assmebly
-
సచివాలయ వ్యవస్థకు చట్టబద్ధత.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు
సాక్షి, అమరావతి: కుగ్రామం, నగరం అన్న తేడా లేకుండా ప్రజలందరికీ వారి సొంత ఊళ్లో ప్రభుత్వ సేవలన్నీ అందుబాటులో తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు పూర్తిస్థాయి చట్టబద్ధత కలి్పంచేందుకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేస్తూ 2022 డిసెంబర్లో జారీచేసిన ఆర్డినెన్స్ స్థానంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి.. ఆ వ్యవస్థకు పూర్తి చట్టబద్ధతను కల్పించనుంది. ఇప్పుటికే ఆర్డినెన్స్‌లో పేర్కొన్న వివరాల మేరకు ఇందుకు సంబంధించి ముసాయిదా బిల్లును గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు రూపకల్పన చేస్తున్నారు. ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ముందు ఈ నెల 14న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదానికి వెళ్లనున్నట్టు అధికారులు వెల్లడించారు. జగన్ సీఎం అయ్యాక 4 నెలలకే ఈ వ్యవస్థకు శ్రీకారం జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే 2019 అక్టోబరు 2వ తేదీ నుంచి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సచివాలయాల్లో పనిచేసేందుకు అప్పటికప్పుడే కొత్తగా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మంజూరు చేశారు. వెంటనే ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇవన్నీ కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ప్రభుత్వం పూర్తిచేసింది. ► గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి రెండువేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు కొలువుదీరాయి. ► అంతకుముందు వరకు కనీసం ఒక్క శాశ్వత ఉద్యోగి కూడా నియామకం జరగని చాలా గ్రామాల్లో కొత్తగా ఏర్పాటైన సచివాలయాల్లో పది నుంచి 11 మంది వరకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది. ► కుగ్రామాలతోసహా ప్రతి చోటా.. ప్రజలకు తమ గ్రామ సచివాలయంలోనే ప్రభుత్వ సేవలన్నీ అందేలా ఏర్పాటు చేసింది. 545 రకాల ప్రభుత్వ సేవలను సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకొచి్చంది. ప్రతి సచివాలయానికి ఇంటర్నెట్ వసతితోపాటు కంప్యూటర్లు, ప్రింటర్లసహా ఇతర ఫర్నిచర్‌ను ప్రభుత్వం అందజేసింది. ► ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలు వారి సొంత ఊరు దాటాల్సిన అవసరం కూడా లేకుండా దాదాపు ఏడుకోట్లకు పైగా ప్రభుత్వ సేవలను వినియోగించుకున్నారు. చదవండి: స్కాములన్నీ బాబు హయాంలోనే -
అసెంబ్లీ బీఏసీ సభ్యులను నియమించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: అసెంబ్లీ బీఏసీ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. మంత్రి వర్గ మార్పుల నేపథ్యంలో బీఏసీ సభ్యులను సీఎం మార్చారు. కన్నబాబు, అనిల్‌కుమార్ స్థానంలో బీఏసీ సభ్యులుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, బీఏసీలో లేజిస్లేటివ్ అఫైర్ కో ఆర్డినేటర్‌గా గండికోట శ్రీకాంత్‌రెడ్డిలను నియమించారు. చదవండి: ఏపీలో మరో భారీ సంక్షేమ పథకం.. అక్టోబర్ 1 నుంచి అమలు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది. -
10 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసమే ఈ సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సమావేశాలు కేవలం నాలుగు రోజుల పాటే జరుగుతాయి. మే నెలలో శాసన సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కిరణ్ సర్కారు పూర్తి స్థాయి బడ్జెట్‌కు బదులు తాత్కాలికంగా ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ ఆరు నెలల కాలం వరకు అమలులో ఉంటుంది. బడ్జెట్ రూపకల్పనలో ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తలమునకలై ఉన్నారు. బడ్జెట్ కసరత్తు ఇప్పటికే దాదాపు పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రజలపై ఎలాంటి పన్నుల భారంకానీ హామీలు కూడా ఉండే అవకాశం లేదు. -
మూడో రోజూ చాంబర్లోనే
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం కూడా శాసనసభలోని తన చాంబర్‌కే పరిమితమయ్యారు. సభలో అడుగు పెట్టలేదు. సోమవారం విభజన బిల్లును సభలో ప్రవేశపెట్టే సమయంలో చంద్రబాబు లేరు. మంగళవారం ఉదయం సభ వాయిదా పడిన తరువాతనే చంద్రబాబు సభకు చేరుకున్నారు. బుధవారం కూడా అదే పంథా అనుసరించారు. మధ్యలో ఒకటి, రెండుసార్లు సభ ఇలా సమావేశమై అలా వాయిదా పడుతున్నా ఆయన మాత్రం సభలోకి అడుగు పెట్టలేదు. లాబీలోని తన చాంబర్లో కూర్చొని తెలంగాణ, సీమాంధ్ర ఎమ్మెల్యేలకు ఎవరి ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారు వ్యవహరించుకోవాల్సిందిగా చెప్పారు. చంద్రబాబు సూచనలకు అనుగుణంగా శాసనసభ కార్యకలాపాలను సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు అడ్డుకుంటుంటే.. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు బిల్లును వెంటనే చర్చకు చేపట్టాలని ఇతర పార్టీల తెలంగాణ ఎమ్మెల్యేలతో కలిసి స్పీకర్‌ను కలవటంతోపాటు ఆయన చాంబర్ ముందు ధర్నా చేశారు. వీరి నిరసనలు ఇలా కొనసాగుతున్న సమయంలోనే తన చాంబర్లో జిల్లాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమవుతున్నారు. బుధవారం ఆయన విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల వారితో భేటీ అయ్యారు. గతం కంటే మన పరిస్థితి ఏమైనా మెరుగైందా? పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ మీరు సమైక్య ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారా, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? అన్న వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ బిల్లుపై సమగ్ర చర్చ జరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వెల్లడించాలని సూచించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అఫిడవిట్లు దాఖలు చేస్తున్నట్టు తెలుస్తోందని, మీరు కూడా వారిని అనుసరించాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలకు చె ప్పారు. -
సోమవారం నుంచే బిల్లుపై అసెంబ్లీలో చర్చ
హైదరాబాద్ : తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో సోమవారం నుంచే ప్రారంభం అవుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. బిల్లు ప్రతులను తెలుగులోకి అనువదించటం సమస్య కాదని ఆయన శనివారమిక్కడ అన్నారు. సోమవారమే బిల్లు ప్రతులను సభ్యులందరికీ ఇస్తామన్నారు. బిల్లును సభలో చర్చించి వీలైనంత త్వరగా రాష్ట్రపతికి పంపడమే తమ అజెండా అన్నారు. చంద్రబాబు నాయుడు బాధ్యత గల ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని గండ్ర సూచించారు. -
'చంద్రబాబు తప్పించుకోవడం ఖాయం'
హైదరాబాద్ : రెండు, మూడు రోజుల్లోనే తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చించి రాష్ట్రపతికి పంపాలని బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ తెలంగాణ బిల్లు విషయంలో స్పీకర్ చొరవ తీసుకోవాలని కోరారు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావటం లేదని విద్యాసాగర్ రావు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ విషయంలో చంద్రబాబు తప్పించుకోవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మృత్యర్థం ఆదివారం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు విద్యాసాగర్ రావు తెలిపారు. పీపుల్స్ ప్లాజా నుంచి 'రన్ ఫర్ యూనిటీ' ప్రారంభం అవుతుందన్నారు.