
గాంధీనగర్: ప్రాథమిక పాఠశాల దశ నుంచే విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పాఠశాలల్లో హాజరుపలికేముందు ఎస్ సర్, ప్రజెంట్ సర్‌కు బదులుగా జైహింద్, జై భారత్ అనాలని నిర్ణయించింది. నూతన సంవత్సరం జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈవిధానం అమలు కానుంది. ఈమేరకు గుజరాత్ విద్యాశాఖమంత్రి భూపేంద్ర సిన్హ్ చూడాసమా ప్రకటించారు. విద్యార్థి దశనుంచే పిల్లల్లో దేశభక్తిని అలవరిచేందుకు హాజరు నిబందనల్లో మార్పులు చేసినట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment