సాక్షి, విజయవాడ: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసింది. రూ.1.29 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ గవర్నర్ ఆమోదం తెలిపారు. 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. నవంబర్ 30వ తేదీ వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది.
కాగా, ఎన్నికల ముందు సూపర్ సిక్స్, సూపర్ టెన్ అంటూ ప్రజలకిచ్చిన హామీల అమలును ఎగ్గొట్టేందుకే ఈ నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. అంతకుముందు.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి నాలుగు నెలల వ్యయానికి సభ అనుమతి తీసుకుంది. ఈ గడువు నేటితో (జూలై 31తో) ముగిసింది.
సాధారణంగా అయితే.. ఎన్నికల ఫలితాలు అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వాలు తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఈనెల 23న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం ఈనెల 22 నుంచి 26 వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించినప్పటికీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు.
Comments
Please login to add a commentAdd a comment