నీతిఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్
గాంధీనగర్: పారిశ్రామిక, మౌలికసదుపాయాలు, ఇంధన రంగాలతో పోల్చుకుంటే విద్య, ఆరోగ్య రంగాల్లో గుజరాత్ వెనుకపడి ఉందని నీతిఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో ఆదివారం నాడిక్కడ భేటీ అయిన అనంతరం కుమార్ మీడియాతో మాట్లాడారు.
2018–19 నుంచి విద్య, ఆరోగ్య రంగాలను మెరుగుపర్చేందుకు కేటాయింపులు పెంచినట్లు భేటీ సందర్భంగా తనకు సీఎం చెప్పారన్నారు. ఈ రెండు రంగాల్లో పురోగతి సాధించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందన్నారు.
కోస్టల్ ఎకనామిక్ జోన్లు ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వానికి సహాయం అందిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో సక్రమంగా అమలు చేస్తున్నారని రాజీవ్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment