10 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు | Assembly Budget Session From February 10th | Sakshi
Sakshi News home page

10 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Published Thu, Feb 6 2014 4:33 PM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM

10 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

10 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 10 నుంచి  ప్రారంభం కానున్నాయి. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కోసమే ఈ సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సమావేశాలు కేవలం నాలుగు రోజుల పాటే జరుగుతాయి. మే నెలలో శాసన సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కిరణ్‌ సర్కారు పూర్తి స్థాయి బడ్జెట్‌కు బదులు తాత్కాలికంగా ఓటాన్‌ అకౌంట్‌ను ప్రవేశపెట్టనుంది.

ఈ బడ్జెట్‌ ఆరు నెలల కాలం వరకు అమలులో ఉంటుంది. బడ్జెట్‌ రూపకల్పనలో ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తలమునకలై ఉన్నారు. బడ్జెట్‌ కసరత్తు ఇప్పటికే దాదాపు పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రజలపై ఎలాంటి పన్నుల భారంకానీ హామీలు కూడా ఉండే అవకాశం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement