పుట్టపర్తి అర్బన్: అమరావతికి దక్కిన ప్రాధాన్యం అభివృద్ధి, సంక్షేమానికి దక్కలేదని ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన సత్యసాయి మహాసమాధిని కు టుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన స్థానిక సాయి ఆరామంలో విలేకరులతో మాట్లాడారు. గత యూపీఏ ప్రభుత్వం తెలుగుతల్లిని రెండుగా విడదీసి, తెలుగు ప్రజల్లో తీరని గుండెకోతను మిగి ల్చిందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా వ్యవసాయం, పారిశ్రామిక, సాంస్కృతిక రంగాలపై ప్రత్యేక పాలసీలు లేకపోవడం బాధాకరమన్నారు.
వైఎస్‌ఆర్ మర ణం తర్వాత రాష్ట్రంలో అధ్వాన పాలన సాగు తోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి గడపకూ వైఎస్సార్ సంక్షేమ పథకాలు చేరాయన్నారు. గోదావరి జిల్లాలో రూ.10 కోట్ల వ్యయంతో గజల్ శ్రీనివాస్ మ్యూజియం, గజల్ డిజిటల్ లైబ్రరీ, ఫర్మార్మింగ్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ పాఠశాల నిర్మిస్తామన్నారు. అనంతరం గజల్ శ్రీని వాస్‌ను వినియోగదారుల సమాఖ్య రాష్ట్ర నా యకుడు సురేష్, చంద్రశేఖర్‌గుప్తా దుశ్శాలు వ, సత్యసాయి చిత్రపటంతో సన్మానించారు.