సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి గురువారం తొలిసారిగా సమావేశమైంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఈ భేటీలో కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సప్లిమెంటరీ డిమాండ్స్‌ను కూడా ఆమోదించింది. జీఎస్టీ చట్టానికి అనుగుణంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్ భేటీకి మంత్రులు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీలో సీఎం కేసీఆర్, శాసనమండలిలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా 10మంది మంత్రులు మంగళవారం ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీంతోసీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీతో కలుపుకొని కేబినెట్ సభ్యుల సంఖ్య 12కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment