సాక్షి, విశాఖపట్నం: క్రీడలతో సనాతన ధర్మం సందేశంలో భాగంగా సేవ్ టెంపుల్స్ భారత్ ఆధ్వర్యంలో అజాదీ కా అమృత్ మహోత్సవాల స్పూర్తితో డా. గజల్ శ్రీనివాస్ ‘‘జైహింద్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్)’’ నిర్వహించడం స్ఫూర్తి దాయకమని శాసన మండలి సభ్యులు పీవీ మాధవ్ అన్నారు. ఈ క్రీడలు నిర్వహించడం ద్వారా సనాతన ధర్మ, దేశ భక్తిని ప్రచారం చేయడం గొప్ప విషయమని కొనియాడారు.
జైహింద్ ప్రీమియర్ లీగ్ ఇన్విటేషన్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ విశాఖపట్నంలోని పి.ఎమ్.పాలెం, బి. గ్రౌండ్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌ను శ్రీ శ్రీ శ్రీ శ్రీనివాసానంద స్వామి గోపూజ నిర్వహించి ప్రారంభించారు. పరిమిత ఓవర్ల టోర్నమెంట్లో షహీద్ వీర సావర్కర్ లెవెన్, షహీద్ అల్లూరి లెవెన్, షహీద్ భగత్ సింగ్ లెవెన్, షహీద్ చంద్ర శేఖర్ ఆజాద్ లెవెన్ శ్రీ బిర్సా ముండా లెవెన్ జట్లు ఆడుతున్నాయని సేవ్ టెంపుల్స్ భారత్, జైహింద్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ డా. గజల్ శ్రీనివాస్, జేపీఎల్ కన్వీనర్ శ్రీ ఫణీంద్ర తెలిపారు.
భారతీయ క్రీడా సుహృద్భావం, స్వాతంత్య్ర సంగ్రామ, సనాతన ధర్మ ప్రచారాలు ముఖ్య లక్ష్యంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. అనేకమంది సాధు, సంత్ పరివారం ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషమని జేపీల్ డైరెక్టర్స్ శ్రీ ఎ. హేమంత్ శర్మ, శ్రీ మేడికొండ శ్రీనివాస్, శ్రీ డి.ఎస్ వర్మ, సంచాలకులు శ్రీ పట్టా రమేష్ తదితరులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment