ఓటాన్ అకౌంట్ కోసం 10 నుంచి అసెంబ్లీ | Andhra Pradesh Assembly session from february 10 | Sakshi
Sakshi News home page

ఓటాన్ అకౌంట్ కోసం 10 నుంచి అసెంబ్లీ

Published Fri, Feb 7 2014 2:18 AM | Last Updated on Sat, Jun 2 2018 4:30 PM

Andhra Pradesh Assembly session from february 10

సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ఈనెల పదో తేదీ తిరిగి ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజులపాటు ఈ సమావేశాలు జరపాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ఆమోదం కోసం ఏర్పాటు చేసే అసెంబ్లీ సమావేశాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం కొందరు మంత్రులతో చర్చించారు. 

పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం, ఆ తరువాతి పరిణామాలను అనుసరించి అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభ ప్రొరోగ్ కానందున, సమావేశాల తేదీలను రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా ఖరారు చేసి, స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు పంపించనుంది. ఆ మేరకు అసెంబ్లీనుంచి అధికారిక నోటిఫికేషన్ వెలువడనుంది. ఓటాన్ అకౌంట్ కోసం రాష్ట్ర శాసనమండలి కూడా సమావేశం జరుపుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement