అనంత ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభం | anantha premier league starts | Sakshi
Sakshi News home page

అనంత ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభం

Published Sun, Nov 6 2016 10:20 PM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

అనంత ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభం - Sakshi

అనంత ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభం

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : అనంతపురం ప్రీమియర్‌ లీగ్‌–2016 క్రికెట్‌ పోటీలను ఆర్డీటీ చీఫ్‌ కోచ్‌ షాబుద్దీన్, జిల్లా క్రికెట్‌ సంఘం ఉపా««ధ్యక్షులు చంద్రమోహన్‌రెడ్డి, మల్లికార్జున ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి ప్రసన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లీగ్‌ మ్యాచుల ద్వారా క్రీడాకారులు అభివృద్ధి సాధిస్తున్నారన్నారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి ఆర్డీటీ సహకారం ఎనలేనిదన్నారు. అనంతరం బీఆర్‌ ప్రసన్న మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా లీగ్‌ క్రికెట్‌ను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా అండర్‌–14 జట్టు గత మూడేళ్లుగా రాష్ట్ర చాంపియన్‌గా నిలుస్తోందన్నారు. అండ్‌–16 లో జిల్లా జట్టు సెమీస్‌కు అర్హత సా«ధించిందన్నారు.

అండర్‌–19 లోనూ అనంత జట్టు రాష్ట్ర చాంపియన్‌గా నిలుస్తున్నందుకు  గర్వంగా ఉందన్నారు. వచ్చే ఆదివారం నుంచి సబ్‌ సెంటర్లలో లీగ్‌ పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్‌ సంఘం సంయుక్త కార్యదర్శి సర్దార్, కోచ్‌లు మహేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అనంత క్రీడా గ్రామంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో అనంతపురం జట్టుపై అనంతపురం స్పోర్ట్స్‌ అకాడమీ జట్టు విజయం సాధించింది. స్కోర్‌ వివరాలు..అనంతపురం: 50 ఓవర్లలో154 పరుగులు (ఆలౌట్‌), అకాడమీ జట్టు: 44 ఓవర్లలో విజయం (3 వికెట్లు).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement