సాక్షి, అమరావతి: 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీకి సమర్పించనుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బుధవారం ఉదయం 11.02 నిమిషాలకు 2024–25 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక ఏడాది తొలి 3 నెలల వ్యయానికి (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఓటాన్ అకౌంట్ పద్దు ఆమోదానికి సభలో ప్రతిపాదించనున్నారు.
అదే సమయానికి శాసన మండలిలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాధ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను చదువుతారు. అంతకు ముందు ఉదయం 8 గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది. మొత్తం బడ్జెట్ రూ. 2.85 లక్షల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment