Rajendranath
-
వివాదాస్పద తీరు.. ఆగడాల్లో సరిలేరు!
ఎక్కడైనా ఒక పోలీసు అధికారికి మంచి పోస్టింగ్ ఇవ్వాలంటే పనితీరు, నిజాయితీ వంటివి చూస్తారు. కానీ ఆ సీఐకి ఈ అర్హతలే లేవు. పైపచ్చు ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. హత్య కేసుల్లో నిందితులకు సహకరిస్తారని, బాధితులపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారనే విమర్శలు ఉన్నాయి. ల్యాండ్ సెటిల్మెంట్లు, రాజకీయ నాయకులఅడుగులకు మడుగులొత్తడంలో ఘనాపాటిగా పేరుంది. అలాంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరిచి మరీ అందలం ఎక్కించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సాక్షి ప్రతినిధి, అనంతపురం: గతంలో రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన రెండు హత్యలు రాష్ట్రంలోనే సంచలనం సృష్టించాయి. అనంతపురం రూరల్ మండలం కందుకూరులో 2018 మార్చి 30న వైఎస్సార్ సీపీ నేత శివారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.ఇటుకలపల్లి నుంచి స్వగ్రామం వెళ్తుండగా దారిలో కాపుకాచిన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో అతి కిరాతకంగా ఆయనను నరికి చంపారు. ఈ హత్యకు వారం రోజుల ముందే రెండు వర్గాల నడుమ గొడవ జరిగింది. ఈ క్రమంలోనే శివారెడ్డి సోదరుడు తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ వినతిపత్రం అందించగా, అప్పట్లో సీఐగా ఉన్న రాజేంద్రనాథ్ యాదవ్ దాన్ని చెత్తబుట్టలో పడేశారు. ఆ తర్వాత వారం రోజులకే శివారెడ్డి హత్య జరి గింది. వినతిపత్రం ఇచ్చినప్పుడే నిందితులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటే అసలు హత్యే జరిగి ఉండేది కాదని కందుకూరు గ్రామస్తులు నేటికీ చెబుతున్నారు. శివారెడ్డి హత్యకు పరోక్షంగా సీఐ కూడా కారణమంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ హత్య కేసు విచారణ అధికారిగా రాజేంద్రనాథ్ ఉంటే బాధితులకు న్యాయం జరగదని మరో పోలీసు అధికారిని ఉన్నతాధికారులు నియమించడం గమనార్హం.ప్రసాదరెడ్డి హత్య కేసులోనూ..2015 ఏప్రిల్ 29న ఏకంగా రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలోనే వైఎస్సార్ సీపీ కీలక నేత భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ హత్య నేపథ్యంలోనూ రాజేంద్రనాథ్ వ్యవహార శైలిలో విమర్శలు వచ్చాయి. ప్రస్తుత అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కారును అప్పట్లో శివప్రసాద్ రెడ్డి హత్య కేసు నిందితులు వాడినట్టు తేలింది. ఆ సమయంలో దగ్గుపాటి ప్రసాద్ రాప్తాడు ఎంపీపీగా ఉన్నారు. ఇప్పుడు దగ్గుపాటి అనంతపురం ఎమ్మెల్యే కావడంతో రాజేంద్రనాథ్ ఏకంగా కీలకమైన వన్‌టౌన్‌కు పోస్టింగ్ తెచ్చుకోగలిగారనే విమర్శలు వినిపిస్తున్నాయి.సెటిల్మెంట్లలో ఘనుడు!రాప్తాడుకు చెందిన ఓ విలేకరికి, ఆయన అన్నదమ్ములకు మధ్య భూ వివాదం నడుస్తోంది. వీరిలో ఒక వర్గానికి పరిటాల కుటుంబం మద్దతు ఉంది. దీంతో అప్పట్లో మంత్రి అయిన పరిటాల సునీత ఒత్తిడితో విలేకరిపై సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ రెచ్చిపోయారు. విలేకరి చొక్కా పట్టుకుని ‘భూమి మీద నీకు హక్కులేదు, మర్యాదగా వచ్చి సంతకాలు చేస్తావా లేదా’ అని బెదిరించారు. దీంతో బాధిత విలేకరి అప్పట్లో తన మిత్రులతో కలిసి పోలీసుస్టేషన్ ముందు ధర్నాకు దిగగా సీఐ క్షమాపణలు చెప్పారు. ఇలా ల్యాండ్ సెటిల్మెంట్లలోనూ ఘనాపాటిగా రాజేంద్రనాథ్ యాదవ్ పేరు తెచ్చుకున్నారు.తాజాగా స్టూడెంట్ యూనియన్ నేతలపై..నేటికీ రాజేంద్రనాథ్ యాదవ్ తన వివాదాస్పద వైఖరిని వీడలేదు. స్టూడెంట్ యూనియన్ నాయకులపై ఇటీవల తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. స్కాలర్షిప్లు మంజూరు చేయాలంటూ అనంతపురంలోని పెన్నార్ భవన్ వద్ద ధర్నాకు దిగిన ఏఐఎస్ఎఫ్ నేతలపై చిందులు తొక్కారు. సీఐ వాడిన భాష అత్యంత జుగుప్సాకరంగా ఉందని, తమను కొట్టడానికి కూడా యత్నించారని, విద్యార్థుల పట్ల కూడా అమాన వీయంగా వ్యవహరించారని విద్యార్థి సంఘం నేతలు వాపోయారు. ఇలా తాను ఎక్కడ పనిచేసినా లెక్కలేనన్ని ‘ఘనతలు’ మూటగట్టుకున్న వ్యక్తికి నగరంలో కీలక స్థానాన్ని కట్టబెట్టడం ఉమ్మడి జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది. చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష వేసే పోలీసు బాస్‌లు రాజేంద్రనాథ్ యాదవ్ విషయంలో ఉదారంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. -
నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్
సాక్షి, అమరావతి: 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీకి సమర్పించనుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బుధవారం ఉదయం 11.02 నిమిషాలకు 2024–25 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక ఏడాది తొలి 3 నెలల వ్యయానికి (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఓటాన్ అకౌంట్ పద్దు ఆమోదానికి సభలో ప్రతిపాదించనున్నారు. అదే సమయానికి శాసన మండలిలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను చదువుతారు. అంతకు ముందు ఉదయం 8 గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది. మొత్తం బడ్జెట్ రూ. 2.85 లక్షల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. -
ఏపీ సర్కారు పనితీరుపై కేంద్రం ప్రశంస
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరడంలో మెరుగ్గా ఉందనే విషయాన్ని గుర్తించిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కృష్ణారావ్ కరాద్ ఏపీ సర్కారు తీరును మెచ్చుకున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి బుగ్గన అధ్యక్షతన 224వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా బుగ్గన మాట్లడుతూ.. రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రూ.1.68 లక్షల కోట్ల రుణ లక్ష్యాన్ని సాధించడం అభినందనీయమన్నారు. ఈ సందర్బంగా బ్యాంకర్లను ప్రత్యేకంగా బుగ్గన అభినందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రుణ ప్రణాళిక లక్ష్యం గతేడాది (రూ.1.40 లక్షల కోట్లు) కన్నా 20 శాతం ఎక్కువగా అంటే.. రూ.1.68 లక్షల కోట్లు నమోదు చేయడం శుభపరిణామమన్నారు. ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఎంఎస్ఎంఈలకు విరివిగా రుణాలివ్వాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. పీఎం ముద్ర, స్టాండప్ ఇండియా తదితర పథకాలకు రుణాలు ఇవ్వడంపై బ్యాంకర్లు మరింత దృష్టి సారించాలని కోరారు. వీధి, చిరు వ్యాపారులకు ప్రాధాన్యత ఇవ్వండి ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద వీధి వ్యాపారులకు, ఆత్మనిర్భర్ నిధి, పీఎం ఎఫ్ఎమ్ఈ పథకాల ద్వారా చిరు వ్యాపారులకు రుణాలిచ్చేందుకు మరింత ప్రాధాన్యతనివ్వాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు. ఆయా పథకాల అమలులో ఎక్కువ జాప్యం లేకుండా దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకానికి 8వ తరగతి అర్హత, ఒక జిల్లా ఒక వస్తువు వంటివి తొలగించడం వంటి అంశాలను సరళతరం చేసిన నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ రుణ సదుపాయం కల్పించడంలో వేగం పెంచాలన్నారు. ప్రైవేట్ బ్యాంకులు కూడా ఇందులో పాలుపంచుకోవాలన్నారు. కౌలు రైతులకు మరింత సహకారం జూన్ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని 67,422 మంది కౌలు రైతులకు రూ.517.86 కోట్ల ఆర్థిక సాయం అందించినట్టు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగనన్న నగర్లలో గృహ నిర్మాణం చేసుకునే వారికి రుణ సదుపాయం కల్పించే లక్ష్యం రూ.2,464.72 కోట్లు (60 శాతం) చేరామన్నారు. సిబిల్ స్కోర్, వయసు తదితర కారణాలతో ఎక్కువ దరఖాస్తులు పక్కన పెడుతున్నారని.. బ్యాంకర్లు పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించి ప్రభుత్వ లక్ష్యం చేరడంలో భాగస్వామ్యం కావాలని కోరారు. రైతులకు మరిన్ని రుణాలివ్వాలి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రైతులకు మరిన్ని రుణాలందించడం ద్వారా చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు. జగనన్న పాలవెల్లువ పథకంలో పాడి రైతులకు తోడ్పాటు ఇవ్వాలన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ సుబ్రమణియన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాలను విజయవంతగా అమలు చేస్తోందని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలులో ప్రభుత్వానికి తమవంతు సహకారం అందించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ.. కౌలు రైతులు, స్వయం సహాయక సంఘాలకు మరింత తోడ్పాటును అందించేందుకు బ్యాంకులు మరింత సహకరించాలని కోరారు. జగనన్న గృహ నిర్మాణ కాలనీలకు రానున్న నాలుగైదు నెలల్లో నూరు శాతం రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీఎం ఎం.రవీంద్రబాబు, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఆర్థికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, సెర్ప్ సీఈవో ఇంతియాజ్, ఆర్బీఐ జీఎం ఆర్కే మహానా, నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్, యూబీఐ జీఎం గుణానంద్ గామి, ఏసీఎం రాజుబాబు పాల్గొన్నారు. మహిళా సంఘాల రుణాలపై వడ్డీ తగ్గించండి స్వయం సహాయక సంఘాలకు ఇప్పటివరకూ రూ.4,286 కోట్లను రుణాలుగా ఇచ్చినట్టు మంత్రి బుగ్గన చెప్పారు. దీనిని మరింత పెంచాలని కోరారు. రూ.3 లక్షల వరకూ డ్వాక్రా సంఘాలు తీసుకునే రుణాలపై వడ్డీ తగ్గించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ కార్యక్రమాల ద్వారా పేద మహిళలకు వడ్డీ భారం తగ్గించే అంశంపైనా చొరవ చూపాలన్నారు. -
‘చంద్రబాబు లేఖ వ్యవహారంపై సమగ్ర విచారణ’
సాక్షి, అమరావతి: చంద్రబాబు లేఖ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు డీజీపీ రాజేంద్రనాథ్. ఇందులో నిజా నిజాలు ఏమిటో తేలాల్సి ఉందన్నారు డీజీపీ. అటు తర్వాతే చర్యలు ఉంటాయన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఢోకా లేదన్న డీజీపీ.. భువనేశ్వరి యాత్రపై టీడీపీ నేతలు ఎటువంటి అనుమతి కోరలేదన్నారు. ఇక టీడీపీ ఆందోళన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకుంటున్న వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదన్నారు. పోలీసులు ఎవరూ కూడా టీడీపీ ఆందోళన కార్యక్రమాలు అడ్డుకోవడం లేదన్నారు. చదవండి: ఉత్తరం.. ఉత్తదే చంద్ర'లేఖ'లో ఇంద్రజాలం! ‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
తగిన సాక్ష్యాధారాలతోనే నిందితుల అరెస్టు
సాక్షి, అమరావతి: నెల్లూరు కోర్టులో దొంగతనం ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేసి తగిన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే నిందితులను అరెస్టు చేశామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. దీనిపై కోర్టుకు సమగ్ర నివేదిక సమర్పిస్తామని తెలిపారు. మంగళవారం సచివాలయంలో హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తానేటి వనితతో డీజీపీ రాజేంద్రనాథ్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ, ఫ్రెండ్లీ పోలీసింగ్, గంజాయి స్మగ్లింగ్ నివారణ, మహిళా భద్రత తదితర అంశాల్లో పోలీసు శాఖ చేపడుతున్న చర్యలను ఆమెకు వివరించారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరు కోర్టులో దొంగతనం కేసుకు సంబంధించి కొందరు చేస్తున్న ఆరోపణలు వేరు.. క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరని వ్యాఖ్యానించారు. దర్యాప్తులో నిగ్గుతేలిన వాస్తవాలు, ఆధారాల ఆధారంగానే కేసు కొనసాగుతోందని చెప్పారు. దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలను న్యాయస్థానానికి సమర్పిస్తామని తెలిపారు. ఇతర ప్రాంతాలకు చెందిన పోలీస్ అధికారులతోనే ఈ కేసును దర్యాప్తు చేయిస్తున్నామని వివరించారు. దిశ యాప్‌ను ఇప్పటివరకు 1.24 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారని డీజీపీ తెలిపారు. యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న మహిళల సమాచారం బహిర్గతం కాకుండా భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని చెప్పారు. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. దిశ యాప్‌ను వినియోగించి ఇప్పటివరకు 10,983 మంది మహిళలు పోలీస్ రక్షణ పొందారని చెప్పారు. -
రాజేంద్రనాథ్
కమెడియన్ రాజేంద్రనాథ్‌ను మనం ఎక్కువగా షమ్మీ కపూర్ సినిమాల్లో చూస్తాం. ముఖ్యంగా ‘దిల్ దేకే దేఖో’, ‘తీస్రీ మంజిల్’, ‘యాన్ ఈమెనింగ్ ఇన్ పారిస్’ వీటిలో అతడు అలరిస్తాడు. ఆ తర్వాత ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’, ‘ఫిర్ వహీ దిల్ లాయాహూ’, ‘మేరే సనమ్’ వంటి హిట్స్ ఉన్నాయి. ‘జబ్ ప్యార్ కిసీసే హోతా హై’ సినిమాలో ‘పొపట్లాల్’ అనే పాత్ర వేశాక అందరూ రాజేంద్రనాథ్ పేరు మర్చిపోయి పొపట్లాల్ అని గుర్తు పెట్టుకున్నారు. వీళ్లది నేపాలి నేపథ్యం ఉన్న కుటుంబం. ప్రఖ్యాత నటుడు ప్రేమ్‌నాథ్ ఇతడి పెద్దన్న. ఇతడి సోదరి కృష్ణను రాజ్‌కపూర్ పెళ్లి చేసుకున్నాడు. చురుకైన బాడీ లాంగ్వేజ్‌తో డైలాగ్ మాడ్యులేషన్‌తో కామెడీ పండించడం రాజేంద్రనాథ్ ప్రత్యేకత. ఎక్కువ సినిమాల్లో చేయకపోయినా చేసినవాటిలో గుర్తింపు పొందాడు. సినిమా వేషాలు తగ్గాక దూరదర్శన్‌లో కూడా సీరియల్స్ చేశాడు. 75 ఏళ్ల వయసులో 2008లో గుండెపోటుతో మరణించాడు. -
పంచాయతీరాజ్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి
-
పంచాయతీరాజ్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి
హైదరాబాద్ : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజినీర్ రాజేంద్రనాథ్ నివాసంపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావటంతో ఏసీబీ ఈ సోదాలు చేపట్టింది. వారి తనిఖీల్లో రాజేంద్రనాథ్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆయన ప్రస్తుతం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో పనిచేస్తున్నారు. ఇటీవలే ఆయన షాద్‌నగర్ నుంచి బదిలీపై వెళ్లారు. రవీంద్రనాధ్పై పలు అవినీతి ఆరోపణలు రావటంతో రాజేంద్రనగర్, గాంధీ నగర్లో ఉన్న ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ.4 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు గుర్తించారు. రెండు ఇళ్లు, రెండు ఫ్లాట్లు, కారు, 40 కిలోల బంగారం, కిలో వెండిని కూడా అధికారులు గుర్తించారు. -
రైతులను దొంగలతో పోలుస్తారా?
సీఆర్డీఏ బిల్లుపై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ సాక్షి, హైదరాబాద్: పైసా పెట్టుబడి కూడా లేని ల్యాండ్ డెవలపర్స్‌కు ఇచ్చిన హక్కులు, భూములు కోల్పోయిన రైతులకు ఇవ్వకపోవడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ల్యాండ్ పూలింగ్‌పై కోర్టుకెళ్ళే రైతుల ఆలోచనల గురించి ప్రభుత్వం చెప్పే మాటలు రైతులను అవమానించేలా ఉన్నాయని తప్పుపట్టారు. ఎర్ర చందనం దొంగలూ కోర్టుకు వెళుతున్నారనడం ఎంత వరకూ సబబని ప్రశ్నించారు. శాసనసభలో సోమవారం సీఆర్డీఏపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. 60 శాతం ప్రజల ఆమోదం ఉంటేనే భూసేకరణ చేపట్టాలన్న నిబంధనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. వ్యవసాయ భూములను సేకరించకూడదని శివరామకృష్ణన్ కమిటీ పేర్కొందని, ప్రభుత్వం మాత్రం పూలింగ్ పేరుతో 50 వేలు, లక్ష ఎకరాలను రాజధాని కోసం సేకరిస్తోందని విమర్శించారు. ఉన్న వ్యవసాయ భూములను ఇలా సేకరిస్తే ఆహారభద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. పేద రైతులు భూమలు ఇవ్వబోమని చెబుతుంటే, ఏ చట్టాన్నైనా తీసుకొచ్చి లాక్కుంటామని ఓ మంత్రి, మీరు కాదంటే దొనకొండలోనో మరో చోటనో రాజధాని పెడతామని మరో మంత్రి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని ఏర్పాటు విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే ఇన్ని వేల ఎకరాల భూములు ఎందుకు సేకరిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సీఆర్డీఏ బిల్లులో రైతులు, రైతుకూలీలకు ఏమాత్రం భద్రత లేదన్నారు. ఎక్కడైనా భూమి ఇచ్చిన వారికి 70 శాతం, డెవలపర్‌కు 30 శాతం ఇవ్వడం సహజమని, కానీ రాజధాని విషయంలో ఇందుకు భిన్నంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డెవలపర్ ఎంపిక విషయంలోనూ అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఎలాంటి పెట్టుబడి లేని డెవలపర్ చిరవకు భూ యజమానిగా బిల్లులో పేర్కొనడం దారుణమన్నారు. ఉపగ్రహాల తయారీలోనే ప్రపంచంలోనే భారత్ తన ప్రతిభను చాటుతుంటే, నిపుణులైన యువత మన దగ్గరుంటే, సింగపూర్‌ను ఆశ్రయించాల్సిన అవసరం ఏమిటన్నారు. చంద్రబాబుకు గొప్ప విజన్ ఉందని, అందుకే 30 ఏళ్ళ క్రితమే కృష్ణా జిల్లా వ్యక్తినే పెళ్లి చేసుకున్నారని రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. ఇదే విజన్‌ను రాజధాని నిర్మాణం విషయంలో అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.