హైదరాబాద్ : 2013-14 ఆర్థిక సంవత్సరానికి లక్ష 83.129 వేల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం 67,800 కోట్లు, ప్రణాళికేతర వ్యయం 1,15,500 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ నిధుల అంచనా 474 కోట్లు... ద్రవ్యలోటు అంచనా 25వేల 402కోట్లుగా ప్రతిపాదించారు. 2013-14లో సవరించిన బడ్జెట్ అంచనాలో రెవెన్యూ మిగులు 1023కోట్లుగా తెలిపారు. రాష్ట్రంలో పేదరికం తగ్గుముఖం పట్టిందని... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20వేలకు పైగా ఉద్యోగాలు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
ఈ రోజు ఉదయం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. సభ్యులు బడ్జెట్‌ను అధ్యయనం చేసేందుకు వీలుగా మంగళవారం శాసనసభకు సెలవు ప్రకటించారు. బుధవారం చర్చ అనంతరం గురువారం బడ్జెట్‌కు ఆమోదం లభించనుంది.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక ప్రణాళిక కింద 59,496 కోట్లు పొందుపరిచారు. దీనికి 66 కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి వచ్చే 8,304 కోట్లు కలపడంతో వార్షిక ప్రణాళిక వ్యయం 67,800 కోట్లకు చేరనుంది. మధ్యంతర భృతి, పెరిగే డీఏలను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికేతర వ్యయాన్ని 1,15,500 కోట్లుగా ప్రతిపాదించారు. ఎన్నికల కోసం బడ్జెట్‌లో 390 కోట్లు కేటాయిస్తున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే కావడంతో వ్యవసాయ బడ్జెట్, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బడ్జెట్‌లను పెట్టడం లేదు.