'ఆర్ఆర్ఆర్' రిలీజై రెండేళ్లయింది. అప్పటి నుంచి రాజమౌళి మహేశ్ సినిమా మీదే పనిచేస్తున్నారు. అదిగో ఇదిగో అంటున్నారు. కానీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది మాత్రం చెప్పట్లేదు. మే చివరన కృష్ణ జయంతి సందర్భంగా ఏదైనా అప్డేట్ వస్తుందనుకుంటే.. అస్సలు సౌండ్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఇలాంటి టైంలో ఈ ప్రాజెక్ట్ గురించి కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్పేశారు.
(ఇదీ చదవండి: మహేశ్ బాబు కొడుకు మొదలుపెట్టేశాడు.. లండన్‌లో నాటకం)
'మహేశ్-రాజమౌళి సినిమా స్టోరీ లాక్ అయిపోయింది. నేను ఇంకా మ్యూజిక్ వర్క్ ప్రారంభించలేదు. కొన్ని టెస్ట్ షూట్స్ చేస్తున్నారు. జూలై లేదా ఆగస్టులో నా పని మొదలుపెడతాను' అని కీరవాణి చెప్పుకొచ్చారు. దీనిబట్టి చూస్తే ఇప్పుడు టెస్ట్ షూట్ చేస్తున్నారంటే షూటింగ్ మొదలయ్యేసరికి ఈ ఏడాది చివర లేదంటే వచ్చే ఏడాది అయిపోవచ్చు.
రాజమౌళి సినిమా అంటే ఫెర్ఫెక్ట్ ఉండాలి. అదీ కాక 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ వచ్చింది కాబట్టి.. ఇప్పుడు చేయబోయే మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉంటాయి. దీంతో కచ్చితంగా పూర్తవడానికి నాలుగైదేళ్లు పట్టేస్తుందేమో? ఇదిలా ఉండగా ఈ సినిమా స్టోరీ విషయంలో గతంలో రకరకాల రూమర్స్ వచ్చాయి. ఏదైనా అప్డేట్ వస్తే గానీ అసలేం జరుగుతుందనేది క్లారిటీ రాదు. చూడాలి మరి ఇప్పుడు టెస్ట్ షూట్ చేస్తున్నారంటే ఆగస్టులో మహేశ్ పుట్టినరోజు నాటికైనా అప్డేట్ ఇస్తారా లేదా అనేది చూడాలి.
(ఇదీ చదవండి: తెలంగాణలో 'కల్కి' టికెట్ ధరలు పెంపు.. ఒక్కొక్కటి ఏకంగా?)
Comments
Please login to add a commentAdd a comment