయ కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటూ... ఇంజినీరింగ్ కోసం జర్మనీ వెళ్ళారు. అక్కడ సుభాష్ చంద్రబోస్‌తో పరిచయం ఏర్పడింది. 1942 నుండి రెండేళ్ళ పాటు బోస్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా, అనువాదకుడిగా పని చేశారు. ఆ క్రమంలో అనేక దేశాలు తిరిగి వచ్చారు. జర్మనీలో ఉన్న సమయంలో సైనికులు పరస్పరం పలకరించుకోవడానికి ‘నమస్తే’, ‘సలాం అలైకువ్‌ు’ ఇత్యాది మాటలు వాడేవారు. వీటికి బదులుగా దేశభక్తిని చాటే ఏదైనా ఒక నినాదాన్ని సూచించమని నేతాజీ ఆబిద్ హసన్‌ను కోరగా ‘జై హింద్’ నినాదాన్ని సూచించారు. నాటి నుండి జైహింద్ భారత విప్లవ నినాదంగా మారింది. జైహింద్ నినాదానికి నేతాజీనే రూపకల్పన చేశారని చాలా మంది భావిస్తారు. ఆబిద్ హసన్ ప్రతిపాదించిన ఈ నినాదం నేతాజీ కారణంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళింది. ఆబిద్ హసన్ 1984లో 73 సంవత్సరాల వయస్సులో స్వస్థలమైన హైదరాబాదులోనే తుది శ్వాస విడిచారు. – షేక్ అబ్దుల్ హకీం జానీ, తెనాలి (భారత స్వాతంత్య్రఅమృతోత్సవాల సందర్భంగా...) -
జై భీమ్ నినాదకర్త హర్దాస్
అంబేడ్కర్‌వాదులు ఒకరినొకరు పలకరించుకోవడానికి జై భీమ్ అనడం పరిపాటి. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో అనేక నినాదాలు పౌరుల్లో దేశభక్తిని పెంచాయి. వాటిల్లో జై హింద్ ఒకటి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీన్ని విరివిగా ఉపయోగించారు. ఈ నినాదాన్ని నేతాజీ అనుచరుడు అబిద్ హసన్ సఫ్రానీ సృష్టించారు. తొలుత దీన్ని భారతదేశానికి విజయం కలగాలి అనే అర్థంలో ఉపయోగించేవారు. ఇప్పుడు దేశానికి వందనం అనే భావంలో ఉపయోగిస్తున్నారు. అలాగే జై భీమ్ నినాదం అంబేడ్కర్ జీవితంతో ముడిపడి ఉన్నప్పటికీ, దీన్ని ఆయన అనుచరుడు బాబు హర్దాస్(హర్దాస్ లక్ష్మణ్ రావు నగ్రాలే) సృష్టించారు. ఈయన 1904 జనవరి 6న బ్రిటిష్ ఇండియాలో జన్మిం చారు. వీర్ బాలక్, మండల్ మహాత్మా, సాంగ్స్ ఆఫ్ ద మార్కెట్ వంటి రచనలు చేశారు. చిన్న తనం నుంచే విగ్రహారాధనను ఖండించారు. మూఢ నమ్మకాలను వ్యతిరేకించారు. నిరక్షరా స్యత నిర్మూలన కోసం రాత్రి బడులు నడిపారు. 1928లో ఆయన మొదటిసారి అంబేడ్కర్‌ను కలుసుకున్నారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీలో చురుగ్గా పనిచేశారు. పార్టీ సభ్యులు ఒకరినొకరు పలకరించుకోవడానికి ఏదైనా మంచి నినాదం ఉంటే బావుంటుందని ఆలోచించారు. అలా 1935లో జై భీమ్ అని ప్రయో గించారు. చీకటి నుంచి వెలుగులోకి రావడం... అంబేడ్కర్‌కు విజయం కలగాలి... అని దీనికి అర్థం చెప్పొచ్చు. ఇది అణగారిన వర్గాల హక్కుల సాధనకు ఒక అక్షర ఆయుధంగా ఉపకరిస్తోందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బాబు హర్దాస్ చిరుప్రాయంలోనే 1939 జనవరి 12న తుదిశ్వాస విడిచారు. ఆయన నినాదం మాత్రం దేశ మంతటా మారుమోగుతూనే ఉంది. – ఎం. రాంప్రదీప్, తిరువూరు (జనవరి 6న బాబు హర్దాస్ జయంతి) -
‘ఏ పరిస్థితుల్లోనైనా ‘జై హింద్’ అనే అంటాను’
హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ‘ఆస్క్ అసద్’ పేరిట ట్విటర్లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. గురువారం సాయంత్రం ట్విటర్ వేదికగా తన అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకున్నారు. కశ్మీర్లో మూక దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. కశ్మీరీలు కూడా భారత్‌లో భాగమేనని తెలిపారు. హింసను అరికట్టడం, రాంబో విధానాలను తగ్గించడం ద్వారా మాత్రమే అక్కడి పరిస్థితులను చక్కదిద్దవచ్చని అన్నారు. తమ పార్టీ అందరి కోసం పోరాడుతుందని వెల్లడించారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలన్నదే తమ కోరిక అని పేర్కొన్నారు. అంతేకాకుండా తానెప్పుడూ జాతీయ గేయాన్ని వ్యతిరేకించలేదని తెలిపారు. దానిని పౌరులపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. ఏ పరిస్థితుల్లోనైనా తాను ‘జై హింద్’ అనే అంటానని చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు కీలక భూమిక పోషిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మతం పేరుతో భయం సృష్టించడం ఎప్పటికైనా ముప్పేనని చెప్పుకొచ్చారు. మీరు ప్రధాని అయితే చేసే మొదటి పని ఏమిటని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. తనకు అలాంటి ఉద్దేశం లేదని.. ఉన్నదానితో తాను సంతోషంగా ఉన్నట్టు పేరొన్నారు. మీరు హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం అవదలచుకున్నారా అని మరో నెటిజన్ అడగ్గా.. లేదని సమాధానం ఇచ్చిన అసద్, తెలుగు రాష్ట్రాలతోపాటు, యూపీ, మహారాష్ట్రలోనూ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్టు చెప్పారు. చివరిగా ఆస్క్ అసద్‌లో పాల్గొన్న అందరికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతానని అన్నారు. #AskAsad Regardless of any atmosphere, I will always say Jai Hind https://t.co/xzJMpDdMGN — Asaduddin Owaisi (@asadowaisi) 7 March 2019 -
జైహింద్, జై భారత్ అనాల్సిందే...
గాంధీనగర్: ప్రాథమిక పాఠశాల దశ నుంచే విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పాఠశాలల్లో హాజరుపలికేముందు ఎస్ సర్, ప్రజెంట్ సర్‌కు బదులుగా జైహింద్, జై భారత్ అనాలని నిర్ణయించింది. నూతన సంవత్సరం జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈవిధానం అమలు కానుంది. ఈమేరకు గుజరాత్ విద్యాశాఖమంత్రి భూపేంద్ర సిన్హ్ చూడాసమా ప్రకటించారు. విద్యార్థి దశనుంచే పిల్లల్లో దేశభక్తిని అలవరిచేందుకు హాజరు నిబందనల్లో మార్పులు చేసినట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. -
హాజరు పలికేటప్పుడు జైహింద్ అనాల్సిందే
భోపాల్, మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పాఠశాలల్లో విద్యార్థులు హాజరు పలికేటప్పుడు జైహింద్ అనడం తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సాత్నా జిల్లాలో తొలుత దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టిన విద్యాశాఖ.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి విజయ్ షా గత డిసెంబర్లోనే కసరత్తు ప్రారంభించారు. ఇదే అంశంపై విజయ్ మాట్లాడుతూ.. ఇకపై ప్రభుత్వ పాఠశాలలో ఇక నుంచి విద్యార్థులు ‘యస్ సార్, యస్ మేడమ్’కు బదులు జైహింద్ అనాలని పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థుల్లో దేశ భక్తి భావం పెరుగుతోందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకిస్తారని అనుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షా ఇరవై రెండు వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నిబంధన అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలకు దీనికి సంబంధించిన ఆదేశాలను జారీ చేయనున్నట్టు తెలిపారు. -
‘హాజరు తీసుకునేప్పుడు జైహింద్ అనండి’
సాక్షి, భోపాల్: స్కూల్లో టీచర్లు హాజరు తీసుకునేప్పుడు ఎస్ సర్/ మేడమ్ అనే బదులు జైహింద్ అనాలని సాత్నా జిల్లా ప్రైయివేట్ స్కూల్ విద్యార్థులకు మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి విజయ్ షా సూచించారు. దీంతో విద్యార్థుల్లో దేశభక్తి పెరుగుతుందన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అనుమతితో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాల్లో అమలు చేస్తామన్నారు. ఇది ప్రయివేట్ స్కూల్ విద్యార్థులకు ఒక సలహా మాత్రమేనని షా పేర్కొన్నారు. చిత్రకూట్‌లో జరిగిన ప్రిన్సిపాల్స్, టీచర్ల డివిజనల్ స్థాయి సమావేశంలో మంత్రి ఈ ప్రకటన చేశారు. -
కీరవాణి ట్వీట్‌పై దుమారం
శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన పైసా వసూల్ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ట్వీట్ చేశారు. అదే బాటలో సీనియర్ సంగీత దర్శకులు కీరవాణి కూడా థియేటర్లో అభిమానుల ఉత్సాహం గురించి ఓ ట్వీట్ చేశారు. అభిమానులు 'జై హింద్' అన్నంత ఆనందంగా, ఉత్సాహంగా జై బాలయ్య అంటూ నినదిస్తున్నారు అంటూ ట్వీట్ చేశారు కీరవాణి. అయితే కీరవాణి చేసిన ఈ ట్వీట్ పై పెద్ద దుమారమే రేగింది. జై బాలయ్య నినాదాన్ని జై హింద్ తో ఎలా పోలుస్తారని నెటిజన్లు విమర్శించారు. అదే సమయంలో కొందరు కులం ప్రస్థావన కూడా తీసుకురావటంతో వివాదం మరింత ముదిరింది. అయితే ఈ విమర్శలపై కీరవాణి కూడా ఘాటుగా స్పందించారు. తాను అర్జున్ రెడ్డి యూనిట్ ను కులం కోసమే ప్రశంసించానా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు ఫేక్ డీపీలు పెట్టుకునే కుక్కలు తన దేశ భక్తి గురించి మాట్లాడటం విడ్డూరమని గట్టి కౌంటర్ ఇచ్చారు కీరవాణి. The good old slogan "Jai Balayya" is now emotionally and entertainingly synonymous to " Jai Hind " — mmkeeravaani (@mmkeeravaani) 1 September 2017I am a chemist now testing my last 2 tweets comparing with likes, retweets blah blah. Praising, confusion, anger.. all are welcome — mmkeeravaani (@mmkeeravaani) 1 September 2017BTW which cast is Radhan, Sandeep and Sundaram of AR ?— mmkeeravaani (@mmkeeravaani) 1 September 2017Anonymous stray dogs with fake dps can't judge my patriotism . I voted last time. Did you?— mmkeeravaani (@mmkeeravaani) 1 September 2017 -
పెళ్లి ఘడియల్లో వివస్త్రగా నిలబెట్టారు
కాన్పూర్: అనుమానంతో పెళ్లి ఘడియల్లో ఓ వధువును తీవ్రంగా అవమానించారు. పెళ్లి కొడుకు తరుపు మహిళలు ఆమె వస్త్రాలను తీసేసి శరీరాన్ని తనిఖీలు చేశారు. ఆ వధువుకు చర్మ వ్యాధి ఉందని ఆరోపణలు రావడమే ఈ పరిణామానికి దారి తీసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జై హింద్ అనే వ్యక్తికి తీజా అనే యువతికి వివాహం నిశ్చయించారు. సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి పెళ్లికూతురు ల్యుకోడర్మా అనే చర్మ వ్యాధితో బాధపడుతుందని, ఆ విషయాన్ని పెళ్లి కొడుకు కుటుంబానికి చెప్పకుండా దాచారంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో ఈ విషయంపై వారి కుటుంబ సభ్యులు రచ్చరచ్చ చేశారు. దాదాపు పెళ్లిని ఆపించేంత పని చేశారు. అయితే, పెళ్లి కూతురు తండ్రి పోలీసులను పిలవడంతో నేరుగా ఇరు వర్గాలను స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు అక్కడే ఓ స్టేషన్ గదిలోకి అబ్బాయి తరుపు మహిళలు కొందరిని పంపించి అక్కడే పెళ్లి కూతురు వస్త్రాలు తీయించి తనఖీలు చేయించారు. తర్వాత అలాంటి చర్మ వ్యాధి ఏదీ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కించారు. ఈ సందర్భంగా వరుడు వధువుకు క్షమాపణలు చెప్పాడు. అయితే, అప్పటికే ఆ అమ్మాయికి ఎంత అవమానం జరగాలో అంత జరిగింది. -
బోస్ - ది ఫర్గాటెన్ హీరో...
సినిమాలు కూడా కాస్తో కూస్తో చదువునిస్తాయ్. ముఖ్యంగా మంచి సినిమాలు. సుభాస్ చంద్రబోస్ గురించి మనకు ఏం తెలుసు? జైహింద్ అన్నాడనీ, ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేశాడని. కాని ఆయన చేసిన సుదీర్ఘమైన, మొక్కవోని పోరాటాన్నీ, సంఘర్షణనీ, దేశాలు పట్టి ఆ ప్రభుత్వాలనూ ఈ ప్రభుత్వాలనూ ఒప్పించి సైన్యం తయారు చేసి భూమార్గాన ఢిల్లీ వరకూ లాంగ్ మార్చ్ చేసి బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి భారత్‌ను విముక్తం చేయాలని ఆయన కన్న కల మరొకరు కనలేరు. కన్నా సంకల్పించలేరు. సంకల్పించినా కడదాకా నిలువలేరు. అహింసా మార్గంతోనే స్వరాజ్యం సాధ్యం అనే గాంధీజీ సిద్ధాంతంతో సుభాస్ ఏకీభవించినా ఈ బతిమిలాడే ధోరణికి, చర్చలకి, గాంధీగారి ‘ఒప్పించి సాధిద్దాం’ సిద్ధాంతానికి ఆయన చాలా త్వరగా విసిగిపోయాడు. ఆఫ్టరాల్ 70 వేల మంది బ్రిటిష్ సైన్యం ఉంది భారత్‌లో. మిగిలిన సైన్యంలో ఉన్నదంతా మనవాళ్లే. ఒక యాభై వేల మంది సైన్యాన్ని తయారు చేయగలిగితే చిటికెలో స్వరాజ్యం సాధ్యం అని నమ్మాడాయన. భారత్‌ను విముక్తం చేయడానికి హిట్లర్ వంటి పిశాచాన్ని కావలించుకోవడానికి కూడా వెనుకాడను అని చెప్పిన సుభాస్ అందుకోసమనే హిట్లర్‌తో చర్చలు కూడా చేశాడు. అతడు అంతగా లొంగకపోయే సరికి జపాన్ను సంప్రదించి, ఆ రెండవ ప్రపంచ యుద్ధం రోజుల్లో ప్రాణాలకు తెగించి జర్మనీ సబ్‌మెరైన్‌లో సగం దూరం ఆ తర్వాత జపాన్ సబ్‌మెరైన్‌లో సగం దూరం నెల రోజుల పాటు ప్రయాణించి జపాన్ చేరుకుని.... ఇదంతా ఎంత సాహసోపేత ప్రయత్నం.. భరతమాత పట్ల నరనరానా పెల్లుబికే భక్తి. బోస్ కల నెరవేరకపోయి ఉండవచ్చు. కాని కొద్ది కాలం పాటైనా ఆయన బ్రిటిష్‌వారిని గడగడలాడించాడు. ఇక ఈ దేశం మన చేతుల్లో లేదు అని తాము గ్రహించడానికి ఆజాద్ హింద్ ఫౌజ్ కూడా ఒక ముఖ్య కారణం అని ఒక బ్రిటిష్ అధికారి అధికారికంగా ప్రకటించాడు. కాని బోస్ మీద వచ్చిన సాహిత్యం, ఆయన చుట్టూ తీసిన సినిమాలు తక్కువ. ఆయన మరణం మీద ఉన్న మిస్టరీ గురించే చర్చ, ఆర్భాటం తప్ప ఆయన పోరాటం ఎలాటిందో తెలుసుకునే వివరాలు పెద్దగా ప్రచారం కాలేదు. అదంతా చదవడం కన్నా ఒక్క మూడు గంటలు వెచ్చిస్తే సుభాస్ చంద్రబోస్ జీవితాన్ని పోరాటాన్ని అథెంటిక్‌గా తెలుసుకునే అవకాశం ఇస్తుంది ‘బోస్- ది ఫర్గాటెన్ హీరో’ సినిమా. 2004లో సహారా పరివార్ 30 కోట్ల ఖర్చుతో భారీగా తీసిన ఈ సినిమా ఎక్కువ మందికి చేరలేదు. కాని ఈ సినిమా తీయడం ఎంత కష్టం అంటే అంత కష్టం. ఇది శ్యామ్ బెనగళ్ లాంటి దర్శకులకే సాధ్యం. సాధారణంగా అన్ని భారతీయ భాషల్లో డబ్ చేసి ఈ సినిమాను చూపించాలి. మన దేశంలో చాలా పనులు జరగనట్టే ఇదీ జరగలేదు. యూ ట్యూబ్‌లో ఉంది. ఈ ఆగస్టు నెలలో అయినా దీనిని Netaji Subhas Chandra Bose: The Forgotten Hero అని కొట్టి చూడండి. అన్నట్టు ఆర్ట్ క్రిటిక్/ థియేటర్ పర్సనాలిటీ షమా జైదీ, రచయిత అతుల్ తివారి ఈ సినిమాకు స్క్రిప్ట్ అందించారు.