Yadava community
-
తలసాని Vs రేవంత్.. ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గొల్ల కురుమలను కించపరిచేలా రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. దున్నపోతులతో గాంధీభవన్‌ను ముట్టడించేందుకు యాదవ సంఘం యత్నించింది. సమాచారం అందుకున్న పోలీసులు గొల్ల కురుమలను అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు. తలసాని Vs రేవంత్ కాగా రాష్ట్రంలోని యాదవ, కురుమలను అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి తలసానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని యాదవ జేఏసీ డిమాండ్ చేసింది. తమ సామాజికవర్గాన్ని తక్కువ అంచనా వేయకూడదని, రాష్ట్రంలో 20 శాతానికి పైగా జనాభా ఉన్నదని, తమ సత్తా ఏమిటో చూపుతామని అన్నారు. రేవంత్ రెడ్డి ఏ గల్లీలో తిరిగినా అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే 25న వేలాదిగా యాదవులు, కురుమలు దున్నపోతులతో ఇందిరాపార్కు నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తామని, అక్కడి నుంచి గాంధీ భవన్‌కు చేరుకొని ముట్టడిస్తామని మంగళవారం హెచ్చరించారు. -
బహుజన కులాల మద్దతుతోనే...
తొంభై ఎనిమిది ఏండ్ల కింద 1924 సంవత్సరంలో ఒకే వృత్తి, ఒకే సంస్కృతి, ఒకే సంప్రదాయం కలిగిన ఒకే కులం వారు ‘‘అఖిల భారత యాదవ మహాసభ’’గా ఏర్పడ్డారు. దేశంలోని ఇతర అణగారిన కులాలతో కలిసి స్వాతంత్య్రోద్యమంలో ముందు భాగాన నిలిచారు. అనేక మంది వీరులను ఆ సమరానికి వారు అందిం చారు. యాదవ మహాసభ కృషి ఫలితం గానే బ్రిటిష్ పాలకులు 1931వ సంవత్సరంలో కుల గణన చేప ట్టాల్సి వచ్చిందన్నది నేడు గుర్తించాల్సిన విషయం. దాని ఫలితం గానే అట్టడుగు శ్రామిక కులాలవారు ముఖ్యమంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, కలెక్టర్లుగా, న్యాయమూర్తులుగా ఎదిగి వచ్చారు. ముఖ్యంగా ఉత్తర భారతం నుంచి మొదలైన ఈ కల్చర్ అణగారిన కులాలను రాజకీయ బాహుళ్యంలోకి చొచ్చుకుపోయేలా చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఫ్రెంచి విద్యావేత్త క్రిస్టాఫ్ జెప్ఫెర్లో మాటల్లో చెప్పాలంటే... ఇది అణగారిన కులాల్లో ఇంకా సమగ్ర స్వరూపాన్ని సంతరించుకోవాల్సిన ఒక నిశ్శబ్ద విప్లవం. నిజానికి అట్టడుగు కులాలు అధికారం పొందే స్థాయికి ఎదగడం అనేది సూటిగా సాగేది కాదు. అంతర్లీన క్రియాశీల ప్రక్రియ. ఆ రకంగా వచ్చిన అట్టడుగు కులాల చైతన్యం దుర్భేద్యమైన కాంగ్రెస్, ఇతర వారసత్వ రాజకీయాల కంచుకోటలను బద్దలు కొట్టింది. ఫలితంగానే వివిధ రాష్ట్రాల్లో అట్టడుగు కులాలు, అణగారిన జాతులు రాజ్యాధికారంలోకి రాగలిగాయి. ఇది స్వతంత్ర భారతంలో మరింత అభివృద్ధి అయిందని చెప్పవచ్చు. అయితే ఇదే సందర్భంలో ‘‘కుల సంఘాలు కుల నిర్మూలన కోసం పని చేయకుండా తమ స్వేచ్ఛను కోల్పోయి రాజకీయ పార్టీల వాడకానికి గురవుతున్నాయి.’’ ఏ అగ్రకులాధిపత్య, వారసత్వ రాజకీయాలను కూకటివేళ్ళతో పెకలించారో అలాంటి జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కోసమే, కులాలను సంఘటితం చేసే పనిముట్లుగా కుల సంఘాలు మారాయని చరిత్రకారుల విమర్శ కూడా ఉంది. సరిగ్గా ఇక్కడే కుల సంఘాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అణగారిన కులాలు అధికారం అందిపుచ్చుకోవడానికి ఆధిపత్య కులాలూ, పాలక వర్గాలూ అంత ఈజీగా అనుమతించవు. కాబట్టి ఆ పనిని చాప కింద నీరులా చేయాలి. రాజకీయ రంగం లోనూ, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ అణగారిన కులాల క్రియాశీలత మరింత పెంచుకోవాలి. అంటే శ్రామిక కులాల పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ఒక ఉన్నత ఆశయంగా అర్థం చేసుకోవాలి. అది ఈ దేశంలో ఫూలే వెలుగులో ఛత్రపతి సాహూ మహరాజ్ లోతుగా అర్థం చేసుకున్నాడు. కనుకనే సమాజ మార్పుకు చదువే కీలకం అని తెలుసుకున్నాడు. అందుకే ఆయన కుల వివక్ష మీద పోరాడటంతో పాటు కొల్హాపూర్ పట్టణంలో 1901లో జైన హాస్టల్, విక్టోరియా మరాఠ హాస్టల్, 1906లో ముస్లిం హాస్టల్, 1907లో వీరశైవ లింగాయత్ హాస్టల్, 1908లో అంటరాని వారికి, మరాఠాలకి హాస్టల్; దర్జీ, నేతన్నలకు 1921లో నాందేవ్ హాస్టల్, మరాఠాలకి హాస్టల్, విశ్వకర్మలకు సోనార్ హాస్టల్ నెలకొల్పి ఆయా కులాల నుంచి ఆ కాలంలోనే అట్టడుగు కులాలను ఎలైట్ సెక్షన్స్‌గా ఎదిగే విధంగా తోడ్పడ్డాడు. ఆ కోణంలోనే ఉత్తర భారతదేశంలో ‘యాదవ మహాసభ’ కృషి చేసింది. సాహూ మహరాజ్ నేతృత్వంలో జరిగిన కృషి ఫలితాలను తొందరగానే గ్రహించిన ఆధిపత్య కులాల వారైన రెడ్డి, కమ్మ, వెలమలూ... మరికొన్ని వెనకబడిన కులాల వారూ తెలుగు నేలపై సంఘాలుగా సంఘటితమై తమ తమ కులాల అభివృద్ధికి నడుం బిగించారు. హైదరాబాద్‌లో 1909 సంవత్సరంలో ‘యాదవ మహాజన సంఘం’, 1919లో ‘రెడ్డి సంఘం’, 1920లో ‘గౌడ సంఘం’, 1930లో ‘కమ్మ సంఘం’, నిజాం చివరి కాలంలో ‘వెలమ సంఘం’ ఏర్పడ్డాయి. వీటిలో ప్రధానంగా రెడ్డి సంఘం వారు ప్రత్యేకమైన ప్రణాళికతో పని చేశారు. ఆ జాతి విద్యా, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధికి రెడ్డి కుల స్థితిమంతులు విశేష కృషి చేశారు. ‘రెడ్డి హాస్టల్’ లాంటి వసతి గృహాన్ని ఏర్పాటు చేసి విద్యావంతుల్ని తయారుచేసి అధికారం అందుకోవడానికి మార్గం సుగమం చేశారు. ఇది అందరికీ ఆదర్శం. (క్లిక్: దేశమే ఓ ‘సంఘం’.. అది విద్వేష కేంద్రం కాదు!) ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో యాదవులు స్థితి మంతులుగా పెద్ద సంఖ్యలో ఉనప్పటికీ విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వలన తమ హక్కులు పొందడంలో, రాజ్యాధికారం సాధించడంలో వెనుక బడిపోయారన్నది కాదనలేని సత్యం. కనుక వివిధ కుల సంఘాల వారు పై అనుభవాల్లోంచి లోతైన గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ కులానికి ఆ కులం ఎదిగే క్రమంలో మిగతా బహుజన కులాల మద్దతు కూడా తీసుకుంటేనే సమగ్ర అభివృద్ధి సాధ్యం. (క్లిక్: వివక్షను బయటి నుంచి చూస్తే ఎలా?) - చలకాని వెంకట్ యాదవ్ వ్యాసకర్త హైకోర్ట్ న్యాయవాది -
సొంతపిచ్‌పై...అఖిలేశ్‌కు అగ్నిపరీక్ష!
ఉత్తరప్రదేశ్ మొదటిదశ ఎన్నికల్లో జాట్లు కీలకంగా మారగా.. రెండోదశలో (ఫిబ్రవరి 14న పోలింగ్ జరిగింది) ముస్లిం ఆధిపత్య ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. ఈనెల 20న మూడోదశ పోలింగ్ యాదవుల బెల్ట్‌లో జరుగుతోంది. మూడు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 16 జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో యాదవ సామాజికవర్గ బలమెక్కువ. సమాజ్‌వాది (ఎస్పీ)కి దీన్ని కంచుకోటగా అభివర్ణిస్తారు. అలాంటి ఈ ప్రాంతంలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి తలబొప్పి కట్టింది. అఖిలేశ్‌పై తిరుగుబాటు చేసి సొంతకుంపటి పెట్టుకున్న బాబాయి శివపాల్ సింగ్ యాదవ్‌తో ఇటీవలే సయోధ్య కుదుర్చుకోవడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకున్నప్పటికీ ఎస్పీ అధినేతకు మూడోదశ విషమపరీక్షగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని కర్హల్ నుంచే అఖిలేశ్ స్వయంగా బరిలో నిలిచారు. బాబాయ్‌తో సయోధ్యతో పూర్వవైభవంపై ఆశలు పశ్చిమ యూపీలోని..ఐదు జిల్లాలు, అవధ్ ప్రాంతంలోని ఆరు జిల్లాలు, బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ఐదు సీట్లకు ఫిబ్రవరి 20న మూడోదశ పోలింగ్ జరగనుంది. ఫిరోజాబాద్,, కాస్గంజ్, ఎతాహ్, మెయిన్‌పురి,, ఫరూకాబాద్,, కన్నౌజ్, ఔరాయా జిల్లాలు 2017లో అఖిలేశ్ పార్టీకి ఓటువేయలేదు.ఫలితంగా ఐదేళ్ల కిందట మొత్తం 59 సీట్లలో బీజేపీ ఏకంగా 49 తమ ఖాతాలో వేసేసుకుంది. సమాజ్‌వాది పార్టీ తొమ్మిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎస్పీ అధినేత కుటుంబకలహాలు పార్టీ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీశాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు ఉన్నప్పటికీ అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ కన్నౌజ్ నుంచి ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2012లో ఈ 59 సీట్లలో (20న పోలింగ్ జరిగే స్థానాలు) ఎస్పీ 37 చోట్ల నెగ్గడం గమనార్హం.. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ బెల్ట్‌లో ఎస్పీ విజయావకావలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో అఖిలేశ్ తన శివపాల్ యాదవ్‌ను మళ్లీ అక్కున చేర్చుకున్నారు. గతంలో హథ్రాస్ గ్యాంగ్‌రేప్ ఘటన కూడా ఈ ప్రాంతంలోనే జరిగింది. దీని నుంచి లబ్ధి పొందాలని చూస్తున్న ఎస్పీ అధినేత ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తున్నారు. అలాగే ప్రతినెలా ‘హథ్రాస్ కి బేటి స్మృతి దివస్’ను నిర్వహిస్తున్నారు. బుందేల్‌ఖండ్ బాగా వెనుకబడిన ప్రాంతం కావడతో నిరుద్యోగ సమస్య, నీటి ఎద్దటి తదిదర సమస్యలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని.. ఎస్పీ అధికారంలోకి వస్తే ఉచిత రేషన్, నెలకు కిలో నెయ్యిని అందిస్తామని అఖిలేశ్ ఓటర్లుకు హామీ ఇచ్చారు. ఒకప్పుడు బుందేల్‌ఖండ్ బీఎస్పీకి కంచుకోటగా ఉండేది. కానీ 2017లో వీచిన బీజేపీ గాలితో బీఎస్పీ తుడిచిపెట్టుకుపోయింది. హైటెన్షన్ పోరు కర్హాల్ నియోజకవర్గంలో అఖిలేశ్‌కు పోటీగా ఓబీసీ నాయకుడు, కేంద్ర మంత్రి సత్యపాల్‌సింగ్ బఘేల్‌ను బీజేపీ బరిలోకి దింపింది. ఈ స్థానంలో మొత్తం ఓటర్లలో 38 శాతం మంది యాదవులే. తర్వాతి స్థానంలో క్షత్రియులు ఉంటారు. భోగావ్ నియోజకవర్గంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి రామ్‌నరేశ్ అగ్నిహోత్రికే బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. కాన్పూర్ నగర్ జిల్లాలోని మహారాజ్‌పూర్ నుంచి సతీష్ మహానాను బీజేపీ మరోసారి రంగంలోకి దిగింది. తొలిదశ ఎన్నికలు పశ్చిమ యూపీలో జరిగినందువల్ల తమకు అనుకూలత ఉందని భావిస్తున్న అఖిలేశ్ యాదవ్ మూడోదశలో ఎలాగైనా పైచేయి సాధించాలనే పట్టుదలతో పని చేస్తోంది.దీంట్లో పైచేయి సాధిస్తే మిగతా నాలుగు దశల్లో కొంత ప్రశాంతంగా పనిచేసుకోవచ్చని ఎస్పీ భావిస్తోంది. యోగి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కుల, సంకుచిత, నియంతృత్వ పాలనకు ముగింపు పల కండి. సమాజంలోని అన్ని వర్గాలను సమదృష్టితో చూసే బహుజన సమాజ్ పార్టీకే పట్టంకట్టండి. దోపిడీదారుల అరాచకాలతో గతంలో యూపీ ప్రాంత ప్రజలు అవస్థలు పడ్డారు. మా పాలనలో వీరందరినీ ఏరిపారేశాం. ఎస్పీ పాలనలో రాష్ట్రంలో కేవలం ఒక వర్గం వారే అభివృద్ధి ఫలాలను అందుకున్నారు. మా ప్రభుత్వం వెనకబడిన కులాల అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించింది. మిగతా పార్టీల్లా మేం నెరవేర్చని వాగ్దానాలు చేయబోం. అందుకే ఈసారి ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోను విడుదలచేయలేదు. – బీఎస్పీ చీఫ్ మాయావతి అఖిలేశ్ గెలుపు ఖాయమని మొదట్లో అతి విశ్వాసంతో ఉన్నారు. తాను పోటీ చేస్తున్న కర్హాల్ నియోజకవర్గంలో స్వయంగా ప్రచారం చేయా ల్సిన పనే లేదని, నేరుగా ఫలితాలు వెలువడే రోజు(మార్చి పదో తేదీ)న కర్హాల్ వస్తానని అఖిలేశ్ ధీమా వ్యక్తంచేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారినట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్వయంగా ములాయం సింగ్‌తో ముందే ప్రచారం చేయిస్తున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈసారి ఎన్నికల్లో 300 సీట్లు సాధించి బీజేపీ ఘన విజయం సాధించాలని ఓటర్లు ఆకాంక్షిస్తే.. ఈ గెలుపు పరంపర కర్హాల్ నుంచే మొదలవ్వాలి. – హోం మంత్రి అమిత్ షా – నేషనల్ డెస్క్, సాక్షి -
కడప గడపలో తొలిసారి.. బీసీ ఎమ్మెల్సీ
సాక్షి, అమరావతి: కడప జిల్లా నుంచి చట్టసభల్లో బీసీలకు అవకాశం దక్కటమంటే ఒక చరిత్రే!! ఎందుకంటే ఇక్కడ చివరిసారిగా 1962లో కాంగ్రెస్ తరఫున కుండ రామయ్య జమ్మలమడుగు నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. ఆ తరవాత ఏ పార్టీ తరఫున కూడా ఎవ్వరూ ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర లేదు. పోనీ ఎమ్మెల్సీగా అయినా బీసీలకు అవకాశమిచ్చారా అంటే... ఏ పార్టీ కూడా అందుకు ముందుకు రాలేదు. బలహీనవర్గాలకు సముచిత ప్రాధాన్యమిస్తూ బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు బ్యాక్‌బోన్ క్లాస్ అని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్... చేతల్లో కూడా అది చూపించారు. తాజాగా గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీలను నామినేట్ చేస్తూ కడప జిల్లా చరిత్రను తిరగరాశారు. అక్కడి నుంచి రమేష్ యాదవ్‌కు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. వీటికి గవర్నరు ఈ నెల 10న ఆమోదముద్ర వేయగా సోమవారం అధికారికంగా ప్రకటించటం తెలిసిందే. నిజానికి ఆంధ్రప్రదేశ్ శానస మండలి ఏర్పాటయిన తరవాత కడప జిల్లా నుంచి మొత్తం 30 మంది ఎమ్మెల్సీలను ఇప్పటిదాకా వివిధ పార్టీలు నామినేట్ చేశాయి. వారిలో యాదవ సామాజిక వర్గానికి మాత్రం ఇప్పటిదాకా అవకాశం దక్కలేదు. ఇదే తొలిసారి. దీనిపై రమేష్ స్పందిస్తూ ‘‘నన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారని కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఈ జిల్లా నుంచి యాదవ వర్గానికి చెందినవారెవరూ ఇప్పటిదాకా ఎమ్మెల్సీ కాలేదు’’ అని సంతోషం వ్యక్తం చేశారు. రమేష్ యాదవ్ తండ్రి వెంకటసుబ్బయ్య 1987లో ప్రొద్దుటూరు మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్‌గా పనిచేశారు. వైసీపీ ద్వారా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ కావడం పట్ల జిల్లా బీసీలు సైతం హర్షం వ్యక్తం చేశాయి. జగన్ హయాంలోనే బడుగులకు అధికారం తాజాగా నామినేట్ చేసిన మోషేన్‌రాజు (పశ్చిమగోదావరి), రమేష్‌యాదవ్ (కడప), తోట త్రిమూర్తులు (తూర్పుగోదావరి), లేళ్ళ అప్పిరెడ్డి (గుంటూరు)లో సగం... అంటే ఇద్దరు ఎస్సీ, బీసీలకు చెందిన వారు కావటం గమనార్హం. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధికారకంలోకి వచ్చాక వైఎస్సార్ సీపీ తరఫున ఇప్పటిదాకా 15 ఎమ్మెల్సీ స్థానాలను నామినేటెడ్, ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికల ద్వారా భర్తీ చేయగా... ఇందులో 4 ఎస్సీలకు, 4 బీసీలకు, 3 మైనార్టీలకు దక్కాయి. ప్రతిపక్షంలో ఉండగా 2018 తర్వాత భర్తీ చేసిన ఎమ్మెల్సీల్లోనూ బీసీ, ఎస్సీ, మైనార్టీలకు 12 సీట్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే. ఈ క్రమంలోనే బీసీ నేత జంగా కృష్ణమూర్తికి వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అవకాశం లభించింది. సామాజిక న్యాయమనేది మాటల్లో కాకుండా చేతల్లో జగన్ ఏ మేరకు చూపిస్తున్నారనేది తెలియటానికి ఈ ఉదంతాలు చాలు. -
సీఎం జగన్ మేలు మరిచిపోలేం: మంత్రి అనిల్
సాక్షి, విజయవాడ: టీటీడీలో సన్నిధి యాదవులకు వంశపారంపర్య హక్కు కల్పించడం హర్షణీయం అని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారని తెలిపారు. చట్టంలో సన్నిధి యాదవులని మార్చినందుకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. 1996లో టీడీపీ ప్రభుత్వం తొలగించిన వంశపారంపర్య విధానాన్ని సీఎం జగన్ అమలు చేశారని.. ఆయన కేబినెట్లో మంత్రిగా ఉండటం ఆనందంగా ఉందన్నారు. సీఎం జగన్ చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. (ఏపీ: కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం) గతంలో సన్నిధి గొల్లలకు ఐదువేలు ఇచ్చేవారని, వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి సమస్యలు తెలుసుకుని 18 వేలు పెంచారని తెలిపారు. టీటీడీలో వంశపారంపర్యం గా హక్కు ఇవ్వడంతో రాష్ట్రంలోని యాదవులంతా సీఎం జగన్‌కు రుణపడి ఉంటామన్నారు. ఇన్నేళ్లు తర్వాత వారికి మంచి చేసిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ ఒక్కరేనని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. -
యాదవులను నిర్లక్ష్యం చేసిన యనమల
సాక్షి, కాకినాడ: యాదవుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు మేనిఫెస్టోలో అనేక అంశాలు చేర్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే యాదవులు మద్దతుగా నిలవాలని జిల్లా యాదవ సంఘ అధ్యక్షుడు మన్నే నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు అల్లి రాజబాబుతో కలిసి మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గొర్రెలు, గొర్రెల కాపర్లకు ఉచిత ఇన్సూరెన్స్‌తోపాటు సన్నిధిగొల్ల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం యాదవులకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. యాదవుల తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ఉన్న యనమల యాదవుల సంక్షేమానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. సన్నిధి గొల్ల విషయంలో యనమల ఇప్పటికీ స్పందించలేదని, టీడీపీ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని విమర్శించారు. యాదవ కులస్తులకు పెద్దగా చెప్పుకునే ఆయన ఏనాడు వీరి సంక్షేమాన్ని పట్టించుకోలేదని, రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర, రూరల్ యాదవ సంఘ అధ్యక్షుడు జాడా అప్పలరాజు, నాయకులు ఎన్.బాబురావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రకాశం జిల్లలో యాదవ జేఏసీ ఆందోళన
-
‘చంద్రబాబుకు కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం’
సాక్షి, కృష్ణా : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మూడపాడులో నిర్వహించిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రూ.5000 కోట్లతో యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, ఏపీలో కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి యాదవులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ దుర్గగుడి వరకు భారీ ర్యాలీగా బయలుదేరి దుర్గమాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రచారానికి పరిమితమైన నాయకుడని విమర్శించారు. ప్రజల సొమ్ముతో ప్రచారాలు చేసుకున్నంత మాత్రాన వాస్తవాలను దాచలేమన్నారు. టీఆర్ఎస్ కాదు, ఏపీ ప్రజలే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. (ఏపీ సీఎంపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్) ఏపీలో కుల రాజకీయాలకు కారణం చంద్రబాబేనని ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ప్రభ్వుతం ఉన్న వాళ్లు భిన్న రకాలుగా మాట్లాడారని విమర్శించారు. హోదాకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు. బీసీలకు అసెంబ్లీ, పార్లమెంటరీ స్థానాల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. -
కేసీఆర్ ఆశీస్సులతో సిద్ధిపేటను చాలా అభివృద్ధి చేశా
-
యాదవులు అభివృద్ధి చెందాలి : సీఎం
సాక్షి, హైదరాబాద్ : యాదవ, కురుమలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా బడుగుల లింగయ్య యాదవ్‌కు అవకాశం ఇచ్చిన సందర్భంగా యాదవ, కురుమ సంఘం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బుధవారం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం యాదవులకు రాజ్యసభ అవకాశం ఇచ్చామని, త్వరలోనే కురుమలకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని సీఎం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 20 మంది గొల్ల, కురుమ నేతలను రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా నియమిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా లింగయ్య యాదవ్‌ను సీఎం అభినందించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, కార్పొరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
టిడిపిని ఓడించాలని యాదవ సంఘం నిర్ణయం
గుంటూరు: టిడిపిని ఓడించాలని యాదవ సంఘం నిర్ణయించింది. యాదవ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరిలో రహస్య సమావేశం జరిగింది. టీడీపీని ఓడించడమే తమ ధ్యేయమంటూ మాగంటి సుధాకర్ యాదవ్ తీర్మానం చేశారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన 9 ఏళ్ల పాలనలో యాదవులకు చేసిందేమీలేదని సుధాకర్ యాదవ్ అన్నారు. ఈ ఎన్నికల్లో బాబుకు యాదవ సంఘం తరఫున తగిన బుద్ధి చెబుతామని ఆయన అన్నారు.