Premier League
-
లోకేశ్ సేవలో తరిస్తున్న ఏసీఏ
సాక్షి, అమరావతి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) గురించి అందరికీ తెలుసు.. మరి మంగళగిరి ప్రీమియర్ లీగ్(ఎంపీఎల్) గురించి మీకు తెలుసా? సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రత్యేక ఆసక్తితో నిర్వహిస్తున్న లీగ్ ఇది. తన స్వామి భక్తిని చాటుకునేందుకు ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) ఈ లీగ్‌కు రూపకల్పన చేశారు. ఈ నెల 23న లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా 22 మ్యాచ్‌లతో ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో ఆదివారం కేశినేని చిన్ని దీనిని ప్రారంభించారు. 22వ తేదీ వరకు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయని.. 23న ఫైనల్స్ నిర్వహించి విజేతకు అవార్డు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏసీఏ నిధులు దుర్వినియోగం!కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఏసీఏను లోకేశ్ కోటరీ తమ గుప్పెట్లోకి తీసుకుంది. కేశినేని చిన్నిని అధ్యక్షుడిగా, తన సన్నిహితుడు, లాబీయిస్టు అయిన సానా సతీశ్‌ను ప్రధాన కార్యదర్శి పీఠంపై కూర్చోబెట్టారు లోకేశ్. అప్పటి నుంచి కేశినేని చిన్ని, సానా సతీశ్ క్రికెట్ ప్రయోజనాలను పక్కనపెట్టి.. లోకేశ్ కోసమే ఏసీఏను ఉపయోగిస్తున్నారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం కోసం ఏకంగా ప్రీమియర్ లీగ్ నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం గవర్నింగ్ బాడీ సమావేశంలో షెడ్యూల్‌ను రూపొందించి లీగ్‌లు నిర్వహిస్తుంటారు. కానీ కేశినేని చిన్ని అవేమీ చేయకుండా.. ఎవరినీ సంప్రదించకుండానే ఈ లీగ్‌ను ప్రకటించారు. ఏసీఏ నిధులు, వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ ఫొటోలతో భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. వీటన్నింటికీ ఏసీఏ నిధులు ఉపయోగిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క నియోజకవర్గమే ముఖ్యమా?వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు, క్రీడాకారులకు చేయూత అందించేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో పోటీలు నిర్వహిస్తే కూటమి నేతలు అవాకులు, చెవాకులు పేలారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, దాదాపు అన్ని క్రీడలతో ‘ఆడుదాం ఆంధ్రా’ నిర్వహిస్తే విమర్శలు చేసిన కూటమి నేతలు.. ఇప్పుడు కేవలం సీఎం తనయుడి కోసం ఆయన నియోజకవర్గంలో మాత్రమే లీగ్ పెట్టడం, దానికి ఏసీఏను ఉపయోగించుకోవడం గమనార్హం. రాష్ట్రమంతటికీ ప్రాతినిధ్యం వహించి పనిచేయాల్సిన ఏసీఏ.. కేవలం ఒక నియోజకవర్గంలో ఒక నేత కోసమే పని చేయడమేమిటని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
Gareth Morgan: 6 బంతుల్లో 6 వికెట్లు
గోల్డ్‌కోస్ట్: ఆ్రస్టేలియా క్లబ్ క్రికెట్లో ఒక అరుదైన రికార్డు నమోదైంది. గోల్డ్‌కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్–3 పోటీల్లో ఒక బౌలర్ ఓవర్లోని ఆరు బంతుల్లో ఆరు వికెట్లు పడగొట్టడం విశేషం. ముద్గీరబ నేరంగ్ అండ్ డిస్ట్రిక్ట్స్ క్లబ్ కెపె్టన్ గారెత్ మోర్గాన్ ఈ ఘనత సాధించి చరిత్రకెక్కాడు. సర్ఫర్స్ ప్యారడైజ్ సీసీ జట్టుపై అతను ఈ రికార్డు సృష్టించాడు. 40 ఓవర్ల మ్యాచ్‌లో 179 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సర్ఫర్స్ క్లబ్ 39 ఓవర్లలో 174/4 వద్ద నిలిచింది. చివరి ఓవర్లో మరో 5 పరుగులు చేస్తే చాలు. అయితే గారెత్ ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసి సంచలనం సృష్టించడంతో 4 పరుగుల తేడాతో గెలుపు ముద్గీరబ జట్టు సొంతమైంది. అంతకుముందే ఈ ఇన్నింగ్స్‌లో మరో వికెట్ తీసిన గారెత్ మొత్తంగా 7/16తో ముగించాడు. గతంలో ప్రొఫెషనల్ క్రికెట్లో నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్), అల్ అమీన్ (బంగ్లాదేశ్), అభిమన్యు మిథున్ (భారత్) ఒకే ఓవర్లో ఐదు వికెట్లు పడగొట్టారు. -
స్వాతంత్య్ర సంగ్రామ స్పూర్తితో.. విశాఖలో జేపీఎల్
సాక్షి, విశాఖపట్నం: క్రీడలతో సనాతన ధర్మం సందేశంలో భాగంగా సేవ్ టెంపుల్స్ భారత్ ఆధ్వర్యంలో అజాదీ కా అమృత్ మహోత్సవాల స్పూర్తితో డా. గజల్ శ్రీనివాస్ ‘‘జైహింద్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్)’’ నిర్వహించడం స్ఫూర్తి దాయకమని శాసన మండలి సభ్యులు పీవీ మాధవ్ అన్నారు. ఈ క్రీడలు నిర్వహించడం ద్వారా సనాతన ధర్మ, దేశ భక్తిని ప్రచారం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. జైహింద్ ప్రీమియర్ లీగ్ ఇన్విటేషన్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ విశాఖపట్నంలోని పి.ఎమ్.పాలెం, బి. గ్రౌండ్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌ను శ్రీ శ్రీ శ్రీ శ్రీనివాసానంద స్వామి గోపూజ నిర్వహించి ప్రారంభించారు. పరిమిత ఓవర్ల టోర్నమెంట్లో షహీద్ వీర సావర్కర్ లెవెన్, షహీద్ అల్లూరి లెవెన్, షహీద్ భగత్ సింగ్ లెవెన్, షహీద్ చంద్ర శేఖర్ ఆజాద్ లెవెన్ శ్రీ బిర్సా ముండా లెవెన్ జట్లు ఆడుతున్నాయని సేవ్ టెంపుల్స్ భారత్, జైహింద్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ డా. గజల్ శ్రీనివాస్, జేపీఎల్ కన్వీనర్ శ్రీ ఫణీంద్ర తెలిపారు. భారతీయ క్రీడా సుహృద్భావం, స్వాతంత్య్ర సంగ్రామ, సనాతన ధర్మ ప్రచారాలు ముఖ్య లక్ష్యంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. అనేకమంది సాధు, సంత్ పరివారం ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషమని జేపీల్ డైరెక్టర్స్ శ్రీ ఎ. హేమంత్ శర్మ, శ్రీ మేడికొండ శ్రీనివాస్, శ్రీ డి.ఎస్ వర్మ, సంచాలకులు శ్రీ పట్టా రమేష్ తదితరులు తెలిపారు. -
ఫైనల్స్‌లో విజయనగరం రాయల్స్‌దే విజయం
విజయనగరం/విజయనగరం రూరల్: మహిళలు అన్ని రంగాల్లో రాణించి చరిత్రలో నిలిచిపోవాలని రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్కే రోజా ఆకాంక్షించారు. జిల్లా కేంద్రం శివారు డెంకాడ మండలం చింతలవలసలోని డాక్టర్ పీవీజీ రాజు నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీలో ఆంధ్రా క్రికెట్ అసొసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో గత నెల 26 నుంచి మహిళా టీ–20 లీగ్ నిర్వహిస్తున్నారు. ఆదివారం నిర్వహించిన ఫైనల్ పోటీలకు మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లీగ్ విజేతగా నిలిచిన విజయనగరం రాయల్స్ జట్టుకు రూ.5 లక్షల చెక్కు, ట్రోఫీ అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన వైజాగ్ డాల్ఫిన్స్ జట్టుకు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేతుల మీదుగా రూ. 3 లక్షల చెక్కు, ట్రోఫీని అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రోజా మాట్లాడుతూ మహిళలు ఇతర రంగాలతో పాటు క్రీడల్లోనూ పాల్గొనడం అభినందనీయమని ప్రశంసించారు. ఆటలకు ఆడపిల్లలు వద్దనకుండా వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. మహిళా క్రికెటర్లకు ఇంత మంచి వేదిక కల్పించిన ఆంధ్రా క్రికెట్ అసొసియేషన్ (ఏసీఏ) పేరు ఆదర్శ క్రికెట్ అసోసియేషన్‌గా మారాలని ఆకాంక్షించారు. మహిళా పక్షపాతి అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పురుషులతో పాటు మహిళలకు ప్రత్యేకంగా లీగ్ నిర్వహించాలన్న సూచనతో అతి తక్కువ సమయంలోనే లీగ్‌ను విజయవంతం చేసిన ఏసీఏ కృషి అభినందనీయమన్నారు. లీగ్‌లో ఉత్తమంగా రాణించిన క్రీడాకారులను చూసి మరింత మంది స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. వెలుగులోకి మట్టిలో మాణిక్యాలు శాప్ చైర్మన్ సిద్ధార్థరెడ్డి కార్యక్రమంలో మాట్లాడుతూ ఏసీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రికెట్ లీగ్‌లతో ఎంతో మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయ పడ్డారు. ఏదైనా రంగంలో రాణించాలంటే కృషి, పట్టుదల, కష్టపడే విధానం ఉండాలన్నారు. నైపుణ్యమున్న క్రీడాకారులను ఎవరూ అడ్డుకోలేరని, క్రికెట్లో రాణిస్తే మీకు మీరే బ్రాండ్ అంబాసిడర్లుగా తయారవుతారన్నారు. ఇటువంటి టోర్నీలలో రాణించి సత్తా చాటుకుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనతో దేశంలోనే తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేక లీగ్ నిర్వహించిన ఏసీఏకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉత్తమ క్రీడాకారిణులకు ప్రత్యేక బహుమతులు కార్యక్రమానికి ముందుగా ఉమన్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా విజయనగరం రాయల్స్ జట్టు సభ్యురాలు ఇ. పద్మజ, మోస్ట్ ప్రామిసింగ్ యంగ్‌స్టర్‌గా ఆయేష్‌ఖాన్, ఉత్తమ బ్యాటర్‌గా సీహెచ్ ఝాన్సీలక్ష్మి (259 పరుగులు), ఉత్తమ బౌలర్‌గా దేవిక (12 వికెట్లు)ల కు నిర్వాహకలు షీల్డులు, చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, విజయనగరం నగరపాలక సంస్థ మేయర్ వి.విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, రేవతీదేవి, ఏసీఏ ట్రెజరర్ గోపినాథ్‌రెడ్డి, సీఈవో ఎంవీ శివారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సత్యప్రసాద్, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి ఫైనాన్షియల్ మేనేజర్ వైవీఎస్ జగన్నాథరావు, విజయనగరం జిల్లా క్రికెట్ అసొసియేషన్ కార్యదర్శి ఎంఎల్ఎన్ రాజు, ఎన్సీఏ కన్వీనర్ దేవవ ర్మ, ఎపెక్స్ కౌన్సిల్ సభ్యులు గౌతమ్, ఎం.డి రహ మాన్, అనూరాధ నిర్మల, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యు లు ఆర్వీసీహెచ్ ప్రసాద్, జీవీవీ గోపాలరాజు, హనీగ్రూప్ చైర్మన్ ఓబుల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఫైనల్ మ్యాచ్ జరిగిందిలా.. ముందుగా టాస్ గెలిచిన విజయనగరం రాయల్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా వైజాగ్ డాల్ఫిన్స్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఆ జట్టుకు ఓపెనింగ్ బ్యాటర్లు అనూష (20 బంతుల్లో 17 పరుగులు), హెప్సిబ (19 బంతుల్లో 13 పరుగులు) తొలి వికెట్‌కు 35 పరుగులు జోడించి శుభారంభం అందించినా మిగతా బ్యాటర్లు విఫలమవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 113 పరగులు సాధించారు. అనంతరం 114 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన విజయనగరం రాయల్స్ జట్టు 18.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టు ఓపెనింగ్ బ్యాటర్, కెప్టెన్ స్నేహదీప్తి అద్భుతంగా ఆడి 30 బంతుల్లో ఒక సిక్స్, ఆరు ఫోర్ల సహాయంతో 45 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఆ జట్టు బ్యాటర్లు హారిక యాదవ్ (11 పరుగులు), ఐశ్వర్యరాయ్ (14 పరుగులు), పద్మజ (28 పరుగులు నాటౌట్), అయేషాసింగ్ (11 పరుగులు నాటౌట్) రాణించి జట్టుకు విజయంతో పాటు ట్రోఫీని అందించారు. -
Christiano Ronaldo: వందో గోల్‌తో కుమారుడికి నివాళి
లండన్: ప్రముఖ ఫుట్‌బాలర్, మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ స్ట్రైకర్ క్రిస్టియానో రొనాల్డో ఇటీవల మరణించిన తన నవజాత శిశువుకు ఘనంగా నివాళులర్పించాడు. ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శనివారం ఆర్సెనల్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్ చేసిన రొనాల్డో.. తన చేతి వేలును ఆకాశం వైపుకు చూపిస్తూ తన బిడ్డను స్మరించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. రొనాల్డో భాగస్వామి జార్జీనా రోడ్రిగ్వెజ్ ఇటీవల కవలలకు (బాబు, పాప) జన్మనిచ్చింది. అయితే, బాబు పుట్టిన వెంటనే మరణించాడు. Cristiano Ronaldo dedicating his 100th Premier League goal to his baby boy who died. ❤🙏pic.twitter.com/EJ8KMtHAYt — The CR7 Timeline. (@TimelineCR7) April 23, 2022 ఇదిలా ఉంటే, ఆర్సెనల్‌పై చేసిన గోల్ రొనాల్డోకు ప్రీమియర్ లీగ్‌లో 100వ గోల్ కావడం విశేషం. ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడు ఈ ఘనతను సాధించలేదు. ఈ మ్యాచ్‌లో రొనాల్డో గోల్ చేసినప్పటికీ మాంచెస్టర్ యునైటెడ్ ఓటమిపాలైంది. ఆర్సినల్ 3-1తో గెలుపొందింది. చదవండి: టీమిండియాలో చోటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హార్ధిక్ పాండ్యా -
ఫుట్‌బాల్ చరిత్రలో అద్భుతం.. ప్రతీ ఆటగాడి కాలికి తగిలిన బంతి
అద్భుతాలు అరుదుగా జరుగుతుంటాయి. ఫుట్‌బాల్ ఆటలో ఆఖరున గోల్ కొట్టేది ఒక్కడే అయినప్పటికి.. అందులో ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్ల హస్తం కచ్చితంగా ఉంటుంది. ఒక మిడ్ ఫీల్డర్.. ఒక డిఫెండర్.. ఒక ఫార్వర్డ్ ప్లేయర్ కలిస్తేనే గోల్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కానీ ఒక ఫుట్‌బాల్ జట్టులోని 11 మంది ఆటగాళ్లు ఒక గోల్ కొట్టడానికి ఒకరినొకరు సహకరించుకోవడం తక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే ఫుట్‌బాల్‌లో ఇరుజట్లు బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి. చదవండి: Andy Murray: అదరగొట్టిన ముర్రే.. ఐదేళ్ల నిరీక్షణకు తెర అయితే క్రిస్టల్ ప్యాలెస్ జట్టు దానిని తిరగరాసింది. ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా క్రిస్టల్ ప్యాలెస్, బ్రైటన్ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. క్రిస్టల్ ప్యాలెస్ గోల్ కొట్టే క్రమంలో ఆ జట్టులోని 11 మంది ఆటగాళ్లు కనీసం ఒక్కసారైనా బంతిని టచ్ చేయడం విశేషం. ఇక చెల్సియా కోనర్ గల్లఘర్ ఆఖర్లో ఫినిషింగ్ టచ్ ఇస్తూ సూపర్ గోల్‌తో మెరిశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ప్రీమియర్ లీగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ''జట్టులోని ప్రతీ ఆటగాడు బంతిని టచ్ చేశాడు.. ఈ జట్టు గోల్ చూడముచ్చటగా ఉంది'' అంటూ క్యాప్షన్ జత చేసింది. అయితే క్రిస్టల్ ప్యాలెస్ అద్భుత గోల్ నమోదు చేసినప్పటికి.. 1-1తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. View this post on Instagram A post shared by Premier League (@premierleague) -
రొనాల్డొ ఘనత.. 13 ఏళ్ల తర్వాత
Cristiano Ronaldo Won Premier League Player Of Month Award.. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డొ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. సెప్టెంబర్ నెలకు గాను '' ప్రీమియర్ లీగ్ ప్లేయర్ ఆఫ్ ది మంత్'' అవార్డును దక్కించుకున్నాడు. మాంచెస్టర్ సిటీ డిఫెండర్ జోవో క్యాన్సెలో, చెల్సియా ఆంటోనియో రుడిగర్, న్యూకాజిల్‌కు చెందిన అలన్ సెయింట్-మాక్సిమిన్, లివర్‌పూల్ ఫార్వర్డ్ మొహమ్మద్ సలా, వాట్ఫోర్డ్ ఆటగాడు ఇస్మాయిలా సార్‌తో పోటీపడిన రొనాల్డో ఈ అవార్డు సాధించాడు. కాగా రొనాల్డొ ఖాతాలో ఇది ఐదో ప్రీమియర్ లీగ్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ కాగా అన్నీ మాంచెస్టర్ యునైటెడ్ తరపునే గెలవడం విశేషం. జువెంటస్ నుంచి మాంచెస్టర్ యునైటెడ్‌కు మారాకా రొనాల్డొ ఆరు మ్యాచ్‌ల్లో 5 గోల్స్ చేశాడు. ఈ ఐదింటిలో మూడు గోల్స్ సెప్టెంబర్ నెలలో వచ్చాయి. తన డెబ్యూ మ్యాచ్ న్యూ కాసిల్తో జరిగిన పోరులో రెండు గోల్స్ చేసిన రొనాల్డో ఆ తర్వాత ఓల్ గున్నార్ టీమ్‌తో జరిగిన పోరులో మరో గోల్‌తో మెరిశాడు. ఇంతకముందు రొనాల్డో 2006 నవంబర్, డిసెంబర్ నెలకు గాను.. ఆ తర్వాత 2008 జనవరి, మార్చి నెలకుగానూ రొనాల్డొ మాంచెస్టర్ యునైటెడ్ తరపున ఈ అవార్డు అందుకున్నాడు. తాజాగా 13 ఏళ్ల గ్యాప్ అనంతరం రొనాల్డొ మాంచెస్టర్ యునైటెడ్ తరపున అవార్డు గెలుచుకోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఆర్సెనల్ బాస్ మైకెల్ ఆర్టెటా సెప్టెంబర్ నెలకు గానూ మేనేజర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. Who else? ✨ Your @EASPORTSFIFA Player of the Month is: @Cristiano 🔴 ⚪️ ⚫️#PLAwards pic.twitter.com/tgkoLkiTuj — Premier League (@premierleague) October 8, 2021 -
24 నుంచి ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్
జైపూర్: ఇప్పటికే క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్, చెస్ తదితర క్రీడాంశాల్లో లీగ్‌లు జరుగుతుండగా తాజాగా ఈ జాబితాలో హ్యాండ్‌బాల్ కూడా చేరింది. జైపూర్ వేదికగా ఈనెల 24 నుంచి ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్ఎల్) జరగనుంది. భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికయిన తెలంగాణకు చెందిన అరిశెనపల్లి జగన్మోహన్ రావు ఈ లీగ్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోర్నీలో ఆరు జట్లు (తెలంగాణ టైగర్స్, మహారాష్ట్ర హ్యాండ్‌బాల్ హస్లర్స్, పిట్‌బుల్స్ పంజాబ్, బెంగాల్ బ్లూస్, కింగ్ హాక్స్ రాజస్తాన్, యూపీ ఐకాన్స్) తలపడతాయి. జనవరి 10న ఫైనల్ జరుగుతుంది. ‘ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్‌తో భారత హ్యాండ్‌బాల్ చరిత్రలో నవశకం ఆరంభం కానుంది’ అని జగన్మోహన్ రావు తెలిపారు. -
లంక లీగ్ వేలానికి మునాఫ్ పటేల్
కొలంబో: శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ఆధ్వర్యంలో జరుగనున్న తొలి లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో భారత మాజీ పేసర్ మునాఫ్ పటేల్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్‌కు సంబంధించి అక్టోబర్ 1న జరుగనున్న వేలానికి మునాఫ్ పటేల్ అందుబాటులో ఉండనున్నాడు. 37 ఏళ్ల మునాఫ్ భారత్ తరఫున 13 టెస్టులు, 70 వన్డేలు, 3 టి20లు ఆడాడు. 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోనూ సభ్యుడు. ఎల్పీఎల్ కోసం మునాఫ్‌తో పాటు ఇంగ్లండ్ ప్లేయర్ రవి బొపారా, దక్షిణాఫ్రికా ఆటగాడు కోలిన్ మున్రో, వెర్నాన్ ఫిలాండర్‌లతో కలిపి మొత్తం 150 మంది అంతర్జాతీయ క్రికెటర్లు వేలానికి రానున్నారు. ఇందులో పాల్గొనే ఐదు ఫ్రాంచైజీలు గరిష్టంగా ఆరుగురు చొప్పున అంతర్జాతీయ క్రికెటర్లను దక్కించుకోవచ్చు. (చదవండి: ముంబైతో కలిసిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్) -
లంక లీగ్ ఆడట్లేదు: ఇర్ఫాన్
న్యూఢిల్లీ: విదేశీ టి20 లీగ్‌లో తాను పాల్గొంటున్నట్లు వస్తోన్న వార్తల్ని భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఖండించాడు. ఈనెల 28 నుంచి జరుగనున్న లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో ఇర్ఫాన్ ప్రాతినిధ్యం వహించనున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశాడు. దీనికి సంబంధించి తాను ఎవరికి మాటివ్వలేదని పఠాన్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశాడు. ‘భవిష్యత్‌లో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన టి20 లీగ్‌లలో ఆడాలని అనుకున్నా. కానీ ఈ పరిస్థితుల్లో లీగ్‌లకు అందుబాటులో ఉంటానని చెప్పలేదు. అందరూ అనుకుంటున్నట్లుగా ఎల్పీఎల్లో పాల్గొనడం లేదు’ అని 35 ఏళ్ల పఠాన్ ట్వీట్ చేశాడు. ఈ ఏడాది జనవరిలో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన ఇర్ఫాన్... ఐపీఎల్లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరఫున 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టి20లు ఆడిన అతను 2500 పరుగులు, 300 వికెట్లు దక్కించుకున్నాడు. -
లంక ప్రీమియర్ లీగ్‌లో ఇర్ఫాన్ పఠాన్!
న్యూఢిల్లీ: శ్రీలంక వేదికగా ఈ నెల 28న ఆరంభమయ్యే లంక ప్రీమియర్ లీగ్‌లో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇందుకోసం అతడు లీగ్ నిర్వాహకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. లీగ్‌లో పాల్గొనే ఐదు జట్లలో ఏదో ఒక జట్టు అతడిని ‘మార్కీ ప్లేయర్ (స్టార్ ఆటగాడు)’ జాబితాలో తీసుకునే అవకాశం ఉంది. పఠాన్ ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో... విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు బీసీసీఐ నుంచి ఎటువంటి అడ్డంకులు ఎదురుకాకపోవచ్చు. భారత జట్టుకు ఆడే ఆటగాళ్లను విదేశీ టి20 లీగ్‌ల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతించదు. అయితే తాను ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించడంతో లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు తనకెటువంటి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉండదని పఠాన్ పేర్కొన్నాడు. 35 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్ 2007 టి20 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. -
28 నుంచి లంక ప్రీమియర్ లీగ్
కొలంబో: క్రికెట్ అభిమానులను అలరించడానికి మరో టి20 లీగ్ ముస్తాబయింది. శ్రీలంక వేదికగా లంక ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ ఆగస్టు 28న మొదలవుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ప్రకటించింది. మొత్తం ఐదు జట్లు పాల్గొంటున్న ఈ ఆరంభ లీగ్... సెప్టెంబర్ 20 వరకు జరుగుతుంది. మొత్తం నాలుగు వేదికల్లో 23 మ్యాచ్‌లు జరుగుతాయని ఎస్ఎల్సీ తెలిపింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఈ లీగ్‌లో శ్రీలంక క్రికెటర్లతోపాటు 70 మందికి పైగా విదేశీ క్రికెటర్లు పాల్గొనే అవకాశముంది. -
ఈ భయాలు లేకుంటే.. ఆ మ్యాచ్ జరిగేది!
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (కోవిడ్-19) పంజా విసురుతోంది. భారత్‌లో సైతం వైరస్ విజృంభణతో 1071 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 29 మంది మృతి చెందారు. దీంతో బీసీసీఐ ప్రతిష్టాత్మంగా నిర్వహించే ఐపీఎల్-2020 ఏప్రిల్ 15 వరకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా, దేశవ్యాప్తంగా 21 రోజల లాక్డౌన్ కోనసాగుతోంది. దీంతో పలువురు ప్రముఖులు ఇంట్లో ఉంటూ.. కరోనా వ్యాప్తి నియంత్రణకు సోషల్ మీడియా ద్వారా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయితే, తాజాగా ముంబై క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కాస్త భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. (లాక్డౌన్: బాయ్‌ఫ్రెండ్‌ను మిస్ అవుతున్న క్రీడాకారిణి) ‘కేవలం భౌతికంగానే ఇంట్లో ఉన్నాను. కానీ, నా మనసు మొత్తం వాంఖడే క్రికెట్ స్టేడియంలో ఉంది’ అని సూర్యకుమార్ తన ట్విటర్లో పేర్కొన్నారు. వాంఖడే స్టేడియం, ఇంట్లో దిగిన రెండు ఫోటోలను ఆయన ట్విటర్లో పోస్టు చేశారు. కాగా, సూర్యకుమార్ ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడిగా గుర్తింపు పొందారు. ఈ సీజన్లో కూడా ఆయన ముంబై ఇండియన్స్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇదిలాఉండగా.. కరోనా భయాలు గనుక లేకుంటే ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో ఐపీల్ తొలి మ్యాచ్ జరగాల్సింది. ప్రస్తుతం భారత్ యుద్ధ ప్రాతిపదికన కరోనా వైరస్ కట్టడికి చర్యలు చేపడుతోంది.(బీసీసీఐ విరాళం రూ. 51 కోట్లు) Mentally at Wankhede stadium. But physically at home. This too shall pass. #stayhome #staysafe pic.twitter.com/EBsjgqtmVB — Surya Kumar Yadav (@surya_14kumar) March 29, 2020 -
ఐఎస్ఎల్-ప్రీమియర్ లీగ్‌ల మధ్య కొత్త ఒప్పందం
ముంబై : ప్రీమియర్ లీగ్, ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)ల మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. నెక్ట్స్ జనరేషన్ ముంబై కప్‌లో భాగంగా శుక్రవారం ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ చైర్పర్సన్ నీతా అంబానీ, ప్రీమియర్ లీగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ మాస్టర్స్‌ను కలిశారు. ఈ సందర్భంగా నీతా అంబానీ, రిచర్డ్‌లు కొత్త ఒప్పందంపై సంతకం చేశారు. గత ఆరేళ్ల నుంచి ఈ రెండు లీగ్‌లు కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఒప్పందం ప్రకారం భారతలో ఫుట్‌బాల్ అభివృద్ధితోపాటు, కోచింగ్ సౌకర్యాలు, యువతలో ఫుట్‌బాల్ నైపుణ్యాలు పెంపొందించడానికి ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ప్రీమియర్ లీగ్‌తో ఐఎస్ఎల్ భాగస్వామ్యం మరో దశకు చేరుకుందన్నారు. గత ఆరేళ్లుగా భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధి తాము చేసిన కృషి సంతృప్తినిచ్చిందని తెలిపారు. యువతలో నైపుణ్యం పెంపొందించడం, కోచింగ్, రిఫరీ అంశాలను మరింత బలోపేతం చేయడానికి రెండు లీగ్‌ల మధ్య కుదిరిన నూతన ఒప్పందం తోడ్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రిచర్డ్ మాస్టర్స్ మాట్లాడుతూ.. ఐఎస్ఎల్తో కొత్త ఒప్పందాన్ని చేసుకోవడం భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధికి తమ నిబద్ధతను మరోసారి చాటిచెప్పింది. ఇందుకు తాము చాలా సంతోషిస్తున్నాం. గత ఆరేళ్లుగా ఐఎస్ఎల్ భాగస్వామ్యంతో ఫుట్‌బాట్ కోచింగ్, అభివృద్ధి, అలాగే మౌలిక సదుపాయాలకు మద్దతిచ్చాం. కొత్త ఒప్పందం ద్వారా యువతలో ఫుట్‌బాల్ నైపుణ్యాన్ని పెంపొందించడం, భారత్‌లో ఫుట్‌బాల్ పరిధిని విస్తృత పరిచేందుకు ఎదురుచూస్తున్నామ’ని తెలిపారు. -
సాక్షి ప్రీమియర్ లీగ్ విజేతలకు బహుమతి ప్రధానం
-
సాక్షి ప్రీమియార్ లీగ్ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం
-
6న సాక్షి ప్రీమియర్ లీగ్ ఫైనల్స్
సాక్షి, హైదరాబాద్: సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతోన్న ‘సాక్షి ప్రీమియర్ లీగ్’ (ఎస్పీఎల్) క్రికెట్ టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. లీగ్ మ్యాచ్‌లను విజయవంతంగా ముగించుకున్న ఎస్పీఎల్ ఫైనల్ సమరానికి సిద్ధమైంది. గురువారం జరుగనున్న ఈ టైటిల్ పోరు బహుమతి ప్రదాన కార్యక్రమం సైనిక్‌పురిలోని భవన్స్ క్రికెట్ అకాడమీలో అట్టహాసంగా జరుగనుంది. ఈ వేడుకకు నగరంలోని అన్ని కాలేజీల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించారు. ఆసక్తి గల వారు తమ కాలేజి ఐడీ కార్డులతో రావాల్సిందిగా నిర్వాహకులు పేర్కొన్నారు. -
చిత్తూరు జిల్లాలో సాక్షి ప్రీమియర్ లీగ్
-
సరికొత్తగా టీ20 లీగ్.. ఇవేం రూల్స్‌రా నాయనా..!
ఢాకా : బంగ్లాదేశ్ టీ20 ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలతో విభేదాల నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. బీపీఎల్‌లో సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు అన్ని దేశాలు పాటించిన రూల్స్‌నే అనుసరించిన బంగ్లా క్రికెట్ బోర్డు బీపీఎల్‌ను తన అధీనంలోకి తీసుకుని తాజా నిర్ణయాలను ప్రకటించింది. మేటి ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన తమ దేశ క్రికెటర్లు టీ20 ఫార్మాట్లో మెరుగ్గా రాణించేందుకు తాజా నిబంధనలు దోహదపడతాయని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ మహబూబల్ అనమ్ చెప్పారు. వచ్చే సీజన్ నుంచి ఈ నిబంధనలు అమలవుతాయని వెల్లడించారు. కాగా, ఏడు ప్రాంచైజీలు ఉన్న బీపీఎల్‌లో ఆరు జట్ల యజమానులతో బంగ్లా క్రికెట్ బోర్డుకు విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో బంగ్లా ప్రీమియర్ లీగ్‌ను బంగ్లా బోర్డు అధీనంలోకి తీసుకుంది. అయితే, బీసీబీ కొత్త నిబంధనలపై విమర్శలు వస్తున్నాయి. మోకాలుకు బోడి గుండుకు ముడిపెట్టుగా రూల్స్ చెత్తగా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. సరుకంతా విదేశాలదైతే బంగ్లా ప్రీమియర్ లీగ్ అనే పేరెందుకుని క్రికెట్ అభిమానులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. బంగ్లా టీ20 ప్రీమియర్ లీగ్ తాజా రూల్స్.. ఏడు టీమ్‌లలో ఒక విదేశీ ఫాస్ట్ బౌలర్ తప్పనిసరి. అతను 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగలగాలి టీమ్‌లో ఒక లెగ్ స్పిన్నర్ తప్పనిసరిగా ఉండాలి ప్రతి జట్టులో ఉన్న మణికట్టు స్పిన్నర్ తప్పనిసరిగా పూర్తి కోటా (4 ఓవర్లు) బౌలింగ్ చేయాలి విదేశీ ప్రధాన కోచ్, ఫిజియోథెరపిస్టు, ట్రెయినర్లే ఉండాలి. స్వదేశానికి చెందిన కోచ్‌లు ఈ ప్రధాన కోచ్‌కు సహాయకుడిగా మాత్రమే ఉంటారు. టీమ్‌లకు డైరెక్టర్‌ను ఎంపిక చేసే అధికారం బీసీబీ డైరెక్టర్‌కు ఉంటుంది. -
ఇండీవుడ్ ఫ్యాషన్ ప్రీమియర్ లీగ్
-
ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు
షార్జా: అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. బల్ఖ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కాబుల్ జ్వనాన్ బ్యాట్స్‌మన్ హజ్రతుల్లా జజాయ్ ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టడంతోపాటు 37 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. అబ్దుల్లా మజారి వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో హజ్రతుల్లా (6, 6, వైడ్, 6, 6, 6, 6) రెచ్చిపోవడంతో ఈ అద్భుతం జరిగింది. ఇదే జోరులో హజ్రతుల్లా 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి... టి20 క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును సమం చేశాడు. గతంలో యువరాజ్ (2007లో ఇంగ్లండ్‌పై), క్రిస్ గేల్ (2016 బిగ్‌బాష్ లీగ్‌లో) కూడా 12 బంతుల్లోనే అర్ధ సెంచరీలు చేశారు. హజ్రతుల్లా (17 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) అదరగొట్టినా ఈ మ్యాచ్‌లో కాబుల్ జ్వనాన్ జట్టుకు ఓటమి తప్పలేదు. తొలుత బల్ఖ్ లెజెండ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 244 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (48 బంతుల్లో 80; 2 ఫోర్లు, 10 సిక్స్‌లు) వీరవిహారం చేయడంతో బల్ఖ్ లెజెండ్స్ 23 సిక్స్‌లు బాది ఓ టి20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా రికార్డు సృష్టించింది. 21 సిక్స్‌లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (2013లో), వెస్టిండీస్ (2016లో), రంగ్‌పూర్ రైడర్స్ (2017లో), భారత్ (2017లో) పేరిట ఉన్న రికార్డును బల్ఖ్ లెజెండ్స్ తిరగరాసింది. అనంతరం కాబుల్ జ్వనాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసి 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. -
టీపీఎల్ 2018 చాంపియన్స్‌గా కూల్ క్రూజర్స్
లండన్ : తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(తాల్) ఆధ్వర్యంలో తాల్ ప్రీమియర్ లీగ్(టీపీఎల్) క్రికెట్ టోర్నమెంట్‌ను మిడిల్సెక్స్లో నిర్వహించారు. క్రాన్ ఫోర్డ్‌లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లో హెస్టన్ మైదానంలో జరిగిన ఈ టోర్నీలో విజేతలకు స్థానిక ఎంపీ సీమా మల్హోత్రా అవార్డులను ప్రదానం చేశారు. కూల్ క్రూజర్స్, మార్చ్ సైడ్ కింగ్స్ జట్లు ఫైనల్ వరకు చేరుకోగా, బ్లూ క్యాప్స్, యూనైటెడ్ టైటాన్స్ జట్లు మూడో స్థానం కోసం పోటీపడ్డాయి. కూల్ క్రూజర్స్ టీపీఎల్ 2018 చాంపియన్స్‌గా నిలవగా, మార్చ్ సైడ్ కింగ్స్ రెండో స్థానం, యునైటెడ్ టైటాన్స్ మూడోస్థానంలో నిలిచాయి. టీపీఎల్‌లో పవన్ కుమార్ సీహెచ్ ఆల్‌రౌండర్‌గా రాణించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు. టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన టీపీఎల్ కమిటీ సభ్యులు సునీల్ నాగండ్ల, వంశీ రక్నర్, శ్యామ్ భీమ్‌రెడ్డి, శ్రీధర్ సోమిశెట్టి, వంశి పొన్నంలకు తాల్ స్పోర్ట్స్ ట్రస్టీ మురళీ తాడిపర్తి కృతజ్ఞతలు తెలిపారు. టీపీఎల్ సలహాదారులు రవిసుబ్బా, సంజయ్ భిరాజు, శరత్ జెట్టి, వాలంటీర్ల చేసిన కృషిని టీఏఎల్ ఛైర్మన్ శ్రీధర్ మేడిచెట్టి అభినందించారు. -
జనవరిలో జల్లికట్టు ప్రీమియర్ లీగ్
సాక్షి, చెన్నై : ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రీఎంట్రీతో తెగ సంబరపడుతున్న తమిళవాసులకు మరో సూపర్ లీగ్ సందడి చేయనుంది. తమిళనాడులోని సంప్రదాయ క్రీడైన జల్లికట్టు ప్రీమియర్ లీగ్ వచ్చే జనవరి 7 నుంచి ప్రారంభంకానుంది. ఈ లీగ్‌ను తమిళనాడు జల్లికట్టు పెరవై, చెన్నై జల్లికట్టు అమైప్ప సంఘాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ పోటీలు సంక్రాంతికి ముందు జనవరి 7 నుంచి ఈస్ట్‌కోస్ట్ రోడ్లో జరగనున్నాయి. అయితే ఈ ప్రీమియర్ లీగ్ నిర్వహణ గురించి జల్లికట్టుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న జంతుహక్కుల సంఘాలు ఇంకా స్పందించలేదు. పెటా పిటిషన్‌తో మార్చి 7, 2014న సుప్రీంకోర్టు ఈ ఆటలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తమిళనాడు ప్రజలు మాత్రం వెనక్కి తగ్గలేదు. గతేడాది సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు వెల్లువెత్తాయి. ఆందోళనకారులతో మెరీనా బీచ్ నిండిపోయింది. వారికి సినీ పరిశ్రమ మద్దతు లభించింది. చట్ట సవరణ తీసుకురావాలంటూ ఏకంగా నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఆందోళన తీవ్రం కావడంతో దిగివచ్చిన కేంద్రం1960 చట్టాన్ని సవరిస్తూ జల్లికట్టుకు అనుమతి ఇచ్చింది. -
ప్రతీ మ్యాచ్ ఫైనల్ లాంటిదే
హెన్రిక్ ఇంటర్వూ్య జర్మనీ క్లబ్ బొరుస్సియా డార్ట్మండ్ నుంచి గత జులైలో 30 మిలియన్ డాలర్ల ఒప్పందంతో హెన్రిక్ మిఖితర్యాన్ మాంచెస్టర్ యునైటెడ్‌కు తరలివచ్చాడు. అయితే అప్పటి నుంచి జట్టుకు అతడి సేవలు పెద్దగా ఉపయోగపడింది లేదు. గాయాలతో పాటు తుది జట్టులో చోటు దక్కకుండా పోవడం ఓ కారణం. అయితే నేడు సండర్లాండ్తో జరిగే మ్యాచ్‌లో కీలకంగా రాణించే ఆటగాళ్లలో తనూ ఒక్కడిగా మారాడు. ఈ నేపథ్యంలో మున్ముందు తాను మెరుగ్గా రాణించి ఆకట్టుకుంటానని అంటున్నాడు. వచ్చే ఏడాది మీ జట్టుకు చాలా కీలకం కానుంది. ప్రీమియర్ లీగ్ పట్టికపై క్రిస్మస్ గేమ్స్ చాలా ప్రభావం చూపిస్తాయి. సండర్లాండ్పై విజయం సాధించగలరనుకుంటున్నారా? 2017 మా జట్టుకే కాకుండా ఆటగాళ్లకు, అభిమానులకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను. ఈ సీజన్‌ను కూడా మెరుగ్గా ముగిస్తాం. టైటిల్ రేసులో వెనుకబడిన మీ జట్టుకు చాంపియన్ అయ్యే అవకాశాలున్నాయా? మేమింకా మా ప్రయత్నాలను వదులుకోలేదు. పోటీలో లేమని మేం చెప్పడం లేదు. ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నాయి. టాప్–4లో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నాం. జట్టులో చాలా కాలం తర్వాత చోటు దక్కించుకున్నారు. మీ వ్యక్తిగత లక్ష్యాలు ఏమిటి? జట్టు కోసం నా శాయశక్తులా పోరాడటమే నా ముందున్న లక్ష్యం. ఈపీఎల్‌లో ప్రతీ మ్యాచ్ ఫైనల్‌లాంటిదే. అందుకే శక్తివంచన లేకుండా ఆడాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా మీ కెరీర్‌పై అత్యంత ప్రభావం చూపిన వ్యక్తి ఎవరు? అందరికంటే ఎక్కువగా మా నాన్న ప్రభావం ఉంది. ఆయన మాజీ ఫుట్‌బాలర్. తను చనిపోయిన తర్వాత ఆయన అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నాను. -
అనంత ప్రీమియర్ లీగ్ ప్రారంభం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంతపురం ప్రీమియర్ లీగ్–2016 క్రికెట్ పోటీలను ఆర్డీటీ చీఫ్ కోచ్ షాబుద్దీన్, జిల్లా క్రికెట్ సంఘం ఉపా««ధ్యక్షులు చంద్రమోహన్‌రెడ్డి, మల్లికార్జున ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి ప్రసన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లీగ్ మ్యాచుల ద్వారా క్రీడాకారులు అభివృద్ధి సాధిస్తున్నారన్నారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి ఆర్డీటీ సహకారం ఎనలేనిదన్నారు. అనంతరం బీఆర్ ప్రసన్న మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా లీగ్ క్రికెట్‌ను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా అండర్–14 జట్టు గత మూడేళ్లుగా రాష్ట్ర చాంపియన్‌గా నిలుస్తోందన్నారు. అండ్–16 లో జిల్లా జట్టు సెమీస్‌కు అర్హత సా«ధించిందన్నారు. అండర్–19 లోనూ అనంత జట్టు రాష్ట్ర చాంపియన్‌గా నిలుస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. వచ్చే ఆదివారం నుంచి సబ్ సెంటర్లలో లీగ్ పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శి సర్దార్, కోచ్‌లు మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అనంత క్రీడా గ్రామంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో అనంతపురం జట్టుపై అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టు విజయం సాధించింది. స్కోర్ వివరాలు..అనంతపురం: 50 ఓవర్లలో154 పరుగులు (ఆలౌట్), అకాడమీ జట్టు: 44 ఓవర్లలో విజయం (3 వికెట్లు).