సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే అభివృద్ధికి కూడా భారీగా నిధులు కేటాయించింది.
బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి ఏకంగా రూ.71,740 కోట్లు కేటాయించి రికార్డు సృష్టించింది ప్రభుత్వం. బీసీల కోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్లకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది.
రూ.20 వేల కోట్లతో రాష్ట్రంలో నాలుగు ఓడ రేవుల నిర్మాణం చేపట్టనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. కొత్తగా నిర్మించనున్న ఈ ఓడ రేవుల ద్వారా 75 వేల మంది కొత్తగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో తాగునీటి పథకాలు ఏర్పాటు చేయనున్నారు. వీటికి గాను ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 10,107 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో10 కొత్త మెడికల్ కాలేజీలు, బోధనాస్పత్రులు, నాలుగు ఇతర ఆస్పత్రులు, మూడు నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment