సంక్షేమ వెలుగులు ధగధగ | 7062 crores for housing construction | Sakshi
Sakshi News home page

సంక్షేమ వెలుగులు ధగధగ

Published Thu, Feb 8 2024 5:29 AM | Last Updated on Thu, Feb 8 2024 3:28 PM

7062 crores for housing construction - Sakshi

సాక్షి, అమరావతి: సంక్షేమ ఆంధ్రను ఆవిష్కరించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. బుధవారం ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేసింది. రాష్ట్రంలో అన్ని విధాలుగా అవసరమైన సంక్షేమానికి మొత్తం రూ.44,668 కోట్లు కేటాయించింది. ఇందులో బీసీ సంక్షేమానికి రూ.29,001.31 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.9,291.55 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.4,133.73 కోట్లు, మైనారిటీల సంక్షేమానికి రూ.2,242.36 కోట్లు కేటాయించడం విశేషం. సంక్షేమంతోపాటు రాష్ట్రంలో గృహ నిర్మాణానికి రూ.7,062 కోట్లు కేటాయించింది.

పేదరికంపై యుద్ధం చేసి ప్రజలను గెలిపించేలా.. దృఢమైన సామాజిక భద్రతా వలయంగా సంక్షేమ అ్రస్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించింది. వివక్ష లేని సంక్షేమంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హులందరికీ సంక్షేమాన్ని వారి గడప వద్దకే చేర్చింది. అట్టడుగు వర్గాలకు అందించిన సంక్షేమ ఫలాలతో వారికి ఎంతో మేలు చేసింది.

ఫలితంగా ప్రజల స్థితిగతులు మారడంతో సురక్షితమైన, గౌరవ ప్రదమైన జీవనం గడిపేలా చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దార్శనికత దేశానికే దిక్సూచిగా నిలిచింది. ఇంటి స్థలాల కేటాయింపు, ఇంటి నిర్మాణం, సంక్షేమ పింఛన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌) ద్వారా ఇంటింటికి రేషన్‌ పంపిణీ తదితర పథకాలు, కార్యక్రమాల ద్వారా ఆర్థిక మద్దతు అందిస్తోంది. వైఎస్సార్‌సీపీ పాలనలో అందించిన సంక్షేమంతో సాధించిన అద్భుత ఫలితాలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ‘సంక్షేమ ఆంధ్ర’ థీమ్‌తో అసెంబ్లీలోవెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  

పెద్ద మనస్సుతో పేదలకు భరోసా 
♦  వైఎస్సార్‌ బీమా కింద 49,000 కుటుంబాలకు రూ.650 కోట్లు  
♦  అగ్ర వర్ణాల కోసం ప్రత్యేక విభాగం (కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, ఆర్య వైశ్య, క్షత్రియ వర్గాల్లో కోటి 15 లక్షల మందికి రూ.36,321 కోట్లు 
♦  ఈబీసీ నేస్తం కింద 4.39 లక్షల మందికి రూ.1,257 కోట్లు, వైఎస్సార్‌ కాపు నేస్తం కింద 77 లక్షల మందికి రూ. 39,247 కోట్లు 
♦  వైఎస్సార్‌ నేతన్న నేస్తం కింద 81,783 మందికి రూ.983 కోట్లు 
♦  జగనన్న తోడు కింద 16.73 లక్షల మందికి రూ.3,374 కోట్లు, జగనన్న చేదోడు కింద 3.40 లక్షల మందికి రూ.1,268 కోట్లు 
​​​​​​​♦  వైఎస్సార్‌ వాహన మిత్ర కింద 2.78 లక్షల మందికి రూ.1,305 కోట్లు  
​​​​​​​♦   వైఎస్సార్‌ లా నేస్తం కింద 6,069 మందికి నెలకు రూ.5 వేలు చొప్పున భృతి  
​​​​​​​♦  వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద 46,329 మందికి రూ.350 కోట్లు 
​​​​​​​♦  ఉపాధి హామీ పథకం కింద 2,141 లక్షల పని దినాల ద్వారా 45 లక్షల కుటుంబాల్లోని 72 లక్షల మందికి చెల్లింపులు 
​​​​​​​♦  అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.883.5 కోట్లు సాయం  

2,19,763 ఎకరాలకు 1,29,842 మంది గిరిజనులకు వ్యక్తిగత పట్టాలు, 67,946 ఎకరాలకు గాను 526 కమ్యూనిటీ పట్టాలు పంపిణీ. 39,272 ఎకరాలకు 26,287 డీకేటీ పట్టాలు పంపిణీ. ఎస్టీల గృహాలకు ఉచిత విద్యుత్‌ నెలకు 100 యూనిట్ల నుంచి∙200 యూనిట్లకు పెంపు. కాఫీ తోటల పరిధి విస్తరణ. గిరిజన సహకార సంఘం ద్వారా మార్కెటింగ్‌ సహకారం. 

​​​​​​​♦  వెనుకబడిన కులాల(బీసీ)ల సంక్షేమం కోసం 56 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు. కోటి 2 లక్షల మందికి రూ.71,740 కోట్ల లబ్ధి.  
​​​​​​​♦  2023–24లో దాదాపు 5 వేల మంది మైనారీ్టలకు ఉద్యోగావకాశాల కోసం శిక్షణ. ఇమామ్‌లకు అందించే సహాయం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.. 4,983 మందికి ప్రయోజనం. మోజన్లకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంపు. 4,983 మందికి మేలు. 
​​​​​​​♦  2021–22 నుంచి 8,427 మంది పాస్టర్లకు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సహాయం. 2023 నుండి విజయవాడలోని ఎంబార్కేషన్‌ పాయింట్‌ నుంచి హజ్‌ యాత్ర చేసే ప్రతి యాత్రికునికి రూ.80 వేలు చొప్పున 1,756 మందికి లబ్ధి. 2019 నుండి 1,178 మంది యాత్రికులు జెరూసలేం వెళ్లడానికి రూ.60 వేల చొప్పున ఆర్థిక సాయం.  

ఎస్సీ విద్యార్థులకు జేఈఈ, నీట్‌ 
వంటి పోటీ పరీక్షలకు శిక్షణ. తద్వారా 200 మంది విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐటీ, ఇతర ప్రీమియర్‌ కళాశాలలలో ప్రవేశం. ‘కెన్నెడీ లుగర్‌–యూత్‌ ఎక్సే్ఛంజ్‌’ కార్యక్రమం, విదేశీ విద్యా అధ్యయన కార్యక్రమాలకు ఎనిమిది మంది విద్యార్థులకు అవకాశం. 2023 సెపె్టంబర్‌లో సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనపై న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశానికి ఈ వర్గానికి చెందిన ఒక విద్యార్థి ప్రాతినిధ్యం.   

ఇళ్ల స్థలాలు, ఇళ్లు.. నగదు బదిలీ 
​​​​​​​♦  రాష్ట్రంలో గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి 4,63,697 ఇళ్లు మాత్రమే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019 నుంచి ఇప్పటి వరకు రూ.1.53 లక్షల కోట్ల విలువైన 30,65,315 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ప్రతి లబ్ధిదారుని ఇంటి ఖర్చుకు రూ.లక్షా 80 వేలు మంజూరు చేసింది. మౌలిక సదుపాయాల కోసం ఒక్కో ఇంటికి రూ.6.90 లక్షల చొప్పున (మొత్తంగా రూ.22,909 కోట్లు) వెచ్చిస్తోంది. ఫలితంగా 22 లక్షల ఇళ్లలో దాదాపు 9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లు 2024 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇప్పటి వరకు 1,62,538 మంది లబ్దిదారులు నివాసం ఉంటున్నారు. 
​​​​​​​
♦ అవినీతి, అవకతవకలకు అవకాశం లేకుండా అర్హతే ప్రాతిపదికగా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోంది. కోవిడ్‌ సమయంలో, ఇతరత్రా ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసి దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు అవిశ్రాంతంగా పనిచేసిన సచివాలయాల సిబ్బంది, వలంటీర్లను ప్రభుత్వం అభినందించింది.    
​​​​​​​
♦ 2019లో స్థిర ధరల సూచి ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031తో దేశంలో 18వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం అది రూ.2,19,518తో 9వ ర్యాంకుకు ఎగబాకింది.   
​​​​​​​
♦ వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పథకం లబ్దిదారుల అర్హత వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించి సంతృప్త స్థాయిలో అమలు చేస్తోంది. 2019లో పింఛన్ల మొత్తం నెలకు రూ.1,385 కోట్లు ఉండగా, జనవరి నెల నాటికి అది రూ.1,968 కోట్లకు పెరిగింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలక్షల మందికి రూ.84,731 కోట్లు అందించింది.  
​​​​​​​
♦ ప్రజల ఇంటి ముంగిటికే సరుకులు సరఫరా చేయాలనే లక్ష్యంతో 9,260 సంచార వాహనాలను ప్రవేశపెట్టింది. తద్వారా వృద్ధులు, దివ్యాంగులు, వేతన కార్మికులకు ఎంతో ఊరట కలిగింది. ఈ వాహనాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి ఉపాధి లభించింది. సబ్సిడీ బియ్యం కోసం గత ప్రభుత్వం రూ.14,256 కోట్లు, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.29,628 కోట్లు ఖర్చు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement