welfare
-
బాలికలపై ప్రిన్సిపాల్ కర్కశత్వం 44 మందికి అస్వస్థత..
-
పీఎం కేర్.. చిల్డ్రన్ వెల్ఫేర్
కలెక్టర్ల నుంచి సేకరించి.. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లల వివరాలను రాష్ట్రాల వారీగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పీఎం కేర్ ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేసినట్టు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి లోక్‌సభలో వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పీఎం కేర్ పోర్టల్‌లో కోవిడ్–19 కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలు 4,532 మంది నమోదైనట్టు కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 855 మంది పిల్లలు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారు. పీఎం కేర్ పోర్టల్‌లో నమోదైన 4,532 మంది పిల్లలకు 18 సంవత్సరాలు నిండాక ప్రతి బిడ్డకు రూ.10 లక్షల చొప్పున పోస్టాఫీస్‌లో కార్పస్ ఫండ్ కింద జమ చేస్తున్నట్టు కేంద్ర మంత్రి వివరించారు.పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకంలో 10 లక్షల కార్పస్‌ను పెట్టుబడి పెట్టడం ద్వారా 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య పిల్లలలకు నెలవారీ స్టైఫండ్‌ను ఇస్తారని, 23 సంవత్సరాల నిండిన తరువాత రూ.10 లక్షలు మంజూరు చేస్తారని వెల్లడించారు. బందువుల దగ్గర ఉంటున్న 18 ఏళ్లలోపు పిల్లలకు మిషన్ వాత్సల్య పథకం కింద నెలకు రూ.4,000 చొప్పున మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. పిల్లల సంరక్షణ, ఇన్స్టిట్యూట్లో ఉండే పిల్లలకు బోర్డింగ్, లాడ్జింగ్ సౌకర్యాలను ప్రభుత్వమే కలి్పస్తుందని మంత్రి తెలిపారు. ఈ పిల్లలు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునేందుకు వీలుగా కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేకంగా అడ్మిషన్లు ఇచి్చనట్టు పేర్కొన్నారు. పూర్తి ఫీజు మినహాయింపుతో.. కోవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలను ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో ప్రత్యేకంగా 10 మంది చొప్పున చేర్చు కుంటున్నారు. ఆ పిల్లలకు పూర్తిగా ఫీజు మినహాయింపు ఉంది. స్కూల్‌కు వెళ్లే పిల్లలందరికీ స్కాలర్íÙప్ కింద రూ.20 వేల చొప్పున ఇస్తారు. వీరంతా ఆయుష్మాన్ భారత్–ప్ర«దానమంత్రి జన ఆరోగ్య యోజన కింద రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీతో నమోదయ్యారు. వారికి 23 సంవత్సరాలు వచ్చే వరకు ఆరోగ్య బీమా కవరేజి వర్తిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. కోవిడ్ కారణంగా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లల వివరాలను బాలస్వరాజ్ పోర్టల్‌లో నమోదు చేశారు. ఈ కేటగిరీలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 1,82,2671 మంది పిల్లలు నమోదయ్యారు. వీరి సంరక్షణ, విద్య, ఆరోగ్య బాధ్యతలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మిషన్ వాత్సల్య పథకం కింద, పిల్లల సంరక్షణ సంస్థల ద్వారా వారి సంరక్షణ చర్యలను చేపడుతున్నారు. తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలు అత్యధికంగా ఒడిశాలో 34,160 మంది, మహారాష్ట్రలో 27,302 మంది, ఉత్తర ప్రదేశ్‌లో 19,437 మంది, తమిళనాడులో 15,395 మంది, గుజరాత్లో 13,802 మంది, మధ్యప్రదేశ్‌లో 11,413 మంది ఉన్నారు. -
నాలుకా.. తాటిమట్టా?
సాక్షి, అమరావతి: ‘అది నేనే... ఇది నేనే... నా చేతులతోనే పోలీసులపై బురద జల్లుతా... మళ్లీ నా నోటితోనే అయ్యో పోలీసులు అంటూ మొసలి కన్నీరు కారుస్తా’ ఇదీ ఈనాడు రామోజీరావు పాత్రికేయ వికృత తాండవం. మొన్నటి వరకు రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల నుంచి కానిస్టేబుల్ వరకూ వైఎస్సార్సీపీకి ఊడిగం చేస్తున్నారంటూ యథేచ్ఛగా రాసేశారు. దీనిపై పోలీసు యంత్రాంగం తిరగబడడంతో రామోజీ వెంటనే ప్లేటు ఫిరాయించి పోలీసులను వైఎస్సార్సీపీ నేతలు వేధిస్తున్నారంటూ నిర్లజ్జగా మరో విషపు రోత రాత అచ్చేసేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన పోలీసు వ్యవస్థకు గౌరవాన్ని పెంచింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనన్న నిజాన్ని ఉద్దేశ పూర్వకంగా విస్మరించారు. చంద్రబాబు–పురందేశ్వరి కుట్రలో భాగంగా ఎన్నికల కమిషన్(ఈసీ)ను తప్పుదారి పట్టించేందుకు పోలీసులపై దు్రష్పచారం చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ ఒక డీఐజీ, అయిదుగురు ఎస్పీలను బదిలీ చేసింది. వారి స్థానంలో ఎన్నికల నియమావళి ప్రకారం కొత్త అధికారులను నియమించింది కూడా. అయినా సరే ఈనాడు రామోజీరావు శాంతించ లేదు. తనను సంప్రదించకుండా ఎస్పీలను ఈసీ నియమిస్తుందా అన్నట్టుగా పేట్రేగిపోయారు. ‘వీళ్లా ఎస్పీలు..’ అంటూ ఐపీఎస్ అధికారులను అవమానపరుస్తూ విషం కక్కారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలపై కూడా దు్రష్పచారానికి పాల్పడ్డారు. దీనిపై ఐపీఎస్ అధికారుల సంఘం, పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా స్పందించి ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీంతో రామోజీ మరో కుట్రకు తెరతీశారు. 16 ఏళ్ల డిమాండ్ 16 రోజుల్లో పరిష్కారం ♦ బ్రిటిష్ కాలంలో ప్రవేశపెట్టిన తమ యూనిఫామ్‌లో మార్పులు చేయాలని ఆర్మ్డ్ రిజర్వుడ్(ఏఆర్), స్పెషల్ పోలీస్(ఏపీఎస్పీ) కానిస్టేబుళ్లు 16 ఏళ్లుగా చేస్తున్న డిమాండ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 16 రోజుల్లో పరిష్కరిస్తూ జీవో జారీ చేశారు. బ్యారెట్ టోపీ స్థానంలో పీక్ టోపీని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. కానిస్టేబుల్ నుంచి రిజ ర్వ్ ఎస్సై స్థాయివరకు నలుపు రంగు విజిల్ కార్డ్‌ను తీసుకువచ్చింది. ఏఆర్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు విజిల్ కార్డ్‌తోపాటు పోలీస్ ఎంబ్లమ్ ఉన్న నలుపు బకిల్ ఉన్న బెల్ట్‌ను యూనిఫామ్‌లో భాగం చేసింది. ♦రాష్ట్రంలో ఎస్సైలకు గెజిటెడ్ అధికారి హోదా కల్పించాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కొత్త పీఆర్సీ ద్వారా ఆ మేరకు సిఫార్సు చేయనున్నట్టుగా ప్రకటించింది. ♦పోలీసులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేందుకు ఎస్ఎల్ఆర్, ఏఎస్ఎల్ఎస్ బిల్లులు చెల్లించేలా ఆర్థిక శాఖను ఆదేశించారు. వివిధ రిస్క్ అలవెన్స్‌లను మంజూరు చేయాలని ఆదేశించారు. ♦24 ఏళ్ల సర్వీసు ఇంక్రిమెంట్‌ను కొనసాగిస్తూనే 30 ఏళ్ల సర్విసుకు ప్రత్యేకంగా ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని నిర్ణయించింది. ♦ఏపీఎస్పీ నుంచి ఏఆర్‌కు మారే పోలీసులకు 6, 12, 18, 24 ఇంక్రిమెంట్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ♦అమర వీరుల కుటుంబాల పిల్లలకు ఇంజినీరింగ్, వైద్య విద్య తదితర కోర్సుల్లో 2 శాతం రిజర్వేషన్ (ఇది వరకు 0.25 శాతం) కల్పించారు. ఇతర ప్రయోజనాలు ♦ డీజీపీ, జిల్లా ఎస్పీ, పోలీస్ కమిషనరేట్లలో ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు. ♦ కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాల్లో పోలీసు ఆసుపత్రుల ఏర్పాటు. ♦ మహిళా పోలీసులకు అదనంగా ఏడాదికి 5 క్యాజువల్ లీవులు. చైల్డ్ కేర్ లీవులు 150 నుంచి 180 రోజులకు పెంపు. ♦విధి నిర్వహణలో భాగంగా రాజధానికి వచ్చే మహిళా పోలీసులకు ప్రత్యేక వసతి సౌకర్యం.. ఎల్టీసీ సౌకర్యం పునరుద్ధరణ ♦ పోలీసు అధికారుల సంఘం తొలిసారిగా రాష్ట్ర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో భాగం. -
FACT CHECK: హే జీసస్.. రోత రాతల పాపాలను క్షమించుడి!
సాక్షి, అమరావతి: రామోజీ పచ్చ పైత్యం రోజు రోజుకీ పరాకాష్టకు చేరుతోంది. క్రైస్తవుల సంక్షేమంపై జగన్ వివక్ష అంటూ విషం చిమ్మే నీచానికి రామోజీ దిగజారిపోయారు. రాయితీలపై అడ్డగోలుగా కోత అంటూ మడత వ్యాఖ్యలు చేస్తూ ఈనాడులో అబద్ధాలు అచ్చేయడాన్ని ‘హే జీసస్.. రామోజీ రోత రాతలు చూడు ప్రభు’ అని క్రైస్తవ సమాజం వ్యాఖ్యానిస్తోంది. పాపపు రాతల తీరును క్షమించమని ప్రార్థిస్తున్నాయి. చంద్రబాబు ఐదేళ్లపాలనలో క్రైస్తవులకు అరకొర రాయితీలు, పథకాలతో సరిపెట్టినా పచ్చ కళ్లకు అంతా సవ్యంగా కన్పించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రైస్తవులకు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా తోడ్పాటు అందిస్తుంటే రామోజీకి మింగుడు పడటంలేదు. ఆరోపణ: టీడీపీ హయాంలో స్వయం ఉపాధి, నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం, చర్చిలకు వెన్నుదన్ను. వాస్తవం: స్వయం ఉపాధి, నైపుణ్య శిక్షణ అంటూ కేవలం రెండు కార్యక్రమాలు అమలు చేసిన టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో క్రిస్టియన్ మైనార్టీల కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ఆ రెండు కార్యక్రమాలే ఏదో గొప్పగా చేసేసినట్టు ఈనాడు పచ్చ కలర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆరోపణ: వైఎస్సార్సీపీ పాలనలో క్రైస్తవులకు కుచ్చుటోపీ, యువతకు శిక్షణ లేదు, వెన్ను విరిచారు. వాస్తవం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్(మైనారిటీ) ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేసి వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచింది. సుమారు 6.82 లక్షల క్రైస్తవ మైనారిటీల సంక్షేమ పథకాల అమలుతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందంజలో ఉంది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ వాహన మిత్ర, లా నేస్తం, వైఎస్ఆర్ చేయూత, వంటి ఎన్నో కొత్త కార్యక్రమాలు వారి ఉన్నతికి దోహదం చేశాయి. కరోనా లాక్డౌన్ సమయంలో పాస్టర్లకు వన్–టైమ్ ప్రత్యేక ఆర్థిక సహాయం, జెరూసలేంకు తీర్థయాత్ర, చర్చిల ద్వారా, చర్చి నడిపే సంస్థలకు సహాయం అందించడం వంటి ప్రత్యేక తోడ్పాటుతో క్రిస్టియన్ మైనార్టీల్లో ఆత్మస్థైర్యం నింపింది. ఆరోపణ: ఆర్థిక సాయమూ అంతంతే వాస్తవం: చంద్రబాబు ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం ఐదేళ్లలో రూ.29 కోట్లు, శిక్షణ కోసం రూ.3.55 కోట్లు ఖర్చు చేస్తే అదే గొప్ప అంటూ ఈనాడు డబ్బాలు కొట్టింది. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 మార్చి వరకు క్రిస్టియన్ మైనార్టీ ఆర్థిక సంస్థ ద్వారా ఏకంగా రూ.416.58కోట్లు అందించింది. దీనిలో ఒక్క చేయూత పథకం(స్వయం ఉపాధి) ద్వారా 27,150 మందికి రూ.50.90కోట్లు అందించింది. దీంతోపాటు 90శాతం సబ్సీడీపై 90 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు(నిత్యావసర సరుకుల సరఫరా వాహనాలు) రూ.55 లక్షలు ఆర్థిక సాయం అందించింది. ఆరోపణ: అప్పుడలా ఇప్పుడిలా అంటూ తప్పుడు లెక్కలు వాస్తవం: టీడీపీ ప్రభుత్వం(2014–19)లో చర్చిలకు సాయం, రాయితీలపై రుణాలు, నైపుణ్య శిక్షణ వంటివి అరకొరగా జరిగితే గొప్పగా జరిగినట్టు ఈనాడు మసిపూసి మారేడు కాయ చేసింది. వైఎస్సార్సీపీ 2019–24 మధ్య క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందించిన ఆర్థిక తోడ్పాటును ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించింది. ► పాస్టర్లకు గౌరవ వేతనం కింద కోవిడ్ లాక్డౌన్ సమయంలో రూ.5వేలు చొప్పున వన్–టైమ్ గ్రాంట్‌గా 29,841 మందికి రూ.1490లక్షలు అందించింది. దీంతోపాటు నెలకు రూ.5వేలు చొప్పున 8427 మంది పాస్టర్లకు గౌరవ వేతనంగా రూ.7109.9లక్షలు అందించింది. ► ఇవి కాక లా నేస్తం కింద జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5వేలు చొప్పున 2020–21లో రూ.30 లక్షలు, 2021–22లో రూ.50 లక్షలు కేటాయించింది. ► కొత్త చర్చిల నిర్మాణం, పాత చర్చిల మరమ్మత్తులు, పునరుద్ధరణ, ఇతర మౌలిక వసతుల కోసం రూ.5 లక్షలు చొప్పున, శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.3 నుంచి 5 లక్షలు చొప్పున నిధులు ఇచ్చింది. ఇప్పటివరకు 98 చర్చిలకు రూ.5.67కోట్లు నిధులు అందించింది. ► జెరూసలేం, ఇతర బైబిల్ ప్రదేశాలకు తీర్థ యాత్ర పథకం కింద, వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువ ఉన్న ప్రతి లబ్ధిదారునికి రూ.60వేలు, వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.30 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఇప్పటివరకు 1,060 మంది లబ్ధిదారులకు రూ.591.60 లక్షలు నిధులు కేటాయించింది. -
ప్రభుత్వానికి థాంక్స్.. కేటీఆర్
-
సంక్షేమ వెలుగులు ధగధగ
సాక్షి, అమరావతి: సంక్షేమ ఆంధ్రను ఆవిష్కరించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. బుధవారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేసింది. రాష్ట్రంలో అన్ని విధాలుగా అవసరమైన సంక్షేమానికి మొత్తం రూ.44,668 కోట్లు కేటాయించింది. ఇందులో బీసీ సంక్షేమానికి రూ.29,001.31 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.9,291.55 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.4,133.73 కోట్లు, మైనారిటీల సంక్షేమానికి రూ.2,242.36 కోట్లు కేటాయించడం విశేషం. సంక్షేమంతోపాటు రాష్ట్రంలో గృహ నిర్మాణానికి రూ.7,062 కోట్లు కేటాయించింది. పేదరికంపై యుద్ధం చేసి ప్రజలను గెలిపించేలా.. దృఢమైన సామాజిక భద్రతా వలయంగా సంక్షేమ అ్రస్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించింది. వివక్ష లేని సంక్షేమంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హులందరికీ సంక్షేమాన్ని వారి గడప వద్దకే చేర్చింది. అట్టడుగు వర్గాలకు అందించిన సంక్షేమ ఫలాలతో వారికి ఎంతో మేలు చేసింది. ఫలితంగా ప్రజల స్థితిగతులు మారడంతో సురక్షితమైన, గౌరవ ప్రదమైన జీవనం గడిపేలా చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికత దేశానికే దిక్సూచిగా నిలిచింది. ఇంటి స్థలాల కేటాయింపు, ఇంటి నిర్మాణం, సంక్షేమ పింఛన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ తదితర పథకాలు, కార్యక్రమాల ద్వారా ఆర్థిక మద్దతు అందిస్తోంది. వైఎస్సార్సీపీ పాలనలో అందించిన సంక్షేమంతో సాధించిన అద్భుత ఫలితాలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ‘సంక్షేమ ఆంధ్ర’ థీమ్‌తో అసెంబ్లీలోవెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద మనస్సుతో పేదలకు భరోసా ♦ వైఎస్సార్ బీమా కింద 49,000 కుటుంబాలకు రూ.650 కోట్లు ♦ అగ్ర వర్ణాల కోసం ప్రత్యేక విభాగం (కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, ఆర్య వైశ్య, క్షత్రియ వర్గాల్లో కోటి 15 లక్షల మందికి రూ.36,321 కోట్లు ♦ ఈబీసీ నేస్తం కింద 4.39 లక్షల మందికి రూ.1,257 కోట్లు, వైఎస్సార్ కాపు నేస్తం కింద 77 లక్షల మందికి రూ. 39,247 కోట్లు ♦ వైఎస్సార్ నేతన్న నేస్తం కింద 81,783 మందికి రూ.983 కోట్లు ♦ జగనన్న తోడు కింద 16.73 లక్షల మందికి రూ.3,374 కోట్లు, జగనన్న చేదోడు కింద 3.40 లక్షల మందికి రూ.1,268 కోట్లు ♦ వైఎస్సార్ వాహన మిత్ర కింద 2.78 లక్షల మందికి రూ.1,305 కోట్లు ♦ వైఎస్సార్ లా నేస్తం కింద 6,069 మందికి నెలకు రూ.5 వేలు చొప్పున భృతి ♦ వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద 46,329 మందికి రూ.350 కోట్లు ♦ ఉపాధి హామీ పథకం కింద 2,141 లక్షల పని దినాల ద్వారా 45 లక్షల కుటుంబాల్లోని 72 లక్షల మందికి చెల్లింపులు ♦ అగ్రిగోల్డ్ బాధితులకు రూ.883.5 కోట్లు సాయం 2,19,763 ఎకరాలకు 1,29,842 మంది గిరిజనులకు వ్యక్తిగత పట్టాలు, 67,946 ఎకరాలకు గాను 526 కమ్యూనిటీ పట్టాలు పంపిణీ. 39,272 ఎకరాలకు 26,287 డీకేటీ పట్టాలు పంపిణీ. ఎస్టీల గృహాలకు ఉచిత విద్యుత్ నెలకు 100 యూనిట్ల నుంచి∙200 యూనిట్లకు పెంపు. కాఫీ తోటల పరిధి విస్తరణ. గిరిజన సహకార సంఘం ద్వారా మార్కెటింగ్ సహకారం. ♦ వెనుకబడిన కులాల(బీసీ)ల సంక్షేమం కోసం 56 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు. కోటి 2 లక్షల మందికి రూ.71,740 కోట్ల లబ్ధి. ♦ 2023–24లో దాదాపు 5 వేల మంది మైనారీ్టలకు ఉద్యోగావకాశాల కోసం శిక్షణ. ఇమామ్‌లకు అందించే సహాయం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.. 4,983 మందికి ప్రయోజనం. మోజన్లకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంపు. 4,983 మందికి మేలు. ♦ 2021–22 నుంచి 8,427 మంది పాస్టర్లకు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సహాయం. 2023 నుండి విజయవాడలోని ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్ర చేసే ప్రతి యాత్రికునికి రూ.80 వేలు చొప్పున 1,756 మందికి లబ్ధి. 2019 నుండి 1,178 మంది యాత్రికులు జెరూసలేం వెళ్లడానికి రూ.60 వేల చొప్పున ఆర్థిక సాయం. ఎస్సీ విద్యార్థులకు జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ. తద్వారా 200 మంది విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర ప్రీమియర్ కళాశాలలలో ప్రవేశం. ‘కెన్నెడీ లుగర్–యూత్ ఎక్సే్ఛంజ్’ కార్యక్రమం, విదేశీ విద్యా అధ్యయన కార్యక్రమాలకు ఎనిమిది మంది విద్యార్థులకు అవకాశం. 2023 సెపె్టంబర్లో సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనపై న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశానికి ఈ వర్గానికి చెందిన ఒక విద్యార్థి ప్రాతినిధ్యం. ఇళ్ల స్థలాలు, ఇళ్లు.. నగదు బదిలీ ♦ రాష్ట్రంలో గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి 4,63,697 ఇళ్లు మాత్రమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుంచి ఇప్పటి వరకు రూ.1.53 లక్షల కోట్ల విలువైన 30,65,315 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ప్రతి లబ్ధిదారుని ఇంటి ఖర్చుకు రూ.లక్షా 80 వేలు మంజూరు చేసింది. మౌలిక సదుపాయాల కోసం ఒక్కో ఇంటికి రూ.6.90 లక్షల చొప్పున (మొత్తంగా రూ.22,909 కోట్లు) వెచ్చిస్తోంది. ఫలితంగా 22 లక్షల ఇళ్లలో దాదాపు 9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లు 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇప్పటి వరకు 1,62,538 మంది లబ్దిదారులు నివాసం ఉంటున్నారు. ♦ అవినీతి, అవకతవకలకు అవకాశం లేకుండా అర్హతే ప్రాతిపదికగా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోంది. కోవిడ్ సమయంలో, ఇతరత్రా ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసి దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు అవిశ్రాంతంగా పనిచేసిన సచివాలయాల సిబ్బంది, వలంటీర్లను ప్రభుత్వం అభినందించింది. ♦ 2019లో స్థిర ధరల సూచి ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031తో దేశంలో 18వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం అది రూ.2,19,518తో 9వ ర్యాంకుకు ఎగబాకింది. ♦ వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం లబ్దిదారుల అర్హత వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించి సంతృప్త స్థాయిలో అమలు చేస్తోంది. 2019లో పింఛన్ల మొత్తం నెలకు రూ.1,385 కోట్లు ఉండగా, జనవరి నెల నాటికి అది రూ.1,968 కోట్లకు పెరిగింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలక్షల మందికి రూ.84,731 కోట్లు అందించింది. ♦ ప్రజల ఇంటి ముంగిటికే సరుకులు సరఫరా చేయాలనే లక్ష్యంతో 9,260 సంచార వాహనాలను ప్రవేశపెట్టింది. తద్వారా వృద్ధులు, దివ్యాంగులు, వేతన కార్మికులకు ఎంతో ఊరట కలిగింది. ఈ వాహనాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి ఉపాధి లభించింది. సబ్సిడీ బియ్యం కోసం గత ప్రభుత్వం రూ.14,256 కోట్లు, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.29,628 కోట్లు ఖర్చు చేసింది. -
మత్స్యకార ‘పథకాల’ అమలులో ఏపీ సహకారం భేష్
చిలకలపూడి(మచిలీపట్నం): మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పథకాల అమలుకు కావాల్సిన సదుపాయాలను కల్పించడంలో ఏపీ ప్రభుత్వ రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారుల కృషి అభినందనీయమని కేంద్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి పరుషోత్తం రూపాల ప్రశంసించారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన పథకాలను లబ్ధిదారులకు చేరవేయడంలో అధికారులు భాగస్వామ్యులు కావాలని సూచించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని గిలకలదిండి హార్బర్ వద్ద సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం మత్స్యకారులు, ఆక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. మచిలీపట్నం గిలకలదిండి హార్బర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం రూ. 20 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. కాగా, నందివాడ మండలం రామాపురానికి చెందిన దావీదు, పెదలింగాలకు చెందిన తుమ్మల రామారావు, రవీంద్రబాబు, ప్రవీణ్‌లు కేంద్ర మంత్రికి పరిశ్రమల్లో ఎదుర్కొంటున్న కష్ట, నష్టాలను వివరించారు. మత్స్యరైతుల ఉత్పత్తిదారుల సంఘాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. కేంద్ర మంత్రి సతీమణి సవితబెన్ రూపాల, కేంద్ర ప్రభుత్వ మత్స్యశాఖ జాయింట్ సెక్రటరీ నీతుకుమార్ ప్రసాద్, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, కలెక్టర్ పి.రాజాబాబు, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రతినిధి డాక్టర్ ఎల్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ ఏపీ టాప్: విజయసాయిరెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏం చేశామో చెప్పేందుకే సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర చేస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. యాత్ర సందర్భంగా శుక్రవారం మాచర్ల నియోజకవర్గం రెంటచింతలలో ఆయన పార్టీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ తో సమావేశమయ్యారు. 2019 మాదిరిగానే 2024లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ ఇచ్చామని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందనేది అవాస్తవమన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలవి తప్పుడు ఆరోపణలని దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలనలో ఏపీ ప్రజల తలసరి ఆదాయం పెరిగిందన్నారు. సీఎం జగన్ విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఫిషింగ్ హార్బర్స్, పోర్టులు నిర్మిస్తున్నామని, అభివృద్ధి విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. రాషష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర జరుగుతుందని తెలిపారు. మాచర్ల నియోజకవర్గానికి ఈ నాలుగున్నరేళ్లలో డీబీటీ ద్వారా రూ. 890కోట్లు , రూ. 300 కోట్లు నాన్ డీబీటీ ద్వారా ఖర్చు చేశామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఇదే మీటింగ్‌లో పాల్గొన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. నాలుగున్నరేళ్ళ పాలనలో ఒకటి, అర లోపాలు ఉంటే ఉండవచ్చన్నారు. ఉన్నది లేనట్టు అబద్ధాలు ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం చేసిందే చెప్పండని ఇన్ఫ్లూయెన్సర్లకు సూచించారు. -
పథకాల అమలుపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు అందిస్తున్న తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పుడు పథకాల పంపిణీ ఎలా ఉండాలి? నిబంధనల అమలు ఎలా ఉంది? అనే కోణంలో పరిశీలన మొదలుపెట్టింది. దళితబంధు, రైతుబంధు, బీసీ బంధులాంటి పథకాలకు సంబంధించి ప్రస్తుత సమయంలో లబ్ధిదారులకు సాయం అందించే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకాల కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు నోటిఫికేషన్ వచ్చే నాటికి లబ్ధి చేకూర్చాలని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పంపిణీ చేస్తే ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని టీపీసీసీ ఎన్నికల సంఘానికి వివరించింది. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం.. సంబంధిత శాఖలను వివరణ కోరింది. తక్షణమే స్పందించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. నివేదికలు సిద్ధం సంక్షేమ పథకాల అమలుపై ఎన్నికల సంఘం నివేదిక కోరడంతో సంబంధిత శాఖలు వివరణ ఇచ్చేందుకు ఉపక్రమించాయి. పథకాల వారీగా శాఖలు ఇప్పటికే సమాచారాన్ని సిద్ధం చేసుకున్నాయి. దళితబంధు పథకం నియోజకవర్గం యూనిట్‌గా అమలు చేస్తున్న క్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గం మినహా మిగతా 118 నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక జాబితాలు, నిర్వహించిన అవగాహన కార్యక్రమాలపై పూర్తిస్థాయి సమాచారంతో ఎస్సీ కార్పొరేషన్ సిద్ధమైంది. కాగా, రెండోవిడత దళితబంధు పథకం కింద నియోజకవర్గానికి ఐదు వందల మంది లబ్ధిదారులకు సాయం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల ద్వారా పలు సిఫార్సులు రావడంతో వాటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ పథకం కింద మొదటి విడతలో కూడా ఎంతమందికి లబ్ధి చేకూర్చారన్నది కూడా ఎన్నికల సంఘానికి వివరించనుంది. అదేవిధంగా రైతుబంధు పథకం కింద గత ఐదేళ్లుగా పంపిణీ చేసిన మొత్తంతో పాటు ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులు, వారికి ఇవ్వాల్సిన నిధులు తదితర సమాచారాన్ని సైతం వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. దీంతోపాటు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అమలు చేస్తున్న బీసీబంధు పథకం కింద అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలను సమర్పించేందుకు సిద్ధమైంది. ఈ పథకం కింద ఎంతమందికి ఆర్థిక సాయం అందించారనే అంశాలను కూడా నివేదిక రూపంలో తయారుచేసి పెట్టుకుంది. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ వివరాలను ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల సంఘానికి సమర్పించనున్నట్లు సమాచారం. -
ఉచితాలన్నీ.. అనుచితమేం కాదు
మేకల కల్యాణ్ చక్రవర్తి : ఎన్నికలు, రాజకీయాలు ఆర్థికాంశాలతోనే ముడిపడి ఉంటాయని.. ప్రజల ఆర్థిక ప్రయోనాలే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల ఎజెండాలు అవుతాయని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ అందె సత్యం స్పష్టం చేశారు. అయితే రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలన్నీ అనుచితమేమీ కావని.. కొన్ని పైకి ఉచితంగానే కనిపిస్తున్నా ఉత్పత్తిని పెంచే సాధకాలుగా ఉపయోగపడతాయనే అభిప్రాయపడ్డారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం కన్నా.. ప్రజలను కొనుగోలు చేయడంపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికలు, ప్రజల ఎజెండా, ఆర్థిక ప్రయోజనాలు, వాటి ప్రభావం, రాజకీయాల్లో వచ్చిన మౌలిక మార్పులపై అందె సత్యం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ.. ఎన్నికలకు, ఆర్థిక ప్రయోజనాలకు అసలు సంబంధమేంటి? ఎన్నికల్లో ఒక భాగం రాజకీయాలైతే, మరోభాగం ఆర్థికఅంశాలు. ఎత్తుగడలు, పొత్తులు, విధానాలు రాజకీయ అంశాలైతే.. ఎన్నికల ప్రణాళికకు సంబంధించి నవి ఆర్థికాంశాలు. ఎన్నికల ప్రణాళికల్లో సంక్షేమం, ఉచితాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. సంక్షేమంతోపాటు ఉత్పత్తిని పెంచే విధానాలూ ఉంటాయి. ఓట్ల కోసం ఉచిత హామీలు ఉంటాయి. ఉచితాలు సరికాదనే చర్చపై మీ అభిప్రాయం? తమిళనాడులో మాదిరిగా మిక్సీలు, టీవీలు ఇస్తే అవి ఉచితాల కిందకు వస్తాయి. మన రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆ దిశలో ఆలోచించడం లేదు. వారి ప్రణాళికల్లో అనుచితాలు లేవు. టీవీ ఇస్తే ప్రజలకు సంక్షేమమేమీ లేదు. ఉత్పత్తి రాదు. కేవలం వినోదం మాత్రమే వస్తుంది. అలాంటివి అనుచితం. అదే పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయం చేయడం వారు అప్పుల బారినపడకుండా చూడటమే. వీటిని ఉచితాలుగా చూడొద్దు. ఇవి సాంఘిక సంక్షోభానికి పరిష్కార మార్గాల్లాంటివి. వ్యవసాయానికి ఆర్థిక సాయం మంచి అంశమేనా? ఏ దేశంలోనైనా వ్యవసాయం గిట్టుబాటుగా లేదు. చాలా దేశాలు వ్యవసాయాన్ని ప్రోత్సహించి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అమెరికాలో దశాబ్దకాలంగా రైతులకు అయ్యే ఖర్చులో సగ భాగం సబ్సిడీ ద్వారా ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది. అయినా రైతుల సంఖ్య 60 లక్షల నుంచి 20 లక్షలకు తగ్గిందన్న విషయాన్ని గుర్తించాలి. వ్యవసాయానికి అన్నివిధాలా సాయం చేసి నిలబెట్టుకోవడం అవసరం. వ్యవసాయ సబ్సిడీలు, పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్, రుణమాఫీ కచ్చితంగా ఉత్పత్తి కోవలోకే వస్తాయి. ఆ ప్రణాళికల ఫలితం తెలంగాణలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఆసరా పెన్షన్లు ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆరోగ్యశ్రీ పథకాలను విస్తృతం చేయడం ద్వారా మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది. విద్య, వైద్య రంగాల్లో ఖర్చుతో ప్రయోజనమేనా? విద్య, వైద్య రంగాల్లో ఖర్చు సమంజసమైనది. వైద్యంపై ఖర్చు జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతుంది. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి పార్టీలు మాట్లాడకపోవడం నిరుత్సాహాన్ని కలిగించేదే. ఉన్నత విద్యా రంగంలో డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి. నేటికీ దేశంలో 30శాతం మంది మాత్రమే గ్రాడ్యుయేట్లు ఉన్నారు. కాబట్టి విద్యపై ఖర్చు అవసరం. కేరళలో ఆరోగ్య, విద్యా వనరుల కారణంగానే పేదరికం 0.7 శాతానికి తగ్గింది. పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టడం.. ఎన్నికల సమయంలో అభ్యర్థులు పెట్టే ఖర్చు కేరళ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. తెలంగాణలోనూ అసెంబ్లీ సెగ్మెంట్‌కు రూ.25 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుందన్న అంచనాలున్నాయి. ఇది ప్రజాభిప్రాయాన్ని హైజాక్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై మీ స్పందన? వ్యవస్థ పూర్తిగా వాణిజ్యపరమైనప్పుడు రాజకీయాలు కూడా వాణిజ్యపరం అవుతాయి. రాజకీయ పార్టీల నాయకులు గతంలో వ్యాపారుల దగ్గర ఆర్థిక సాయం తీసుకునేవారు. ఇప్పుడు రాజకీయ నాయకులే వ్యాపారులయ్యారు. ఈ లక్షణాన్నే ఎన్నికల్లోనూ ఉపయోగిస్తున్నారు. జమిలి ఎన్నికలతో... భారత్‌లో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మధ్యంతరంగా కూలిపోయినప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. జమిలి ఎన్నికల ప్రతిపాదన భవిష్యత్‌లో అధ్యక్ష తరహా పాలనకు దారితీయొచ్చు. ప్రజలు ఆర్థిక ప్రయోజనాల కోసం ఇలా ఎదురుచూడాల్సిందేనా? ఎప్పుడూ ప్రభుత్వాల వద్ద అడుక్కుని లబ్ధి పొందడమే ప్రజల పనిగా మారింది. భూపంపిణీతోపాటు సామాజిక సమస్యలను పరిష్కరించని కారణంగానే ఈ దుస్థితి. ప్రజల కొనుగోలు శక్తిని నిరంతరం పెంచే విధంగా కాకుండా ప్రజలను కొను గోలు చేసి రాజకీయ నాయకులు కుంభకోణాలకు పాల్పడుతున్నారు. అందుకే ఆర్థిక ప్రయోజనాల కోసం ఎన్నికల సమయంలో ప్రజలు పడిగాపులు కాయాల్సి వస్తోంది. నగదు బదిలీ పథకాలతో నష్టమా.. లాభమా? దేశంలో ఆకలి సూచీలు దిగజారిపోతున్నాయి. అంటే కింది స్థాయి పేదలకు ప్రభుత్వాల సాయం అవసరమే. పేదల కొనుగోలు శక్తి కారణంగా ప్రభుత్వానికి పన్నులు వస్తాయి. డిమాండ్, ఉత్పత్తి పెరుగుతాయి. ఇక మన దేశంలో ఉద్యోగులు, కార్మి కుల వాటా ఎక్కువ. పాత పింఛన్ ప్రభుత్వాలకు భారమనేది అభివృద్ధి నిరోధక ఆలోచన. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా పాత పింఛన్ విధానాన్నే అమలు చేస్తున్నాయి. -
ప్రజల కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీ
సాక్షి, హైదరాబాద్/దుండిగల్: ఎంతో కాలం అధికారంలో ఉన్నా ఏమీ చేయని వాళ్లు.. చేసింది చెప్పుకోవ డానికి ఏమీ లేనివాళ్లు ఇప్పుడు తమ కు అవకాశమిస్తే ఎన్నో చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, వారి మాటలు నమ్మొద్దని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రజలను హెచ్చరించా రు. సంక్రాంతి ముందు గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు ఎన్నికల ముందు వచ్చేవాళ్ల మాటలతో మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ, బెంగళూరుల నుంచి వచ్చేవారు ఎన్నో ప్యాకేజీలు ప్రకటిస్తున్నారని, వాళ్లు చెప్పిన దానికంటే ఎక్కువ సంక్షేమ కార్యక్ర మాలు, బ్రహ్మాండమైన ప్యాకేజీ ఇచ్చే ఆలోచన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందని, ఆ విషయాల్ని ఆయనే త్వరలో ప్రకటిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ స్కీముల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్‌లో నిర్మించిన 1,800 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను కేటీఆర్ గురువారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘డబుల్’ లబ్ధిదారుల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు పేదలు, రైతులపై కేసీఆర్కున్న ప్రేమ దేశంలో మరెవ్వరికీ లేదని కేటీఆర్ చెప్పారు. ప్రగతి రథ చక్రాన్ని ఆపేందుకు ఇష్టమొచ్చినట్లుగా హామీలిస్తు న్న వారి మాటలు నమ్మి మోసపోవద్దని, పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఎలాంటి పక్షపాతం లేకుండా ఆన్లైన్ లాటరీ ద్వారా ఎంపిక చేశామని తెలిపారు. జగద్గిరిగుట్ట డివిజన్లోని కాంగ్రెస్ మహిళా అధ్యక్షు రాలు కౌసల్యకు, బీజేపీ నాయకురాలు సునీతకు కూడా ఇళ్లు వచ్చాయని చెప్పారు. తొలిదశలో అర్హులకు లక్ష ఇళ్లు ఇస్తుండగా, అర్హులైన మిగతా మూడున్నర లక్షల మందికి కూడా ఇచ్చే బాధ్యత తమదేనని అన్నారు. ఈ రోజుతో 30 వేల ఇళ్ల పంపిణీ పూర్తవుతుండగా, త్వరలోనే మిగతా 70 వేల ఇళ్లు కూడా అందజేస్తామన్నారు. లక్ష ఇళ్ల నిర్మాణా నికి ప్రభుత్వానికైన ఖర్చు దాదాపు రూ.10 వేల కోట్లయితే, మార్కెట్ రేటు ప్రకారం దాదాపు రూ. 50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల విలువైన ఆస్తిని పేదల చేతుల్లో పెడుతున్న ప్రభుత్వం తమదని కేటీఆర్ పేర్కొన్నారు. దుండిగల్‌కు త్వరలోనే కొత్త పరిశ్రమ రానుందని తెలిపారు. ఇలాంటి ఇళ్లు ఇంకెక్కడైనా ఉన్నాయా ? మన రాష్ట్రం కాక దేశంలో ఉన్న మరో 27 రాష్ట్రాల్లో, కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయేమో చూపిస్తారా? అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు. పేదలకు ఇలాంటి ఇళ్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేవని చెప్పారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అని పెద్దలు అంటారని, నిరుపేద ప్రజలకు ఇళ్లు కట్టించి, పెళ్లి చేయించి ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి మేనమామగా నిలిచారని పేర్కొన్నారు. చాయ్ అమ్ముకో.. దేశాన్ని మోసం చేయొద్దు ఇంటి పట్టా అందుకున్న ఒక మహిళను కేటీఆర్ ఏం చేస్తావంటూ ప్రశ్నించారు. ఆమె తాను చా య్ అమ్ముతానని చెప్పడంతో ‘చాయ్ అమ్ము కోవాలి.. కానీ దేశాన్ని మోసం చేయొద్దు’ అని అన్నారు. ఏమీ అర్థం కాక ఆమె తెల్లముఖం వేయడంతో.. ‘నీ గురించి కాదులే.. వేరేవా ళ్లు ఉన్నారు.. వారి గురించి చెబుతున్నా’ అంటూ పరోక్షంగా ప్రధాని మోదీని ప్రస్తావించారు. -
2023-24 ఏపీ సంక్షేమ పథకాల క్యాలెండర్.. షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరాతి: ‘2023-24 జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్’ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచార శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాది పొడవునా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తున్నామన్నది సంక్షేమ క్యాలెండర్ ద్వారా సీఎం ముందుగానే ప్రకటించారు. అందుకు అనుగుణంగా లబ్ధిని ప్రభుత్వం అందిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే సంక్షేమ పథకాల ద్వారా అందించిన లబ్ధి (డీబీటీ, నాన్ డీబీటీ) రూ. 2,96,148.09 కోట్లు. నెలల వారీగా ప్రభుత్వం అందజేయనున్న సంక్షేమ పథకాల వివరాలను సంక్షేమ క్యాలెండర్లో పొందుపరిచారు. ఆ వివరాలను గమనిస్తే... ►ఏప్రిల్ 2023- జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ ఈబీసీ నేస్తం ►మే 2023- వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ (మొదటి విడత), వైఎస్సార్ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన (మొదటి విడత), వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీ తోఫా (మొదటి త్రైమాసికం), వైఎస్సార్ మత్స్యకార భరోసా ►జూన్ 2023-జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ లా నేస్తం (మొదటి విడత), మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి ►జులై 2023-జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత), వైఎస్సార్ నేతన్న నేస్తం, ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు (మొదటి విడత), వైఎస్సార్ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ), వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీతోఫా (రెండో త్రైమాసికం) ►ఆగష్టు 2023-జగనన్న విద్యా దీవెన (రెండో విడత), వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ వాహనమిత్ర ►సెప్టెంబర్ 2023-వైఎస్సార్ చేయూత ►అక్టోబర్ 2023-వైఎస్సార్ రైతుభరోసా – పీఎం కిసాన్ (రెండవ విడత), జగనన్న వసతి దీవెన (మొదటి విడత) ►నవంబర్ 2023-వైఎస్సార్ సున్నావడ్డీ – పంట రుణాలు, వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీతోఫా (మూడవ త్రైమాసికం), జగనన్న విద్యాదీవెన (మూడవ విడత) ►డిసెంబర్ 2023-జగనన్న విదేశీ విద్యాదీవెన (రెండవ విడత), జగనన్న చేదోడు, మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి ►జనవరి 2024-వైఎస్సార్ రైతుభరోసా – పీఎం కిసాన్ (మూడవ విడత), వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు (రెండవ విడత), వైఎస్సార్ లా నేస్తం (రెండవ విడత), పెన్షన్ల పెంపు (నెలకు రూ. 3000) ►ఫిబ్రవరి 2024-జగనన్న విద్యా దీవెన (నాల్గవ విడత), వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీతోఫా (నాల్గవ త్రైమాసికం), వైఎస్సార్ ఈబీసీ నేస్తం ►మార్చి 2024-జగనన్న వసతి దీవెన (రెండవ విడత), ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు చదవండి: మా నమ్మకం నువ్వే.. ఏప్రిల్ 7 నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం -
అర్చకులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
సాక్షి, అమరావతి: అర్చకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అర్చక సంక్షేమంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్చకులకు వంద శాతం వైద్య ఖర్చులు తిరిగి చెల్లింపునకు నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. తక్షణమే అమల్లోకి వచ్చేలా అధికారులను మంత్రి ఆదేశించారు. అర్చకుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, అర్చకులకు వంద శాతం వైద్య ఖర్చులు చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. దీని ద్వారా అర్చకులకు మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు. చదవండి: కోల్డ్ స్టోరేజ్ నేతలంతా చేరి ప్రభుత్వంపై విమర్శలా: అమర్నాథ్ -
మడమ తిప్పని వ్యక్తిత్వం.. పాలనలో సంక్షేమం
సాక్షి వెబ్‌డెస్క్: 12 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమారునిగా మాత్రమే వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ తెలుసు. ‘నన్ను అణచివేయాలని చూస్తే పడిలేచిన కడలి కెరటంలా పైకి ఎగసిపడతాను. గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంతో తిరిగి వస్తాను’ అన్న జగన్ ఆ మాటల్ని నిజం చేసుకున్నారు. ఎన్నో సవాళ్లు ఆటుపోట్లు ఎదురైనా ప్రజా సేవే పరమావధిగా మొక్కవోని విశ్వాసంతో సీఎం వైఎస్ జగన్ ముందడుగు వేస్తున్నారు. ఆత్మవిశ్వాసమే ఆయువుగా దేశంలోనే ఆదర్శ సీఎంగా ఎదిగారు. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, తప్పుడు ప్రచారాలు, గత టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు ఎదుర్కొని పోరాట యోధుడిగా ఎదురు నిలిచి అకుంఠిత దీక్షకు సంకేతంగా మారారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ స్వచ్ఛమైన పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రజలకిచ్చిన మాట కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, పరిస్థితులు సహకరించపోయినా.. సంకల్పబలంతో ముందుకుసాగుతున్నారు. రెండున్నరేళ్లలో దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా పరిపాలన సాగిస్తున్నారు. ఒక వైపు కరోనా వంటి విపత్కర పరిస్థితులు.. ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం చేస్తూనే, మరోవైపు సంక్షేమాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నారు. విలువలకు కట్టుబడి.. 2009లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా.. సీఎం జగన్ ఇష్టపడలేదు. విలువలకే కట్టుబడ్డారు. 2009 సెప్టెంబర్ 2న వైఎస్సార్ హఠాన్మరణంతో. నాడు దాదాపుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా వైఎస్ జగన్ సీఎం కావాలని సంతకాలు చేశారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వద్దామని కొందరు ఆయనకు సూచించారు. కానీ ఆయన సమ్మతించలేదు. తన తండ్రి రెక్కల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చబోనని వైఎస్ జగన్ రాజకీయ విలువలకు కట్టబడ్డారు. ఓదార్పు యాత్ర.. ఇచ్చిన మాట కోసం పార్టీకి రాజీనామా చేయడమే కాదు. ఎంపీ పదవిని సైతం వైఎస్ జగన్ తృణప్రాయంగా వదిలేశారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కడప స్థానం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. తన తండ్రి, దివంగత మహానేత వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన అభిమానుల కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర ప్రారంభించారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకపోవడంతో ప్రజలకు ఇచ్చిన మాట కోసం పార్టీని వీడారు. మాటకు కట్టుబడి ఓదార్పు యాత్ర చేశారు. బాధితులను పరామర్శించి అండగా ఉంటానని వారికి కొండంత భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం.. రాజన్న ఆశయాల సాధనే లక్ష్యంగా 2011 మార్చి 12న వైఎస్ జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన కొద్దినెలలకే 2011 కడప పార్లమెంట్ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి 5,45,672 ఓట్ల అఖండ మెజార్టీతో రికార్డు విజయం సాధించారు. కుట్రపూరితంగా.. రాజన్న ఆశయాలను నీరుగార్చిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఎన్నో పోరాటాలు చేశారు. రైతు దీక్ష, జలదీక్ష, విద్యార్థి దీక్ష, చేనేత దీక్ష ధర్నాలతో ఉద్యమించారు. ఆయనను అడ్డుకునేందుకు అప్పటి అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కుమ్మక్కై కుట్రపూరితంగా వ్యహరించి అక్రమ కేసులు బనాయించారు. టీడీపీ అవినీతిపై పోరాటం.. 2014 ఎన్నికల అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మాణాత్మక పాత్ర పోషించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడారు. టీడీపీ ప్రభుత్వం అవినీతి, అసమర్థతకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈక్రమంలోనే రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా టీడీపీ ఎన్నో కుట్రలు పన్నింది. 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభపెట్టి చంద్రబాబు టీడీడీలో చేర్చుకున్నారు. ప్రజా సంకల్పయాత్ర.. అవినీతి, అసమర్థ పాలనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మార్చేందుకు వైఎస్ జగన్ చారిత్రాత్మక ప్రజా సంకల్పయాత్ర చేపట్టారు. ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్సార్ సమాధివద్ద 2017 నవంబర్ 6న పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాలగుండా సాగిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ నడక సాగించారు. ముఖ్యమంత్రిగా.. 2019 మే 30న నవ్యాంధ్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. అపూర్వ ప్రజా మద్దతుతో 151 అసెంబ్లీ సీట్లు సాధించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా సంక్షేమ రథ సారథిగా, అభివృద్ధి కాముకుడిగా పాలన సాగిస్తున్నారు. -
నవరత్నాలతో ప్రతీ ఎస్సీ కుటుంబానికి లబ్ధి.. అసెంబ్లీలో మంత్రి విశ్వరూప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతీ ఎస్సీ కుటుంబానికి నవ రత్నాల ద్వారా లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ సంక్షేమంపై స్వల్ప కాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నామన్నారు. అమ్మ ఒడి అద్భుతమైన పథకం. ఏడాదికి రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు. చదవండి: తమాషా చేస్తున్నావా?.. డ్యూటీ అంటే లెక్కలేదా? వైఎస్సార్ చేయూత ద్వారా ఐదేళ్లలో రూ.75 వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం. 5 లక్షల మంది లబ్ధిదారులకు వైఎస్సార్ చేయూతతో లబ్ధి చేకూరుతుంది. ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం రాష్ట్రంలో 1070 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. దాదాపు లక్ష మంది ఎస్సీ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు. -
ఏపీలో ఆర్థికంగా వెనుకబడినవారి కోసం కొత్త సంక్షేమ శాఖ
-
అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖ
-
AP: అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖ
సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ఈడబ్ల్యూఎస్ సంక్షేమ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఈ శాఖ పరిధిలోకి కమ్మ,రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్య వైశ్య కార్పొరేషన్లు రానున్నాయి. అలాగే జైన్ల సంక్షేమానికి, సిక్కుల సంక్షేమానికి వేర్వేరు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ రెండు జీవోలను జారీ చేసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. (చదవండి: Rain Alert: ఏపీలో భారీ వర్షాలు) -
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పాలన
సాక్షి, విశాఖపట్నం: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీవీఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. విశాఖలో వెయ్యి పార్కులను, 216 చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు. 794 మురికివాడలను అభివృద్ధి చేసి ఇళ్ల పట్టాలు ఇస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఇవీ చదవండి: చంద్రబాబు, లోకేష్‌లకు మతి భ్రమించింది: జూపూడి విద్యార్థి మృతిపై లోకేశ్ తప్పుడు ప్రచారం -
e-Shram: కార్మికులకు అండగా ఇ-శ్రమ్
అసంఘటిత రంగంలో అనామకంగా ఉండిపోయిన కార్మికలకు అండగా నిలించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది. సంక్షేమం, ఉపాధి, ప్రభుత్వ పథకాలు తదితర అంశాల్లో కార్మికులకు సహాయకారిగా ఉండేందుకు ఇ శ్రమ్ పేరుతో పోర్టల్‌ని ప్రారంభించనుంది. ఎంతమంది కార్మికులు భారత దేశంలో అసంఘటిత రంగంలో దాదాపు 38 కోట్ల మంది కార్మికులు ఉన్నట్టు అంచనా. కోవిడ్ సంక్షోభం సమయంలో లాక్డౌన్ విధించినప్పుడు వీరంతా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఊరుకాని ఊరిలో ఇటు యజమానులు, అటు ప్రభుత్వ మద్దుతు సరైన సమయంలో అందక ఇక్కట్ల పాలయ్యారు. దీంతో ఇటు పౌర సమాజం, అటు న్యాయస్థానాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అసంఘటిత కార్మికులు ఎంత మంది ఉన్నారు, సంక్షేమ పథకాలు ఎలా అందించాలనే అంశంపై నిర్థిష్ట కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. ఇ-శ్రమ్ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమం లక్ష్యంగా కేంద్రం ఆగస్టు 26న ఇ శ్రమ్ వెబ్ పోర్టల్‌ని అందుబాటులోకి తేనుంది. ఆధార్‌కార్డు ఆధారంగా కార్మికులు తమ వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల అసంఘటిత రంగంలో ఎంత మంది కార్మికులు ఉన్నారు. వీరిలో నిర్మాణ రంగం, వలస కార్మికులు, వీధి వ్యాపారులు ఇలా కేటగిరిల వారీగా ఎంత మంది ఉన్నారనే సమాచారం ప్రభుత్వానికి అందుతుంది. అదే విధంగా ఆయా కేటగిరిల కింద ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కార్మికులకు అందించే వీలు కలగనుంది. ఒకే గొడుకు కిందికి ఇ శ్రమ్ పోర్టల్ అందుబాటులోకి రావడం వల్ల ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్మిక సంఘాలు కూడా ఒకే గొడుకు కిందకు వచ్చే అవకావం ఉంది. దీని వల్ల కార్మికుల సమస్యల వెలుగులోకి రావడంతో పాటు సమస్యల పరిష్కారం సైతం త్వరగా జరిగేందుకు వీలు ఏర్పడనుంది. ఆగస్టు 26న పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. కార్మికుల కోసం హెల్ప్‌లైన్ ఇ శ్రమ్ వెబ్ పోర్టల్‌తో పాటు అసంఘటిత కార్మికుల కోసం కార్మిక శాఖ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయనుంది. అందులో భాగంగా 14434 నంబరును దేశవ్యాప్తంగా కార్మికులకు అందుబాటులోకి తేనుంది. చదవండి: JioMeet : ఆన్లైన్ క్లాసుల కోసం జియోమీట్.. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో -
నిన్న రోడ్డెక్కిన తండ్రి.. నేడు చెట్టెక్కిన కొడుకు
హుస్నాబాద్: తండ్రీకొడుకులు రోడ్డెక్కారు. ఆకలిబాధతో అలమటిస్తున్నానని తండ్రి అంటుండగా, అదేం కాదు, అనవసరంగా బద్నాం చేస్తున్నాడని కొడుకులు అంటున్నారు. తండ్రి నిరాహారదీక్ష చేపట్టగా, తండ్రి వైఖరిని నిరసిస్తూ కొడుకు చెట్టెక్కి ఆందోళన చేపట్టాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో చర్చనీయాంశమైంది. హుస్నాబాద్ పట్టణానికి చెందిన కొత్తకొండ స్వామికి ఇద్దరు కొడుకులు. కొడుకులను పెంచి పోషించి ప్రయోజకులుగా చేసి, ఆస్తులు కూడబెట్టి ఇచ్చినా.. బుక్కెడు బువ్వ పెట్టడం లేదని తండ్రి ఆదివారం ఆమరణ దీక్ష చేట్టారు. ఈ నేపథ్యంలో తమను కావాలనే అభాసుపాలు చేస్తున్నాడని పెద్ద కొడుకు సంతోష్ తమ ఇంటి ముందున్న చెట్టెక్కాడు. విషయం తెలుసుకుని వచ్చిన ఎస్ఐ శ్రీధర్ సర్దిచెప్పడంతో సంతోష్ కిందికి దిగివచ్చాడు. స్వామి, ఆయన కొడుకులు సంతోష్, సుధాకర్‌ను పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఆస్తి పంపకాలు, ఇతర సమస్యలను తామే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని ఒప్పుకున్నారని ఎస్ఐ తెలిపారు. -
4 కోట్ల ఆస్తులు: బుక్కెడు బువ్వ పెట్టరూ..
హుస్నాబాద్: కొడుకులను పెంచి ప్రయోజకులను చేస్తే అప్పులు అంటగట్టడమే కాకుండా కనీసం బు క్కెడు బువ్వ కూడా పెట్టడం లేదంటూ రూ. 4 కోట్ల ఆస్తులున్న ఓ తండ్రి పడుతున్న ఆవేదనకు అద్దం పట్టే చిత్రమిది. అన్నం వండుకోవడానికి కూడా చేత కాని పరిస్థితుల్లో ఉన్న తనకు తిండి పెట్టాలని బతిమిలాడినా పట్టించుకోవడం లేదంటూ ఓ పెద్దా యన ఆమరణ దీక్షకు దిగిన వైనమిది. సిద్దిపేట పట్టణానికి చెందిన కొత్తకొండ స్వామి అనే వృద్ధు డు తన కుమారులైన సంతోశ్, సుధాకర్ల మనసు కరగాలని ఆదివారం రాత్రి వారి ఇంటి ముందు బ్యానర్ కట్టుకొని ఇలా నిరశనకు దిగాడు. కౌలురైతు ఆత్మహత్యాయత్నం కోనరావుపేట: కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యం వర్షంలో తడిసి మొలకెత్తడంతో ఓ కౌలు రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆసరి అంజయ్య కొంత భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. పండిన ధాన్యాన్ని సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో కొద్దిరోజుల క్రితం పోశాడు. కొనుగోళ్లలో జాప్యం జరగగా.. ఇటీవల కురుస్తున్న వర్షాలకు అతని ధాన్యం తడిసి మొలకెత్తింది. దీం తో ఆ ధాన్యాన్ని కొనుగోలు చేస్తారో లేరోనని ఆందోళన చెందిన అంజయ్య క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కొనుగోలు కేంద్రం సిబ్బందిని వివరణ కోరగా.. ధాన్యాన్ని తూర్పారబడితే తూకం వేస్తామని సదరు రైతు కుమారుడికి సమాచారం ఇచ్చామని, అయినా ఆ రైతు రాకపోవడంతో తూకం వేయలేదని సమాధానమిచ్చారు. చదవండి: త్వరలో డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ -
2 years YSJagan ane nenu: అక్కాచెల్లెమ్మలకు అండగా
వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఉన్న మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం గత రెండేళ్లలో ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తోంది. రెండేళ్లలో మహిళ స్వాలంబన, సంక్షేమం మీద రూ. రూ.88,040.29 కోట్ల ధనం వెచ్చించింది. రికార్డు స్థాయిలో 4.36 కోట్ల మంది మహిళాలకు మేలు జరిగింది. వైఎస్సార్ ఆసరా వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా తొలి విడతగా గతేడాది రూ. 6,310 కోట్లను ప్రభుత్వం అందచేసింది. ఈ సొమ్ము 77,75,681 మంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో పడ్డాయి. ప్రభుత్వం చెల్లించిన డబ్బులు ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దాని మీద ఎటువంటి షరతులు విధించలేదు.ప్రభుత్వం అందించిన సొమ్మును ఇష్టం వచ్చిన అవసరాలకు లేదా వ్యాపారాలకు ఉపయోగించుకోవచ్చని సీఎం జగన్ సూచించారు. అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు, వ్యాపారవేత్తలుగా మారి స్వావలంబన సాధించడం కోసం ఇప్పటికే ప్రభుత్వం P&G, ఐటీసీ, హెచ్‌యూఎల్, అమూల్, అల్లన లాంటి దిగ్గజ సంస్థలతో, వివిధ బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం (మహిళలు) బ్యాంకుల నుంచి రుణం తీసుకుని సకాలంలో వాయిదాలు చెల్లించిన పొదుపు సంఘాలను ప్రోత్సహించాలని సీఎం జగన్ నిర్ణయించారు. సకాలంలో రుణం చెల్లించిన సంఘాలకు ఆ రుణంపై వడ్డీ మొత్తాన్ని వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తోంది. దీంతోపాటు 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి వరకు 90,37,255 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.1,400 కోట్ల వడ్డీ బకాయిలు కూడా వారి తరపున ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించింది. ఈ ప్రభుత్వంపై నమ్మకం బలపడటంతో స్వయం సహాయక సంఘాల సంఖ్య 8.71 లక్షల నుంచి 9.34 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం ఈ సంఖ్య 1.11 కోట్లకు చేరింది. ఇప్పటివరకు ఈ పథకం క్రింద 98,00,626 మంది మహిళా పొదుపు సంఘాల సభ్యులకు మొత్తం రూ.2,354.22 కోట్లు లబ్ది చేకూరింది. వైఎస్సార్ చేయూత మహిళల ఆర్థిక స్వావలంబనకు, వారి పిల్లల చదువులు మరియు వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ,. బీసీ, మైనారిటీ మహిళలకు ఏటా రూ.18,750 ల చొప్పున ఆర్థిక సాయం ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. చేయూత సాయంతో ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 69,000 షాపులు కొత్తగా ఏర్పాటయ్యాయి. 2021 ఏప్రిల్ నాటికి వైఎస్సార్ చేయూత పథకం క్రింద 24,55,534 మంది మహిళల ఖాతాల్లో రూ.4,604.13 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. వైఎస్సార్ కాపు నేస్తం 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్న పేద కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల పేద అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా ఏటా రూ.15,000 ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటివరకు 3,27,862 మంది మహిళలకు రూ.491.79 కోట్ల ఆర్థిక సాయం అందించడం జరిగింది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని సీఎం జగన్ అమల్లోకి తెచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఇదే పనికి సగటున ఏడాదికి రూ.500 కోట్లు మాత్రమే కేటాయిస్తే.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా నాలుగు రెట్లు ఎక్కువగా రూ.1,863.13 కోట్లు ప్రస్తుత ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. తద్వారా 30,16,000 మంది అక్కచెల్లెమ్మలు, చిన్నపిల్లలు లబ్ది పొందుతున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయసున్న ఆర్థికంగా వెనుకబడి ఉన్న బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలందరికీ వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా అర్హులైన మహిళకు ఏడాదికి రూ. 15,000 ప్రభుత్వం సాయం అందిస్తుంది. ఈ పథకం ద్వారా 4 లక్షల మంది లబ్ది పొందనున్నారు. జగనన్న జీవ క్రాంతి జగనన్న అమూల్ పాలవెల్లువ పథకం క్రింద ఆవులు, గేదెలకు సంబంధించి 1.12.008యూనిట్లను కొనుగో చేయించింది. మేకలు /గొర్రెలకు సంబంధించి ప్రభుత్వం 72,179 యూనిట్లు కొనుగోలు చేయించి మహిళలకు ఆదాయం పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మహిళా సంక్షేమం విషయంలో మైలు రాళ్లు - గతాన్ని భిన్నంగా రాష్ట్ర కేబినేట్లో ఒక మహిళకు ఉప ముఖ్యమంత్రిగా, మరో మహిళకు హోంశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. - స్థానిక సంస్థలలో మహిళలకు 61 శాతం పదవులు కేటాయించి అత్యధిక ప్రాధాన్యత సీఎం జగన్ కల్పించారు. - మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చి నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. - గ్రామ/వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్ల నియామకం చేపట్టారు. - కుటుంబాల్లో సుఖశాంతులు నింపేందుకు మద్య నియంత్రణ అమలు - రూ. 27,000 వేల కోట్ల ఖర్చుతో 30,76,000 ఇళ్ల పట్టాల పంపిణీ. మహిళల పేరు మీదే ఇళ్ల రిజిస్ట్రేషన్లు - వైఎస్సార్ లా నేస్తం ద్వారా 721 మందికి రూ.3.21 కోట్లు ఖర్చు చేశారు - జగనన్న విద్యా దీవెన కింద 10,88,439 మంది తల్లుల ఖతాల్లో రూ.2,477.89 కోట్లు జమ - జగనన్న వసతి దీవెన ద్వారా 15,56,956 మంది తల్లులకు రూ.2,269.93 కోట్లు అందచేత - జగనన్న చేదోడు కింద 1,36,340 మంది అక్కచెల్లెమ్మలకు రూ.136.64 కోట్లు అందించిన ప్రభుత్వం - జగనన్న గోరుముద్ద పథకం ద్వారా 18,20,196 మంది బాలికలకు రూ.789.54 అందచేత - జగనన్న విద్యాకానుక పథకం ద్వారా 21,86,972 మంది బాలికలకు రూ. 334.61 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం -
అన్ని రంగాల్లో దూసుకుపోతున్న నారీమణులు!
ఒకప్పుడు అమ్మాయి పుట్టిందంటే మైనస్ అని భావించేవారు..చదువుల్లో, ఇతర రంగాల్లో వారికి అవకాశాలు తక్కువగా ఉండేవి. సమాజంలో ‘అబల’ అనే వివక్షను సైతం ఎదుర్కొనేవారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. వివిధ పథకాల అమలులో తరుణీమణులకు పెద్ద పీట వేయడంతో వారిజీవితాలు మెరుగుపడ్డాయి. అవకాశాల్లో సగ భాగం కల్పించడంతో పలు రంగాల్లో మగవారికి దీటుగా రాణిస్తున్నారు. ఆర్థిక స్వావలంబన దిశగా దూసుకుపోతున్నారు. నేడు (సోమవారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. కర్నూలు: మహిళాభ్యున్నతి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. స్త్రీనే ఇంటి యజమానురాలిగా మార్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ పథకాలు అమలు చేస్తున్నారు. చట్ట సభల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టు పనులు.. ఇలా అనేక వాటిలో సగం మహిళలకే కేటాయించారు. వివక్ష లేకుండా మహిళలకు విద్య, వైద్యం అందించడంతోపాటు వారి సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చి అతివల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచారు. బాలికా సంరక్షణ.. జిల్లాలో బాలికల సంరక్షణ యూనిట్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా 18 ఏళ్లలోపు వయస్సు ఉన్న అమ్మాయిలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి చూపుతున్నారు. ఆపైన వయస్సు ఉన్న మహిళలకు కూడా వివిధ సహాయ సహకారాలు అందిస్తున్నారు. లింగ నిర్ధారణ, భ్రూణ హత్యల నివారణకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరేళ్ల వయస్సులోపు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. బాలికా సంరక్షణ కేంద్రం ద్వారా అనాథ, సొంతవాళ్లు లేనివాళ్లను చేరదీసి పోషిస్తున్నారు. దత్తత కేంద్రం ద్వారా పిల్లలను 5వ తరగతి వరకు అక్కడే చదివిస్తున్నారు. 6 నుంచి కేజీబీవీ విద్యా సంస్థల్లో చదివించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం దత్తత ఇస్తున్నారు. దిశ వన్ స్టాప్ సెంటర్ హింస, వేధింపుల నుంచి ఆడ పిల్లలకు రక్షణ కల్పించేందుకు దిశ వన్‌స్టాప్ సెంటర్‌ను కర్నూలులో ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ఎస్ఐ, ఏఎస్ఐ, గైనకాలజీ, ఫొరెన్సిక్, ఆర్ఎంఓ వైద్యులను కేటాయించారు. ఒక దుర్ఘటన జరిగితే ఆడపిల్లలు పోలీస్, లాయర్లు, డాక్టర్లు చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఒకే చోట సేవలన్నీపొందే వీలు కల్పించారు. అలాగే కిశోర బాలికల కోసం వైఎస్సార్ కిశోర వికాసం పథకాన్ని తీసుకొచ్చారు. ఇందులో తొమ్మిది రకాల సేవలు అందిస్తున్నారు. పౌష్టికాహారం అందించడం, బాల్య వివాహాలను అరికట్టడం, బాల కారి్మక వ్యవస్థను నిర్మూలించడం, బాలికల అక్రమ రవాణాను అడ్డుకోవడం ఈ పథకం ప్రధాన ఉద్దేశాలు. ఈ పథకం కింద సలహాలు, సూచనలు అందిస్తారు. జిల్లాలో 3,126 మంది మహిళలు కిరాణా దుకాణాలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 2,399 కిరాణా దుకాణాలకు రూ. 8.03 కోట్లరుణాలు మంజూరు చేసింది. అలాగే 675 మంది మహిళలకు గొర్రెలు, మేకల యూనిట్లు ఇప్పించింది.విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా అమ్మ ఒడి పథకం కింద జిల్లాలో 4,12,884 మంది తల్లుల బ్యాంక్ ఖాతాలకు ప్రతి ఏడాది రూ.15వేలు చొప్పున ప్రభుత్వం నగదు జమ చేస్తోంది. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం 2.42లక్షల మంది బాలింతలకు, అలాగే 1.92 లక్షల మంది పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. సాయం కోసం ఫోన్ నంబర్లు.. స్త్రీ, శిశు సంరక్షణ కోసం ఉచిత ఫోన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 181 (ఉమెన్), 1098 (చైల్డ్ ), 112, 100, 1091, 08518–255057(పోలీసు సహాయం కోసం) 24గంటలూ పనిచేస్తాయి. -
ఆదివాసీల అభివృద్ధికి కృషి: అప్పలరాజు
సాక్షి, శ్రీకాకుళం: ఆదివాసీల సంక్షేమం కోసం అన్ని విధాల కృషి చేస్తామని పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని కాశీబుగ్గ జీఎంఈ కాలనీలోని తన కార్యాలయం వద్ద ఆదివాసీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మన రాష్ట్ర జనాభాలో 5.2 శాతం ఆదివాసీలు ఉన్నారని.. వారి సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసుకునే విధంగా ఈ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. (వైఎస్ జగన్ ఎప్పుడూ గుర్తు చేస్తుంటారు) గిరిజనుల అభివృద్ధి కోసం నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ లక్షా ముప్పై వేల ఎకరాల భూ పట్టాలు ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఆదివాసీల అభ్యున్నతికి పాటు పడుతున్నారని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. -
కౌలు చేలల్లో.. సంక్షేమ ఫలాలు
పంటల సాగుకు అందించే సంక్షేమ ఫలాలు కౌలు రైతులకు దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సీసీఆర్సీ(క్రాప్ కల్టివేటర్ రైట్స్ సర్టిఫికెట్) (పంట సాగు హక్కు) పత్రం పొందిన ప్రతి కౌలు రైతుకూ ఇకపై సంక్షేమ ఫలాలు అందనున్నాయి. ఇందుకు గాను లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను వ్యవసాయ, రెవెన్యూ శాఖలు ప్రారంభించాయి. చిత్తూరు అగ్రికల్చర్ : జిల్లాలో ఏటా వ్యవసాయ, ఉద్యాన పంటలు దాదాపు 2.70లక్షల హెక్టార్లలో సాగవుతాయి. అందులో వ్యవసాయ పంటలు 2.20 లక్షల హెక్టార్లు, పడమటి మండలాల్లో అత్యధికంగా టమాట సుమారు 50వేల హెక్టార్లలో సాగవుతుంది. వర్షాధార పంటగా వేరుశనగ లక్ష హెక్టార్లకు పైబడి సాగు చేస్తారు. ఈ పంటల్లో 40 శాతం మేరకు కౌలు రైతులు సాగు చేస్తుండడం గమనార్హం. గతంలో పంటల సాగులో ఎలాంటి నష్టం వచ్చినా కౌలు రైతులు భరించాల్సిందే. నష్టం వచ్చినా భూములిచ్చినందుకు యజమానులకు మాత్రం ఒప్పందం మేరకు దిగుబడి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అదేగాక ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టి కారణంగా పంట నష్టానికి ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం కూడా భూ యజమానులకే దక్కేది. ఫలితంగా కౌలు రైతులకు ఎలాంటి సంక్షేమ ఫలమూ అందే పరిస్థితి ఉండేది కాదు. తద్వారా కౌలు రైతులు నష్టాలను చవిచూడడమే గాకుండా ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఉండేది. కౌలు రైతులకు పెద్దపీట వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల శ్రేయస్సు కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. కౌలు రైతులను కూడా అన్ని విధాలా ఆదుకునేందుకు చర్యలు చేపడుతోంది. అర్హత ఉన్న ప్రతి కౌలు రైతుకూ రైతు భరోసాతో పాటు అన్ని రకాల సంక్షేమ ఫలాలు, బ్యాంకు నుంచి పంట రుణాలను కూడా అందించనుంది. ఇందుకోసం ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులను గుర్తించే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. గుర్తింపు ఇలా.. జిల్లాలో కౌలు రైతులను గుర్తించేందుకు వ్యవసాయ, రెవెన్యూ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నాయి. సాగవుతున్న పంటలను వ్యవసాయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడతారు. ఎవరైనా కౌలుకు పంటలు సాగు చేస్తుంటే గుర్తించి వారికి కౌలు సర్టిఫికెట్ పొందడానికి అర్హతలను తెలియజేస్తారు. భూయజమాని సమ్మతిస్తే వారి సహకారంతో సీసీఆర్సీ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకుంటారు. దీన్ని వీఆర్వో పరిశీలించి, భూ యజమాని సమ్మతితో పంట సాగుదారు అర్హత పత్రం కోసం తహసీల్దార్‌కు ప్రతిపాదిస్తారు. ఈ ప్రతిపాదన మేరకు తహసీల్దార్ సీసీఆర్సీ మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ఇప్పటికి జిల్లాలో గతేడాది 1,194 మందిని గుర్తించారు. ఈ ఏడాది రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాక మే 16 నుంచి ఇప్పటివరకు 29 మందిని గుర్తించి, పత్రాలను అందించారు. ఈ సంఖ్యను మరింత పెంచాలన్న ఉద్దేశంతో ప్రతి కౌలు రైతునూ గుర్తించే పనిలో వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతి రైతుభరోసా కేంద్రం పరి ధిలో కనీసం ఐదుగురు కౌలు రైతులను గుర్తించే ప్రక్రియను ముమ్మరం చేశారు. సంక్షేమ ఫలాలు ఇలా.. ఈ ఖరీఫ్ సీజన్‌కు సాగవుతున్న పంటలను రైతుల వారీ వ్యవసాయ శాఖ సిబ్బంది ఈ–క్రాప్ బుకింగ్ చేపట్టనుంది. అదే సమయంలో సీసీఆర్సీ పత్రం ఉన్న కౌలు రైతులు సాగు చేసిన పంటలను కూడా వారి పేరున నమోదు చేస్తారు. ఈ విధంగా నమోదైన పంటలకు నష్టం వాటిల్లినప్పుడు ప్రభుత్వం అందించే పరిహారం, బీమా తదితరాలు నేరుగా కౌలు రైతులకే అందుతుంది. అదేగాక వారికి బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందే వెసులుబాటు కూడా కల్పిస్తుంది. రైతు భరోసాకు అర్హత ఇలా.. కౌలు రైతులు కూడా రైతు భరోసా కింద ముందస్తుగా పంటలకు పెట్టుబడి నిధిని పొందే విధంగా చర్యలు తీసుకుంది. ఇందుకుగాను కనీసం 2.5 ఎకరాల పైబడి భూమి ఉన్న యజమానుల నుంచి భూములను కౌలుకు తీసుకుని ఉండాలి. ఈ విధంగా కౌలు తీసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సొంత భూములు లేకుండా ఉన్న వారు రైతు భరోసాకు అర్హత పొందుతారు. -
కార్మికుల సంక్షేమమే సీఎం వైఎస్ జగన్ ధ్యేయం
-
వృద్ధుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..
సాక్షి, విజయనగరం: వయో వృద్ధుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అన్నారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయనగరం జిల్లా ఏరియా ఆసుపత్రిలో వృద్ధుల వార్డును డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృద్ధులకు అన్ని విధాలుగా చేయూతనందించే దిశగా చర్యలను చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వం ఇస్తున్న పింఛను మొత్తాలను పెంచడంతో పాటుగా.. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక వైద్యసేవలను అందించనున్నామని వెల్లడించారు. పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో 60 ఏళ్లు దాటిన వృద్ధుల కోసం 10 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ వార్డులో వయో వృద్ధులకు ప్రత్యేకంగా పడకలను కేటాయించి అవసరమైన చికిత్సలను అందిస్తామని తెలిపారు. సేవలను సీనియర్ సిటిజన్లు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, అధికారులు పాల్గొన్నారు -
మహానేత స్ఫూర్తితో శ్రేయోదాయక బడ్జెట్
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలు, వైఎస్సార్సీపీ సిద్ధాంతాలను ప్రతిబింబిస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా శ్రేయోదాయకమైన బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో స్వయంగా చూసిన ప్రజల కష్టాలను తీర్చేందుకు, పేదల కన్నీళ్లను తుడిచేందుకు మార్గాన్ని సుగమం చేసేలా బడ్జెట్ ఉందని ఆయన ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌పై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర స్ఫూర్తి బడ్జెట్లో ప్రతిఫలించిందన్నారు. ఏడ్చే బిడ్డను తల్లి తన ఒడలోకి తీసుకుని ఎలా ఓదారుస్తుందో అదే విధంగా అక్షరాస్యతకు దూరంగా ఉన్న పిల్లలను సీఎం వైఎస్ జగన్ తన ఒడిలోకి తీసుకుని వారికి విద్యను అందించడానికి అమ్మ ఒడి పథకాన్ని రూపొందించారన్నారు. ప్రభుత్వం రూ.28 వేల కోట్లతో ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్‌తో, రైతు భరోసా పథకంతో రాష్ట్రంలోని రైతులకు ధైర్యం వచ్చిందని చెప్పారు. కౌలు రైతుల గురించి ఆలోచించిన మొట్టమొదటి సీఎం వైఎస్ జగన్ అని ప్రశంసించారు. పేదలకు ఇళ్లు నిర్మించేందుకు భూసేకరణ కోసం బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించడం రాష్ట్రంలో గొప్ప మార్పు తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకు ఓడారో బాబుకు తెలీదట 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఏనాడైనా ప్రజలను సమ దృష్టితో చూశారా అని ధర్మాన సూటిగా ప్రశ్నించారు. ప్రజల్ని పౌరులుగా కాకుండా ఓటర్లుగానే చూసి పాలించారని ఆయన విమర్శించారు. పసుపు చొక్కా వేసుకుంటేనే పథకాలు అందిస్తామన్నదే ఆయన సిద్ధాంతమని దుయ్యబట్టారు. బడ్జెట్ వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలా ఉందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి విమర్శించడాన్ని ఆయన తిప్పికొట్టారు. ‘అవును మా బడ్జెట్ వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలానే ఉంది. అందులో తప్పేముంది? బడ్జెట్ పార్టీ మేనిఫెస్టోలానే ఉండాలి. అందులో ఉన్న హామీలను చూసి ప్రజలు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించారు. అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోలోని హామీలనే అమలు చేయాలి.లేకపోతే ప్రజల్ని మోసం చేసినట్లు అవుతుంది. చంద్రబాబు అయితే మేనిఫెస్టోలో అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేసి ప్రజల్ని మోసగించారు’ అని ధర్మాన పేర్కొన్నారు. చంద్రబాబు గత ఐదేళ్లలో అప్పులు పెంచడం తప్ప చేసిందేమీ లేదన్నారు. అందుకే ప్రజలు ఓడించి వారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. అయితే చంద్రబాబు మాత్రం తాను ఎందుకు ఓడిపోయానో తెలియట్లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. -
ప్రభుత్వ ఉద్ధేశం స్పష్టంగా ఉండాలి
-
హామీలకు చట్టబద్ధత
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో 60 శాతం మేర నెల రోజుల్లోనే అమల్లోకి తీసుకువచ్చి తన చిత్తశుద్ధిని, ఇచ్చిన మాటపై నిలబడటాన్ని చాటి చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి.. ఇప్పుడు ఆ హామీల్లోని పలు అంశాలకు 40 రోజుల్లోనే చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధం చేశారు. గురువారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ సమావేశాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొత్తం 12 బిల్లులను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి చట్టబద్ధత కల్పించాలనే విషయమై మంగళవారం ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో సుమారు మూడు గంటలకు పైగా సుదీర్ఘ కసరత్తు చేశారు. ఆయా బిల్లులపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎటువంటి పొరపాట్లు లేకుండా ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని, న్యాయ శాఖతో సమన్వయంతో బిల్లులను రూపొందించాలని చెప్పారు. ఆయా బిల్లులపై మంత్రులు, అధికార సభ్యులు పూర్తి అవగాహనతో ఉండాలని స్పష్టం చేశారు. కొత్తగా చట్టాలను తీసుకురావడంతో పాటు, ఇదివరకు చేసిన చట్టాల్లో సవరణల కోసం ఉద్దేశించిన బిల్లులు ఇప్పటికే తుదిరూపు దిద్దుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమావేశం అయ్యారు. మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ బిల్లులు రూపొందబోతున్నాయి. ప్రభుత్వ ఉద్ధేశం స్పష్టంగా ఉండాలి అంతకంతకూ పెరిగిపోతున్న స్కూలు, కాలేజీ ఫీజులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సామాజిక వేత్తల నుంచి వైఎస్ జగన్ 14 నెలల సుదీర్ఘ పాదయాత్ర సమయంలో పెద్ద ఎత్తున అర్జీలు, ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటి నియంత్రణ, పర్యవేక్షణకు చేయనున్న చట్టం కట్టుదిట్టంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కౌలు రైతులు, శాశ్వత బీసీ కమిషన్.. నామినేటెడ్ పదవులు, పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం తదితర అంశాలపై రూపొందించే చట్టాల విషయమై ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రతి బిల్లులో ప్రభుత్వ ఉద్దేశాలు, తీసుకురాబోతున్న చట్టాల వల్ల ప్రజలకు ఏవిధంగా ప్రయోజనం కలగబోతుందన్న అంశాలను స్పష్టంగా పేర్కొనాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన బిల్లుల వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా ఉపాధికి ఊతం పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పించే దిశగా చట్టాన్ని తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో మాట్లాడారు. ఈ చట్టం పకడ్బందీగా ఉండాలని, ఎటువంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా జాగత్రలు తీసుకోవాలని చెప్పారు. పాదయాత్ర సమయంలో ఈ విషయంపై వైఎస్ జగన్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ చట్టం కార్యరూపం దాలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంచి రోజులు ఇప్పటికే మంత్రివర్గంలో 60 శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించడమే కాకుండా ఎస్సీ మహిళకు హోం శాఖను అప్పగించి ఇప్పటికే ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వర్గాలకు నామినేషన్ పదవులు, ఐదు లక్షల రూపాయలలోపు నామినేషన్ పనుల్లో 50 శాతం కల్పిస్తూ చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు. వెనుకబాటుతనాన్ని చెప్పుకోవచ్చిక.. వివిధ కులాలను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ నేపథ్యంలో జగన్మోహన్రెడ్డి ఎన్నికల సభల్లో.. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎవరైనా బీసీలుగా గుర్తింపు పొందడానికి ఆ కమిషన్‌కు దరఖాస్తు చేసుకుంటే వారి స్థితిగతులతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఎందుకు వారు బీసీలుగా మారాలని కోరుకుంటున్నారనే అంశాలను అధ్యయనం చేసి బీసీ కమిషన్ సిఫార్సులు చేస్తుందని అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు ఇందుకు అనుగుణంగా శాశ్వత ప్రాదిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించనున్నారు. ఏపీఐడీఈ చట్టంలో మార్పులు ఇష్టానుసారం టెండర్ల ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది. స్విస్ చాలెంజ్ ముసుగులో అస్మదీయ సంస్థలకు నామినేషన్‌పై కట్టబెట్టడం వంటి అనైతిక చర్యలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పులుస్టాప్ పెట్టనుంది. ఒక రకంగా చెప్పాలంటే గత టీడీపీ సర్కారు రాష్ట్ర ఖజానా నుంచే భారీ దోపిడీకి పాల్పడింది. ఈ నేపధ్యంలో టెండర్ల విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చి ప్రజాధనాన్ని వృధా కాకుండా ఆదా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా టెండర్ల స్క్రూటినీకి జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా ప్రభుత్వం తొలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే చట్ట సవరణలను చేయాలని నిర్ణయించింది. గత చంద్రబాబు సర్కారు రాజధానిలో సింగపూర్ ప్రైవేట్ సంస్థల కోసం స్విస్ చాలెంజ్ ముసుగులో కారు చౌకగా రైతుల నుంచి తీసుకున్న భూములను అప్పగించేందుకు వీలుగా ఏపీఐడీఈ చట్టంలో సవరణలు తీసుకువచ్చింది. స్విస్ చాలెంజ్ విధానంలో సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆథారిటీ తొలుత ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలించాల్సి ఉండగా, గత టీడీపీ సర్కారులో సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపాక ఆ అథారిటీకి ఆ ప్రతిపాదనలను పంపించారు. దీనిని హైకోర్టు తప్పుపట్టడంతో ఆ అథారిటీనే రద్దు చేస్తూ ఏపీఐడీఈ–2001 చట్టంలో చంద్రబాబు సర్కారు సవరణలు చేసింది. అలాగే సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు కోరిన విధంగా రాజధాని భూములపై సర్వహక్కులు కల్పిస్తూ మరోసారి చంద్రబాబు సర్కారు ఏపీఐడీఈ చట్టంలో సవరణలు చేసింది. ఈ సవరణలన్నీ సింగపూర్ కంపెనీలకు భారీ ఆర్థిక ప్రయోజనం కలిగించేలా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీఐడీఈ చట్టం నుంచి ఈ సవరణలన్నీ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిచింది. ఇందుకు అనుగణంగా ఏపీఐడీఈ చట్టంలో సవరణలను తీసుకురానున్నారు. ఏపీఐడీఈ చట్టం ప్రస్తుతం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో చేపట్టే ప్రాజెక్టులకే వర్తించనుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుల పనులన్నింటినీ కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా చట్టంలో సవరణలను ప్రతిపాదించనున్నారు. ఇదే చట్టంలో టెండర్లను జ్యుడిషియల్ స్క్రూటినీ చేసేందుకు వీలుగా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రొవిజన్‌ను కొత్తగా చేర్చనున్నారు. దీంతో ఇక పీపీపీ ప్రాజెక్టులతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల పనుల టెండర్లను పూర్తి పారదర్శకతతో జ్యుడిషియల్ స్క్రూటినీ అనంతరమే ఖరారు చేయనున్నారు. భూముల రీ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వే చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ప్రస్తుతం భూములపై ఉన్న హక్కులు ఊహాజనితమేనని, వాస్తవ హక్కులు కాదని, దీంతో భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఒకరికి చెందిన భూమి మరొకరు కాజేయడం, భూమి హక్కు పత్రాలను సృష్టించడం వంటి చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇందుకు స్వస్తి పలికి రాష్ట్రంలో భూములన్నీ రీ సర్వే కోసం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేక చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇందుకు అనుగుణంగా సమగ్ర టైటిల్‌ను కల్పించేందుకు వీలుగా చట్టం తీసుకురానున్నారు. భూములు రీ సర్వే చేసి శాశ్వత హక్కు కల్పించిన తరువాత సివిల్ న్యాయస్థానాలు కూడా ప్రశ్నించకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ పాలక మండళ్లపై సర్కారుకే అధికారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో సహా పలు ఆలయాల పాలకమండళ్లు, ట్రస్టుల చైర్మన్లు, సభ్యులను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రీకాల్ చేయనుంది. ఆ నియమాకాలను సూపర్ సీడ్ చేసే అధికారం ప్రభుత్వానికి కల్పిస్తూ దేవదాయ చట్టంలో సవరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టీటీడీతో పాటు వివిధ ట్రస్టుల ఛైర్మన్లు, సభ్యులకు సంబంధించి రాజకీయ నియామకాలు జరుగుతుంటాయి. సాధారణంగా ప్రభుత్వం మారితే గత ప్రభుత్వం నియమించిన రాజకీయ పదవుల్లోని వారు రాజీనామా చేస్తారు. అయితే ఇప్పుడు పలువురు రాజకీయం చేయడానికి ఆ పదవుల్లోనే అంటిపెట్టుకుని ఉంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ సహా ఇతర ట్రస్టుల చైర్మన్లు, సభ్యులను రీకాల్ చేసే అధికారం ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేలా దేవదాయ శాఖ చట్టంలో సవరణలు తీసుకువస్తూ ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎట్టకేలకు లోకాయుక్త రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో లోకాయుక్త ఏర్పాటు కాలేదు. గత ఐదేళ్ల చంద్రబాబు సర్కారు లోకాయుక్త ఏర్పాటుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్.జగన్ తొలి బడ్జెట్ సమావేశాల్లోనే లోకాయుక్త ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణ తరహాలోనే లోకాయుక్త చట్టానికి సవరణలు చేస్తూ లోకాయుక్త ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిటైర్డ్ చీఫ్ జస్టిస్తోనే లోకాయుక్త ఏర్పాటు చేయాలని ప్రస్తుత చట్టంలో ఉంది. అయితే రిటైర్డ్ చీఫ్ జస్టిస్‌లు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అందుబాటులో లేకపోయిన పక్షంలో రిటైర్డ్ జడ్జిని నియమించేందుకు వీలుగా చట్టంలో సవరణలు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తరహాలో చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ ప్రస్తుత అసెంబ్లీసమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపారం చేయడాన్ని నియంత్రించేందుకు, ప్రభుత్వ రంగంలోని విద్యా సంస్థలు పటిష్టం చేయడానికి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును తీసుకురావాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్య, కాలేజీ విద్య నియంత్రణ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ఫీజుల నియంత్రణతో పాటు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి సమగ్ర బిల్లును అసెంబీల్లో ఆమోదించడం ద్వారా చట్టబద్ధత కల్పించనున్నారు. కౌలు రైతులకు అండ భూ యజమానుల హక్కులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం ఇచ్చేందుకు వీలుగా చట్టంలో సవరణలు తీసుకురావాలని నిర్ణయించారు. 11 నెలల పాటు కౌలు ఒప్పందంపై కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు వీలుగా చట్టంలో సవరణలు చేయనున్నారు. కల్తీ విత్తనాలు, నకిలీ పురుగు మందులకు చెక్ రాష్ట్రంలో రైతులను పట్టిపీడుస్తున్న కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు చెక్ పెట్టాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విత్తన కంపెనీలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లతో వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందాలను చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందం చేసుకున్న కంపెనీల నుంచే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనాలని రైతులకు ప్రభుత్వం సూచించనుంది. విత్తన, ఇతర కంపెనీల టర్నోవర్ ఆధారంగా సెక్యూరిటీ డిపాజిట్‌ను నిర్ధారించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉదాహరణకు వంద కోట్ల టర్నోవర్ గల కంపెనీ అయితే రెండు కోట్ల రూపాయల మేర సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కంపెనీలతో చేసుకునే అవగాహన ఒప్పందాల్లోనే నకిలీ విత్తనాల వల్ల మొలకెత్తకపోయినా లేదా దిగుబడి రాకపోయినా, దిగుమతి తగ్గినా ఆయా రైతులకు నష్టపరిహారం ఆయా కంపెనీల ద్వారా చెల్లించేలా క్లాజులను పొందు పరచాలని భావిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. నకీలీ విత్తనాలు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇదంతా జరగాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మధ్యే మార్గంగా విత్తన కంపెనీలతో వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందాలను చేసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు ఉన్నతాధికారి తెలిపారు. ప్రభుత్వం మారినా పదవులు వదలని నేతలు అధికారం కోల్పోయిన తర్వాత నైతిక ప్రమాణాలు, విలువలు పాటించి గత ప్రభుత్వంలో దక్కిన నామినేటెడ్ పదవులకు రాజీనామా చేసే సంప్రదాయాన్ని టీడీపీ నేతలు పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర కావస్తున్నా చాలా మంది టీడీపీ నేతలు ఇంకా తమ పదవులను వదిలేందుకు ఇష్టపడడం లేదు. టీటీడీ చైర్మన్‌గా పని చేసిన పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేయకుండా మొండికేశారు. ఎట్టకేలకు విమర్శలు తట్టుకోలేక రాజీనామా చేశారు. ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్న వర్ల రామయ్య, ఎస్సీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, శాప్ చైర్మన్ అంకమ్మ చౌదరి, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దివి శివరాం, స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నామన రాంబాబు, ఆర్టీసీ రీజియన్ చైర్మన్లు.. ఇలా చాలా మంది ఇంకా ఆ పదవులను పట్టుకుని వేలాడుతూనే ఉన్నారు. అధికార మార్పిడి తర్వాత వదిలిపెట్టాల్సిన పదవులను వదిలే విషయంపై చంద్రబాబు సైతం వారికి సరైన దిశా నిర్దేశం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పదవులు వదలని వ్యవహారంపై టీడీపీలోని పలువురు సీనియర్ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తరచూ నీతులు, విలువల గురించి చెబుతూ ఆచరణలో పాటించక పోవడం సరికాదనే అభిప్రాయం ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది -
వైఎస్సార్‌సీపీతోనే ఎస్సీల అభివృద్ధి
సాక్షి, దొడగట్ట(రొద్దం): మండల పరిధిలోని దొడగట్ట, గోనిమేకుపల్లి, రొద్దం పాత చెక్‌పోస్ట్ తదితర గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో గురువారం వైఎస్సార్సీపీ నాయకులు నవరత్నాలపై ప్రచారం చేశారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఎస్సీలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ దళితులను కించపరిచి మాట్లాడిన చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. వైఎస్సార్ సీపీతోనే ఎస్సీల అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సినిమా నారాయణ, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు గంగాధర్, జిల్లా కార్యదర్శి నారనాగేపల్లి రాజు, బైలాంజినేయులు, రొద్దం శ్రీరాములు, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు వైఎస్సార్సీపీలో చేరిక మండల పరిధిలోని నారనాగేపల్లి గ్రామానికి చెందిన పలువురు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. గురువారం రాత్రి స్థానిక నాయకులు వై.రామన్న, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు తదితరుల ఆధ్వర్యంలో పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త శంకరనారాయణ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి శంకర్‌నారాయణ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో బోయ నరసింహులు, బోయ సుబ్రమణ్యం తదితరలు ఉన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ బి.నారాయణరెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, సింగిల్ విండో డైరెక్టర్ మారుతిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు రాజారెడ్డి, వజీర్, లక్ష్మీనారాయణరెడ్డి, ఆర్ఏ రవిశేఖర్‌రెడ్డి, రాజ్‌గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తా : జోగి రమేష్
సాక్షి, పెడన: ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం పునాది వేసింది, రిజర్వేషన్ కల్పించింది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డేనని.. ఆయన ఆశయాలతో మీ ముందుకు వస్తున్న జగనన్నను గెలిపించుకుందామని నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఐదో వార్డులో గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమం ద్వారా నవరత్నాలు కరపత్రాలను అందజేశారు. తొలుత మహబూబ్ సుభాని జెండా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన పిమ్మట గడపగడపకు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పట్టణంలోని ప్రతి పేదవాడికి ఇండ్ల స్థలంతో పాటు ఇంటిని నిర్మించి ఇచ్చే పూచినాదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చామని, మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే పేదవాడి కల సాకారం అయ్యేలా ఇళ్లను నిర్మించి ఇవ్వడంతో పాటు ఆయా కాలనీలలో మౌలికవసతులు కల్పించడం జరుగుతుందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించిన ఇందిరమ్మ కాలనీలలో నేటికి కూడా మౌలికవసతలు కల్పించకుండా టీడీపీ ప్రభుత్వం కుట్ర చేసిందని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ, అక్కాచెల్లిళ్లకు 45 సంవత్సరాలకు రెండో ఏడాది నుంచి ఆయా కార్పొరేషన్లు ద్వారా వడ్డిలేకుండా ఉచితంగా రూ.75వేలను విడతలు వారీగా అందించడం జరుగుతుందన్నారు. పిల్లల చదువు కోసం ప్రతి ఏటా ఉపకారవేతనంగా రూ.15వేలు ఇస్తామని, ఫీజు రీయింబర్స్‌మెంటు ద్వారా చదువులకు ఆటంకం లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. నవరత్నాల్లోని తొమ్మిది పధకాలను తూచతప్పకుండా అమలు చేసి చూపిస్తామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పట్టణానికి పూర్తిస్థాయిలో తాగునీరు అందించేలా చూస్తామన్నారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బండారు మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, కౌన్సిలర్లు మెహరున్నీసా, కటకం ప్రసాద్, గరికిముక్కు చంద్రబాబు, పిచ్చిక సతీష్‌బాబు, మెట్లగోపీ ప్రసాద్, పట్టణప్రధాన కార్యదర్శి పోతర్లంక సుబ్రమణ్యం, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి వన్నెంరెడ్డి మహాంకాళరావు, మైనార్టీ నాయకుడు అయూబ్‌ఖాన్, అబ్దుల్‌ఖాదర్ జిలానీ, అబ్దుల్‌హై, వార్డు అధ్యక్ష, కార్యదర్శులు పాషి, అబ్దుల్రఫి, రియాజుల్ రహామాన్, కరీం, మజీద్, బాషా, ఆయా విభాగాల నాయకులు భళ్ల గంగయ్య, బట్ట దివాకర్ తదితరులు పాల్గొన్నారు. -
వంచన బడ్జెట్!
-
ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాం
సాక్షి, అమరావతి: సంక్షేమం, సమతుల అభివృద్ధి, కనీస మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యాలుగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడం వల్లే రాష్ట్రం ప్రగతిబాట పట్టిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఐదేళ్ల క్రితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం అనేక సవాళ్లను అధిగమించి ప్రగతి బాట పట్టిందన్నారు. 2019 – 20 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.26 లక్షల కోట్లతో, మొదటి నాలుగు నెలలకు సంబంధించి రూ. 76816.85 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మంగళవారం ఆయన శాసనసభకు సమర్పించారు. 2019– 20 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,26,177.53 కోట్ల వ్యయం ప్రతిపాదించామని, 2018– 19 కేటాయింపులతో పోల్చితే ఇది 18.38 శాతం ఎక్కువని వివరించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 11.45 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన యనమల సరిగ్గా 1.22 గంటలకు జైహింద్ అంటూ ప్రసంగాన్ని ముగించారు. ‘దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మన రాష్ట్రం ఒకటిగా నిలబడి వరుసగా మూడేళ్లు రెండంకెల వృద్ధి సాధిస్తుందని మనం ఊహించామా? 70 ఏళ్ల ఆంధ్రుల కల, రాష్ట్రం జీవనాడి అయిన పోలవరం డ్యామ్ శరవేగంగా పూర్తవుతుందని, దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుందని ఊహించామా? ఇవన్నీ ఈరోజు నిజంగానే సాధించాం’ అని యనమల పేర్కొన్నారు. ఉన్నత విద్యకు పెద్దపీట.. సమాజంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతల పట్ల తమ ప్రభుత్వం పూర్తి జాగరూకతతో ఉందని యనమల చెప్పారు. జాతీయ స్థాయిలో వంద అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఆరు మన రాష్ట్రానికి చెందినవే కావడం ఉన్నత విద్యకు తాము ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని చెప్పారు. 2019 – 20 బడ్జెట్లో మానవ వనరుల విభాగానికి రూ. 29,955 కోట్లు కేటాయించామని, ఇది మొత్తం బడ్జెట్లో 11.5 శాతమని తెలిపారు. అమరావతిని ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చేయాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. అమరావతి నిర్మాణానికి రూ. 1.09 లక్షల కోట్లు ఖర్చు అమరావతి నిర్మాణానికి రూ. 1,09,023 కోట్లు అవుతుందని అంచనా వేయగా మొదటి దశలో రూ. 39,875 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని యనమల చెప్పారు. తమ ప్రభుత్వ కృషి వల్ల రాష్ట్రం విద్యుత్తు లోటు నుంచి మిగులు రాష్ట్రంగా మారిందన్నారు. ‘తల్లి గర్భం నుంచి జీవితాంతం వరకు ప్రతి దశలోనూ సంక్షేమాన్ని అమలు చేస్తున్న స్ఫూర్తిదాయకమైన ప్రభుత్వం ఇది. పురుషులతో మహిళలు పోటీపడే సమాజం ఏర్పాటే మా లక్ష్యం. అందుకే పసుపు కుంకుమ కింద ప్రతి స్వయం సహాయక సంఘం సభ్యురాలికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాం. ఇప్పుడు మరోమారు 93.81 లక్షల మందికి రూ. 10 వేల చొప్పున మొత్తం రూ.9,381 కోట్లు ఇవ్వాలని నిర్ణయించాం. రూ. 24 వేల కోట్ల రుణ భారం నుంచి రైతులను విముక్తులను చేశాం. ఆఖరి రెండు వాయిదాలను త్వరలో జమ చేస్తాం’ అని యనమల పేర్కొన్నారు. పెట్టుబడి రహిత సహజ సేద్యం (జెడ్బీఎన్ఎఫ్)లో రాష్ట్రం అగ్రగామిగా ఉందని ప్రకటించారు. మరోవైపు శాసన మండలిలో మంత్రి పి.నారాయణ బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. యనమల బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలు... ►రైతుల కోసం అన్నదాత సుఖీభవ అనే మరో పథకానికి రూ. 5,000 కోట్లు ప్రతిపాదిస్తున్నా. ►కనీస మద్దతు ధరలు లేని సమయంలో రైతును ఆదుకునేందుకు విపణి ప్రమేయ నిధి రూ. 500 కోట్ల నుంచి రూ. 1,000 కోట్లకు పెంపు. ►పశువుల బీమా కోసం బడ్జెట్లో రూ. 200 కోట్లు కేటాయింపు. ►ముఖ్యమంత్రి యువనేస్తం కింద నిరుద్యోగ యువతకు ప్రస్తుతం నెలకు రూ. 1000 చొప్పున ఇస్తున్న నిరుద్యోగ భృతి రూ. 2000కి పెంపు. ఈ పథకం కింద 4.3 లక్షల మంది లబ్ధి పొందుతున్నట్లు ప్రకటన. ►వెనుకబడిన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు రూ. 3,000 కోట్లు. జనాభా దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధుల పంపిణీ. ►అంబేడ్కర్ విదేశీ విద్య పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి మంజూరు చేసే స్కాలర్షిప్ రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంపు. ►ఎస్సీ సబ్‌ప్లాన్ కింద 2019 – 20 కేటాయింపులు 28 శాతం పెంచి రూ. 14,367 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటన. ఎస్టీ సబ్‌ప్లాన్ 33 శాతం పెంచి రూ. 16,226 కోట్లు కేటాయింపు ప్రతిపాదన. ►ఆరోగ్య శాఖ బడ్జెట్ రూ. 8,463 కోట్ల నుంచి రూ. 10,032 కోట్లకు పెంపు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి కేటాయింపులు రూ. 1,000 కోట్ల నుంచి రూ. 1,200 కోట్లకు పెంపు. -
పేదల సంక్షేమమే కాంగ్రెస్ మేనిఫెస్టో ఎజెండా..
సాక్షి, పాన్‌గల్: పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ మెనిఫెస్టోను రూపొందించిందని డీసీసీ సభ్యులు రాంమూర్తినాయుడు, బీసీ సెల్ జిల్లా నాయకులు యుగంధర్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని రేమద్దుల, గోప్లాపూర్, కిష్టాపూర్, శాగాపూర్ గ్రామాలల్లో మెనిఫెస్టో కరపత్రాలను పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఐదు పర్యాయాలు పనిచేసిన జూపల్లి నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న టీఆర్ఎస్కు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పెన్షన్లు పెంపు, రేషన్ ద్వారా సన్నబియ్యం, ఏడాదికి ఆరు ఉచిత సిలిండర్లు, 200 యూనిట్ల వరకు ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.6లక్షలు వంటి పథకాలు అమలు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ వెంకటయ్యనాయుడు, ప్రతాప్‌రెడ్డి, వహీద్, దామోదర్‌రెడ్డి, రాముయాదవ్, రమేష్, వెంకట్, నర్సింహ్మ, కృష్ణతేజ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించండి చిన్నంబావి: పేదల అభ్యున్నతికి కృషి చేసిన కాంగ్రెస్‌ను గెలిపించాలని కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ బీరం హర్షవర్దన్‌రెడ్డి సతీమణి విజయమ్మ కోరారు. శుక్రవారం ఆమె మండలంలోని దగడపల్లి, అమ్మాయిపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. నిరుద్యోగభృతి, ఏడాదికి ఆరు సిలిండర్లు, రైతు రుణమాఫీ తదితర కార్యక్రమాలు అమలవుతాయని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, చిదంబర్‌రెడ్డి, లొంకహర్షవర్ధన్రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా కిరణ్‌కుమార్, సాయిబాబు. మల్లికార్జున్, ఆంజనేయులు, వేంకటస్వామి, చక్రధర్గౌడు. శంకర్ పాల్గొన్నారు. -
చిరు వ్యాపారుల సంక్షేమానికి కృషి
హుజూరాబాద్: చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, వారి సంక్షేమానికి కృషి చేస్తానని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పట్టణంలోని సాయిరూప గార్డెన్లో హుజూరాబాద్ వరక్త, వాణిజ్య వ్యాపారుల యాజమానులు గురువారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హాజరై మాట్లాడారు. చిరు వ్యాపారులు సెలవు లేకుండా ప్రతిరోజూ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటారని పేర్కొన్నారు. కూరగాయాల, పండ్ల వ్యాపారులు తోపుడు బండ్లపై పెట్టి వ్యాపారం చేస్తుంటారని, అలాంటి వారి కోసం ఇప్పటికే పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించామని తెలిపారు. ప్రజలు మరోసారి ఆశీర్వదించి ఆదరిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పట్టణంలోని పాపరావు బొందలో ప్రభుత్వ ఖర్చుతో కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపడుతామని తెలిపారు. టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు బర్మావత్ యాదగిరి నాయక్, సీనియర్ నాయకులు చందగాంధీ, తాళ్లపల్లి రమేశ్, శ్రీనివాస్, ఆర్కే రమేష్, తాళ్లపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. టీఆర్ఎస్లో చేరిక హుజూరాబాద్: నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన పలువురు నాయకులు గురువారం పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి మంత్రి ఈటల రాజేందర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే టీఆర్ఎస్లోకి చేరుతున్నారన్నారు. ప్రజాసంక్షేమమే ఎజెండాగా పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి అండగా నిలువాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో పూసల ప్రభావతిరెడ్డి, సుజాత, ధనలక్ష్మిలతోపాటుగా వీణవంక, కందుగుల గ్రామాలకు చెందిన 200 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర సహాయకార్యదర్శి బండ శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, వైస్ చైర్మన్ తాళ్లపల్లి రజిత, నాయకులు గందె శ్రీనివాస్, అపరాజ ముత్యంరాజు, తాళ్లపల్లి శ్రీనివాస్, పోతుల సంజీవ్, కేసిరెడ్డి లావణ్య, కల్లెపల్లి రమాదేవి, విక్రమ్‌రెడ్డి, దాసరి రమణారెడ్డి, దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మా బతుకులు మార్చే వారికే ‘ఓటు’
సాక్షి,కామారెడ్డి : ‘గత 25 సంవత్సరాలుగా ఓటు వేస్తునే ఉన్నా.. ఎందరో నాయకులు మారుతున్నారు.. జెండాలు, ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ మా బతుకులు మాత్రం మారుతలేవు’ అంటూ కామారెడ్డికి మోచీ కులస్తుడు సాయినాథ్ వినూత్నంగా తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రహదారి పక్కన చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న గంట సాయినాథ్.. తన ఆవేదనను ఓ బోర్డు రూపంలో నేతలకు విన్నవిస్తున్నాడు. రోడ్డు మీద ఉన్న తమ బతుకులు మార్చే వారికి ఓటు వేస్తానని బోర్డు ఏర్పాటు చేశాడు. టెండర్ ఓటు అంటే ? సాక్షి,కామారెడ్డి అర్బన్: మీరు ఓటేయడానికి ఎంతో ఉత్సాహంతో పోలింగు స్టేషన్‌కు వెళ్తారు.. కానీ అప్పటికే మీ ఓటు ఎవరో వేసేసి ఉంటారు. మీరు శాపనార్థాలు పెట్టుకుంటూ బయటకు రావొద్దు. మీ వేలికి ఓటేసిన సిరా గుర్తు లేదు కదా..! అప్పుడు మీరు ప్రిసైడింగ్ అధికారికి మీ ఓటరు గుర్తింపు కార్డు లేదా ఎన్నికల సంఘం ఆమోదించిన ఏదైనా ఇతర గుర్తింపు కార్డు చూపి తాను కచ్చితంగా ఓటు వేస్తానని డిమాండ్ చేయవచ్చు. ప్రిసైడింగ్ అధికారి నీవే అసలు ఓటరని నిర్ధారణ చేసుకుంటారు. మీకు ఓటు వేయడానికి అవకాశం ఇస్తారు. కానీ ఓటింగ్ యంత్రంపై కాదు. అప్పుడు బ్యాలెట్ పేపరు ఇస్తారు. దానినే టెండర్ ఓటు అంటారు. టెండర్ బ్యాలెట్ పేపర్లు కూడా ఎన్నికల నియమం 49 పి ప్రకారం మామూలు బ్యాలెట్ పేపరులాగే వుంటుంది. ఓటింగ్ యంత్రంపై ఉండే బ్యాలెట్ యూనిట్లో ప్రదర్శితమయ్యే అన్ని గుర్తులు ఉంటాయి. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు 20 బ్యాలెట్ పేపర్లను సరఫరా చేస్తారు. ఏదైనా స్టేషన్లో 20 కన్నా ఎక్కువ టెండర్ ఓట్లు అవసరమైతే వెంటనే జోనల్ అధికారి ద్వారా రిటర్నింగ్ అధికారులు బ్యాలెట్లను ప్రిసైడింగ్ అధికారి సరఫరా చేస్తారు. టెండర్ బ్యాలెట్ పేపరు వెనుక స్టాంపు లేకుంటే చేతిరాతతో ప్రిసైడింగ్ అధికారి టెండర్ బ్యాలెట్ అని రాయాల్సి ఉంటుంది. ఫామ్–17బీలో టెండర్ బ్యాలెట్ పేపర్లు ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా రాయాలి. ఓటరుకు బ్యాలెట్ పేపరు ఇవ్వడానికి ముందుగా కాలమ్–5లో ఓటరు సంతకం లేదా వేలిముద్ర తీసుకుంటారు. టెండర్ బ్యాలెట్ పేపరుతో పాటు బాణం క్రాస్మార్క్ ఉన్న రబ్బరు స్టాంపు ఓటరుకు ఇస్తారు. టెండర్ బ్యాలెట్ పేపరు, రబ్బరు స్టాంపు తీసుకున్న ఓటరు గదిలోకి వెళ్లి తాను ఓటు వేయదలచుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా స్టాంపుతో మార్కు చేసి మడత పెట్టి ప్రిసైడింగ్ అధికారికి అందజేయాలి. ప్రిసైడింగ్ అధికారి దానిని ఒక కవరులో భద్రపరిచి వివరాలను ఫారం 17–బీలో రాసుకుంటారు. అంధత్వం, ఇతర ఇబ్బందుల వల్ల ఇతరుల సహాయం లేకుండా ఓటు వేయలేని పరిస్థితి ఉంటే తమ వెంట సహాయకుడ్ని వెంట తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. -
న్యాయవాదుల సంక్షేమానికి కృషి
షాద్‌నగర్‌టౌన్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం న్యాయవాదులు చేసిన కృషి మరువలేనిదని రాష్ట్ర బార్ అసోసియోషన్ చైర్మన్ నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం న్యాయవాదులు ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొని పోరాటం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ఈ ఏడాది ఏపీ, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు వేర్వేరుగా ఎన్నికలు జరగనున్నాయన్నారు. మరోసారి న్యాయవాదులు అవకాశం కల్పించి రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్‌గా తనను ఎన్నుకోవాలని కోరారు. న్యాయవాదుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో అడ్వకేట్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. అదేవిధంగా జూనియర్ న్యాయవాదులను లాభం చేకూర్చే విధంగా వారికి ఉపకార వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. విశ్రాంత న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటుగా రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరికీ ఉపయోగపడే విధంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా న్యాయవాదులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, తెలంగాణ అడ్వకేట్స్ ఫండ్ కింద వంద కోట్ల నిధులు ఉన్నాయని, వీటిని న్యాయవాదుల సంక్షేమానికి ఖర్చు చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. షాద్‌నగర్‌లో సబ్‌కోర్టు ఏర్పాటు కావడానికి ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమమే «ధ్యేయంగా ముందుకు సాగుతానన్నారు. జూన్ 29న నిర్వహించే రాష్ట్ర బార్ అసోసియేషన్ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఆయన కోరారు. 22 ఏళ్ల పాటు బార్ కౌన్సిల్ సభ్యుడిగా, వైస్ చైర్మన్‌గా, చైర్మన్‌గా ఎన్నో సేవలు అందించానని, మరిన్ని సేవలు అందించేందుకు తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. సమావేశంలో న్యాయవాదులు చెంది మహేందర్‌రెడ్డి, మోముల బసప్ప, కంచి రాజ్‌గోపాల్, పాతపల్లి కృష్ణారెడ్డి, మధన్‌మోహన్‌రెడ్డి, జగన్, శ్రీనివాస్, ప్రణీత్‌రెడ్డి, కవిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
హోంగార్డుల సంక్షేమానికి కృషి
కర్నూలు : హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు ఎస్పీ గోపీనాథ్ జట్టి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డుల సంక్షేమానికి చేపట్టిన సంక్షేమ పథకాల పత్రాలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోంగార్డుల సమస్యల పరిష్కారానికి తన వంతు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. హోంగార్డుల సంక్షేమ పథకాల పత్రాన్ని ప్యాకెట్ డైరీగా ఉంచుకోవాలని, ప్రభుత్వ పథకాల గురించి తమ కుటుంబాలకు కూడా తెలియజేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, చంద్రన్న బీమా పథకం, వ్యక్తిగత ప్రమాద బీమా, మెడి క్లెయిమ్ పాలసీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన తదితర పథకాల గురించి వివరించారు. హోంగార్డులు తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. కార్యక్రమంలో సదరన్ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ ఎన్.చంద్రమౌళి, డీఎస్పీలు బాబుప్రసాద్, సి.ఎం.గంగయ్య, లక్ష్మినారాయణరెడ్డి, సీఐ పవన్‌కిషోర్, ఈ–కాప్స్ ఇన్చార్జ్ రాఘవరెడ్డి పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం.. కర్నూలు హోంగార్డు యూనిట్లో పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు యల్లప్ప కుటుంబానికి వెల్ఫేర్ ఫండ్ చెక్కును ఎస్పీ అందజేశారు. యల్లప్ప భార్య శకుంతలను శనివారం ఎస్పీ తన కార్యాలయానికి పిలిపించి రూ.10 వేల చెక్కు ఇచ్చారు. వారి కుటుంబంలో ఒకరికి త్వరలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హోంగార్డ్స్ కమాండెంట్ చంద్రమౌళి, హోంగార్డు డీఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
గీత కార్మికుల తలరాత మారదా?
క్షణ క్షణం భయం భయం. బతుకే ప్రమాదకరం. వెళ్లిన కార్మికుడు క్షేమంగా తిరిగొస్తాడో రాడో అన్న ఉత్కంఠ. తెలంగాణ గీత కార్మికుల దైన్య స్థితి ఇదే. నిజాం సుదీర్ఘ పాలన నాటినుంచీ ఇప్పటికీ వేదనాభరిత జీవితాలను అనుభవిస్తున్న గీత కార్మికుల అభ్యున్నతిపై పాలకులు నిర్లక్ష్యం వహించడం బాధాకరం. తెలంగాణలో సుమారు 30 కోట్ల తాటి చెట్లున్నాయి గీత వృత్తిపై సుమారు 75 లక్షలమంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జీవిస్తున్నారు. అయితే ప్రతి జూన్ నెల నుంచి వీరికి ప్రమాదకరమైన సమయమే. తాటి చెట్టు నుంచి కింద పడి, లేదా చెట్టుకు వేలాడుతూ ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలో నారాయణ గౌడ్ అనే వ్యక్తి చెట్టుపై నుంచి తలకిందులుగా వేలాడుతూ ప్రాణాలు కోల్పోవడం ప్రత్యక్ష ఉదాహరణ. అయితే తెలంగాణ జిల్లాల్లో గీత కార్మికుల ప్రాణాలు ప్రతి ఏటా గాలిలో కలిసిపోతున్నా ప్రభు త్వం నుంచి వచ్చే నష్టపరిహారం ఏమీ అందడం లేదు. కల్లుగీత ద్వారా, తాటివనాల ద్వారా ఏటా రూ.150 కోట్ల ఆదాయం వస్తున్నా, గీత కార్మికులు తాటిచెట్టు పన్ను, భూ యజమాని పన్ను, ఎక్సైజ్ సుంకం కడుతూ ప్రభుత్వాన్ని పోషిస్తున్నప్పటికీ గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఇచ్చిందేమీ లేదు. తాటిచెట్టుపైనుంచి పడి ప్రమాదానికి గురై, అంగవైకల్యం లేదా మరణం సంభవించిన వారి కుటుంబాలకు ఏళ్లు గడిచినా ఎక్స్‌గ్రేషియా అందడంలేదు. పైగా రెక్కలు ముక్కలు చేసుకుని శరీరబాధలు అనుభవించి చేసిన కష్టానికి ప్రతిఫలం రాక మార్కెట్లో డిమాండ్ లేక ఆత్మహత్యల పాలవుతున్న గీత కార్మికులను ఆదుకునే యంత్రాంగం లేదు. పైగా తెలంగాణ గీత కార్మికులకు ప్రపంచీకరణ పుణ్యమా అని గౌడ వృత్తి దెబ్బతినిపోయింది. తాటివృత్తి గౌరవాన్నికాపాడి ఆ వృత్తిపై ఆధారపడిన లక్షలాది కార్మికులకు ఆత్మస్థైర్యం కలిగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. తెలంగాణలోని గీత కార్మిక సంఘాల కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై సమగ్ర సర్వేను నిర్వహించి జనాభాలో 40 శాతంగా ఉన్న వృత్తి కళాకారులకు రక్షణ కల్పించాలి. లంచాల కోసం గీత సంఘాలను వేధిస్తున్న అధికారులను, నంబరు పంతుళ్లు, అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకోవాలి. గీత కార్మికుల తలరాతను ఇప్పటికైనా మార్చాలి.- రావుల రాజేశం, లెక్చరర్, జమ్మికుంట, మొబైల్ : 98488 11424 -
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత
పెద్దపల్లిరూరల్ : తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తోందని, ప్రస్తుత సీజన్లో రైతులు పండించిన చివరి గింజ వరకూ మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేసేలా అవసరమైన ఏర్పాట్లు చేశామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులోని మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం మంత్రి ఈటల, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ గుండేటి ఐలయ్యతో కలిసి పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్ల తీరుపై ఆరా తీస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించాక గతంలో ఎన్నడూ లేని విధంగా రైతాంగ సంక్షేమానికి సీఎం కేసీఆర్ సారథ్యంలో అద్భుత పథకాలకు రూపకల్పన జరుగుతోందన్నారు. రైతులు పంట సాగుకు పెట్టే పెట్టుబడి మొదలు ఆధునిక వ్యవసాయ పనిముట్లను రాయితీపై అందిస్తూ.. పంట దిగుబడులు వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర చెల్లించేది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. వరిధాన్యాన్ని ఐకేపీ, సింగిల్ విండో కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పొరుగు రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసేందుకు కొందరు రైస్‌మిల్లర్లు రూ.1620 నుంచి 1650 వరకు ధర చెల్లిస్తామంటూ గ్రామాల్లో తిరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. అలాంటి వ్యాపారులు నాణ్యత సరిగా లేదంటూ తక్కువ ధర చెల్లించే అవకాశం ఉందని, వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పౌరసరఫరాల శాఖ ద్వారా జరిగే క్రయ విక్రయాల వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తూ అక్రమాలను నియంత్రిస్తున్నామన్నారు. అనేక పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ అన్నదాత గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడని ఎమ్మెల్యే దాసరి అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పరితపిస్తున్న కేసీఆర్ బంగారు తెలంగాణ సాధించాలన్న ఆశయసాధనకు అందరూ తోడ్పాటునందించాలన్నారు. వ్యవసాయ మార్కెట్‌యార్డు అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు మంత్రి సాయంతో ముందుకు సాగుతామని మార్కెట్ చైర్మన్ ఐలయ్యయాదవ్ అన్నా రు. కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్‌సింగ్, మార్కెట్ వైస్ చైర్మన్ మాదారపు ఆంజనేయరావు, డైరెక్టర్లు జడల సురేందర్, రాజేందర్ పాల్గొన్నారు. -
యాదవులు అభివృద్ధి చెందాలి : సీఎం
సాక్షి, హైదరాబాద్ : యాదవ, కురుమలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా బడుగుల లింగయ్య యాదవ్‌కు అవకాశం ఇచ్చిన సందర్భంగా యాదవ, కురుమ సంఘం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బుధవారం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం యాదవులకు రాజ్యసభ అవకాశం ఇచ్చామని, త్వరలోనే కురుమలకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని సీఎం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 20 మంది గొల్ల, కురుమ నేతలను రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా నియమిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా లింగయ్య యాదవ్‌ను సీఎం అభినందించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, కార్పొరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి రూ.20 కోట్లు
సాక్షి, తిరుపతి : రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్ల (హిజ్రాలు) సంక్షేమం కోసం ఈ బడ్జెట్టులో రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 80 వేల మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఎక్కువ మంది యాచన ద్వారా జీవనం సాగిస్తున్నారు. సమాజంలో ఎదురయ్యే అవహేళనలను తట్టుకోలేక ఎక్కువ మంది ఇళ్లల్లోనే గడుపుతున్నారు. సొంతిళ్లు, రేషన్‌కార్డులు, హెల్త్ కార్డులు లేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్లో రాష్ట్రప్రభుత్వం 26 వేల మందిని గుర్తించి పెన్షన్ స్కీమ్ వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. వారి సంక్షేమానికి సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం.. వారికోసం ఏడాదికి రూ.50 కోట్లు ఖర్చు చేయాలని అప్పట్లో నిర్ణయించింది. అయితే బడ్జెట్లో కేవలం రూ.20 కోట్లు కేటాయించడంపై ట్రాన్స్జెండర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అరకొర నిధులతో ట్రాన్స్జెండర్ల సంక్షేమం, అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్రంలోనూ అమలు చేయాలని ఏపీ ట్రాన్స్‌జెండర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. -
గొల్ల కురుమ సంక్షేమ భవనానికి కేసీఆర్ శంకుస్థాపన
-
తెలియదు.. గుర్తు లేదు!
♦ చిన్నమ్మ పల్లవి ♦ వీడియో కాన్ఫరెన్స్ విచారణ ♦ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి ♦ ఇక క్రాస్ ఎగ్జామిన్ విదేశీ మారక ద్రవ్యం కేసులో కోర్టు సంధించిన ప్రశ్నలకు చిన్నమ్మ శశికళ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. న్యాయమూర్తి ప్రశ్నలకు సమాధానాలు ‘తెలియదు.. గుర్తు లేదు’ అని దాటవేశారు. ఆమేరకు శనివారం పరప్పన అగ్రహార చెర నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెన్నై ఎగ్మూర్ కోర్టు ప్రశ్నలకు ఆమె దాటవేత ధోరణి అనుసరించారు. సాక్షి, చెన్నై : దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళపై కేసులకు కొదవ లేదు. అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం చిన్నమ్మ శశికళ పరప్పన అగ్రహార చెరలో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈడీ దాఖలుచేసిన పలు కేసుల విచారణలు ఒకటి తర్వాత మరొకటి చెన్నై ఎగ్మూర్ కోర్టు ముందుకు వస్తున్నాయి. 1991–1996 మధ్య కాలంలో జయలలిత సీఎంగా ఉన్నప్పుడు చిన్నమ్మ అండ్ ఫ్యామిలీ సాగించిన అవినీతి వ్యవహారాలు, మాయాజాలాలను తదుపరి అధికారంలోకి వచ్చిన డీఎంకే ఒక్కొక్కటిగా వెలుగులోకి తెచ్చింది. ఆ దిశగా 1996 –2001 మధ్యకాలంలో శశికళపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఐదు కేసులను నమోదు చేసింది. ఇందులో నాలుగు కేసుల్లో శశికళ మీద అభియోగాలు మోపింది. మూడు కేసుల్లో శశికళతో పాటు ఆమె బంధువులు కూడా నిందితులుగా ఉన్నారు. ఇందులో జయ టీవీకి విదేశాల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోళ్లు చిన్నమ్మ మెడకు ఉచ్చుగా మారింది. రిజర్వు బ్యాంక్ అనుమతి లేకుండా నగదు బట్వాడా డాలర్లలో సాగినట్టు ఈడీ తేల్చింది. ఈ కేసు విచారణను చెన్నై ఎగ్మూర్ కోర్టులో సాగుతోంది. కోర్టుకు శశికళ నేరుగా హాజరు కావాల్సి ఉన్నా, పరప్పన అగ్రహార చెరలో శిక్ష అనుభవిస్తున్న దృష్ట్యా, కుదర లేదు. వాయిదాల పర్వంతో సాగుతూ వచ్చిన ఈ పిటిషన్ విచారణ మరింత వేగవంతం అయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించేందుకు ఎగ్మూర్ ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జకీర్ హుస్సేన్ ఆదేశాలు ఇచ్చారు. ఉక్కిరి బిక్కిరి.. దాటవేత శనివారం ఎగ్మూర్ కోర్టులో విచారణ ఆసక్తికరంగా సాగింది. 11.15 గంటల నుంచి 12.40 గంటల వరకు విచారణ జరిగింది. పరప్పన అగ్రహార చెర నుంచి వీడియో కాన్ఫరెన్స్ ముందుకు ఖైదీల యూనిఫాం గెటప్‌లో చిన్నమ్మ ప్రత్యక్షం అయ్యారు. ఆమెను ప్రశ్నలతో న్యాయమూర్తి ఉక్కిరి బిక్కిరి చేశారు. విదేశీ మారక ద్రవ్యం కేసులో ఈడీ మోపిన అభియోగాలను వివరిస్తూ ప్రశ్నలను సంధించారు. న్యాయమూర్తి ప్రశ్నలకు తెలియదు.. గుర్తు లేదు అన్న సమాధానాలతో చిన్నమ్మ దాటవేశారు. అనేక ప్రశ్నలను చిన్నమ్మను ఇరకాటంలో పెట్టే విధంగా సాగినా, చాకచక్యంగా దాటవేత ధోరణి సాగించడం గమనార్హం. ఇక, విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ఆ రోజున క్రాస్ ఎగ్జామిన్ సాగుతుందని విచారణను న్యాయమూర్తి ముగించారు. ఇక, శశికళ, ఆమె బంధువు సుధాకరన్ మీద దాఖలుచేసిన మరో విదేశీ మారక ద్రవ్యం కేసు విచారణ ఏడో తేదీ విచారణకు రానుంది. ఇప్పటికే సుధాకరన్ కోర్టుకు హాజరైన దృష్ట్యా, ఆ రోజున మరోమారు చిన్నమ్మ శశికళ వీడియో కాన్ఫరెన్స్ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
ప్రజా సంక్షేమమే ధ్యేయం
–కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆదోని: దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. మూడేళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో పేదలు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతున్నారని చెప్పారు. ఆదోని పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ æహాలులో సోమవారం ఆర్డీఓ ఓబులేసు అధ్యక్షతన సబ్కా సాథ్ సబ్కా వికాష్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆయన అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత పాలకులు తమ వ్యక్తిగత సంపాదన, కార్పొరేట్ సంస్థల ఉన్నతి కోసం పాటు పడ్డాయి తప్ప పేదలను ఏ నాడు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేదల అభ్యున్నతి, దేశ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అసంఘటిత కార్మికులు 60 ఏళ్ల తర్వా నెలకు కనీసం రూ.5వేలు పింఛను పొందేందుకు అటల్ పెన్షన్ యోజనను ప్రవేశ పెట్టామని చెప్పారు. హౌస్ ఫర్ ఆల్ పథకం కింద పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని చెపా్పరు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరీష్‌బాబు, జాతీయ మీడియా ప్రతినిధి చెల్లపల్లి నరిసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూల్‌రెడ్డి, ప్రకాష్‌జైన్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు గిరిరాజవర్మ, రమేష్‌బాబు, సుబ్బారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కునిగిరి నాగరాజు, నాయకులు మేధా మురళీధర్, రంగాస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల సంక్షేమానికి చర్యలు
హోంమంత్రి రాజప్ప కాకినాడ క్రైం : పోలీసుల సంక్షేమం «భద్రత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. శుక్రవారం కాకినాడ ఎస్పీ కార్యాలయ సమీపంలో రూ.10 లక్షలతో నిర్మించిన పోలీస్ రిటైర్డు ఉద్యోగుల సంక్షేమ భవనాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కాకినాడ, రాజమహేంద్రవరంలో ఎస్పీ కార్యాలయ భవనాలు నిర్మాణంలో ఉన్నట్టు, ఆదర్శ పోలీస్స్టేషన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సమాజంలో పోలీస్ సేవలు విశిష్టమైనవని శాసనమండలి డిప్యూటీ చైర్మ¯ŒS రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఎస్పీ ఎం.రవిప్రకాశ్, సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఏఎస్పీ ఏఆర్ దామోదర్, జిల్లా పోలీస్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బలరామ్, పలువురు రిటైర్డ్ అసోసియేష¯ŒS సభ్యులు పాల్గొన్నారు. మహాసంకల్పదీక్ష ఏర్పాట్లపై సమావేశం కాకినాడ సిటీ : నవ నిర్మాణదీక్షలో భాగంగా ఈ నెల 8వ తేదీన కాకినాడలో నిర్వహించబోయే మహాసంకల్ప దీక్ష ఏర్పాట్లపై శుక్రవారం స్ధానిక ఆర్అండ్బి అతిథిగృహంలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రత్యేకగా సమావేశమయ్యారు. సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మ¯ŒS రెడ్డి సుబ్రహ్మణ్యం, జెడ్పీ చైర్మ¯ŒS రాంబాబు, శాసనమండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, దాట్ల బుచ్చిబాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎస్వీఎస్ వర్మ, డీసీసీబీ చైర్మ¯ŒS వరుపుల రాజా పాల్గొన్నారు. మహాసంకల్పం సభ నిర్వహించే ఆనందభారతి గ్రౌండ్స్‌ను చినరాజప్ప పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మిశ్రా, ఎస్పీ రవిప్రకాశ్‌ను ఆదేశించారు. -
గల్ఫ్ ఎన్ఆర్ఐల సంక్షేమంపై త్వరలో ప్రకటన
రాష్ట్ర ఎన్ఆర్ఐ విభాగం మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: గల్ఫ్‌లోని తెలంగాణ ఎన్ఆర్ఐల కష్టాలను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, ఎన్ఆర్ఐల సంక్షేమంపై త్వరలో ఓ ప్రకటన చేస్తామని రాష్ట్ర ఎన్ఆర్ఐ విభాగం మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ప్రవాస భారతీయులకు ఎన్నిక ల్లో ఇచ్చిన హమీలను అమలు చేస్తామన్నారు. ఇందు కోసం తాను త్వరలో గల్ఫ్‌లో పర్యటిస్తానని, అక్కడి ఎన్ఆర్ఐ సంఘాలు, ఎన్నారైలకు సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. ఎన్ఆర్ఐలు ఏ సమస్య ఉన్నా తన కార్యాలయ సిబ్బందికి తెలియజేయాలని కోరారు. ఎమిరెట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ సంఘం ప్రతినిధులు మంగళవారం మంత్రి కేటీఆర్‌ను కలిసి గల్ఫ్‌లో తెలంగాణ వాసుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నారైల సమస్యలపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపట్ల కృతజ్ఞతలు తెలిపారు. -
మాజీ సైనికుల సంక్షేమమే లక్ష్యం
– ఎన్సీసీ కమాండర్ కల్నల్ పీజీ కృష్ణ కర్నూలు(హాస్పిటల్): మాజీ సైనికులు, వితంతువుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ పీజీ కృష్ణ చెప్పారు. స్థానిక ఎన్సీసీ క్యాంటీన్లో వచ్చిన లాభాల నుంచి మరణించిన మాజీ సైనికుల భార్యలు, మాజీ సైనికులకు 15 మందికి రూ.10వేల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో క్యాంటీన్లో సరుకులు కొనుగోలు చేయాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండాల్సి వచ్చేదన్నారు. దీన్ని సవరించి సెల్ఫ్ సర్వీసు విధానంలో త్వరగా సరుకులు తీసుకునే విధంగా మార్పులు చేశామన్నారు. క్యాంటీన్లో సరుకులు కొనుగోలు చేసి డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసే వారికి 2 శాతం పన్నును మినహాయింపును బ్యాంకర్లు ఇచ్చారన్నారు. వైద్య విధానంలో భాగంగా ఈసీహెచ్ఎస్ స్కీమ్ బాగా నడుస్తోందన్నారు. అనంతరం ఆయన సి. రాణెమ్మ, వై. ముర్తుజాబీ, బి. కృపమ్మ, షేక్ హసీనా, ఎస్. సత్య, ఇ. సరళ, ఎస్. యశోద, సత్యవతి, పఠాన్ అస్మత్ఖాతూన్, ఎల్లమ్మ, చిన్నమ్మ, ఎం. శివమ్మ, అన్నమ్మ, గోవిందమ్మ, నాగరాణిదేవిలకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో యుఆర్సీ∙ ఇన్చార్జి ఆఫీసర్ కల్నల్ ఐతల్, 9వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ ఎస్కె సింగ్, లెఫ్ట్‌నెంట్ కల్నల్ గౌస్‌బేగ్, ఈసీహెచ్ ఆఫీసర్ కల్నల్ సుబ్బయ్య, మాజీ సైనికోద్యోగుల సంఘం అధ్యక్షులు పురుషోత్తమ్, క్యాంటీన్ మేనేజర్ కేపీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
బ్రాహ్మణ కుటుంబాలకు సంక్షేమ ఫలాలు
– జిల్లా కోఆర్డినేటర్ సముద్రాల హనుమంతరావు కర్నూలు (అర్బన్): ఇప్పటి వరకు 30 వేల బ్రాహ్మణ కుటుంబాలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందాయని బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ సముద్రాల హనుమంతరావు తెలిపారు. ఆదివారం స్థానిక సంకల్‌బాగ్‌లోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు ఒక లక్ష మంది వరకు బ్రాహ్మణులు లబ్ధిపొంది ఉంటారన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసమే కార్పొరేషన్ చైర్మెన్ ఐవైఆర్ కృష్ణారావు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని చెప్పారు. విద్య, ఉపాధి, వైద్య రంగాలతో పాటు 60 సంవత్సరాలు దాటిన బ్రాహ్మణ వృద్ధులకు నెలకు రూ.1000 పింఛన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. రిజిస్టర్ అయిన వృద్ధాశ్రమాల్లో ఉన్న వారికి రూ.3 వేలు ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అర్చకులకు రిటైర్డ్‌మెంటు లేకుండా చేశామని చెప్పారు. అనంతరం బ్రాహ్మణ సంఘం నేతలు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి హెచ్‌కే మనోహర్, జిల్లా అర్చక పురోహితుల సంఘం అధ్యక్షుడు రవిచంద్ర, కార్యదర్శి చెరువు దుర్గాప్రసాద్, హెచ్‌కే రాజశేఖర్, ఎస్.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
19న మాజీ సైనికుల సమావేశం
కర్నూలు(అర్బన్): అనంతపురంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ స్టేడియంలో ఈ నెల 19న మాజీ సైనికుల సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రాచయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి జిల్లాలోని మాజీ సైనికులు, వితంతువులపై ఆధారపడిన వారు తప్పక హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
విద్యార్థులకు పరీక్ష
గాడితప్పిన సాంఘిక సంక్షేమం - పదవ తరగతి విద్యార్థులకు మోటివేషన్ క్లాసుల నిర్వహణలో నిర్లక్ష్యం - ఒక్క డివిజన్‌లోనూ మొదలు కాని ప్రక్రియ - మరో నెల రోజుల్లో పరీక్షలు - పలు వసతిగృహాల్లో పనిచేయని బోర్లు - మెరుగుపడని బయోమెట్రిక్ హాజరు కర్నూలు(అర్బన్): పదవ తరగతి పరీక్షలు పట్టుమని నెల రోజులు లేవు. ఇప్పటి వరకు విద్యార్థులకు మోటివేషన్ తరగతులూ నిర్వహించని పరిస్థితి. యేటా డిసెంబర్లోనే డివిజన్ల వారీగా క్లాసులు నిర్వహిస్తున్నా ఈసారి ఆ ఊసే కరువయింది. ఇందుకు ప్రధాన కారణం సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారి దీర్ఘకాలిక సెలవులో వెల్లడమే. మొత్తంగా అధికారి లేని లోటుతో ఈ శాఖలో పాలన గాడితప్పింది. పక్క జిల్లాలో ఇప్పటికే తరగతులు ఒకటికి రెండుసార్లు నిర్వహించి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయగా.. ఇక్కడి విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారింది. సైకాలజీలో నిష్ణాతులైన వారిని పిలిపించి వసతి గృహాల్లోని విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టాలనేది ఈ క్లాసుల ముఖ్య ఉద్దేశం. అయితే ఈ విద్యా సంవత్సరం ఒక్క డివిజన్‌లోనూ క్లాసులు నిర్వహించలేదు. అదేవిధంగా పరీక్షలకు అవసరమయ్యే ప్యాడ్, పెన్ను, పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్‌ను కూడా అందివ్వకపోవడం గమనార్హం. ఆయా వసతిగృహాల్లో సంబంధిత అధికారులు రాత్రి బస చేస్తూ విద్యార్థులను చదివించాల్సి ఉంది. అలాగే ప్రతి వసతిగృహంలోని పదో తరగతి విద్యార్థులను గ్రేడ్లుగా విభజించి గ్రూప్ డిస్కషన్ నిర్వహించాలి. సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో ఈ ప్రక్రియ కూడా చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. పలు వసతి గృహాల్లో తీరని దాహం వేసవి సమీపిస్తుండడంతో ఇప్పటికే పలు వసతి గృహాల్లోని మంచినీటి బోర్లలో నీరు ఇంకిపోవడంతో ఆయా వసతి గృహాల్లోని విద్యార్థులు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ వసతి గృహంలో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని సంక్షేమాధికారులు వినతి పత్రాలు అందజేస్తున్నా ఫలితం లేకపోతోంది. ముఖ్యంగా ఓర్వకల్లు(బాలికలు), ఆలూరు(ఐడబ్ల్యూహెచ్), మద్దికెర (బాలురు), తెర్నేకల్(బాలురు), నందవరం(బాలురు), ఎమ్మిగనూరు (కళాశాల బాలురు) తదితర వసతి గృహాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికే పలు వసతి గృహాలకు చెందిన సంక్షేమాధికారులు స్వయంగా డబ్బులు వెచ్చించి తాగునీటిని ట్యాంకర్ల ద్వారా తెప్పించుకుంటున్నారు. రెగ్యులర్ అధికారి లేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఇన్చార్జి డీడీగా బాధ్యతలు నిర్వహిస్తున్నా, ఆయనకున్న పని ఒత్తిడి కారణంగా సమస్యలపై దృష్టి సారించలేక పోతున్నట్లు తెలుస్తోంది. నామమాత్రంగానే బయోమెట్రిక్ హాజరు జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో బోగస్ హాజరును అరికట్టేందుకు బయోమెట్రిక్ మిషన్లు, ట్యాబ్‌లను అందించారు. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల పలు వసతి గృహాల్లో బయోమెట్రిక్ హాజరు అంతంతమాత్రంగానే నమోదు అవుతోంది. సాంకేతిక కారణాలను తెలుసుకొని వాటిని సరిచేసి అన్ని వసతి గృహాల్లో బయో మెట్రిక్ హాజరు నమోదయ్యేలా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పలు వసతి గృహాలకు సంబంధించి సిగ్నల్స్ లేకపోవడంతో ఆయా వసతి గృహాల్లో మాన్యువల్‌గానే హాజరును నమోదు చేస్తున్నారు. మోటివేషన్ క్లాసుల నిర్వహణకు చర్యలు డివిజన్ల వారీగా పదో తరగతి విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సంబంధిత సహాయ సంక్షేమాధికారులకు ఆదేశాలు జారీ చేశాం. తాగునీటి సమస్య ఉన్న వసతి గృహాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. స్పెషల్ హాస్టళ్లపై సంబంధిత హెచ్‌డబ్ల్యూఓలు ప్రత్యేక దృష్టి సారించి ఈ విద్యా సంవత్సరంలో వంద శాతం ఫలితాలు సాధించేలా చర్యలు చేపడతాం. - ప్రకాష్‌రాజు, ఇన్చార్జి డీడీ -
బీసీ సంక్షేమంపై సమీక్ష
శాసన సభా కమిటీ పర్యటన బాపట్ల : బాపట్ల వ్యవసాయ కళాశాలలో మౌలిక సదుపాయాలపై బీసీ సంక్షేమ శాసనసభ కమిటీ మంగళవారం రాత్రి పరిశీలించింది. విశ్వవిద్యాలయం డీన్ డాక్టరు టి.రమేష్‌బాబు, పీజీ స్టడీస్ డీన్ వీరరాఘవయ్య, రిజిస్ట్రార్ టి.వి.సత్యనారాయణ విశ్వవిద్యాలయం నిర్వహణపై పలువిషయాలను కమిటీ దృష్టికి తీసుకువెళ్ళారు. బీసీ రిజర్వేషన్లు అమలుపై కమిటీ చైర్మన్ తిప్పేస్వామి అడిగితెలుసుకున్నారు. బీసీ విద్యార్థులకు అందాల్సిన స్కాలర్‌షిపులు, హాస్టల్ నిర్వహణపై ఆరా తీశారు. రామచంద్రపురంలో పర్యటించిన కమిటీ మండలంలోని రామచంద్రపురంలోని మత్స్యకారుల కాలనీలో కమిటీ పర్యటించింది. ఈసందర్భంగా మత్స్యకారులను ఎస్టీల జాబితాలో చేర్చాలని ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్ వినతి పత్రం అందించారు. మత్స్యకారులకు అందాల్సిన సబ్సిడీలు కూడా సక్రమంగా అందేలా చూడాలని కోరారు. పర్యటనలో కమిటీ సభ్యులు అశోక్‌బాబు,రమణమూర్తి, జాయింట్‌కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమానికి పెద్దపీట
– బూత్ కమిటీల నిర్మాణానికి పాటుపడాలి – పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలి – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు కర్నూలు(టౌన్): ప్రజా సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు అనా్నరు. హోదా కంటే ఎక్కువగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెపా్పరు. మంగళవారం కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న తనీష్ కన్వెన్షన్ సమావేశ హాలులో ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ముందుగా పండిత దీన్‌దయాళ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు మాట్లాడుతూ పెద్ద నోట్లర ద్దుతో చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా దేశ ప్రజలు అండగా నిలిచారని చెప్పారు. దేశంలో ప్రస్తుతం ఉగ్రవాదం, తీవ్రవాదం, నకిలీ కరెన్సీ తగ్గుముఖం పట్టిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం 90 శాతం నిధులు కేటాయించిందన్నారు. అలాగే వెనుకబడిన 7 జిల్లాల అభివృద్ధికి ఏడాదికి రూ. 50కోట్ల చొప్పున నిధులు ఇస్తుందన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం కొంత మంది చేసే హోదా ఉద్యమాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు కృషి చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ బూత్ కమిటీలను నియమించాలని సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు హరీష్ బాబు, పార్టీ కేంద్ర కమిటీ సంఘటన కార్యదర్శి సతీష్, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాసు, పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్సీలు సోమువీర్రాజు, కంతెటి సత్యనారాయణ, మాజీ మంత్రులు పురందేశ్వరీ, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి , పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సందడి సుధాకర్, రంగస్వామి, యోగనంద్చౌదరి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కువే ఇస్తున్నాం
సబ్‌ప్లాన్‌ను మించి నిధులు ఖర్చు చేస్తున్నాం: సీఎం కేసీఆర్ ► ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ► వారికి అన్నివిధాలా సహకారం అందిస్తాం ► హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మొటిక్ చార్జీలు పెరగాలన్న ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ నిధులు ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఖర్చు చేసిన వివరాలు, విషయాలు వారికి తెలియకపోతే ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తుందనే భావన కలిగే అవకాశముంటుందని అభిప్రాయపడ్డారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటుకు గురైన ఎస్సీ, ఎస్టీల పట్ల మరింత శ్రద్ధ వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు, అభివృద్ధి, సంక్షేమ చర్యలపై సీఎం సోమవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, సీనియర్ అధికారులు సోమేశ్ కుమార్, నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, సందీప్ సుల్తానియా, కరుణాకర్, ప్రవీణ్ కుమార్, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి, ఖర్చు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు విషయంలో ప్రతీనెలా అధికారులు సమీక్ష జరపాలి. మూడు నెలలకోసారి మంత్రులు సమావేశాలు నిర్వహించాలి. అరు నెలలకోసారి ముఖ్యమంత్రే స్వయంగా సమీక్ష నిర్వహించాలి. సబ్‌ప్లాన్ ప్రకారం కేటాయించిన నిధులే కాకుండా.. ఆయా వర్గాలకు ప్రభుత్వం ఎక్కువే ఖర్చు చేస్తోంది. ఇదే ఒరవడి ఇక ముందు కూడా కొనసాగాలి. వారికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందించాలి. ఎస్సీ, ఎస్టీ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లు, ఓవర్సీస్ స్కాలర్ షిప్స్.. ఇలా ఆర్థిక లబ్ధి కల్పించే పథకాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఎక్కువ సబ్సిడీని అందిస్తోంది. కల్యాణలక్ష్మి, దళితులకు భూపంపిణీ అమల్లో ఉంది. ఇతర పథకాల్లోనూ వారికే గరిష్ట లబ్ధి చేకూరుతోంది. ఇది మంచి పరిణామం. భవిష్యత్తులోనూ కొనసాగించాలి’’అని సీఎం చెప్పారు. మెస్ ఛార్జీలు పెరగాలి ‘‘రాష్ట్రంలో హాస్టళ్ల పరిస్థితి మారాలి. విద్యార్థులకు చెల్లించే మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు అవసరమైనంత పెరగాలి. ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ ఎస్సీ, ఎస్టీల్లో పరిమితి లేకుండా ఎంత మందికి అవసరమైతే అంత మందికి అందించాలి’’అని సీఎం అధికారులకు సూచించారు. ఆ భూములు వినియోగంలోకి తేవాలి ఎస్సీ, ఎస్టీలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములతో పాటు సొంత భూములు ఉపయోగంలోకి తేవాలని సీఎం పేర్కొన్నారు. వారు వ్యవసాయం చేసేందుకు అవసరమైన సహకారం అందించాలని, మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పారు. కేంద్రం ఆ పద్దులను తీసేసింది.. ‘‘కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనలో మార్పులు చేసింది. ప్లాన్, నాన్ ప్లాన్ పద్దులు తీసేసింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అప్పుల కిస్తీలు, కార్యాలయాల నిర్వహణ ఖర్చులు పోను మిగతా వ్యయమంతా ఒకే పద్దు కింద చూపించేలా మార్గదర్శకాలు రూపొందించింది. వాటినే అనుసరించాలి. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు అనుసరించాల్సిన వ్యూహం రూపొందించాలి’’అని ఆదేశించారు. -
వ్యవసాయ సంక్షోభానికి పాలకులే కారణం
– ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : భారతదేశంలో వ్యవసాయ రంగం సంక్షోభానికి పాలకులే కారణమని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు ఆరోపించారు. గురువారం కార్మిక కర్షక భవన్లో సీఐటీయూ నగర కమిటీ కార్యదర్శి ఎండీ అంజిబాబు అధ్యక్షతన ‘వ్యవసాయ సంక్షోభం–రైతులు, కార్మికులపై ప్రభావం’ అనే అంశంపై జిల్లా స్థాయి సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకోవడంలేదన్నారు. రైతుల పరిస్థితి దయనీయంగా మారడంతో వ్యవసాయానికి అనుబంధంగా పనిచేస్తున్న కూలీలు కూడా జీవన భృతిని కోల్పోయి తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులు, కూలీలను ఉదారంగా ఆదుకోవడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు కే.బడేసాహేబ్ మాట్లాడుతూ..జపాన్‌లో 26 శాతం, అమెరికాలో 80 శాతం, యూరప్‌లో 37 శాతం, చైనాలో 34 శాతం, పాకిస్తాన్లో 26 శాతం వ్యవసాయానికి సబ్సిడీలు ఇస్తుంటే భారతదేశంలో ఇది రెండు శాతమే ఉంటోందన్నారు. సాగునీటి వనరులు ఉన్నా వాటిని వినియోగంలోకి తెచ్చుకునేందుకు ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్, పుల్లారెడ్డి, సబ్బయ్య, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. -
బ్రాహ్మణుల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు
కర్నూలు (అర్బన్): రాష్ట్రంలోని బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు శాసనమండలి చైర్మన్ డా.ఎ.చక్రపాణియాదవ్, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. శనివారం బ్రాహ్మణ కార్పొరేషన్ కో ఆర్డినేటర్ సముద్రాల హనుమంతరావు, బ్రాహ్మణ సంఘం నాయకులు మండలి చైర్మన్, రాజ్యసభ సభ్యులను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ నగరంలోని బ్రాహ్మణులకు ఎన్టీఆర్ గృహాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు మండలి చైర్మన్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బ్రాహ్మణులకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలోనే అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్‌కు శిక్షణ తీసుకోవాలనే పేద బ్రాహ్మణులకు రూ.ఒక లక్ష వరకు కార్పొరేషన్ ఫీజు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నేతలు హెచ్.కె.మనోహర్‌రావు, రాజశేఖర్‌రావు, మురళి, కల్లె వేణుగోపాలశర్మ తదితరులు పాల్గొన్నారు. -
క్షురక క్షుద్బాధ!
- అందని సంక్షేమ పథకాలు - వెక్కిరిస్తున్న పేదరికం - పట్టించుకోని ప్రభుత్వం - అభివృద్ధి దూరంగా నాయీ బ్రాహ్మణులు వెలుగోడు: నాయీబ్రాహ్మణులు..పెళ్లి, పేరంటాలు, పూజా పునస్కారాలు, దినకర్మలు, క్షౌరవృత్తితో పాటు అనేక రకాల పనులు చేయడంలో నేర్పరులు. సమాజానికి ఎంతో మేలు చేసే వీరికి మాత్రం ప్రభుత్వం తగిన చేయూతనివ్వడం లేదు. కులవృత్తుల సంక్షేమ నిధి నుంచి వీరికి సాయం అందడం లేదు. వీరి ఎదుగుదలకు.. డోలు, సన్నాయి లాంటి పరికరాలు ప్రభుత్వం అందించడం లేదు. సబ్సిడీపై రుణాలు కూడా ఇవ్వడం లేదు. వారసత్వంగా వచ్చే శిక్షణతోనే వృత్తి సాగిస్తూ వీరు పస్తులతో కాలం గడపుతున్నారు. జిల్లాలో నాయీ బ్రాహ్మణ కుటుంబాలు 12,000 వరకు ఉన్నాయి. జిల్లాలో 70,000 మంది ఓటర్లు ఉన్నారు. అనేక వృత్తుల వారికి ప్రభుత్వం చేయూత ఇస్తోందని.. తమను మాత్రం గాలికి వదిలేసిందని వీరు ఆరోపిస్తున్నారు. అన్ని వృత్తుల మాదిరి తమనూ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. వృత్తిలో భాగంగా వీరు అనారోగ్యాలకు గురవుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలు పోషించుకోవడం, పిల్లల్ని చదివించుకోవడం కష్టంగా మారింది. అద్దె చెల్లింపులూ కష్టమే.. ఒకప్పుడు తిండిగింజల కోసం వీరు క్షవరం చేసేవారు. ప్రస్తుతం డబ్బుల కోసం వృత్తి కొనసాగిస్తూ కుటుంబాలను పోషించుకున్నారు. ఏడెనిమిది సంవత్సరాల నుంచి క్షవర వృత్తి కొత్తపుంతలు తొక్కుతోంది. జిల్లాలో 6వేల వరకు మంగలిషాపులు ఉండగా.. వివిధ రకాల కాస్మోటిక్స్‌తో వీటిని తీర్చిదిద్దుతున్నారు. ఒక షాపు ఏర్పాటు చేయాలంటే కనీసం లక్షన్నర రూపాయల ఖర్చు అవుతోంది. ఇంకా మెరుగైన సౌకర్యాలతో ఏర్పాటు చేయాలంటే రూ.5లక్షలు ఖర్చు అవుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి అద్దె చెల్లించడం కష్టంగా మారింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్నప్పటికీ కుటుంబాలను పోషించుకోలేని దుర్భర స్థితిలో వీరు ఉన్నారు. అందని ప్రభుత్వ సాయం.. ఎన్టిఆర్ హయాంలో క్షౌర వృత్తిపై పన్ను విధించారు. దీన్ని నిరసిస్తూ అనేక ఆందోళనలు చేపట్టడంతో అప్పటి ప్రభుత్వం వెనక్కితగ్గింది. తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్షౌర సామగ్రి ఇప్పించారు. ఇది కులవృత్తుల సంక్షేమ నిధి నుంచి ఇచ్చారు. తరువాత వైఎస్ఆర్.. మంగలిషాపులకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చారు. అయితే కిరణ్‌కుమార్ రెడ్డి సర్కార్ దానిని తొలగించింది. ఎన్నో రకాలుగా సేవలు చేసే నాయిబ్రాహ్మణలకు ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందడం లేదు. ఇవీ డిమాండ్లు – నాయిబ్రాహ్మణులకు ప్రభుత్వం ఇతర కులవృత్తుల మాదిరిగానే అన్ని సౌకర్యాలు కల్పించాలి. – కులవృత్తుల కోటాకింద క్షౌరవృత్తి సామగ్రి అందించాలి. – ఉచిత విద్యుత్ సరఫరా చేయాలి. – ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్రూం పథకం కింద ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. – వత్తి శిక్షణలో భాగంగా హర్మోనియం, సన్నాయి, డోలు లాంటివి ఉచితంగా ఇప్పించాలి. – ప్రతి గ్రామంలో భవనం నిర్మించి ఇవ్వాలి. మండల కేంద్రంలో ఒక భవనం ఉండాలి. -
కార్మికుల సంక్షేమమే ఎన్ఎంయూ లక్ష్యం
* ఎన్ఎంయూ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షుడు డీఎస్పీ రావు రేపల్లె: ఏపీఎస్ ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికలో నేషనల్ మజ్దూర్ యూనియన్ అభ్యర్థిగా రేపల్లె డిపో నుంచి పోటీచేస్తున్న ఇంకొల్లు శ్రీనివాసరావును బలపరచాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షుడు డీఎస్పీ రావు ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. సీపీఎస్ ఎన్నికలను పురస్కరించుకుని స్థానిక డిపో కార్యాలయం ఎదుట ఆదివారం నిర్వహించిన గేట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సంక్షేమమే ఎన్ఎంయూ లక్ష్యమన్నారు. గత సీసీఎస్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయని ఘనత ఎంప్లాయీస్ యూనియన్‌కే దక్కుతుందన్నారు. కార్మికులకు అవసరమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలంటే ఎన్ఎంయూ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్ఎంయు పాలకవర్గంగా ఉన్న సమయంలో సీసీఎస్‌లో స్వల్పకాలిక రుణాల వరకు మాత్రమే ఉండగా గృహ రుణాలను ప్రవేశపెట్టిందన్నారు. గృహ రుణాలపై ఉన్న 12.5 శాతం వడ్డీని 9శాతంకు తగ్గించిందని, పిల్లల చదువులకై నూతనంగా విద్యారుణాలు ప్రవేశపెట్టింది ఎన్‌ఎంయునే అని తెలిపారు. ప్రతి సభ్యుడికి 10రోజులలో లోన్లు వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎడ్యుకేషన్ లోన్లు పెంచడం, నూతన సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని చెప్పారు. ఇన్సూరెన్స్ పథకంను లక్ష నుంచి రూ.10లక్షలకు పెంచుతామని వెల్లడించారు. ప్రతి జోన్లో ఒక సీసీఎస్ బ్రాంచ్ ఆఫీసును ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఎన్ఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.హనుమంతరావు, రీజియర్ సెక్రటరీ కేవిఎస్ నరసింహారావు, జోనల్ ట్రెజరర్ ప్రభాకరరావు, ఎన్ఎంయు అభ్యర్ధి ఇంకొల్లు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నమ్మకం.. అమ్మకం!
- రూ. 7 కోట్ల విక్రయానికి 'వెల్ఫేర్ 'భూములు - జిల్లాలో 1.5 లక్షల మంది బాధితులు - బోర్డు తిప్పేందుకు రంగం సిద్ధం నమ్మకానికి అమ్మవంటిదంటూ ప్రచార మాద్యమాల్లో ఊదరగొట్టిన 'వెల్ఫేర్' సంస్థ. అదే నమ్మకాన్ని అంగట్లో పెట్టి అమ్ముకుంటోంది. అక్షయ గోల్డ్, అగ్రిగోల్డ్, అభయగోల్డ్, అక్షిత, అవని గోల్డు వంటి సంస్థలు వేల కోట్లు కొల్ల గొట్టిన సంఘటనలు ఇంకా కోర్టుల్లో విచారణ దశల్లోనే ఉంటే మరో సంస్థ బోర్డు తిప్పేసేందుకు రంగం సిద్ధం చేసుకొంది. అందులో భాగంగా ఎమ్మిగనూరులో 'వెల్ఫేర్' భూములు రూ. 7 కోట్లకు అమ్మేయటం ప్రకంపనలు సృష్టించింది. నిన్నటి వరకు సంస్థ లేకపోయినా స్థలాలు ఉన్నాయనే భరోసాతో ఉన్న బాధితులు నేడు లబోదిబోమంటున్నారు. - ఎమ్మిగనూరు రాష్ట్ర వ్యాప్తంగా 800కు పైగా బ్రాంచ్‌లు ఉన్న వెల్ఫేర్ సంస్థ నాలుగేళ్లుగా నగదు లావాదేవీలకు బ్రేకులు వేసింది. రోజుకో వంద చొప్పున నెలకు రూ. 3,000 వంతున ఏడాదిలో రూ. 36,000 కడితే వెల్ఫేర్ సంస్థ ద్వారా ప్లాటు (100 చదరపు గజాలు) రిజిస్ట్రేషన్ చేయించడం, లేకపోతే లబ్ధిదారుడు కట్టిన సొమ్ముకు 10 శాతం ఎక్కువ కలిపి నగదు చెల్లిస్తామంటూ ఏజెంట్లు నమ్మ బలికారు. జిల్లాలో సుమారు 1.5 లక్షల మంది సభ్యులుగా చేరారు. ఇలా చేరి పొదుపు చేసిన వారి మొత్తమే రూ. 54 కోట్లకు పైబడి అవుతోంది. ఐదేళ్ల కాలపరిమితితో మరో రూ.30 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు సేకరించినట్లు తెలుస్తోంది. గొలుసు కట్టు కథలో అన్ని కంపెనీలు ఇప్పటికే బోర్డులు తిప్పేసి ఎందరో ఏజెంట్లు, సభ్యుల చావులకు కారణమైతే తాజాగా ఎమ్మిగనూరు సంఘటనతో వెల్ఫేర్ సంస్థపై సభ్యుల నమ్మకం అమ్మకానికి పెట్టేశారు. ఎమ్మిగనూరుకు కూతవేటు దూరంలో కలుగొట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని కర్నూలు – బళ్లారి ప్రధాన రహదారి పక్కన ఉన్న 17.50 ఎకరాల భూమి (సర్వే నంబర్లు 172, 174ఎ, 174బీ, 174సీ, 175, 178) వెల్ఫేర్ సంస్థ 2009, 2010లో కొనుగోలు చేసింది. అయితే ఎమ్మిగనూరుకు చెందిన వ్యాపారులు వారం రోజుల క్రితం ఎకరా రూ.42 లక్షల ప్రకారం రూ. 7 కోట్లకు ఈ పొలాన్ని కొనుగోలు చేశారు. జిల్లాలోని లక్షాయాభైవేల మంది నమ్మకాన్ని వమ్ముచేశారు. బ్లాక్‌మనీతో కొనుగోలు: ఒక పక్క పెద్ద నోట్ల రద్దుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వెల్ఫేర్ సంస్థకు చెందిన స్థలాన్ని రూ. 7 కోట్లకు కొనుగోలు చేయటం రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం రేపింది. ఆదోనికి చెందిన డాక్టర్ దంపతులు, పార్లపల్లెకు చెందిన దళారి మర్చంట్, డోన్, కోడుమూరుకు చెందిన బడా నేతలు ఈ కొనుగోలు చేపట్టినట్లు తెలుస్తొంది. ఎమ్మిగనూరులోని గాంధీనగర్‌కు చెందిన ఓ దుస్తుల షాపు యజమానీ, గోనెగండ్లకు చెందిన ఎల్ఐసీ ఏజెంట్ వీరందరికీ బినామీలుగా ఉండి వ్యవహారం చక్క బెడుతున్నారు. అయితే వాస్తవానికి వెల్ఫేర్ సంస్థలో చేరిన సభ్యుల కోసం ఆ సంస్థ 2013లోనే ఈ భూములను లే అవుట్ భూములుగా మార్చింది. కలుగొట్ల పంచాయతీలో ఎల్పీసీ 138/2013గా కూడా నమోదైంది. నల్లధనంతో కొనుగోలు చేసిన వ్యక్తులు అప్పుడే వెల్ఫేర్ బోర్డు స్థానంలో గ్రీన్ సిటీగా పేరు మార్చి సెంట్ రూ. 1.20 లక్షలుగా అమ్మకానికి పెట్టారు. వెల్ఫేర్ సభ్యులకు న్యాయం చేసిన తరువాత ఎటువంటి లావాదేవీలైనా జరపాలనీ, ముందుగానే ఇలా అక్రమ పద్ధతుల్లో అమ్ముకోవటంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఈ భూముల అమ్మకాలను రద్దు చేయాలనీ, లేకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడుతామని వెల్ఫేర్ బాధితులు హెచ్చరిస్తున్నారు. -
పేదల అభ్యున్నతికి కృషి
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు – పథకం ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కర్నూలు(అగ్రికల్చర్): పేదల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. అందులో భాగంగానే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారని చెప్పారు. మన జిల్లాకు 10వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరు అయ్యాయని ఆయన ప్రకటించారు. గురువారం కర్నూలు వెంకటరమణ కాలనీలోని పర్యాటక సంస్థకు చెందిన హరిత గెస్ట్‌హౌస్‌లో ఉజ్వల యోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు. మొదటి రోజు 200 గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దారిద్య్రరేఖకు దిగువనున్న మహిళలు ఆధార్ నంబరు, బ్యాంకు పాసు పుస్తకం చూసిస్తే ఎలాంటి డబ్బు లేకుండా గ్యాస్ కనెక్షన్ ఇస్తారనా్నరు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ... మహిళల సంక్షేమం లక్ష్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. వంటకు కట్టెలను వాడటంతో మహిళల ఆరోగ్యంతో పాటు అడవులు దెబ్బతింటున్నాయని చెప్పారు. గ్యాస్ కనెక్షన్లు లేనివారు తహసీల్దారు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఐఓసీ ఏరియా మేనేజర్ మీరనాయర్ మాట్లాడుతూ... 18 ఏళ్లు పైబడిన నిరుపేద మహిళలకు సిలిండరు, గ్యాస్, రెగ్యులేటరు, లైటర్, పాస్ పుస్తకం ఉచితంగా ఇస్తామని తెలిపారు. గ్యాస్ స్టవ్‌కు రూ.990, గ్యాస్‌కు రూ.600 కేంద్రం లోన్ ఇస్తుందని తెలిపారు. లోన్ తీరే వరకు వీరికి గ్యాస్ సబ్సిడీ రాదని అది కేంద్రానికి వెలుతుందన్నారు. గ్రామాల్లోనే క్యాంపులు పెట్టి గ్యాస్ వినియోగంపై అవగాహన కల్పించిన తర్వాతనే కనెక్షన్లు ఇస్తామని వెల్లడించారు. సమావేశంలో డీఎస్ఓ తిప్పేనాయక్, ఐఓసీ సేల్స్ ఆఫీసర్ హరికృష్ణ, హెచ్ఓపీ సేల్స్ ఆఫీసర్ మురళీమోహన్, బీఓపీ టెరిటరీ మేనేజర్ దిలీఫ్, సేల్స్ ఆఫీసర్ సురేష్, గ్యాస్ డిస్ట్రిబ్యూటరీలు రమేష్‌గౌడు, శ్వేత, వెంకటేశ్వరరెడ్డి, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చెంచుల సంక్షేమానికి కృషి
కలెక్టర్ సుజాతశర్మ యర్రగొండపాలెం: గిరిజన చెంచుల సంక్షేమం కోసం ప్రభుత్వ శాఖలన్నీ కలసికట్టుగా పనిచేయాలని కలెక్టర్ సుజాతశర్మ అధికారులకు సూచించారు. మండలంలోని వెంకటాద్రిపాలెంలో కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెంచులు నివసించే ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నల్లమల అడవుల్లోని పాలుట్ల గిరిజన గూడేనికి ప్రతినెలా 5, 20 తేదీల్లో వైద్యాధికారులు వెళ్లి వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. గిరిజన గూడెంలో నీటి వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్లూ్యఎస్ అధికారులను ఆదేశించారు. చెన్నుపల్లి(అల్లిపాలెం) చెంచు గూడెంను రెవెన్యూ గ్రామంగా మార్చి అన్ని సదుపాయాలు కల్పించాలని స్థానికులు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అటవీ హక్కుల చట్టం కింద 350 ఎకరాల మేరకు సాగుభూమికి పట్టాలిచ్చారని, అక్కడే నివాసం ఉండి వ్యవసాయం చేసుకుంటున్నామని వారు తెలిపారు. నివాస స్థలాలకు పట్టాలు ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డు పడుతున్నారన్నారు. నల్లమల అడవుల్లో నివసించే చెంచులకు ఆర్ఏపీ, టీఏపీ, డబ్ల్యూపీ కింద 170 రేషన్ కార్డులు ఇచ్చారని, ఈ కార్డులకు ఒక్కొక్క దానికి కేవలం 4 నుంచి 10 కిలోల బియ్యం ఇస్తున్నారని, ఈ కార్డులను అంత్యోదయ అన్న యోజన కింద మార్పుచేసి కార్డుకు 35 కిలోల ప్రకారం బియ్యం పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని గిరిజన చెంచు సంక్షేమ సంఘం నాయకులు చెవుల అంజయ్య, ఎన్.ఈదన్న, మంతన్న కోరారు. పునరావాస కాలనీలో శ్మశాన lవాటికకు స్థలం చూపించాలని, పక్కా గృహాలు ఏర్పాటు చేయాలని చెంచులు కోరారు. వేలి ముద్రలు పడటంలేదని డీలర్ రేషన్ ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. పునరావాస కాలనీకి రోడ్డు వేయాలని, డీప్‌వెల్ బోరువేసి మంచినీరు సరఫరా చేయాలని మినీ అంగన్వాడీ భవన నిర్మాణం చేపట్టాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ముందుగా వెంకటాద్రిపాలెం, పునరావాస కాలనీల్లోని అంగన్వాడీ కేంద్రాలను ఆమె సందర్శించారు. మెుక్కలు నాటారు. యర్రగొండపాలెంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ డి.శ్రీనివాసరావు, మార్కాపురం ఆర్డీవో చంద్రశేఖరరావు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి పి.కొండయ్య, డ్వామా ఏపీడీ రమేష్‌బాబు, జిల్లా వైద్యాధికారిణి యాస్మిన్, డీపీవో ఎస్ఎస్వీ ప్రసాద్, డీటీడబ్ల్యూ ప్రేమానందం, పంచాయతీరాజ్ ఎస్ఈ చంద్రశేఖరయ్య, ఐసీడీఎస్ పీడీ జి.విశాలాక్ష్మి, హౌసింగ్ ఈఈ తారకరామారావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ కె.వెంకటేశ్వర్లు, ఏఈ ఆరె భవాని, తహశీల్దార్ ఎం. రత్నకుమారి, ఎంపీడీవో టి.హనుమంతరావు, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీడీ టి.వెంకటేశ్వర్లు, ఏడీఏ డి.బాలాజీనాయక్ పాల్గొన్నారు. -
ప్రాంతీయ పార్టీలతో అభివృద్ధి జరగదు
కుటుంబ పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలి: లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రాభివృద్ధి జరగదని, కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు సక్రమంగా అమలు కావని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ప్రాంతీయ పార్టీలకు ప్రజాసంక్షేమం కంటే కుటుంబ సంక్షేమమే ముఖ్యమన్నారు. యూపీలో సమాజ్‌వాదీ ప్రభుత్వం కుటుంబ కలహాలతో బజారుకెక్కిందన్నారు. కుటుంబ పార్టీలు ఎక్కడున్నా అదే జరుగుతుందని, ప్రజలు జాగురుకతతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ వంద రోజుల ప్రణాళిక... రూ.వంద కోట్ల స్వాహాకు దారితీసిందన్నారు. నగరంలో చిన్న వాన వచ్చినా నదుల మాదిరిగా పరిస్థితి తయారవుతోందన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ సమక్షంలో పలువురు టీడీపీ, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... ప్రధాని మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తుంటే, సీఎం కేసీఆర్ మాత్రం సచివాలయానికి రారని, ఫామ్‌హౌస్, క్యాంప్ ఆఫీసుల నుంచే పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కేంద్రం రాష్ట్రానికి 85 వేల ఇళ్లు కేటాయించినా, టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కేజీ టూ పీజీ విద్య, దళితులకు 3 ఎకరాలు తదితర హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.3,060 కోట్లు, ఆరోగ్యశ్రీ రూ.430 కోటల బకాయిలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే వాస్తు పేరిట కొత్త సెక్రటేరియట్ భవనాలకు రూ.350 కోట్లు వెచ్చించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. శ్వాస ఫౌండేషన్ రూపొందించిన ‘స్వచ్ఛ దివాళి-సేప్ దివాళి’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. -
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పోరాటం
– సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమమే లక్ష్యం – వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి – ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి జగన్ హామీ : హఫీజ్ ఖాన్ కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు రవాణ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరు కొనసాగిస్తామని వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కొత్త బస్టాండ్‌లోని రీజినల్ మేనేజరు కార్యాలయంలో ఆర్ఎం వెంకటేశ్వరరావును కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కొత్తగా ఎంపికైనా రీజియన్ (జిల్లా) కమిటీని ఆర్ఎంకు పరిచయం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు, కింది స్థాయి సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు. రోజురోజుకు బస్సుల సంఖ్యను తగ్గించడం, అద్దె బస్సులను పెంచడంతో ప్రైవేటు పరం అవుతుందనే అభద్రతాభావంతో కార్మికులు పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా డ్రైవర్, కండక్టర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగి మానసికంగా ఆందోళనలకు గురవుతున్నారని చెప్పారు. చట్ట విరుద్ధంగా ప్రైవేటు వాహనాదారులు ప్రయాణికులను తీసుకెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమాన్నారు. నష్టాల పేరుతో సర్వీసులను తగ్గిండం సరి కాదన్నారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయ కర్త, ఆర్టీసీ యూనియన్ కర్నూలు–2డిపో గౌరవ అధ్యక్షుడు ఎంఎ హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. వాస్తవానికి గత టీడీపీ పాలనలో ఆర్టీసీ పరిస్థితి మునిగిపోయే నావాలా ఉండేదని, అయితే 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదుకుని జీవం పోశారని గుర్తు చేశారు. ఆయన తరువాత ఆర్టీసీని పట్టించుకునే నాథుడు కరువయ్యారని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయక వేలాంది మంది చవువుకున్న నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారని చెప్పారు. కార్మికుల సమస్యలపై చర్చించేందుకు అన్ని సంఘాల తరహాలో వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌కూ సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ఆర్ఎం స్పందించి ప్రతి నెలా రెండు సార్లు యూనియన్ నాయకులు కలిసేందుకు సమయం ఇస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రీజినల్ అధ్యక్ష, కార్యదర్శులు బి. చంద్రశేఖర్, జి. సెబాస్టీయన్, ముఖ్య సలహాదారు వై. మాధవస్వామి, 2డిపో నాయకులు ప్రభుదాస్, నాగన్న, వైఎస్ఆర్సీపీ నాయకులు పేలాల రాఘవేంద్ర, మాలిక్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమానికి వైకల్యం
దివ్యాంగులకు చంద్రబాబు సర్కారు మొండిచేయి... పింఛన్ కోసం నాలుగు లక్షలమంది ఎదురుచూపు ధ్రువీకరణ ఉన్నా 2.5 లక్షల మందికి పింఛన్ లేదు పరీక్షల కోసం మరో లక్షన్నరమంది పడిగాపులు మెడికల్ క్యాంపులకు నిధులివ్వని రాష్ర్ట ప్రభుత్వం సర్కారు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వికలాంగులు రెండున్నరేళ్లలో తగ్గిన వికలాంగ పింఛన్లు సాక్షి, అమరావతి అసలే వైకల్యం.. కాళ్లు, చేతులు సరిలేక, శరీరం సహకరించక.. ఒక చోట నుంచి మరో చోటకు కదలాలంటే నరకయాతన.. అలాంటి దివ్యాంగులు ప్రతిరోజూ ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బాధనంతటినీ పంటిబిగువున భరిస్తున్నారు. వైకల్య సర్టిఫికెట్ కోసం అవసరమైన వైద్య పరీక్షల కోసం కొంత మంది.... సర్టిఫికెట్ ఉన్నా పింఛన్ ఇచ్చే నాథుడు కానరాక మరికొంతమంది... సర్కారు కార్యాలయాల బైట పడిగాపులు పడుతున్నారు. ఈ రెండు కేటగిరీల సంఖ్య చూస్తేనే నాలుగులక్షలు దాటిందంటే ఆశ్చర్యం కలగక మానదు. సర్కారు సరిగ్గా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తే ఇంకా ఎన్నో లక్షల మంది గురించి తెలిసే అవకాశం ఉంది. కానీ నిధులివ్వని కారణంగా మెడికల్ క్యాంపులే జరగడం లేదు. రెండున్నరేళ్లుగా రాష్ర్టంలో దివ్యాంగుల దీనావస్థ ఇది. వారి సంఖ్య ఎంత ఉన్నా పెన్షన్ పొందేవారి సంఖ్య మాత్రం పెరగడమే లేదు. పైగా తగ్గింది కూడా... అలాగే అన్నిరకాల పింఛన్లదీ అదే పరిస్థితి. పెరగాల్సిందిపోయి తగ్గాయి. రెండున్నరేళ్ల క్రితం 43 లక్షలున్న పింఛన్లు ఇపుడు 42 లక్షలకు తగ్గిపోయాయి. రెండేళ్లుగా తిరుగుతున్న వికలాంగులు.. వికలాంగ పింఛను పొందాలంటే 40శాతానికి పైబడి అంగవైకల్యం ఉండాలనే నిబంధన ఉంది. రాష్ర్టంలోని 13 జిల్లాల్లో వైకల్య ధృవపత్రాల కోసం 11,39,829 మంది ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించిన మెడికల్ క్యాంపులలో 9,83,977 మందికి వైద్య పరీక్షలు జరిగాయి. ఇంకా లక్షన్నరమందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మొత్తం దరఖాస్తు చేసుకున్న 11.39 లక్షల మందిలో 7,71,281 మందికి 40 శాతం పైబడి అంగవైకల్యం ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే వీరిలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 5,36,223 మందికి మాత్రమే పింఛన్లు మంజూరు చేస్తోంది. 40 శాతం పైగా అంగవైకల్యం ఉన్నట్లుగా సర్టిఫికెట్లు పొందిన 2,35,058 మంది గత రెండేళ్లుగా కొత్త పింఛన్ల కోసం మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ నిత్యం తిరుగుతూనే ఉన్నారు. పరీక్షల కోసం 1.55 లక్షల మంది ఎదురుచూపు అంగవైకల్య సర్టిఫికెట్ల జారీ చేయడానికి ఉద్దేశించిన మెడికల్ క్యాంపుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా నిధులు విడుదల చేయడం లేదు. దాంతో లక్షలాదిమంది దివ్యాంగులకు వైద్య పరీక్షలు చేయించుకునే వెసులుబాటే లేకుండా పోయింది. అంగవైకల్య సరిఫికెట్ల కోసం దరఖాస్తుచేసుకున్న వారిలో 9,83,977 మందికి మాత్రమే మెడికల్ క్యాంపుల ద్వారా ప్రభుత్వం వైద్య పరీక్షలు నిర్వహించింది. ఇంకా 1.55 లక్షల మంది ఇప్పటికీ వైద్య పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. తమ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో, ఎవరిని సంప్రదించాలో తెలియక అవస్థలు పడుతున్నారు. ఎవరన్నా చనిపోతేనే కొత్తవారికి పింఛన్ పింఛన్ తీసుకుంటున్నవారు ఎవరన్నా చనిపోతేనే కొత్తవారికి పింఛన్ మంజూరు చేయాలనేది చంద్రబాబు గత తొమ్మిదేళ్ల హయాంలో అనుసరించిన పద్ధతి. ఇపుడు మరలా అదే పునరావృతమైనట్లు కనిపిస్తోంది. వృద్ధులు, వికలాంగులు, వింతంతువులకు కొత్త పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలపకపోతుండడంతో అధికారులు ప్రస్తుతం ఉన్న పింఛనుదారుల్లో ఎవరైనా చనిపోతేనే వారి స్థానంలో కొత్త పించన్లు మంజూరు చేస్తున్నారు. అయితే వికలాంగుల పింఛన్లు అలా ఖాళీ ఏర్పడిన సందర్భంలోనూ గ్రామాల్లో ఉండే జన్మభూమి కమిటీల రాజకీయాలతో ఆయా ఫించన్లను కొత్తగా వికలాంగులకు కాకుండా వృద్ధులకో, వితంతువులకో మంజూరు చేయిస్తున్నారన్న విమర్శలున్నాయి. తగ్గిన వికలాంగ పింఛన్లు రాష్ర్టంలో రెండున్నరేళ్లలో వికలాంగుల పింఛన్ల సంఖ్య పెరగకపోగా తగ్గింది. అదెలాగ అనుకుంటున్నారా? రెండున్నరేళ్ల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినపుడు 5.37లక్షల మంది వికలాంగులకు పింఛన్లు అందేవి. ప్రస్తుతం 5.36 లక్షల మంది వికలాంగులకు మాత్రమే ఫ్రభుత్వం నెలవారీ పింఛన్లు అందజేస్తోంది.అంటే వెయ్యికి పైగా వికలాంగ పింఛన్లు తగ్గిపోయాయన్నమాటేగా.. గత నెలలో.. అంటే సెప్టెంబర్‌లోనూ రాష్ట్ర ప్రభుత్వం 5.36 లక్షల మందికి మాత్రమే పింఛన్లు విడుదల చేసింది. -
మత్స్యకారుల సంక్షేమానికి కృషి
ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. స్థానిక అశోక్‌నగర్‌లోని ఫంక్షన్ హాలులో సోమవారం ఆ సంఘం రాష్ట్ర నాయకులు కుళ్లాయప్ప అధ్యక్షతన మత్స్యకారుల జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. చేపలు పట్టి జీవించేవారికి కోస్తాలో మంచి ఉపాధి అవకాశాలున్నాయన్నారు. కరువు నేపథ్యంలో జిల్లాలోని చెరువు ఎండిపోయి జీవనవృత్తిని కోల్పోయిన మత్స్యకారులు పేదరికంలో మగ్గుతున్నారని విచారం వ్యక్తం చేశారు. దివంగత రాజశేఖరరెడ్డి ప్రయత్నం వల్లే హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలు జీడిపల్లికి చేరుకున్నాయన్నారు. ప్రస్తుతం నీటి వనరులు వృద్ధి చెందుతున్న దృష్ట్యా మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. నీళ్లు పుష్కలంగా ఉంటేనే మత్స్యకారులు సంతృప్తిగా జీవిస్తారన్నారు. జిల్లా మత్స్యకారుల డిమాండ్ల సాధనకు తమ మద్దతు ఉంటుందన్నారు. బెస్తలను ఎస్టీల్లో చేరుస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సంఘం నాయకులు కుళ్లాయప్ప మాట్లాడుతూ మత్స్యకారుల సహకార సంఘాలకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమాఖ్య జిల్లా అధ్యక్షులు నాగరాజు, మత్స్య సంఘం నాయకులు రవి, వెంగముని, చిన్ననారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జాలర్ల సంక్షేమానికి రూ.299 కోట్లు
బాపట్ల: జాలర్ల సంక్షేమం కోసం రూ.299 కోట్ల నిధులు కేటాయించినట్లు మత్స్యశాఖ కమిషనర్ శ్రీరామ్‌శంకర్ నాయక్ చెప్పారు. ఆదివారం బాపట్లలోని విజన్ కళాశాలలో ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి మత్స్యకారుల శిక్షణ సదస్సు ప్రారంభ సభలో ఆయన పాల్గొన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం పలు పథకాలు చేపట్టిందని తెలిపారు. ఉపాధి హామీ పథకం నిధులతో చేపలు ఆరబెట్టుకునే ప్లాట్‌ఫారాలు నిర్మించుకునేందుకు అవకాశం ఉందన్నారు. బాపట్లలో పండుకప్ప, పీతల హేచరీల నిర్మాణానికి స్థల సేకరణ పూర్తిచేసి ఎంపెడాకు అప్పగించినట్లు తెలిపారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మత్స్యకారులకు అందడం లేదని చెప్పారు. వీటిపై వారికి సరైన అవగాహన లేకపోవడంతోపాటు దళారీ వ్యవస్థ పెరిగిందన్నారు. అర్హులైన యువకులను కోస్ట్‌గార్డు ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి గౌరవ అధ్యక్షుడు కొండూరి జయరామయ్య అధ్యక్షత వహించిన ఈ సభలో మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పోలయ్య, సర్పంచ్ కత్తి వీణాంబ, బీజేపీ నాయకులు, 13 జిల్లాల పరిధిలోని సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నాం
ఆత్మకూరు(ఎం): ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం రైతుల సంక్షేమ కోసం కృషి చేస్తుందని చైర్మన్ జిల్లాల శేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో సంఘం 33వ వార్షిక సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ జిల్లాల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి రైతులు కూడ తమ వంతుగా సహకరించాలని తెలిపారు. తీసుకున్న పంట రుణాలు తిరిగి చెల్లించినప్పుడే సహకార సంఘం అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వ్యవసాయానికి అప్పు తీసుకున్న రూ. 1.46కోట్లకు గానూ 43 మంది రైతులకు నోటీసులు అందజేయగా రూ. 23లక్షలు మాత్రమే వసూలు చేయగలిగామని అన్నారు. కూరెళ్ల, పల్లెర్ల గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలు నిర్వహిస్తే సహకార సంఘానికి రూ. 5.50లక్షల లాభం చేకూరిందని పేర్కొన్నారు. స్థానికంగా లాకర్ సౌకర్యం లేక పోవడంతో మోత్కూరులోని సీసీ బ్యాంక్‌లో బంగారంపై పంట రుణాలు ఇప్పిస్తున్నట్లు తెలిపారు. రెండు ఎకరాలు పైబడి వ్యవసాయ భూమిని మార్టిగేజ్ చేసినట్లయితే రూ. 7లక్షల వరకు వ్యవసాయ రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. సీఈఓ రామస్వామి నివేదికను చదివి వినిపించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గంగపురం మల్లేశం, వైస్ చైర్మన్ ముద్దసాని సిద్ధులు, మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాస లక్ష్మారెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు బొబ్బల ఇంద్రారెడ్డి, డైరక్టర్లు సోలిపురం మల్లారెడ్డి, ఎర్ర అమృతారెడ్డి, కందడి దశరథరెడ్డి, పీసరి నర్సిరెడ్డి, నాల్కపెల్లి యాదయ్య సిబ్బంది భిక్షం, సింహాద్రి, కిరణ్, పావని పాల్గొన్నారు. -
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి
– జిల్లా జాయింట్ కలెక్టర్ సీ హరికిరణ్ కర్నూలు(అర్బన్): విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్ అన్నారు. ఆదివారం ప్రపంచ వినికిడి మెరుగు పరిచే దినోత్సవాన్ని స్థానిక సీ క్యాంప్‌లోని వికలాంగుల ప్రభుత్వ బాలుర వసతి గహంలో ఘనంగా నిర్వహించారు. వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ కె. భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జేసీ హరికిరణ్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు ఎందులోను ఎవరికి తీసిపోరని చాలా మంది నిరూపించారన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని విద్యలో పోటీ పడి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ వికలాంగులు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలన్నారు. ఏడీ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ శారీరక వికలాంగుల బాలుర వసతి గహానికి, సెన్సరీ పార్కుకు స్థలం కేటాయించాలని కోరారు. అలాగే బధిరులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే 60 మంది బధిరులకు రూ.5.40 లక్షల విలువ చేసే టచ్‌ఫోన్స్, రూ.3 లక్షల విలువ చేసే ట్రై సైకిళ్లు 60 మంది శారీరక వికలాంగులకు, రూ.1.40 లక్షల విలువ చేసే వీల్‌చైర్స్‌ను 20 మంది మానసిక వికలాంగులకు అందించారు. -
ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
హుజూర్నగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 9వ వార్డులో మామిడి రాములుకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.35,500ల చెక్కును ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ తేజావత్ రవినాయక్, సైదులునాయక్, మామిడి వసంత్, ములకలపల్లి రాంబాబు, వెంకటరెడ్డి, మహేష్, చంటి, ఉపేందర్, సైదులు, రాజు పాల్గొన్నారు. -
సంక్షేమానికి చిరునామా వైఎస్సార్
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమానికి, సామాజిక మార్పునకు చిరునామాగా నిలిచారని, అందుకే నేటికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రాన్ని 18 మంది ముఖ్యమంత్రులు పాలించారని, వారెవరికీ సాధ్యంకాని రీతిలో.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అని కొనియాడారు. వైఎస్ వర్ధంతి రోజును ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు సంకల్పదినంగా పాటించాలని పిలుపునిచ్చారు. అపర బ్రహ్మ.. వైఎస్సార్.. మొండి రోగాలకు గురై ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్న పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు వైఎస్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని సూర్యప్రకాశ్ గుర్తు చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సకాలంలో వైద్యం అందించేందుకు 104, 108 అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించి లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన అపర బ్రహ్మ వైఎస్ అని కొనియాడారు. దేశంలో దళితులు, పేదల కోసం కేంద్ర ప్రభుత్వాలు 49 లక్షల గృహాలు నిర్మిస్తే, తన హయాంలో ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు 48 లక్షల కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మించి పేదలకు గూడు కల్పించారని గుర్తు చేశారు. రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను ఇవ్వడమే కాక సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించి.. వారు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించిన రైతు పక్షపాతి వైఎస్ అని చెప్పారు. భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తలపెట్టి, సుమారు 80 శాతం ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి అపర భగీరధుడిగా వెలుగొందుతున్నారన్నారు. టెన్త్, ఇంటర్‌తో చదువు ఆపేసే పరిస్థితుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి లక్షలాది మంది ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పించడంతో పాటు ఇంజనీర్లు, డాక్టర్లు కావడానికి అవకాశం కల్పించిన విద్యాప్రదాత రాజశేఖరరెడ్డి అని శ్లాఘించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొనసాగించడంలో తీవ్రంగా విఫలమయ్యారని విమర్శించారు. మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించే శక్తిసామర్థ్యాలు వైఎస్ జగన్మోహన్రెడ్డికే ఉన్నాయని తెలిపారు. -
సంక్షేమ శాఖలపై సమీక్ష
హన్మకొండ అర్బన్ : జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు కొత్త జిల్లాల ఏర్పా టు తర్వాత ఏ విధంగా ఉండాలనే విషయంపై ఏజేసీ తరుపతిరావు, పీఓ అమయ్‌కుమార్ సమీక్షించారు. కలెక్టరేట్లోని ఏజేసీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షలో జిల్లాలోని అధికారులు, జిల్లాలకు కేటాయింపులు, సిబ్బంది కొరత, తదితర అంశాలపై చర్చిం చారు. అనంతరం కలెక్టర్‌కు తుది నివేదిక అందజేశారు. సమావేశంలో ఈడీలు నర్సింహా స్వామి, సురేష్, డీడీలు శంకర్, చందన, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లాల ఏర్పాటుపై 2,428 అప్పీళ్లు హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి బుధ వా రం రాత్రి వరకు ఆన్లైన్ ద్వారా మొత్తం 2428 అప్పీళ్లు అందాయి. ఈ మేరకు అధికారులు అభ్యంతరాల వివరాలను తెలిపారు. హన్మకొండ జిల్లాపై 1145, జయశంకర్ జిల్లాపై 570, మహబూబాబాద్ జిల్లాపై 40, వరంగల్ జిల్లాపై 253 అప్పీళ్లు అందినట్లు చెప్పారు. అలాగే రెవెన్యూ డివిజన్లు, మండలాలపై మెుత్తం 420 అభ్యంతరాలు వచ్చినట్లు వారు పేర్కొన్నారు. -
2 కోట్ల అసంఘటిత రంగ కార్మికులకు బీమా
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : రాష్ట్రంలోని 2 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు చంద్రన్న బీమా పథకంలో బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ డి. వరప్రసాద్ తెలిపారు. ఆయన బుధవారం రాజమహేంద్రవరంలోని లా హాæస్పిన్ హోటల్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అసంఘటిత కార్మికులకు దేశంలో మొదటిసారిగా మన రాష్ట్రంలోనే బీమా సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. ఈ బీమా ద్వారా ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షల నగదు చెల్లిస్తారన్నారు. సాధారణ మరణానికి రూ. 30 వేలు ఇస్తారన్నారు. ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం కలిగితే రూ. 5 లక్షలు, పాక్షిక, శాశ్వత అంగ వైకల్యం చెందితే రూ. 3.62 లక్షలు చెల్లిస్తారని తెలిపారు. అంతేకాకుండా ఆ కార్మికుల పిల్లలకు 9, 10, ఇంటర్, ఐఐటి చదివే వారికి సంవత్సరానికి రూ. 1,200 చొప్పున స్కాలర్ షిప్ అందజేస్తారన్నారు. చంద్రన్న బీమాలో నమోదు చేసుకున్నవారికి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా వివాహ కానుక, ప్రసూతి సహాయం, తాత్కాలిక ప్రమాద భృతి, వృత్తి నైపుణ్య శిక్షణ, అంత్య క్రియల సహాయం వంటి సదుపాయాలు కూడా లభిస్తాయన్నారు. ఎన్ఆర్ఈజీఎస్లో కూడా 50 రోజులు పని చేసిన కూలీలను భవన నిర్మాణ కార్మికులుగా పరిగణిస్తారని తెలిపారు. ఈ పథకం కింద కార్మికులకు చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తం రూ. 134 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందన్నారు. సర్వీసు ఛార్జీ కింద బీమాదారు కేవలం రూ. 15 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆటో కార్మికుల సంక్షేమానికి పోరాటం
సిరిసిల్ల టౌన్ : ఆటో కార్మికుల సంక్షేమానికి తాము పోరాటం చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మూషం రమేష్ అన్నారు. ఈనెల 17న ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆర్డీవో కార్యాలయం ముట్టడిస్తామన్నారు. ఆదివారం స్థానిక గాంధీచౌక్‌లో ముట్టడి ప్రచార కరపత్రాలు విడుదల చేసి మాట్లాడారు. కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి పంతం రవి, నాయకులు ఇటిక్యాల అశోక్, పిట్ల బాలయ్య, పున్న దేవయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
ఆటో కార్మికుల అడ్డా ప్రారంభంలో ఎమ్మెల్యే అజయ్‌కుమార్ ఖమ్మం అర్బన్: ప్రభుత్వం కార్మికుల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తుందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని బల్లేపల్లిలో టీఆర్ఎస్ అనుబంధ ఆటో కార్మికుల సంఘం ఏర్పాటు చేసి ఆటో వర్కర్స్ అడ్డాను ప్రారంభించి టీఆర్ఎస్ జెండాను ఎగర వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యాక్రమాలను చేపట్టినట్లు తెలిపారు.ఆనంతరం ఆటో ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొనకంచి ప్రసాద్,ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్యాంసుందర్, కార్యదర్శి సుధాకర్, ప్రధాన కార్యదర్శి మంగ్యా, మల్లూరు, కుమార్,టీఆర్‌ఉస్ జిల్లా నాయకులు కాట్రాల శ్రీరాములు, రమణ, మధన్, మాజీ సర్పంచ్ భూక్యా భాషా, హెచ్. ప్రసాద్,సోమరాజు, రమేష్, సాయిరాం .పాల్గొన్నారు. ఈర్లపుడిలో హరితహారం.. రఘునాథపాలెం మండలంలోని ఈర్లపుడి పంచాయతీలోని వివిధ తండాల్లో గురువారం హరితహారంలో ఎమ్మెల్యే అజయ్‌కుమార్ మొక్కలు నాటారు.పల్లెలు పాడి పంటలతో పచ్చగా ఉండాలన్నా, కాలుష్య రహిత వాతావరణ కావాలన్నా మొక్కలు నాటడమే ప్రధాన లక్ష్యం అన్నారు. కోర్లబోడు తండా, లచ్చిరాం తండా, దోనబండ గ్రామాల్లో మొక్కలు నాటారు.కార్యక్రమంలోఎంపీడీఓ శ్రీనివాసరావు, మండల ఏఈ ఆదిత్య రాజు,సొసైటీ చైర్మన్ తుమ్మల పల్లి మోహన్‌రావు,జెడ్పీటీసీ, ఎంపీపీ,టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాల్గొన్నారు. -
బీసీ సబ్-ప్లాన్‌పై అధ్యయనం
చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన బీసీ వెల్ఫేర్ కమిటీ హైదరాబాద్: రాష్ట్రంలో వెనుకబడిన కులాల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపడుతున్న పథకాల అమలును అసెంబ్లీ బీసీ వెల్ఫేర్ కమిటీ సమీక్షించింది. ఈమేరకు కమిటీ చైర్మన్ , ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్ అధ్యక్షతన బుధవారం అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశం జరిగింది. పొరుగు రాష్ట్రమైన ఏపీలో బీసీల కోసం తీసుకు వచ్చిన బీసీ సబ్-ప్లాన్‌పై అధ్యయనం చేసేందుకు ఈ కమిటీ చిత్తూరు జిల్లాకు వెళ్లాలని నిర్ణయించింది. బుధవారం రాత్రి బయలుదేరిన ఈ కమిటీ శుక్రవారం ఆ జిల్లాలో పర్యటించనుంది. కాగా పీయూసీ హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డును పరిశీలించింది. క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా పీయూసీ చైర్మన్ దివాకర్‌రావు సారథ్యంలో ఈ కమిటీ బుధవారం రింగురోడ్డు పనుల్లో జరిగిన అవకతవకలను పరిశీలించింది. నిర్మాణ పనుల్లో రూ.9కోట్లు దుర్వినియోగం జరిగినట్లు కాగ్ గుర్తించిం దని, ఈ మేరకు విజిలెన్సు విచారణ జరిపించి దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అలాగే అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ హన్మంత్ షిండే నేతృత్వంలో క్షేత్ర స్థాయి పర్యటన జరిపింది. మరో వైపు అసెంబ్లీ మహిళా శిశు సంక్షేమ కమిటీ చైర్పర్సన్ రేఖా నాయక్ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమైంది. మహిళలు, శిశువుల కోసం అమలు చేస్తున్న పథకాల అమలు తీరును సమీక్షించింది. -
రైతుల సంక్షేమం కోసమే పథకాలు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కల్లూరు : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందని ఆర్అండ్బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని నారాయణపురం లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణ పనులకు శంఖుస్థాపన చేసిన అనంతరం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. జిల్లాకు రూ. 40 కోట్లు మంజూరైతే సత్తుపల్లి నియోజకవర్గంలోని 17 ఎత్తి పోతల పథకాలకే రూ.27 కోట్లు కేటాయించామన్నారు. గోదావరి జలాలను జిల్లాకు తీసుకొచ్చి ఇక్కడ భూములను సస్యశ్యామలంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆర్అండ్బీ నుంచి జిల్లాకు రూ. 1200 కోట్లు మంజూరైతే సత్తుపల్లికి రూ.200, పీఆర్ నుంచి రూ.50 కోట్లు కేటాయించామన్నారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని కొద్ది రోజుల్లోనే చూస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కవిత, ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, ప్రజాప్రతినిధులు, నాయకులు జయలక్ష్మి, లీలావతి, దయానంద్ విజయ్‌కుమార్, కృష్ణ, రామూనాయక్, చందర్రావు, రామారావు, రఘు, మోహనరావు, వెంకటేశ్వరరెడ్డి, రాము, సత్తిరెడ్డి, లోకేష్, శ్రీనివాసరావు, శ్రీను, కిరణ్, శ్రీనాథ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
ఇవి పాటిస్తే గేటెడ్‌లో నిశ్చింతే!
సాక్షి, హైదరాబాద్ : గేటెడ్ కమ్యూనిటీ అయినా లగ్జరీ విల్లా అయినా నివాసితులంతా రోజువారి పనుల్లో బిజీగా ఉంటారు. అసలు పక్కవారి గురించి ఆలోచించే తీరికే ఉండదు. ఈ నేపథ్యంలో నివాసితుల సంక్షేమం కోసం సమయాన్ని వెచ్చించడానికి ముందుకొచ్చేవారిని అభినందించాలి. మంచి పనులు చేస్తే మనస్ఫూర్తిగా ప్రోత్సహించాలి. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవటానికి సలహాలు ఇవ్వాలి. అంతేతప్ప చిన్న పొరపాటునూ భూతద్దంలో చూసి పెద ్దగా చేయకూడదు. ఇలా చేస్తే భవిష్యత్తులో ఆయా సంఘం బాధ్యతల్ని నిర్వర్తించడానికి ఎవరూ ముందుకురాకపోవచ్చు. కాబట్టి నివాసితులంతా సంఘం పట్ల బాధ్యతగా మెలగాలి. ⇔ ఒక అపార్ట్మెంట్లోని వ్యవహారాలన్నీ సమర్థంగా నడిపించాల్సిన విధివిధానాల గురించి ‘బైలాస్’లో స్పష్టంగా రాసుకోవాలి. ఏయే సందర్భాల్లో నివాసితులెలా స్పందించాలో ముందే పేర్కొనాలి. కాబట్టి, ఇందులో పొందుపరిచే నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. అలా చేసినవారి మీద తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా రాసుకుంటే మంచిది. ⇔ సంఘ సభ్యులుగా ఎన్నికయ్యేవారు తోటి సభ్యులతో కలసిమెలసి పనిచేయాలి. వ్యక్తిగత వివాదాల జోలికి వెళ్లకూడదు. రాగద్వేషాలకూ తావివ్వకూడదు. నివాసితులందరికీ ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోవాలి. సంఘంలోని కొందరికే మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకోవటం కరెక్ట్ కాదు. ⇔ నివాసితుల సంఘం ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులకు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నాకే ఎన్నుకోవాలి. ఆయా అభ్యర్థుల ప్రత్యేకతలు, వివిధ సందర్భాల్లో స్పందించే తీరు, సంఘం మేలు కోసం సమయాన్ని వెచ్చించగలరా? అందరికీ ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోగలరా? లేక వ్యక్తిగత లాభాపేక్షను దృష్టిలో పెట్టుకుంటారా? ఇలా పలు అంశాల్ని గమనించాకే నిర్ణయం తీసుకోవాలి. ⇔ కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో కొందరు వ్యక్తులు ‘తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు’ అన్నట్లుగా వ్యవహరిస్తారు. వాళ్లే కరెక్ట్.. ఇతరులు చెప్పేది తప్పని భావిస్తుంటారు. వాళ్లకు నచ్చిన అంశాన్ని ఇతరులు మీద బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తుం టారు. కాబట్టి ఇలాంటి వారు చెప్పే అంశాన్ని లోతుగా పరి శీలించాకే నివాసితులు అంతి మ నిర్ణయానికి రావాలి. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చింతపల్లి : గ్రామీణ ప్రాంతాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల ప్రజలకు, రైతులకు తాగు, సాగునీరు అందించేందుకు చేపట్టిన డిండి ప్రాజెక్టు పనుల టెండర్లను ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు నట్వ గిరిధర్, బోరిగం భూపాల్, గుర్రం జగన్, ఎల్లెంకి అశోక్, ఎల్లెంకి చంద్రశేఖర్, కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎండి.ఖాలెద్, సలీం, ఉజ్జిని రఘురాంరావు, ఎదుళ్ళ గిరిబాబు, ఉడుతల అక్రం, విజయ్‌కుమార్, శీలం సత్తయ్య, మహేందర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.