
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఎన్నికల జ్వరం పట్టుకున్నట్లు అనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. శనివారం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడిన తీరు అలాగే ఉందన్నారు. సభలో సీఎం వారి టీఆర్‌ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించినట్లుగా మాట్లాడారని, బహుశా కేసీఆర్ తాను అసెంబ్లీలో మాట్లాడుతున్నానన్న విషయాన్ని మరచిపోయారేమోనని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రంపైనా, ఇతర పార్టీలపైనా విమర్శలు చేసేందుకు కేసీఆర్ అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకోవడం దురదృష్టకరమన్నారు. అనేక పథకాలు, కార్యక్రమాల కింద కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయక వాటిని నిరుపయోగం చేసిందని లక్ష్మణ్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment