కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం లోక్సభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నిరాశజనకంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డి ఎ సోమయాజులు అన్నారు. చిదంబరం ప్రవేశపెట్టిన ఆ బడ్జెట్పై ఆయన సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్లో స్పందించారు. చిదంబరం వాస్తవ విరుద్ధమైన లెక్కలతో అటు పార్లెమెంట్ను, ఇటు దేశ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
ద్రవ్యలోటు, రెవెన్యూలోటులను తగ్గించి చూపారన్నారు. ప్రస్తుత యూపీఏ ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా గెద్దదిగిపోతే మేలని దేశ ప్రజలు భావిస్తున్నారని సోమయాజులు పేర్కొన్నారు.