GAJAL SRINIVAS
-
స్వాతంత్య్ర సంగ్రామ స్పూర్తితో.. విశాఖలో జేపీఎల్
సాక్షి, విశాఖపట్నం: క్రీడలతో సనాతన ధర్మం సందేశంలో భాగంగా సేవ్ టెంపుల్స్ భారత్ ఆధ్వర్యంలో అజాదీ కా అమృత్ మహోత్సవాల స్పూర్తితో డా. గజల్ శ్రీనివాస్ ‘‘జైహింద్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్)’’ నిర్వహించడం స్ఫూర్తి దాయకమని శాసన మండలి సభ్యులు పీవీ మాధవ్ అన్నారు. ఈ క్రీడలు నిర్వహించడం ద్వారా సనాతన ధర్మ, దేశ భక్తిని ప్రచారం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. జైహింద్ ప్రీమియర్ లీగ్ ఇన్విటేషన్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ విశాఖపట్నంలోని పి.ఎమ్.పాలెం, బి. గ్రౌండ్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌ను శ్రీ శ్రీ శ్రీ శ్రీనివాసానంద స్వామి గోపూజ నిర్వహించి ప్రారంభించారు. పరిమిత ఓవర్ల టోర్నమెంట్లో షహీద్ వీర సావర్కర్ లెవెన్, షహీద్ అల్లూరి లెవెన్, షహీద్ భగత్ సింగ్ లెవెన్, షహీద్ చంద్ర శేఖర్ ఆజాద్ లెవెన్ శ్రీ బిర్సా ముండా లెవెన్ జట్లు ఆడుతున్నాయని సేవ్ టెంపుల్స్ భారత్, జైహింద్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ డా. గజల్ శ్రీనివాస్, జేపీఎల్ కన్వీనర్ శ్రీ ఫణీంద్ర తెలిపారు. భారతీయ క్రీడా సుహృద్భావం, స్వాతంత్య్ర సంగ్రామ, సనాతన ధర్మ ప్రచారాలు ముఖ్య లక్ష్యంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. అనేకమంది సాధు, సంత్ పరివారం ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషమని జేపీల్ డైరెక్టర్స్ శ్రీ ఎ. హేమంత్ శర్మ, శ్రీ మేడికొండ శ్రీనివాస్, శ్రీ డి.ఎస్ వర్మ, సంచాలకులు శ్రీ పట్టా రమేష్ తదితరులు తెలిపారు. -
వెంకన్న సన్నిధిలో పలువురు ప్రముఖులు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి, గజల్ శ్రీనివాస్ వంటి ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘కుటుంబ సమేతంగా స్వామి వారి ఆశీస్సులు పోందడం చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సార్లు దర్శించుకున్న, ఎన్ని సార్లు చూసిన తనివి తీరని ఒక దివ్యమంగళ స్వరూపం స్వామి వారిది. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. త్వరగా వ్యాక్సిన్ రావాలని స్వామి వారిని కోరుకున్నాను. ఏపీలో కరోనాతో ఒక పక్క.. వరదలతో మరో పక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సమయంలో కూడా స్వామి వారిపై భక్తితో తిరుమలకు వచ్చి ఆయన ఆశీస్సులు పోందడం ఆనందదాయకం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరింత శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు సాయం చేయమని స్వామి వారిని వేడుకున్నాను. గతంలో లాగానే తిరుమలకు వచ్చే పర్యాటకులకు బ్రహ్మోత్సవాల అనంతరం దర్శనం కల్పిస్తాం’ అన్నారు. (చదవండి: శ్రీవారికి కానుకగా బంగారు శఠారి) వకుళ మాత ఆలయ నిర్మాణం చాలా సంతోషం: గజల్ శ్రీనివాస్ భారత్ సేవ్ టెంపుల్స్‌లో భాగంగా మా చిరకాల కోరిక వకుళ మాత ఆలయం నిర్మాణం జరడం చాలా సంతోషంగా ఉంది అన్నారు గజల్ శ్రీనివాస్. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాతృత్వంతో వకుళ మాత ఆలయం రూపకల్పన జరగడం చాలా ఆనందం. కరోనా సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ స్వచ్చ తిరుమలను అందంగా తీర్చి దిద్దిన టీటీడీని అభినందిస్తున్నాను. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రండి’ అని కోరారు. (చదవండి: ఆయన్ని చూస్తుంటే వైఎస్సార్ గుర్తుకు వచ్చారు) విపత్తుల నుంచి ప్రజలను కాపాడాలని కోరాను: కోన రఘుపతి కరోనా, ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలందరిని కాపాడాలని స్వామి వారిని వేడుకున్నాను అన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. ‘వేంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరిపై ఉంది. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. కరోనా సమయంలో టీటీడీ ఏకాంతంగా స్వామి వారి వాహన సేవలు నిర్వహించినప్పటికి ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తోంది’ అని తెలిపారు. -
గజల్ శ్రీనివాస్ రిమాండ్ పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: యువతిని లైంగికంగా వేధించారన్న కేసులో ప్రముఖ గజల్ గాయకుడు కె.శ్రీనివాస్ జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈ నెల 25 వరకు పొడిగిస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘సేవ్ టెంపుల్స్’సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే కేసులో శ్రీనివాస్‌ను పోలీసులు ఈ నెల 2న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రిమాండ్ ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు 18న విచారణ జరపనుంది. ఈ కేసులో రెండో నిందితురాలు పార్వతి పరారీలో ఉన్నారు. -
గజల్ శ్రీనివాస్ కేసుపై రఘువీరా స్పందన
సాక్షి, విజయవాడ: లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న గజల్ శ్రీనివాస్ వ్యవహారంపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి స్పందించారు. టీడీపీ ప్రభుత్వం బుద్ధే వక్రబుద్ధి అని, అందుకే అలాంటి వారిని సెలక్ట్ చేస్తోందని విమర్శించారు. గజల్ శ్రీనివాస్ తమ పార్టీలో తిరగలేదని, స్వచ్ఛంగా ఉండాల్సిన అంబాసిడరే ఇలా చేసినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని రఘువీరా అన్నారు. రేపటి నుంచి పోలవరం యాత్రం.. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు పాదయాత్ర చేపడుతున్నామని రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి ధవళేశ్వరం నుంచి పోలవరం ప్రాజెక్ట్ వరకు పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో ఇంద్రకిలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారిని రఘువీరా రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రేపటి నుంచి 10 తేదీవరకు ధవళెశ్వరం నుండి పోలవరం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నాం. 10న పోలవరంలో సామూహిక సత్యాగ్రహం నిర్వహిస్తాం. కేంద్ర ప్రభుత్వ నిధులతో పోలవరం పూర్తి చేయాలి. పోలవరం నిర్వాసితులందరికీ న్యాయం చేయాలి. పోలవరం ప్రాజెక్టులో కమీషన్లు ఏవిధంగా పంచుకోవాలి అన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశయంగా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ పాదయాత్రను విజయవంతం చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించాలని అమ్మవారిని వేడుకున్నాం’ అని రఘువీరా అన్నారు. ఇంద్రకీలాద్రి పై తాంత్రిక పూజలపై.. ‘ఆలయంలో అర్ధరాత్రి పూజలు జరిగాయని దుర్గగుడి చైర్మన్ ఒప్పుకున్నారు. అధికారులతో మాట్లాడుదామంటే భయపడిపోతున్నారు. దుర్గమ్మ సన్నీధిలో ఎవ్వరూ అబద్ధాలు ఆడలేరు. అలాగని నిజం చెప్పాలంటే నోటికి తాళాలు వేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా దుర్గగుడి లో ఏదో ఒక అపచారం జరుగుతూనే ఉంది. గతంలో అమ్మవారి ముక్కుపుడక విషయంలో ప్రభుత్వం మూల్యం చెల్లించుకొంది. ఆలయంలో పాలక మండలి నోరు మెదపకూడదని టీడీపీ నేతలు హుకుం జారీ చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే’ అని రఘువీరా అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ వ్యవహారంలో ఎవరిపై చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం, దేవాదాయశాఖ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పూజలు జరిగాయనేది వాస్తవమని, జరగలేదని బుకాయించొద్దని సూచించారు. ఈ వ్యవహారంపై సిట్డింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి, లేకుంటే టీడీపీ సర్కారు మళ్లీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. -
గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్ : గజల్ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టి వేసింది. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని ప్రాసీక్యూషన్ న్యాయవాది చెప్పడంతో ఆయన వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై 354, 354 ఏ, 509 సెక్షన్లు నమోదు చేశారు. అనంతరం తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. అదే సమయంలో తనపై అన్యాయంగా కేసు పెట్టారని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గజల్ శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసులపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు అనుమతి లేకుండా సీడీలను ఎఫ్ఎస్ఎల్కు ఎలా పంపిస్తారనంటూ ప్రశ్నించింది. ఏ2 అయిన పార్వతీ ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పడం పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా నిర్లక్ష్యంగా ఎలా సమాధానం చెబుతారని నిలదీసింది. సేవ్ టెంపుల్ సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈ నెల (జనవరి) 2న గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాలతో గజల్ శ్రీనివాస్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. -
గజల్ శ్రీనివాస్ కస్టడీ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: ‘సేవ్ టెంపుల్స్’ సంస్థలో పనిచేస్తున్న సహచర ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న కేసులో నిందితుడు గజల్ శ్రీనివాస్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. మరోవైపు తనపై అన్యాయంగా కేసు పెట్టారని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గజల్ శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని శుక్రవారం వెల్లడిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో గజల్ శ్రీనివాస్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలు రిమాండ్‌లో ఉన్నారు. -
గజల్ శ్రీనివాస్‌ను కఠినంగా శిక్షించాలి!
సాక్షి, విజయవాడ: ప్రముఖ గజల్ శ్రీనివాస్ రాసలీలల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గజల్ శ్రీనివాస్ తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా తాజాగా అతనికి వ్యతిరేకంగా బీజేవైఎం ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన నిర్వహించారు. యువతిని లైంగికంగా వేధించిన గజల్ శ్రీనివాస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ మహిళా నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కస్టడీపై నేడు నిర్ణయం విచారణ నిమిత్తం గజల్ శ్రీనివాస్‌ను తమ కస్టడీకి అప్పగించాలంటూ పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం వాదనలు ముగిశాయి. న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించనుంది. ఇక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన గజల్ శ్రీనివాస్‌పై సేవ్ టెంపుల్స్ సంస్థ వేటు వేసింది. ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించినట్లు సంస్థ అధ్యక్షుడు ప్రకాశ్‌రావు వెలగపూడి ఓ ప్రకటన విడుదల చేశారు. పరారీలో పార్వతి గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసులో రెండో నిందితురాలిగా ఉన్న పార్వతి పరారీలో ఉంది. ఆమెకు నోటీసులు జారీ చేయడానికి పంజాగుట్ట పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు సహకరించిన పార్వతి.. శ్రీనివాస్ చెప్పినట్లుగా వినాలని బాధితురాలిపై ఒత్తిడి తీసుకువచ్చిందని ప్రధాన ఆరోపణ. మంగళవారం ఉదయం పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్టు చేయగా.. ఆ రోజు సాయంత్రం వరకు కూడా పార్వతి సేవ్ టెంపుల్స్ సంస్థ కార్యాలయం వద్ద ఉంది. గజల్ శ్రీనివాస్ తనకు తండ్రిలాంటి వాడని, 20 ఏళ్లుగా తాను అక్కడే పనిచేస్తున్నా ఎలాంటి ఇబ్బందులు రాలేదని మీడియాకు చెప్పింది. బాధితురాలు ఎందుకు ఫిర్యాదు చేసిందో అర్థం కావడం లేదనీ పేర్కొంది. కానీ బాధితురాలు చేసిన స్టింగ్ ఆపరేషన్ వీడియోలు మంగళవారం సాయంత్రం బయటకు వచ్చాయి. అందులో పార్వతి, గజల్ శ్రీనివాస్‌ల రాసలీలలు స్పష్టంగా కనిపించాయి. ఆ తర్వాతి నుంచి పార్వతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు పంజాగుట్ట పోలీసులు ప్రయత్నించినా ఆచూకీ దొరకలేదు. ఆమె సెల్‌ఫోన్ సైతం స్విచాఫ్ చేసి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పార్వతి ఆచూకీ కోసం సేవ్ టెంపుల్స్ కార్యాలయం, ఆమె ఇల్లు, స్నేహితుల వద్ద ఆరా తీస్తున్నారు. -
వీడేంటి గుడిని బచాయించేది?
గుడిని కాపాడతాడట... వీడి సంస్థ పేరే సేవ్ టెంపుల్... ఉద్యోగాన్ని భక్తితో చేసే వాళ్లనే మలినం చేసే రకం. వీడి దుంపతెగ. వీడేంటి గుడిని బచాయించేది? వీడినుంచి ఆడపిల్లల్ని బచాయించాలి అంటుంది ఈ బాధితురాలు. గజల్ శ్రీనివాస్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన ఈ అమ్మాయి సాక్షి టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇది. ‘నలుగురిలో ఉన్నప్పుడు పెద్దమనిషిగా, ఆధ్యాత్మికవేత్తగా చెలామణి అవుతాడు. ఎవరూ లేనప్పుడు అతడిలోని రాక్షసుడు నిద్ర లేచి వేధింపులు ప్రారంభిస్తాడు. ఆ కార్యాలయంలో పని చేసినన్నాళ్ళూ ఒక్కో క్షణం ఒక్కో నరకం అనుభవించా’ అని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. బుధవారం ఆమె సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ గజల్ శ్రీనివాస్‌తో ఎదురైన చేదు అనుభవాలు, తాను అనుభవించిన నరకాన్ని గురించి చెప్పారు. ‘సేవ్ టెంపుల్ సంస్థ చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలకు స్ఫూర్తి పొందే జీతంలో పెరుగుదల లేకపోయినా పాత ఉద్యోగం మాని అక్కడ చేరాలని భావించా. సంస్థ చైర్మన్ ప్రకాష్‌తోపాటు గజల్ శ్రీనివాస్ నన్ను ఇంటర్వ్యూ చేశారు. జూన్ 3న ఉద్యోగంలో చేరిన తర్వాత కొంతకాలం చైర్మన్ మా కార్యాలయంలోనే ఉన్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాతే గజల్ శ్రీనివాస్ తన నిజస్వరూపం బయటపడింది. ఒక్కసారిగా గర్జించిన సింహంలా మారిపోయి పంజా విసరడం ప్రారంభించాడు. నాలుగు నెలల నుంచి విచిత్రమైన ప్రవర్తన, వెకిలి చేష్టలు ప్రారంభమయ్యాయి. పనివేళలతో నిమిత్తం లేకుండా నన్ను ఆఫీస్‌లో ఉండమనేవాడు. ఇతర ఉద్యోగుల్ని పంపేసి నన్ను ఒంటరిగా ఉంచడానికి చూసేవాడు. ఎవరైనా మహిళా గెస్టులు వస్తే వారితో గంటల తరబడి మాట్లాడేవాడు. ‘వాళ్ళు వెళ్ళేవరకు నువ్వు ఉండాలి’ అనేవాడు. అలా కుదరదని చెప్పినందుకు ఓసారి నోటికొచ్చినట్లు తిట్టాడు. ఏడుస్తున్నా కనికరం లేకుండా ప్రవర్తించాడు. రెండోరోజు ఆఫీస్‌కు వచ్చిన వెంటనే నేను వెళ్ళిపోతా అని చెప్పా. ‘నాకు పలుకుబడి ఉంది, నేను పంపకుండా నువ్వు వెళ్ళిపోతానంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇవ్వను, శాలరీ సర్టిఫికెట్ ఇవ్వను. ఒకవేళ అవి వద్దనుకుని వెళ్ళిపోవాలని చూస్తే నిన్ను ఏదో ఒక కేసులో ఇరికిస్తా’ అంటూ బెదిరించాడు. తనకు నచ్చిన ఆడవాళ్ళను ఆఫీస్‌కు తీసుకువచ్చే అతడు... ఆ సమయంలో మాత్రం టైమ్ కాకపోయినా కార్యాలయం నుంచి అందరినీ పంపించేసేవాడు. నేను సీఎం పక్క ఉంటా, త్వరలో గవర్నర్ అవుతా, నాకు ఎంతో పలుకుబడి ఉందంటూ లోబరుచుకునే ప్రయత్నం చేసేవాడు. చివరలో అతడి వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. హత్తుకుందాం... లాంటి మాటలు అనేవాడు. నేను అతడికి లొంగట్లేదని నాపై కక్షకట్టాడు. రేడియో జాకీ అయిన నాతో నానా చాకిరీ చేయించాడు. టిష్యూ పేపర్స్‌ను అపరిశుభ్రంగా చేసి నేలపై పడేసేవాడు. ఆపై బెల్ కొట్టి నన్ను పిలిచి ‘స్వచ్ఛ్ భారత్’ అంటూ అవి కనిపించట్లేదా... తియ్ అనేవాడు. అతిథులు తాగిన కాఫీ, టీ కప్పుల్నీ నాతోనే తీయించేవాడు. ఆడపిల్లలు ఇందుకే ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటారా అని అతడు పెట్టే బాధలు చవిచూసినప్పుడు నాకు అనిపించింది. దీంతో రెండు నెలల పాటు చివరకు అన్నం తినేప్పుడూ ఏడుస్తూనే ఉన్నా. నాకు నమ్మకమైన స్నేహితులకు విషయం చెప్తే ఉద్యోగం మానేయమని అన్నారు. తోటి ఉద్యోగులకు చెప్తే ఆయనతో ఎందుకు పెట్టుకుంటావ్ అనే వాళ్ళు. ఆయన భార్య కొన్నాళ్ళ క్రితం వరకు ఆఫీస్‌కు వచ్చినా.. ఆపై మానేశారు. ‘మేడం మీరు రాకపోతే ఆఫీస్ మరో రకంగా ఉంటోంది’ అని ఆమెకు పరోక్షంగా హెచ్చరించి చెప్పినా ప్రయోజనం లేదు. తన నిజస్వరూపం బయటకు తెలియకూడదనే అన్నీ గదిలోనే చేస్తుంటాడు. కన్నతండ్రిలాంటి వెలగపూడి ప్రకాశరావు గారికి కూడా ద్రోహం చేశారు. ఆ ఆఫీస్‌లో పని చేసే పార్వతి ‘‘నువ్వంటే సార్‌కు ఇష్టం... సహకరిస్తే అన్నీ చూసుకుంటాడు’’ అనేది. రోజులు గడిచేకొద్దీ వేధింపులు శృతిమించాయి. నేను ఉద్యోగం మానేసి వెళ్ళిపోతే నా తర్వాత వచ్చే మరో అమ్మాయి బలవుతుందని భావించా. నాలా మరొకరు బలి కాకూడదంటే గజల్ శ్రీనివాస్‌కు బుద్ధి చెప్పాలనుకున్నా. ఎంతో పేరున్న మనిషి కాబట్టి బయటకు వచ్చి ‘అసలు విషయం’ చెప్తే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. అందుకే సాక్ష్యాధారాలతో అతడి నిజస్వరూపాన్ని సమాజానికి చూపించాలి అనుకున్నా. పెద్దమనిషి ముసుగులో చాలా చిన్నపనులు... అకృత్యాలు చేసే గజల్ శ్రీనివాస్ చాలా సెక్యూర్డ్‌గా ఉంటాడు. ఎక్కడా ఎలాంటి ఆధారాలూ దొరకనీయడు. అందుకే స్టింగ్ ఆపరేషన్ చేయడానికి పెద్ద గ్రౌండ్ వర్క్ చేశా. కార్యాలయంలోని అతడి బెడ్రూమ్లోనూ మంచం మినహా ఇంకేమీ ఉండవు. అయినప్పటికీ ధైర్యం చేసి స్పై కెమెరా ఏర్పాటు చేశా. విషయం పసిగడితే నన్ను అక్కడే చంపేస్తాడని తెలుసు. అందుకే నాకు నమ్మకమైన ఓ స్నేహితురాలికి విషయం చెప్పా– ఏ రోజైనా నేను ఆఫీస్ నుంచి తిరిగి రాకపోతే... ఫలానా చోట కెమెరా పెట్టాను తీసుకోండి అని సూచించా. పక్కా ఆధారాల కోసమే నేను ఈ మధ్య ఆయన పిలిచినప్పుడు గదిలోకి వెళ్ళి కాళ్ళు నొక్కడం, ముట్టుకోవడం చేశా. ఇదంతా కెమెరాలో రికార్డు అవుతుందనే చేశా. పోలీసుల వద్దకు వెళ్ళేప్పుడు భయపడ్డా. అయితే ఏసీపీ విజయ్‌కుమార్, ఇన్స్పెక్టర్ రవీందర్ నాకు ధైర్యం చెప్పారు. నేను చేసిన సాహసానికి న్యాయం చేస్తూ గజల్ శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. వారితోపాటు తెలంగాణ పోలీసుకి ఎంతో రుణపడి ఉన్నా. సాధారణంగా ఓ ఆడపిల్ల తనకు ఎదురైన లైంగిక వేధింపుల్ని మౌనంగా భరిస్తుంది తప్ప బయటకు చెప్పుకోలేదు. తెగించి అలా చెప్పిందంటే అవి శృతిమించాయని, నిజమని నమ్మాల్సిందే. నేను ఇన్ని ఆధారాలు, వీడియోలతో పోలీసులకు ఫిర్యాదు చేసినా కొందరు అనుమానిస్తున్నారు. ఇలా చేస్తే భవిష్యత్తులో మరో బాధితురాలు బయటకు వచ్చేందుకు కూడా ధైర్యం చేయదు. మృగాళ్లకు చెక్ పడదు. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల ఉంటుంది. ఆమెకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే– అని అంతా ఆలోచించాలి. ఇది కేవలం శృతి తప్పడం కాదు... తీవ్రమైన అపశృతి. ఆయనకు పరిచితులైన కళాకారులు ముందు ఆశ్చర్యపోతారు, ఆ తరవాత ఈ దుర్బుద్ధి ఎలా పుట్టిందా అనుకుంటారు. మహిళలందరూ తమని తాము కాపాడుకోవడానికి బయటకు రావాలని చెబుతున్నాను. పోలీసులకు ధన్యవాదాలు చెబుతున్నాను. గజల్ శ్రీనివాస్‌ను తమ సంస్థ ప్రచార బాధ్యతల నుంచి తీసేస్తున్నట్లు ‘సేవ్ టెంపుల్’ ఆర్గనైజేషన్ అధ్యక్షులు వెలగపూడి ప్రకాశ్‌రావు ప్రకటించారు. గతి తప్పిన గజల్ -
ఆ వీడియోలు చూస్తే ‘గజల్’ నిజస్వరూపం తెలుస్తుంది!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచానికి అతనొక ప్రముఖ గజల్ గాయకుడు. శాంతికాముకుడు. ఆధ్మాత్మికవేత్త. కానీ అతని అసలు స్వరూపం అది కాదని, మహిళల పట్ల అతనో ముసుగు వేసుకున్న క్రూరమృగమని అంటున్నారు బాధితురాలు. గజల్ శ్రీనివాస్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదుచేసిన ఆమె తాజాగా ’సాక్షి’ టీవీతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. గజల్ శ్రీనివాస్ బాగోతాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చిన ఆ యువతి.. అతను, అతని పనిమనిషి పార్వతి చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. ఆమె స్వచ్ఛందంగా తనకు మసాజ్ చేసేందుకు ఒప్పుకున్నదని గజల్ శ్రీనివాస్, అతని పనిమనిషి పార్వతి ఆరోపిస్తుండగా.. ఆ ఆరోపణలను అవాస్తవమని, అసలు వాస్తవం అందరికీ తెలియాలనే తాను వీడియోలు బహిర్గతం చేశానని, ఆ సమయంలో తనను ఆమె ఏ విధంగా శ్రీనివాస్ గదిలోకి తీసుకెళ్లింది వీడియోలో నమోదైందని బాధితురాలు వివరించారు. వాళ్లు చెప్పింది అబద్ధం అని నిరూపించడానికి ‘సేవ్ టెంపుల్’ వీడియో కూడా ఇచ్చానని ఆమె అన్నారు. ఆమెను తాను సొంత కూతురిలాగా చూసుకున్నానని, ఆమె పట్ల ఎలాంటి తప్పుడు చర్యకు పాల్పడలేదని, ఉద్దేశపూర్వకంగానే ఆమె తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని గజల్ శ్రీనివాస్ మీడియాతో పేర్కొన్న వ్యాఖ్యలు ప్రస్తావించగా.. ’అవన్నీ అబద్ధాలు.. దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా మీడియాకు అందించాను. వాటిని చూస్తే అందరికీ అర్థం అవుతుంది.. మహిళల పట్ల అతను ముసుగు వేసుకున్న ఒక క్రూరమృగం అన్నది నిర్ధారణ అవుతుంది’ అని బాధితురాలు తెలిపారు. -
గజల్ కేసులో మరో ట్విస్ట్..మరిన్ని వీడియోలు!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. గజల్ శ్రీనివాస్ రాసలీలలకు సంబంధించి మరిన్ని వీడియోలను బాధితురాలు తాజాగా విడుదల చేశారు. పనిమనిషి పార్వతి తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అని నిరూపించడానికే.. మరిన్ని వీడియోలు విడుదల చేశానని ఆమె తెలిపారు. నా వద్ద ఇంకా చాలా వీడియోలు ఉన్నాయని తెలిపారు. గజల్ శ్రీనివాస్ గలీజ్ పనులకు సంబంధించి మొత్తంగా 20 వీడియోలను బాధితురాలు పోలీసులకు సమర్పించినట్టు తెలుస్తోంది. పనిమనిషి పార్వతే తనను గజల్ శ్రీనివాస్ వద్ద వెళ్లాలని బలవంతపెట్టేదని బాధితురాలు తెలిపారు. గజల్ శ్రీనివాస్ బారిన పడిన బాధిత మహిళలు చాలామంది ఉన్నారని, చాలామంది మహిళల జీవితాలను అతను నాశనం చేశాడని చెప్పారు. అతని వ్యవహారంపై రెండు నెలలుగా స్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు బాధితురాలు వెల్లడించారు. గజల్ శ్రీనివాస్‌లాంటి మోసగాడిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి మోసగాళ్లను వదిలేస్తే..మరింత మంది జీవితాలు నాశనమవుతాయని అన్నారు. తాజా వీడియోలు వెలుగుచూడటంతో గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసు ఉచ్చు మరింతగా బిగుసుకున్నట్టయింది. తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ‘సేవ్ టెంపుల్స్’ సంస్థలోని ఉద్యోగినిని లైంగికంగా వేధించిన కేసులో కేసిరాజు శ్రీనివాస్ అలియాస్ గజల్ శ్రీనివాస్ అరెస్టయిన సంగతి తెలిసిందే. బాధితురాలు పక్కా సాక్ష్యాలతో పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన బాగోతం బయటపడింది. ఈ కేసులో పనిమినిషిగా ఉన్న పార్వతి కూడా నిందితురాలిగా చేర్చారు. -
ఆయన బయటకొస్తే సాక్ష్యాలు తారుమారు..!
సాక్షి, హైదరాబాద్: మహిళను లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్‌కు బెయిల్ ఇవ్వొద్దని కోరుతూ నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు కౌంటర్ ధాఖలు చేశారు. గజల్ శ్రీనివాస్ బయటకు వస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశముందని పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా పలువురిని విచారించాల్సి ఉందని తెలిపారు. ఇంకా ఈ కేసులో బాధితురాలి వాంగ్మూలం రికార్డ్ చేయాల్సి ఉందని వివరించారు. నాంపల్లి కోర్టులో బెయిల్ కోసం గజల్ శ్రీనివాస్ లాయర్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. గజల్ శ్రీనివాస్ సమాజంలో మంచి పలుకుబడి గల వ్యక్తి అని, అతను బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు నివేదించారు. పూర్తి ఆధారాలతోనే గజల్ శ్రీనివాస్‌ను అరెస్టు చేశామని, అరెస్టుకు ముందు నోటీసులు ఇచ్చినా సరైన వివరణ ఇవ్వలేదని తెలిపారు. మరోవైపు పోలీసులు కూడా గజల్ శ్రీనివాస్‌ను తమ కస్టడీకి అనుమతించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అయితే, పోలీసుల కస్టడీకి అతన్ని అనుమతించే విషయమై వాదనలు ముగియడంతో కోర్టు తీర్పు గురువారానికి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో ఏ-2గా ఉన్న కీలక నిందితురాలు పార్వతి పరారీలో ఉంది. గజల్ శ్రీనివాస్ పనిమనిషి అయిన పార్వతిని అదుపులోకి తీసుకుంటే గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు సంబంధించి మరిన్ని కీలక వివరాలు రాబట్టే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే గజల్ శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించినట్టు పోలీసులు చెప్తున్నారు. తాను బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న సంస్థలోని ఉద్యోగినిని లైంగికంగా వేధించిన కేసులో కేసిరాజు శ్రీనివాస్ అలియాస్ గజల్ శ్రీనివాస్ అరెస్టయిన సంగతి తెలిసిందే. బాధితురాలు పక్కా సాక్ష్యాలతో పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన బాగోతం బయటపడింది. ఈ కేసులో పార్వతి అనే మహిళను కూడా నిందితురాలిగా చేర్చినట్టు ఇన్స్పెక్టర్ ఎస్.రవీందర్ మంగళవారం వెల్లడించారు. నాంపల్లి కోర్టులో నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లు బుధవారానికి వాయిదా పడ్డాయి. దీంతో గజల్ శ్రీనివాస్‌కు జ్యుడీషియల్ రిమాండ్ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆఫీసులో మసాజ్ చేయాలంటూ.. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన బాధిత మహిళ బీకాం, బ్యూటీషియన్ కోర్సులు పూర్తి చేయడంతో పాటు ప్రవచనాలు, వేదాలు అధ్యయనం చేసింది. ఈమెకు 2014లో వివాహమైనా మూడు నెలలకే విడాకులు తీసుకుంది. గతేడాది జూన్ నుంచి పంజగుట్ట పరిధిలోని సప్తగిరి బిల్డింగ్‌లో ఉన్న సేవ్ టెంపుల్ సంస్థలో నెలకు రూ.13 వేల జీతానికి పని చేస్తోంది. ఆ సంస్థ నిర్వహించే వెబ్ రేడియో ఆలయవాణికి ఇన్చార్జ్గా విధులు నిర్వర్తిస్తోంది. వెలగపూడి ప్రకాశ్‌రావు నేతృత్వంలోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయం మూడేళ్లుగా సప్తగిరి బిల్డింగ్‌లోని త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో నడుస్తోంది. ఈ సంస్థకు గజల్ శ్రీనివాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి బాధితురాలు ఈ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకే విధులు నిర్వర్తించాల్సి ఉంది. అయితే గజల్ శ్రీనివాస్ తరచూ ఆ కార్యాలయానికి వెళ్లి అర్ధరాత్రి వరకు గడిపేవాడు. బాధితురాలిని కూడా ఆ సమయం వరకు ఉండాల్సిందిగా ఒత్తిడి చేసేవాడు. ఇందుకు ఆమె గతంలోనే అనేకసార్లు సున్నితంగా తిరస్కరించింది. సేవ్ టెంపుల్ సంస్థలో బాధితురాలితో పాటు వీడియో ఎడిటర్, సహాయకుడు, పని మనిషి పార్వతి మాత్రమే ఉద్యోగులుగా ఉన్నారు. కార్యాలయానికి సంబంధించిన మూడు బెడ్రూమ్స్లో ఒకదాన్ని గజల్ శ్రీనివాస్ తన అనైతిక కార్యకలాపాలకు వినియోగించేవాడు. వేళకాని వేళల్లో పని మనిషి పార్వతితో కాళ్లు నొక్కించుకోవడం, మసాజ్ చేయించుకోవడంతోపాటు ఇతర అనైతిక కార్యకలాపాలకు పాల్పడేవాడు. పార్వతి మాదిరే తనకు ‘సహకరించాలంటూ’ శ్రీనివాస్ బాధితురాలిపై ఒత్తిడి చేసేవాడు. లేదంటే ఉద్యోగం నుంచి తీసేస్తానని, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతోపాటు మరెక్కడా ఉద్యోగం రాకుండా చేస్తానని బెదిరించేవాడు. పార్వతి సైతం గజల్ శ్రీనివాస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ బాధితురాలిపై అనేకసార్లు ఒత్తిడి తీసుకువచ్చింది. ‘‘నేను చేస్తున్నట్లే సార్‌కు చెయ్యి. అప్పుడే మంచి జీతంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తాడు. ఆయన చాలా పెద్దోడు. నాకు చేసినట్లే నీకు పెళ్లి కూడా చేస్తాడు’’ అని చెప్పేది. ఈ వేధింపులు తారస్థాయికి చేయడంతో అనేకసార్లు తిరస్కరించిన బాధితురాలు.. కొన్ని సందర్భాల్లో పార్వతితో కలిసి రెండుమూడు గంటల పాటు గజల్ శ్రీనివాస్ కాళ్లు నొక్కేది. దీంతో మరింత రెచ్చిపోయిన గజల్ శ్రీనివాస్ ఆ గదిలో నగ్నంగా/అర్ధనగ్నంగా ఉండి బాధితురాలిని పార్వతి ద్వారా పిలిపించేవాడు. ఆమెను బలవంతంగా ఆలింగనం చేసుకోవడం, చేతులతో అభ్యంతరకరంగా తడమటం చేసేవాడు. వీటిని భరించలేకపోయిన బాధితురాలు హెచ్చరిస్తే... బెదిరింపులకు దిగేవాడు. ఫోన్ ద్వారా, వాట్సాప్ చాటింగ్స్ ద్వారానూ హింసించేవాడు. బాధితురాలి స్టింగ్ ఆపరేషన్ గజల్ శ్రీనివాస్ వేధింపులు శృతిమించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధితురాలు భావించింది. అయితే పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం, కేవలం ఫిర్యాదు మాత్రమే చేస్తే ఎవరూ నమ్మరనే ఉద్దేశంతో స్వయంగా స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది. సేవ్ టెంపుల్ కార్యాలయంలో శ్రీనివాస్ వినియోగిస్తున్న బెడ్రూమ్లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇందులో గజల్ శ్రీనివాస్, పార్వతి రాసలీలలతోపాటు పార్వతితో కలిసి బాధితులురాలు శ్రీనివాస్ కాళ్లు నొక్కుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. వీటి ఆధారంగా గత శుక్రవారం (డిసెంబర్ 29) పంజగుట్ట పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. వీడియో రికార్డులతోపాటు వాయిస్ రికార్డులు, ఫొటోలు పోలీసులకు అందించింది. దీంతో ఐపీసీ 354, 354 (ఏ), 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విషయం గోప్యంగా ఉంచి ప్రాథమిక దర్యాప్తు చేశారు. అన్ని ఆధారాలు సేకరించి మంగళవారం ఉదయం ఆనంద్‌నగర్ కాలనీలోని తన నివాసంలో గజల్ శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. -
అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రాలుగా గుర్తించాలి
స్వచ్ఛభారత్ ఏపీ అంబాసిడర్ గజల్ శ్రీనివాస్ పుట్టపర్తి టౌన్ : తిరుపతి, పుట్టపర్తికి అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలని స్వచ్చభారత్ అంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ అన్నారు. పుట్టపర్తికి విచ్చేసిన ఆయన పట్టణంలోని పలు ఆలయాలతోపాటు, చిత్రావతి నది, చిత్రావతి హారతి ఘాట్, స్థానిక ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం స్థానిక సాయిఆరామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చిత్రావతి నదిపై బ్రిడ్జి నిర్మిస్తోందని, అనుబంధంగా సమీపంలోని చిత్రావతి నదిలో 40 అడుగుల సత్యసాయి విగ్రహం నిర్మించాలన్నారు. అందుకు ప్రభుత్వం నిధులు వెచ్చించలేక పోతే తాను విగ్రహం నిర్మించేందుకు నిధులు సమకూరుస్తానన్నారు. ఈనెల 25 నుంచి రెండు రోజుల పాటు ద్వారకా తిరుమలలో సేవ్ టెంపుల్స్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంగీత కళాకారుడు గిరిధర్, పట్టణ యువకులు ఊట్ల సోము, తిరుపతేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
నవ్యాంధ్ర నవరసాల రాజధాని కావాలి
గజల్ శ్రీనివాస్ ఆకాంక్ష కొత్తపేట : నవ్యాంధ్రలో వివిధ కళా సంస్థలు ఏర్పాటు చేసి నవరసాల రాజధానిగా రూపుదిద్దాలని గజల్ గాయకుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతి అభివృద్ది ఎంత అవసరమో కళలకు ప్రోత్సాహం కూడా అంతే అవసరమన్నారు. శాస్త్రీయ సంగీతం, నాట్యం, శిల్పం తదితర కళలను ప్రోత్సహించాలని కోరారు. ప్రముఖ వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పంచలోహ విగ్రహాన్ని నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) సౌజన్యంతో గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళంపల్లి స్వగ్రామమైన రాజోలు నియోజకవర్గం శంకరగుప్తంలో నెలకొల్పనున్నారు. కొత్తపేటలో ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్‌వుడయార్ రూపొందిస్తున్న విగ్రహం నమూనాను గురువారం సాయంత్రం శ్రీనివాస్ పరిశీలించారు. అచ్చం బాలమురళీకృష్ణ సంగీతం ఆలపిస్తున్నట్టుగానే విగ్రహాన్ని మలిచారని రాజ్‌కుమార్‌ను అభినందించారు. రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు పర్యవేక్షణలో మార్చి 3న జరిగే మంగళంపల్లి గుడి, విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, నాట్స్ అధ్యక్షుడు మోహ¯ŒS మన్వా ముఖ్యఅతిథులుగా పాల్గొంటారని శ్రీనివాస్ విలేకరులకు చెప్పారు. అదే రోజు నాట్స్–గజల్ శ్రీనివాస్ కళాపరిషత్‌ల ఆధ్వర్యంలో బాలమురళీకృష్ణ సంగీత ఆరాధనోత్సవాలు నిర్వహిస్తామన్నారు. మార్చి 5న వకుళమాత ఆలయ శంకుస్థాపన తిరుపతి సమీపంలోని పేరూరులో వెంకటేశ్వరస్వామి తల్లి వకుళమాత ఆలయం పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టినట్టు సేవ్ టెంపుల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ తెలిపారు. ఆ దిశగా 40 ఎకరాలు సేకరించగా టీటీడీ రూ.4 కోట్ల విడుదలకు సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. మార్చి 5న పరిపూర్ణానందస్వామి పర్యవేక్షణలో జరిగే శంకుస్థాపనలో ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పీఠాధిపతులు పాల్గొంటారన్నారు. ర్యాలి ప్రసాద్‌కు పురస్కారద్వయం కాకినాడ కల్చరల్ : ప్రముఖ కవి, ‘నవరసం’ వెబ్ పత్రిక సంపాదకుడు ర్యాలి ప్రసాద్ రెండు పురస్కారాలు అందుకోనున్నారు. ఆయన రాసిన ‘అతను’ కవిత విజయవాడ నుంచి వెలువడే ‘ఉపాధ్యాయ’ మాసపత్రిక వార్షిక కవితా పురస్కారానికి ఎంపిక కాగా..‘పరివర్తనం’ కవిత హైదరాబాద్ ఏజీ ఆఫీస్ ఏటా జాతీయస్థాయిలో నిర్వహించే వచన కవితా పోటీల్లో పురస్కారానికి ఎంపికైంది. ప్రసాద్ గతంలో ‘పునాసనీడ, తదనంతరం, కుంకుమరేఖ, మట్టి’ వంటి కవితా సంకలనాలు వెలువరించారు. అక్షరానికి పసనూ, పరిమళాన్నీ సంతరిస్తూ ఆయన రాసిన అనేక కవితలు ఎన్నో పోటీల్లో బహుమతులను అందుకున్నాయి. ప్రశంసలు పొందాయి. తాజాగా మరో రెండు పురస్కారాలు అందుకోనున్న సందర్భంగా ఆయనను పలువురు సాహితీవేత్తలూ కవిత్వాభిమానులూ అభినందించారు. -
సాంస్కృతిక రాజధానిగా పాలకొల్లును తీర్చిదిద్దాలి
డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఉల్లంపర్రు (పాలకొల్లు అర్బన్) : ఎందరో కళాకారులకు పుట్టినిల్లయిన పాలకొల్లును సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు కృషి చేయాలని గజల్ మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ అన్నారు. ఉల్లంపర్రులో ఆయన సోమవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నినాదం ఇచ్చారు. ఎమ్మెల్యే నిమ్మల నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, తాను ఎమ్మెల్యేకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానన్నారు. దీపం వెలిగించి ఎలా నమస్కరిస్తామో, మొక్కను కూడా అలాగే నమస్కరించాలన్నారు. మొక్కలు లేనిదే మానవ మనుగడ లేదన్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, జెడ్పీటీసీ కోడి విజయలక్ష్మి, ఎంపీపీ పెన్మెత్స శ్రీదేవి, సర్పంచ్ పెదపాటి హవీలా, ఉప సర్పంచ్ పాశర్ల వెంకట రమణ పాల్గొన్నారు -
సంక్షేమానికి ప్రాధాన్యంత దక్కడం లేదు
పుట్టపర్తి అర్బన్: అమరావతికి దక్కిన ప్రాధాన్యం అభివృద్ధి, సంక్షేమానికి దక్కలేదని ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన సత్యసాయి మహాసమాధిని కు టుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన స్థానిక సాయి ఆరామంలో విలేకరులతో మాట్లాడారు. గత యూపీఏ ప్రభుత్వం తెలుగుతల్లిని రెండుగా విడదీసి, తెలుగు ప్రజల్లో తీరని గుండెకోతను మిగి ల్చిందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా వ్యవసాయం, పారిశ్రామిక, సాంస్కృతిక రంగాలపై ప్రత్యేక పాలసీలు లేకపోవడం బాధాకరమన్నారు. వైఎస్ఆర్ మర ణం తర్వాత రాష్ట్రంలో అధ్వాన పాలన సాగు తోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి గడపకూ వైఎస్సార్ సంక్షేమ పథకాలు చేరాయన్నారు. గోదావరి జిల్లాలో రూ.10 కోట్ల వ్యయంతో గజల్ శ్రీనివాస్ మ్యూజియం, గజల్ డిజిటల్ లైబ్రరీ, ఫర్మార్మింగ్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ పాఠశాల నిర్మిస్తామన్నారు. అనంతరం గజల్ శ్రీని వాస్‌ను వినియోగదారుల సమాఖ్య రాష్ట్ర నా యకుడు సురేష్, చంద్రశేఖర్‌గుప్తా దుశ్శాలు వ, సత్యసాయి చిత్రపటంతో సన్మానించారు. -
ఆలయాలను పరిరక్షిద్దాం-గజల్ శ్రీనివాస్
విజయనగరం టౌన్: ఆలయాలను పరిరక్షణకు ప్రజలందరి సహకారం కావాలని ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం విజయనగరం సంతపేటలోని జగన్నాథస్వామి ఆలయాన్ని సందర్శించుకున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.సేవ్ టెంపుల్ ఆర్గనైజేషన్ తరఫున ఆలయ ఆధునీకరణకు రూ. లక్ష అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫేస్బుక్లో ప్రత్యేక పేజీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సేవ్ టెంపుల్ ఆర్గనైజేషన్ కన్వీనర్ అయిన ఆయన ప్రవాసాంద్రులను సమావేశపరిచి సంస్థ తరపున దేవాలయాల పరిరక్షణకు వారితో కలిసి కృషి చేస్తానని హామినిచ్చారు. -
సమైక్య పోరుకు సన్నద్ధం కావాలి
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో సైతం ఓడించడానికి సీమాంధ్రులు సమైక్యపోరుకు సన్నద్ధం కావాలని గజల్ శ్రీనివాస్ అన్నారు. నగరంలోని ఎన్జీఓ భవన్‌కు మంగళవారం ఆయన విచ్చేసి ఎన్జీఓ సంఘనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఈనెల 9న నిర్వహించనున్న సమైక్యరన్‌లో తాను కూడా పాల్గొంటానని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు నిరసన, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
గజల్ శ్రీనివాస్ పై కేసు నమోదు
హైదరాబాద్: ప్రముఖ తెలుగు గాయకుడు గజల్ శ్రీనివాస్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఏపీఎన్జీవో సభలో జాతీయ గీతాన్ని కించపరిచారని ఆరోపణల కింద అతనిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గజల్ శ్రీనివాస్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏపీ ఎన్జీవోలు సెప్టెంబర్ నెలలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించినృ ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సభకు ఉద్యోగి కాని గజల్ శ్రీనివాస్‌ను సభకు అనుమతించటం, సభలో ఆయన ప్రసంగించడంపై వివాదం రాజుకుంది. అప్పటి సభలో జాతీయ గీతాన్ని శ్రీనివాస్ అవమానపరిచారంటూ ఫిర్యాదు నేపథ్యంలో అతనిపై కేసు నమోదైంది. -
పంచుకోవడానికి రాష్ట్రం రొట్టెముక్క కాదు : గజల్ శ్రీనివాస్
జంగారెడ్డిగూడెం రూరల్, న్యూస్‌లైన్: పంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రొట్టెముక్క కాదని.. మట్టి ముద్దని, రాష్ట్ర విభజన ఎవరితరం కాదని గజల్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జంగారెడ్డిగూడెంలో రాయప్రోలు సాహితి సత్సంగ పీఠం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరైన సమైక్యాంధ్రపై మాట్లాడారు. ఎప్పటికీ తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర అన్నదమ్ములంతా కలిసే ఉంటారన్నారు. కుయుక్తుల చర్యల వల్ల రాష్ట్ర విభజనకు పాల్పడుతున్నారని, గాంధేయవాదంతో రాష్ట్రం సమైక్యంగా ఉండేలా ప్రతి ఒక్కరూ పోరాడాలని, తెలుగు భాషా సంస్కృతిని విడదీయడం సాధ్యం కాదన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, కేసీఆర్ జంగారెడ్డిగూడెం వచ్చి భోజనం చేయడం ఖాయమని ఆయన అన్నారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో 1035 కిలో మీటర్లు శాంతి కోసం పాదయాత్ర చేసి గజల్స్ గీతాలు ఆలపించినట్లు చెప్పారు. ఆకట్టుకున్న సమైక్య గీతాలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ గజల్ శ్రీనివాస్ ఆలపించిన గీతాలు సమైక్యవాదులను ఆకట్టుకున్నాయి. ఓయి తెలుగువాడా... హైదరాబాద్ ఎవరిది భరతమాతను అడుగవా... బెదిరింపులు చేస్తానంటే నా ఇంటి బువ్వ తినిపిస్తా.. వంటి గీతాలు ఆయన పాడారు.