vote on account budget
-
AP: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆర్డినెన్స్ జారీ
సాక్షి, విజయవాడ: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసింది. రూ.1.29 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ గవర్నర్ ఆమోదం తెలిపారు. 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. నవంబర్ 30వ తేదీ వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది.కాగా, ఎన్నికల ముందు సూపర్ సిక్స్, సూపర్ టెన్ అంటూ ప్రజలకిచ్చిన హామీల అమలును ఎగ్గొట్టేందుకే ఈ నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. అంతకుముందు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి నాలుగు నెలల వ్యయానికి సభ అనుమతి తీసుకుంది. ఈ గడువు నేటితో (జూలై 31తో) ముగిసింది.సాధారణంగా అయితే.. ఎన్నికల ఫలితాలు అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వాలు తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఈనెల 23న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం ఈనెల 22 నుంచి 26 వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించినప్పటికీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. -
సూపర్ సిక్స్ గోవిందా.. బాబు స్కెచ్ అదుర్స్
-
బడ్జెట్ పై ఏపీ ప్రభుత్వం మల్లగుల్లాలు
-
డిక్లరేషన్లన్నీ అమలు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: సంపూర్ణ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళిక అని.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. రైతులకు ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్, హైదరాబాద్‌లో ప్రకటించిన యువ డిక్లరేషన్, చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, కామారెడ్డిలో ప్రకటించిన బీసీ, మైనార్టీ డిక్లరేషన్లను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. శనివారం రూ.2,75,891 కోట్ల అంచనాలతో రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024–25ను అసెంబ్లీలో భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. తర్వాత సభలను ఉద్దేశించి ప్రసంగించారు. బడ్జెట్లో రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.29,669 కోట్ల మూలధన వ్యయాన్ని చూపారు. బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యంశాలు వారి మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేశాం. ఆరు హామీల కోసం ప్రజల నుంచి 1.29 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కోసం ప్రతి నెలా ఆర్టీసీకి రూ. 300 కోట్లు అదనపు నిధులిస్తున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యసేవల పరిమితిని రూ.5లక్షల నుంచి రూ. 10లక్షలకు పెంచాం. మరో రెండు ముఖ్యమైన గ్యారంటీలైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీల అమలుకు కసరత్తు జరుగుతోంది. త్వరలోనే విధివిధానాలను సిద్ధం చేసి ప్రజలకు ఫలాలను అందిస్తాం. పటిష్టమైన ఐటీ విధానం తెస్తాం బడ్జెట్లో పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజల జీవన స్థితిగతుల వృద్ధికి కృత్రిమ మేధ (ఏఐ)ని వినియోగించుకుంటాం. ఐటీని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. పటిష్టమైన ఐటీ విధానం కోసం అమెరికాలోని ఐటీ సర్వ్ అనే సంస్థతో సంప్రదింపులు చేస్తున్నాం. దేశంలో పటిష్టమైన ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం. బడ్జెట్లో ఐటీ శాఖకు రూ.774 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో 11శాతం నిధులను స్థానిక సంస్థలకు ఇవ్వాలని.. ఈ నిధుల్లో 61శాతం మేర గ్రామాలకే కేటాయించాలని రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మా ప్రభుత్వం ఈ సిఫార్సులకు అనుగుణంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.40,080 కోట్లు కేటాయిస్తున్నాం. పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి బడ్జెట్లో రూ.11,692 కోట్లను కేటాయిస్తున్నాం. మూసీ ప్రక్షాళనకు రూ.1,000 కోట్లు.. హైదరాబాద్ అభివృద్ధితో సృష్టించిన సంపద ఏ కొందరు అధికారులు, నాయకుల స్వార్థం కోసం కాదు. మూసీని ప్రక్షాళన చేసి, పరీవాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా మార్చే కార్యాచరణ ప్రారంభించాం. హైదరాబాద్ మెడలో అందమైన మణిహారంలా మూసీని తీర్చదిద్దడానికి రూ.1,000 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. త్వరలో జాబ్ కేలండర్ ప్రకటన ‘‘ఉద్యోగ నియామకాల కోసం జాబ్ కేలండర్ తయారీ ప్రక్రియ ప్రారంభించాం. మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నాం. 15 వేల కానిస్టేబుళ్ల నియామకాలను త్వరలో పూర్తిచేస్తాం. 64 గ్రూప్–1 పోస్టుల భర్తీకి అనుమతించాం. ► వైద్య రంగానికి బడ్జెట్లో రూ.11,500 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అసంపూర్తిగా ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వైద్య–నర్సింగ్ కాలేజీలను త్వరగా పూర్తి చేస్తాం. నిమ్స్‌ను విస్తరిస్తాం. ఉస్మానియా ఆస్పత్రి కోసం నూతన భవనాన్ని నిర్మిస్తాం. ► రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన వస్త్రాలు, స్కూల్ యూనిఫారాలను ఇకపై చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేస్తాం. గిగ్ వర్కర్లకు రూ.5లక్షల ప్రమాద బీమాను అమల్లోకి తెచ్చాం. ► గృహజ్యోతి కింద అర్హత ఉన్న కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా కోసం బడ్జెట్లో రూ.2,418 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. త్వరలో ఈ పథకాన్ని ప్రారంభిస్తాం. ►వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, గృహాలు, ఇతర వినియోగదారులకు రాయితీ విద్యుత్ కోసం ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,825 కోట్లను కేటాయిస్తున్నాం. ► ఇందిరమ్మ పథకం కింద.. ఇళ్లు లేనిపేదలకు ఇంటి స్థలం, స్థలమున్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు అందించే కార్యాచరణ ప్రారంభిస్తున్నాం. ఈ ఏడాది ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లను మంజూరు చేస్తాం. ఈ పథకానికి బడ్జెట్లో రూ.7,740 కోట్లను ప్రతిపాదిస్తున్నాం.’’ అని తన ప్రసంగంలో చెప్పారు. మూడు జోన్లుగా తెలంగాణ తెలంగాణలో అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా ప్రతిపాదిస్తున్నాం. ఔటర్‌రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ నగర ప్రాంతం, ఔటర్‌రింగ్ రోడ్డు– ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతం సెమీ అర్బన్ జోన్, రీజనల్ రింగ్‌రోడ్డు ఆవల ఉన్న భాగాన్ని గ్రామీణ జోన్‌గా నిర్ధారించి.. దానికి తగ్గట్టు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని మా ఆలోచన. ► గురుకుల ఎంబీఏ కాలేజీలు..: ఎస్సీ గురుకుల భవనాల నిర్మాణానికి రూ.1,000 కోట్లు, ఎస్టీ గురుకుల భవనాలకు రూ.250 కోట్లు, బీసీ గురుకుల భవనాలకు రూ.1,546 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో రెండు ఎంబీఏ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నాం. ► ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్..: రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్‌హబ్‌గా రూపొందిస్తాం. ప్రతి మండలంలో ఆధునిక సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తాం. పైలట్ ప్రాతిపదికన వీటి ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఉస్మానియా వర్సిటీతో సహా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి రూ.500 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. విద్యారంగానికి బడ్జెట్లో రూ.21,389 కోట్లు ఇస్తున్నాం. ► పాత ప్రాజెక్టులను పూర్తి చేస్తాం..: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత–చేవెళ్లను పూర్తిచేసి ఎగువ ప్రాంతాలైన ఆదిలాబాద్, ఇతర జిల్లాలకు సాగునీరు అందిస్తాం. పెండింగ్‌లోని ప్రాజెక్టుల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరివ్వగల శ్రీశైలం ఎడమగట్టు కాల్వ, కల్వకుర్తి, నెట్టెంపాడు, రాజీవ్ భీమా, కోయల్‌సాగర్, ఎస్సారెస్పీ వరద కాల్వ, దేవాదుల, కుమురంభీం, చిన్న కాళేశ్వరంప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తాం..’’ అన్నారు. -
ఆరుకు.. ఊరుకు.. ఆరు గ్యారంటీలకు రూ.53 వేల కోట్లు
ప్రభుత్వం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి.. అప్పులు, మిత్తీలతో తీవ్ర భారం ఇన్నాళ్లూ తెలంగాణను అబద్ధాలకు పర్యాయపదంగా మార్చారు. ఆ అబద్ధాలు వినడం అలవాటైన వారికి మా బడ్జెట్ కొత్తగా అనిపించవచ్చు. అప్పులు చేసిన రైతులు మిత్తీలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా.. ఇరిగేషన్ శాఖ అప్పులు, మిత్తీలతో ప్రభుత్వం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. – సీఎం రేవంత్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆరు ‘గ్యారంటీ’లకు.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ సర్కారు తమ తొలి బడ్జెట్‌ను తెచ్చింది. మొత్తంగా రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టగా.. అందులో ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు కేటాయించింది. మొత్తం బడ్జెట్ పద్దులో ఈ రెండింటికి కలిపి మూడో వంతు మేర నిధుల కేటాయింపు ఉండటం గమనార్హం. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు్ల, చేయూత, యువ వికాసం హామీల అమలుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది. గ్రామాల వికాసానికి తోడ్పడేలా రాష్ట్ర ఆర్థిక సంఘం సూచించిన మేరకు భారీగా నిధులు ఇస్తున్నట్టు పేర్కొంది. ఈ రెండింటితోపాటు సంక్షేమం, విద్యా రంగానికి గణనీయంగా ప్రతిపాదనలు చేసింది. అయితే కీలకమైన వ్యవసాయ శాఖతోపాటు వైద్యారోగ్య రంగానికి కోతపెట్టింది. అప్పుల సమీకరణ ఎక్కువే.. శనివారం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్ర మార్క 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గతబడ్జెట్‌లో ప్రతిపాదించిన రుణాలకంటే ఏకంగా 50 శాతం ఎక్కువగా ఈసారి అప్పుల పద్దు చూపారు. 2023–24లో బహిరంగ మార్కెట్ నుంచి రూ.40,615.68 కోట్లు రుణ సమీ కరణ చేయనున్నట్టు పేర్కొనగా, ఈసారి ఏకంగా రూ.59,625 కోట్లకు పెంచారు. ఇతర రుణాలు కూడా కలిపి గత బడ్జెట్లో రూ.55,277.698 కోట్లు చూపగా.. ఈసారి మొత్తంగా రూ.68,585.21 కోట్ల మేర రుణాలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం బడ్జెట్లో ఇది 25శాతం కావడం గమనార్హం. ఇక గతంలో చేసిన అప్పుల వాయిదాలు, వడ్డీల చెల్లింపుకోసం తాజా బడ్జెట్లో రూ.35,868 కోట్లు చూపెట్టారు. ఇది మొత్తం బడ్జెట్లో 12శాతానికిపైనే. తగ్గిన రాష్ట్ర వృద్ధిరేటు రాష్ట్ర వృద్ధిరేటు 2022–23తో పోలిస్తే 14.7 శాతం నుంచి 2023–24లో 11.3 శాతానికి తగ్గిందని, వ్యవసాయ వృద్ధిరేటు మైనస్‌లో పడిపోయిందని ¿¶ట్టి వెల్లడించారు. అయితే ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమేనని, జూన్‌లో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో.. బడ్జెట్ పరిమాణం, శాఖల కేటాయింపుల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. పన్ను ఆదాయంపైనే ఆశలు ఈ సారి బడ్జెట్లో పన్నుల ఆదాయం అంచనా రూ.20 వేల కోట్లు పెరిగింది. రాష్ట్ర వృద్ధిరేటు నిలకడగా ఉన్న నేపథ్యంలో సొంత పన్ను రాబడుల అంచనాను రూ.1.38 లక్షల కోట్లుగా చూపారు. గత బడ్జెట్ ప్రతిపాదనలతో పోలిస్తే ఇది రూ.7వేల కోట్లు ఎక్కువ. దీంతోపాటు కేంద్ర పన్నుల్లో వాటా, పన్నేతర ఆదాయం, గ్రాంట్ ఇన్ ఎయిడ్లు కలిపి ఈసారి రెవెన్యూ రాబడుల రూపంలో రూ.2,05,601.50 కోట్లు సమకూరుతాయని అంచనా వేశారు. గత బడ్జెట్లో రెవెన్యూ రాబడుల అంచనా రూ.2,16,566.97 కోట్లుకాగా.. తాజాగా సవరించిన అంచనాల్లో రూ.1,78,172.95 కోట్లుగానే ఉంది. అంటే గత బడ్జెట్ కంటే రూ.11వేల కోట్లు తక్కువగా.. సవరించిన అంచనాల కంటే రూ.27 వేలకోట్లు ఎక్కువగా రెవెన్యూ రాబడులను చూపారు. బడ్జెట్లో కొన్ని కీలక అంశాలివీ.. ► ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ► గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో రెండు ఎంబీఏ కాలేజీలు ► ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ గృహాలు ► త్వరలో ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం ► 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్‌పై త్వరలో మార్గదర్శకాలు ► మూసీ ప్రక్షాళనకు రూ.1,000 కోట్లు ► కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం కీలక కేటాయింపుల తీరు ఇదీ.. సంక్షేమ రంగాలకు గత బడ్జెట్లో రూ.33,416 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.45,149 కోట్లకు పెంచారు. అయితే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, కల్యాణలక్ష్మి కోసం ప్రత్యేక పద్దులు చూపలేదు. సంక్షేమశాఖలకు కేటాయించిన నిధుల్లోంచే వీటికి ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. విద్యాశాఖకు గత బడ్జెట్‌కన్నా ఒక శాతం అధికంగా రూ.21 వేల కోట్లు ఇచ్చారు. వ్యవసాయ రంగానికి గతంలో కంటే రూ.7వేల కోట్లు తక్కువగా.. రూ.19,746 కోట్లే చూపారు. రైతుబంధు పథకం అమలును సమీక్షించే క్రమంలో నిధులు తగ్గాయి. వైద్యారోగ్య శాఖ పద్దులో గతంతో పోలిస్తే రూ.700 కోట్లు తగ్గాయి. 4 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వీలుగా గృహనిర్మాణ శాఖ రూ.25వేల కోట్ల నిధులు కోరగా.. రూ.7,400 కోట్లు మాత్రమే కేటాయించారు. హౌజింగ్ శాఖ భూములు అమ్మి ఇళ్లు కట్టించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రతిపాదనలు, వాస్తవ ఖర్చుకు భారీ వ్యత్యాసం 2023–24 బడ్జెట్లో ప్రతిపాదించిన నిధులు, చేసిన వాస్తవ ఖర్చులకు చాలా తేడా ఉందని కాంగ్రెస్ సర్కారు బడ్జెట్ గణాంకాల్లో పేర్కొంది. గత ఏడాది బడ్జెట్ రూ.2,90,296 కోట్లుకాగా.. సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.2,24,624.87 కోట్లకే పరిమితమైంది. ఆ మొత్తానికి రూ.50 వేల కోట్లు అదనంగా కలిపి.. తాజాగా రూ.2,75,890.69 కోట్లతో 2024–25 బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ► పన్ను రాబడుల విషయానికి వస్తే.. 2023–24లో రూ.1,31,028.65 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేయగా, రూ.13 వేల కోట్లు తక్కువగా రూ.1,18,195.10 కోట్లు మాత్రమే సమకూరుతున్నట్టు సవరణ బడ్జెట్లో అంచనా వేశారు. ► కేంద్ర పన్నుల్లో వాటా కింద గత బడ్జెట్ ప్రతిపాదనల కంటే రూ.2 వేల కోట్లు ఎక్కువగా రూ.23,216.52 కోట్లు అందనున్నట్టు సవరణ బడ్జెట్లో పేర్కొన్నారు. అయితే పన్నేతర ఆదాయం అంచనాల మేరకు రూ.22,808.31 కోట్లు సమకూరుతున్నట్టు వివరించారు. ► 2023–24 బడ్జెట్లో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పద్దు కింద కేంద్రం నుంచి రూ.41,259.17 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. సవరించిన అంచనాల్లో కేవలం రూ.13,953.02 కోట్లే అందుతున్నట్టు తేల్చారు. ► బహిరంగ మార్కెట్ రుణాలు ఆశించిన మేర సమకూరాయి. కేంద్రం నుంచి రూ.4,102 కోట్లు వస్తాయనుకుంటే, రూ.1,500 కోట్లే అందనున్నట్టు సవరించిన అంచనాలు చెప్తున్నాయి. సంక్షేమానికి రూ.45,149 కోట్లు తాజా బడ్జెట్లో శాఖల వారీగా కేటాయించిన ప్రభుత్వం సంక్షేమశాఖలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. గత కొన్నేళ్లుగా కేటాయింపులు అరకొరగా ఉండడంతో సతమతమవుతున్న సంక్షేమ శాఖలకు, అనుబంధ విభాగాలకు తాజా బడ్జెట్ కాస్త ఊరట ఇచ్చే విధంగా ఉందని ఆర్థిక నిపుణులు అన్నారు. సంక్షేమ శాఖలకు అనుబంధంగా ఉన్న ఆర్థిక సహకార సంస్థలకు కొత్త కార్యక్రమాలు చేపట్టేలా కేటాయింపులున్నాయి. గడిచిన రెండేళ్లతో పోలిస్తే ఈ దఫా కేటాయింపులు భారీగా పెరిగాయి. ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమ శాఖలతో పాటు మైనార్టీ సంక్షేమ శాఖలకు 2024–25 సంవత్సరంలో రూ.45,149 కోట్లను తాజా బడ్జెట్లో కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ బడ్జెట్లో నాలుగు సంక్షేమ శాఖలకు గతేడాది కంటే రూ.11,733 కోట్లు అధికంగా కేటాయించారు. తాజాగా జరిపిన కేటాయింపుల్లో అత్యధికంగా ఎస్సీ అభివృద్ధి శాఖకు కేటాయించారు. గత కేటాయింపులతో పోలిస్తే ఈ దఫా గిరిజన సంక్షేమ శాఖకు అదనంగా రూ.9,048 కోట్లు కేటాయించడం గమనార్హం. 2023–24 వార్షిక బడ్జెట్లో దళితబంధు పథకం కింద రూ.17,700 కోట్లు కేటాయించినప్పటికీ ప్రభుత్వం పైసా ఖర్చు చేయకపోగా.. ఈసారి బడ్జెట్లో దళితబంధు ప్రస్తావనే లేదు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు కూడా గత బడ్జెట్ కంటే రూ.1,771 కోట్లు అధికంగా కేటాయించారు. మైనార్టీ సంక్షేమ శాఖకు కూడా గత బడ్జెట్ కంటే రూ.62 కోట్లు పెరిగాయి. విద్యకు రూ.21 వేల కోట్లు గత ఏడాది కన్నా 1.05 శాతం అదనం గత ఏడాదితో పోలిస్తే విద్యారంగానికి మధ్యంతర బడ్జెట్లో 1.05 శాతం నిధులు పెరిగాయి. గత ఏడాది మొత్తం బడ్జెట్లో ఈ రంగానికి రూ.16,092 కోట్లు (6.7శాతం) ఇవ్వగా, ప్రస్తుత బడ్జెట్లో రూ. 21,389 కోట్లు (7.5శాతం) కేటాయించారు. అయితే పాఠశాల విద్యలోనే ఈ పెరుగుదల ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో పోలిస్తే రూ.13 వేల కోట్ల నుంచి రూ.17,931 కోట్లకు నిధులు పెంచారు. టీచర్లకు ఇంక్రిమెంట్లు ఇవ్వడం వల్ల పెరిగిన వేతనాలు, పీఆర్సీ వల్ల పెరిగే జీతాలకే ఈ నిధులు సరిపోయే అవకాశముంది. గత ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు–మనబడి’ఊసే బడ్జెట్లో కనిపించలేదు. మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్, బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. ఉన్నతవిద్యకు రూ.2,959.10 కోట్లు, సాంకేతికవిద్యకు రూ. 487.64 కోట్లు కేటాయించారు. 65 ఐటీఐలను కొత్తగా తేబోతున్నట్టు చెప్పినా, ఇవి ప్రైవేట్ రంగంలోనే అని స్పష్టత ఇచ్చింది. నైపుణ్య వర్సిటీపె అధ్యయనం చేస్తున్నట్టు వెల్లడించింది. కల్యాణలక్ష్మికి కానరాని ప్రత్యేక పద్దు సంక్షేమ శాఖల నిధుల నుంచే ఖర్చు చేసే అవకాశం పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థికసాయం అందించే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ప్రత్యేక పద్దు తాజా బడ్జెట్లో కానరాలేదు. ఇదివరకు ఈ పథకాలకు ప్రత్యేకంగా పద్దులు కేటాయించగా, ఈసారి వాటి ఊసెత్తలేదు. ఈ పథకాలకు 2023–24, 2022–23 ఆర్థిక సంవత్సరాల్లో రూ.3210 కోట్లు, రూ. 2,750 కోట్లు కేటాయించారు. సంక్షేమ శాఖల ద్వారానే ఈ పథకాలు అమలవుతున్నాయి. ఈసారి సంక్షేమశాఖలకు నిధులు పెంచడంతో ఈ రెండు పథకాల నిర్వహణను వాటికే అప్పగించినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు అదనంగా తులం బంగారం ఇస్తామని ప్రకటించారు. కానీ, తాజా బడ్జెట్లో ఆ రెండు పథకాల ప్రస్తావన లేకపోగా, తులం బంగారం అంశాన్ని కూడా చేర్చలేదు. ఇందిరమ్మ ఇళ్లకు అప్పులే దిక్కా? రూ.20,000 కోట్లు కావాల్సి ఉండగా.. కేటాయించింది రూ.7,740 కోట్లే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లను భారీ ఎత్తున చేపట్టాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు కావాల్సిన నిధుల విషయంలో మాత్రం స్పష్టతనివ్వలేదు. తాజా బడ్జెట్లో పేదల ఇళ్ల కోసం రూ.7740 కోట్లను ప్రతిపాదించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు చొప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆ ఇళ్లను పూర్తి చేయాలంటే రూ.20 వేల కోట్ల వరకు అవసరమవుతాయి. గృహనిర్మాణ శాఖ కూడా రూ.25 వేల కోట్లు కావాలని ఆర్థిక శాఖను కోరింది. కానీ నిధులు అతి తక్కువగా ప్రతిపాదించటం విశేషం. అందుకే కేటాయింపులు తగ్గించారా? ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించకుండా, కేంద్రం ఇచ్చే సాయం, రుణాలతో చేపట్టనుందన్న మాటలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికే హడ్కో నుంచి రూ.3 వేల కోట్లను రుణంగా తీసుకోవాలని గృహనిర్మాణ సంస్థ నిర్ణయించింది. పట్టణ ప్రగతి పక్కకే! పురపాలనకు రూ.11,692 కోట్లు రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి బడ్జెట్లో తక్కువ కేటాయింపులే జరిగాయి. హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) మినహా రాష్ట్రంలోని 129 మునిసిపాలిటీలు, 12 కార్పొరేషన్లలో అభివృద్ధి పనులు, జీతభత్యాలు, నిర్వహణ వ్యయాల కింద ఈ మొత్తం కేటాయించారు. గత ఏడాది బడ్జెట్లో జరిపిన రూ. 11,372 కోట్ల కేటాయింపుల కన్నా ఈసారి రూ.320 కోట్లు మాత్రమే అధికం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని భావిస్తున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు ఈసారి రూ.1,000 కోట్లు కేటాయించారు. కాగా గత ప్రభుత్వంలో పట్టణ ప్రగతి పేరిట చేపట్టిన కార్యక్రమాల ఊసు ఈసారి లేకపోవడంతో ఆ కార్యక్రమాన్ని ఎత్తివేసినట్టేనని పురపాలక వర్గాలు చెబుతున్నాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం గమనార్హం. -
రూ.3 లక్షల కోట్ల బడ్జెట్!?
సాక్షి, హైదరాబాద్: ఆరుగ్యారంటీల అమలుకు ప్రాధాన్యతనిస్తూ, సంక్షేమ పథకాల అమలు కోసం గ్రీన్‌చానెల్ ఆసరా కల్పిస్తూ, సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులను ప్రాధాన్యతల వారీగా చూపిస్తూ 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఈ తొలి బడ్జెట్ పద్దు రూ.2.95లక్షల కోట్ల నుంచి రూ.3లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్ సమర్పించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ పద్దు కింద మూడు నెలల కాలానికి అసెంబ్లీ అనుమతి తీసుకుని జూన్‌లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఓటాన్ అకౌంట్‌కు శనివారం ఉదయం 9 గంటలకు భేటీ కానున్న రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. పెద్ద పద్దులు తగ్గించకుండానే...! గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,90,296 కోట్లుగా సభ ఆమోదం కోసం పెట్టిన విషయం విదితమే. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రతిపాదనల కోసం ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలతో సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల కంటే ముందే ఆన్లైన్లో ప్రతిపాదనలు కోరింది. ఈ మేరకు ఆయా ప్రభుత్వ శాఖలు తమ ప్రతిపాదనలు పంపాయి. విద్యుత్ శాఖ రూ.18 వేల కోట్లు, సాగునీటి శాఖ రూ.25వేల కోట్లు, సంక్షేమ శాఖలన్నీ కలిపి రూ.40వేల కోట్ల పైచిలుకు, గృహనిర్మాణశాఖ రూ.25వేల కోట్లు, ఆర్టీసీ రూ.7వేల కోట్లు, వైద్యారోగ్య శాఖ రూ.13వేల కోట్లు, అన్ని రకాల విద్యాశాఖలు కలిపి రూ.21వేల కోట్లు, వ్యవసాయ శాఖ రూ.30వేల కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.40వేల కోట్ల పైచిలుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. కీలకమైన ఈ ఐదారు శాఖల బడ్జెట్ పద్దు రూ.2లక్షల కోట్ల వరకు చేరాయి. వీటికి తోడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, అప్పులకు వడ్డీల చెల్లింపుల కింద మరో రూ.65వేల కోట్లు అవసరమవుతాయి. నాలుగు గ్యారంటీలకే నిధులు? ఆరు గ్యారంటీల అమలు కోసం రూ.65వేల కోట్ల వరకు అవసరమవుతాయనే అంచనాలున్నా ప్రస్తుత ఏడాది బడ్జెట్లో కేవలం నాలుగు గ్యారంటీల (మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధి రూ.10లక్షలకు పెంపు, రూ.500కే గ్యాస్ సిలెండర్, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్)లకు నిధులు ప్రతిపాదించనున్నారు. వీటిని ఆయా శాఖల పద్దుల్లో సర్దుబాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి తోడు రైతుభరోసా, రైతు రుణమాఫీ, పింఛన్లు, కొత్త ఉద్యోగాల కల్పనలకు అవసరమైన నిధులను కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయాశాఖల్లో సర్దుబాటు చేయనున్న ట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం అమలు చేసిన వా టిలో రైతుబంధు (రైతు భరోసా) మినహా ఇతర ప థకాలకు నిధుల కేటాయింపు లేదని సమాచారం. వీటికి తోడు రెవెన్యూ పద్దు, మూల ధన వ్యయం, ద్రవ్యలోటు అంచనాలు కలిపి బడ్జెట్ పద్దు ఈసారి రూ.2.95 లక్షల కోట్ల నుంచి రూ.3లక్షల కోట్ల వరకు వెళుతుందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. కేంద్రంపై పెద్దగా ఆశలు పెట్టుకోకుండానే.. గత కొన్నేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్ను వాటాలు, ఇవ్వాల్సిన గ్రాంట్ఇన్ ఎయిడ్లు ఆశించిన మేర రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పద్దులో చూపించిన మొత్తానికి, సవరణల బడ్జెట్‌కు చాలా తేడా కనిపించింది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరానికి గాను పన్నుల్లో వాటా కింద రూ. 21,471 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 41,259 కోట్లను ప్రతిపాదించింది. అయితే, వాస్తవ రూపంలోకి వచ్చేసరికి డిసెంబర్ నాటికి రూ. 10,253 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద కేవలం రూ. 4978 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నుంచి తమకు ఏ మేరకు సహకారం ఉంటుందన్న దానిపై ఆచితూచి అంచనాలతో రాష్ట్రం బడ్జెట్ కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రంపై పెద్దగా ఆశలు పెట్టుకోకుండానే వాస్తవిక అంచనాలకు అనుగుణంగా ప్రతిపాదనలు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంచనాల్లో తగ్గుదల! ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర పన్నుల్లో వాటాను తెలంగాణకు 2.102 శాతంగా ప్రతిపాదించింది. ఇందులో కార్పొరేషన్ ట్యాక్స్ కింద రూ.8051.77 కోట్లు, ఆదాయపన్ను కింద రూ. 8872.10 కోట్లు, సీజీఎస్టీ కింద రూ. 7838.82 కోట్లు, కస్టమ్స్ డ్యూటీ కింద రూ. 523.20 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ కింద రూ. 312.84 కోట్లు, సరీ్వసు టాక్స్, ఇతర పన్నులు కలిపి మొత్తం రూ. 25639.84 కోట్లు తెలంగాణకు వచ్చే అవకాశముందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో గత ఏడాది కంటే పన్నుల్లో వాటా ప్రతిపాదనలు పెరిగి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంచనాల్లో తగ్గుదల ఉండే అవకాశముందని ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. అప్పులు.. భూముల అమ్మకాలు ఎలా? రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందని మొదటి సమావేశాల్లోనే శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తన తొలి బడ్జెట్ పత్రంలో ఏ మేరకు రుణ సమీకరణను ప్రతిపాదిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గతేడాది రుణాల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.40,615 కోట్లను ప్రతిపాదించింది. ఇందులో రూ.36వేల కోట్లకు పైగా డిసెంబర్ నాటికే సమీకరణ జరిగింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి నెల చివరకు మరో రూ.5,400 కోట్లు తీసుకోనుంది. విధానాలు, ప్రభుత్వ ఆలోచనలు ఎలా ఉన్నా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మనుగడకు బహిరంగ మార్కెట్లో రుణ సేకరణ అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా అప్పుల పద్దు రూ.40వేల కోట్లు దాటుతుందని తెలుస్తోంది. ఇక, రాజీవ్ స్వగృహ, దిల్ భూముల అమ్మకాలకు ప్రభుత్వం మొగ్గు చూపుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పన్నేతర ఆదాయం పద్దు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రేపే తెలంగాణ బడ్జెట్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మధ్యాహ్నాం 12 గంటలకు ఓటాన్ అకౌంట్ (ఓట్ ఆన్ అకౌంట్) బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. మరోవైపు శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. అంతకు ముందు.. ఉదయం 9గం. ప్రాంతంలో తెలంగాణ మంత్రి మండలి సమావేశం అవుతుంది. బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో.. ఎలాంటి ప్రతిపాదనలు ఉండవు. కేవలం ఖర్చులు మాత్రమే ఉంటాయి. అందుకే ఇందులో కొత్త ప్రాజెక్టులు, భారీ కేటాయింపులు ఉండవు. ప్రభుత్వ కార్యకలాపాలు, శాఖల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ పంపిణీ సాఫీగా సాగేందుకు ఓటాన్ అకౌంట్ ప్రవేశపెడతారు. రెండు నెలల నుంచి ఆరు నెలల వరకు ఖర్చుల కోసం తీసుకునే మొత్తం ఇది. -
అప్పులు తగ్గించి సంపద పెంచాం
సాక్షి, అమరావతి: తమకు మీడియా బలం ఉందనే అహంకారంతో విపక్షాలు పదేపదే అబద్ధాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. గత సర్కారు కంటే తక్కువ అప్పులు చేసినా అనునిత్యం బురద చల్లుతున్నాయని మండిపడ్డారు. టీడీపీ 2014లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చకుండా ఇప్పుడు కొత్తవి ప్రకటిస్తుంటే బీజేపీ, వామపక్షాలు లాంటి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. శాసనసభలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి బుగ్గన గురువారం గణాంకాలతో సమాధానమిచ్చారు. ఐదేళ్లుగా బడ్జెట్ సమర్పించే అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ 2024–25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించాల్సిందిగా సభ్యులను కోరారు. టీడీపీ కంటే అప్పుల వృద్ధి తక్కువే వాస్తవ లెక్కలకు, బడ్జెట్‌కు వ్యతాసం ఉందని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు విమర్శించటాన్ని బుగ్గన ఖండించారు. 2019–20లో టీడీపీ రూ.1.91 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా వాస్తవంగా ఖర్చు చేసింది రూ.1.64 లక్షల కోట్లు మాత్రమేనని, బడ్జెట్ లెక్కల కంటే రూ.27,000 కోట్లు తక్కువ వ్యయం చేసిందని గుర్తు చేశారు. 2023–24 బడ్జెట్లో రూ.2.79 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడితే సవరించిన అంచనాల ప్రకారం వ్యయం రూ.2.75 లక్షల కోట్లుగా ఉందని, తుది లెక్కలు కూడా ఇంచుమించి ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం కంటే ఇప్పుడు అప్పుల వృద్ధిరేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ మీడియా బలం ఉందన్న అహంకారంతో పదేపదే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ♦ కేంద్ర అప్పులు 2014–19లో 59.75 శాతం పెరగగా 2019–24లో 86 శాతం పెరిగాయి. కేంద్ర అప్పులు 2014–19లో 9.82 శాతం, 2019–24లో 13.25 శాతం చొప్పున పెరిగాయి. టీడీపీ హయాంలో రాష్ట్ర అప్పులు 126 శాతం పెరిగితే 2019–24 మధ్య అప్పుల్లో వృద్ధి 95 శాతంగా ఉంది. అంటే సగటున టీడీపీ హయాంలో 18 శాతం అప్పులు పెరిగితే మా ప్రభుత్వం వచ్చాక 14 శాతం మేర మాత్రమే పెరిగాయి. కేంద్రం, టీడీపీ సర్కారు రెట్టింపు స్థాయిలో అప్పులు చేస్తే మాట్లాడని ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మాపై బురద జల్లడం వెనుక మీడీయా ఉందన్న అహకారం స్పష్టంగా కనిపిస్తోంది. ♦ 2014లో పలు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ తర్వాత మేనిఫెస్టోను మాయం చేసింది. రైతు రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి లాంటివి ఎగ్గొట్టింది. మా ప్రభుత్వం మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావిస్తూ తు.చ. తప్పకుండా అమలు చేస్తోంది. అందుకు అనుగుణంగానే బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయి. వామపక్ష పార్టీలు ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేసినా మేనిఫెస్టోను మా ప్రభుత్వం అమలు చేసిందని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. ♦ గత సర్కారు పెట్టిన బకాయిలను తీర్చడంతో పాటు వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాలకు సంబంధించిన అకౌంట్స్‌ను మా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మా ప్రభుత్వం చేసిన అప్పులు బటన్ నొక్కి నేరుగా ప్రజల ఖాతాల్లో జమ వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరి చంద్రబాబు చేసిన అప్పులు ఎక్కడికి పోయాయో వెల్లడించాలి. ♦ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఖజానాలో ఏమీ లేదని, హామీలు నెరవేర్చలేరంటూ టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు. ఇప్పుడు చంద్రబాబు వల్ల కాని హామీలను ప్రకటించడంపై ఆ పార్టీ నాయకులు విస్తుపోతున్నారు. తమ నాయకుడు ఎన్నికల ముందు హామీలను గుప్పించి ఆ తర్వాత గాలికి వదిలేస్తారని రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో కలిసినప్పుడు అసలు విషయం చెబుతున్నారు. సంపద సృష్టించి హామీలను అమలు చేస్తానంటున్న చంద్రబాబు గత చరిత్రను పరిశీలిస్తే వాస్తవాలు బోధపడతాయి. ♦ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రెవెన్యూ వృద్ధి రేటు 6 శాతం ఉంటే ఇప్పుడు 16 శాతానికి పెరిగింది. దీనిబట్టి ఎవరి హయాంలో సంపద పెరిగిందో తెలుసుకోవచ్చు. 2018–19లో 11% స్థూల ఉత్పత్తి రేటుతో ఏపీ 14వ స్థానంలో ఉండగా 2023 నాటికి 16.2 శాతానికి పెరిగి రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటులో 4వ స్థానానికి పురోగమించింది. 2018–19లో మన వ్యవసాయ రంగం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3 శాతంతో 12వ స్థానంలో ఉండగా ఈ రోజు 13% వృద్ధి రేటుతో 6వ స్థానానికి ఎగబాకింది. 2023–24కి సంబంధించి కేంద్ర జీడీపీలో 7.3 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేయగా అది మన రాష్ట్రంలో 7.35 శాతంగా ఉంటుంది. ఇది ప్రజా బడ్జెట్ ఇది సప్త రంగాలకు పెద్దపీట వేసిన ప్రజా బడ్జెట్ ఇది. గత ప్రభుత్వం మాదిరిగా గాలిలో మేడలు కట్టలేదు. గ్రాఫిక్స్ బొమ్మలు చూపించలేదు. మా నాయకుడు సుదీర్ఘ పాదయాత్రలో పేదల గుండెలు తడిమి ప్రతి ఒక్కరి బతుకులు మార్చేలా తీసుకొచ్చిన బడ్జెట్ ఇది. విద్య, వైద్యం, వ్యవసాయం ప్రాధాన్యాన్ని గుర్తించి.. ఆ దిశగా మానవ జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్ రూపొందించారు. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా, విద్య మిథ్యగా మారిపోయింది. ఇప్పుడు ఎందరో పేదలకు ఉచిత వైద్యంతో ఊపిరిపోస్తూ.. ఎందరో పేద బిడ్డలకు ప్రపంచ స్థాయి చదువులు అందిస్తోంది మా ప్రభుత్వం. సీఎం జగన్ గొప్ప సంకల్పమే జీపీపీతోపాటు విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే మార్గదర్శకంగా నిలబెట్టింది. ఉత్తరాంధ్రలో సముద్రాన్నే నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారులకు జగనన్న వచ్చిన తర్వాతే కదా జీవిత భరోసా దక్కింది. వేట నిషేధ సమయంలో రూ.10వేలు అందుకుని కడుపు నింపుకుంటున్నారు. టీడీపీ హయాంలో కేవలం 4లక్షల ఇళ్లు ఇస్తే.. మా ప్రభుత్వం 32లక్షలకు పైగా ఇళ్ల స్థలాలతో కొత్త ఊర్లను నిర్మిస్తోంది. కొత్త పారిశ్రామిక పాలసీ ఏపీ ముఖచిత్రాన్ని మార్చేసింది. మా ప్రభుత్వం డీబీటీ, నాన్–డీబీటీ కింద ఇచ్చినవే చెబుతోంది. అవి కాకుండా గ్రామాల్లో చేసిన అభివృద్ధిని కూడా కలిపితే ఏకంగా ఐదేళ్లలో రూ.5.30లక్షల కోట్లకుపైగా సంక్షేమాభివృద్ధిని చేసి చూపించాం. దీనితోపాటు ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ అభివృద్ధికి మరింత నిధులు కేటాయించాలి. – కరణం ధర్మశ్రీ, చోడవరం ఎమ్మెల్యే విద్య, వైద్యానికి పెద్దపీట సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం బడ్జెట్లో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసింది. ప్రభుత్వ విద్యారంగంలో వినూత్న సంస్కరణలు చేపట్టి మన పిల్లల భవితకు బంగారు బాటలు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు గోరుముద్ద పథకం కింద పౌష్టికాహారం అందిస్తోంది. ఈ కార్యక్రమానికి గత ప్రభుత్వంతో పోలిస్తే మా ప్రభుత్వం నాలుగు రెట్లు అధికంగా బడ్జెట్‌ను ఖర్చు చేస్తోంది. సచివాలయాల ఏర్పాటు ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసింది. ఏకంగా 4 లక్షల ఉద్యోగాలను కలి్పంచింది. నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకునేలా డీబీటీ, నాన్ డీబీటీ విధానంలో సాయం అందించింది. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ప్రస్తుతం రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతోంది. – హఫీజ్ ఖాన్, కర్నూల్ ఎమ్మెల్యే రేపటి తరాల అభివృద్ధికి పునాదులు రాష్ట్రంలో ముస్లిం, మైనారిటీల అభ్యున్నతికి సీఎం జగన్ కంకణబద్దుడై ఉన్నారు. ఈ క్రమంలో ముస్లింలకు మేలు చేస్తూ ఐదేళ్లలో అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేశారు. నిరుపేదలకు లక్షల సంఖ్యలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం ద్వారా రేపటి తరాల అభివృద్ధికి పునాదులు వేశారు. విద్యా, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లో స్పష్టమైన మార్పులు తెచ్చారు. నవరత్నాల పథకాల అమలు ద్వారా పేదల కుటుంబాల్లో వెలుగులు నింపారు. సర్పంచ్ల దగ్గర నుంచి నాలాంటి సామాన్యూలు ఎందరికో సీఎం వైఎస్ జగన్ రాజకీయ జీవితాన్ని ప్రసాదించారు. – ముస్తఫా, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే -
ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో చివరి రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేల తీరులో ఎటువంటి మార్పులేదు. సభ మొదలైన మరుక్షణం నుంచే కార్యకలాపాలను స్తంభింపజేసేందుకు ప్రయత్నించారు. సభ ప్రారంభమైన వెంటనే పథకం ప్రకారం గొడవ చేసి వెళ్లిపోయారు. కేవలం సభలో 15 నిమిషాలు మాత్రమే టీడీపీ సభ్యులు సభలో ఉన్నారు. సంప్రదాయం ప్రకారం బుధవారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై గురువారం సభలో చర్చ నిర్వహించాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా సభ ప్రారంభమైన వెంటనే జాబ్ క్యాలెండర్, మద్యపాన నిషేధంపై టీడీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దానిని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. దీంతో టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంలోకి వెళ్లారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, డోలా బాలవీరాంజనేయస్వామి, అశోక్, రామకృష్ణలు స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టారు. మరోవైపు ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, చినరాజప్ప తదితరులు స్పీకర్ పోడియం ముందు నిలుచుని, పోడియాన్ని తడుతూ ఆందోళనకు దిగారు. వారి ఆందోళన మధ్యే సభా కార్యకలాపాలను కొనసాగిస్తూ స్పీకర్ మాట్లాడుతుండగా... ఆయన ప్రసంగానికి అడ్డుతగులుతూ స్పీకర్ మైక్‌లో వినిపించేలా టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రంలో గంజాయి సాగు, వాడకం మితిమీరిపోయిందంటూ ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ సభ్యులు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేల తీరును శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తప్పుబట్టారు. సభలో జరుగుతున్న బిజినెస్‌కు విరుద్ధంగా వాయిదా తీర్మానాలకు డిమాండ్ చేసి ఆందోళనకు దిగడమేమిటని ప్రశి్నంచారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణపై సీఎం జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుందని గుర్తుచేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఒకసారి పోలీస్ రికార్డులను పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. అయినా టీడీపీ సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత టీడీపీ సభ్యులు రాలేదు. రెండు బిల్లులకు ఆమోదం ఏపీ విద్యుత్ సుంకం (సవరణ) బిల్లు–2024, ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు–2024ను శాసనసభ ఆమోదించింది. విద్యుత్ సుంకం బిల్లును ఆ ర్థి క మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సభలో ప్రవేశపెట్టారు. -
మౌలిక వసతులతో... రాష్ట్రం సుసంపన్నం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ‘ఏపీ పారిశ్రామిక విధానం 2023–27’ ప్రభుత్వం తీసుకువచ్చింది. మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు 2024–25లో రూ.43 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించారు. రూ.24 వేల కోట్లతో తీరప్రాంతాభివృద్ధి రాష్ట్రంలో రూ.24 వేల కోట్లతో ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, షిప్ ల్యాండ్ కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వేలో రూ.20 వేల కోట్లతో పర్యావరణహిత ఓడరేవులు నిర్మిస్తున్నారు. రూ.3800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లను జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, కొత్తపట్నం, ఓడరేవు, పూడిమడక, బియ్యపుతిప్ప, మంచినీళ్లపేట వద్ద ని ర్మిస్తున్నారు. రూ.127 కోట్లతో చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పలంక, రాయదరువుల్లో ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను అభివృద్ధి చేశారు. అంతర్గత జల రవాణా అభివృద్ధికి ఏపీ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీని 2023లో స్థాపించి, కృష్ణానదిపై ముక్త్యాల–మద్దిపాడు మధ్య తొలి నదీ ప్రవాహ ప్రాజెక్టును రూపొందించారు. భోగాపురం విమానాశ్రయ అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామాల అనుసంధానం భారత్ నెట్ రెండో దశ ప్రాజెక్ట్ అమలులో భాగంగా 613 మండలాల్లోని 11,254 గ్రామ పంచాయతీలను కలుపుతూ 55 వేల కి.మీ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. వైద్య విద్య బలోపేతం ♦ రాష్ట్రంలో రూ.8480కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ♦ ఉద్దానం ప్రాంత కిడ్నీ రోగులకోసం పలాసలో వైఎస్సార్ కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం. అత్యున్నత విద్యాలయాలు ♦ కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ, సాలూరులో సెంట్రల్ గిరిజన వర్సిటీ, విజయనగరంలో గురజాడ జేఎన్టీయూ, ఒంగోలులో ఆంధ్రకేసరి వర్సిటీ, వైఎస్సార్ కడపలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ కర్నూలులో క్లస్టర్ వర్సిటీ, రెండో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం. పోలవరం పురోగమనం ♦ 2019మే నాటికి 42 శాతం హెడ్ వర్క్‌లు 70 శాతానికి చేరిక ♦ గోదావరి నదిలో తొలి సారిగా రేడియల్ గేట్ల ఏర్పాటు. ♦ గతేడాది నవంబర్ 30వ తేదీన అవుకు రెండో టన్నెల్ ప్రారంభం. ♦ అవుకు మొదటి, రెండో టన్నెళ్లు పూర్తి. మూడో టన్నెల్ త్వరలో పూర్తి. ♦ గతేడాది సెపె్టంబర్ 19న 77 చెరువుల అనుసంధానం ప్రాజెక్ట్ ప్రారంభం. ♦ 2022 సెపె్టంబర్ 6వ తేదీన గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీల ప్రారంభం. ♦ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం పురోగతి. పారిశ్రామిక పరుగులు ♦ 2019 నుంచి ఇప్పటి వరకు 311కుపైగా ఏర్పాటైన భారీ పరిశ్రమలు ♦ రూ.5995 కోట్లతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు ♦ రూ.19345 కోట్ల పెట్టుబడులతో 117 ఒప్పందాలు చేసుకున్న ఒబెరాయ్, నోవోటెల్, వంటి ప్రముఖ సంస్థలు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు ♦ పట్టణాభివృద్ధిలో భాగంగా 1426 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ టౌన్íÙప్ల ఏర్పాటు ♦ రూ.189 కోట్లతో 481 ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు ♦ గ్రామీణ మౌలిక సదుపాయాల కింద 10,893 గ్రామ పంచాయతీ భవనాలు, 10216 వ్యవసాయ గోదాములు, 8299 భారత్ నిర్మాణ్ సేవా కేంద్రాలు, 3734 భారీ పాల శీతలీకరణ కేంద్రాల నిర్మాణం -
ఇదిగో.. సామర్థ్య ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ పరిపూర్ణ మానవ అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అనతి కాలంలోనే ‘సామర్థ్య ఆంధ్ర’గా ఆవిర్భవించింది. విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతితో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ‘సామర్థ్య ఆంధ్ర’ కింద 2024–25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఏకంగా రూ.53,508.04 కోట్లు కేటాయించింది. బుధవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసన సభలో బడ్జెన్‌ను ప్రవేశపెట్టారు. పాఠశాల, సాధారణ విద్యకు పెద్దపీట వేస్తూ రూ.33,898.04 కోట్లు కేటాయించారు. సాంకేతిక విద్యకు రూ.578.59 కోట్లు, కార్మిక శక్తి, ఉద్యోగాల కల్పనను పెంచేలా రూ.1,114.74 కోట్లు కేటాయించారు. ఇక గ్రామీణ పేదలకు ఇంటి వద్దనే ఆరోగ్య సేవలు అందిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేసేలా, ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యాన్ని పెంచడానికి రూ.17,916.67 కోట్లు కేటాయించడం విశేషం. –సాక్షి, అమరావతి ‘విద్య’యీ భవ పిల్లలకు మంచి విద్య అందించి, ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పం. అందుకే ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చింది. వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ అమలు చేస్తోంది. త్వరలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) పాఠ్య ప్రణాళికలను అమలు చేయనుంది. ఆంగ్ల భాషా నైపుణ్యం పెంచేలా టొఫెల్ సరి్టఫికేషన్ అందిస్తోంది. విద్యా బోధనలో సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. పిల్లలకు ఉచిత కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను ఉచితంగా అందిస్తోంది. 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్‌తో బోధన ప్రవేశపెట్టింది. జగనన్న విద్యాకానుక కిట్ల ద్వారా ఏటా రూ.3,367 కోట్లతో 47 లక్షల మంది విద్యార్థులకు యూనిఫామ్‌లు, బ్యాగ్‌లు, బూట్లు, పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. మనబడి నాడు–నేడు ద్వారా 56,703 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కళాశాలల రూపురేఖలను మార్చింది. నాడు – నేడు ద్వారా ఇప్పటివరకు రూ.7163 కోట్ల స్కూళ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దింది. రెడీ టు వర్క్ విద్యార్థులు చదువుల సమయంలోనే పరిశ్రమలు, ఐటీ సంస్థలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దుతోంది. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 192 స్కిల్ హబ్‌లు, పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో 27 స్కిల్ కాలేజీలు స్థాపించింది. తద్వారా 2023–24 ఆర్థిక సంవత్సరంలో 21 రంగాల్లో 1.06 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా.. వీరిలో 95 శాతం మంది ఉద్యోగాలు పొందారు. యువతకు శిక్షణ ఇవ్వడానికి 201 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో వర్చువల్ ల్యాబ్‌లు, క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. 14 పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో (ఐటీఐ) కియా మోటార్స్, మారుతీ, టయోటా, ఇసుజు మొదలైన సంస్థల సహాయంతో అధునాతన యంత్రాలతో ల్యాబ్‌లను అభివృద్ధి చేసింది. ఉన్నతంగా విద్య జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. ఇప్పటివరకు విద్యా దీవెన కింద రూ.11,901 కోట్లు, వసతి దీవెన కింద రూ.4,276 కోట్లు ఖర్చు చేసింది. తద్వారా విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గి ఉన్నత విద్యలో డ్రాప్ అవుట్ శాతం భారీగా తగ్గింది. ప్రపంచంలోని టాప్–50 (సబ్జెక్టుల వారీగా) విశ్వ విద్యాలయాల్లో రాష్ట్ర విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆకాంక్షతో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రవేశపెట్టింది. ఇంటర్న్‌షిప్ ద్వారా చదువుతో పాటే విద్యార్థులు బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగులు పొందే అవకాశాన్ని కల్పించింది. దేశంలోనే తొలిసారిగా ఏపీలోనే ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో వైద్య, దంత వైద్య కోర్సుల్లో 50 శాతం కోటా, మిగిలిన అన్ని కోర్సుల్లో 35 శాతం సీట్లను ప్రభుత్వ కోటాలో పేదలు ఉచితంగా చదువుకునే వెసులుబాటు కల్పించింది. ఆరోగ్యశ్రీతో పునరుజ్జీవనం వైఎస్ జగన్ ప్రభుత్వం నాడు–నేడు ద్వారా రూ.16,852 కోట్లతో ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధన ఆస్పత్రుల వరకు సమూల మార్పులు చేసి మెరుగైన వైద్యాన్ని అందిస్తోంది. గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ విధానంతో 14 రకాల వైద్య పరీక్షలను, 105 రకాల మందులను ఇంటి వద్దనే అందిస్తోంది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ పేదల పాలిట సంజీవనిగా మారింది. కుటుంబ ఆదాయ పరిమితిని రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచి, మరింత మందికి ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తోంది. ప్రొసీజర్స్‌ను పెంచి, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు పరిమితి లేని చికిత్సలు అందిస్తోంది. ఆరోగ్య ఆసరా కింద 25 లక్షల మంది రోగులకు రూ.1366 కోట్లు అందించింది. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 1.67కోట్ల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు, మందులు పంపిణీ చేసింది. కిడ్నీ రోగులకు కార్పొరేట్ సౌకర్యాలతో 200 పడకలతో పలాసలో వైఎస్సార్ కిడ్నీ రిసెర్చ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించింది. వైద్య శాఖలో 53,126 మంది శాశ్వత సిబ్బందిని నియమించింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల పోస్టుల ఖాళీలు సగటున 61 శాతం ఉంటే.. ఏపీలో దానిని 4 శాతానికంటే తక్కువకు తగ్గించడం గమనార్హం. గోరుముద్దతో ఆరోగ్యం.. ప్రభుత్వం జగనన్న గోరుముద్ద కింద ఏడాదికి రూ.1,910 కోట్లు ఖర్చు చేస్తూ 43 లక్షల మందికిపైగా విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఇది గత ప్రభుత్వం చేసిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ. గిరిజన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, మైదాన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లతో మహిళల్లో రక్తహీనత సమస్యను తగ్గిస్తోంది. సామర్ధ్యాంధ్ర కేటాయింపులు రూ. 53,508.04 కోట్లు సాధారణ విద్య రూ.33,898.04 కోట్లు వైద్య రంగంరూ.17,916.67 కోట్లు సాంకేతిక విద్య రూ.578.59 కోట్లు ఉద్యోగ, ఉపాధి రంగాలురూ. 1,114.74 కోట్లు -
సంక్షేమ వెలుగులు ధగధగ
సాక్షి, అమరావతి: సంక్షేమ ఆంధ్రను ఆవిష్కరించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. బుధవారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేసింది. రాష్ట్రంలో అన్ని విధాలుగా అవసరమైన సంక్షేమానికి మొత్తం రూ.44,668 కోట్లు కేటాయించింది. ఇందులో బీసీ సంక్షేమానికి రూ.29,001.31 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.9,291.55 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.4,133.73 కోట్లు, మైనారిటీల సంక్షేమానికి రూ.2,242.36 కోట్లు కేటాయించడం విశేషం. సంక్షేమంతోపాటు రాష్ట్రంలో గృహ నిర్మాణానికి రూ.7,062 కోట్లు కేటాయించింది. పేదరికంపై యుద్ధం చేసి ప్రజలను గెలిపించేలా.. దృఢమైన సామాజిక భద్రతా వలయంగా సంక్షేమ అ్రస్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించింది. వివక్ష లేని సంక్షేమంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హులందరికీ సంక్షేమాన్ని వారి గడప వద్దకే చేర్చింది. అట్టడుగు వర్గాలకు అందించిన సంక్షేమ ఫలాలతో వారికి ఎంతో మేలు చేసింది. ఫలితంగా ప్రజల స్థితిగతులు మారడంతో సురక్షితమైన, గౌరవ ప్రదమైన జీవనం గడిపేలా చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికత దేశానికే దిక్సూచిగా నిలిచింది. ఇంటి స్థలాల కేటాయింపు, ఇంటి నిర్మాణం, సంక్షేమ పింఛన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ తదితర పథకాలు, కార్యక్రమాల ద్వారా ఆర్థిక మద్దతు అందిస్తోంది. వైఎస్సార్సీపీ పాలనలో అందించిన సంక్షేమంతో సాధించిన అద్భుత ఫలితాలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ‘సంక్షేమ ఆంధ్ర’ థీమ్‌తో అసెంబ్లీలోవెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద మనస్సుతో పేదలకు భరోసా ♦ వైఎస్సార్ బీమా కింద 49,000 కుటుంబాలకు రూ.650 కోట్లు ♦ అగ్ర వర్ణాల కోసం ప్రత్యేక విభాగం (కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, ఆర్య వైశ్య, క్షత్రియ వర్గాల్లో కోటి 15 లక్షల మందికి రూ.36,321 కోట్లు ♦ ఈబీసీ నేస్తం కింద 4.39 లక్షల మందికి రూ.1,257 కోట్లు, వైఎస్సార్ కాపు నేస్తం కింద 77 లక్షల మందికి రూ. 39,247 కోట్లు ♦ వైఎస్సార్ నేతన్న నేస్తం కింద 81,783 మందికి రూ.983 కోట్లు ♦ జగనన్న తోడు కింద 16.73 లక్షల మందికి రూ.3,374 కోట్లు, జగనన్న చేదోడు కింద 3.40 లక్షల మందికి రూ.1,268 కోట్లు ♦ వైఎస్సార్ వాహన మిత్ర కింద 2.78 లక్షల మందికి రూ.1,305 కోట్లు ♦ వైఎస్సార్ లా నేస్తం కింద 6,069 మందికి నెలకు రూ.5 వేలు చొప్పున భృతి ♦ వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద 46,329 మందికి రూ.350 కోట్లు ♦ ఉపాధి హామీ పథకం కింద 2,141 లక్షల పని దినాల ద్వారా 45 లక్షల కుటుంబాల్లోని 72 లక్షల మందికి చెల్లింపులు ♦ అగ్రిగోల్డ్ బాధితులకు రూ.883.5 కోట్లు సాయం 2,19,763 ఎకరాలకు 1,29,842 మంది గిరిజనులకు వ్యక్తిగత పట్టాలు, 67,946 ఎకరాలకు గాను 526 కమ్యూనిటీ పట్టాలు పంపిణీ. 39,272 ఎకరాలకు 26,287 డీకేటీ పట్టాలు పంపిణీ. ఎస్టీల గృహాలకు ఉచిత విద్యుత్ నెలకు 100 యూనిట్ల నుంచి∙200 యూనిట్లకు పెంపు. కాఫీ తోటల పరిధి విస్తరణ. గిరిజన సహకార సంఘం ద్వారా మార్కెటింగ్ సహకారం. ♦ వెనుకబడిన కులాల(బీసీ)ల సంక్షేమం కోసం 56 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు. కోటి 2 లక్షల మందికి రూ.71,740 కోట్ల లబ్ధి. ♦ 2023–24లో దాదాపు 5 వేల మంది మైనారీ్టలకు ఉద్యోగావకాశాల కోసం శిక్షణ. ఇమామ్‌లకు అందించే సహాయం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.. 4,983 మందికి ప్రయోజనం. మోజన్లకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంపు. 4,983 మందికి మేలు. ♦ 2021–22 నుంచి 8,427 మంది పాస్టర్లకు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సహాయం. 2023 నుండి విజయవాడలోని ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్ర చేసే ప్రతి యాత్రికునికి రూ.80 వేలు చొప్పున 1,756 మందికి లబ్ధి. 2019 నుండి 1,178 మంది యాత్రికులు జెరూసలేం వెళ్లడానికి రూ.60 వేల చొప్పున ఆర్థిక సాయం. ఎస్సీ విద్యార్థులకు జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ. తద్వారా 200 మంది విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర ప్రీమియర్ కళాశాలలలో ప్రవేశం. ‘కెన్నెడీ లుగర్–యూత్ ఎక్సే్ఛంజ్’ కార్యక్రమం, విదేశీ విద్యా అధ్యయన కార్యక్రమాలకు ఎనిమిది మంది విద్యార్థులకు అవకాశం. 2023 సెపె్టంబర్లో సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనపై న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశానికి ఈ వర్గానికి చెందిన ఒక విద్యార్థి ప్రాతినిధ్యం. ఇళ్ల స్థలాలు, ఇళ్లు.. నగదు బదిలీ ♦ రాష్ట్రంలో గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి 4,63,697 ఇళ్లు మాత్రమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుంచి ఇప్పటి వరకు రూ.1.53 లక్షల కోట్ల విలువైన 30,65,315 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ప్రతి లబ్ధిదారుని ఇంటి ఖర్చుకు రూ.లక్షా 80 వేలు మంజూరు చేసింది. మౌలిక సదుపాయాల కోసం ఒక్కో ఇంటికి రూ.6.90 లక్షల చొప్పున (మొత్తంగా రూ.22,909 కోట్లు) వెచ్చిస్తోంది. ఫలితంగా 22 లక్షల ఇళ్లలో దాదాపు 9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లు 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇప్పటి వరకు 1,62,538 మంది లబ్దిదారులు నివాసం ఉంటున్నారు. ♦ అవినీతి, అవకతవకలకు అవకాశం లేకుండా అర్హతే ప్రాతిపదికగా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోంది. కోవిడ్ సమయంలో, ఇతరత్రా ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసి దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు అవిశ్రాంతంగా పనిచేసిన సచివాలయాల సిబ్బంది, వలంటీర్లను ప్రభుత్వం అభినందించింది. ♦ 2019లో స్థిర ధరల సూచి ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031తో దేశంలో 18వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం అది రూ.2,19,518తో 9వ ర్యాంకుకు ఎగబాకింది. ♦ వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం లబ్దిదారుల అర్హత వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించి సంతృప్త స్థాయిలో అమలు చేస్తోంది. 2019లో పింఛన్ల మొత్తం నెలకు రూ.1,385 కోట్లు ఉండగా, జనవరి నెల నాటికి అది రూ.1,968 కోట్లకు పెరిగింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలక్షల మందికి రూ.84,731 కోట్లు అందించింది. ♦ ప్రజల ఇంటి ముంగిటికే సరుకులు సరఫరా చేయాలనే లక్ష్యంతో 9,260 సంచార వాహనాలను ప్రవేశపెట్టింది. తద్వారా వృద్ధులు, దివ్యాంగులు, వేతన కార్మికులకు ఎంతో ఊరట కలిగింది. ఈ వాహనాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి ఉపాధి లభించింది. సబ్సిడీ బియ్యం కోసం గత ప్రభుత్వం రూ.14,256 కోట్లు, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.29,628 కోట్లు ఖర్చు చేసింది. -
ఏపీ బడ్జెట్ ఏడు రంగుల ఆంధ్ర ధనుస్సు
‘రోటి, కపడా, ఔర్ మకాన్’ ఎవరు అవునన్నా, కాదన్నా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇదో నినాదం. ప్రజలకు వీటిని సమకూర్చడం పాలకుల కనీస బాధ్యత. ఇవి అందుబాటులో ఉన్నప్పుడే ఏ కుటుంబమైనా అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేయడానికి ఉపక్రమిస్తుంది. వీటిని విస్మరించి, గ్రాఫిక్స్‌తో ఎన్ని మేడలు కట్టినా అవి నీటి మూటలేనని చరిత్ర చెబుతోంది. ప్రజల ఆనందాన్ని, వారి బాగోగులను చూసి ఆనందించే వాడే అసలైన పాలకుడని కూడా చరిత్ర వెల్లడిస్తోంది. తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు బాసటగా నిలిచినప్పుడే ప్రజా రంజక పాలన అనిపించుకుంటుంది. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఈ మూడు రంగాల్లో చేయూత అందిస్తే చాలు, ప్రజలు స్వయం సమృద్ధి దిశగా అడుగులేస్తారని విశ్వ వ్యాప్తంగా విఖ్యాత ఆర్థిక నిపుణులు నొక్కి వక్కాణిస్తుండటం తరచూ వినిపిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభ్యున్నతికే ఎన్నో దేశాలు, రాష్ట్రాలు సతమతం అవుతున్న వేళ.. ఇంతకు మించిన సంక్షేమాభివృద్ధిని సాకారం చేస్తూ మన రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. నవరత్నాల పథకాలు, సప్త స్వరాల్లాంటి థీమ్‌ల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన జీవనాన్ని అందించాలనే తపన, తాపత్రయం.. బడ్జెట్లో కళ్లకు కడుతోంది. సాక్షి, అమరావతి: సాధారణ ఎన్నికలకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రూపుదిద్దుకుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024 – 25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను బుధవారం అసెంబ్లీకి సమర్పించారు. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటును తగ్గించేందుకు ప్రయత్నం చేసిన ఆర్థిక మంత్రి మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాల అమలు ద్వారా గత ఐదేళ్లలో సాధించిన ప్రగతి, ఫలితాలు, సంక్షేమాన్ని బడ్జెట్ ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. కొత్త ఆలోచనలు, వినూత్న విధానాలను అమలు చేయడం ద్వారా అతి తక్కువ వ్యవధిలో ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాల్లో గణనీయమైన మార్పులు తేగలిగిందన్నారు. ఎన్నికల నేపధ్యంలో 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి ఏప్రిల్ – జూలై వరకు నాలుగు నెలలు పాటు వ్యయానికి రూ.88,215 కోట్ల పద్దును అసెంబ్లీ ఆమోదానికి ప్రతిపాదించారు. భారీ అంచనాలకు వెళ్లకుండా వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలకే పరిమితమయ్యారు. ఎప్పటిలాగానే విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారు. ► 2024–25 ఓటాన్ అకౌంట్ మొత్తం బడ్జెట్‌ను రూ.2,86,389.27 కోట్లు గా బుగ్గన ప్రతిపాదించారు. మూలధన వ్యయం రూ.30,530.18 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.2,30,110.41 కోట్లుగా ప్రతిపాదించారు. రెవెన్యూ లోటు 24,758.22 కోట్లు ఉంటుందని, ద్రవ్య లోటు రూ.55.817.50 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ద్రవ్యలోటు జీఎస్డీపీలో దాదాపు 3.51% ఉంటుందని, రెవెన్యూ లోటు జీఎస్డీపీలో దాదాపు 1.56 శాతం ఉంటుందని అంచనా వేశారు. 2023–24 సవరించిన అంచనాల మేరకు రెవెన్యూ లోటు జీఎస్డీపీలో 2.19 శాతం, ద్రవ్య లోటు జీఎస్డీపీలో 4.18 శాతం ఉంటుందని తెలిపారు. ► సాధారణ విద్యకు బడ్జెట్ కేటాయింపుల్లో పెద్ద పీట వేశారు. సాధారణ విద్యా రంగానికి రూ.33,898 కోట్లు కేటాయించారు. సంక్షేమ, అభివృద్ది రంగాలకు తగినన్ని నిధులు కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి రూ.17,816 కోట్లు, పట్టణాభివృద్దికి రూ.9546 కోట్లు, వైద్య, ఆరోగ్య రంగానికి రూ.17,916 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.14,236 కోట్లు, సాగునీటి రంగానికి రూ.12,038 కోట్లు, మొత్తం సంక్షేమ రంగానికి రూ.44,668 కోట్లు కేటాయించారు. విద్యుత్ రంగానికి రూ.6,595 కోట్లు, రవాణా రంగానికి రూ.10,334 కోట్లు కేటాయింపులు చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాల పెట్టుబడులకు రూ.3,940 కోట్లు కేటాయించారు. ఐదేళ్లలో ‘సుపరిపాలిత ఆంధ్ర’గా.. 2019.. అప్పటికి రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయింది. విభజన గాయాలు మానేందుకు, సాంత్వన చర్యలు తీసుకునేందుకు గత టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా.. పరిస్థితిని పెనం మీంచి పొయ్యలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని పునరి్నర్మించుకోవడంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానంగా దృష్టిపెట్టారు. ఈ సమస్యలను అధిగమించాలంటే మూస పద్ధతిలో కాకుండా సరికొత్త విధానంలో మాత్రమే అభివృద్ధి సాధించగలమని ఆయన తన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా బలంగా విశ్వసించారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ముఖ్యంగా సుపరిపాలనలో భాగంగా పాలనలో వికేంద్రీకరణ ప్రవేశపెట్టడం అత్యంత ప్రధానమైనది. ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు సీఎం జగన్ తీసుకెళ్లారు. గ్రామస్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరిచారు. విస్తృతస్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించి సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారత అందించి రాష్ట్రాన్ని ‘సుపరిపాలిత ఆంధ్ర’గా తీర్చిదిద్దారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బుధవారం తన బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రం ‘సుపరిపాలిత ఆంధ్ర’గా ఎలా రూపాంతరం చెందిందో స్పష్టంగా వివరించారు. పాలనా వికేంద్రీకరణ.. ప్రజలు సాధికారిత, వికేంద్రీకరణ, సుపరిపాలన అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి. వీటిని ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరచడం, విస్తృత స్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించడం, సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారతనందించింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు, పోలీసు వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాకుండా స్థానిక సంస్థలను బలోపేతం చేసింది. కమ్యూనిటీ కాంట్రాక్టుల విధానం, స్థానిక పాలనలో పౌరుల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించింది. అలాగే.. ► దాదాపు 1,35,000 మంది ఉద్యోగులతో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసింది. వీటిల్లో 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించింది. తద్వారా అర్హులైన లబ్ధిదారులందరికీ ఎలాంటి లోపాలు లేకుండా సకాలంలో పారదర్శకంగా సంక్షేమ పథకాలకు తోడు పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందిస్తోంది. ► అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు.. రెవెన్యూ డివిజన్లను 52 నుంచి 77కి పెంచి పరిపాలనాపరమైన పునర్నిర్మాణాన్ని చేపట్టింది. ఇది ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని మరింత జవాబుదారీగా, సమర్థవంతంగా చేసింది. ► నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేస్తాయి. ► ఇక పౌరుల రక్షణ, భద్రతను పెంపొందించడానికి అవసరమైన చోట్ల రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోలీసు సబ్–డివిజన్లు ఏర్పాటుచేసింది. ► ప్రతి జిల్లాలో దిశా పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేయడమే కాక రాష్ట్రవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాధాన్యత కలిగిన 20 ముఖ్య ప్రాంతాల్లో పర్యాటక పోలీసుస్టేషన్లు ప్రారంభమయ్యాయి. ► భద్రతా మౌలిక సదుపాయాలు పెంచడం ద్వారా ప్రజాభద్రత మరింత మెరుగుపడింది. గడప గడపకు మన ప్రభుత్వం.. ► ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు పౌరుల నుంచి నేరుగా ప్రాథమిక సౌకర్యాలు, మౌలిక సదుపాయాల అవసరాలను తెలుసుకుని వాటిని సమకూర్చడం ద్వారా బాధ్యతాయుతమైన పాలనను అందిస్తున్నారు. ► ఈ కార్యక్రమంలో భాగంగా 58,288 పనులను రూ.2,356 కోట్ల అంచనాతో మంజూరు చేయగా, ఇప్పటివరకు రూ.729 కోట్లతో 17,239 పనులు పూర్తయ్యాయి. ► రాష్ట్రంలో స్థానిక సంస్థలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు నాల్గవ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించి, ఐదవ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని కూడా ఏర్పాటుచేసింది. వివక్షకు దూరంగా.. గత ఎన్నికల ప్రచార సమయంలో చెప్పిన మాదిరిగానే ముఖ్యమంత్రి జగన్ రాజకీయాలు, ప్రాంతాలు, కులమతాలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి ఫలాలను అందించినట్లు బడ్జెట్ ప్రసంగంలో బుగ్గన పేర్కొన్నారు. పాలనా వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చర్యలను వివరిస్తూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు. ప్రతిపక్ష నాయకుడి నియోజక వర్గమని వదిలేయకుండా కుప్పంను రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించడంతోపాటు పౌరుల రక్షణ, భద్రత కోసం కొత్త పోలీసు సబ్ డివిజన్, పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తోందనేందుకు ఇదే ఉదాహరణ అని చెప్పారు. సంక్షేమ ఫలాలను వివరిస్తూ కొందరు లబ్ధిదారులకు చేకూరిన ప్రయోజనాన్ని బుగ్గన వీడియో ప్రజంటేషన్ ద్వారా తెలియచేశారు. ఇలాంటి ఉదంతాలు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ కనిపిస్తాయన్నారు. ► తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన వడ్డే రాజేశ్వరి పొదుపు సంఘాల రుణాల మాఫీ, పింఛన్, ఆసరా కింద లభించిన సాయంతో గొర్రెలను కొనుగోలు చేశారు. తనను కష్టాల నుంచి ఈ ప్రభుత్వం గట్టెక్కించిందని ఆమె సంతోషంగా చెబుతోంది. ► విశాఖ జిల్లా భీమిలి మండలం టి.నగరపాలెంకు చెందిన పల్లా కృష్ణవేణి చేయూత కింద అందిన మొత్తంతో కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకుంది. అమ్మ ఒడి సాయం కూడా అందుతోంది. కుట్టు మిషన్ ఉంది. రోజుకు రూ.1,000 దాకా సంపాదిస్తున్నానని, కిరాణా దుకాణంతో తమ బతుకులు మారాయని సగర్వంగా చెబుతోంది. ► విశాఖపట్నం ఆరో వార్డు మధురవాడకు చెందిన వాండ్రాసి అన్నపూర్ణ తాము టీడీపీ మద్దతుదారులైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇతర పథకాలనూ అందిస్తోందని ధన్యవాదాలు తెలియచేస్తోంది. ► నడవలేని స్థితిలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరుకు చెందిన వృద్ధురాలు కవుజు బేబీ అనే మహిళకు ప్రతి నెలా రూ.3,000 పెన్షన్, ఇతర పథకాలను ఇంటి వద్దే అందిస్తుండటంతో ఈ ప్రభుత్వం తనను ఎంతో ఆదుకుంటోందని కృతజ్ఞతలు తెలిపింది. ► విశాఖకు చెందిన రోబంకి చిరంజీవులు అనే వృద్ధ దంపతులకు వైఎస్సార్ కంటి వెలుగు ద్వారా కంటి ఆపరేషన్లు, ఆరోగ్యశ్రీ ద్వారా కాలికి ఆపరేషన్ నిర్వహించడంతోపాటు ఆసరా, పెన్షన్ అందిస్తుండటంతో ఈ ప్రభుత్వం కన్న కొడుకులా ఆదుకుంటోందంటూ సంతోషంగా చెబుతున్నారు. ► ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి పంపడంతో ఒంటరిగా ఉన్న తాను దేవాలయాల వద్ద యాచిస్తూ జీవనం సాగించానని, ఈ ప్రభుత్వం వచ్చాక రూ.3,000 పెన్షన్ ప్రతీ నెలా ఇస్తుండటంతో భిక్షాటన మానుకుని గౌరవంగా బతుకుతున్నానంటూ విజయనగరం జిల్లా బాడంగి మండలం వాడాడ గ్రామానికి చెందిన బత్తిన అప్పమ్మ చెబుతోంది. -
AP Budget 2024: బడ్జెట్లో సంక్షేమానికి భారీ కేటాయింపులు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే అభివృద్ధికి కూడా భారీగా నిధులు కేటాయించింది. బడ్జెట్లో బీసీ సంక్షేమానికి ఏకంగా రూ.71,740 కోట్లు కేటాయించి రికార్డు సృష్టించింది ప్రభుత్వం. బీసీల కోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్లకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. రూ.20 వేల కోట్లతో రాష్ట్రంలో నాలుగు ఓడ రేవుల నిర్మాణం చేపట్టనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. కొత్తగా నిర్మించనున్న ఈ ఓడ రేవుల ద్వారా 75 వేల మంది కొత్తగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో తాగునీటి పథకాలు ఏర్పాటు చేయనున్నారు. వీటికి గాను ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 10,107 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో10 కొత్త మెడికల్ కాలేజీలు, బోధనాస్పత్రులు, నాలుగు ఇతర ఆస్పత్రులు, మూడు నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఇదీచదవండి.. 2,86,389 కోట్లతో ఏపీ బడ్జెట్ -
నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్
సాక్షి, అమరావతి: 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీకి సమర్పించనుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బుధవారం ఉదయం 11.02 నిమిషాలకు 2024–25 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక ఏడాది తొలి 3 నెలల వ్యయానికి (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఓటాన్ అకౌంట్ పద్దు ఆమోదానికి సభలో ప్రతిపాదించనున్నారు. అదే సమయానికి శాసన మండలిలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను చదువుతారు. అంతకు ముందు ఉదయం 8 గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది. మొత్తం బడ్జెట్ రూ. 2.85 లక్షల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. -
రేపు ఏపీ కేబినెట్ భేటీ.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి బుధవారం ఉదయం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి భేటీ కానుంది. ఉదయం 8గం. సమయంలో సచివాలయం ఫస్ట్ బ్లాక్‌లో ఈ భేటీ జరగనుంది. ఈ భేటీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. అనంతరం.. ఉదయం 9గం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఉదయం 11గం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు బుగ్గన రాజేంద్రనాథ్. -
AP: 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఫిబ్రవరి 6న ఓటాన్ అకౌంట్ బడ్జెట్
సాక్షి, అమరావతి: ఈనెల ఐదో తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 6వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభల సభ్యులనుద్ధేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 7 లేదా, 8వ వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. -
Budget Session: జనవరి 31 నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
సాక్షి, ఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది. ఈనెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వివరాల ప్రకారం.. ఈనెల 31వతేదీ నుంచి ఫిబ్రవరి తొమ్మిదో తేదీ వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈనెల 31న రాష్ట్రపతి ప్రసంగం ఉండనుంది. ఫిబ్రవరి ఒకటో తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వంలో ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ సమావేశాల అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. Parliament Budget Session will be held from 31st January to 9th February. — News Arena India (@NewsArenaIndia) January 11, 2024 -
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం
సాక్షి, అమరావతి: 2021 ఏడాది బడ్జెట్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. మూడు నెలల కాలానికి గాను కేబినెట్ దీనిని ఆమోదించింది. త్వరలోనే ఏపీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపనుంది. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు జరగలేదు. దాంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
ఆఖరి పందేరం
సాక్షి, అమరావతి: ప్రస్తుత ప్రభుత్వం గడువు మరో 12 రోజుల్లో ముగుస్తుందనగా తనకు కావాల్సిన వారి బిల్లులను ఆగమేఘాలపై చెల్లించేస్తోంది. క్లియరెన్స్ సేల్ మాదిరి కోట్ల నుంచి లక్షల రూపాల బిల్లులను వివిధ శాఖల కార్యదర్శులు వారాంతంలో విడుదల చేశారు. సశేషం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అస్మదీయ సంస్థలు, వ్యక్తుల బిల్లుల చెల్లింపునకు సంబంధిత శాఖలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి నిధులను విడుదల చేస్తూ శుక్రవారం పలు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శాఖలో కంప్యూటర్ల ఏర్పాటునకు 13.47 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్షర ఎంటర్ప్రైజెస్ కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ ఐటంలను సరఫరా చేసిందని, ఇందు కోసం 13,47,82,782 రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాలు కల్పించినందుకు మరో 1.38 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. ఇక ప్రజావేదికలో సీఎం చంద్రబాబు అవార్డు గ్రహీతలకు ఒక రోజు ఇచ్చిన డిన్నర్‌కు 3,44,430 రూపాయలను విడుదల చేస్తూ సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి ఎన్. శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే ఉత్తర్వులో ఈ ఏడాది, గత ఏడాది రిపబ్లిక్ డే ఉత్సవాల నిర్వహణ కోసం 2.29 కోట్ల రూపాయలు వ్యయం కాగా ఆ మొత్తాన్ని విడుదల చేశారు. హైకోర్టు భవనాల తనిఖీ కోసం అయిన 7,54,231 రూపాయలను విడుదల చేశారు. ఢిల్లీలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న వారికి సౌకర్యాల కల్పన కోసం 42,80,477 రూపాయలు వ్యయం కాగా దాన్ని కూడా విడుదల చేశారు. గుర్తింపు కార్డులు ముద్రించినందుకు 4,36,314 రూపాయలు విడుదల చేశారు. ప్రణాళిక శాఖలో పనిచేస్తున్న వ్యక్తుల రెమ్యూనరేషన్ కోసం 50 లక్షల రూపాయలను విడుదల చేస్తూ ప్రణాళికా శాఖ కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వర్షాకాలం నాటికి కాళేశ్వరం నీళ్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే వర్షాకాలంనాటికి కాళేశ్వరంప్రాజెక్టు ద్వారా పొలాలకు సాగునీరు అందిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. సోమవారం శాసనమండలిలో జరిగిన ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్భంగా ఈటల మాట్లాడారు. అంతకు ముందు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ పైవిధంగా స్పందిం చారు. రైతుల సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రతీ పంటకు గిట్టుబాటు ధర అందించటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో ఎర్రజొన్నలు, మొక్కజొన్నకు డిమాండ్ లేని సమయంలోనూ రైతులు నష్టపోకుండా అత్యధిక ధర కు ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు.వ్యవసాయానికి 24గంటల కరెంటు అందిస్తున్నామని, మోటారు కాలిపోయిందని ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన అగ్రకుల పేదల రిజర్వేషన్ల బిల్లు పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందన్నారు. ఆడంబరాలకు పోయి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం అమాంతం పెంచేస్తోందని, చివరకు రెవెన్యూ లెక్కలు కుదరక తిరిగి తగ్గిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మహ్మద్ షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సాధ్యమైనంత మేర బడ్జెట్ పెట్టి పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని వారు కోరారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరుగుతోందని, సైబర్ నేరాలు కూడా విస్తరిస్తున్న సమయంలో మరిన్ని ఎక్కువ నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. బడ్జెట్ కేటాయింపులపై ఎమ్మెల్సీ మహ్మద్ జాఫ్రీ తదితరులు లేవనెత్తిన అంశాలపై మంత్రి ఈటల వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ సభలో ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. భావోద్వేగానికి గురైన చైర్మన్ స్వామిగౌడ్ శాసనసభ చివరి రోజు సమావేశాల్లో చైర్మన్ స్వామిగౌడ్ భావోద్వేగానికి లోనయ్యారు. వచ్చే నెలాఖరు లో తనతో పాటు పలువురు సభ్యుల పదవీ కాలం పూర్తికానుండటంతో ఆయన తన అనుభవాలను పం చుకున్నారు. పలు రంగాల్లో మేధావులతో జరిగిన అర్థవంతమైన చర్చలు తనకు సంతృప్తినిచ్చాయన్నా రు. రాజకీయాలకు అతీతంగా ప్రజాసమస్యలపై చర్చలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. మండలి సభ్యుడిగా, చైర్మన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు స్వామిగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సభ నిరవధిక వాయిదా పడింది. ఏడు గంటలు... నాలుగు బిల్లులు... ఈ నెల 22వ తేదీన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. శుక్ర, శని, సోమ మూడ్రోజుల పాటు సమావేశాలు జరగగా... ఏడు గంటల పాటు సభ కొనసాగింది. ఇందులో ఇరవై మంది సభ్యులు వివిధ అంశాలపై మాట్లాడారు. నాలుగు బిల్లులు ఆమోదం పొందాయి. -
ఈ బడ్జెట్‌తో హామీల అమలెలా?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీలను అమలు చేసేలా బడ్జెట్‌ను రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని శాసనసభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలను నెరవేర్చేలా బడ్జెట్ ఉంటుందని ఆశించిన ప్రజలకు ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌తో తీవ్ర నిరాశే మిగిలిందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వ ప్రాధాన్యాలను గుర్తించాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామన్న ప్రభుత్వ వాదనలో పసలేదన్నారు. కేంద్రం నుంచి వచ్చే రాబడుల్లో రూ. 8–10 వేల కోట్లకు మించి మార్పు ఉండనందున పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌పై చర్చలో భాగంగా సభలో ఆయన సోమవారం సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగాలేవీ..? తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన ప్రధాన కారణాల్లో నియామకాలు ఒకటని భట్టి గుర్తుచేశారు. నిరుద్యోగులు ఆశించిన స్థాయిలో ప్రభుత్వం ఉద్యోగాల కల్పన చేసి ఉంటే నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడేది కాదన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ప్రాజెక్టులను కేంద్రం నుంచి సాధించి ఉంటే భారీగా ఉద్యోగాలు లభించేవని, ఈ విషయాన్ని ప్రభుత్వం విస్మరించడంతో నిరుద్యోగ సమస్య పెరి గిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా 2013లో నిమ్జ్‌కు అనుమతి వచ్చిందని, అప్పట్లోనే కొంత భూసేకరణ కూడా జరిగిందని, అది వచ్చి ఉం టే రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలు ఏర్పడేవన్నారు. ఐటీఐఆర్‌ను సాధించి ఉంటే రూ. 3.11 లక్షల కోట్ల ఆదాయం, రూ. 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు, రూ. 2.35 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు, 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవన్నారు. భట్టిపై సీఎం ఆగ్రహం... భట్టి విక్రమార్క తన ప్రసంగంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన ప్రతిసారీ సీఎం కేసీఆర్ దాన్ని తప్పుపడుతూ మాట్లాడారు. భట్టి చెబుతున్న అంకెలు తప్పని, ఆయన అవగాహన లేక మాట్లాడుతూ సభ ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. అయితే తన ప్రసంగాన్ని అడ్డుకోవడం సరికాదం టూ భట్టి కూడా అసహనం వ్యక్తం చేశారు. వాస్తవా లు చెబుతుంటే సీఎం దబాయించేలా మాట్లాడుతున్నారన్నారు. దీంతో ఆ మాటను ఉపసంహరించుకోవాలంటూ సీఎం డిమాండ్ చేశారు. బడ్జెట్ లెక్కల్లో అంచనాలకు, వాస్తవాలకు పొంతన లేదన్న ఆరోపణపై సీఎం స్పందిస్తూ బడ్జెట్ లెక్కలు అలాగే ఉంటాయన్నారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్ల లెక్కలు ఇంతకంటే దారుణంగా ఉన్నాయన్నారు. విద్యారంగానికి కేటాయింపులు కనీసం 20 శాతం ఉండాల్సి ఉండగా కేవలం 6.8 శాతమే పెట్టారని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ వ్యయం 30–40 శాతం తక్కువగా ఉందని భట్టి విమర్శించగా.. వివిధ అంశాల కింద బడ్జెట్లో విద్యారంగానికి రూ. 19,482 కోట్లు కేటాయించామని, అది 11.2 శాతం అవుతుందని, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ కింద ప్రతిపాదించిన దాని కంటే ఎక్కువే ఖర్చు చేస్తున్నామని సీఎం వివరించారు. మిషన్ భగీరథ నుంచి జగిత్యాల మున్సిపాలిటీకి బిల్లులు చెల్లించా లంటూ నోటీసులు పంపారని భట్టి పేర్కొనగా ఆర్డబ్ల్యూఎస్ఎస్ పేరును మిషన్ భగీరథగా మార్చామ ని, కాంగ్రెస్ హయాంలో పేరుకుపోయిన బకాయిలు చెల్లించాలని మాత్రమే అధికారులు అడిగారన్నారు. భగీరథ నీటి వినియోగానికి సంబంధించి ప్రజల నుంచి బిల్లులు వసూలు చేయాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని సీఎం తెలిపారు. పాత ప్రాజెక్టులు పూర్తి చేసుంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన కీలక సాగునీటి ప్రాజెక్టులను యథాతథంగా పూర్తి చేసి ఉంటే ఇప్పటికే తెలంగాణకు ఎంతో మేలు జరిగి ఉండేదని భట్టి పేర్కొన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రూ. 28 వేల కోట్లతో పూర్తి చేసే అవకాశం ఉండేదని, అదే జరిగి ఉంటే 16.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వచ్చి ఉండేదన్నారు. ఇందిర, రాజీవ్ సాగర్లను రూ. 1,500 కోట్ల వ్యయంతో పూర్తి చేయగలిగి ఉండేవారమని, దానివల్ల పూర్వపు ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకుపైగా సాగునీరు లభ్యత ఉండేదన్నారు. -
కేసీఆర్ x భట్టి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య సోమవారం అసెంబ్లీలో ఆసక్తికర సంవాదం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలోని శబరి నది విషయంలో.. వీరిద్దరి మధ్య సోమవారం ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ వాగ్వాదం చోటుచేసుకుంది. బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో ఇందిర స్రవంతి, రాజీవ్ స్రవంతి అంటూ సమైక్య సీఎంలు కుట్రలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ – నాగార్జునసాగర్‌కు నీటి మళ్లింపు కోసం తెలంగాణ వారిని మైమరిపించేందుకు ఈ ప్రాజెక్టులు తెచ్చారన్నారు. నాడు కేంద్రంలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా.. మహారాష్ట్రతో నీటి ఒప్పందం చేసుకోలేకపోయారన్నారు. దీంతో.. అంబేడ్కర్ సుజల స్రవంతి కాస్తా కాగితం స్రవంతిగా మారిపోయిందన్నారు. ఇందిరాసాగర్ దుమ్ముగూడెంలో కొట్టుకుపోయిందన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర తట్టెడు మట్టి తవ్వకుండా ఎక్కడో చేవెళ్ల దగ్గర కాలువ తవ్వడం కాంగ్రెస్ వాళ్ల తెలివి అని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో, బయటా టీఆర్ఎస్ పోరాడిందన్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల రీ–డిజైన్‌పై అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇస్తే దానికి కాంగ్రెస్ సభ్యులు ఎందుకు హాజరుకాలేదని సీఎం ప్రశ్నించారు. గోదావరి నుంచి 160 టీఎంసీలే కాదు 400 టీఎంసీలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. 15–20 రోజుల్లోనే మేడిగడ్డ పనులు చేపడతామన్నారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ అన్యాయంగా కేసులు వేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 200 కేసులు వేశారని, వారిలో కాంగ్రెస్ ఆఫీస్‌బేరర్లు ఉన్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు ఒక కంటితుడుపుగానే మిగిలిందన్నారు. సీతారామప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు, నాగార్జునసాగర్ ఆయకట్టు పటిష్టం చేయడం ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. ఈ వర్షాకాలం జూన్, జూలైలలో నాగార్జునసాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలిచ్చి.. మధిరతో పాటు వివిధ నియోజకవర్గాలకు నీళ్లు ఇస్తామన్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కాకపోయినా తెలియని విషయాలు తెలుసుకున్నానని నీటిపారుదలరంగంపై పట్టుసాధించానని, ఈ విషయంలో కాంగ్రెస్ నాయకులు బాధ్యతారహిత ప్రకటనలు చేయొద్దని సీఎం హితవుపలికారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్లను పునర్వ్యవస్థీకరిస్తామని, గ్యాప్ ఆయకట్టును పూర్తిచేయడం తమ కమిట్మెంట్ అని కేసీఆర్ స్పష్టంచేశారు. అంబేడ్కర్ సుజల స్రవంతి ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని, ఈమేరకు మహారాష్ట్రతో ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు వస్తే, రాకపోతే అనే రెండుపద్ధతుల్లో ఆలోచించాలని భట్టి విక్రమార్క సూచించారు. ఖమ్మం జిల్లా రుద్రమకోట దగ్గర శబరి నదిలో ఏడాదంతా అందుబాటులో ఉండే 4.5 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవాలన్నారు. గోదావరిలో ఆ పాయింట్‌ను తెలంగాణ కోల్పోవద్దని పునర్విభజన చట్టంలోనూ ఉన్న ఈ హక్కును చేజారుకోవద్దన్నారు. దుమ్ముగూడెం, సీతారామప్రాజెక్టుల ద్వారా 2.5లక్షల నుంచి 8లక్షల ఎకరాల దాకా నీరు ఇవ్వొచ్చునన్నారు. రాజీవ్‌సాగర్‌కు రూ.200 కోట్ల నిధులు కేటాయిస్తే పూర్తి అవుతుందని దాని ద్వారా ప్రయోజనం చేకూరుతుందన్నారు. కోర్టులో కేసు వేసిన సత్యనారాయణ టీఆర్ఎస్లోనే ఉన్నారని, ఆయన భార్య చేవెళ్ల జడ్పీటీసీ టీఆర్ఎస్లోనే ఉన్నారని భట్టి పేర్కొన్నారు. గతంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇచ్చినపుడు, తమ వాదన వినిపించేందుకు తమకు ప్రజెంటేషన్ అవకాశమివ్వాలని సీఎల్పీ తరఫున లేఖ ఇచ్చినా స్పీకర్ నుంచి స్పందన లేకపోవడం వల్లే తాము హాజరుకాలేదని భట్టి స్పష్టం చేశారు. ఎక్కడీ శబరి? ఈ సందర్భంగా కేసీఆర్ జోక్యం చేసుకుంటూ భట్టి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో వద్దని.. కమిటీ హాల్లో ప్రజెంటేషన్ పెట్టాలని వితండవాదం చేసింది కాంగ్రెస్ వాళ్లేనన్నారు. రుద్రమకోట, శబరి నది ఎక్కడ? ఈ విషయంలోనూ సభను తప్పుదోవ పట్టిస్తారా అని విమర్శించారు. శబరినది గోదావరిలో కలిసే స్థానం ఏపీలో ఉందని.. భౌగోళిక వాస్తవాలు తెలుసుకోకుండా ఎలా మాట్లాడతారని సీఎం ప్రశ్నించారు. పాపికొండల దగ్గర శబరి కలుస్తుందన్నారు. మరోసారి ధ్రువీకరించుకోవాలని భట్టికి సూచించారు. ఖమ్మం జిల్లాకు రెండేళ్లలో నీళ్లిచ్చి భట్టిని వెంట తీసుకెళతామన్నారు. ఖమ్మంకు వచ్చి చూడండి! సీఎం ఖమ్మం జిల్లాకు వచ్చి గతంలోని ప్రాజెక్టుల పాయింట్లను చూడాలన్నారు. రుద్రంపేట, శబరి దగ్గర చెబుతున్న ప్రాంతాలు మునిగిపోతాయని, పోలవరం పూర్తయితే అది 30 మీటర్ల అడుగుకు పోతుందన్నారు. ఆ ప్రాంతం ప్రాజెక్టుల నిర్వహణకు ఏమాత్రం ప్రయోజనకరం కాదన్నారు. అయితే.. భట్టి కంటే తానే ఆ ప్రాంతంలో ఎక్కువ పర్యటించానని సీఎం చెప్పారు. కాంగ్రెస్ వారి కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకుని రక్షణశాఖను బతిమిలాడి లైడర్ సర్వే చేయించానన్నారు. గోదావరికి సంబంధించి అక్షాంశాలు, రేఖాంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు సీఎం తెలిపారు. పోలవరం ముంపుప్రాంతాలే కాకుండా తీసుకున్న ఇతర ప్రాంతాల గురించి గతంలో సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు.. కాంగ్రెస్‌తో దోస్తీ కట్టాక భిన్నంగా ప్రవర్తిస్తున్నారన్నారు. రెండున్నరేళ్లలో పదిలక్షల ఎకరాలకు (సాగర్ ప్రాంతంతో సహా) నీళ్లు అందించాక.. భట్టి వెంట రాకపోయినా లాక్కెళ్తానని సీఎం చమత్కరించారు. తాను పిలిస్తే వస్తానని, బలవంతంగా తీసుకెళ్లాల్సిన అవసరంలేదని భట్టి కూడా అదే రీతిలో స్పందించారు. మరోసారి రుద్రమకోట గురించి పరిశీలించాలని సీఎంకు సూచించారు. అయితే.. ఈ అంశంపై తాను చెప్పేదేమీ లేదంటూ సీఎం కేసీఆర్ పేర్కొనడంతో వీరిద్దరి మధ్య సంవాదం ముగిసింది. కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే: భట్టి శాసనసభలో చర్చ సందర్భంగా కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని, కేసీఆర్ అబద్ధాలను నిర్భయంగా చెబుతారని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. శబరి నది గురించి కేసీఆర్ సభలో చెప్పింది అబద్ధమని నిరూపిస్తానన్నారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం సీఎల్పీ కార్యాలయంలోని తన చాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే మీడియాను శబరి నది వద్దకు తీసుకెళ్తానని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను కూడా తీసుకెళ్లి శబరి నది ఎక్కడ ఉందో చూపిస్తానన్నారు. పాత ప్రాజెక్టులను కొనసాగిస్తూనే శబరి నీటిని వాడుకునే వీలుందని చెప్పారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులను కొనసాగించవచ్చని స్పష్టం చేశారు. -
సీఎం కేసీఆర్‌కు ఎన్నికల జ్వరం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఎన్నికల జ్వరం పట్టుకున్నట్లు అనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. శనివారం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడిన తీరు అలాగే ఉందన్నారు. సభలో సీఎం వారి టీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించినట్లుగా మాట్లాడారని, బహుశా కేసీఆర్ తాను అసెంబ్లీలో మాట్లాడుతున్నానన్న విషయాన్ని మరచిపోయారేమోనని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రంపైనా, ఇతర పార్టీలపైనా విమర్శలు చేసేందుకు కేసీఆర్ అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకోవడం దురదృష్టకరమన్నారు. అనేక పథకాలు, కార్యక్రమాల కింద కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయక వాటిని నిరుపయోగం చేసిందని లక్ష్మణ్ ఆరోపించారు. -
‘కేసీఆర్ అలా మాట్లాడటం దురదృష్టకరం’
సాక్షి, హైదరాబాద్ : కేంద్రం ప్రభుత్వం, ఇతర పార్టీలపై విమర్శలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకొని మాట్లాడటం దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను దర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడిన విధానం టీఆర్ఎస్ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనట్టుగా ఉందన్నారు. కేసీఆర్‌కు ఎన్నికల జ్వరం పట్టుకుందని, అందుకే అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు మట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తుందనడం దారుణం కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం సహకార సమాఖ్యకు పెద్దపీట వేస్తూ తెలంగాణ అభివృద్ధికి చేయూతను అందించిందని లక్ష్మణ్ చెప్పారు. దానిని విస్మరించి కేసీఆర్.. కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తుందనడం దారుణమన్నారు. అనేక పథకాలు, కార్యక్రమాల కింద కేంద్రం ఇచ్చిన నిధులకు తెలంగాణ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయక వాటిని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఇక యుటిలైజేషన్ సర్టిఫికెట్ (యూసీ)లు ఇవ్వకపోవడంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆగిపోయాన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించిన విషయాన్నీ ముఖ్యమంత్రిగారు మరచిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు వస్తున్న కేంద్ర నిధులపై కేసీఆర్ మరోసారి అబద్ధాలు ఆడారని ఆరోపించారు. సభలోని లేనివారిపై ఆరోపణలు చేయడం సంప్రదాయాలకు విరుద్ధం కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై బీజేపీ బహిరంగ చర్చకు రావాలని గతంలో సవాల్ విసిరితే ముందుకు రాని కేసీఆర్ ఇప్పుడు అమిత్ షాపై అవాకులు చవాకులు పేలుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు చెప్పిందే నిజమైతే కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. శాసనసభలో లేని వ్యక్తి అమిత్ షాపై కేసీఆర్ ఆరోపణలు గుప్పించడం సభా సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. సభా సంప్రదాయాలు తెలియకుండా ముఖ్యమంత్రి మాట్లాడడం సరైంది కాదన్నారు. దీనిని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంన్నారు. మెదీకి పేరొస్తుందని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పేరు వస్తుందని పేద కుటుంబానికి రూ.5 లక్షల మేర వైద్య సహాయం అందించే ‘‘ఆయుష్మాన్ భారత్’’ను తెలంగాణలో అమలు చేయక రాష్ట్రంలోని పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. కాళేశ్వరం సహా అనేక సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు రికార్డు స్థాయి తక్కువ వ్యవధిలో జారీ చేసిందన్నారు. జాతీయ రహదారులు, రైల్వేల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణంలో మోదీ ప్రభుత్వంలోనే తెలంగాణ గణనీయమైన ప్రగతి సాధించిందని పేర్కొన్నారు. ఈ విజయాలను తన క్రెడిట్‌గా కేసీఆర్ చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనలు పాటించకపోవడంతో కేంద్రం నిధులు జారీ చేయలేకపోతే.. దానిని సాకుగా చూపి కేంద్రం రాష్ట్రంపై కుట్రలు పన్నిందనడం కేసీఆర్ నైజాన్ని బయటపెడుతోందని విమర్శించారు. మహిళల సామర్థ్యాన్ని కేసీఆర్ కించపరిచారు తాజాగా ప్రకటించిన మంత్రివర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ వారి సామర్థ్యాన్ని కించపరిచారని లక్ష్మణ్ విమర్శించారు. ఇద్దరు మహిళలను మంత్రివర్గంలో చేర్చుకుంటామని ఇప్పుడు చెప్పడం ప్రజలను మభ్యపెట్టడం తప్పితే మరొకటి కాదన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడమే గాక దానిని నిసిగ్గుగా సమర్థించుకుంటున్నారని మండిపడ్డారు. గ్రామాలను పరిపుష్టం చేస్తామన్న కేసీఆర్ మాటలు ఇంతవరకు అమలు కాలేదన్నారు. మాయ మాటాలతో ప్రజలను కేసీఆర్ ఎక్కువ రోజులు మభ్యపెట్టలేరన్నారు.