
సాక్షి, హైదరాబాద్ : యాదవ, కురుమలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా బడుగుల లింగయ్య యాదవ్‌కు అవకాశం ఇచ్చిన సందర్భంగా యాదవ, కురుమ సంఘం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బుధవారం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం యాదవులకు రాజ్యసభ అవకాశం ఇచ్చామని, త్వరలోనే కురుమలకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని సీఎం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 20 మంది గొల్ల, కురుమ నేతలను రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా నియమిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా లింగయ్య యాదవ్‌ను సీఎం అభినందించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, కార్పొరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment