పెళ్లి ఘడియల్లో వివస్త్రగా నిలబెట్టారు | UP bride made to strip after skin disease rumours | Sakshi
Sakshi News home page

పెళ్లి ఘడియల్లో వివస్త్రగా నిలబెట్టారు

Published Mon, May 15 2017 9:00 AM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

పెళ్లి ఘడియల్లో వివస్త్రగా నిలబెట్టారు

పెళ్లి ఘడియల్లో వివస్త్రగా నిలబెట్టారు

కాన్పూర్‌: అనుమానంతో పెళ్లి ఘడియల్లో ఓ వధువును తీవ్రంగా అవమానించారు. పెళ్లి కొడుకు తరుపు మహిళలు ఆమె వస్త్రాలను తీసేసి శరీరాన్ని తనిఖీలు చేశారు. ఆ వధువుకు చర్మ వ్యాధి ఉందని ఆరోపణలు రావడమే ఈ పరిణామానికి దారి తీసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జై హింద్‌ అనే వ్యక్తికి తీజా అనే యువతికి వివాహం నిశ్చయించారు. సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి పెళ్లికూతురు ల్యుకోడర్మా అనే చర్మ వ్యాధితో బాధపడుతుందని, ఆ విషయాన్ని పెళ్లి కొడుకు కుటుంబానికి చెప్పకుండా దాచారంటూ వదంతులు వ్యాపించాయి.

దీంతో ఈ విషయంపై వారి కుటుంబ సభ్యులు రచ్చరచ్చ చేశారు. దాదాపు పెళ్లిని ఆపించేంత పని చేశారు. అయితే, పెళ్లి కూతురు తండ్రి పోలీసులను పిలవడంతో నేరుగా ఇరు వర్గాలను స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు అక్కడే ఓ స్టేషన్‌ గదిలోకి అబ్బాయి తరుపు మహిళలు కొందరిని పంపించి అక్కడే పెళ్లి కూతురు వస్త్రాలు తీయించి తనఖీలు చేయించారు. తర్వాత అలాంటి చర్మ వ్యాధి ఏదీ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కించారు. ఈ సందర్భంగా వరుడు వధువుకు క్షమాపణలు చెప్పాడు. అయితే, అప్పటికే ఆ అమ్మాయికి ఎంత అవమానం జరగాలో అంత జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement