కీరవాణి ట్వీట్పై దుమారం | Keeravani compare Jai Balayya slogan with Jai Hind | Sakshi
Sakshi News home page

కీరవాణి ట్వీట్పై దుమారం

Published Sat, Sep 2 2017 12:49 PM | Last Updated on Sun, Sep 17 2017 6:18 PM

కీరవాణి ట్వీట్పై దుమారం

కీరవాణి ట్వీట్పై దుమారం

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన పైసా వసూల్ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ట్వీట్ చేశారు. అదే బాటలో సీనియర్ సంగీత దర్శకులు కీరవాణి కూడా థియేటర్లో అభిమానుల ఉత్సాహం గురించి ఓ ట్వీట్ చేశారు. అభిమానులు 'జై హింద్' అన్నంత ఆనందంగా, ఉత్సాహంగా జై బాలయ్య అంటూ నినదిస్తున్నారు అంటూ ట్వీట్ చేశారు కీరవాణి.

అయితే కీరవాణి చేసిన ఈ ట్వీట్ పై పెద్ద దుమారమే రేగింది. జై బాలయ్య నినాదాన్ని జై హింద్ తో ఎలా పోలుస్తారని నెటిజన్లు విమర్శించారు. అదే సమయంలో కొందరు కులం ప్రస్థావన కూడా తీసుకురావటంతో వివాదం మరింత ముదిరింది. అయితే ఈ విమర్శలపై కీరవాణి కూడా ఘాటుగా స్పందించారు. తాను అర్జున్ రెడ్డి యూనిట్ ను కులం కోసమే ప్రశంసించానా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు ఫేక్ డీపీలు పెట్టుకునే కుక్కలు తన దేశ భక్తి గురించి మాట్లాడటం విడ్డూరమని గట్టి కౌంటర్ ఇచ్చారు కీరవాణి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement