సాక్షి, ఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది. ఈనెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
వివరాల ప్రకారం.. ఈనెల 31వతేదీ నుంచి ఫిబ్రవరి తొమ్మిదో తేదీ వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈనెల 31న రాష్ట్రపతి ప్రసంగం ఉండనుంది. ఫిబ్రవరి ఒకటో తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వంలో ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ సమావేశాల అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
Parliament Budget Session will be held from 31st January to 9th February.
— News Arena India (@NewsArenaIndia) January 11, 2024
Comments
Please login to add a commentAdd a comment