పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు: రాష్ట్రపతి ప్రసంగం ఇదే.. | Parliament Budget Sessions First Day Live Updates | Sakshi
Sakshi News home page

Parliament Budget Sessions 2024: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు అప్‌డేట్స్‌

Published Wed, Jan 31 2024 10:39 AM | Last Updated on Wed, Jan 31 2024 5:47 PM

Parliament Budget Sessions First Day Live Updates - Sakshi

Live Updates..

రాష్ట్రపతి ప్రసంగం అనంతరం రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరిన ద్రౌపది ముర్ము..

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం..
కొత్త పార్లమెంటులో నా తొలి సంతకం
భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైంది
శాంతినికేతన్ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది
భగవాన్ బిర్సాముండా జన్మదినాన్ని జన్ జాతీయ దివస్ గా జరుపుకుంటున్నాం
ఆదివాసీ యోధులను సర్మించుకోవడం గర్వకారణం
చంద్రుడి దక్షిణధ్రువం పై దిగిన తొలి దేశంగా భారత్ రికార్డు
ఆదిత్య ఎల్-1 మిషన్ ను భారత్ దిగ్విజయంగా ప్రయోగించింది 
భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ఆదిత్య ఎల్-1 ప్రవేశించింది.


జీ20 సమావేశాలను భారత్ విజయవంతంగా నిర్వహించింది
ఆసియా క్రీడల్లో భారత్ తొలిసారిగా 107 పతకాలు సాధించింది
ఆసియా పారా క్రీడల్లో భారత్ 111 పతకాలు సాధించింది
భారత్ లో తొలిసారిగా నమో భారత్ రైలును ఆవిష్కరించాం
నారీ శక్తి వందన్ అధినీయం బిల్లును ఆమోదించుకున్నాం.


నారీశక్తి వందన్ అధినీయం చట్టం ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కేటాయింపు 
పేదరికి నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్ ముందుకెళ్తోంది 
తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేశాం
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అన్ని ఆటంకాలు అధిగమించాం
ఎన్నో ఏళ్ల భారతీయుల కల.. రామమందిర నిర్మాణం సాకారమైంది.  

దేశంలో 5జీ నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తోంది
దేశంలో కొత్త క్రిమినల్ చట్టాన్ని తీసుకొచ్చాం
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తో ముందుకెళ్తున్నాం
రక్షణరంగం, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి
నా చిన్నప్పటి నుంచి గరీబీ హఠావో నినాదాలు వింటున్నా
ప్రస్తుతం దేశంలో పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం జరుగుతోంది.
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.

రెండు లక్షల అమృత్ వాటికలను నిర్మించాం
లక్ష కోట్లకు డిఫెన్స్ ఉత్పత్తులు చేరాయి
డిజిటల్ ఇండియా నిర్మాణం గొప్ప విషయం
డిజిటల్ ఇండియాలో 46 శాతం అభివృద్ధి సాధించాం
డిజిటల్ ఇండియాతో బ్యాంకింగ్ లావాదేవీలు సులభతరమయ్యాయి
రక్షణ రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి.

ఆయుష్మాన్ భారత్ లో 57 కోట్ల మంది భాగస్వామ్యమయ్యారు
జాతీయ రహదారుల్లో లక్షా 40 వేల కిలో మీటర్లు నిర్మించాం
39 వందే భారత్ రైళ్లను ఏర్పాటు చేసుకున్నాం
యువశక్తి, నారీశక్తి, రైతులు, పేదల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
10 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం
తక్కువ ధరకు గ్యాస్ సరఫరా చేస్తున్నాం
కరోనా మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొన్నాం.

ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్ వ్యవస్థలున్న దేశం భారత్
దేశంలో 10 లక్షల కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మించుకుంటున్నాం
ప్రపంచంలో అత్యంత వేగంగా భారత ఎకానమీ అభివృద్ధి
రక్షణ, అంతరిక్ష రంగాల్లో నూతన ఆవిష్కరణలు జరిగాయి
రైల్వే శాఖలో పలు సంస్కరణలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు
విద్యుదీకరణ, వందే భారత్ రైళ్లతో వేగంగా ప్రయాణికుల రాకపోకలు
దేశంలో ప్రస్తుతం పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం జరుగుతోంది.
నా చిన్నప్పటి నుంచి గరీబీ హఠావో నినాదాలు వింటున్నా
దేశంలో 10 లక్షల కి.మీల గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేసుకున్నాం
ముంబైలో అటల్ సేతు నిర్మించుకున్నాం.

రూ.7 లక్షల ఆదాయం వరకు పన్ను లేకుండా చేశాం
సామాన్యులకు భారం పడకుండా పన్ను సంస్కరణలు తీసుకొచ్చాం.
2 కోట్ల మంది మహిళలు స్వయం సమృద్ధి సాధించారు 
4 కోట్ల 10 లక్షల మందికి పక్కా ఇళ్లు నిర్మించాం 
కిసాన్ సమ్మాన్ ద్వారా 10 కోట్ల మంది రైతులకు పెట్టుబడి సాయమందిస్తున్నాం
కరోనా, యుద్దాల ప్రభావం దేశంలో ధరల పెరుగుదలపై పడకుండా జాగ్రత్తపడ్డాం

యువతకు లక్షల్లో ఉపాధి అవకాశాలు కల్పించాం
25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి పైకి తీసుకొచ్చాం
ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మోదీ సర్కార్ విప్లవాత్మక మార్పులు తెచ్చింది
లక్షకు పైగా స్టార్టప్స్ ను ఎంకరేజ్ చేశాం
డీబీటీ కింద రూ.25 లక్షల కోట్లు ప్రజలకు అందించాం
గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్ తో 46 శాతం మనదే 
రక్షణరంగం, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి

ఆవాస్ యోజన పథకం ద్వారా సామాన్యులకు నీడ కల్పిస్తున్నాం
పదేళ్లలో వేల ఆదివాసీ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాం
ఆదివాసీ గ్రామాలకు శుద్దజలాలు అందిస్తున్నాం
ట్రాన్స్ జెండర్లకు సమాజంలో గౌరవస్థానం కల్పించాం
దేశ అభివృద్ధి నాలుగు స్తంభాల పై ఆధారపడి ఉంది
యువశక్తి, నారీశక్తి, రైతులు, పేదలు అనే స్తంభాలపై ఆధారపడి ఉంది.

రష్యా-ఉక్రెయిన్, పాలస్తీనా-ఇజ్రాయెల్ యుద్దాల వేళ ద్రవ్యోల్భణాన్ని అదుపుచేశాం
ఎన్నో సమస్యలున్నా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతున్నాం
గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహిస్తున్నాం
సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉన్నాం
సికిల్ సెల్, ఎనీమియతో బాధపడుతున్న గిరిజనుల కోసం జాతీయ మిషన్
జాతీయ మిషన్ కింద ఇప్పటివరకు 1.40 కోట్ల మందికి పరీక్షలు చేయించాం
ఇంజినీరింగ్, మెడిసన్ కూడా మాతృభాషల్లో చదివే అవకాశం కల్పించాం
వైద్య కళాశాలల సంఖ్యను గణనీయంగా పెంచాం.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభయ్యాయి. 

పార్లమెంట్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

కాసేపట్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. 

ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌ నుంచి పార్లమెంట్‌కు బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు హాజరుకానున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ. పార్లమెంట్‌ వద్దకు చేరుకున్న సోనియా. 

నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త పార్లమెంట్‌లో తొలిసారిగా బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించనున్నారు. 

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నారీ శక్తిని కేంద్రం ప్రతిబింబిస్తోంది. బడ్జెన్‌ను మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడుతుండటం నారీశక్తికి నిదర్శనం. ప్రతీసారి సభను అడ్డుకుంటున్న సభ్యులు.. ఈసారైనా సహకరించాలి. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు ఇవే చివరి సమావేశాలు. గత పదేళ్లలో మేము చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసు. 

ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా, తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలిసారి పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రారంబోపాన్యాసం చేయనున్నారు. ఈసారి ఆర్థిక సర్వే నివేదికను విడుదలచేయట్లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.

తొలి రెండు రోజులు ఉభయసభల్లో జీవో అవర్, క్వశ్చన్‌ అవర్‌ను ఇప్పటికే రద్దు చేస్తూ బులిటెన్‌ విడుదల చేశారు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనుంది. ఆ తర్వాత రాజ్యసభ, లోక్‌సభలో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేసిన నేపథ్యంలో సాంకేతికంగా రాష్ట్రపతిపాలనలో ఉన్న ఆ ప్రాంతానికి సంబంధించిన జమ్మూకశ్మీర్‌ బడ్జెట్‌నూ ఆర్థిక మంత్రి నిర్మల లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement