అద్భుతాలు అరుదుగా జరుగుతుంటాయి. ఫుట్‌బాల్ ఆటలో ఆఖరున గోల్ కొట్టేది ఒక్కడే అయినప్పటికి.. అందులో ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్ల హస్తం కచ్చితంగా ఉంటుంది. ఒక మిడ్ ఫీల్డర్.. ఒక డిఫెండర్.. ఒక ఫార్వర్డ్ ప్లేయర్ కలిస్తేనే గోల్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కానీ ఒక ఫుట్‌బాల్ జట్టులోని 11 మంది ఆటగాళ్లు ఒక గోల్ కొట్టడానికి ఒకరినొకరు సహకరించుకోవడం తక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే ఫుట్‌బాల్‌లో ఇరుజట్లు బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి.
చదవండి: Andy Murray: అదరగొట్టిన ముర్రే.. ఐదేళ్ల నిరీక్షణకు తెర
అయితే క్రిస్టల్ ప్యాలెస్ జట్టు దానిని తిరగరాసింది. ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా క్రిస్టల్ ప్యాలెస్, బ్రైటన్ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. క్రిస్టల్ ప్యాలెస్ గోల్ కొట్టే క్రమంలో ఆ జట్టులోని 11 మంది ఆటగాళ్లు కనీసం ఒక్కసారైనా బంతిని టచ్ చేయడం విశేషం. ఇక చెల్సియా కోనర్ గల్లఘర్ ఆఖర్లో ఫినిషింగ్ టచ్ ఇస్తూ సూపర్ గోల్‌తో మెరిశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ప్రీమియర్ లీగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ''జట్టులోని ప్రతీ ఆటగాడు బంతిని టచ్ చేశాడు.. ఈ జట్టు గోల్ చూడముచ్చటగా ఉంది'' అంటూ క్యాప్షన్ జత చేసింది. అయితే క్రిస్టల్ ప్యాలెస్ అద్భుత గోల్ నమోదు చేసినప్పటికి.. 1-1తో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment