Telangana cabinet
-
బీసీలకు 42% కోటా
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. స్థానిక సంస్థల్లో, విద్యారంగంలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే మరో ముసాయిదా బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశానంతరం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరాలు విలేకరులకు వెల్లడించారు. చిక్కులు తలెత్తకుండా ఎస్సీ వర్గీకరణ బిల్లు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీల వర్గీకరణ చేపట్టడానికి ఏర్పాటు చేసిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ గత నెల 3న సమర్పించిన తొలి విడత సిఫారసులపై వివిధ వర్గాల నుంచి 71 విజ్ఞప్తులు వచ్చాయని పొంగులేటి తెలిపారు. ఈ విజ్ఞప్తులను పరిష్కరించిన అనంతరం తాజాగా కమిషన్ సమర్పించిన నివేదికను బిల్లు రూపంలో శాసనసభలో ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా బిల్లును రూపొందించామన్నారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు కొత్త బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. 37 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు 2017లో సభలో ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు పొన్నం ప్రభాకర్ వివరించారు. ఇక 3 సెక్టార్లుగా రాష్ట్రం! ‘రాష్ట్రాన్ని మూడు సెక్టార్లుగా విభజించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపలి ప్రాంతాన్ని కోర్ అర్బన్ ఏరియాగా, అక్కడి నుంచి ట్రిపుల్ ఆర్ రోడ్డుకు ఆవల 2 కి.మీల బఫర్ జోన్ వరకు ఫ్యూచర్ సిటీగా, మిగిలిన ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా విభజించాలని నిర్ణయించాం. రూరల్ తెలంగాణ పరిధిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు రావు. 7 మండలాల్లోని 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియా (ఎఫ్‌సీడీఏ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. నాగార్జునసాగర్, శ్రీశైలం హైవేల మధ్య ఉన్న 30 కి.మీల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నాం. హెచ్ఎండీఏ పరిధిలోని 36 గ్రామాలను ఎఫ్‌సీడీఏకి బదిలీ చేశాం. ఫ్యూచర్ సిటీ కోసం 90 పోస్టులను ఆమోదించాం. హెచ్ఎండీఏ పరిధి విస్తరణ హెచ్ఎండీఏ పరిధిని రీజినల్ రింగ్ రోడ్డుకు 2 కి.మీల బఫర్ జోన్ వరకు పొడిగించాం. 11 జిల్లాల్లోని 104 మండలాలు, 1,355 గ్రామాలకు హెచ్ఎండీఏ పరిధి విస్తరించింది. కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి..’ అని పొంగులేటి తెలిపారు. సెర్ప్, మెప్మా విలీనం ‘కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద రూపొందించిన పాలసీ–2025ని కేబినెట్ ఆమోదించింది. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళల ఆర్థికాభివృద్ధికి అందించిన సహకారాన్ని మళ్లీ కొత్త పాలసీతో పునరుద్ధరిస్తాం. మహిళా స్వయం సహాయక సంఘాలు ఒకే గొడుగు కింద ఉండాలనే ఉద్దేశంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లను ఒకే సంస్థగా విలీనం చేయాలని నిర్ణయించాం. ఇందిరా మహిళా శక్తి సంఘాల మహిళల రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 65 ఏళ్లకు పొడిగించడంతో పాటు సభ్యులుగా చేరేందుకు కనీస వయస్సును 18 నుంచి 15 ఏళ్లకు కుదించాం..’ అని మంత్రి చెప్పారు. 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ‘తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987ను సవరించాలని నిర్ణయించాం. తెలంగాణ పర్యాటక పాలసీ–2025ని మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27 ప్రత్యేక పర్యాటక కేంద్రాల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నాం. పర్యాటక విధానంతో వచ్చే 5 ఏళ్లలో రూ.15వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా నిర్ణయాలు తీసుకున్నాం..’ అని పొంగులేటి తెలిపారు. మేలో హైదరాబాద్‌లో మిస్‌వరల్డ్ పోటీలు.. ‘మేలో జరగనున్న మిస్ వరల్డ్– 2025 పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. 140 దేశాల నుంచి హాజరుకానున్న అతిథులకు ఎక్కడా లోటు జరకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాం..’ అని చెప్పారు. ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి 5.15 ఎకరాలు రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలన అధికారుల(జీపీఓ)ను నియమించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు వీఆర్ఓ, వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసింది. తాజాగా మళ్లీ వారిలో యోగ్యులను జీపీఓలుగా తీసుకోవాలని నిర్ణయించినట్టు పొంగులేటి వెల్లడించారు. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలో కేంద్రం ఆధ్వర్యంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి 5.15 ఎకరాల కేటాయింపునకు మంత్రివర్గం అనుమతినిచ్చింది. పారా ఒలంపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన దీప్తి జీవాంజీకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 361 పోస్టులను మంత్రివర్గం మంజూరుచేసింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ పరిధిలో 330 రెగ్యులర్, 165 అవుట్ సోర్సింగ్ పోస్టులు కలిపి మొత్తం 495 పోస్టులను ఆమోదించింది. దక్షిణాదికి అన్యాయంపై త్వరలో అఖిలపక్ష భేటీ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయోజనం కల్పించడానికి కేంద్రం దురుద్దేశంతో వ్యవహరిస్తోందనే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్టు పొంగులేటి తెలిపారు. కేంద్రంతో కొట్లాడి ఉత్తరాది రాష్ట్రాలకు సమానంగా దక్షిణాది రాష్ట్రాలకు సీట్లను తెచ్చుకోవడానికి త్వరలో హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి ఆధ్వర్యంలో త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేలా పోరాడాలని నిర్ణయించామన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు లోపాయికారీ ఒప్పందం – అందుకే ‘పట్టభద్రుల’ అభ్యర్థి ఓటమి – మంత్రులతో సీఎం రేవంత్ సమీక్ష ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై రాష్ట్ర మంత్రులు సమీక్ష జరిపారు. గురువారం కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా మంత్రులతో సమావేశమయ్యారు. ఎన్నికలు జరిగిన తీరు, ఫలితాలు తదితర అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల తరహాలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ, బీఆర్ఎస్లు లోపాయికారీ ఒప్పందంతో వెళ్లినందునే కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిపాలయ్యాడనే అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. దీనితో పాటు ఎన్నికలు ఎదుర్కొన్న తీరులో ఎక్కడైనా లోపాలుంటే భవిష్యత్తులో సవరించుకోవాల్సి ఉంటుందని కొందరు సూచించినట్లు తెలిసింది. మరోవైపు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కూడా మంత్రులతో రేవంత్‌రెడ్డి చర్చించారు. 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలురాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 12 నుంచి 27 వరకు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 12న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. మరుసటి రోజు ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ 2025–26ను సభలో ప్రవేశపెట్టనుంది. -
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చ
-
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే!
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కేబినేట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం అఖిలపక్షం అధ్వర్యంలో ఢిల్లీలో నిరసనపై కేబినెట్ చర్చించనుంది. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక సరఫరా, కొత్త రేషన్ కార్డుల జారీ వేగవంతం అంశాలపై మంత్రి వర్గం చర్చించనుంది. మెప్మాను సెర్ప్‌లో విలీనం చేసే అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వేసవి కాలంలో తాగు నీటి ఇబ్బందులు రాకుండా చేపట్టవలసిన చర్యలపై కూడా కేబినెట్ చర్చించనుంది.కాగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసే విషయమై నిన్న(బుధవారం).. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కీలక భేటీ జరిగింది. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలపాటు సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో పాటించాల్సిన మార్గదర్శకాలపై చర్చించారు.మొత్తం నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఒకవేళ సీపీఐకి ఒక స్థానం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయిస్తే అప్పుడు నిర్ణయం తీసుకుందామనే కోణంలో చర్చించారు. ఏ సామాజికవర్గానికి, ఏ జిల్లాకు ఎలాంటి పదవులు ఇవ్వాలి.. ఎమ్మెల్సీలుగా ఎవరిని పరిగణనలోకి తీసుకోవాలన్న అంశంపై ఓ అభిప్రాయానికి వచ్చారు. అయితే, ఎమ్మెల్సీలతోపాటు ఇతర అన్ని పదవుల భర్తీపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకుగాను ఈనెల 7వ తేదీన ఢిల్లీకి రాష్ట్ర నాయకత్వం వెళ్లనున్నట్టు సమాచారం. -
తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు వెళ్లనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్సీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఇంకో ఒకరిద్దరు నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు(శుక్రవారం) ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీతో రాష్ట్ర నేతలు భేటీ కానున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణాల వారిగా ఆశావహుల జాబితాను ఇంఛార్జి మున్షీ.. సిద్ధం చేసింది.ప్రసుత్తం తెలంగాణ కేబినెట్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది మంత్రులు ఉండగా.. మరో ఆరుగురికి కేబినెట్లో చోటు లభించాల్సి ఉంది. కేబినెట్ విస్తరణపై గత కొంత కాలంగా తీవ్ర చర్చ నడుస్తోంది. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ముఖ్యమైన హోం, విద్యా శాఖలు సీఎం రేవంత్ వద్దే ఉన్న సంగతి తెలిసిందే. మంత్రి పదవుల కోసం చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు.కాగా, సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ భేటీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. -
రైతు భరోసా వారికి మాత్రమేనా?
-
కేటీఆర్ ‘ఈ-కార్ రేస్’ కేసు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సోమవారం(డిసెంబర్ 16) అసెంబ్లీ కమిటీహాల్లో కేబినెట్ భేటీ జరిగింది. సుదీర్ఘంగా రాత్రి 8.30 గంటల వరకు జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు.కేబినెట్ సమావేశంలో కేటీఆర్ ఈ-కార్ రేసుపై సమగ్రంగా చర్చించామని చెప్పారు. ఈ కార్ రేసులో నిధుల అవకతవకలపై దర్యాప్తునకు గవర్నర్ న్యాయనిపుణులను సంప్రదించి అనుమతించారని పొంగులేటి తెలిపారు. కేటీఆర్‌ను అరెస్టు చేస్తారో లేదో తనకు తెలియదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.ఈ-కార్ రేసులో వచ్చిన పెట్టుబడుల లెక్క కూడా ఏసీబీ తేలుస్తుందని చెప్పారు. ఈ విషయంలో అప్పటి మునిసిపల్ శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌పైనా విచారణ జరుగుతుందన్నారు. తాము కక్షపూరితంగా వ్యవహరించడం లేదన్నారు.కేబినెట్లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు..భూమి లేని వారికి డిసెంబర్ 28న రూ.6వేల నగదు పంపిణీసంక్రాంతి తర్వాత కొత్త రేషన్‌కార్డుల జారీ కేటీఆర్‌పై కేసు విషయంలో ఏసీబీకి సీఎస్ ద్వారా లేఖసంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డు లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయంరైతు కూలీలకు రెండు దఫాలుగా 12 వేలు ఆర్దిక సహాయం చేసేందుకు కేబినెట్ నిర్ణయం.స్పోర్ట్ పాలసీకి కేబినెట్ ఆమోదం..పంచాయతీ రాజ్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం -
‘హైడ్రా’కు ఫుల్ పవర్స్..కేబినెట్ కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం(సెప్టెంబర్20) సెక్రటేరియట్లో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించింది. హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్‌పై కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాలు ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని, హైడ్రా వాటిని నేలమట్టం చేస్తుందని ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైడ్రాకు కేబినెట్లో విస్తృత అధికారాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదీ చదవండి.. ఒక హైడ్రా.. ఆరు చట్టాలు -
20న తెలంగాణ కేబినెట్ భేటీ.. వీటిపైనే చర్చ!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 20న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేబినెట్ చర్చించనుంది.వరద నష్టం గురించి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వ్యవసాయ కమిషన్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆర్వోఆర్ చట్టం రద్దు చేయనున్నట్లు సమాచారం. పేదలందరికీ ఆరోగ్య బీమా, భూమాత పోర్టల్, కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలు, విద్యా కమిషన్, 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: మాజీ సీఎస్ సోమేష్‌కుమార్‌కు సీఐడీ నోటీసులు -
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. నిర్ణయాలివే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రిమండలి సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ 1లో జరిగిన ఈ కేబినెట్ భేటీ దాదాపు గంటన్నరపాటు సాగింది.కేబినెట్ నిర్ణయాలు..యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగురోడ్డు వరకూ విస్తరించే ముసాయిదా బిల్లుకు ఆమోదం..కొత్త రేషనుకార్డుల జారీకి కేబినెట్ ఆమోదం..హైదరాబాద్ అభివృద్ధికి విదేశీ ద్రవ్య సంస్థల నుంచి రుణాలను సమకూర్చుకునే అంశానికి కేబినెట్ నిర్ణయంక్రికెటర్ సిరాజ్, నిఖత్ జరిన్‌కు ఆర్థిక సాయం, గ్రూప్ 1 డీఎస్పీ పోస్టు కేటాయింపు..ధరణి పోర్టల్‌ను భూమాతగా మారుస్తూ కేబినెట్ నిర్ణయంరేపు జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్న ప్రభుత్వంనిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవడానికి కేబినెట్ ఆమోదంఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్‌కు మరోసారి రకమండ్ చేశాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిఇటీవల విది నిర్వాహాణలో చనిపోయిన ఉన్నతస్థాయి ఉధ్యోగుల పిల్లలకు ఉద్యోగాలు.గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం 437 కోట్లు కేటాయింపు.గోదావరి నీటిని మల్లన్న సాగర్‌కు అక్కడి నుంచి శామిర్ పేట్ చెరువు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు తరలించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. -
కేబినెట్ కీలక భేటీ.. చర్చంచబోయే అంశాలు ఇవే..
-
ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీపై చర్చ!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఆగస్టు 15లోగా రైతు పంట రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ప్రధానంగా ఇదే అంశంపై క్యాబినెట్లో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.రుణమాఫీకి సుమారు రూ.30వేల కోట్లు, రైతుభరోసాకు మరో రూ.7వేల కోట్లు అవసరమవడంతో.. నిధుల సేకరణ ఎలా అనే అంశంపైనా మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రుణమాఫీతోపాటు, అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పన, పంటల బీమాతో పాటు పలు అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. -
తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేబినెట్ సమావేశం నిర్వహణకు షరతులు విధించింది. అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సిన అంశాల ఎజెండాపైనే కేబినెట్ చర్చించాలని కేంద్ర ఎన్నికల సంఘం షరతు విధించింది. జూన్ 4వ తేదీ లోపు చేపట్టాల్సిన అత్య వసర అంశాలు ఆ తేదీ వరకు వేచి ఉండటానికి అవకాశం లేని అంశాలను మాత్రమే చేపట్టాలని ఈసీ స్పష్టం చేసింది.లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్య వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు అయిన అధికారులెవరూ క్యాబినెట్ సమావేశానికి హాజరు కాకూడదని ఎన్నికల సంఘం పేర్కొంది. -
ఈసీ నుంచి రాని అనుమతి.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. దీంతో సీఎంతో పాటు మంత్రులు సచివాలయం నుంచి వెనుదిరిగి వెళ్లారు.శనివారం మధ్యాహ్నం కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. అయితే ఒక వైపు లోక్‌సభ ఎన్నికల కోడ్, మరో వైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కేబినెట్ సమావేశానికి అనుమతించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఈసీని కోరింది. తెలంగాణ ప్రభుత్వ వినతిని సీఈవో వికాస్ రాజ్ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.ఈసీ నుంచి ఏ క్షణమైన అనుమతి వస్తుందని మంత్రులు అందరూ శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సచివాలయంలోనే వేచి ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని విభాగాల అధికారులు కేబినేట్ భేటీకి హాజరయ్యేందుకు ఆఫీసులకు చేరుకున్నారు. అయితే రాత్రి 7 గంటల వరకు ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాలేదు. ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇవాళ సాయంత్రం జరగాల్సిన కేబినెట్ భేటీ నిలిచిపోయింది. -
4న తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. బడ్జెట్ సమావేశాలపై కేబినెట్ చర్చించనుంది. 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు హామీలను అమలు చేసిన ప్రభుత్వం.. ఆదివారం జరగనున్న సమావేశంలో మరో రెండు గ్యారెంటీలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: జన్మలో కేసీఆర్ మళ్లీ సీఎం కాలేరు: సీఎం రేవంత్‌రెడ్డి -
TS: క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందా? విస్తరణ ఇప్పటికే ఆలస్యం అయిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా? మంత్రివర్గంలో కొత్తగా ఎవరికి పదవులు ఇవ్వాలో కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేసేసిందా? ఇంతకీ ఎవరెవరికి రేవంత్ క్యాబినెట్లో బెర్త్‌లు కన్ఫాం అయ్యాయి? పదవుల కోసం పైరవీలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి? అతి త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకునేలా, ఈ నెలాఖరులోగా క్యాబినెట్ విస్తరణ జరగబోతోంది. ఇప్పటికే సామాజిక సమీకరణాలపై కసరత్తు చేసిన కాంగ్రెస్ అదిష్టానం సీఎం రేవంత్‌రెడ్డితో మరోసారి చర్చించి నిర్ణయం తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత క్యాబినెట్ లో నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. విస్తరణలో ఆ నాలుగు జిల్లాలకు కచ్చితంగా చోటు కల్పించాల్సి ఉంటుంది. ప్రస్తుత క్యాబినెట్ లో రెడ్డి సామాజిక వర్గం నుంచి నలుగురు, బీసీ, ఎస్సీ సామాజికవర్గాల నుంచి ఇద్దరు చొప్పున, ఎస్టీ, కమ్మ, వెలమ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు క్యాబినెట్ విస్తరణలో ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్‌రావు బెర్త్ ఆశిస్తున్నారు. ఇప్పటికే మాల సామాజిక వర్గం నుంచి భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం, గడ్డం ప్రసాద్ కు స్పీకర్ పదవి వచ్చారు. అందువల్ల మాల కమ్యూనిటీకే చెందిన వివేక్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించడం పట్ల కాంగ్రెస్ నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వెలమ వర్గానికి చెందిన ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి ఆశిస్తున్నా.. ఆయనకు పోటీగా ఉమ్మడి నిజామాబాద్ నుంచి మదన్ మోహన్ రావు కూడా పోటీ పడుతున్నారు. అయితే ఇప్పటికే వెలమ సామాజిక వర్గం నుంచి జూపల్లి కృష్ణారావుకు మంత్రి వర్గంలో చోటు కల్పించడంతో ఈ ఇద్దరిలో ఒకరికైనా అవకాశం ఇస్తారో లేదో చూడాలి. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి రేసులో ఉండగా..ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే రేవంత్‌రెడ్డి క్యాబినెట్లో ఇప్పటికే సీఎంతో కలుపుకుని నలుగురు రెడ్డి వర్గం మంత్రులున్నారు. రెడ్డి వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇస్తారని భావిస్తున్నా..సుదర్శన్‌రెడ్డి.. మల్‌రెడ్డిలో ఎవరికి ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత క్యాబినెట్లో బీసీ సామాజికవర్గాల్లో మున్నూరు కాపు, గౌడ్లకు ప్రాతినిధ్యం కల్పించారు. అందువల్ల ఇతర బీసీ వర్గాల్లో ప్రాబల్యం ఉన్న మరో కులానికి చెందిన నేతకు విస్తరణలో మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆరుగురు బీసీ ఎమ్మెల్యేల్లో ఇద్దరు మంత్రులు, ఇద్దరు విప్‌లుగా పదవులు పొందారు. మరో ఇద్దరు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్.. రజకవర్గానికి చెందిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ల్లో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఆదివాసీల నుంచి సీతక్కకు ఇప్పటికే మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. విస్తరణలో ఎస్టీ లంబాడ నుంచి ఒకరికి అవకాశం దక్కబోతోంది. అందులో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కు ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఒక మైనారిటీకి కచ్చితంగా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. కానీ ప్రస్తుతం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గాని ఎమ్మెల్సీగా గాని ఒక్క మైనారిటీ నేత కూడా లేరు. దీంతో పలువురు మైనారిటీ నేతల పేర్లను కాంగ్రెస్ అదిష్టానం పరిశీలిస్తోంది. దీనికి తోడు గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు లేరు. ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరినైనా ఆకర్షించి మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక మాదిగ సామాజిక వర్గ నేతలు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మాదిగ వర్గం నేతకు పదవి ఇవ్వడం ద్వారా ఎస్సీ వర్గీకరణతో మాదిగ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీని కౌంటర్ చేయొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా తన క్యాబినెట్లో సామాజిక న్యాయం పాటించేలా క్యాబినెట్ విస్తరణ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ఆలోచన ఎంత మేరకు అమలవుతుందో చూడాలి. ఇదీచదవండి.. పార్లమెంట్ సన్నాహాలతో బీఆర్ఎస్ శ్రేణుల చైతన్యం -
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు ఇవే
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీలపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఆరు గ్యారంటీలను అమలు ప్రక్రియలో భాగంగా అన్ని అంశాలపై చర్చించామని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో మార్పు చూపిస్తాం. రేపు 2 గ్యారంటీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం చర్చిస్తారు. 2014 నుంచి 2023 వరకు ప్రభుత్వ శాఖల ఖర్చుపై చర్చించాం. అన్ని శాఖల ఆదాయ వ్యయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయించాం. ఈ నెల 9న రెండు గ్యారెంటీలు అమల్లోకి తెస్తాం’’ అని మంత్రి వెల్లడించారు. ►మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఎల్లుండి నుంచి అమలు ►ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంపు ►ఎల్లుండి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ►రైతులకు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ -
తెలంగాణలో రేపు కొలువుదీరనున్న కొత్త సర్కార్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో రేపు(గురువారం) కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మధ్యాహ్నం 1.04 నిమిషాలకు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో సామాజిక న్యాయం పాటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాష్ట్ర కేబినెట్‌తో పాటు ఇతర కీలక పదవుల్లో ఆయా వర్గాలకు ప్రాధాన్యం కల్పించే దిశలో కసరత్తు చేస్తోంది. మరోవైపు, మంత్రి పదవి ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టారు. తెలంగాణ మంత్రి వర్గంలో చోటు కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, ప్రేమ్ సాగర్‌రావుతో పాటు పలువురు అధిష్టానం పెద్దలను కలిశారు. డీకే శివకుమార్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. మంత్రి పదవుల్లో స్థానం కల్పించాలని కోరినట్లు సమాచారం. అధిష్టానంపైనే సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. మంత్రి వర్గ కూర్పుపై ఢిల్లీలో అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. వరుసగా ఏఐసీసీ నేతలతో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్‌తో ప్రమాణం చేసేది ఆరుగురేనని సమాచారం. ఒక డిప్యూటీ సీఎం, ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. స్పీకర్ ఎవరనేది తేలాక.. మరోసారి మంత్రి వర్గ విస్తరణ జరగనున్నట్లు తెలిసింది. తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు ? 1. సీఎం - రేవంత్ రెడ్డి 2. డిప్యూటీ సీఎం - భట్టి విక్రమార్క 3. దామోదర రాజనర్సింహ ( మాదిగ) 4.గడ్డం వివేక్ ( మాల) 5. సీతక్క( ఎస్టీ) 6. పొన్నం ప్రభాకర్(గౌడ్) 7. కొండా సురేఖ ( మున్నూరు కాపు) 8. ఉత్తం కుమార్ రెడ్డి 9. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 10. కోమటి రెడ్డి వెంకట రెడ్డి 11. మల్ రెడ్డి రంగారెడ్డి 12. తుమ్మల నాగేశ్వర రావు ( ఖమ్మం) 13. దుద్దిల్ల శ్రీధర్ బాబు( బ్రాహ్మణ) 14. షబ్బీర్ ఆలీ 15. జూపల్లి కృష్ణారావు 16. శ్రీహరి ముదిరాజ్ 17. వీర్లపల్లి శంకర్ (ఎంబిసి) స్పీకర్ : రేవూరి ప్రకాశ్ రెడ్డి / శ్రీధర్ బాబు చదవండి: మాటిచ్చిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు సీఎంగా.. -
సామాజిక కోణంలో కేబినెట్ కూర్పు
సాక్షి, హైదరాబాద్: కొత్త ప్రభుత్వ ఏర్పాటులో సామాజిక న్యాయం పాటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాష్ట్ర కేబినెట్‌తో పాటు ఇతర కీలక పదవుల్లో ఆయా వర్గాలకు ప్రాధాన్యం కల్పించే దిశలో కసరత్తు చేస్తోంది. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఈ ప్రక్రియ బుధవారం కూడా కొనసాగనుంది. కొత్త సీఎల్పీ నాయకుడిగా ఎంపికైన రేవంత్‌రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, హైకమాండ్ పెద్దలు కేసీ వేణుగోపాల్, డి.కె.శివకుమార్, మాణిక్‌రావ్ ఠాక్రేల సమక్షంలో చర్చించిన తర్వాత రాహుల్, ఖర్గేలతో మాట్లాడి వారి అనుమతి మేరకు కీలక పదవులపై నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా కేబినెట్లో ఎంతమందిని తీసుకోవాలి? ఎవరెవరిని తీసుకోవాలి? ఏయే సామాజిక వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యమివ్వాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకుని గురువారం ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులందరి చేత ప్రమాణం చేయించనున్నారు. డిప్యూటీ సీఎంలు ఒకరా... ఇద్దరా? రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్‌రెడ్డిని సీఎంగా నిర్ణయించిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పదవిపై అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఒకరిని నియమించాలా లేదా ఇద్దరికి అవకాశమివ్వాలా అన్న దానిపై టీపీసీసీ ముఖ్యులతో సమాలోచనలు జరుపుతోంది. ప్రస్తుతమున్న సమాచారం మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పేరు ఇప్పటికే ఖరారైనట్టు తెలుస్తోంది. దళిత సామాజిక వర్గానికి చెందిన భట్టి గతంలో పలు పదవులు నిర్వహించారు. ప్రస్తుతం సీఎల్పీ నేతగా ఉన్న ఆయనకు తగిన గౌరవం ఇవ్వాల్సిన దృష్ట్యా కేబినెట్లో కీలక శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్టు సమాచారం. అయితే ఉప ముఖ్యమంత్రి హోదాను భట్టికి మాత్రమే పరిమితం చేస్తారని, అలాగే భట్టితో పాటు మరొకరికి కూడా ఇస్తారనే రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై బుధవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏ సామాజిక వర్గం నుంచి ఎంతమంది? కొత్త మంత్రివర్గాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న దానిపై అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏ సామాజిక వర్గం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారనే అంశంతో పాటు ఏ సామాజిక వర్గానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలన్న కోణంలో కసరత్తు చేస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 25 మంది ఎంపిక కాగా.. సీఎంతో పాటు నాలుగు లేదా ఐదు బెర్తులు వారికి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్లగొండ), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (ఖమ్మం), సుదర్శన్‌రెడ్డి (నిజామాబాద్)లకు మంత్రివర్గంలో స్థానం ఖరారైనట్టేనని తెలుస్తోంది. టి.రామ్మోహన్‌రెడ్డి (రంగారెడ్డి), దొంతి మాధవరెడ్డి (వరంగల్)ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకటి లేదా రెండు విప్ పదవులు కూడా ఈ సామాజిక వర్గానికి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విప్‌లుగా ఉన్నత విద్యావంతులైన మహిళలు పరణికారెడ్డి, యశస్వినిరెడ్డిల్లో ఒకరికి అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. వీరితో పాటు మల్రెడ్డి రంగారెడ్డి (రంగారెడ్డి), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (నల్లగొండ)లకు కూడా ప్రభుత్వంలో ప్రాధాన్య పదవులు లభించే అవకాశాలున్నాయి. ఇక వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రేంసాగర్‌రావు, జూపల్లి కృష్ణారావులలో ఒకరికి లేదంటే ఇద్దరికీ మంత్రిగా అవకాశం దక్కనుంది. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు మరోమారు కేబినెట్ మంత్రి బాధ్యత అప్పగించడం ఖాయమేనని, ఆయనకు విద్య లేదా ఐటీ శాఖ అప్పగించవచ్చనే చర్చ జరుగుతోంది. బీసీలలో వీరికే.. తాజా ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్)కు కేబినెట్ బెర్తు ఖరారయిందనే చర్చ జరుగుతోంది. ఈయనతో పాటు మహిళా కోటాలో కొండా సురేఖ (వరంగల్ ఈస్ట్) పేరు ప్రకటన కూడా లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. ఈ ఇద్దరితో పాటు మరొకరికి అవకాశం ఇవ్వొచ్చనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన ఆది శ్రీనివాస్ (మున్నూరు కాపు), వాకిటి శ్రీహరి (ముదిరాజ్), బీర్ల అయిలయ్య (యాదవ్)లలో ఒకరికి చాన్స్ దొరకొచ్చని అంటున్నారు. ఎస్సీ కోటాలో రాజనర్సింహ ఖరారు దళిత ఎమ్మెల్యేలకు కూడా కొత్త కేబినెట్లో తగిన ప్రాధాన్యం ఇచ్చేలా అధిష్టానం కసరత్తు సాగుతోంది. మాల సామాజిక వర్గానికి చెందిన భట్టిని ఉప ముఖ్యమంత్రిగా నియమించనున్న నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహ (ఆంథోల్)కు కీలక శాఖ అప్పగించవచ్చని తెలుస్తోంది. ఆయనతో మాదిగ వర్గానికే చెందిన మరొక నాయకుడికి కూడా అవకాశాలున్నాయని అంటున్నారు. మాల సామాజిక వర్గానికి చెందిన ఓయూ విద్యార్థి నాయకుడు మేడిపల్లి సత్యంకు విప్ పదవి వస్తుందని, ఆయనతో పాటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వేముల వీరేశం (నకిరేకల్)కు కూడా విప్ హోదా కల్పించే ప్రతిపాదనలున్నాయని సమాచారం. ఇక ఎస్టీ కోటాలో ధనసరి అనసూయ (సీతక్క)కు మంత్రి పదవి ఖాయమైనట్టే. ఆమెకు డిప్యూటీ సీఎం హోదా ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆదివాసీ వర్గాలకు చెందిన ఆమెతో పాటు లంబాడా సామాజిక వర్గం నుంచి ఎన్.బాలూనాయక్ (దేవరకొండ), రామచంద్రనాయక్ (డోర్నకల్)ల పేర్లు వినిపిస్తున్నాయి. ఖాళీగా కొన్ని బెర్తులు? పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకున్న నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారిలో ముఖ్యమంత్రిని, మంత్రులుగా మరో 17 మందిని నియమించే అవకాశం ఉండడంతో ఆ మేరకు ఒకేసారి భర్తీ చేస్తారా.. రెండు నుంచి నాలుగు బెర్తులను ఖాళీగా ఉంచి తొలిసారి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ప్రాంతాల వారీ ప్రాధాన్యతల దృష్ట్యా హైదరాబాద్ లాంటి జిల్లాలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలంటే ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాల్సి ఉన్న నేపథ్యంలో అని బెర్తులనూ నింపకపోవచ్చని తెలుస్తోంది. ఇలా మంత్రివర్గంలో స్థానంపై ఆశలు పెట్టుకున్న అనేకమంది.. ఏఐసీసీ పెద్దలు, తమకు సన్నిహితులై ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలతో లాబీయింగ్ చేస్తుండటం గమనార్హం. -
ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
మంత్రివర్గంలోకి ‘పట్నం’.. రేపు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ టికెట్ కేటాయింపులో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ సయోధ్య కుదిర్చారు. తాండూరు టికెట్‌పై రాజీఫార్ములాలో భాగంగా శాసనమండలి సభ్యుడిగాఉన్న పట్నం మహేందర్‌రెడ్డి ఈ నెల 23న బుధవారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉదయం 11.30కు రాజ్‌భవన్‌లో పట్నం రాష్ట్ర మంత్రివర్గంలో చేరతారు. 2014 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరిన మహేందర్‌రెడ్డి తాండూరు నుంచి గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరారు. రోహిత్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరిన నాటి నుంచి ఇద్దరు నేతల నడుమ విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకుని పలుమార్లు బహిరంగంగా విమర్శలకు పూనుకున్నారు. చదవండి: పార్టీ ధిక్కారానికి పాల్పడితే వేటే.. 2023లో తాండూరు అసెంబ్లీ టికెట్ కోసం ఇద్దరు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్న నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్యవర్తిత్వం వహించారు. రోహిత్ రెడ్డికి టికెట్ ఇస్తే సహకరించాలని మహేందర్‌రెడ్డిని కోరడంతో పాటు ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న బెర్త్‌లో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మండలి నుంచి కేబినెట్లోకి తీసుకుంటామని భరోసా ఇచ్చారు. 2021 మే నెలలో ఈటలను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేసిన నాటి నుంచి కేబినెట్ బెర్త్ ఖాళీగా ఉంది. ప్రస్తుతం కుదిరిన రాజీ ఫార్ములామేర కేబినెట్లో ఖాళీగాఉన్న బెర్త్‌లో పట్నం మంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. మహేందర్‌రెడ్డి సుమారు 3 నెలలపాటు మంత్రిగా అధికారిక హోదాలో పనిచేస్తారు. -
తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఉద్వాసన ఎవరికో?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. మొత్తం 119 స్థానాలకు గానూ ఒకే విడతలో 115 మందితో కూడిన తొలి విడత అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. వీరిలో తొమ్మిదిమంది సిట్టింగ్‌లకు హ్యండ్ ఇచ్చారు. మరో నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒకే విడతలో భారీ సంఖ్యలో అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. తాజాగా మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో తెలంగాణ కేబినెట్లో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. బుధవారం రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరణ జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత చాలా కాలంగా ఆయన స్థానం ఖాళీగా ఉంది. ఈ క్రమంలో ఈటల స్థానంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి కేబినెట్లో చోటుదక్కే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా కామారెడ్డి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో టికెట్ కోల్పోయిన స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే గంపా గోవర్దన్ ను కేబినెట్లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. చదవండి: 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తాం.. అక్టోబర్ 16న బీఆర్ఎస్ మేనిఫెస్టో మంత్రి వర్గంలో 18 మందికి ఛాన్స్ ఉంది. ఎన్నికల వేళ అసంతృప్తితో రగలిపోతున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకోనున్నారు. తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి రోహిత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేసీఆర్ ప్రకటించారు. అదే స్థానాన్ని కోరుకున్న మహేందర్ రెడ్డిని ఏదోవిధంగా సర్ధుబాటు చేయాలని భావించారు. బుధవారం కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గతంలో 2014 తెలంగాణ ప్రభుత్వ మొదటి క్యాబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా మహేందర్ రెడ్డి పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికై బీఆర్ఎస్ లో చేరిన సబితారెడ్డి.. కేసీఆర్ క్యాబినెట్ లో ఛాన్ప్ దక్కించుకోవడంతో… మహేందర్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒకదశలో పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల ముందు సడెన్ గా పట్నంకు కేసీఆర్ క్యాబినెట్ లో ఛాన్స్ ఇచ్చారు. ఇక గంపా గోవర్ధన్ పేరు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీంతో ఇద్దరిని తీసుకోవాలంటే ఎవరో ఒకరికి ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. ప్రస్తుతం కెసిఆర్ మంత్రి వర్గంలో ముగ్గురు (సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి) రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటే .. సమీకరణాలు మారుతాయి కాబట్టి ఓ రెడ్డి మంత్రిని తప్పించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు మూడు నెలలే ఉంది కాబట్టి ఒకరిని బుజ్జగించి మంత్రి పదవి నుంచి తప్పుకోమనే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కాబట్టి అదే జిల్లాకు చెందిన సబితాకు నచ్చజెపుతారా అన్నది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఎవరికి ఉధ్వాసన పలుకనున్నారు? లేదా కేవలం మహేందర్ రెడ్డి వరకే పరిమితం చేసి విస్తరణ చేస్తారా అనేది తెలియాల్సి ఉండాలి. కేబినెట్ విస్తరణపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పాండిచ్చేరి నుంచి ఈ రాత్రికి గవర్నర్ హైదరాబాద్ రానున్నారు. -
తెలంగాణ ఆర్టీసీ ఇక ప్రభుత్వంలో విలీనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)ను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ మంత్రి మండలి నిర్ణయించింది. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో ఐదుగంటలకు పైగా జరిగిన సమావేశం అనంతరం.. కేబినెట్ భేటీ సారాంశాన్ని మీడియాకు వివరించారు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. ఇక నుంచి 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని, ఈ మేరకు కేబినెట్ భేటీలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విలీనం, విధివిధానాలు నిర్ణయించేందుకు ఒక కమిటీని(సబ్ కమిటీ) ఏర్పాటు చేయనున్నట్లు, త్వరలోనే అసెంబ్లీలో బిల్లు తేనున్నట్లు తెలిపారాయన. ► హైదరాబాద్‌లో మెట్రో రైలును విస్తరిస్తాం. రూ. 60వేల కోట్లతో విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. Lb నగర్ పెద్ద అంబర్ పేట వరకు, ఉప్పల్ నుంచి బీ బీ నగర్ వరకు, ఉప్పల్ నుంచి ECIL దాకామెట్రో నిర్మాణం చేపడుతున్నాం. మూడు-నాలుగేళ్లలో మెట్రో విస్తరణ పూర్తవుతుంది. ప్యాట్నీ నుంచి కండ్లకోయ ORR వరకు, అలాగే.. జేబీఎస్ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ మెట్రో రహదారి.. ఆపైనే మెట్రో నిర్మాణం ఏర్పాటు చేస్తాం. ► పది జిల్లాల్లో వరద నష్టం తీవ్రంగా ఉంది. వరదలు వచ్చినప్పుడు కేంద్రం ఏనాడూ ఆదుకోలేదు. నష్టపోయిన రైతులను తెలంగాణ ప్రభుత్వమే ఆదుకుంటోంది. ► ప్రజాభిప్రాయాన్ని అపహాస్యం చేసేలా గవర్నర్ వ్యవస్థ ఉంది. చట్టపరంగా ఆమోదించిన బిల్లులను గవర్నర్ వెనక్కి పంపారు. తిరిగి పంపిన మూడు బిల్లులను అసెంబ్లీలో మరోసారి పాస్ చేస్తం. రెండోసారి పాస్ చేశాక.. గవర్నర్ ఆమోదించాల్సిందే. ► గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను కేబినెట్ ఎంపిక చేసింది. ఎస్టీ కేటగిరి కుర్రా సత్యనారాయణ, బీసీ కేటగిరీలో దాసోజు శ్రవణ్‌ను ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తున్నాం. ఎమ్మెల్సీల ఎంపికలో గవర్నర్‌కు ఎలాంటి అభ్యంతరం ఉండదని అనుకుంటున్నాం. ► నిమ్స్‌లో కొత్తగా 2వేల పడకల ఏర్పాటుకు నిర్ణయం. ► వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు 253 ఎకరాలు కేటాయింపు. ► బీడీ టేకేదార్లకు పెన్షన్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ► తెలంగాణలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీల ఏర్పాటు ► సౌత్ ఇండియా కాపు సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయం. ► అనాథ పిల్లల కోసం కొత్త పాలసీ తీసుకొస్తున్నాం ► హకింపేట్ ఎయిర్‌పోర్ట్‌ను పూణే తరహాలో పౌరవిమానయాన సేవలకు వినియోగించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖకు ప్రతిపాదన పంపుతున్నాం. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాబోయే కేంద్రం లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది అందులో బీఆర్ఎస్ కీలకంగా వ్యవహరిస్తుంది. -
ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గం భేటీ ముగిసింది. ఐదు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలతో పాటు వరదల వల్ల జరిగిన జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ.. యుద్ధప్రాతిపదికన రోడ్లను పునరుద్ధిరించడానికి చేపట్టే అంశాలపై భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సభలో ప్రవేశపెట్టే పలు బిల్లుల గురించి కూడా కేబినెట్ చర్చించినట్లు సమాచారం. చదవండి: వరదల్లో బురద రాజకీయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల వివాదం -
బీఆర్ఎస్కు కోకాపేటలో 11 ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని కోకాపేట గ్రామంలో 11 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్ భేటీలో భూపరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించినట్టు తెలిసింది. ఈ భూమిలో ప్రజా నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలకు శిక్షణ ఇచ్చేందుకు ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్’ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పేరిట చేసిన ప్రతిపాదన సముచితమేనని భూపరిపాలన శాఖ (రెవెన్యూ) పెట్టిన నోట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ భూమిని హెచ్ఎండీఏ నుంచి స్వాధీనం చేసుకుని బీఆర్ఎస్కు కేటాయిస్తామని ఆ శాఖ పేర్కొంది. దీంతో సుమారు రూ.500 కోట్ల విలువైన భూమిని బీఆర్ఎస్ పేరిట బదలాయించడం లాంఛనమే కానుంది. అయితే, కేబినెట్ నిర్ణయాల ను వెల్లడించేందుకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ అంశాన్ని గోప్యంగా ఉంచడం, తమకు భూమిని కేటాయించాలని బీఆర్ఎస్ ప్రతిపాదించిన వారంరోజుల్లోనే రెవెన్యూశాఖ అంగీకారం తెలిపి మంత్రివర్గ సమావేశం ముందు నోట్ పెట్టడం, కేబినెట్ ఇందుకు ఆమోదం తెలిపిన విషయాన్ని రహస్యంగా ఉంచడం చర్చనీయాంశమవుతోంది. బీఆర్ఎస్ చేసిన ప్రతిపాదన ఇదే కేబినెట్ ముందు భూపరిపాలన శాఖ పెట్టిన నోట్ ప్రకారం ఈనెల 12న బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పేరిట భూకేటాయింపు కోసం ప్రతిపాదన వచ్చింది. ఈ భూమిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ను ఏర్పాటు చేసి నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలకు వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇస్తామని అందులో పేర్కొన్నారు. ఈ కేంద్రంలో కాన్ఫరెన్స్ హాళ్లు, లైబ్రరీ, శిక్షణ తీసుకునే వారికి వసతి, సెమినార్ రూమ్‌లు, విద్యావేత్తలకు పని ప్రదేశాలను ఏర్పాటు చేస్తామన్నారు. సామాజిక కార్యకర్తలు, ప్రజా నాయకుల అవసరాలను తీర్చేందుకు ఇదో ప్రతిష్టాత్మక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ఇందుకు కోకాపేటలోని 239, 240 సర్వే నంబర్లలో గల 11 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్టుగానే.. బీఆర్ఎస్ ప్రతిపాదనను పరిశీలించిన భూపరిపాలన శాఖ కేబినెట్ ముందు సవివరంగా నోట్ పెట్టింది. హైదరాబాద్ జిల్లా తిరుమలగిరి మండలంలోని బోయిన్పల్లి గ్రామంలో ఉన్న 502, 503, 502/పీ2 సర్వే నంబర్లలోని 10 ఎకరాల 15 గుంటల భూమిని ఎకరం రూ.2 లక్షల చొప్పున అప్పట్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ)కి కేటాయించినట్టు ఈ నోట్లో పేర్కొంది. జాతీయస్థాయిలో మానవ వనరుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసేందుకు ఈ భూమిని కేటాయించినట్టు తెలిపింది. దీనిపై హైకోర్టు ఉత్తర్వుల మేరకు గత ఏప్రిల్ 28న ఆ భూమిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి పునర్కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఏపీసీసీకి బోయిన్‌పల్లిలో భూమి ఇచ్చినట్టుగానే కోకాపేటలో బీఆర్ఎస్కు భూమి ఇవ్వడం సముచితమేనని భూపరిపాలన శాఖ ఆ నోట్లో స్పష్టం చేసింది. రూ.40 కోట్లకు...? ఈ భూమిని కేబినెట్ నిర్ణయించిన ధరకు బీఆర్ఎస్కు కేటాయిస్తామని భూపరిపాలన శాఖ నోట్లో పేర్కొంది. దీనిప్రకారం ఈ భూమి తమ పేరిట బదలాయించేందుకు బీఆర్ఎస్ పార్టీ మొత్తం రూ.40 కోట్లు చెల్లించేలా కేబినెట్ ఆమోదించినట్టు సమాచారం. దాదాపు రూ.500 కోట్ల విలువైన ఈ భూమిని రూ.40 కోట్లకు బీఆర్ఎస్కు బదలాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్న విషయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం గజానికి రూ.100 చొప్పున మాత్రమే తీసుకుని విలువైన భూములను బీఆర్ఎస్ పేరిట బదలాయించుకున్నారని, హైదరాబాద్ జిల్లా కార్యాలయం కోసం బంజారాహిల్స్‌లో 4,935 చదరపు గజాల భూమిని నామమాత్రపు ధరకు సొంతం చేసుకున్నారని, ఇది బీఆర్ఎస్ భూదాహానికి నిదర్శనమనే విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి. -
111 పూర్తిగా రద్దు.. వీఆర్ఏల క్రమబద్ధీకరణ.. కేబినెట్ కీలక నిర్ణయాలివే..
కేబినెట్ కీలక నిర్ణయాలివీ.. ► కాళేశ్వరం ప్రాజెక్టుతో మూసీ, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్,హుస్సేన్ సాగర్ల అనుసంధానం.. వీటికి గోదావరి జలాల తరలింపు ► వీఆర్ఏల క్రమబద్ధీకరణ.. వివిధ శాఖల్లో సర్దుబాటు.. పేస్కేల్ వర్తింపు ► రాష్ట్రంలో పంటల సాగు కాలాన్ని ఒక నెల ముందుకు జరిపేలా చర్యలు ► కొత్త జిల్లాలకు అనుగుణంగా జిల్లా వైద్యాధికారి పోస్టుల పెంపు.. 40 కొత్త మండలాలకు పీహెచ్‌సీలు.. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో శాశ్వత నియామకాలకు నిర్ణయం ► మైనారిటీ కమిషన్‌లో జైనులకూ ప్రాతినిధ్యం ► టీఎస్పీఎస్సీని బలోపేతం చేసేందుకు కొత్తగా 10 పోస్టులు మంజూరు ► వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల ద్వారా మక్కలు, జొన్నల కొనుగోళ్లు ► 10, 15 రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం ► అచ్చంపేటకు ఉమామహేశ్వర లిఫ్టు తొలి, రెండో దశ పథకాలు మంజూరు బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, మేదరి, కుమ్మరి తదితర కుల వృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని.. ఒక్కో లబ్ధిదారుకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయించినట్టు మంత్రి హరీశ్ ప్రకటించారు. దీని విధివిధానాల ఖరారుకు మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన మంత్రులు తలసాని, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డిలతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఆర్థిక సాయంలో సబ్సిడీ ఎంత? ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నదానిపై ఉప సంఘం నిర్ణయం తీసుకుంటుందన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్థిక సాయం పంపిణీ ప్రారంభిస్తామన్నారు. సాక్షి, హైదరాబాద్: ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు, పరీవాహక ప్రాంతం పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవోను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఎత్తివేసింది. కొన్నేళ్ల కిందటి దాకా హైదరాబాద్ నగర దాహర్తిని తీర్చిన ఈ జలాశయాల పరిరక్షణ కోసం.. వాటి ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో.. అన్నిరకాల నిర్మాణాలను నిషేధిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో ఈ జీవోను జారీ చేసిన విషయం తెలిసిందే. 111 జీవో కారణంగా ఆ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిందని, ప్రస్తుతం ఈ రిజర్వాయర్ల నీటి అవసరం పెద్దగా లేనందున.. జీవోను రద్దు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. దీని పరిధిలో ఉన్న 84 గ్రామాల్లో ఇకపై ఎలాంటి ఆంక్షలు ఉండవని.. ‘హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)’కు సంబంధించిన విధివిధానాలు, నిబంధనలే వర్తిస్తాయని ప్రకటించింది. గురువారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన నూతన సచివాలయంలో తొలిసారిగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం మంత్రులు గంగుల, తలసాని, వేముల, మల్లారెడ్డిలతో కలసి మంత్రి హరీశ్‌రావు కేబినెట్ భేటీ వివరాలను వెల్లడించారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ నీటి కోసం ఇబ్బంది లేదని.. హైదరాబాద్ చుట్టుపక్కల అంతా అభివృద్ధి జరుగుతుంటే తమ గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయని 111 జీవో పరిధిలోని 84 గ్రామాల ప్రజలు చాలా కాలం నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గతంలో వారికి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకే 111 జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. హైదరాబాద్ నగరానికి ఇప్పుడు గోదావరి, కృష్ణా, మంజీరా నదుల నుంచి సరిపడా నీళ్లు వస్తున్నాయని.. నీటికి ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణతోపాటు కాలుష్యం బారిపడకుండా.. వాటి చుట్టూ రింగ్ మెయిన్, ఎస్టీపీల నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని కేబినెట్ నిర్ణయించిందని వివరించారు. హైదరాబాద్ నుంచి శంకర్పల్లి, చేవెళ్ల రోడ్లను 150 అడుగుల నుంచి 200 అడుగులకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాళేశ్వరంతో జంట జలాశయాలు, మూసీ అనుసంధానం రాబోయే రోజుల్లో కొండపొచమ్మ సాగర్ నుంచి కాళేశ్వరం (గోదావరి) జలాలతో మూసీ, ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లను అనుసంధానించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని హరీశ్‌రావు తెలిపారు. కాళేశ్వరంతో అనుసంధానం చేసి మూసీని స్వచ్ఛమైన నదిగా మార్చాలని సూచించారన్నారు. మురికి కూపంగా మారిన హుస్సేన్‌సాగర్‌ను సైతం రాబోయే రోజుల్లో గోదావరి జలాలతో అనుసంధానం చేయడానికి అవసరమైన విధి విధానాలు, డిజైన్లను రూపొందించనున్నట్టు తెలిపారు. ఘనంగా దశాబ్ది ఉత్సవాలు రాష్ట్రం 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గత 9 ఏళ్లలో సాధించిన విజయాల ఫలాలను అందుకుంటున్న ప్రజలను భాగస్వాములను చేస్తూ 21 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించేందుకు వీలుగా విధివిధానాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు. వైద్యారోగ్య శాఖ పునర్వ్యస్థీకరణ కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖను పునర్వ్యస్థీకరించే దిశగా మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. 33 జిల్లాలకు జిల్లా వైద్యారోగ్య అధికారి (డీఎంఅండ్‌హెచ్‌ఓ) పోస్టులతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లకు ఆరు పోస్టులు కలిపి.. మొత్తంగా డీఎంఅండ్‌హెచ్‌ఓ పోస్టుల సంఖ్యను 38కి పెంచాలని నిర్ణయించింది. ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 40 మండలాలకు పీహెచ్‌సీలను మంజూరు చేసింది. రాష్ట్రంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగులే పనిచేస్తుండగా.. శాశ్వత నియామకాలు జరపాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాలతో రాష్ట్రంలో ప్రాథమిక వైద్య సేవలు బలోపేతం అవుతాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పంట కాలం.. నెల ముందుకు.. అకాల వర్షాలు, వడగళ్ల వానలతో ఈ ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో.. రాష్ట్రంలో పంట కాలాన్ని నెల రోజుల పాటు ముందుకు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అకాల వర్షాలు కురిసే ఏప్రిల్‌లో కాకుండా మార్చి నెలాఖరులోగానే రైతులు పంట కోతలు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయనుంది. వచ్చే వానాకాలం పంటలను ఒక నెల ముందుకు జరిపితే.. యాసంగి పంట కూడా నెల ముందుకు జరుగుతుందని, రైతులు నష్టపోకుండా కాపాడుకోవచ్చని మంత్రి హరీశ్ తెలిపారు. ఈ దిశగా వ్యవసాయ రంగంలో మార్పులు, రైతులను చైతన్యవంతం చేయడంపై వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో మంత్రులు గంగుల, ఎర్రబెల్లి, పువ్వాడ, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలతో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. కేబినెట్ ఇతర నిర్ణయాలివీ.. ► రాష్ట్రంలో ఎవరు, ఎక్కడ నకిలీ విత్తనాలు అమ్మినా పీడీ యాక్టు కింద అరెస్టు చేయాలని డీజీపీ, సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ► మక్కలు, జొన్నల ధర తగ్గి రైతులు నష్టపోతుండటంతో కొనుగోళ్లకు వ్యవసాయశాఖ, పౌరసరఫరాల శాఖలకు అనుమతి ఇచ్చింది. ► నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం మొదటి, రెండో విడత పనులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ► రెండో విడత గొర్రెల పంపిణీని 10, 15 రోజుల్లో ప్రారంభించాలని.. కేంద్రం నుంచి ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని కేబినెట్ నిర్ణయించింది. ► రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ► ఖమ్మంలో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఖమ్మం జర్నలిస్టు కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి 23 ఎకరాలను కేటాయించింది. వనపర్తిలో జర్నలిస్టు అసోసియేషన్ భవనానికి స్థలాన్ని కేటాయించింది. ► మైనారిటీ కమిషన్‌లో జైనులకు ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించింది. ► టీఎస్పీఎస్సీని బలోపేతం చేసేందుకు కొత్తగా 10 పోస్టులు మంజూరు చేసింది. ► వనపర్తి జిల్లా గణపురం మండలం కర్నె తండాకు పీహెచ్సీ, 8 పోస్టులు మంజూరు. ► నిర్మల్ జిల్లా ముధోల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు 27 పోస్టులను మంజూరు చేసింది. ► ఇటీవల గవర్నర్ తిరస్కరించిన బిల్లులను మళ్లీ ఆమోదించి పంపేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించాలని మంత్రివర్గం ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ► గవర్నర్ కోటాలో ఖాళీ అవుతున్న రెండు ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థుల ఖరారు కోసం త్వరలో మరోసారి కేబినెట్ భేటీ నిర్వహించాలని.. అలా సాధ్యం కాకుంటే సర్క్యులేషన్ విధానంలో ఆమోదించి గవర్నర్‌కు సిఫార్సు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. -
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సుమారు ఐదు గంటల పాటు భేటీ సాగింది. సమావేశం అనంతరం కేబినెట్ కీలక నిర్ణయాలను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు మీడియాకు వెల్లడించారు. దళిత బంధుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, లక్షా 30 వేల కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. గృహలక్ష్మి పథకం ద్వారా 4 లక్షల మంది పేదలకు ఇళ్లు ఇస్తాం.. నియోజకవర్గానికి 3వేల చొప్పున ఇళ్లు కేటాయిస్తామన్నారు. లబ్ధిదారుడికి రూ.3లక్షల గ్రాంట్ ఇస్తామని హరీష్‌రావు పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక వెంటనే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 4 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని హరీష్‌రావు పేర్కొన్నారు. కాగా, సమావేశంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాల్సిన ఇద్దరిని ఖరారు చేయడంతో పాటు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లులపైనా చర్చించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు జారీచేసిన అంశంపైనా భేటీలో చర్చించినట్లు సమాచారం. ఈడీ విచారణ సందర్భంగా ఒకవేళ కవితను అరెస్టుచేస్తే ఎలా స్పందించాలి, కేంద్రం రాష్ట్రంపై వ్యవహరిస్తున్న కక్షసాధింపు చర్యలపై మున్ముందు ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. చదవండి: ఇది నా ఒక్కరి సమస్య కాదు.. ఈడీని ధైర్యంగా ఎదుర్కొంటా: ఎమ్మెల్సీ కవిత -
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్‌కు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. ప్రగతి భవన్లో ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రేపు(జనవరి 6) శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తరువాత సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ పర్యటనకు వెళ్లనున్నారు. -
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు పలు రంగాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న అభివృద్ధికి అనుగుణంగా రోడ్లు భవనాల శాఖలో పని విస్తృతి పెరుగుతున్నదని, అందుకు అనుగుణంగా శాఖలోని పలు విభాగాలను పటిష్టం చేయాలని, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీసుకున్న పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రోడ్లు భవనాల శాఖలో అధికార వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన అదనపు ఉద్యోగ నియామకాలను చేపట్టాలని, అవసరమైన మేరకు నూతన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆదేశించింది. అందుకోసం అదనపు నిధులను కూడా మంజూరు చేసింది. ఇందులో భాగంగా రోడ్లు భవనాల శాఖ చేసిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతే కాకుండా అత్యవసర సమయాల్లో అధికారులు స్వీయ నిర్ణయంతో ప్రజావసరాలకు అనుగుణంగా పనులు చేపట్టేందుకు కేబినెట్ అవకాశమిచ్చింది. పోలీస్‌శాఖలో నియామకాలు రాష్ట్ర పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని మొత్తం 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. వీటితోపాటు.. మూడు కమిషనరేట్ల పరిధిలో.. శాంతిభద్రతలను మరింతగా మెరుగు పరిచేందుకు నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిల్లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గురుకులాల్లో పోస్టుల భర్తీ తెలంగాణ మంత్రివర్గం మహాత్మా జ్యోతి బాఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ గురుకులాల్లోని పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. మొత్తం 2,591 నూతన ఉద్యోగాల నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రారంభించిన 4 జూనియర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు, 33 రెసిడెన్షియల్ పాఠశాలలల్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ విభాగాల్లో, అవసరమైన మేరకు ఈ నూతన నియామకాలను చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది. వరాలు... రోడ్లు భవనాల శాఖలో పెరిగిన పనికి అనుగుణంగా శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బి శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది. ఇందులో.. కొత్తగా 3 చీఫ్ ఇంజనీర్ పోస్టులు, 12 సూపరిండెంట్ ఇంజనీర్ పోస్టులు, 13 ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, 102 డి.ఈ.ఈ పోస్టులు, 163 అసిస్టెంట్ ఈ.ఈ పోస్టులు, 28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులతో పాటు పలు టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది పోస్టులున్నాయి. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టాలని రోడ్లు భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది. దాంతో పాటు సత్వరమే పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. చదవండి: పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం పెరిగిన నూతన ఉద్యోగాలతో పాటు, ఆర్ అండ్ బీ శాఖలో పరిపాలన బాధ్యతల వికేంద్రీకరణకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల నిర్మాణం, మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బి శాఖ లోని.., రోడ్లు, భవనాలు, ఎలక్ట్రికల్, జాతీయ రహదారుల విభాగాల్లో... 3 చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలను., 10 సర్కిల్ కార్యాలయాలను., 13 డివిజన్ కార్యాలయాలను., 79 సబ్ డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి శాఖను కేబినెట్ ఆదేశించింది. రోడ్లు భవనాల శాఖను మరింత పటిష్ట పరిచేందుకు ప్రజావసరాల దృష్ట్యా పనులు చేపట్టేందుకు ఈ ఆర్థిక సంవత్సరానికి అదనంగా నిధులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా.. కాలానుగుణంగా చేపట్టే రోడ్ల మరమ్మతుల (పీరియాడిక్ రెన్యువల్స్) కోసం, కూ. 1865 కోట్లను మంజూరు చేసింది. వానలు, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా రోడ్లు తెగిపోవడం, కొట్టుకుపోవడం వంటి సందర్భాల్లో ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగు పరిచే దిశగా తక్షణమే పనులు చేపట్టేందుకు గాను.. రూ. 635 కోట్ల నిధులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. వానలు వరదలు తదితర ప్రకృతి విపత్తుల సందర్భంలో, ప్రజావసరాలకు అనుగుణంగా, అసౌకర్యాన్ని తొలగించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు.. వీలుగా కింది స్థాయి డీఈఈ నుంచిపై స్థాయి సీఈ వరకు స్వతంత్ర నిర్ణయాధికారానికి కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా.. విచక్షణతో కూడిన స్వీయ నిర్ణయాలను తీసుకుని పనులు చేపట్టేందుకు డిఈఈకి ఒక పనికి రూ. 2లక్షలు (సంవత్సరానికి 25 లక్షలు), ఈఈకి 25 లక్షల వరకు(ఏడాదికి 1.5 కోట్లు), ఎస్ఈ పరిధిలో 50 లక్షలు (సంవత్సరానికి 2 కోట్లు), సీఈ పరిధిలో రూ.1 కోటి వరకు(సంవత్సరానికి 3 కోట్ల వరకు) పనులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అత్యవసర సమయాల్లో ఈ పనులను అవసరమైతే నామినేషన్ పద్దతుల్లో చేపట్టేందుకు అధికారాలను కల్పించింది. ఇందు కోసం ఏడాదికి రూ.129 కోట్లు ఆర్అండ్బీ శాఖ ఖర్చు చేసేందుకు కేబినెట్ అవకాశం కల్పించింది. ఇదే పద్దతిని అనుసరిస్తూ.. భవనాల విభాగంలో కూడా అత్యవసర సమయాల్లో రిపేర్లు తదితర ప్రజావసరాల కోసం ఖర్చు చేసేందుకు అవకాశం కల్పించింది. అత్యవసర పనులు చేపట్టేందుకు పరిమిత నిధులతో స్వీయ నిర్ణయాధికారాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు తగ్గట్టుగా నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. -
పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని మొత్తం 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. వీటితోపాటు.. మూడు కమిషనరేట్ల పరిధిలో.. శాంతిభద్రతలను మరింతగా మెరుగు పరిచేందుకు నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిల్లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అదే విధంగా శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని కేబినెట్ నిర్ణయించింది పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితులలో, నేరాల తీరు కూడా మారుతున్న నేపథ్యంలో నేరాల అదుపునకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలనీ, అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్‌ను దెబ్బతీస్తూ శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తున్నాయని కేబినెట్ చర్చించింది. డ్రగ్స్ నేరాలను అరికట్టి నిర్మూలించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కేటీఆర్ వరాల జల్లు -
17 జాతీయ సమైక్యతా దినం
-
తెలంగాణ కేబినెట్ భేటి ప్రారంభం
-
తెలంగాణ కేబినెట్ సమావేశం.. ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం
హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ భేటీలో ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మే 20 నుంచి జూన 5వరకూ పల్లె, పట్టణ ప్రగతి చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. ధాన్యం కొనుగోలుపై 24 గంటల్లో స్పందించాలని ఢిల్లీలో దీక్ష సందర్భంగా కేంద్రానికి గడువు విధించిన కేసీఆర్.. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. -
అదుపులోనే కరోనా.. మూడో వేవ్ వస్తే సర్వం సిద్ధం: తెలంగాణ కేబినెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం గురువారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖపై చర్చిస్తున్నారు. మొదట కొవిడ్ పరిస్థితిపై చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్రాల్లో కరోనా స్థితిగతులు, కట్టడి చర్యలపై వైద్యాధికారులు మంత్రివర్గానికి వివరించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో పరిస్థితులు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అవకాశం: తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ రాష్ట్రంలో విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతరం కరోనా కేసుల్లో పెరుగుదల లేదని, మహమ్మారి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. అన్నిరకాల మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వాక్సినేషన్ అందుబాటులో ఉంన్నాయని చెప్పారు. ఇప్పటివరకు రెండు కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నేటి నుంచి ప్రారంభమైందని, ప్రతి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా కలిసి వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని మంత్రివర్గం తెలిపింది. ఇందులో భాగంగా రోజుకు 3 లక్షల టీకాలు వేసేలా పూర్తి సన్నద్దతతో ఉండాలని మంత్రివర్గం నిర్దేశించింది. అవకాశం: రైలు పట్టాలపై మొసలి.. ఆగిపోయిన రైళ్లు కొత్త వైద్య కళాశాలలు వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్అండ్బీ, వైద్యారోగ్య శాఖను మంత్రివర్గం ఆదేశించింది. హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ ఏర్పాటుపై సమీక్షించారు. గతంలో 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉండేదని, దాన్ని ఇప్పటికే 280 మెట్రిక్ టన్నులకు పెంచుకున్నామని, మరింత పెంచి 550 గతంలో 130 మెట్రిక్ టన్నులకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని వైద్యశాఖాధికారులను మంత్రివర్గం ఆదేశించింది. రూ..133 కోట్లతో బెడ్స్, మందులు, ఇతర సామగ్రిని, చిన్నపిల్లల వైద్యం కోసం 5,200 బెడ్లు, ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు వివరించారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతుల పురోభివృధ్దికి సమగ్రమైన ప్రణాళికలను సిద్దం చేసుకుని తదుపరి మంత్రివర్గ సమావేశానికి తీసుకురావాలని వైద్య శాఖాధికారులను ఆదేశించింది. మంత్రివర్గ నిర్ణయాలు గతంలో ఇచ్చిన హామీ మేరకు వచ్చే యేడాది నుంచి మద్యం దుకాణాల్లో.. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని కేబినెట్ నిర్ణయం రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడయిన రోడ్ల మరమ్మతుకు ఇప్పటికే కేటాయించిన రూ.300 కోట్లకు అదనంగా మరో రూ.100 కోట్లు కేటాయించింది. ఈ మేరకు పంచాయితీ రాజ్ శాఖకు ఆదేశాలు జారీ. రాజాబహద్దూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి కోరిక మేరకు, నారాయణగూడలో 1,261 గజాల స్థలాన్ని, బాలికల వసతి గృహ నిర్మాణం కోసం కేటాయింపు. -
తెలంగాణలో రూ.50 వేల వరకు రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీ మేరకు ఇప్పటివరకు రూ.25 వేల లోపు పంట రుణాలను మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి నెలాఖరులోగా రూ.50 వేల వరకున్న పంట రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం ఆదేశించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ అందించిన వివరాల ప్రకారం 6 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. రూ.25 వేల వరకున్న రుణాల మాఫీతో ఇప్పటికే 3 లక్షల పై చిలుకు రైతులు ప్రయోజనం పొందగా, తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ సంఖ్య 9 లక్షలకు పెరగనుంది. మిగతా రుణమాఫీ ప్రక్రియ కూడా దశలవారీగా కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం గల అగ్ర కుల పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింప జేయాలని నిర్ణయించింది. ఈ కోటాలో భర్తీ చేసే ఉద్యోగాల గరిష్ట వయో పరిమితిని 5 ఏళ్లు పెంచాలని కూడా నిర్ణయించింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో ఆరున్నర గంటలకు పైగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దళిత బంధు పథకం అమలు, విధివిధానాల రూపకల్పనపై కేబినెట్ విస్తృతంగా చర్చించింది. పైలట్ ప్రాజెక్టు అమలుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ ముందుకు సాగుతోందని, ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. దళిత బంధుకు చట్టబద్ధత దళిత బంధు పథకం అమలు విషయంలో మంత్రివర్గ సహచరుల నుంచి సీఎం సూచనలు స్వీకరించారు. రెక్కల కష్టం తప్ప మరే ఆస్తి లేని దీనస్థితిలో దళిత ప్రజలు ఉన్నారని, రాష్ట్రంలో 20 శాతం జనాభా ఉన్న దళితుల చేతుల్లో ఉన్న సాగుభూమి కేవలం 13 లక్షల ఎకరాలేనని, వారి పేదరికానికి ఇంతకు మించిన గీటురాయి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో గిరిజనుల కన్నా దయనీయ పరిస్థితుల్లో దళితులు ఉన్నారని తెలిపారు. అరకొర సహాయాలతో దళితుల అభివృద్ధి సాధ్యం కాదని, అందుకే దళితబంధులో ఒక యూనిట్ పెట్టుకోవడానికి రూ.10 లక్షల పెద్దమొత్తం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. బ్యాంకు రుణాలతో ముడి పెట్టుకోలేదని, తిరిగి చెల్లించే భారం ఉంటే దళితుల ఆర్థిక స్థితిలో మెరుగుదల రాదని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకానికి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు. దళిత బంధు దేశానికి దారి చూపే పథకం అవుతుందని కేబినెట్ అభిప్రాయ పడింది. ప్రతి జిల్లాలో ‘సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ ప్రైజ్’ దళిత బంధు లబ్ధిదారుడు ఎంచుకున్న ఉపాధిని అనుసరించి సంబంధిత ప్రభుత్వ శాఖ శిక్షణ కల్పించాలని మంత్రివర్గం కోరింది. శిక్షణ, పర్యవేక్షణకు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ వివిధ శాఖల అధికారులతో, గ్రామంలోని చైతన్యవంతులైన వారి భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పథకం అమలులో జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి కీలక పాత్ర పోషిస్తారని ముఖ్యమంతి అన్నారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతి జిల్లాలో ‘సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ ప్రైజ్’ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దళితబంధు పథకం అమలుకు పటిష్టమైన యంత్రాంగం అవసరమని, వివిధ శాఖల్లో అదనంగా ఉన్న ఉద్యోగుల సమాచారం సమర్పించాలని ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావును మంత్రివర్గం ఆదేశించింది. లబ్ధిదారులకు అందజేసే ఒక ప్రత్యేక కార్డు నమూనాలను కేబినెట్ పరిశీలించింది. దళిత వాడల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని, మిగతా గ్రామంతో సమానంగా దళిత వాడలకు అన్ని హంగులూ ఏర్పడాలని, ఇందుకు నిధుల కొరత లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అనాథ పిల్లలకు అండగా నిలవాలి ‘కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, ఒంటరిగా మారి మానసిక వేదన, సామాజిక వివక్షను ఎదుర్కొంటూ సమాజ క్రూరత్వానికి బలయ్యే ప్రమాదముంది. గతంలో అనాథ పిల్లలకు బీసీ హోదా ఇవ్వడంతో పాటు వారి రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఇప్పుడు కూడా అనాథ పిల్లల సంక్షేమానికి సమగ్ర విధానాన్ని రూపొందించాలి. మానవీయ కోణంలో ప్రభుత్వ యంత్రాంగం స్పందించి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు ఖాళీగా వున్న అనువైన ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించి అందులో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ కోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రులు, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్‌తో మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ ఆహ్వానితులుగా కొనసాగనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అనాథల స్థితిగతుల మీద సమగ్ర నివేదికను సమర్పించాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. మందులు, ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలి అన్ని జిల్లాల్లో కరోనా నిర్థారణ పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని వైద్య శాఖను కేబినెట్ ఆదేశించింది. అన్ని రకాల మందులు, ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని సూచించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఈ సందర్భంగా వైద్యశాఖ నివేదించింది. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో మరోసారి వైద్య బృందాలు పర్యటించి రావాలని మంత్రివర్గం ఆదేశించింది. నిమ్స్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి కొత్తగా మంజూరు చేసిన ఏడు ప్రభుత్వ వైద్య కళాశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. అవసరమైన పడకలు, ఇతర మౌలిక వసతులు, కళాశాలలు, హాస్టళ్ల భవనాల నిర్మాణాలకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించింది. వైద్య కళాశాలల భవన నిర్మాణాలను చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖను మంత్రివర్గం ఆదేశించింది. నిమ్స్ ఆస్పత్రిని మరింతగా అభివృద్ధి పరిచి వైద్య సేవలను విసృత పరిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేసి తదుపరి మంత్రివర్గ సమావేశం ముందు ఉంచాలని వైద్య శాఖను మంత్రివర్గం ఆదేశించింది. భవిష్యత్తులో అనుమతించనున్న వైద్య కళాశాలల కోసం స్థలానేష్వషణ, ఇతర సౌకర్యాల కల్పనకు ముందస్తుగా ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాలని సూచించింది. అవసరమున్న జిల్లాల్లో వచ్చే ఏడాది నాటికి వైద్య కళాశాలల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాలని, ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరింది. త్వరలో సూపర్ స్పెషాలిటీలకు శంకుస్థాపన కొత్తగా ఏర్పాటు చేయనున్న 5 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రితో పాటు హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ‘తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్)’గా నామకరణం చేయాలని తీర్మానించింది. టిమ్స్ గచ్చిబౌలి, టిమ్స్ సనత్‌నగర్, టిమ్స్ ఎల్బీ నగర్, టిమ్స్ అల్వాల్ ఆస్పత్రులుగా అభివృద్ధి చేసి, అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఒక్కచోటే అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించింది. వరంగల్‌లో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరలో చేపట్టాలని ఆదేశించింది. పటాన్చెరులో మల్టీస్పెషాలటీ ఆస్పత్రి పటాన్చెరులో కార్మికులు, ఇతర ప్రజల అవసరాలకు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని మంత్రివర్గం మంజూరు చేసింది. రాష్ట్రంలో జిల్లాకో వైద్య కళాశాల స్థాపన లక్ష్యంగా, వైద్య కళాశాలలు లేని జిల్లాలను గుర్తించి రెండు మూడేళ్లల్లో దశల వారీగా వాటిని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ధోభీ ఘాట్లు, సెల్లూనకు ఉచిత విద్యుత్ ధోభీ ఘాట్లు, సెల్లూనకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని వారంలోగా సంపూర్ణంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్బీసీ పనులను ప్రారంభించండి నల్లగొండ జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు నుండి ప్రారంభించిన ఎస్సెల్బీసీ సొరంగమార్గం పనులను పున:ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. దాంతోపాటు ఉదయ సముద్రం లిఫ్టు ఇరిగేషన్ స్కీం (బ్రాహ్మణ వెల్లెంల)ను కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి కేబినెట్ ఆదేశాలు జారీచేసింది. ఉదయ సముద్రం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ►16 నుంచి దళిత బంధు తెలంగాణ దళిత బంధు పథకాన్ని ఈ నెల 16 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని నిర్ణయం. దళిత జాతి పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రవేశపెడుతున్న ఈ ప్రతిష్టాత్మక పథకానికి కేబినెట్ ఏకగ్రీవ ఆమోదం. ►57 ఏళ్లకు పింఛన్లు వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సును 57 ఏళ్లకు తగ్గిస్తూ ఇప్పటికే తీసుకున్న నిర్ణయం అమలు ప్రక్రియ తక్షణమే ప్రారంభం. కుటుంబంలో ఒక్కరికే పింఛన్ పద్ధతి కొనసాగింపు. భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు పెన్షన్ బదిలీ ►అనాథ పిల్లల బాధ్యత సర్కారుదే కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలు పెద్దవారై ప్రయోజ కులయ్యే వరకు ఆశ్రయం కల్పించి అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి పిల్లల వివరాలు తెప్పించాలని ఆదేశం. -
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
-
తెలంగాణలో మొత్తం ఖాళీ పోస్టులు 56,979
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి అవకాశముందో ఆర్థిక శాఖ తేల్చింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 44,022, ఆయా శాఖల పరిధిలోని గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఇతర సంస్థల్లో 12,957 కలిపి మొత్తం 56,979 డైరెక్ట్ రిక్రూట్మెంట్ (డీఆర్) పోస్టుల భర్తీకి అవకాశముందని స్పష్టం చేసింది. ఈ మేరకు నివేదికను బుధవారం కేబినెట్‌కు సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం పోలీసు శాఖలో ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉండగా, అతి తక్కువగా సమాచార శాఖలో కేవలం నాలుగంటే నాలుగు పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయి. ఇలా మొత్తం 28 శాఖల వివరాలను కేబినెట్‌కు సమర్పించగా, 8 ప్రభుత్వ శాఖల్లో 100కన్నా తక్కువ ఉద్యోగ ఖాళీలు చూపెట్టారు. సంక్షేమ గురుకులాల్లో పోస్టుల సంఖ్యను చూపెట్టినా, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న దాదాపు 18 వేల పోస్టులను మాత్రం నివేదికలో ప్రస్తావించలేదు. కానిస్టేబుళ్ల పోస్టులు 19,251 పోలీసు శాఖలో 21,507 డీఆర్ పోస్టులు నింపేందుకు అవకాశముందని ఆర్థిక శాఖ పేర్కొంది. ఇందులో 88 డీఎస్పీ (సివిల్), 368 ఎస్ఐ (సివిల్), 19,251 కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి అవకాశం ఉందని తెలిపింది. అలాగే 515 ఫైర్‌మెన్, 380 ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు, 174 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించింది. సంక్షేమ గురుకులాల్లో.. సంక్షేమ గురుకులాల్లో 7,701 పోస్టుల భర్తీకి అవకాశముందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఇందులో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల సొసైటీ పరిధిలో 3,400, ఎస్సీ గరుకుల సొసైటీలో 1,784, ఎస్టీ గురుకులాల్లో 1,124, మైనార్టీ గురుకులాల్లో 1,393 పోస్టులు చూపెట్టారు. పలు శాఖల్లో ఇలా... వైద్య శాఖ విషయానికి వస్తే 3,353 స్టాఫ్ నర్సులు, 1,216 ఏఎన్ఎంలు, 1,085 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అవకాశముంది. ఉన్నత విద్యలో 1,062 డిగ్రీ లెక్చరర్లు, 900 వరకు జూనియర్ లెక్చరర్ పోస్టులున్నాయని ఆర్థిక శాఖ తేల్చింది. రెవెన్యూ శాఖ విషయానికి వస్తే 305 ఎక్సైజ్ కానిస్టేబుళ్లు, 59 ఏసీటీవోలు, 48 సీటీవోలు, 169 జూనియర్ అసిస్టెంట్లు (పన్నుల శాఖ), 210 మంది డిప్యూటీ సర్వేయర్లు, 50 డ్రాఫ్ట్‌మెన్, 42 డిప్యూటీ కలెక్టర్లు, 95 నాయబ్ తహశీల్దార్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 894 జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, 121 ఎంపీడీవోలు, 195 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల భర్తీకి అవకాశముంది. నీటì పారుదల శాఖలో 721 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 221 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు, 184 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, అటవీశాఖలో 856 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉండగా, మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ సూపర్వైజర్లు గ్రేడ్–1 కింద 181, గ్రేడ్–2 కింద 433 ఖాళీలున్నాయి. వ్యవసాయశాఖలో వ్యవసాయ విస్తరణాధికారులు 200, పశువైద్య విభాగంలో 244 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, 103 వెటర్నరీ అసిస్టెంట్లు, రవాణా శాఖలో 108 మంది అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు పోస్టుల భర్తీకి అవకాశముందని ఆర్థిక శాఖ వెల్లడించింది. -
జోగు రామన్న కు మళ్ళీ రాజయోగం పట్టనుందా?
-
తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేత
అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కలాపాలను పూర్తి స్థాయిలో నిర్వహించుకోవచ్చు. సామాజిక, రాజకీయ, మతపర, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. లాక్డౌన్ పూర్తిగా ఎత్తేయడంతో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు తొలగిపోయాయి. ప్రార్థన స్థలాలు, సినిమా హాళ్లు, అమ్యూజ్మెంట్ పార్కులు, క్లబ్బులు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు, పబ్స్, జిమ్‌లు, స్టేడియాలు తెరుచుకోవచ్చు. వివాహాలు, అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తుల సంఖ్యపై పరిమితి ఉండదు. ‘‘లాక్డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా పోయినట్టు కాదు. జనజీవనం, సామాన్యుల బతుకుదెరువు దెబ్బతినవద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదు. మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం వంటి జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. ప్రభుత్వ నిబంధనలను విధిగా అనుసరించాలి. పూర్తి స్థాయిలో కరోనా నియంత్రణకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలి..’’ - ప్రజలకు మంత్రివర్గం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఆదివారం నుంచి సంపూర్ణంగా ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. లాక్డౌన్ సమయంలో విధించిన అన్ని రకాల ఆంక్షలను ఉప సంహరిస్తున్నట్టు ప్రకటించింది. లాక్‌డౌన్‌కు ముందున్నట్టుగా రోజువారీ వ్యవహారాలు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని సూచించింది. అన్ని విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు తెరుచుకోవచ్చని పేర్కొంది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు జూలై 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో పునః ప్రారంభించుకోవచ్చని తెలిపింది. శనివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన ఈ భేటీ రాత్రి 8.30 గంటల వరకు 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందంటూ, కరోనా నియంత్రణలోకి వచ్చిందంటూ వైద్యారోగ్య శాఖ అందించిన నివేదికలను పరిశీలించింది. పొరుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గిన అంశంపై పరిశీలన జరిపింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో కరోనా వేగంగా నియంత్రణలోకి వచ్చిందన్న అంశాలను నిర్ధారించుకుని.. లాక్డౌన్ ఎత్తివేత నిర్ణయం తీసుకుంది. వెంటనే ఉత్తర్వులు జారీ రాష్ట్రంలో కరోనా రెండో వేవ్ నియంత్రణ కోసం మే 12 నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తొలుత ఉదయం నాలుగు గంటల పాటు మాత్రమే సడలింపు ఇవ్వగా.. తర్వాత ఒంటి గంట వరకు, సాయంత్రం ఐదు గంటల వరకు పెంచారు. తాజాగా పూర్తిస్థాయిలో ఎత్తివేశారు. లాక్డౌన్ ఎత్తివేస్తూ, దానికి ముందు కొనసాగిన అన్నిరకాల కార్యకలాపాలకు అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం రాత్రే ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. జూన్ 1 నుంచే విద్యా సంస్థలు పునః ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థుల హాజరు, ఆన్లైన్ క్లాసుల కొనసాగింపు తదితర అంశాలకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని విద్యా శాఖను మంత్రివర్గం ఆదేశించింది. విద్యార్థులకు భౌతిక తరగతులు (ఫిజికల్ క్లాసెస్) ప్రారంభించాలని సూచించింది. లాక్డౌన్ ఎత్తివేతతో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు తొలగినా.. అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులపై మాత్రం స్పష్టత రాలేదు. గ్రామాల్లో ఆధునిక సెలూన్లు యాదవులకు గొర్రెల పంపిణీ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. గతంలోనే నిర్ణయించిన ప్రకారం క్షౌ ర వృత్తిలోని నాయీ బ్రాహ్మణులకు గ్రామాల్లో మోడ్రన్ సెలూన్లను తక్షణమే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. రైతులకు బీమా సత్వరమే అందిస్తున్నట్టుగా.. చేనేత, గీత కార్మికులు, ఇతర వృత్తి కులాల వారికి సైతం త్వరగా చెల్లింపులు జరిగేలా చూడాలని సూచించింది. మత్స్య, గీత కార్మికులకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని, ఎంబీసీ కార్పోరేషన్‌కు నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. హైదరాబాద్‌లో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు రోగుల రద్దీతో కిటకిటలాడుతున్న ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించడం, ప్రజలకు మరింతగా వైద్య సేవలు అందించడం లక్ష్యంగా.. కొత్తగా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతమున్న ‘టిమ్స్’ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఆధునీకరించాలని.. కొత్తగా మరో 3 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని తీర్మానించింది. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి ప్రాంగణంలో ఒకటి, గడ్డి అన్నారం నుంచి తరలించిన పండ్ల మార్కెట్ స్థలంలో మరొకటి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో అల్వాల్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు మధ్య మరొకటి నిర్మించాలని నిర్ణయించింది. దీనివల్ల జిల్లాల నుంచి అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు శివారు ప్రాంతాల్లోనే వైద్య సౌకర్యం అందుతుందని పేర్కొంది. కొత్తపేటలోని కూరగాయల మార్కెట్‌ను పూర్తిగా ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌గా అభివృద్ధి చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. -
Telangana: కృష్ణాపై కొత్త ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాను పూర్తిగా వినియోగించుకోవడానికి వీలుగా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. కృష్ణానదిపై జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య అలంపూర్ వద్ద గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్ద మారూరు గ్రామాల పరిధిలో జోగులాంబ బ్యారేజీని నిర్మించి 60-70 టీఎంసీల నీటిని తరలించాలని తీర్మానించింది. ఈ నీటిని పాలమూరు-రంగారెడ్డి పథకంలో భాగమైన ఏదుల రిజర్వాయర్‌కు ఎత్తిపోసి.. పాలమూరు, కల్వకుర్తి ప్రాజెక్టుల కింది ఆయకట్టుకు అందించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులతో పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీటి విషయంగా అన్యాయం జరుగుతోందని, ఈ నేపథ్యంలో కృష్ణా జలాల్లో న్యాయంగా దక్కాల్సిన వాటాను వినియోగించుకునేలా మరిన్ని కొత్త పథకాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రాజెక్టులపై ప్రధాని నుంచి ప్రజాక్షేత్రం వరకు.. భేటీ సందర్భంగా ఏపీ చేపట్టిన ప్రాజెక్టులపై చర్చించిన కేబినెట్.. రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ కుడి కాల్వ నిర్మాణాలపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. ఏపీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిందని, సుప్రీంకోర్టులో కేసులు వేసిందని గుర్తు చేసింది. ఆ ప్రాజెక్టులు ఆపాలని కేంద్రం, ఎన్జీటీ ఆదేశించినా ఏపీ ప్రభుత్వం బేఖాతరు చేయడం సరికాదని పేర్కొంది. ఈ విషయంలో ప్రధానమంత్రిని, కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించాలని, ఏపీ ప్రాజెక్టులను ఆపివేయించేలా చూడాలని నిర్ణయించింది. ఇదే సమయంలో ఏపీ జలదోపిడీకి పాల్పడుతోందని ప్రజాక్షేత్రంలో, న్యాయస్థానాల్లో ఎత్తిచూపాలని.. రాబోయే వర్షకాల పార్లమెంటు సమావేశాల్లోనూ వివరించాలని మంత్రివర్గం ఆలోచనకు వచ్చింది. ఏపీ ప్రాజెక్టుల పర్యవసానంగా రాష్ట్రంలో కృష్ణా బేసిన్ ప్రాంతాలకు జరిగే నష్టాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించింది. కేంద్రం తీరుపై ఆవేదన నదీ జలాల విషయంలో కేంద్రం తీరును మంత్రివర్గం తప్పుపట్టింది. తెలంగాణకు న్యాయమైన వాటాకోసం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం– 1956 సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరిన అంశంపై చర్చించింది. సుప్రీంకోర్టులో కేసుల వల్ల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయలేకపోతున్నామని, తెలంగాణ కేసులను వెనక్కి తీసుకుంటే త్వరగా నిర్ణయం తీసుకుంటామని అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్ర జలశక్తి మంత్రి హామీ ఇచ్చారని మంత్రివర్గం గుర్తు చేసింది. కేంద్రం సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరిస్తుందనే నమ్మకంతో తెలంగాణ ప్రభుత్వం కేసులు ఉపసంహరించుకున్నా.. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్రం వైఖరి కారణంగా తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించింది. రాష్ట్ర రైతుల ప్రయోజనాల రక్షణ కోసం ఎంత దూరమైనా పోవాలని అభిప్రాయపడింది. ప్రాజెక్టులపై కేబినెట్ నిర్ణయాలివీ.. పులిచింతల ఎడమ కాల్వ నిర్మించి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. సుంకేశుల రిజర్వాయర్ నుంచి మరో ఎత్తిపోతల పథకం ద్వారా నడిగడ్డ ప్రాంతంలో మరో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించాలి. కృష్ణా ఉపనది అయిన భీమా నది తెలంగాణలో ప్రవేశించే కృష్ణ మండలంలోని కుసుమర్తి గ్రామం వద్ద భీమా వరద కాల్వను నిర్మించాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో జలాశయాల సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచాలి. నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఎగువ భూములకు నీరివ్వాలి. సాగునీటి శాఖ ఈ ప్రాజెక్టులకు సంబంధించి వెంటనే సర్వేలు నిర్వహించి, డీపీఆర్‌ల తయారీ కోసం చర్యలు తీసుకోవాలి. వానాకాలం ప్రారంభంలోనే కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాలకు నీటి ప్రవాహం పెరుగుతుంది. ఈ సమయంలోనే తెలంగాణకు హక్కుగా ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టుల్లో వీలైనంత మేరకు జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి.. ఎత్తిపోతల పథకాలకు వినియోగించుకోవాలి. తద్వారా ఎప్పటికప్పుడు నీటిని ఎత్తిపోసుకోవడంతోపాటు విద్యుత్ ఖర్చును తగ్గించుకోవచ్చు. కృష్ణా, గోదావరి నదులపై 2,375 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో పూర్తి సామర్ధ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసి.. కాళేశ్వరం, దేవాదుల, ఏఎమ్మార్పీ తదితర పథకాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖను కేబినెట్ ఆదేశించింది. -
లాక్‌డౌన్‌పై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ జరిగింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ మేరకు లాక్ డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్‌లో 3 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఆమోదం తెలిపింది. టిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఆధునీకరించాలని నిర్ణయించింది. చెస్ట్ ఆస్పత్రి, గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ప్రాంగణాల్లో ఆస్పత్రుల నిర్మాణం, అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో మరో ఆస్పత్రి నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. లాక్డౌన్, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయ సంబంధిత అంశాలతో పాటుగా గోదావరి వాటర్ లిఫ్ట్, హైడల్ పవర్ ఉత్పత్తిపై కేబినెట్ చర్చించింది. చదవండి: లాక్డౌన్, బడులు, కర్ఫ్యూనే మంత్రివర్గ అజెండా రసవత్తరంగా టీపీసీసీ పీఠం: ఐదుగురిలో ఎవరో..? -
లాక్డౌన్, బడులు, కర్ఫ్యూనే మంత్రివర్గ అజెండా
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసరంగా భేటీ కానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను కొనసాగించాలా, ఎత్తివేయాలా, మరిన్ని సడలింపులు ఇవ్వాలా? అన్న దానితోపాటు రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్రంలో మే 12వ తేదీ నుంచి లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సడలింపుతోపాటు.. ప్రజలు ఇళ్లకు చేరుకోవడానికి మరో గంట అదనంగా మినహాయింపు ఉంది. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు, కరోనా కేసుల నమోదు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేసి.. రాత్రి 9 గంటల నుంచి మరునాడు ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను రాత్రి తొమ్మిదింటికే మూసేసి, ఇళ్లకు చేరుకోవడానికి ఒక గంట సమయం ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నట్టు తెలిసింది. సినిమా హాళ్లు, షూటింగ్‌లు, థీమ్ పార్క్‌లు, జిమ్‌లు వంటి వాటికి అనుమతి ఇస్తారా, మరికొంత కాలం మూసే ఉంచుతారా అన్నది కూడా కేబినెట్ సమావేశంలో తేలనుంది. ఇక ఈ నెల 21వ తేదీ నుంచి విద్యా సంస్థల ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. దీనిపై కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విద్యా సంస్థలు తెరుచుకున్నా కొంతకాలం పాటు ఆన్లైన్ తరగతులే కొనసాగించనున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. వ్యవసాయ అంశాలపైనా.. వానాకాలం మొదలైన నేపథ్యంలో.. సాగు, నకిలీ విత్తనాల బెడద ఎక్కువైన నేపథ్యంలో మరింత కఠిన చర్యలు తీసుకునే దిశగా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. రైతుబంధు పథకం కింద రైతాంగానికి అందిస్తున్న ఆర్థిక సాయం, విత్తనాలు, ఎరువుల లభ్యత అంశాలను చర్చిస్తారని చెబుతున్నారు. కాళేశ్వరం నుంచి ఇప్పటికే ఎత్తిపోతలు ప్రారంభమైన నేపథ్యం మరింత సమర్థవంతంగా గోదావరి నీటిని వినియోగించుకోవడంపై కూడా కేబినెట్ దృష్టి సారించనుంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశంతోపాటు కరోనా మూడో వేవ్ రావొచ్చనే ఆందోళన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించనుంది. నిధుల సమీకరణకు సంబంధించి కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. -
పరిశ్రమల్లో స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించే కొత్త విధానాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. టీఎస్ఐపాస్ ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం వృద్ధి చెందుతుండటంతో స్థానికులకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభించేలా పరిశ్రమలశాఖ రూపొందించిన ముసాయిదాను కేబినెట్ ఆమోదించింది. ఈ నూతన విధానంలో భాగంగా స్థానిక మానవ వనరులకు ఎక్కువ సంఖ్యలో ఉపాధి కల్పించే పరిశ్రమలకు జీఎస్టీలో రాయితీ, విద్యుత్ చార్జీల్లో ప్రోత్సాహకాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం కొంత మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది. టీఎస్‌ఐపాస్‌లో భాగంగా టీ ప్రైడ్, టీ ఐడియాలో భాగంగా పరిశ్రమలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు, ప్రోత్సాహకాలిస్తోంది. పరిశ్రమలకు ప్రోత్సాహకాలివే.. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు అవసరమైన స్థానిక మానవ వనరులను ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యా సంస్థల సహకారంతో అందించాలనేది ఈ పాలసీ ఉద్దేశం. అయితే మహారాష్ట్రలో 80 శాతం, ఏపీ, కర్ణాటకలో 75 శాతం, మధ్యప్రదేశ్‌లో 70 శాతం మేర స్థానికులకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఈ విధానంపై విమర్శ లు వస్తున్న నేపథ్యంలో రెండు కేటగిరీల్లో ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెమీ స్కిల్డ్ కేటగిరీలో 70 శాతం, స్కిల్డ్ కేటగిరీలో 60 శాతం స్థానికుల కు ఉపాధి కల్పించే పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలిస్తారు. టీ ప్రైడ్, టీ ఐడియాలలో ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలకు ఇవి అదనం. స్కిల్డ్ కేటగిరీలో మధ్య తరహా, భారీ పరిశ్రమలకు వ్యాట్/సీఎస్టీ/జీఎస్టీలో 10 శా తం రాయితీ ఇస్తారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఎలాంటి రాయితీలుండవు. విద్యుత్ ఖర్చు పరిహారానికి సంబంధించి సెమీ స్కిల్డ్ కేటగిరీలో ఐదేళ్ల వరకు సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు యూనిట్‌కు 50 పైసలు, స్కిల్డ్ కేటగిరీలో రూపాయి వంతున ప్రోత్సాహకం ఇస్తారు. మధ్య తరహా, భారీ పరిశ్రమలకు సెమీ స్కిల్డ్ కేటగిరీలో యూనిట్‌కు 75 పైసలు, స్కిల్డ్ కేటగిరీలో రూపాయి చొప్పున ఇస్తారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు పెట్టుబడి రాయితీలో 5 శాతం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం ఒక్కో వ్యక్తికి చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు రూ. 3 వేలు, మధ్య తరహా, భారీ పరిశ్రమలకు రూ.5 వేలకు మించకుండా చెల్లిస్తారు. ఎలక్ట్రిక్ వాహన పాలసీకి ఆమోదం వాహన కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం, తయారీని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ‘తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీ’ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. -
కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్ను వినియోగించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించాలని కోరింది. డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 గంటల వరకు రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయం కొత్త భవన సముదాయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబం« దించిన డిజైన్లను ఆమోదించింది. బాధితులకు హోం ఐసోలేషన్ కిట్లు కరోనా వ్యాప్తి – వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స– ప్రభుత్వ వైద్యాన్ని మరింత పటిష్టం చేసే అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. దాదాపు రెండున్నర గంటల పాటు నిపుణులు, వైద్యులతో చర్చించింది. ‘కరోనా ప్రస్తుతం పెద్ద నగరాల్లో తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లోనూ కేసులు తగ్గుతున్నాయి. తెలంగాణలో మరణాల రేటు తక్కువగానూ, కోలుకుంటున్న వారి రేటు ఎక్కువగానూ నమోదవుతున్నది. కాబట్టి ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’అని వైద్య నిపుణులు కేబినెట్ కు వివరించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ఎన్ని కేసులు వచ్చినా వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేబినెట్ ఉద్ఘాటించింది. ఎక్కువ వ్యయం చేసి ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు, మందులు, నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, వారిని ఉపయోగించుకోవాలని కేబినెట్ ప్రజలను కోరింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావాల్సిన మందులు, పరికరాలు, వసతులు ఏర్పాటు చేయడానికి ఎంత డబ్బుకైనా వెనకాడేది లేదని స్పష్టం చేసింది. – రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్‌డెసివిర్, డెక్సామితజోన్ ఇంజక్షన్లు, ఫావిపిరావిర్ టాబ్లెట్లు, ఇతర మందులు, పిపిఇ కిట్లు, టెస్ట్ కిట్లు లక్షల సంఖ్యలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. కోవిడ్ చికిత్సపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలిలా ఉన్నాయి. – పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు తేలగానే వారికి వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇవ్వాలి. 10 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్స్ సిద్ధంగా ఉంచాలి. – రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఆక్సిజన్ బెడ్లను సిద్ధంగా ఉంచాలి. – ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే తాత్కాలిక పద్ధతిలో నియమించుకునేందుకు కలెక్టర్లకు అధికారం. – కోవిడ్ రోగులకు చికిత్స అందించే విషయంలో అవకతవకలకు పాల్పడే ప్రైవేటు ఆసుపత్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. – ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన వందకోట్లకు అదనంగా మరో వంద కోట్లను విడుదల చేసింది. వైద్య ఆరోగ్య శాఖ నిధులను నెలవారీగా ఖచ్చితంగా విడుదల చేయాలి. –ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నందున వారికి కావాల్సిన మందులు, ఇంజక్షన్లు, భోజనాలు ఖర్చులు ప్రభుత్వం భరించాలని నిర్ణయించింది. – ప్రతీ రోజు 40వేల వరకు పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. త్వరలో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంచడం లక్ష్యంగా రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లు పెట్టాలనే సీఎం నిర్ణయాన్ని కేబినెట్ అభినందించింది. ఇందుకోసం సమగ్ర విధానం తీసుకురావాలని నిర్ణయించింది. వలస కార్మికుల సంక్షేమానికి పాలసీ లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల కష్టాలను ప్రపంచమంతా కళ్లారా చూసిందని, భవిష్యత్తులో వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కేబినెట్ అభిప్రాయపడింది. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారని, వారి సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తయారు చేయాలని నిర్ణయించింది. పుట్టిన ఊరిని, కన్నవారిని, కుటుంబాన్ని వదిలి పనికోసం తెలంగాణకు వచ్చే కార్మికులు ఇదే తమ ఇల్లు అనే భావన, భరోసా కలిగించేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. వలస కార్మికుల సంక్షేమ పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించింది. టీఎస్–బీపాస్‌కు ఆమోదం భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన టీఎస్–బీపాస్ పాలసీని మంత్రివర్గం ఆమోదించింది. టీఎస్–ఐపాస్ లాగానే టీఎస్–బీపాస్ కూడా అనుమతుల విషయంలో పెద్ద సంస్కరణ అని కేబినెట్ అభిప్రాయపడింది. స్థానిక సంస్థలకు వన్‌టైం సెటిల్మెంట్ అవకాశం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సిన కరెంటు బిల్లులను ప్రతీ నెలా క్రమం తప్పకుండా చెల్లించాలని కేబినెట్ ఆదేశించింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పాత విద్యుత్ బిల్లుల బకాయిలను వన్‌టైమ్ సెటిల్మెంట్ ద్వారా చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది – ప్రభుత్వ శాఖలకు చెందిన పనికిరాని పాత వాహనాలను అమ్మేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. – కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించింది. –దుమ్ముగూడెం బ్యారేజికి సీతమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్‌కు నృసింహ స్వామి రిజర్వాయర్, తుపాకులగూడం బ్యారేజికి సమ్మక్క బ్యారేజిగా నామకరణం చేస్తూ తీర్మానించింది. – రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ దాదాపు రెండున్నర గంటలు చర్చించింది. నియంత్రిత పద్ధతిలో 1.13 కోట్ల ఎకరాల్లో పంటలు వేసారని, మరో 10–12 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉందని, 8.65 లక్షల ఎకరాల్లో వివిధ రకాల తోటలున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. -
కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ
-
ఈనెల 5న తెలంగాణ కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ విభృంభణ కొనసాగుతున్న తరుణంలో ఈనెల 5న తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరుగనుంది. కరోనా నియంత్రణ, వైరస్ నిర్ధారణ పరీక్షలు, వైద్య రంగంలో తీసుకురావాల్సిన మార్పులను కేబినెట్ చర్చించనుంది. అలాగే కొత్త సచివాలయం నిర్మాణం, నియంత్రిత సాగు వంటి అంశాలు మంత్రిమండలి ముందుకు చర్చకు రానున్నాయి. -
ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి : తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశమైన మంత్రివర్గం.. లాక్డౌన్ 4.0 మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చించింది. తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీ చార్జీల పెంపుపై కూడా కేబినెట్ చర్చించింది. ఎంజీబీఎస్‌ను మరిన్ని రోజులు మూసి ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధివిధానాలపైనా చర్చించారు. -
భయం లేదు.. జాగ్రత్తలే
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ గురించి రాష్ట్ర ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని, రాష్ట్రంలో అసలు కరోనా లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులకు మాత్రమే కరోనా పాజిటివ్‌గా నమోదైందని, అందులో ఒక వ్యక్తి చికిత్స పొంది కోలుకోగా, మరో వ్యక్తి చికిత్స పొందుతున్నాడని సీఎం చెప్పారు. మరో ఇద్దరికి అనుమానం ఉన్న నేపథ్యంలో నిర్ధారణ కోసం పుణేకు పంపామని, ఆ రిపోర్టు వచ్చిన తర్వాతే వారి గురించి ఆలోచిస్తామని చెప్పారు. శనివారం సాయంత్రం ప్రగతి భవన్లో మూడు గంటల పాటు నిర్వహించిన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు, ఉన్నతాధికారులతో కలసి సీఎం విలేకరులతో వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే.. ముందుజాగ్రత్తగానే చర్యలు.. ‘రాష్ట్రంలో ఏదో ఉత్పాతం ఏర్పడింది. పిడుగు పడింది అని ప్రజలు భయపడాల్సిన పనిలేదు. భయోత్పాతం చెంది గందరగోళానికి గురికావా ల్సినవసరం లేదు. అసలు ఇది మనదేశంలో పుట్టిన వైరస్ కాదు. విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే వస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారిని పరీక్షించేందుకు ఎయిర్‌పోర్టులో అన్ని ఏర్పాట్లు చేశాం. కానీ ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి చాలా మందికి.. వారి నుంచి చాలా చాలా మందికి సోకుతుందనే ఆలోచనతోనే దాన్ని నియంత్రించేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. అంతే తప్ప ఎవరూ భయపడొద్దు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రెండు దశల కార్యాచరణ రూపొందించాం. అందులో 15 రోజుల పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారం రోజుల పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలున్నాయి. కేబినెట్ నిర్ణయాలను అందరూ పాటించాల్సిందే. ఎవరికీ మినహాయింపు ఉండదు. ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. చట్టాలను ఎలా అమలు చేయాలో తెలుసు’అని హెచ్చరించారు. ఇక్కడ పుట్టింది కాదు.. ‘ఈ వ్యాధి చైనా నుంచి వచ్చి ఇతర దేశాల్లో పాకుతుందే తప్ప మన దేశంలో పుట్టింది కాదు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 130 కోట్ల మంది జనాభా ఉన్న మనదేశంలో కేవలం 83 మందికి మాత్రమే వచ్చింది. అందులో 66 మంది విదేశాల నుంచి వచ్చిన భారతీయులు, 17 మంది విదేశీయులు. వీరిలో 10 మంది కోలుకున్నారు. ఇద్దరు మాత్రమే చనిపోయారు. మిగిలిన వారికి చికిత్స అందుతోంది. ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదు. బెంబేలెత్తి గందరగోళానికి గురికావొద్దు. ప్రజలు తమను తాము కాపాడుకునేందుకు జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటమే మంచిది’అని సూచించారు. కేంద్ర సూచనల దృష్ట్యా ‘అసెంబ్లీలో జరిగిన చర్చ, కేబినెట్ సమావేశం అనంతరం కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ రాష్ట్రాలు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి. కేంద్రం కూడా చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడబోం. ఈ వైరస్ నియంత్రణ కోసం ప్రాథమికంగా రూ.500 కోట్లను కేబినెట్ మంజూరు చేసింది. ఈ నిధి సీఎస్ అధీనంలో ఉంటుంది. ఏ క్షణంలోనైనా, ఎలాంటి సందర్భంలో అయినా ఈ నిధిని ఖర్చు చేసే సంపూర్ణ స్వేచ్ఛ ఆయనకు ఇస్తున్నాం. వైద్య, ఆరోగ్య శాఖ కూడా సర్వ సన్నద్ధంగా ఉంది’అని సీఎం వివరించారు. ఊళ్లకు పాకే ప్రసక్తే లేదు.. ‘ఇది అంతర్జాతీయంగా వస్తున్న వ్యాధి కాబట్టి దేశీయంగా వచ్చే ప్రమాదం లేదు. ఎయిర్‌పోర్టులు, పోర్టుల వద్దే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మనకు సముద్రం లేదు కాబట్టి పోర్టుల వద్ద ప్రమాదం లేదు. ఎయిర్‌పోర్టు కూడా హైదరాబాద్‌లోనే ఉన్నందున, బహుళ ఎయిర్‌పోర్టులు లేనందున హైదరాబాద్ పరిసరాలకు మాత్రమే ఈ వైరస్ పరిమితమవుతుంది. గ్రామీణ ప్రాంతాలకు సోకే అవకాశమే లేదు. ప్రజలు భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్టులో 200 మంది వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు కేంద్రం పంపిన అధికారులు ఉన్నారు. వ్యాధి ప్రబలకుండా వారు స్క్రీనింగ్ చేస్తున్నారు’అని కేసీఆర్ భరోసా ఇచ్చారు. అందుబాటులో పడకలు ‘ఈ వైరస్ అనూహ్యంగా పెరిగినా ఇబ్బంది కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా 1,020 ఐసొలేషన్ పడకలు అందుబాటులో ఉంచాం. ఇవన్నీ కరోనా వైరస్ బాధితుల కోసమే.. ప్రత్యేక వార్డుల్లో ఉంటాయి. వీటితో పాటు 321 ఐసీయూ బెడ్ యూనిట్లు అందుబాటులో ఉంచాం. 240 వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాం. వెంటిలేటర్లకు ఎలాంటి కొరత లేదు. వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకునే క్వారంటైన్ కోసం నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఇప్పటికే ఏర్పాటు చేశాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శి ఆధ్వర్యంలో ఉండే ఈ టాస్క్‌ఫోర్స్‌లో పంచాయతీరాజ్, పురపాలక, అటవీ, పోలీసు తదితర శాఖ అధికారులు ఉంటారు. ఈ టాస్క్‌ఫోర్స్ రోజూ ఒకటి లేదా రెండు సార్లు సమావేశమై రాష్ట్రంలోని పరిస్థితిని ఆరోగ్య మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తాయి. ఆరోగ్య మంత్రి కూడా పరిస్థితిపై సమీక్ష జరిపి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదు’అని పేర్కొన్నారు. ప్రజారవాణా యథాతథం ‘ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రజా రవాణా యథాతథంగా కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు యథాతథంగా నడుస్తాయి. అయితే వాటిలో నిరంతరం శానిటైజేషన్ జరుగుతుంది. ప్రజలకు కొనుగోలుకు ఇబ్బంది లేకుండా, సరుకుల కొరత రాకుండా సూపర్ మార్కెట్లు, షాపులు, మాల్స్ మూసేయట్లేదు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని సీఎం వివరించారు. మీడియా.. బహుపరాక్ ‘కరోనా వ్యాప్తిపై సోషల్ మీడియాలో, మీడియాలో (ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ మీడియా) అతి ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం, చట్టం అంటే ఏంటో రుచి చూపిస్తాం. చట్టాలు ఎలా అమలు చేయాలో తెలుసు. ఎవరికీ మినహాయింపు ఉండదు. కొందరు అతిగాళ్లు సోషల్ మీడియాలో ఇష్టమున్న ప్రచారం చేస్తున్నారు. వీరిపై చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో భయాందోళనలు కలిగించడం మంచిది కాదు. వీటిని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ప్రచారం చేసే వాళ్లపై నియంత్రణ ఉంటుంది. క్షమించేది లేదు. కఠిన చర్యలుంటాయి’అని కేసీఆర్ తీవ్ర హెచ్చరికలు చేశారు. అలాగే మీడియా కూడా సంయమనం పాటించాలని, ప్రజలను భయాందోళనలకు గురిచేసే వార్తలు కాకుండా, వారికి సమాచారం ఇచ్చే విధంగా, అవగాహన కలిగించేలా మాత్రమే ప్రచారం చేయాలని సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖ ధ్రువీకరించిన తర్వాతే వార్తలు రాయాలని స్పష్టం చేశారు. ఎవరూ కాపాడలేరు.. ‘ఎలక్ట్రానిక్ మీడియాలో అతి ప్రచారం చేస్తున్నారు. మంచిర్యాల, జగిత్యాల, కాకరకాయ అంటూ వార్తలు రాస్తున్నారు. వీళ్ల మీద కూడా నియంత్రణ పెడుతున్నాం. మంచిర్యాల, జగిత్యాల, తోక, తొండెం అని రాస్తే క్షమించే పరిస్థితి లేదు. ఆరోగ్య శాఖ నిర్ధారించింది మాత్రమే రాయాలి తప్ప, ఏ మీడియా అయినా ఈడ కేసు, ఆడ కరోనా అని రాస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మేం పత్రికా స్వేచ్ఛను హరించట్లేదు. భయోత్పాతం సృష్టించడం, తప్పుడు ప్రచారం చేయడం సమాజానికి మంచిది కాదు కాబట్టి మానుకుంటే మంచిది. మాకు ఎలాంటి శషభిషల్లేవు. ప్రభుత్వం అంటే ఏంటో వారే చూస్తారు. ఎవరూ కాపాడలేరు. ప్రభుత్వానికి విచక్షణాధికారాలు ఉంటాయి. ప్రభుత్వ వినతిని కాదని, ఇలాంటి సున్నిత పరిస్థితుల్లో తప్పుడు వార్తలు రాస్తే ఏమవుతుందో అనుభవం వారికే వస్తుంది. అప్పీల్ చేయకపోతే మాది తప్పు. విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి చర్యలకు వెనుకాడే ప్రసక్తే లేదు’అని కేసీఆర్ మీడియాను కూడా హెచ్చరించారు. పరిశుభ్రత పాటిస్తే మంచిది.. ‘కరోనా ప్రధానంగా చైనా, ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియాలో విస్తరించింది. ఈ ఏడు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను 14 రోజుల పాటు క్వారంటైన్ కేంద్రాలకు తరలించి, పరిస్థితిని బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వారం రోజుల తర్వాత ఆరోగ్య మంత్రి, ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి సమీక్షించి, ప్రస్తుతం విధించిన ఆంక్షలు కొనసాగించాలా లేదా ఎత్తేయాలా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో పారిశుధ్య చర్యలు తీసుకోవాలని కోరతాం. ప్రభుత్వం ఏటా నిర్వహించే ఉగాది పంచాంగ శ్రవణాన్ని అవసరమైతే రద్దు చేస్తాం. శ్రీరామనవమి వంటి పండుగల నిర్వహణకు సంబంధించి పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం. కరోనాపై లేనిపోని భయాందోళనలు కల్పించొద్దు. మాస్క్‌ల అవసరం అంతగా లేదు. కరోనా వ్యాప్తికి సంబంధించి ప్రాథమికంగా అనుమానితులు ఉంటే వారి నుంచి నమూనాలు సేకరించి పుణేలోని కేంద్రానికి పంపిస్తున్నాం. కరోనా ప్రభావం కొద్ది రోజులే ఉండే అవకాశం ఉంది. రాకపోకలను తగ్గించుకోవడంతో పాటు పరిశుభ్రత పాటించడం ద్వారా కరోనా వ్యాప్తిని నివారించొచ్చు. అసెంబ్లీ సమావేశాల కొనసాగింపుపై ఆదివారం స్పీకర్ నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారు’అని సీఎం వెల్లడించారు. 15 రోజుల కార్యాచరణ అంశాలు.. ► ప్రాథమిక పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు శనివారం రాత్రి నుంచి మార్చి 31 వరకు బంద్. ► ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. ఎవరు అతిక్రమించినా తీవ్ర చర్యలుంటాయి. ఉల్లంఘిస్తే అనుమతులు రద్దు. కోచింగ్ సెంటర్లు, సమ్మర్ క్యాంపులు మూసేయాలి. ఈ రాత్రి నుంచే అమల్లోకి వస్తుంది. ఎవరూ రిస్క్ తీసుకోవద్దు. ► ఎస్ఎస్సీ, ఇంటర్, ఇతర బోర్డు పరీక్షలు యథావిధిగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయి. ఈ పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లు, జాగ్రత్తలు చేస్తారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉండే విద్యార్థుల్లో పరీక్షలు రాసే విద్యార్థులకు హాస్టల్ వసతి కొనసాగుతుంది. మిగిలిన విద్యార్థులను పంపిస్తారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉండే విద్యార్థుల కోసం ప్రత్యేక శానిటరీ ఏర్పాట్ల కోసం వైద్య శాఖ కార్యదర్శి ఆదివారం ఉత్తర్వులు జారీ చేస్తారు. ► రాష్ట్రంలోని అన్ని మ్యారేజీ హాల్స్ మూసివేత. ఇప్పటికే కరారైన ముహూర్తాలు, నిర్ణయించిన పెళ్లిళ్లకు మినహాయింపు. పెళ్లిళ్లు 200 మంది లోపు బంధువులతో (అమ్మాయి తరఫు 100, అబ్బాయి తరఫు 100 మంది) చేసుకుంటే మంచిది. వాళ్ల శ్రేయస్సు, మంచి దృష్ట్యా శుభకార్యాలను ఈ పద్ధతిలో చేసుకోవాలి. మ్యారేజీ హాల్స్ విషయంలో ఇప్పటికే పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలిచ్చాం. మ్యారేజీ హాల్స్ యజమానులు మార్చి 31 తర్వాత జరిగే పెళ్లిళ్లకు ఎవరికీ హాల్స్ బుకింగ్ ఇవ్వొద్దు. అలా ఇస్తే కఠిన చర్యలు ఉంటాయి. ఓనర్లు రిస్క్ తీసుకోవద్దు. వారం రోజుల పాటు నియంత్రణ వీటిపై.. ► బహిరంగ సభలు, సమావేశాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు, ఉత్సవాలు, ర్యాలీలు, ఎగ్జిబిషన్లు, ట్రేడ్ ఫెయిర్లు, కల్చరల్ ఈవెంట్లకు అనుమతులు ఉండవు. ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాలు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్, జిమ్నాజియమ్స్, జూ పార్కులు, మ్యూజియాలు, ఎమ్యూజ్మెంట్ పార్కులు అన్నీ మూసేయాలి. జన సమ్మర్థం ఉండే ప్రాంతాలు కాబట్టి అనుమతి ఉండదు. వెంటనే మూసేయాలి. ► అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్లు రద్దు. నిర్వహించడానికి వీల్లేదు. సినిమా హాళ్లు, బార్లు, పబ్బులు, మెంబర్షిప్ క్లబ్బులు కూడా బందే. చదవండి: మహమ్మారి కరోనా.. ప్రపంచానికే పెనుసవాల్ కరోనా ఎఫెక్ట్: గో మూత్రంతో విందు కరోనా ఎఫెక్ట్ ఎలా ఉందంటే.. -
మతపర వివక్ష వద్దు!
సాక్షి, హైదరాబాద్ : భారత పౌరసత్వం ఇచ్చే విషయంలో మతపరమైన వివక్ష చూపరాదని రాష్ట్ర కేబినెట్ కేంద్రాన్ని కోరింది. రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలను సమానంగా చూడా లని విజ్ఞప్తి చేసింది. భారత రాజ్యాంగం ప్రసాదించిన లౌకి కత్వాన్ని ప్రమాదంలో పడేసేలా పరిణమించిన పౌర సత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలని కేబినెట్ కోరింది. ఈ మేరకు కేబినెట్లో తీర్మానం చేశారు. కేరళ, పంజాబ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తరహాలోనే తెలం గాణ అసెంబ్లీలోనూ ఇందుకు సంబంధించి తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రగతిభవన్‌లో ఆది వారం సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సుదీర్ఘంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసు కుంది. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా పట్టణ ప్రగతి కార్యక్రమంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించింది. 10 రోజులపాటు పట్టణ ప్రగతి.. ఈ నెల 24 నుంచి పది రోజులపాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిం చాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడానికి ఈ నెల 18న ప్రగతిభవన్‌లో రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సు నిర్వహించనున్నారు. కాగా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థపై పయనం సాగడమే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమంతో మంచి పునాది ఏర్పడాలని ఆకాంక్షించారు. పట్టణాల్లో పచ్చదనం–పారిశుధ్యం వెల్లివిరియాలని, ప్రణాళికాబద్ధమైన ప్రగతి జరగాలని, పౌరులకు మెరుగైన సేవలు అందాలని, మొత్తంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా అడుగులు పడాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కోరారు. ఆయా పట్టణం ఇప్పుడు ఎలా ఉంది? రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి? అనేది ప్రణాళిక వేసుకుని అందుకు అనుగుణంగా నిధులు వినియోగించుకుని క్రమపద్ధతిలో ప్రగతి సాధించాలని చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే... పట్టణ ప్రగతి కార్యక్రమం సన్నాహకం కోసం ఈ నెల 18న ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలి. మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, కమిషనర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను ఈ సమావేశానికి ఆహ్వానించాలి. పట్టణ ప్రగతి కార్యక్రమ నిర్వహణపై చర్చించాలి. ఈ సదస్సులో పాల్గొన్న వారందరినీ అదేరోజు మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్మించిన వెజ్–నాన్ వెజ్ మార్కెటును, శ్మశాన వాటికలను సందర్శించడానికి తీసుకెళ్తారు. వార్డు యూనిట్‌గా పట్టణ ప్రగతి జరగాలి. ప్రతీ వార్డుకు ఒక ప్రత్యేకాధికారిని నియమించాలి. పట్టణ ప్రగతిలో భాగంగా వార్డుల వారీగా చేయాల్సిన పనులు, మొత్తం పట్టణంలో చేయాల్సిన పనులను గుర్తించాలి. పట్టణప్రగతిలో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించాలి. ప్రతీ మున్సిపాలిటీ, కార్పొరేషన్లో వార్డుల వారీగా నాలుగు చొప్పున ప్రజా సంఘాల ఏర్పాటు ప్రక్రియను వచ్చే 5 రోజుల్లో పూర్తి చేయాలి. జీహెచ్ఎంసీకి నెలకు రూ.78 కోట్లు, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నెలకు రూ.70 కోట్లు వెంటనే ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి మాసాలకు సంబంధించిన నిధులు జనాభా ప్రాతిపదికన ఆయా పట్టణాలకు అందించాలి. ఈ విధంగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు నెలకు రూ.148 కోట్ల చొప్పున నిధులు సమకూరుతాయి. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టే పనులకు నిధుల కొరత ఉండదు. 14వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన రూ.811 కోట్లలో రూ.500 కోట్లు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు, రూ.311 కోట్లు జీహెచ్ఎంసీకి కేటాయించాలి. పట్టణ ప్రగతిలో పచ్చదనం–పారిశుధ్యం పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. డ్రైనేజీలు శుభ్రం చేయాలి. మురికిగుంతలు పూడ్చాలి. విరివిగా మొక్కలు నాటాలి. హరిత ప్రణాళిక రూపొందించాలి. వార్డుల్లో నర్సరీల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలి. నగరాలు, పట్టణాల్లో స్థలాలు అందుబాటులో లేకుంటే సమీప గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి. అందుకోసం గ్రామాలను ఎంపిక చేయాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పారిశుధ్య పనుల కోసం మొత్తం 3,100 వాహనాలు సమకూర్చాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో 600 వాహనాలు వచ్చాయి. మిగతా 2,500 వాహనాలను త్వరగా తెప్పించి, పట్టణాలకు పంపాలి. ఇంకా ఎన్ని వాహనాలు అవసరమో అంచనా వేసి, వాటినీ సమకూర్చాలి. పట్టణాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలి. పట్టణాల్లో ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల పరిస్థితిని మెరుగుపరచాలి. గుంతలు పూర్తిగా పూడ్చేయాలి. దహన వాటికలు/ఖనన వాటికల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను ఎంపిక చేయాలి. పొదలు, మురికి తుమ్మలను నరికేయాలి. వెజ్/నాన్ వెజ్ మార్కెట్లు ఎన్ని నిర్మించాలో నిర్ణయించుకుని, వాటి కోసం స్థలాలను ఎంపిక చేయాలి. క్రీడా ప్రాంగణాలు, ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయాలి. డంప్ యార్డుల ఏర్పాటు కోసం స్థలాలు గుర్తించాలి. పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలి. మహిళల కోసం ప్రత్యేకంగా షీ టాయిలెట్స్ నిర్మించాలి. వీటి కోసం స్థలాలు గుర్తించాలి. ప్రభుత్వ స్థలాలను టాయిలెట్ల నిర్మాణానికి కేటాయించాలి. వీధులపై వ్యాపారం చేసుకునే వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపించేవరకు వారిని ఇబ్బంది పెట్టొద్దు. పార్కింగ్ స్థలాలు గుర్తించాలి. అవసరమైతే ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పార్కింగు కోసం ఏర్పాటుచేయాలి. పట్టణాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడానికి ఆధునిక పద్ధతులు అవలంభించాలి. ప్రమాద రహిత విద్యుత్ వ్యవస్థ ఉండాలి. వంగిన స్తంభాలు, తుప్పు పట్టిన స్తంభాలు, రోడ్డు మధ్యలోని స్తంభాలు, ఫుట్‌పాత్‌లపై ట్రాన్స్ఫార్మర్లు మార్చాలి. వేలాడే వైర్లను సరిచేయాలి. రాజీవ్ స్వగృహ, అభయహస్తం, బంగారుతల్లి, వడ్డీ లేని రుణం తదితర పథకాల పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి కొనసాగింపుపై తదుపరి నిర్ణయం తీసుకోవాలి. రాజీవ్ స్వగృహ ఇళ్ళను వేలం ద్వారా అమ్మేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడానికి చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన రామకృష్ణారావు, అరవిందకుమార్ సభ్యులుగా అధికారుల కమిటీని నియమించింది. అభయహస్తం పథకం సమీక్ష బాధ్యతను మంత్రి టి.హరీశ్‌రావు, ఐఎఎస్ అధికారి సందీప్ సుల్తానియాలకు అప్పగించింది. తెలంగాణ లోకాయుక్త చట్టంపై తెచ్చిన ఆర్డినెన్సును కేబినెట్ ఆమోదించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో లోకాయుక్త బిల్లు ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించినందుకు అధికార యంత్రాంగాన్ని కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ అభినందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డిలను ప్రత్యేకంగా అభినందించారు. -
కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రగతి భవన్లో జరుగుతోంది. పట్టణ ప్రగతితో పాటు సీఏఏ, ఎన్నార్సీ, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులో వివక్ష తదితర అంశాలు ప్రధాన ఎజెండాగా రాష్ట్ర మంత్రిమండలిలో చర్చ జరగనుంది.అలాగే పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల్లో ఖాళీల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. కాగా, సోమవారం సీఎం కేసీఆర్ 66వ జన్మదినం నేపథ్యంలో కేబినెట్ సమావేశం జరుగుతుండటంతో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
డేట్ 5.. డ్యూటీకి డెడ్‌లైన్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో పనిచేస్తున్న 49 వేల మంది కార్మికుల పొట్టకొట్టి నష్ట పరిచే ఆలోచన ప్రభుత్వానికి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ సాధించిన నాయకుడిగా, సోదరుడిగా చెప్తున్నా.. యూనియన్ల మాయలో పడి బతుకులు ఆగం చేసుకోవద్దు. మీ కుటుంబాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నెల ఐదో తేదీ మంగళవారం రాత్రి 12 గంటల్లోగా విధుల్లో చేరండి.. కుటుంబాలను కాపాడుకోండి. ఉద్యోగాలకు రక్షణ ఉంటుంది. యూనియన్ల మాయలో పడకుండా కార్మికులు ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలి. కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత మంచి అవకాశం చేజార్చుకోవద్దు. మీకు రక్షణ ఉంటుంది’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. అవకాశం ఇవ్వకపోతే తమ తప్పు అని, ఇచ్చినా వినియోగించుకోకపోతే వాళ్ల తప్పు అని వ్యాఖ్యానించారు. కార్మికులు తమ కుటుంబాలు, జీవితాలను రోడ్డున వేయొద్దని.. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విధుల్లో చేరకుంటే మధ్యప్రదేశ్ తరహాలో తెలంగాణ ఆర్టీసీ రహిత రాష్ట్రమవుతుందని స్పష్టంచేశారు. నవంబర్ ఐదో తేదీ అర్ధరాత్రి లోగా కార్మికులు విధుల్లో చేరని పక్షంలో అన్ని రూట్లను ప్రైవేటుపరం చేస్తామని స్పష్టంచేశారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌లో ఐదు గంటల పాటు జరిగిన రాష్ట్ర మంత్రివర్గం భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రంగాలకు చెందిన చిరుద్యోగులను ఆదుకున్న చరిత్ర మాది. ఆర్టీసీ కార్మికులకు కూడా నాలుగేళ్లలో 15శాతం ఫిట్మెంట్తో కలుపుకుని 67శాతం వేతనాలు పెంచాం. ప్రతీ ఒక్కరు గౌరవప్రదంగా బతకాలి. ఎవరి కడుపూ కొట్టకూడదు అనే ఉద్దేశంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఐకేపీ ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఏఓలు తదితరుల జీతాలు పెంచాం. చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆపడం, రైతుల ఆత్మహత్యలు లేకుండా చేసేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం’ అని కేసీఆర్ తెలిపారు. సమ్మె అర్థరహితం... ‘ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె అర్దరహితం, దురహంకారపూరితం, అంతు లేని కోరికలతో జరుగుతున్న సమ్మె. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే అంశంపై కూలంకషంగా చర్చించి.. విలీనం అసాధ్యమని నిర్ద్వంద్వంగా తిరస్కరించడంతో పాటు 5,100 ఆర్టీసీ బస్సులను ప్రైవేటు రంగానికి ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. అందువల్ల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఆర్టీసీలో ప్రస్తుతం 10,400 సర్వీసులు ఉండగా, ఇందులో 2,100 అద్దె బస్సులు ఉన్నాయి. మిగిలిన 8,300 బస్సుల్లో 2,609 బస్సుల కాలం చెల్లి.. ఉపయోగంలో లేవు. రాబోయే 3, 4 నెలల్లో మరో నాలుగైదు వందల బస్సులు కూడా కాలం చెల్లేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి కొని, నడిపే సామర్ద్యం ఆర్టీసీకి లేనందున మొత్తంగా 5,100 బస్సులను ప్రైవేటు ఆపరేటర్లకు ఇస్తాం. ఇప్పటికే ఉన్న 2,100 అద్దె బస్సులు ఇక ఆర్టీసీలో ఉండవు. ప్రజా రవాణాలో లెవల్ ప్లేయింగ్ ఉండటంతో పాటు, బ్లాక్‌మెయిల్‌కు లొంగకుండా, రాష్ట్రం, రాజధాని ప్రతిష్ట దెబ్బతినకుండా చూస్తాం. యాజమాన్యం అదుపాజ్ఞలో పనిచేస్తే మంచి లాభాలు వస్తాయి. లాభాలు వచ్చే రూట్లను ప్రైవేటుకు అప్పగిస్తామనే అపోహలు వద్దు. పల్లెవెలుగు రూట్లను ప్రైవేటుపరం చేస్తాం. లాభదాయం కాని రూట్లను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగిస్తాం. ప్రైవేటుకు అప్పగించాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. తద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ప్రైవేటు ఆపరేటర్లు కూడా సిద్దంగా ఉన్నారు. పండుగలు, పరీక్షల సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా, నగరాల్లో అభివృద్ది జరిగే క్రమంలో రవాణా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కార్మికులు ఐదో తేదీ అర్దరాత్రి లోగా విధుల్లో చేరకుంటే ఆరు, ఏడు తేదీల్లో ఆర్టీసీ భవిష్యత్తు నిర్ణయిస్తాం. ప్రైవేటీకరణ విషయంలో పునరాలోచన లేదు’ అని సీఎం స్పష్టం చేశారు. శనివారం కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు ఈటల రాజేందర్, పువ్వాడ అజయ్‌కుమార్ ప్రభుత్వ, ప్రైవేటు నడుమ లెవల్ ప్లేయింగ్ ‘ప్రభుత్వ, ప్రైవేటు ఆపరేటర్ల నడుమ లెవల్ ప్లేయింగ్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేసిన 2019 మోటారు వెహికిల్ సవరణ చట్టం ఈ ఏడాది నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం నిబంధనల మేరకు 5,100 బస్సులను ప్రైవేటుపరం చేస్తున్నాం. తద్వారా ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ప్రైవేటీకరణపై ఎలాంటి అనుమానాలు వద్దు. ఆరోగ్యకరమైన పోటీ, విస్తృత సౌకర్యాలు అందుబాటులో ఉండాలనే ఈ నిర్ణయం. ప్రైవేటు బస్సులు ప్రభుత్వ నియంత్రణలో నడిచేలా రెగ్యులేటరీ కమిటీ వేస్తాం. ప్రైవేటు ఆపరేటర్లు ఇష్టం వచ్చినట్లు టికెట్ రేట్లు పెంచకుండా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పర్యవేక్షణ ఉంటుంది. జర్నలిస్టులు, విద్యార్థులతో సహా అన్ని వర్గాలకు ఇచ్చే బస్సు పాసులు వంద శాతం చెల్లుబాటవుతాయి. ప్రజలు బాధపడకుండా యథావిధిగా కొనసాగిస్తాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అదే బాట లో మరో 91 చిన్న, పెద్దా ప్రభుత్వ కార్పోరేషన్లు అదే డిమాండును పెడతాయి. కోర్టులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తాయి. అందుకే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని కేసీఆర్ తెలిపారు. బీజేపీ ఎంపీలు క్షమాపణలు చెప్పాలి... ‘బీజేపీకి ఈ రాష్ట్రంలో నలుగురు ఎంపీలు ఉన్నారు. ప్రజల పక్షాన వారిని ప్రశ్నిస్తున్నా. కేంద్రంలో మోటారు వాహన సవరణ చట్టం ఆమోదించినపుడు లోక్‌సభలో మీరు ఉన్నారు కదా. అక్కడ అనుకూలంగా ఓటు వేసి ఇక్కడ డ్రామాలు చేస్తున్నారా. నితిన్ గడ్కరీ పార్లమెంటులో బిల్లు పెట్టినపుడు మీరు అంత పవిత్రులైతే నిరసన తెలపాలి కదా. నైతికత ఉందా.. మీ ప్రభుత్వం చేసిన చట్టంలో భాగస్వాములై ఇక్కడ వీరంగం వేస్తున్నారా? శవాలు మీద పేలాలు ఏరుకునే రకం.. చీప్ పొలిటికల్ టాక్టిక్స్’ అంటూ బీజేపీ ఎంపీల తీరుపై సీఎం మండిపడ్డారు. ‘కార్మికులను రెచ్చగొడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో మీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు ఉమాభారతి, బాబూలాల్ గౌర్ ఆర్టీసీని ప్రైవేటుపరం చేసిన సమాచారం మా దగ్గర ఉంది. ఆర్టీసీ కార్మికుల విషయంలో బీజేపీ ఎంపీలు చేసిన దుర్మార్గాలకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్లాట్ఫారం స్పీచ్‌లు ఎన్నైనా కొట్టొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ఆర్టీసీని విలీనం చేసిందా. మాకు నోరు లేదా.. మేం మాట్లాడలేమా? ఆత్మహత్యలకు మీరే కారకులై ఎవరిని బదనాం చేస్తారు. మీరే నేరస్తులు’ అంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘యూనియన్లు, ప్రతిపక్ష నాయకులే హంతకులు.. పనిచేసి బతికేవాళ్లను సమ్మెకు ఎంకరేజ్ చేసిన వాళ్లే హంతకులు.. బాధ్యత వహించాల్సింది వంద శాతం వాళ్లే. యూనియన్లు పెట్టిన పనికిమాలిన డిమాండ్ల వల్లే ఈ గతి. కార్మికులు బతకాలి. కార్పొరేషన్లను బతికించాలి. ఎటు తీసుకుపోతున్నారో సోయి ఉండాలి. 67 శాతం పెంచినా, 4,700 తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినా.. ఇవేం డిమాండ్లు.. అర్దం ఉందా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘సమ్మె చట్ట విరుద్దమని కార్మిక శాఖ ప్రకటించిన నేపథ్యంలో యజమానికి, కార్మికులకు ఉండే సంబంధాలు తెగిపోయినట్లే. సంస్థ ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. దీంతో 49వేల మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి. అయినా ఆర్టీసీ కారి్మకుల శ్రేయస్సు, సంస్థ మనుగడ దృష్టిలో పెట్టుకోకుండా ఇంకో ఆరు రోజులు అంటూ తొమ్మిదో తేదీ వరకు ఆర్టీసీ కారి్మక సంఘాలు కార్యాచరణ ప్రకటించడం అర్దరహితం’ అని విమర్శించారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం.. ‘రవాణా శాఖ రాష్ట్ర పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూలులో ఉంది. ఆర్టీసీ విషయంలో ఏపీ, తెలంగాణ నడుమ కొంత వివాదం ఉంది. వివాదాస్పద విషయాలను పెండింగులో పెట్టి.. ఎవరి కార్పొరేషన్ వాళ్లు నడుపుకొనేలా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దానిని రెండు ప్రభుత్వాలు నోటిఫై చేశాయి. ఇప్పుడున్నది తెలంగాణ ఆర్టీసీ.. ఆర్టీసీలో తెలంగాణకు 31శాతం వాటా ఉంది. ఆ మేరకు నష్టాలకు సంబంధించిన డబ్బు ఇవ్వాలని కేంద్రాన్ని అడుగుతాం. ఐదేళ్లలో ఎదురైన నష్టాలను పంచుకోమని అడుగుతాం. చేతులు కడుక్కుంటారా, డబ్బులు ఇస్తారా చూస్తాం. ఏపీలో ఆర్టీసీ విలీనం.. ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విలీనం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ రైతుబంధు, రైతు బీమా ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన విధానాలు ఉంటాయి. పాలసీ నిర్ణయాల మీద ప్రభుత్వాన్ని ఎవరూ డిక్టేట్ చేయలేరు. కేబినెట్ నిర్ణయం చెబుతున్నాం. అర్దం చేసుకోలేక పోతే వాళ్ల కర్మ. నేను కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కష్టం, నష్టం రానీయం. కులం, మతం, జాతి ఆధారంగా అన్ని వర్గాల శ్రేయస్సు, రాష్ట్ర భవిష్యత్తు, దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాం. అందు కే 2014లో 63 మందిని గెలిపించగా, 2018లో మాకు మూడింట రెండొంతుల మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 32 జడ్పీలకుగాను అన్ని చోట్లా మా పార్టీ వారినే గెలిపించారు. హుజూర్‌నగర్‌లో మా పార్టీ అభ్యర్థిని బ్రహ్మాండమైన మెజారిటితో గెలిపించి ప్రజలు మా మీద విశ్వాసం ఉంచారు. ఈ తరుణంలో మేం ఏ నిర్ణ యం చేసినా రాష్ట్రం, ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాం. దేశంలో అత్యంత తీవ్ర ఆర్దిక మాంద్యం ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం అలాం టి పరిస్థితి లేకుండా చూస్తున్నాం. ఐదేళ్లలో 21% వృద్ధిరేటుతో ఉన్న తెలంగాణలో ఆర్ధికమాంద్యం మూలంగా వృద్ధిరేటు 5శాతానికి పడిపోయినా.. ఆర్దిక పరిస్థితి నెగటివ్‌లో మాత్రం లేదు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతీ గడపకూ మేలు చేకూరేలా కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల మూలంగా వలసలు లేని రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తున్నాం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హైకోర్టుకు ఆ అధికారం లేదు రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తంచేసిన విషయంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ బదులిచ్చారు. తప్పుడు సమాచారంతో అఫిడవిట్ జారీ చేశారని హైకోర్టు.. ఆర్టీసీ ఎండీపై మండిపడిందని వచి్చన వార్తలను ఆయన తోసిపుచ్చారు. ‘కోర్టు అలా అనలేదు. అనజాలదు. అనడానికి కోర్టుకు కూడా అధికారం ఉండదు. ఎట్ట అంటదండీ. మేం ఫైల్ చేసిన అఫిడవిట్ మీద మాట్లాడాల.. అవతల పక్క అడ్వొకేట్ (ఆర్టీసీ జేఏసీ న్యాయవాది) ఏదో అంటడు. కానీ, కోర్టు అనలేదు. ఆయనెవరో అడ్వొకేట్ తప్పుడు మాటలు మాట్లాడిండు. ఏదో డాక్యుమెంట్ పట్టుకొచ్చి మాట్లాడిండు. అది అంతర్గత డాక్యుమెంట్. మంత్రికిచి్చన ప్రజెంటేషన్ డాక్యుమెంట్ అది. దానిమీద ఏమైనా సంతకం ఉంటదా అండి. హైకోర్టు అంటలేదు. అది ఎవడో అడ్వొకేట్ అంటుండు’ అని కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఉప ఎన్నికలు జరిగిన హుజూర్‌నగర్‌కు రూ.100 కోట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆర్టీసీ కారి్మకుల జీతాలు ఇవ్వడానికి రూ.47 కోట్లు లేవా? అని హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలను కేసీఆర్ తప్పుబట్టారు. ‘అలా కామెంట్ చేయడానికి హైకోర్టుకు కూడా అధికారం లేదు. ప్రభుత్వం కదా డబ్బులిచ్చేది.. ఒక హుజూర్‌నగర్‌కే ఇస్తాదండి? మేము పాలకు కూడా రూ.4 ప్రోత్సాహకం ఇస్తున్నం.. రూ.2 వేలు పింఛన్ ఇస్తున్నం.. రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నం.. వికలాంగులకు రూ.3 వేలు పింఛన్ ఇస్తున్నం. చాలా ఇస్తుంటం.. చాలా ఇస్తం.. ప్రభుత్వం ఒకటి ఇస్తదా? నువ్వు గాడ ఎట్ల ఇచ్చినవ్.. ఈడ ఎట్ల ఇచ్చినవ్.. అలా ఉంటదానండి లెక్క? ఆ పని మాది కదా’ అని కేసీఆర్ ప్రశ్నించారు. విలేకరిపై ఆగ్రహం.. ‘ఎంత ఘోరమైన ఆరోపణ చేస్తున్నావు. ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నావు’ అని ఓ పత్రికా విలేకరిపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మీ దగ్గరి వాళ్లకే అప్పగించడానికి ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయని ప్రశ్నిం చగా, ‘అట్లా ఇస్తామా? మా అంత పారదర్శకంగా ఎవరూ ఉండరు’ అని కేసీఆర్ బదులిచ్చారు. సీఎం ఏకపాత్రాభినయం: రేవంత్ కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో ఏకపాత్రాభినయం చేశారని, ఆయన మాటల్లో అడుగడుగునా అహంకారం, అధికార మదం కొట్టొచ్చినట్లు కనిపించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్‌ది బెదిరింపు ధోరణి: బీజేపీ చట్టబద్ధంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ శనివారం కేబినెట్ భేటీ అనంతరం చేసిన ప్రకటనలు బెదిరింపు ధోరణితో ఉన్నాయని బీజేపీ వ్యాఖ్యానించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ప్రకటన విడుదల చేశారు. చర్చించి స్పందిస్తాం : ఆర్టీసీ కార్మికులు సాక్షి, హైదరాబాద్: సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ఈనెల ఐదో తేదీలోగా విధుల్లో చేరాలని, లేని పక్షంలో వారికి ఆరీ్టసీతో సంబంధాలు పోయినట్టేనన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వాఖ్యల నేపథ్యంలో కారి్మక సంఘాల జేఏసీ ఆదివారం ఉదయం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అందులో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి బెదిరింపు ధోరణితో మాట్లాడినా కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దని, ఆ బెదిరింపులకు లొంగాల్సిన అవసరం లేదని కోకన్వీనర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం సమావేశం తర్వాత కారి్మకులకు సూచనలు చేస్తామని వెల్లడించారు. ఎవరూ విధుల్లో చేరరు ముఖ్యమంత్రి పెట్టిన డెడ్‌లైన్‌ను కార్మికులెవరూ పట్టించుకోరని కారిక సంఘాల జేఏసీ–1 కన్వీనర్ హనుమంతు పేర్కొన్నారు. గతంలో ఇలాగే చెప్పినా ఒక్కరు కూడా చలించని విషయాన్ని గుర్తించాలన్నారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకుంటే విధుల్లో చేరి ప్రయోజనం ఏమిటని, అసలు ఇన్ని రోజులు దీక్షగా నిర్వహించిన సమ్మెకు ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. తాము ఆర్టీసీ పరరక్షణ కోసమే సమ్మె చేపట్టామని, సంఘాల నేతల ప్రయోజనాల కోసం కాదని స్పష్టంచేశారు. ఉన్న రూట్లను ప్రైవేటీకరించి ఇక ఆర్టీసీ లేకుండా చేసే కుట్రకు ఆమోదం తెలుపుతూ కారి్మకులు విధుల్లో ఎలా చేరతారన్నారు. ఐదేళ్లలో 67 శాతం జీతాలు పెంచామన్న సీఎం మాట కూడా అబద్ధమేనని, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రకటించిన ఐఆర్ కలిపే తెలంగాణ ప్రభుత్వం తొలి వేతన సవరణ చేసిందని, వాస్తవంగా తెలంగాణ వచ్చాక పెరిగిన జీతాలు 33 శాతమేనని పేర్కొన్నారు. ఆర్టీసీకి ఇవ్వాల్సిందేమీ లేదు: జీహెచ్ఎంసీ సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి జీహెచ్ఎంసీ చెల్లించాల్సింది ఏమీ లేదని మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. శనివారం జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశానికి హాజరైన ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీకి జీహెచ్ఎంసీ ఎంత ఇవ్వాలో, ఎంత ఇచ్చారో స్పష్టత నివ్వాలని కోరారు. జీహెచ్ఎంసీ నుంచి రూ.1,400 కోట్లకు పైగా రావాల్సి ఉందని చెబుతున్నారన్నారు. ఈ అంశంపై చర్చకు మేయర్ బదులిస్తూ.. ఆర్టీసీకి జీహెచ్ఎంసీ ఇవ్వాల్సింది ఏమీ లేదన్నారు. నిధులివ్వాలనేది మాండేటరీ (తప్పనిసరి) కాదన్నారు. -
ఆర్టీసీ సమ్మె : ‘నవంబర్ 5లోపు విధుల్లో చేరండి’
-
ఆర్టీసీ సమ్మె : ‘నవంబర్ 5లోపు విధుల్లో చేరండి’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 49 అంశాలపై చర్చ జరిగిందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు మీడియాతో అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదని కేబినెట్ నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేశామని చెప్పారు. ఎక్సైజ్ పాలసీతో రూ.975 కోట్ల ఆదాయం కలిసి వచ్చిందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘చరిత్ర ఎవరూ చెరపలేరు. చావు దాకా వెళ్లి వచ్చిన. తెలంగాణ అంటే అమితమైన అభిమానం ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసమే తీసుకుంటాం’అన్నారు. 2100 బస్సులు మూలకు.. 5100 బస్సు రూట్లలో ప్రైవేటు వాహనాలకు అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు. అంతులేని కోరికతో ఆర్టీసి కార్మికులు సమ్మెకు వెళ్లారని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వ లో విలీనం చేయబోయేది లేదని కేసీఆర్ మరోసారి ఉద్ఘాటించారు. ఆర్టీసీలో మొత్తం 10,400 బస్సులు ఉన్నాయని, వాటిలో 8300 బస్సులు ఆర్టీసీ బస్సులు, 2100 అద్దె బస్సులు ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో 2300 మూలకు పడ్డాయని చెప్పారు. చర్చల మధ్యలో సమ్మెకు వెళ్లొద్దని కేసీఆర్ స్పష్టం చేశారు. నవంబర్ 5 లోపు చేరండి.. ఇబ్బంది పెట్టం ‘ఆర్టీసీ కార్మికుల కార్యాచరణ అర్ధరహితమైనది. ప్లాట్ ఫామ్ స్పీచ్ వేరు రియాలిటీ వేరు. కార్మికులు రోడ్డున పడే అవకాశముంది. బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి రావొద్దు. చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీ లేదు. వెస్ట్ బెంగాల్లో బెస్ట్ పద్ధతి ఉంది. ఆర్టీసీ ఉండాలి ప్రైవేటు బస్సులు ఉండాలి. ఆరోగ్య కరమైన పోటీ ఉండాలని నిర్ణయించాం. కేంద్రం తెచ్చిన కొత్త చట్టం ప్రకారం నిర్ణయం తీసుకున్నాం. కార్మికుల ఎడల కఠినంగా లేము. 67 శాతం వేతనాలు పెంచాం. 4260 మందిని రెగులరైజ్ చేశాం. కార్మికుల కడుపు నింపినం. ఎవరి పొట్ట కొట్టలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరు గౌరవ ప్రదంగా గడపాలని కోరుకుంటుంది. చేనేత కార్మికుల ఆత్మహత్యలు నివారించాం. ఆర్టీసీ కార్మికులు మా బిడ్డలే. యూనియన్ల మాయ లో పడి రోడ్డున పడొద్దు. ఆర్టీసీ కార్మికులకు మరో అవకాశం ఇస్తున్నం. వారంతా నవంబర్ 5 లోపు విధుల్లో చేరవచ్చు. భవిష్యత్తు ఉంటది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టము’అన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. ‘ప్రైవేటు బస్సుల నిర్వాహకులు ప్రభుత్వ నియంత్రణలో ఉంటారు. అన్ని పాసులు అమల్లో ఉంటాయి. ఆరోగ్యకరమైన పోటీ కోసమే ఆర్టీసీపై ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాం. కార్మికులు పునరాలోచన చేయాలి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యూనియన్ల బెదిరింపులు ఉండకూడదు. భవిష్యత్తుని కాపాడుకోవాలి. యాజమాన్యం అదుపు ఆజ్ఞాల్లో సిబ్బంది ఉంటే లాభాలు వస్తాయి. ఆర్టీసీకి నష్టదాయకంగా ఉన్న రూట్లు ఇవ్వాలని పలు ట్రాన్స్‌పోర్టు కంపెనీలు కోరుతున్నాయి. ఆర్టీసీ విలీనం అంతటితో ఆగదు 92 సంస్థలు అడుగుతాయి అలాంటి డిమాండ్లే చేస్తాయి. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత మార్పు ఉండదు. కార్మికులు కుటుంబాల్ని రోడ్డున పడేయొద్దు. నవంబర్ 5 వరకు విధుల్లోకి రాకపోతే... మిగతా 5 వేల రూట్లు కూడా ప్రైవేటుకు అప్పగిస్తాం. మా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోం. అవకాశం ఇవ్వకపోతే ప్రభుత్వం తప్పు. అవకాశం చేజార్చుకోవద్దు. నలుగురు బీజేపీ ఎంపీలు అక్కడ బిల్లుకు ఆమోదం చెప్పి... ఇక్కడ వ్యతిరేకించడం ఏమిటి ? శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం చేస్తున్నారు. మధ్య ప్రదేశ్‌లో ఆర్టీసీని రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వమే. బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. చట్టవిరుద్ధంగా సమ్మె చేస్తున్నారు. కార్మికుల చావులకు యూనియన్లు, రాజకీయ పక్షాలే కారణం. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వలేదు పక్షపాతం వహించలేదు. ఆర్టీసీ విలీనం అంశాన్ని ఏపీలో ఎన్నికల హామీ గా ఇచ్చారు. ఇక్కడ అలా హామీ ఇవ్వలేదు’అని ముఖ్యమంత్రి చెప్పారు. -
ఎమ్మెల్యే రేగాకు సీఎం కార్యాలయం నుంచి పిలుపు!
సాక్షి, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు శనివారం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటీన హైదరాబాద్ బయల్దేరారు. మంత్రివర్గ విస్తరణకు ఇంకా జాప్యం జరిగే అవకాశం నేపథ్యంలో ఎమ్మెల్యే కాంతారావును ప్రభుత్వ విప్‌గా నియమించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ విప్‌గా క్యాబినెట్ హోదాలో నియమించనున్నట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతుండగా.. శాసనసభ కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శాసన మండలి, శాసనసభ చీఫ్ విప్ పదవుల భర్తీపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా శాసనసభ కమిటీల వివరాలతోపాటు, చీఫ్ విప్, విప్ల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ శాసనసభ ఏర్పాటై ఎనిమిది నెలలు దాటినా.. బిజినెస్ అడ్వైజరీ కమిటీ మినహా ఇతర కమిటీల నియామకం జరగలేదు. శాసనసభ నిబంధనల ప్రకారం ఆర్థిక, సంక్షేమ, ఇతర రంగాలకు సంబంధించి 19 రకాలైన కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా పబ్లిక్ అకౌంట్స్, అంచనాలు, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలున్నాయి. సంక్షేమ, ఇతర రంగాల కమిటీలను స్పీకర్ నామినేట్ చేస్తారు. ఎంఐఎంకు పీఏసీ చైర్మన్ పదవి? పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మొత్తం 13 మంది సభ్యులకుగాను తొమ్మిది మంది శాసనసభ, నలుగురు శాసన మండలి నుంచి ఎన్నిక అవుతారు. అయితే పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ఇవ్వడం ఆనవాయితీ. 119 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో అధికార టీఆర్ఎస్కు 103 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్ తరఫున 19 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా, 12 మంది చీలిక వర్గం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం హోదాను కోల్పోయింది. ఏడుగురు సభ్యులున్న ఏఐఎంఐఎం అసెంబ్లీలో అతిపెద్ద రెండో పార్టీగా అవతరించింది. ఎంఐఎంకు అధికారికంగా ప్రతిపక్ష హోదా దక్కక పోయినా.. ఆ పార్టీ ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది. మండలి చీఫ్ విప్‌గా పల్లా రాజేశ్వర్‌రెడ్డి? గంగుల కమలాకర్, వినయభాస్కర్, గంప గోవర్దన్, బాజిరెడ్డి గోవర్దన్‌ల పేర్లు చీఫ్ విప్ పదవి కోసం వినిపిస్తున్నాయి. వీరితోపాటు ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, హనుమంతు షిండే, పద్మా దేవేందర్‌రెడ్డి, రేఖా నాయక్, బాల్క సుమన్ కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. మండలి విప్‌గా ఉన్న డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని చీఫ్ విప్‌గా నియమించి, మరో ఎమ్మెల్సీకి విప్‌గా అవకాశం ఇవ్వాలనే యోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న ఎమ్మెల్యేలతో పాటు, సామాజిక వర్గాల సమతుల్యత పాటిస్తూ చీఫ్ విప్, విప్ల నియామకంపై కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చీఫ్ విప్, విప్ పదవుల కోసం పోటీ గత అసెంబ్లీలో చీఫ్ విప్‌గా వ్యవహరించిన కొప్పుల ఈశ్వర్ ప్రస్తుతం సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. గత శాసనసభలో గంప గోవర్దన్ (కామారెడ్డి), గొంగిడి సునీత (ఆలేరు), నల్లాల ఓదెలు (చెన్నూరు) విప్‌లుగా వ్యవహరించారు. ఓదెలు మినహా మిగతా ఇద్దరూ మరోమారు శాసనసభకు ఎన్నికయ్యారు. కాగా శాసన మండలిలో చీఫ్ విప్‌గా వ్యవహరించిన పాతూరు సుధాకర్‌రెడ్డి పదవీ కాలం ఈ ఏడాది మార్చితో ముగిసింది. 2016 ఆగస్టులో మండలి విప్‌లుగా నియమితులైన బోడకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్ రెడ్డి నేటికీ కొనసాగుతున్నారు. -
దసరా తర్వాతే విస్తరణ
సాక్షి, హైదరాబాద్ : సుమారు ఆరు నెలలుగా ఆశావహులంతా ఆతృతగా ఎదురు చూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశం దసరా తర్వాతే కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నర్ బదిలీ, బడ్జెట్ సమావేశాలు, బతుకమ్మ పండుగ తదితరాలు వరుసగా వస్తుండటంతో పండుగ తర్వాతే విస్తరణ ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నట్లు తెలిసింది. మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించాలనే అంశంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతమున్న మంత్రివర్గంలో పెద్దగా మార్పుచేర్పులు లేకుండా మరో నలుగురు లేదా ఐదుగురికి అవకాశం లభించే సూచనలు ఉన్నాయి. మంత్రివర్గంలో సామాజికవర్గాల సమ తౌల్యత పాటిస్తూ మంత్రివర్గ కూర్పుపై కేసీఆర్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభమై మూడో వారం వరకు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు ఈఎస్ఎల్ నరసింహన్ స్థానంలో రాష్ట్రానికి కొత్త గవర్నర్‌ను కేంద్రం నియమించింది. కొత్త గవర్నర్ బాధ్యతలు స్వీకరించే తేదీపై త్వరలో స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లోగా మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేటీఆర్, హరీశ్ బెర్తులపైనే ఆసక్తి.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి హరీశ్‌రావుకు తిరిగి మంత్రివర్గంలో చోటు కల్పించడంపై టీఆర్ఎస్లో అంతర్గతంగా కొంత స్పష్టత రావాల్సి ఉంది. కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు ఇప్పటికే కేబినెట్ హోదాలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిని అప్పగించారు. అదే సామాజికవర్గం నుంచి ఇప్పటికే సీఎం కేసీఆర్‌తోపాటు ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే హరీశ్‌రావుకు చోటు కల్పించకుండా తాను ఒక్కడినే మంత్రివర్గంలో చేరితో విమర్శలు వస్తాయనే భావన కేటీఆర్‌లో ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ వద్ద కూడా కేటీఆర్ ప్రస్తావించినట్లు తెలిసింది. దీంతో మంత్రివర్గంలో హరీశ్‌రావు చేరిక అంశం కొలిక్కి వస్తేనే విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే దసరా తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌కు బెర్తులు ఖాయమైనట్లు సమాచారం. కాగా, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ శనివారం తన కుమార్తె, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితతో కలసి కేటీఆర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. పురపాలనలో సమూల ప్రక్షాళన కోసం రూపొందించిన నూతన పురపాలక చట్టాల బిల్లును ఆమోదించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ భేటీ నిర్వహిస్తున్నారు. పురపాలనలో అవినీతి నిర్మూలన, నాణ్యమైన పౌర సేవలను అందుబాటులో తీసుకొచ్చేందుకు కొత్తగా మున్సిపాలిటీల చట్టం, మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం, జీహెచ్ఎంసీ చట్టం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం, టౌన్‌ప్లానింగ్ చట్టాల ముసాయిదాను కేసీఆర్ తయారు చేయించారు. ఈ చట్టాలకు సంబంధించిన బిల్లును బుధవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించనుంది. మరుసటి రోజు, అనగా ఈ నెల 18న రాష్ట్ర శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి 19న ఆమోదించనున్నారు. ఈ మేరకు ఈ నెల 18, 19 తేదీల్లో ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం తెలిసిందే. కొత్త పురపాలక చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత వచ్చే నెల తొలివారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. పీఆర్సీ కోసం ఉద్యోగుల నిరీక్షణ... కొత్త పీఆర్సీ లేదా మధ్యంతర భృతి అమలు, పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంపు హామీల అమలు కోసం ఉద్యోగులు చాలా రోజుల నుంచి నిరీక్షిస్తున్నారు. పీఆర్సీ, పదవీ విరమణ వయస్సు పెంపు తదితర అంశాలపై బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రభుత్వం సానుకూల ప్రకటన చేసే అవకాశముందని ఉద్యోగులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ అంశాలపై ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు నిర్వహించి తదుపరి మంత్రివర్గ భేటీలో ఓ నిర్ణయం తీసుకుంటామని గత నెల 18న జరిగిన మంత్రివర్గ భేటీ అనంతరం ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలా? లేదా ఆలోగా మధ్యంతర భృతి చెల్లించాలా? అన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. ఈ రెండు విషయాలపై ముఖ్యమంత్రి సానుకూలతతో ఉన్నారని సంఘాల నాయకులు పేర్కొనడంతో ఉద్యోగవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. సచివాలయం తరలింపునకు పచ్చజెండా... మంత్రివర్గ భేటీలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జరుగుతున్న సంప్రదింపుల్లో పురోగతిపై సైతం చర్చించనున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కొత్త సచివాలయం, శాసనసభ భవనాలు నిర్మిం చాలని గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోగా, తాజా భేటీలో సచివాలయ కార్యాలయాల తరలింపుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. బూర్గుల రామకృష్ణారావు భవన్‌కు సచివాలయ కార్యాలయాలను తరలించేందుకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, రుణ ఉపశమన కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును సైతం ఈ సమావేశంలో ఆమోదించనున్నారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. -
మూడో టీఎంసీకి ‘పైప్‌లైన్’ క్లియర్
సాక్షి, హైదరాబాద్ : బహుళార్ధ సాధక ప్రాజెక్టు కాళేశ్వరంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేలా పనులు కొనసాగిస్తున్న ప్రభుత్వం, కొత్తగా మూడో టీఎంసీ నీటిని తీసుకునే ప్రణాళికకు అంగీకారం తెలిపింది. మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో అదనంగా మరో టీఎంసీ తీసుకునే ప్రణాళికను ఆమోదించడమే కాకుండా, దానికయ్యే వ్యయ అంచనాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పైప్‌లైన్ వ్యవస్థ ద్వారానే నీటిని తీసుకునేలా రూపొందించిన ప్రణాళికకు ఓకే చెప్పింది. దీంతో పాటే ఇప్పటికే నిర్మాణంలో ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో అదనపు మోటార్ల ఏర్పాటుకయ్యే అదనపు వ్యయాల అంచనాలను సమ్మతించింది. (చదవండి : కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుదోవ పట్టించొద్దు ) మిడ్‌మానేరు దిగువన పైప్‌లైన్ ద్వారానే.. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు 2టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా పనులు చేస్తున్నారు. దీనిలో భాగంగా మేడిగడ్డ పంప్‌హౌస్ వద్ద 11, అన్నారం వద్ద 8, సుందిళ్ల వద్ద 9 మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మూడో టీఎంసీ నీటిని తీసుకునేందుకు వీటికి అదనంగా 3 పంప్‌హౌస్‌ల్లో కలిపి మరో 15 మోటార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పడున్న వాటితో కలిపి అదనంగా మేడిగడ్డలో 6, అన్నారంలో 4, సుందిళ్లలో 5 మోటా ర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ అదనపు మోటార్ల ఏర్పాటుతో పాటు, వాటికి అనుగుణంగా పలు నిర్మాణాలు చేయాల్సి ఉండటంతో వ్యయం పెరుగుతోంది. గత అంచనా 3 పంప్‌హౌస్‌లకు కలిపి రూ.7,998 కోట్లు ఉండగా, ప్రస్తుతం అది రూ.12,392కోట్లకు చేరుతోంది.ఈ పెరిగిన వ్యయాలకు కేబినెట్ ఓకే చెప్పింది. ఇక మిడ్‌మానేరు దిగువన మల్లన్నసాగర్ వరకు మొదట టన్నెల్ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించినా, దీని నిర్మాణాలకు చాలారోజులు పడుతున్న నేపథ్యంలో పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నీటి తరలింపునకు 3 స్థాయిల్లో లిఫ్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిలో మిడ్‌మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్ వరకు పైప్‌లైన్ వ్యవస్థ నిర్మాణానికి రూ.4,142 కోట్లు, అనంతగిరి నుంచి మల్లన్నసాగర్ వరకు పైప్‌లైన్ నిర్మాణానికి రూ.10,260 కోట్లు అవుతుందని అంచనా వేశారు. మొత్తంగా ఈ నిర్మాణానికి రూ.14,362 కోట్ల మేర వ్యయం అవుతుండగా, దీనికి ఆమోదం తెలిపిన కేబినెట్ వచ్చే ఏడాది నాటికి ఈ పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. పాలమూరు రుణాలు.. ఎస్ఎల్బీసీ.. ఎస్సారెస్పీ కాల్వలు.. వీటితో పాటే కేబినెట్ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.10 వేల కోట్లు రుణాలు తీసుకునేందుకు కేబినెట్ అనుమతినిచ్చింది. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే ఈ రుణాల సేకరణ జరుగనుంది. ఇక దీంతో పాటే ఎస్సారెస్పీ స్టేజ్–2లో కాల్వల లైనింగ్ పనుల కోసం రూ .653 కోట్ల కేటాయింపునకు సైతం ఓకే చెప్పింది. అలాగే ఏఎంఆర్పీ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనుల సత్వర పూర్తికి రూ.63.50 కోట్ల అడ్వాన్సులు కోరగా దానికి సమ్మతించింది. దీంతో పాటే కొత్తగా గొలుసుకట్టు చెరువుల అనుసంధానానికి వీలుగా తూములు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయాలని నిర్ణయించి, పనులు సైతం మొదలు పెట్టగా, ఆ పనులను చేపట్టేందుకు అంగీకారం తెలిపింది. -
‘రిటైర్మెంట్’ పెంపు.. ఐఆర్‌పై చర్చ
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం కీలక కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో జరిగే మంత్రివర్గ భేటీలో వివిధ ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుంది. చాలా రోజుల తర్వాత జరుగుతున్న మంత్రివర్గ సమావేశం కోసం ప్రభుత్వం భారీ అజెండాను సిద్ధం చేసినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించడానికి ఫిబ్రవరి 22న చివరిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు జరగడంతో దాదాపు 9 నెలలుగా రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో స్తబ్దత నెలకొంది. పలు కీలక అంశాలపై ప్రభుత్వ నిర్ణయాలు వాయిదా పడ్డాయి. తాజాగా మంగళవారం నిర్వహిస్తున్న మంత్రివర్గ సమావేశం ముందు పెండింగ్ ప్రతిపాదనలతోపాటు కొత్త ప్రతిపాదనలను ఉంచాలని ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి డజనుకుపైగా అంశాలను ప్రభుత్వం మంత్రివర్గం ముందు ఉంచబోతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం పెంపు, ఈ ప్రాజెక్టు ద్వారా అదనంగా మరో టీఎంసీ నీరు తరలింపు, ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణ తదితర ప్రధాన అంశాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని 22 కొత్త జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం భూముల కేటాయింపు ప్రతిపాదనలను ప్రభుత్వం కేబినెట్ ముందుంచనుంది. అలాగే రుణ ఉపశమన కమిషన్ చట్ట సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించే అవకాశాలున్నాయి. ఇక కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన పూర్తికాకపోవడంతో ఈ కేబినెట్ సమావేశంలో పెట్టే అవకాశం లేకుండా పోయింది. కొత్త మున్సిపల్ చట్టం సిద్ధమైనా మంత్రివర్గ సమావేశంలో పెట్టడం లేదని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వం నుంచి చివరి నిమిషంలో పిలుపు వస్తే కొత్త మున్సిపల్ చట్టాలను కేబినెట్ ముందు ఉంచి ఆమోదించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శారదా పీఠానికి కోకాపేటలో 2 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవన్నీ కేబినెట్ ఎజెండాలో ఉండబోతున్నాయి. రిటైర్మెంట్ వయసు పెంపుపై ప్రకటన! ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలను ప్రభుత్వం మంత్రివర్గ సమవేశంలో చర్చించి కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలా లేక ఫిట్మెంట్ వర్తింపజేయాలా అనే అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చనే చర్చ జరుగుతోంది. ఇటీవల ఏపీ మంత్రివర్గం సమావేశమై అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతిని చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరి దృష్టి మంగళవారం జరగనున్న కేబినెట్ భేటీపై కేంద్రీకృతమై ఉంది. మధ్యంతర భృతితోపాటు శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచే అంశంపై మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రభుత్వం ఓ ప్రకటన చేసే అవకాశముందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మధ్యంతర భృతి ప్రకటన/పీఆర్సీ అమలులో జాప్యంపట్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్ల జేఏసీ కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై మంత్రివర్గంలో తప్పకుండా చర్చించవచ్చని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. మధ్యంతర భృతి చెల్లింపు, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే సీఎం కేసీఆర్ కసరత్తు చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. -
తెలంగాణ కేబినెట్: ఇద్దరు మహిళలకు అవకాశం
-
ఒకరికి కాదు ఇద్దరికి అవకాశం.. కేసీఆర్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: గత హయాంలోని తెలంగాణ తొలి కేబినెట్లో మహిళలకు అవకాశం లభించని విషయం తెలిసిందే. ఈ విషయంలో విమర్శలు వచ్చినా.. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. ఈసారి మొదటి విస్తరణలోనూ కేబినెట్లో మహిళకు అవకాశం దక్కలేదు. గత మంగళవారం 10మంది మంతులతో కేబినెట్‌ను కేసీఆర్ విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హయాంలోనైనా మహిళా మంత్రులు ఉంటారా? అసలు కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు మంత్రులుగా అవకాశం ఇస్తుందా? అన్న చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విషయమై ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్పష్టత నిచ్చారు. కేబినెట్లో ఇద్దరు మహిళలకు అవకాశం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కేబినెట్లో మహిళకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరగా.. ఒక్కరికి కాదు ఇద్దరికి అవకాశం ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. మహిళలు అధికంగా ఓట్లు వేయడంతోనే తాము భారీ అధిక్యంతో అధికారంలోకి వచ్చామన్నారు. -
బడ్జెట్ టైం
-
నేడే బడ్జెట్
సాక్షి, హైదరాబాద్ : 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబం ధించి తెలంగాణ తాత్కాలిక బడ్జెట్ శుక్రవారం అసెంబ్లీ ముందుకు రానుంది. ఆర్థికశాఖ సైతం తనవద్దే ఉండటంతో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జె ట్ను ప్రవేశపెట్టనున్నారు. ఓ ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం తెలంగాణలో ఇదే తొలిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంలుగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి, కొణిజేటి రోశయ్య ఆర్థికశాఖ బాధ్య తలను స్వయంగా పర్యవేక్షించడంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1964 నుంచి 1971 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవీకాలంలో ఒకసారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టగా.. కొణిజేటి రోశయ్య 2010–11 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కాగా, వైద్య–ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్ట నున్నారు. ఉభయ సభల్లో వేర్వేరుగా శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీల అమలు దిశగా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆర్థికశాఖ ఉన్నతాధి కారులు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న, చేయబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించేలా తాత్కాలిక బడ్జెట్ ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు ఆర్థికశాఖ అధికారులు బడ్జెట్ తుది అంకెలను గురువారం ఖరారు చేశారు. ప్రస్తుతం 4 నెలల కాలానికే బడ్జెట్ ఆమోదం తెలుపుతున్నా ఏడాది మొత్తానికి బడ్జెట్ లెక్కలను సిద్ధం చేశారు. 2018–19లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,74,453 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. సాధారణంగా గత బడ్జెట్‌తో పోల్చితే 15% పెంపుతో కొత్త బడ్జెట్ ఉంటుంది. ఆసరా పింఛన్లు, రైతుబంధు చెల్లింపుల పెంపు, నిరుద్యోగ భృతి, రుణమాఫీ వంటి కీలక హామీల అమలు కోసం ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు జరగనున్నాయి. హామీల అమలుకు ప్రాధాన్యం అభివృద్ధిని కొనసాగిస్తూనే సంక్షేమ పథకాలను విస్తరిస్తామని అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పేర్కొంది. ఆసరా పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే వికలాంగుల పింఛన్లను రూ.1,500 నుంచి రూ.3,016 వరకు పెంచడంతోపాటు మిగిలిన అన్ని రకాల ఆసరా పింఛన్లను రూ.1,000 నుంచి రూ.2,016 వరకు పెంచుతామని, బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ తేదీని 2018 వరకు పొడిగిస్తామని, వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పేర్కొంది. రైతుబంధు ఆర్థిక సాయాన్ని రూ.10 వేలకు పెంచుతామని, లక్ష రూపాయల పంట రుణమాఫీ, రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవభృతి, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకాన్ని కొనసాగిస్తూనే సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణానికి 5 నుంచి 6 లక్షల రూపాయల సాయం, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంపు వంటి హామీలనూ టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు హామీ వల్ల నిరుద్యోగుల్లో అసంతృప్తి తలెత్తకుండా చూసేందుకు ఉద్యోగ నియామక వయోపరిమితిని మూడేళ్లు పెంచనున్నట్లు తెలిపింది. పింఛనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు సముచితమైన రీతిలో వేతనసవరణపై నిర్ణయం తీసుకుంటామని, నిరుద్యోగ సోదరులకు నెలకు రూ.3016 భృతి చెల్లిస్తామని ప్రకటించింది. ఉద్యోగుల విషయంలో బడ్జెట్ ప్రసంగంలోనే సీఎం స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలక్పొడం, ఐకేపీ ఉద్యోగులను పర్మినెంటు చేసి, ఈ యూనిట్ల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతో కలిపి ఐకేపీ ఉద్యోగులకు అప్పగించడం, ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్రాభివద్ధికి ప్రత్యేక పథకాలు రూపకల్పన, రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్‌తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు, వివిధ కులాల కేటగిరీ మార్పు కోసం వచ్చిన విజ్ఞాపనలను సానుభూతితో పరిశీలిన, కంటి వెలుగు పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు. ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసి, తెలంగాణ రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన తదితర అంశాలను టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచారు. వీటి అమలు దిశగా తాత్కాలిక బడ్జెట్లో కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. జీఎస్టీ బిల్లుకు ఆమోదం సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ తాత్కాలిక బడ్జెట్‌కు ఆమోదముద్ర వేశారు. విస్తరణ తర్వాత జరిగిన మంత్రివర్గం ఈ తొలి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పద్దులకు, అనుబంధ గ్రాంట్లకు ఆమోదం తెలిపారు. వార్షిక బడ్జెట్‌తోపాటు అనుబంధ గ్రాంట్లను సభలో ప్రవేశపెట్టనున్నారు. వస్తు సేవల పన్నుల (జీఎస్టీ) చట్టానికి గతంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన బిల్లును మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాల్లోనే దీన్ని ప్రవేశపెట్టనున్నారు. కొత్త మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తొలిసారి కేబినెట్ భేటీలో పాల్గొన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బడ్జెట్‌ను అధ్యయనం చేసేందుకు వీలుగా శనివారం ఉభయ సభలకు సెలవు ఉంటుంది. బడ్జెట్‌పై ఆదివారం ఉభయసభల్లో చర్చ జరుగుతుంది. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలుపుతుంది. దీంతో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. -
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి గురువారం తొలిసారిగా సమావేశమైంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఈ భేటీలో కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సప్లిమెంటరీ డిమాండ్స్‌ను కూడా ఆమోదించింది. జీఎస్టీ చట్టానికి అనుగుణంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రగతి భవన్లో జరిగిన కేబినెట్ భేటీకి మంత్రులు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీలో సీఎం కేసీఆర్, శాసనమండలిలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా 10మంది మంత్రులు మంగళవారం ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీంతోసీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీతో కలుపుకొని కేబినెట్ సభ్యుల సంఖ్య 12కు చేరుకుంది. -
హామీల అమలు దిశగా..
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల అమలుదిశగా సీఎం కేసీఆర్ బడ్జెట్‌ను రూపొందించారు. అభివృద్ధి, సంక్షేమం ప్రధాన లక్ష్యాలుగా బడ్జెట్ రూపకల్పన పూర్తయింది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు కేసీఆర్ అసెంబ్లీలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ అయినా కేంద్ర ప్రభుత్వం తరహాలోనే పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిపే అవకాశం ఉందని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఆర్థికశాఖ తన వద్దే ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత నాలుగేళ్లలాగే ఈసారీ భారీ బడ్జెట్‌కు రూపకల్పన జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం కానున్న కేబినెట్ తాత్కాలిక బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. తాత్కాలిక బడ్జెట్ అయినా 12 నెలలకు అవసరమైన అంచనాలను బడ్జెట్లో పొందుపరిచినట్లు తెలిసింది. సంక్షేమానికి భారీగా... ‘ఆదాయం పెంచాలి. సంక్షేమం పంచాలి’నినాదంతో సంక్షేమ రంగానికి ఈసారీ భారీగా కేటాయింపులు జరపనుంది. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు గతంలో కంటే ఈసారి కేటాయింపులు పెంచనుంది. ఆసరా పింఛన్లలో కొత్త విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి పెరిగిన పింఛన్‌ను చెల్లించనుంది. ఈ నేపథ్యంలో ఆసరా పథకానికి కేటాయింపులు భారీగా పెరగనున్నాయి. రాష్ట్రంలో ఆసరా పింఛన్ లబ్ధిదారులు 40లక్షల మంది ఉన్నారు. వయస్సు పరిమితి తగ్గించడం, పెన్షన్ మొత్తాన్ని రెట్టింపు చేస్తుండడంతో కేటాయింపులు సైతం రెట్టింపు కానున్నాయి. కొత్తగా 7లక్షల మందికి పింఛను చెల్లించాలని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఆసరా పథకానికి అత్యధిక మొత్తంలో నిధుల కేటాయింపులు ఉండనున్నాయి. నిరుద్యోగభృతి, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పథకంలో మార్పులు, ఎస్సీ–ఎస్టీ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్లో వీటిని ప్రస్తావించడంతోపాటు అవసరమైన నిధుల కేటాయింపులు ఉండనున్నాయి. -
మంత్రులుగా ప్రమాణ స్వీకారం
-
ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ టీమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా పది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ వారితో ప్రమాణం చేయించారు. జాతీయ గీతాలాపన అనంతరం మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఒక్కొక్కరిని సభా వేదికపైకి పిలిచారు. ప్రమాణం స్వీకారం చేసిన వారు వరుసగా మొదటగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. తలసాని అనంతరం సూర్యాపేట ఎమ్మెల్యే, గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. జగదీష్ రెడ్డి ప్రమాణం చేసిన అనంతరం టీఆర్ఎస్ సీనియర్ నేత, గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణం చేసిన ఈటల రాజేందర్ ప్రమాణం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ప్రాతినిథ్యం వహించిన ఈయన పార్టీ ఎల్పీ నేతగా పనిచేశారు. తొలి సారి వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ఆరు సార్లు ధర్మపురి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేశారు. తొలి మంత్రివర్గ విస్తరణలో ఏకైక ఎస్సీ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ నిలిచారు. పాలకుర్తి ఎమ్మెల్యే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఈయన తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల నాయకుడిగా పనిచేశారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. చివరగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఆయన మల్కజ్గిరి ఎంపీగా పనిచేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌లతో కలిసి కొత్త మంత్రులు ఫోటోలు దిగారు. -
‘మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదు’
సాక్షి, హైదరాబాద్: తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన సీఎం కేసీఆర్‌కు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదని, కేసీఆర్‌కు ఎప్పటికీ విధేయత కలిగివుంటానని అన్నారు. చిన్నప్పటి నుంచి పేదల కోసం కష్టపడి పనిచేసినట్టు వెల్లడించారు. తనకు మంత్రి పదవి దక్కడమే ఎక్కువని, ఏ శాఖ అప్పగించినా సమర్థవంతంగా పనిచేస్తానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపతానని, బంగారు తెలంగాణ సాధనకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. అదృష్టంగా భావిస్తున్నా: నిరంజన్ రెడ్డి కేసీఆర్‌తో పనిచేయడం తన అదృష్టమని ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి అన్నారు. తొలిసారి గెలిచినా తనను మంత్రిని చేశారని సంతోషం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ తనకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఆ అనుభవం మంత్రిగా పనిచేయడానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. (నేడే కేసీఆర్ కేబినెట్ విస్తరణ) కేసీఆర్‌కు స్పష్టత ఉంది: జగదీశ్‌రెడ్డి రెండోసారి మంత్రి కావడం ఆనందంగా ఉందని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఏ బాధ్యత ఇచ్చిన సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. ప్రజలకు, పార్టీకి విధేయుడిగా పనిచేస్తానన్నారు. నల్గొండలో టిఆర్ఎస్ జెండా ఎగరడం లో తమ వంతు కృషి చేశానని, ఈ అంశం కూడా మంత్రి పదవి రావడానికి దోహదపడిందన్నారు. గతంలో తాను నిర్వహించిన విద్యుత్ శాఖ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నట్టు వెల్లడించారు. అనేక సమీకరణాలతో మంత్రి వర్గాన్ని విస్తరించారని, ఎవరి సేవలను ఎక్కడ ఉపయోగించుకుకోవాలనే దానిపై సీఎం కేసీఆర్‌కు స్పష్టత ఉందన్నారు. -
భావోద్వేగానికి లోనైన ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: తనకు మంత్రి పదవి దక్కడంపై ఎర్రబెల్లి దయాకర్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను అందరిని కలుపుకొని వెళ్తానని, జిల్లా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పారు. ‘ఎన్టీఆర్ నాకు మంత్రి పదవి ఇస్తానని అన్నారు కానీ లక్ష్మీపార్వతి వల్ల రాలేదు. చంద్రబాబు నన్ను మంత్రిని చేస్తానని మాటతప్పారు. కేసీఆర్ నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వరంగల్ జిల్లాకు పెండింగ్ లో ఉన్న రింగ్ రోడ్డు, టెక్స్ టైల్ పార్కు, ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తేచ్చేందుకు కృషిచేస్తా. సీనియర్ నాయకులు కడియం శ్రీహరి, చందూలాల్, మధుసూదనాచారిలను కలుపుకొని వారి అనుభవంతో ముందుకు వెళతా. వరంగల్ ఉద్యమకారులు, టీఆర్ఎస్ శ్రేణులకు అండగా ఉంటాన’ని ఎర్రబెల్లి అన్నారు. అరుదైన గౌరవమని: కొప్పుల ఈశ్వర్ తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా చోటు దక్కడం ఆనందంగా ఉందని కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఉద్యమ నాయకుడిగా తనకిది అరుదైన గౌరవమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన మీద పెట్టిన నమ్మకాన్ని నెరవేరుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి జవాబుదారిగా పనిచేస్తానని చెప్పారు. (నేడే కేసీఆర్ కేబినెట్ విస్తరణ) కేసీఆర్‌కు కృతజ్ఞతలు: ఇంద్రకరణ్ రెడ్డి తనపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇంద్రకరణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మొదటి ఐదేళ్లలో కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. బంగారు తెలంగాణ కల సాకారం చేసేందుకు సమిష్టిగా పనిచేస్తామన్నారు. కార్యకర్తల కృషి వల్లే తనకు మంత్రి పదవి దక్కిందన్నారు. నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ముఖ్యమంత్రి తనకు ఏ శాఖ అప్పగించిన శిరసావహిస్తానని స్పష్టం చేశారు. -
విధేయతకు పట్టం
సీఎం కేసీఆర్ విధేయతకు పట్టం కట్టారు. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయం చేశారు. సీఎం నేరుగా జగదీశ్‌రెడ్డికి ఫోన్ చేసి మంత్రి పదవి ఇస్తున్న విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. మంగళవారం మిగతా మంత్రులతో పాటు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయన రెండో సారి మంత్రి పదవి చేపడుతున్నారు. సాక్షిప్రతినిధి, సూర్యాపేట: టీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా జగదీశ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని ఆయనకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసిన తర్వాత అధికారుల నుంచి కూడా ఫోన్ వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేట నియోజకవర్గం నుంచి జగదీశ్‌రెడ్డి 2014 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. అప్పట్లో ఉమ్మడి జిల్లా నుంచి ఆయన ఒక్కడికే మంత్రి వర్గంలో చోటు దక్కింది. ఉమ్మడి జిల్లాలో పార్టీతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయనదే పై చేయి అయింది. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరినా ఉమ్మడి జిల్లా నుంచి జగదీశ్‌రెడ్డికే సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిచ్చారు. సీఎం జిల్లాకు ఎప్పుడు వచ్చినా జగదీశ్‌రెడ్డి ముందుండి కార్యక్రమాలు నడిపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మది స్థానాల్లో ఆపార్టీ విజయఢంకా మోగించడం, సూర్యాపేట నుంచి జగదీశ్‌రెడ్డి విజయంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. నేతలు, పార్టీ శ్రేణుల ప్రచారాన్ని వాస్తవం చేస్తూ సీఎం మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన అనుచరగణం ఆనందంలో మునిగింది. ఉద్యమం నుంచి గులాబీ బాస్ వెన్నంటే.. ఉద్యమం నుంచి జగదీశ్‌రెడ్డి గులాబీ బాస్ కేసీఆర్‌కు వెన్నంటే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ్యుల్లో ఒకడిగా ఉండడంతో తొలి నుంచి కేసీఆర్ ఆయనకు గుర్తింపునిచ్చారు. పలు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు ఆయన ఇన్చార్జిగా వ్యవహరించారు. తొలి సారి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో తొలి విద్యాశాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆతర్వాత విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో పని చేశారు. విద్యుత్ శాఖ ఆయనకు అప్పగించిన తర్వాతే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందించింది. అంతేకాకుండా దామరచర్ల, పాల్వంచ, మణుగూరులో నూతనంగా విద్యుత్ ప్లాంట్లు మంజూరయ్యాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడంతో ప్రభుత్వం సాధించిన ఘనతలో జగదీశ్‌రెడ్డికి సీఎం కేసీఆర్ నుంచి ప్రశంసలు అందాయి. ఇలా అన్నింటా కేసీఆర్‌కు అనుంగు నేతగా ఉన్న ఆయనకు మంత్రి పదవి దక్కింది. ప్రమాణస్వీకారానికి తరలుతున్న నేతలు.. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో జరగనుంది. అయితే జగదీశ్‌రెడ్డికి సీఎం నుంచి మంత్రి పదవిపై ఫోన్ రావడంతో జిల్లాలోని ఆపార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు అభినందనలు తెలిపారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ఆయన వెంటే ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఆయనను అభినందించడానికి జిల్లా నుంచి తరలివెళ్తున్నారు. జగదీశ్‌రెడ్డి బయోడేటా పేరు : గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తండ్రి : చంద్రారెడ్డి తల్లి : సావిత్రమ్మ భార్య : సునీత కుమారుడు : వేమన్‌రెడ్డి కూతురు : లహరి పుట్టినతేదీ : 18.07.1965 స్వగ్రామం : నాగారం (నాగారం మండలం) విద్యార్హత : బీఏ, బీఎల్ 27.04.2001 టీఆర్ఎస్ ఆవిర్భావ సభ్యులు 2001 సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి, సిద్దిపేట ఉప ఎన్నికల ఇన్చార్జి 2002 మహబూబ్‌నగర్ పాదయాత్ర ఇన్చార్జి (జల సాధన 45 రోజుల కార్యక్రమం. పాదయాత్ర ఆలంపూర్ నుంచి ఆర్డీఎస్ వరకు..) 2003 మెదక్ ఉప ఎన్నికల ఇన్చార్జి 2004 సిద్దిపేట ఉప ఎన్నికల ఇన్చార్జి (హరీష్‌రావు ఎన్నిక) 2005 సదాశివపేట మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి 2006 కరీంనగర్ ఎంపీ ఉప ఎన్నికల ఇన్చార్జి 2008 ముషీరాబాద్, ఆలేరు ఉప ఎన్నికల ఇన్చార్జి, మెదక్ జిల్లా ఇన్చార్జి 2009లో హుజూర్నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ 2013లో నల్లగొండ జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి 2014లో సూర్యాపేట నుంచి పోటీ .. విజయం తెలంగాణలో తొలి విద్యాశాఖ మంత్రి ఆతర్వాత విద్యుత్‌శాఖ , ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి 2108 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలు.. సూర్యాపేట నుంచి విజయం -
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా ఐకే రెడ్డికి చాన్స్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక్కరికే అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. సీనియారిటీ, విధేయతను ప్రామాణికంగా తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో ఈ విడత నిర్మల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి(ఐకే రెడ్డి)కి అవకాశం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉన్నత విద్యావంతుడు, సీనియర్ రాజకీయవేత్త అయిన ఐకే రెడ్డికి ఈసారి కేబినెట్లో కీలకమైన శాఖను కట్టబెట్టే అవకాశం ఉంది. జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, బీసీ నాయకుడు జోగు రామన్నకు రిక్తహస్తం ఎదురుకానుంది. ఈసారి కేబినెట్లోకి పరిమిత సంఖ్యలోనే మంత్రులను తీసుకొని, పార్లమెంటు ఎన్నికల తరువాత మలిదఫా విస్తరణ ఉంటుందని సంకేతాలు వచ్చిన నేపథ్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ఐకే రెడ్డి ఒక్కరికే అవకాశం లభిస్తుందని స్పష్టమవుతోంది. గత ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లపాటు రాష్ట్ర న్యాయ, దేవాదాయ, గృహ నిర్మాణ శాఖలకు మంత్రిగా వ్యవహరించిన ఇంద్రకరణ్‌రెడ్డికి మరోసారి పదవి లభించనుందని స్పష్టం కావడంతో ఆయన వర్గీయులు, టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌కు విధేయుడు... రాజకీయ యోధుడు ఐకే రెడ్డి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి బలమైన నాయకుడు. 1984 నుంచే రాజకీయాల్లో ఉన్న ఆయన జిల్లా పరిషత్ చైర్మన్, శాసనసభ, పార్లమెంటు సభ్యులుగా సేవలు అందించారు. 2014 ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అనూహ్య విజయం సాధించిన ఐకే రెడ్డి గెలిచిన వెంటనే టీఆర్ఎస్లో చేరి మంత్రిగా నాలుగున్నరేళ్లు కొనసాగారు. మంత్రిగా అందరికీ అందుబాటులో ఉంటారని పేరున్న ఐకే రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విధేయుడిగా పేరొందారు. 2018 ఎన్నికల్లో నిర్మల్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డిపై 9వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 10 స్థానాలకు 9 చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించినప్పటికీ, ముఖ్యమంత్రి ఐకే రెడ్డికే అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. పేరు: అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తల్లిదండ్రులు: చిన్నమ్మ–నారాయణరెడ్డి భార్య: విజయలక్ష్మి పిల్లలు: కుమారుడు గౌతంరెడ్డి, కోడలు దివ్యారెడ్డి, కూతురు పల్లవిరెడ్డి, అల్లుడు రంజిత్‌రెడ్డి పుట్టినతేది: 16.02.1949 విద్యార్హత: బీకాం, ఎల్ఎల్బీ రాజకీయ అనుభవం: 1987లో జెడ్పీచైర్మన్‌గా, 1991–96 ఎంపీగా, 1999, 2004లో ఎమ్మెల్యేగా, 2008లో ఎంపీగా పనిచేశారు. 2000 సంవత్సరంలో టీసీఎల్‌ఎఫ్ కన్వీనర్‌గా వ్యవహరించారు. 1994, 1996లలో ఎంపీగా, 2009 నిర్మల్, 2010 సిర్పూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందారు. 2014ఎన్నికల్లో బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్లో చేరిక. రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు. 2018 ముందస్తు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపు. సామాజిక సమీకరణల్లో మాజీ మంత్రి జోగు రామన్న వెనుకబాటు గత ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన జోగు రామన్నకు ఈసారి అవకాశం దక్కడం లేదని స్పష్టమవుతోంది. మంత్రివర్గం కూర్పులో బీసీలకు ఇతర జిల్లాల నుంచి అవకాశం లభిస్తుండడం, సామాజికవర్గం పరంగా కూడా వరంగల్ నుంచి మున్నూరుకాపు వర్గానికి చెందిన వినయ్‌భాస్కర్‌కు చీఫ్ విప్‌గా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామన్నకు మంత్రివర్గంలో చోటు లేనట్టేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. సుమన్‌కు కలిసిరాని సామాజిక కూర్పు పెద్దపల్లి ఎంపీగా కొనసాగుతూనే చెన్నూరు శాసనసభ స్థానం నుంచి ఘన విజయం సాధించిన బాల్క సుమన్‌కు సామాజిక కూర్పులో భాగంగానే ఈ విడతలో మంత్రి యోగం దక్కలేదని సమాచారం. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు ఈసారి మంత్రి వర్గంలో స్థానం దాదాపుగా ఖరారైంది. అదే పార్లమెంటు స్థానంలో పరిధిలో ఈశ్వర్ సామాజిక వర్గానికే చెందిన సుమన్‌కు తద్వారా అవకాశం లభించలేదని సమాచారం. అయితే పార్లమెంటు ఎన్నికల తరువాత జరిగే మలి విడత విస్తరణలో సుమన్‌కు మంత్రి పదవి లేదా కేబినెట్ హోదాలో మరేదైనా కీలక పదవి దక్కనుందని తెలుస్తోంది. రేఖానాయక్ తదితరులకు నిరాశే! మహిళలకు గత ప్రభుత్వంలో అవకాశం లభించని నేపథ్యంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఖానాపూర్ మహిళా ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌కు ఈసారి మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. రేఖానాయక్‌కు అవకాశం ఇస్తే మహిళ, ఎస్టీ కోటా రెండు భర్తీ అవుతాయని భావించారు. అయితే పరిమిత కేబినెట్ విస్తరణలో సామాజిక, మహిళ, తదితర కోటాల జోలికి వెళ్లకుండా 8 లేదా 9 మందితో విస్తరణ జరపాలని ముఖ్యమంత్రి భావిస్తుండడంతో రేఖానాయక్‌కు నిరాశే ఎదురైంది. సిర్పూరు నుంచి మూడుసార్లు విజయం సాధించిన కోనేరు కోనప్ప సైతం మంత్రి పదవికి రేసులో ఉన్నారు. ఆయన సైతం ‘కమ్మ’ సామాజిక వర్గం నుంచి సీనియర్ ఎమ్మెల్యేగా అవకాశం లభిస్తుందని ఆశించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నడిపెల్లి దివాకర్‌రావు(మంచిర్యాల) సైతం సీనియర్ సభ్యుడిగా చాన్స్ దక్కకపోతుందా అని భావించారు. అయితే సామాజిక వర్గాల కూడికలు, తీసివేతల్లో భాగంగానే వీరికి అవకాశం దక్కలేదనేది సుస్పష్టం. -
మంత్రులు ఇద్దరు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరికీ మంత్రుల అవకాశం దక్కింది. ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మాజీమంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు మరోమారు మంత్రి పదవి దక్కింది. ప్రభుత్వ మాజీ విప్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు తొలిసారి మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఈ ఇద్దరు నేతలు మంగళవారం ఉదయం 11.30 గంటలకు కుటుంబసభ్యులతో ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సోమవారం సమాచారం అందింది. ఈసారి మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరిగింది. సీఎం తనయుడు, మాజీమంత్రి కేటీఆర్ పూర్తిస్థాయిలో పార్టీ బాధ్యతలు చూస్తుండటంతో ఆయనను కేబినెట్లోకి తీసుకోలేదంటున్నారు. ఈనేపథ్యంలో మాజీమంత్రి ఈటల రాజేందర్, మాజీ విప్ కొప్పులకు మంత్రులకు అవకాశం కల్పించినట్లు చెప్తున్నారు. తమ అభిమాన నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారన్న సమాచారం అందుకున్న ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ అభిమానులు, బంధువులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం రాత్రే హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఓటమెరుగని నేత ‘ఈటల’.. ఆరుసార్లు గెలిచిన ‘కొప్పుల’ ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరించిన ఈటల రాజేందర్ వరుస విజయాలతో ఓటమెరుగని నేతగా నిలిచారు. ఈటల రాజేందర్ 2004లో కమలాపూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత 2008 ఉప ఎన్నికల్లోనూ విజేతగా నిలిచారు. ఆ తర్వాత అనూహ్యంగా హుజురాబాద్ నియోజకవర్గానికి రాజకీయ మకాం మార్చిన ఈయన 2009, 2010 (ఉప ఎన్నిక), 2014, 2019 ఎన్నికలవరకు వరుస విజయాలతో సత్తా చాటారు. 2019 ఎన్నికల్లో బరిలో నిలిచి గెలిచిన రాజేందర్ డబుల్ హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. తెలంగాణ మొదటి కేబినెట్లో ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు చేపట్టి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావడంలో కీలకంగా వ్యవహరించారు. మాజీ విప్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఏడుసార్లు పోటీచేసి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి ఓడిన ఈయన ఆ తర్వాత వరుస విజయాలు సాధించారు. రద్దైన మేడారం నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ తరఫున 1994లో తొలిసారి పోటీచేసి ఓటమిపాలయ్యారు. తర్వాత 2004లో మేడారం టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత 2008 ఉప ఎన్నికలో విజేతగా నిలిచారు. తరువాత ధర్మపురి నియోజకవర్గానికి మారిన ఆయన 2009, 2010 (ఉప ఎన్నిక), 2014, 2019లో వరుస విజయాలతో దూసుకెళ్లారు. ఏడుసార్లు పోటీ ఆరుసార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్‌ను ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈయన గత కేబినెట్లోనే మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగినా.. సమీకరణలు, సామాజిక కోణాల సర్దుబాటులో తృటిలో తప్పింది. ఈసారి ఈటల రాజేందర్‌తోపాటు కొప్పుల ఈశ్వర్‌కు మంత్రివర్గంలో స్థానం దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. శాఖల కేటాయింపుపై సస్పెన్స్.. ప్రమాణ స్వీకారం తర్వాతే బాధ్యతలు మాజీమంత్రి ఈటల రాజేందర్, మాజీ విప్ కొప్పుల ఈశ్వర్‌కు ఈ మంత్రివర్గంలో స్థానం లభించగా.. ఈ ఇద్దరు నేతలకు ఏయే శాఖలు కేటాయిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సీఎంగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా 16 మందిని భర్తీ చేయాల్సి ఉంది. ఈసారి 10 మందినే భర్తీ చేస్తున్నందున.. ఉమ్మడి జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతలకు ఏ శాఖలు కేటాయిస్తారన్న చర్చ జరుగుతోంది. ఈసారి కొందరి శాఖల మార్పులు ఖాయమన్న ప్రచారం బలంగా ఉంది. ఈ మంత్రివర్గంలో కేటీఆర్ లేకపోగా.. మిగిలింది ఈటల రాజేందర్. సీఎంవో కార్యాలయం నుంచి ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని మాత్రమే సమాచారం అందగా.. కేటాయించే శాఖల ప్రస్తావన లేదు. గత ప్రభుత్వంలో రాజేందర్ ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈ సారి ఏ శాఖ కేటాయిస్తారనేది చర్చనీయాంశం అయ్యింది. కొత్తగా మంత్రివర్గంలో చేరుతున్న కొప్పుల ఈశ్వర్‌కు కేటాయించే శాఖపైనా చర్చ జరుగుతోంది. ఈ విషయమై అధినేత కేసీఆర్ ఏం యోచిస్తున్నారు? అయన మదిలో ఏముంది..? అనేది ప్రమాణ స్వీకారం తర్వాతే తేలనుందంటున్నారు. ‘ఈటల’ బయోడేటా.. పేరు : ఈటల రాజేందర్ పుట్టినతేదీ : 24–03–1964 తల్లిదండ్రులు : ఈటల వెంకటమ్మ, మల్లయ్య స్వగ్రామం : కమలాపూర్ విద్యాభ్యాసం : బీఎస్సీ(బీజెడ్సీ), ఎల్ఎల్బీ డిస్కంటిన్యూ వ్యాపారం : 1986 నుండి కోళ్ళపరిశ్రమ వ్యాపారం కుటుంబం : భార్య జమునారెడ్డి, కూతురు నీత్, ఒక కొడుకు నితిన్ రాజకీయ నేపథ్యం 2002లో టీఆర్ఎస్లో చేరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2004లో మెుదటిసారిగా కమలాపూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2008 ఉప ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా, టీఆర్ఎస్ లెజిస్లెషన్ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ శాసనసభ పక్షనేతగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి వకుళాభరణం కృష్ణమోహన్‌రావుపై 15,035 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2010 ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎం.దామోదర్‌రెడ్డి, 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డిపై విజయం సాధించిన రాజేందర్, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డిని ఓడించారు. 2014లో కేసీఆర్ కేబినేట్లో ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రిగా వ్యవహరించిన ఈయనకు రెండోసారి కేసీఆర్ కొలువులో మంత్రిగా అవకాశం దక్కింది. ‘కొప్పుల’ బయోడేటా.. పేరు : కొప్పుల ఈశ్వర్ పుట్టిన తేదీ : 1959 ఏప్రిల్ 20 తల్లిదండ్రులు : మల్లమ్మ, లింగయ్య విద్యార్హతలు : డిగ్రీ స్వగ్రామం : కుమ్మరికుంట, జూలపల్లి మండలం భార్య : స్నేహలత పిల్లలు : కూతురు నందిని, అల్లుడు అనిల్, మనుమడు భవానీనిశ్చల్ రాజకీయ నేపథ్యం సింగరేణి సంస్థలో 20ఏళ్లపాటు ఉద్యోగిగా పనిచేశారు. 1983లో టీడీపీలో చేరిన ఈశ్వర్ రాష్ట్ర మిడ్‌క్యాప్ సంస్థ డైరెక్టర్‌గా.. మినిమమ్ వేజ్ అడ్వైజరీ బోర్డ్ డైరెక్టర్‌గా.. మేడారం నియోజకవర్గం దేశం పార్టీ ఇన్చార్జిగా పనిచేశారు. 1994లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. 2001 టీఆర్ఎస్లో చేరారు. 2004 జనవరిలో జరిగిన ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి 56 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో 28వేల ఓట్ల మెజార్టీతో అదేస్థానం నుంచి ఎన్నికయ్యారు. నియోజకవర్గ పునర్విభజనలో మేడారం నియోజకవర్గం రద్దు కావడంతో ధర్మపురి నియోజకవర్గం నుంచి 2009 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. 2009, 2010 ఉప ఎన్నిక, 2014 సాధారణ, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను వరుసగా ఓడించారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా వ్యవహరించిన కొప్పుల ఈశ్వర్‌కు ఈసారి మంత్రిపదవి దక్కింది. -
6 కొత్త ముఖాలు
సాక్షి, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కొత్త మంత్రివర్గంలో ఆరు కొత్త ముఖాలకు చోటు దక్కింది. నేడు ఉదయం 11.30లకు పదిమంది మంత్రులతో రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు. గత కేబినెట్ నుంచి నలుగురు పాతవారికే కొత్త జాబితాలో స్థానం దక్కింది. ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి తొలిసారి మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. పాతవారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, జి.జగదీశ్‌రెడ్డి మాత్రమే తాజా జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు రావాలని వీరిని సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్లో ఆహ్వానించారు. ‘మీరు ప్రభుత్వంలో ఉంటున్నారు. బంగారు తెలంగాణ సాధనకు కలిసి పనిచేద్దాం’అని సీఎం చెప్పారు. సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు సైతం మంత్రులుగా ప్రమాణం చేసే వారికి ఫోన్ చేసి ఆహ్వానించారు. ఫోన్లో సీఎం మాట్లాడిన వెంటనే వీరంతా ప్రగతిభవన్‌కు చేరుకుని కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రుల ప్రమాణ కార్యక్రమం కోసం సాధారణ పరిపాలన శాఖ రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు పూర్తి చేసింది. కొత్త మంత్రులకు నిబంధనల ప్రకారం కేటాయించాల్సిన అధికారిక వాహనాలను సిద్ధం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లకు, టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ బాధ్యులకు, ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలకు ఆహ్వానాలు పంపించారు. మహిళలు, ఎస్టీలకు నో చాన్స్ సీఎం కేసీఆర్ పదిమంది టీమ్‌లో ఆరుగురు ఓసీలు, ముగ్గురు బీసీలు, ఒక ఎస్సీ ఉన్నారు. మైనారిటీ వర్గానికి చెందిన మహమూద్‌అలీ ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. ఎస్టీ వర్గానికి చెందిన వారికి మంత్రులుగా అవకాశం దక్కలేదు. ఎస్టీ వర్గం నుంచి డీఎస్ రెడ్యానాయక్ (డోర్నకల్), అజ్మీరా రేఖానాయక్ (ఖానాపూర్)ల పేర్లను పరిశీలించినా చివరికి ఈ వర్గం నుంచి ఎవరినీ ఎంపిక చేయకుండా వాయిదా వేశారు. గత ప్రభుత్వంలో మాదిరిగానే ఈసారీ మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. టీఆర్ఎస్ తరుఫున గెలిచిన మహిళా ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి (మెదక్), గొంగిడి సునీత (ఆలేరు), అజ్మీరా రేఖానాయక్ (ఖానాపూర్)లలో ఒకరికి తాజా విస్తరణలో మంత్రిగా చాన్స్ ఉంటుందని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. జాబితాలో మాత్రం మహిళలకు చోటు దక్కలేదు. ఆ ఏడుగురికి అవకాశం లేదు గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారిలో ఐదుగురే మళ్లీ మంత్రులుగా ఉండబోతున్నారు. సీఎం కేసీఆర్‌తోపాటు మహమూద్‌అలీ గతంలోనే ప్రమాణం చేశారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్, జి.జగదీశ్‌రెడ్డి మళ్లీ మంత్రులుగా ప్రమాణం చేస్తున్నారు. దీంతో పాతవారిలో ఐదుగురికి మళ్లీ అమాత్యయోగం దక్కింది. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈయన మినహా ఏడుగురికి అవకాశం దక్కలేదు. కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, తన్నీరు హరీశ్‌రావు, కె.తారకరామారావు, జోగు రామన్న, టి.పద్మారావుగౌడ్, సి.లక్ష్మారెడ్డిలకు ఈసారి మంత్రులుగా అవకాశం రాలేదు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పూర్తిస్థాయిలో నిమగ్నం కానున్నారు. ఈ కారణంగా కేటీఆర్‌కు తాజా విస్తరణలో మంత్రి పదవిని కేటాయించలేదు. అయితే టీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావుకు మంత్రి పదవి దక్కపోవడంపై టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రెండు జిల్లాలకు డబుల్... మంత్రి విస్తరణలో మహబూబ్‌నగర్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు రెండు చొప్పున మంత్రి పదవులు దక్కాయి. గత ప్రభుత్వంలోనూ ఈ రెండు జిల్లాలకు ఇదే రకంగా ప్రాతినిథ్యం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గత ప్రభుత్వంలో కె.తారకరామారావు, ఈటల రాజేందర్ మంత్రులుగా ఉన్నారు. తాజాగా ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్లకు చోటు దక్కింది. ఉమ్మడి మహబూబ్‌నర్ జిల్లా నుంచి గత ప్రభుత్వంలో జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్ మంత్రులుగా ఉంటున్నారు. మెదక్ ఉమ్మడి సీఎం కేసీఆర్ ఒక్కరే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతంలో ఈ జిల్లా నుంచి తన్నీరు హరీశ్‌రావు మంత్రిగా ఉన్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాకు తాజా మంత్రివర్గంలో ప్రాతినిథ్యం దక్కలేదు. గత సంప్రదాయం మంత్రివర్గ విస్తరణలో కేసీఆర్ గత సంప్రదాయాన్నే పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. 2014లో జూన్ 2న తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడింది. సీఎం కేసీఆర్‌తోపాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అదే ఏడాది డిసెంబరులో మరోసారి విస్తరణ తర్వాత కొత్తగా ఆరుగురిని మంత్రులుగా చేర్చుకున్నారు. ఈ విస్తరణలోనే ఎస్టీ వర్గానికి చెందిన అజ్మీరా చందులాల్, ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర్రావు మంత్రులుగా ప్రమాణం చేశారు. సీఎం కేసీఆర్ ఈసారీ మరోసారీ రెండో విస్తరణలో ఆరుగురికి అవకాశం కల్పించనున్నారు. ఈటలకు ఆలస్యంగా! మంత్రులుగా ప్రమాణం చేసే వారికి సీఎం కార్యాలయం నుంచి ఫోన్లో సమాచారం ఇచ్చి ఆహ్వానించడం సంప్రదాయం. సీఎం కేసీఆర్ ఎంపిక చేసిన పది మందికి సీఎం ఆఫీస్ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు ఫోన్లు చేశారు. తొమ్మిది మందికి సాయంత్రం ఏడు గంటలకు ఫోన్లో సమాచారం అందింది. ఈటల రాజేందర్‌కు మాత్రం రాత్రి 10 గంటల తర్వాత ఫోన్లో అధికారిక సమాచారం వచ్చింది. మొదట తొమ్మిది మందికే మంత్రులుగా అవకాశం ఉంటుందని అనుకున్నారు. చివరికు రాత్రి పది గంటలకు ఫోన్ రావడంతో ఈటల వర్గీయులు ఊరట చెందారు. మరోసారి విస్తరణలో ఆరుగురు లోక్‌సభ ఎన్నికల తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రగతి భవన్ వర్గాలంటున్నాయి. అప్పుడు మరో ఆరుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. ఈ ఆరుగురు ఎవరనే విషయంపై అప్పుడే చర్చ మొదలైంది. తదుపరి విస్తరణలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు, ఎస్టీ వర్గానికి చెందిన ఒకరికి కచ్చితంగా చోటు దక్కనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒకరికి అవకాశం ఇవ్వనున్నారు. మిగిలిన ముగ్గురు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఎంపికైన వారి వివరాలు ఆదిలాబాద్ : అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి – ఓసీ(రెడ్డి) నిజామాబాద్ : వేముల ప్రశాంత్‌రెడ్డి – ఓసీ(రెడ్డి) కరీంనగర్ : కొప్పుల ఈశ్వర్ – ఎస్సీ(మాల), ఈటల రాజేందర్ – బీసీ (ముదిరాజ్) మహబూబ్‌నగర్: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి – ఓసీ(రెడ్డి), వి. శ్రీనివాస్‌గౌడ్ – బీసీ(గౌడ్) హైదరాబాద్: తలసాని శ్రీనివాస్‌యాదవ్ – బీసీ(యాదవ) రంగారెడ్డి: చామకూర మల్లారెడ్డి – ఓసీ(రెడ్డి) నల్లగొండ: గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి – ఓసీ(రెడ్డి) వరంగల్: ఎర్రబెల్లి దయాకర్‌రావు – ఓసీ(వెలమ) -
రేపు ప్రమాణం చేయబోయే మంత్రులు వీరే..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో పదిమంది మంత్రులు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న తొలి కేబినెట్ విస్తరణలో ఎవరెవరికీ అవకాశం దక్కనుందనే దానిపై సస్పెన్స్ వీడిపోయింది. టీఆర్ఎస్ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్.. తదితర నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. సామాజికవర్గాల వారీగా చూసుకుంటే రెడ్డి సామాజికవర్గం నుంచి ఐదుగురు, బీసీ నుంచి ముగ్గురు, ఎస్సీ నుంచి ఒకరు, వెలమ నుంచి ఒకరు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వీరిలో కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్ గౌడ్ తొలిసారిగా మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. -
8 లేదా 9 మందికి చాన్స్.. తెలంగాణ మంత్రులు వీరే..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మరికొద్ది గంటల సమయమే ఉండటంతో కేబినెట్లో బెర్త్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ‘హై’ టెన్షన్ నెలకొంది. మంత్రివర్గ విస్తరణలో పలువురి పేర్లు తెరమీదకు వచ్చినా... తుది జాబితా మాత్రం ఇప్పటివరకూ అధికారంగా బయటకు రాలేదు. మరోవైపు ఎనిమిది లేదా తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు పార్టీ ఎమ్మెల్యేలకే ప్రగతి భవన్ నుంచి పిలుపురావడంతో వారంతా ముఖ్యమంత్రిని కలిసేందుకు వస్తున్నారు. ఇప్పటికే ప్రగతి భవన్ అధికారులు పలువురికి ఆదివారమే సమాచారం అందించగా, తాజాగా సోమవారం మరికొందరు ప్రగతి భవన్ చేరుకున్నారు. వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందంటూ ప్రశాంత్ రెడ్డి (నిజామాబాద్), నిరంజన్ రెడ్డి (మహబూబ్ నగర్), ఇంద్రకరణ్ రెడ్డి (ఆదిలాబాద్), జగదీశ్ రెడ్డి (నల్లగొండ), కొప్పుల ఈశ్వర్ (కరీంనగర్), ఎర్రబెల్లి దయాకర్ రావు (వరంగల్), తలసాని శ్రీనివాస్ యాదవ్ (హైదరాబాద్), శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్ నగర్), ఈటల రాజేందర్ (కరీంనగర్), అలాగే డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు, చీఫ్ విప్‌గా దాస్యం వినయ్ భాస్కర్ పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మంత్రివర్గంలో ఉంటారా అనే దానిపై అధికార పార్టీతోపాటు రాజకీయ వర్గాలు, ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఎవరికి వారు మాత్రం తమకు ఛాన్స్ దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నారు. సీఎం కార్యాలయం లేదా సాధారణ పరిపాలనశాఖ నుంచి ఫోన్లు వచ్చాయా అంటూ ఆశావహులు తమ పరిధి మేరకు ఆరా తీస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరం నుంచి కనీసం అరడజను మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కనివారికి అంతకు సమానమైన కేబినెట్ పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ కూర్పుపై నెలకొన్న సస్పెన్స్‌కు తెర పడాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. -
అందుకే హరీశ్‌కు మంత్రి పదవి రాదు: రేవంత్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు మంత్రివర్గంలో చోటు దక్కదని అన్నారు. హరీశ్‌తో పాటు మరో నలుగురు సీనియర్లుకు మంత్రివర్గంలో స్థానం దక్కదని పేర్కొన్నారు. కేసీఆర్ కేబినెట్లో అసమర్థులకు చోటిస్తారని అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ టీఆర్ఎస్ పార్టీపై పలు ఆరోపణలు గుప్పించారు. రేవంత్ రెడ్డి సోమవారమిక్కడ విలేకరలుతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మిడ్ మానేరు, గౌరెల్లి, తోటపల్లి పనుల్లో సుమారు వెయ్యి కోట్లు తీసుకున్నారు. తన బినామీలకే కాంట్రాక్ట్‌లు ఇప్పించారు. ఆ డబ్బులనే కేసీఆర్‌కు తెలియకుండా హరీష్ ఎన్నికల్లో డబ్బులు పంచారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 26మందికి ఆయన డబ్బులిచ్చారు. కొందరు కాంగ్రెస్ వాళ్లకు ఇస్తానంటే తీసుకోలేదు. హరీష్..అమిత్ షాతో ఫోన్లో మాట్లాడటం కేసీఆర్‌కు తెలిసింది. అందుకే మంత్రి పదవి కట్. ఒకవేళ హరీశ్ ఎదురు తిరిగితే పాస్‌పోర్టు కేసులో ఇరికించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారు. కడియం, నాయినిని పక్కన పెట్టారెందుకు? ఇక కడియం శ్రీహరిపై ఒక్క అవినీతి ఆరోపణ లేదు. మరి ఆయనకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వడం లేదు?. మాదిగలకు కేబినెట్లో చోటు కల్పించడం లేదు. అలాగే నాయిని నర్సింహారెడ్డిని పక్కనపెట్టారు. కేసీఆర్‌కు అహంకారం తలకెక్కింది. పాలన పక్కన పెట్టి ప్రత్యర్థులను వేధిస్తున్నారు. కేసీఆర్, నరేంద్ర మోదీల మధ్య ఫెవికాల్ బంధం. ఎన్నికల్లో యాభై లక్షలు దొరికిన పట్నం నరేందర్ రెడ్డి కేసు ఎందుకు ఈడీకి ఇవ్వరు?. ఐటీ శాఖ ఇచ్చినా కూడా ఈడీ ఎందుకు విచారణ చేపట్టడం లేదు. అదే నాపై మాత్రం ఐటీ, ఈడీ కేసులు పెట్టించారు. ఉగ్రదాడిలో అమరులైన జవాన్లుకు కేసీఆర్ నివాళులు అర్పించకపోవడం దారుణం. ఆయన దృష్టిలో జవాన్లకు, కిసాన్లకు విలువలేదు. పార్టీ నేత పోచారం శ్రీనివాసరెడ్డి తల్లి చనిపోతే పలకరించిన కేసీఆర్‌కు జవాన్ కుటుంబాలను పలకరించలేదు. నిజామాబాద్‌లో ఆందోళన చేస్తున్న రైతులను కేసీఆర్ పట్టించుకోలేదు.ఎర్రజొన్న, పసుపు రైతులను ప్రభుత్వం పట్టించుకోదు. ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇస్తున్నా. వారంలోగా పరిష్కరించకుంటే నేనే ఆ రైతులకు మద్దతుగా వెళతా. పార్టీ ఓటమిపై అంతర్గతంగా చర్చించుకుంటాం. నేను ఎక్కడున్నా కంఫర్ట్‌గానే ఉంటా.’ అని అన్నారు. -
మంత్రివర్గంపై కేసీఆర్ కసరత్తు..!
-
మంత్రివర్గంపై పూర్తయిన కేసీఆర్ కసరత్తు..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈనెల 19న తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమాత్యుల జాబితా దాదాపు ఖరారైనట్లేనని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. ఆదిలాబాద్ నుంచి సీనియర్‌నేత, మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి బెర్తు కన్ఫాం అయినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, వరంగల్ నుంచి పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావుకి అవకాశం లభించిందని సమాచారం. ఇక మహబూబ్‌నగర్ నుంచి వనపర్తి శాసన సభ్యుడు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇద్దరిలో ఒక్కరికి అవకాశం కల్పించే విషయంపై కేసీఆర్ కసరత్తు ఇంకా కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని, పద్మారావుకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై కేసీఆర్ మరింతో లోతుగా ఆలోచిస్తున్నారు. కరీంనగర్ నుంచి ధర్మపురి ఎమ్మెల్యే కొప్పల ఈశ్వర్, ఈటల రాజేందర్ విషయంపై ఇంకా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. నల్గొండ నుంచి మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డికి పదవి దాదాపు ఖరారైనట్లే. ఇక రంగారెడ్డి, మెదక్, ఖమ్మం జిల్లాల నుంచి ఈసారికి ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కడే టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో కొత్తగూడెం, ఖమ్మం కోటాలో ఆయనకు పదవి దక్కుతుందని ధీమాగా ఉన్నారు. ఇదిలావుండగా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్లో చేరతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఎస్సీ కోటాలో ఆయనకు పదవి దక్కుతుందని సమాచారం. కాగా ఈ నెల 19న మాఘ శుద్ధ పౌర్ణమి నేపథ్యంలో కేసీఆర్.. మంత్రివర్గ విస్తరణకు ఆ రోజున ముహుర్తం నిర్ణయించారు. తొలి విడతలో 10మందితో క్యాబినెట్ విస్తరణ జరగనుంది. -
తెలంగాణ కేబినెట్ రేసులో ఆ 10మంది?
-
తెలంగాణ కేబినెట్ రేసులో ఆ 10మంది?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు కావడంతో ఇప్పుడు... కేబినెట్లో ఎవరికి చోటు దక్కుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ విస్తరణలో పదిమందికి మంత్రులుగా అవకాశం లభించనుంది. కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. కాగా గత ప్రభుత్వంలోని మంత్రులతోపాటు కొత్త వారిని కలిపి మంత్రివర్గ కూర్పు ఉండనుంది. ఊహించని విధంగా ఒకరిద్దరికి చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19ద తేదీ ఉదయం 11.30 గంటలకు రాజ్ భవన్లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది. మంత్రివర్గ కూర్పులో సాధారణంగా మూడు కీలక అంశాలను ప్రాతిపదికగా చేసుకొని పరిపాలన సమర్థత, సామాజిక సమీకరణాలు, ప్రభుత్వం–పార్టీని అనుసంధానించే నేతలతో కేబినెట్ ఏర్పాటు కానుంది. అంతేకాకుండా గత టీఆర్ఎస్ కేబినెట్లో మహిళలకు చోటు దక్కలేదన్న విమర్శల నేపథ్యంలో ఈసారి ఒకరికి అవకాశం లభించనుంది. మంత్రివర్గంలో చోటు దక్కేవారిలో గత ప్రభుత్వంలో పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా చేసిన కేటీఆర్, సాగునీటి మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన హరీశ్ రావుతో పాటు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, జోగు రామన్న, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మారెడ్డికి కేబినెట్లో అవకాశం లేనట్లేనని తెలుస్తోంది. -
19న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ
-
19న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు అయింది. ఈ నెల 19వ తేదీ ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శుక్రవారం గవర్నర్ నరసింహన్‌తో భేటీ తర్వాతే కేబినెట్ విస్తరణ తేదీ అధికారికంగా వెల్లడి అయింది. ఈ విస్తరణలో 10మందికి మంత్రులుగా అవకాశం దక్కనుంది. ఈ నెల 19న మాఘ శుద్ధ పౌర్ణమి నేపథ్యంలో కేసీఆర్...మంత్రివర్గ విస్తరణకు ఆ రోజున ముహుర్తం నిర్ణయించారు. ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. గత ప్రభుత్వంలోని మంత్రులతోపాటు కొత్త వారిని కలిపి మంత్రివర్గ కూర్పు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే ఇంకా తెలియరాలేదు. మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. -
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ సమావేశం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో 10మందికి మంత్రులుగా ఛాన్స్ దక్కనున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 22న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యేలోపే కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కేబినెట్లో ఎవరెవరు ఉండాలనే విషయంలో అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. గత ప్రభుత్వంలోని మంత్రులతోపాటు కొత్త వారిని కలిపి మంత్రివర్గ కూర్పు ఉండనుంది. అలాగే మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు, జిల్లాలవారీగా పదవుల కేటాయింపు కీలకం కానుంది. మరోవైపు సోమవారం తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీఆర్ఎస్ పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
కేసీఆర్‌కు అనుకూలంగా ఉండే 6 సంఖ్య వచ్చే తేదీన..
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలైనా మంత్రివర్గ విస్తరణ లేకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వసంత పంచమిని పురస్కరించుకుని ఆదివారం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆశావహులు, ఇతర ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం భావించారు. అయితే శనివారం రాత్రి వరకు దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో వసంత పంచమి నాడు సైతం మంత్రివర్గ విస్తరణ ఉండబోదని దాదాపు తేలిపోయింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందనే చర్చ మళ్లీ మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అనుకూలంగా ఉండే ఆరు సంఖ్య వచ్చే 15న గానీ, 24న గానీ విస్తరణ ఉంటుందని తాజాగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం నుంచి మాత్రం విస్తరణ తేదీపై ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది స్పష్టత రాకపోవడంతో సీనియర్ ఎమ్మెల్యేల్లో ఆందోళన పెరుగుతోంది. పదవి వస్తుందా? రాదా? అనే విషయం ఎలా ఉన్నా విస్తరణ త్వరగా జరిగితే స్పష్టత వచ్చి ప్రశాంతంగా ఉంటామని పలువురు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు లేకున్నా ఎప్పుడు ఉంటుందనే విషయంపై స్పష్టత ఇస్తే బాగుంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. పెళ్లిళ్లకు వెళ్లాలా..: వసంత పంచమి శుభముహూర్తం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో పెళ్లిళ్లు ఉన్నాయి. ప్రతి ఎమ్మెల్యేకు తమ నియోజకవర్గంలో సగటున 50కిపైగా వివాహ ఆహ్వానాలు అందాయి. ముఖ్య కార్యకర్తలు, బంధువుల నుంచి వచ్చిన పెళ్లిళ్లకు హాజరు కావాలన్నా ఉదయం నుంచి రాత్రి వరకు తిరిగితేగానీ పూర్తి కాని పరిస్థితి ఉంది. వసంత పంచమి సందర్భంగా విస్తరణ ఉంటుందనే సమాచారం నేపథ్యంలో సీనియర్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. నియోజకవర్గాలకు వెళ్లాలా? సీఎం కార్యాలయం నుంచి పిలువు వస్తుందా? ఆనే ఆలోచనలతోనే శనివారం అంతా గడిపారు. ‘మంత్రివర్గంలో మీకు చోటు ఖాయమేనా సార్’అంటూ నియోజక వర్గంలోని ద్వితీయ శ్రేణి నేతలు, సన్నిహితుల నుంచి రోజంతా ఫోన్లు రావడంతో వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బంది పడ్డారు. బయటి వారికి చెప్పే సమాధానం ఎలా ఉన్నా విస్తరణ ఇప్పుడు ఉంటుందా? ఉంటే మంత్రిగా అవకాశం వస్తుందా అనే ఆలోచనలతో సీనియర్ ఎమ్మెల్యేలు, ఆశావహుల్లో రోజురోజుకీ టెన్షన్ పెరిగిపోతోంది. -
ఆర్థికమంత్రి లేకుండా పరిపాలన ఎలా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ ఏర్పాటులో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టికల్ 164(ఎ) ప్రకారం మంత్రుల సంఖ్య 15 శాతం మించకూడదన్నారు. మంత్రుల సంఖ్య 12 కంటే తక్కువ ఉండకూడదన్న విషయాన్ని అటు సీఎం కానీ, ఇటు గవర్నర్ కానీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మంత్రి మండలి సూచనల మేరకు గవర్నర్ చేయాలన్నారు. ఆర్థిక మంత్రి లేకుండా పరిపాలన ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు మంచి రోజుల రాబోతున్నాయి తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు చాలా చోట్ల విజయం సాధించారని దోసోజ్ శ్రవణ్ అన్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులనే టీఆర్ఎస్లో చేర్చుకొని విజయం సాధించారని ఆరోపించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా భారీ విజయాన్ని సాధించేల పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్‌కు మంచిరోజులు రాబోతున్నాయని.. దానికి పంచాయతీ ఎన్నికలే నిదర్శనమన్నారు. శాసన సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అవకతవకలకి పాల్పడిందన్న ఆరోపణలకి పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఊతం ఇచ్చాయన్నారు. ప్రజారస్వామ్యంపై గౌరవం పోకముందే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను కోరారు. -
వీరివీరి గుమ్మడిపండు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా, మహమూద్ అలీ మంత్రిగా గురువారం ప్రమాణం చేశారు. వారం రోజుల్లోపే పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరనుంది. అయితే.. ఈసారి ఎవరికి కేబినెట్ బెర్తులు దక్కుతాయనేదానేదే ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వంలోని నలుగురు మంత్రులు ఈసారి ఓడిపోయారు. వీరి స్థానాల్లో కొత్త వారిని తీసుకోవడం ఖాయం. అయితే.. గతంలో ఉన్నవారిలో ఎందరికి మంత్రి పదవులు ఇస్తారనేదే మాజీల్లో ఉత్కంఠ రేపుతోంది. దీనికితోడు కొత్త వారిలో ఎందరికి, ఎవరెవరికి అవకాశం ఇస్తారనేదానిపై చర్చ జరుగుతోంది. మంత్రులుగా తమ పేరును పరిశీలించాలని పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంకు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. నేరుగా చెప్పకుండా మనసులోని మాటను అధినేతకు తెలిసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ కసరత్తు కొత్త జట్టు కూర్పుపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ కూర్పు పూర్తయిన తర్వాత.. ఈ నెల 17 లేదా 18 తేదీల్లో మిగిలిన మంత్రుల ప్రమాణస్వీకారం జరగొచ్చని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ముందస్తు ఎన్నికలో టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది. వీరిలో సీనియర్ ఎమ్మెల్యేలు అందరూ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు సైతం మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్యాంగ నియమావళి ప్రకారం తెలంగాణలో సీఎం, మరో 17 మంది మంత్రులు ఉంటారు. కేసీఆర్, మహమూద్ అలీ గురువారం ప్రమాణం స్వీకారం చేశారు. మరో 16 మందికే కేబినెట్ బెర్త్ దక్కుతుంది. జిల్లాలు, సామాజిక లెక్కల ప్రకారం వీటిని భర్తీ చేయాల్సి ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు (కమ్మ), జూపల్లి కృష్ణారావు (వెలమ), అజ్మీరా చందూలాల్ (ఎస్టీ–లంబాడ), పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోయారు. అసెంబ్లీలో కేసీఆర్ తర్వాత ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన డీఎస్ రెడ్యానాయక్ (ఎస్టీ–లంబాడ), ఎర్రబెల్లి దయాకర్‌రావు (వెలమ)లకు కొత్త ప్రభుత్వంలో బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ భారీ విజయాలను నమోదు చేసుకున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక్క స్థానానికే పరిమితమైంది. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లో పువ్వాడ అజయ్ కుమార్ (కమ్మ) గెలిచారు. 2014 ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కు ఒకటే స్థానం వచ్చింది. ఆరు నెలల వరకు ఆ జిల్లా నుంచి ఎవరికీ మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. ఖమ్మం ఉమ్మడి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం కల్పించే విషయంలో సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరు ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవికి పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సామాజిక వర్గాల వారిగా.. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రిగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి ఎన్నికలలో ఓడిపోయారు. ఈ జిల్లా కోటాలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి పేర్లను సీఎం పరిశీలిస్తున్నారు. కేసీఆర్ పాత జట్టులో సభ్యులుగా ఉన్న వారిలో మార్పులు చేస్తే గ్రేటర్ హైదరాబాద్ నుంచి కేపీ వివేకానంద (కుత్బుల్లాపూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్)ల పేర్లను పరిశీలించే అవకాశం ఉంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి (ఎస్సీ)ని కొనసాగించే విషయంలో మార్పులు జరిగితే రాష్ట్రంలో హరీశ్ రావు తర్వాత రెండో అతిపెద్ద విజయం సాధించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ (మాదిగ)తోపాటు రసమయి బాలకిషన్ (మాదిగ)లలో ఒకరికి మంత్రి పదవి ఖాయమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇదే కోటాలో మాల సామాజికవర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్ (మాల), చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్టీ కోటాలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ను ఖరారు చేస్తే మహిళా కోటా సైతం భర్తీ కానుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మహిళా మంత్రి కోటాలో పద్మా దేవేందర్ రెడ్డి (మెదక్), గొంగడి సునీత (ఆలేరు) పేర్లను టీఆర్ఎస్ అధినేత పరీశీలిస్తున్నారు. కీలకమైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల భర్తీ పూర్తయ్యాకే మంత్రి పదవుల విషయంలో సీఎం కేసీఆర్ తుది నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రి పదవులకు ప్రాబబుల్స్: ఆదిలాబాద్: అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, బాల్క సుమన్, అజ్మీర రేఖానాయక్ నిజామాబాద్: పోచారం శ్రీనివాస్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి కరీంనగర్: కేటీఆర్, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ మెదక్: హరీశ్‌రావు, సోలిపేట రామలింగారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, హైదరాబాద్: తలసాని శ్రీనివాస్‌యాదవ్, టి.పద్మారావుగౌడ్, దానం నాగేందర్. రంగారెడ్డి: సీహెచ్ మల్లారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కేపీ వివేకానంద్. మహబూబ్‌నగర్: సి.లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్. నల్లగొండ: జి.జగదీశ్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, గొంగడి సునీత. వరంగల్: కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీఎస్ రెడ్యానాయక్, అరూరి రమేశ్, దాస్యం వినయభాస్కర్. ఖమ్మం: పువ్వాడ అజయ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
బిగ్ బ్రేకింగ్: మహమూద్ అలీకి కీలకమైన మంత్రిత్వశాఖ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సీనియర్ నేత, మైనారిటీ నాయకుడు మహమూద్ అలీకి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. మంత్రివర్గంలో అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖను ఆయనకు కట్టబెట్టారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌తోపాటు మంత్రిగా మహమూద్ అలీ ఒక్కరే ప్రమాణం చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు కీలకమైన రెవెన్యూశాఖ బాధ్యతలను మహమూద్ అలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడైన అలీకి రెండో పర్యాయంలోనూ కీలక మంత్రిత్వశాఖ దక్కింది. దీంతో గత పర్యాయంలో హోంమంత్రిగా వ్యవహరించిన నాయిని నరసింహారెడ్డికి మరోసారి మంత్రివర్గంలో చోటు దక్కుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా ఈసారి మంత్రివర్గంలో గణనీయమైన మార్పులు ఉంటాయని, పలువురు కొత్తవారికి అవకాశముంటుందని వినిపిస్తోంది. -
అప్డేట్స్: ఎమ్మెల్యే కాంపు కార్యాలయాలు ఖాళీ చేయండి!
సాక్షి, హైదరాబాద్: ముందుస్తు ఎన్నికల దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా శాసనసభను రద్దు చేయాలని నిర్ణయించింది. గురువారం మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకునున్నారు. అసెంబ్లీ రద్దుపై వ్యూహాలు అవలంభించాలన్న దానిపై ప్రతిపక్షాలు చర్చోపచర్చలు జరుపుతున్నాయి. బీజేపీ నేతలు గవర్నర్‌ను కలవాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. . ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా లేరని కోదండరాం అన్నారు. తెలంగాణ శాసనసభ రద్దుకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ కోసం.. ఎమ్మెల్యేల కాంపు కార్యాలయాలు ఖాళీ చేయండి! రానున్న ఎన్నికల కోసం ప్రకటించిన 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్ తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్లాలని, వెంటనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ఖాళీ చేయాలని కేసీఆర్ అభ్యర్థులకు సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. చదవండి పూర్తి కథనం : ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం నిప్పులు చెరుగుతున్న ప్రతిపక్షం! సాయంత్రం 5. 30 గంటలు: అసెంబ్లీని రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన సీఎం కేసీఆర్‌పై ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ తెలంగాణ బఫూన్ అని, ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. చేసిన తప్పులన్నీ కేసీఆర్ కాంగ్రెస్ మీద నెట్టుతున్నారని రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా కూడా రాదని కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని మరో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ హితవు పలికారు. కారణాలు చెప్పకుండానే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని తప్పుబట్టారు. ముందస్తు ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఏముందో కేసీఆర్ చెప్పాలని బీజేపీ నేత లక్ష్మణ్ నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అసెంబ్లీని రద్దు చేయడం సరికాదన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పును కేసీఆర్ వమ్ము చేశారని బీజేపీ నేత కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కుటుంబపాలనకు తెరలేపిన కేసీఆర్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. చదవండి: దిగిపోయేటప్పుడూ కేసీఆర్‌వి అబద్ధాలే... కేసీఆర్ పెద్ద బఫూన్... ‘ ఇక మా గెలుపు ఎవరూ ఆపలేరు’ సాయంత్రం 4.30 గంటలు : ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగున్నరేళ్లుగా తెలంగాణ ప్రజలను కేసీఆర్ అన్నివిధాలుగా మోసంచేశారని మండిపడ్డారు. మద్యం అమ్మకాల్లో, రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉందని, తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేశానని కేసీఆర్ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. పోయేకాలం వచ్చి శాసనసభను కేసీఆర్ రద్దు చేశారని దుయ్యబట్టారు. స్థాయి మరచి, విజ్ఞత మరిచి ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాహుల్‌గాంధీపై వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. ప్రెస్మీట్లో కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని అన్నారు. తెలంగాణ ప్రజలు వర్సెస్, కేసీఆర్ కుటుంబంగా ఈ ఎన్నికలు జరగనున్నాయని, కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు తరిమికొడతారని పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయం హీటెక్కింది. అసెంబ్లీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేడు రద్దు చేశారు. తొమ్మిది నెలలు ముందుగా అసెంబ్లీని రద్దు చేయడమే కాకుండా.. రద్దు చేసిన రోజే 105మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా ఏమంటోంది. అభినందనలు.. విమర్శలు ఎలా ఉన్నాయి. చదవండి: అసెంబ్లీ రద్దు : ఎందుకంత తొందర..!? ముగిసిన ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం.. 1 గంట 20 నిమిషాలపాటు విలేకరులతో మాట్లాడిన కేసీఆర్ మధ్యాహ్నం 3.30 గంటలు: కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాతో అనేక ఊహాగానాలకు తెరపడింది. పలు విషయాల్లో స్పష్టత వచ్చింది. సీనియర్ నేత వివేక్ తిరిగి టీఆర్ఎస్లోకి రావడంతో పెద్దపల్లి ఎంపీగా ఉన్న విద్యార్థి నేత బాల్క సుమన్ అసెంబ్లీకి షిఫ్ట్ అయ్యారు. బాల్క సుమన్ చెన్నూరు నుంచి పోటీ చేయనున్నారు. దీంతో పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి మళ్లీ వివేక్‌కు లైన్ క్లియర్ అయినట్టుంది. ఇక సినీ నటుడు బాబుమోహన్‌కు చేదు అనుభవం మిగిలింది. ఆయన స్థానంలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న జర్నలిస్టు క్రాంతికూమార్కు ఆందోల్ సీటు లభించింది. ఇక కేసీఆర్ కుమార్తె కవిత అసెంబ్లీకి మారుతారన్న ఊహాగానాలకు సైతం తెరపడింది. నిజామాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీటు ఇవ్వడంతో ఆమె అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం లేదని స్పష్టత వచ్చినట్టు అయింది. టీఆర్ఎస్ వంద స్ధానాల్లో విజయం సాధిస్తుంది.. 50 రోజుల్లో వంద సభలను ఏర్పాటు చేసి మా ఆలోచనలను ప్రజల ముందుంచుతాం.. తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ధీమా.. పూర్తి కథనం కోసం చదవండి: వంద స్ధానాల్లో గెలుస్తాం : కేసీఆర్ మధ్యాహ్నం 3 గంటలు: ప్రెస్మీట్లో కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని వెలువరించారు. అసెంబ్లీ రద్దు చేసిన రోజే 105 మంది అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం సీఎం కేసీఆర్ మళ్లీ గజ్వెల్ నుంచి పోటీ చేయనున్నారు. తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించారు. చెన్నూరు, ఆందోల్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు. వారికి ముందే సమాచారం ఇచ్చామని, వారికి తగినవిధంగా గౌరవించుకుంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఇక 14స్థానాల్లో అభ్యర్థుల పేర్లు పెండింగ్‌లో ఉంచారు. చదవండి పూర్తి కథనం: 105 మంది అభ్యర్ధులను ప్రకటించిన కేసీఆర్ మధ్యాహ్నం 3 గంటలు : ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన కేసీఆర్ ప్రతిపక్షాలు కాకిగోల చేస్తున్నాయి.. ప్రతిపక్ష నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కోర్టు స్టేలు తీసుకొచ్చి అడ్డుకుంటున్నారు రాష్ట్రంలోఅసహన వైఖరి కనిపిస్తోంది రౌండ్ టేబుల్స్, వాళ్ల బొంద టేబుల్స్ అని పెడుతున్నారు ఒక్కటంటే ఆధారం లేకుండా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న ఈ సన్నాసులంతా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసినవారే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి విద్యుత్ కొనుగోలు చేసి కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నాం తెలంగాణకు విలన్ నంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రానికి బిగ్గెస్ట్ పీడ కూడా ఆ పార్టీయే అనేక త్యాగాల ఫలితం తెలంగాణ అనేక త్యాగాలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ వచ్చింది: సీఎం కేసీఆర్ రాష్ట్రం బాధ్యతయుతంగా ముందుకుసాగాలనే ఆలోచనతోనే గత ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాం : సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో స్పష్టమైన మెజారిటీతో ప్రజలు ఎన్నుకున్నారు: సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2.50 గంటలు: ప్రారంభమైన కేసీఆర్ మీడియా సమావేశం.. మధ్యాహ్నం 2: 35 : ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ బయలుదేరిన కేసీఆర్ మధ్యాహ్నం 1: 45 : అసెంబ్లీ రద్దుపై కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్‌కు కేసీఆర్ అందించారు. కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించారు. దీంతో ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం తరఫున ప్రక్రియ పూర్తయింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌ను గవర్నర్ కోరారు. మధ్యాహ్నం 1.30: రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు సీఎం కేసీఆర్, మంత్రులు కలిశారు. అసెంబ్లీ రద్దు గురించి గవర్నర్‌కు నివేదించారు. మధ్యాహ్నం 1.06: ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలిలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం ఒంటి గంట: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మంత్రి మండలి నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం 12.50: ఓటమి భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా లేరని చెప్పారు. మధ్యాహ్నం 12.35: కాసేపట్లో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో మంత్రులు ప్రగతి భవన్‌కు తరలివస్తున్నారు. కేబినెట్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం 12.00: తెలంగాణ అసెంబ్లీ రద్దు, ముందుస్తు ఎన్నికలపై చర్చ నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీనియర్ నేత జైపాల్ రెడ్డి హాజరయ్యారు. ఉదయం 11.30: కేసీఆర్ వ్యవహార శైలికి నిరసనగా కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉదయం 10.57: బీజేపీ నాయకులు గవర్నర్ నరసింహన్ అపాయింట్మెంట్ కోరారు. శాసనసభ రద్దైతే రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ నాయకులు కోరనున్నారని సమాచారం. ఉదయం 10.50: స్పీకర్ మధుసూదనాచారితో అసెంబ్లీ కార్యదర్శి పత్ర్యేకంగా సమావేశమయ్యారు. అసెంబ్లీ రద్దైతే తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఉదయం 10.45: మంత్రులందరూ మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్లో ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు ప్రగతి భవన్‌కు చేరుకుంటున్నారు. అంతకుముందు సమాచారం... గురువారం ఉదయం హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలని మాత్రమే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు మంత్రులకు సూచించారు. మంత్రివర్గ సమావేశం ఎప్పుడు ఉంటుంది? ఎజెండా ఏమిటన్న విషయాలు మాత్రం గోప్యంగానే ఉంచారని ఓ సీనియర్ మంత్రి బుధవారం రాత్రి ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. జీఏడీ అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రివర్గ సమావేశం ఉంటుంది. 1–30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిసి కేబినెట్ తీర్మానం కాపీని అందజేస్తారు. అనంతరం గన్‌పార్క్ వద్దకు చేరుకుని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం రెండు గంటలకు కేసీఆర్ టీఆర్ఎస్ భవన్‌కు చేరుకుని మీడియా సమావేశంలో మాట్లాడతారు. శాసనసభ రద్దుకు సంబంధించి గురువారం సాయంత్రం ప్రకటన వెలువడగానే.. శుక్రవారం ఉదయం సిద్దిపేట జిల్లాకు బయలుదేరి వెళతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం తరువాత హుస్నాబాద్‌కు చేరుకుంటారు. బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. నేటి సాయంత్రం నుంచి ఆపధర్మ ప్రభుత్వం శాసనసభ రద్దుకు సంబంధించి గవర్నర్ నరసింహన్ సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేస్తారని, అదేసమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని కేసీఆర్‌ను కోరతారని అధికార వర్గాలు వెల్లడించాయి. శాసనసభ రద్దయిన వెంటనే 119 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వం కోల్పోతారు. అయితే ముఖ్యమంత్రి, మంత్రివర్గ సహచరులు యధావిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వారి జీతభత్యాలు, అలవెన్సుల్లో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా ఆపధర్మ మంత్రిమండలిగా కొనసాగాలని గవర్నర్ తన నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆపధర్మ ప్రభుత్వానికి అధికారాలు ఉండవు. -
తిట్టినోళ్లు.. కొట్టినోళ్లే సీఎం వద్ద ఉన్నారు
సాక్షి, యాదాద్రి: తెలంగాణ ఉద్యమకారులను తిట్టినోళ్లు, కొట్టినోళ్లు ఇప్పుడు ముఖ్యమంత్రి వద్ద ఉన్నారని టీజీవో గౌరవాధ్యక్షుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ డైరీ ఆవిష్కరణ కోసం ఆయన భువనగిరికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యోగులు, ఉద్యమకారులకు ప్రస్తుతం న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను తిట్టినోళ్లు, మమ్మల్ని కొట్టించి జైలులో పెట్టించినోళ్లదే రాజ్యం నడుస్తుంది. అలాంటి వారి వద్దకు పనుల కోసం పోవాలంటే బాధ అనిపిస్తోంది. గతాన్ని తలచుకుంటే దుఃఖం వస్తోంది’’అని పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారిలో వందశాతం ఈ బాధ ఉందని, కళ్లలోకి నీళ్లొస్తున్నాయని చెప్పా రు. ఈ విషయమై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఉన్నమాటే అన్నారని పేర్కొన్నారు. వారిని అందుకే తీసుకున్నారేమో! ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆంధ్రా నాయకులు తెలంగాణను దెబ్బతీసే ప్రయత్నం మొదలుపెట్టారని, వాళ్ల ఆధిపత్యం చలాయించే చర్యలు ప్రారంభించారని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఈ సమయంలో ఇష్టం లేకపోయినా.. తెలంగాణ ఉద్యమంలో లేనివారిని ప్రభుత్వంలోకి తీసుకుని ఉంటారని ఆయన విశ్లేషించారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడని, ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను చాలా మంది వ్యతిరేకించారన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు రావడంతో వారంతా ఆయనకు జేజేలు పలుకుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఉద్యమకారులెవరినీ మరిచిపోరని, ఎవరికి, ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు తెలుసన్నారు. దీర్ఘకాలికంగా ఉద్యమకారులకు మంచి భవిష్యత్ ఉంటుందని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సకలజనుల సమ్మె, సహాయ నిరాకరణ, తెలంగాణ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని, ఆనాటి ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు, యువత కుటుంబాలకు రుణపడి ఉంటామన్నారు. నా మాటలను మీడియా వక్రీకరించింది యాజమాన్యాలకు లీగల్ నోటీస్ ఇస్తా జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని తాను అన్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. మహబూబ్‌నగర్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి ప్రచారాలు మీడియాకు మంచిది కాదన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమే కానీ, కేసీఆర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నట్లు ఆయన స్పష్టం చేశారు. తాను మంత్రివర్గంపై ఆరోపణలు చేసినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. మంత్రి పదవి రావడం తన చేతుల్లో లేదని.. అది కేసీఆర్ చేతుల్లో ఉందన్నారు. తనపై దురుద్దేశంతోనే అసత్య ప్రచారం చేస్తున్న పత్రికా యాజమాన్యాలకు లీగల్ నోటీసులను ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు చాలా కుట్రలు చేస్తున్నారని అలాంటిదే తనపై ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేశా రు. తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని కొనియాడారు. -
తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సోమవారం భేటీ అయింది. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సబ్ కమిటీ భేటీలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర రావు హాజరయ్యారు. రైతులకు ఇచ్చే రూ. 8 వేల సాయంపై ఈ భేటీలో చర్చించారు. ఈ నేపధ్యంలో పోచారం మాట్లాడుతూ మే 15 నుంచి డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తోందన్నారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ వర్షాకాలం నుంచి వ్యవసాయానికి పెట్టుబడి మద్దతు పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో పథకం అమలు కోసం మంత్రి పోచారం అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీని వేసిన విషయం తెలిసిందే. -
రిజర్వేషన్ల పెంపునకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం
-
కోటాకు ఓకే
- రిజర్వేషన్ల పెంపునకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం - ముస్లింలకు 12 శాతం, ఎస్టీలకు 10 శాతం ఖరారు - నేడు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం - రాష్ట్ర జీఎస్టీ, హెరిటేజ్ బిల్లులకు గ్రీన్‌సిగ్నల్ - ప్రభుత్వ ఉద్యోగులకు 3.66 శాతం డీఏ పెంపు - రెండు ఎత్తిపోతల పథకాలకు పచ్చజెండా - మత్స్యకారుల ఎక్స్‌గ్రేషియా రూ. 4 లక్షలకు పెంపు సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముస్లింలకు 12 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ముస్లింలకు (బీసీ–ఈ కోటా) 4 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఈ కోటాను పెంచుతూ ‘తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ల చట్టం–2017’ పేరుతో రూపొందించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆదివారం జరిగే అసెంబ్లీ, మండలి సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం ప్రగతి భవన్లో గంటన్నరపాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో రిజర్వేషన్ల పెంపుపైనే ప్రధాన చర్చ జరిగింది. ఇటీవల బీసీ కమిషన్, చెల్ల్లప్ప కమిషన్, సుధీర్ కమిషన్ ఇచ్చిన నివేదికలపైనా చర్చించారు. తాజాగా కోటా పెంపుతో రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న మొత్తం రిజర్వేషన్లు 50% నుంచి 62 శాతానికి చేరనున్నాయి. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా తమిళనాడు తరహాలో రిజర్వేషన్లను పెంచేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతోపాటు రాష్ట్ర హెరిటేజ్ చట్టం, రాష్ట్ర జీఎస్టీ (వస్తు, సేవల) చట్టానికి సంబంధించిన బిల్లులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వీటిని సైతం అసెంబ్లీ, కౌన్సిల్లో ప్రవేశపెట్టాలని తీర్మానించింది. బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల పెంపుపైనా చర్చ బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల పెంపుపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ఆర్నెల్లలో బీసీ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని తీర్మానం చేశారు. అలాగే త్వరలో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిషన్‌కు చైర్మన్‌గా పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను నియమించాలనే అభిప్రాయం మంత్రుల నుంచి వ్యక్తమైంది. కొత్తగా రాష్ట్ర జీఎస్టీ చట్టం ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జీఎస్టీ బిల్లు ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి రానుంది. దీంతో ప్రస్తుతం వ్యాట్, సేల్స్ ట్యాక్స్, సీఎస్టీ వంటి రకరకాల పన్నులకు బదులు దేశవ్యాప్తంగా జీఎస్టీ పేరుతో ఒకే పన్ను విధానం అమలవుతుంది. స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ, ఇంటర్ స్టేట్ జీఎస్టీ పేరుతో ఈ పన్నులు వసూలు చేస్తారు. సెంట్రల్ జీఎస్టీ, ఇంటర్‌స్టేట్ జీఎస్టీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలకు గతంలోనే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ చట్టానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. కేంద్ర చట్టానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలు తమ పరిధిలో వసూలు చేసే పన్నులకు సంబంధించిన రాష్ట్ర జీఎస్టీ చట్టం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రూపొందించిన రాష్ట్ర జీఎస్టీ బిల్లును ప్రభుత్వం ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్రమంతటికీ వారసత్వ చట్టం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న చారిత్రక వారసత్వ కట్టడాలను పరిరక్షించేందుకు రాష్ట్ర హెరిటేజ్ చట్టం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధికి పరిమితమైన ఈ చట్టాన్ని రాష్ట్రమంతటికీ విస్తరించటంతోపాటు శిథిలావస్థకు, ప్రజలకు ముప్పు వాటిల్లే దశకు చేరుకున్న కట్టడాలను కూల్చివేసేలా చట్టానికి పలు సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదానికి పంపాలని మంత్రివర్గం నిర్ణయించింది. మే ఒకటిన చెల్లించే జీతంతో పెరిగిన డీఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి గతేడాది జులై నుంచి పెండింగ్‌లో ఉన్న 3.66 శాతం కరువు భత్యం(డీఏ) చెల్లింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న 18.34 శాతం డీఏ 22 శాతానికి చేరనుంది. మే ఒకటిన చెల్లించే జీతంతో పెరిగిన డీఏను నగదు రూపంలో చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. ప్రమాదవశాత్తూ మరణించే మత్స్యకారులకు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.లక్ష ఎక్స్‌గ్రేషియాను రూ.4 లక్షలకు పెంచేందుకు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది. హోంశాఖలో కొద్దిరోజులుగా పెండింగ్ లో ఉన్న 105 మంది పోలీస్ అధికారుల పదోన్నతుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. నీటిపారుదల శాఖకు సంబంధించిన వివిధ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఎస్సారెస్పీ వరద కాల్వ నుంచి రిజర్వాయర్‌కు నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా లిఫ్ట్ చేసే పథకానికి, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి ఆమోద ముద్ర వేసింది. -
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రగతి భవన్లో ముగిసింది. ఈ భేటీలో ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల పెంపు శాతాన్ని ఖరారు చేసే అంశంపై చర్చించారు. రాష్ట్ర రిజర్వేషన్ల బిల్లు సహా మరో 40 అంశాలకు ఈ భేటీలో ఆమోదం తెలపినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, మత్స్యకారులకు పరిహారం పెంపు, కాళేశ్వరం, మధ్య మానేరు ప్రాజెక్టుల టెండర్ల అంశంపై సమావేశంలో చర్చించారు. పురపాలకశాఖలో కొత్త ఉద్యోగాల భర్తీపైనా చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాగా, రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు రేపు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం కానున్న నేపథ్యంలో ఈ సాయంత్రం జరిగే బీఏసీ సమావేశానికి సీఎం కేసీఆర్ సైతం హాజరుకానున్నారు. -
ముస్లింలకు 12%.. ఎస్టీలకు 10%
-
ముస్లింలకు 12%.. ఎస్టీలకు 10%
-
ముస్లింలకు 12%.. ఎస్టీలకు 10%
రిజర్వేషన్ల పెంపుపై ముసాయిదా బిల్లుకు రూపకల్పన - నేటి రాష్ట్ర కేబినెట్ భేటీలో తుది నిర్ణయం - రేపు అసెంబ్లీ, మండలిలో బిల్లు - తమిళనాడు తరహాలో అవకాశమివ్వాలని తీర్మానం - రాష్ట్రంలో మొత్తంగా 62 శాతానికి చేరుకోనున్న రిజర్వేషన్లు సాక్షి, హైదరాబాద్ విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు 8 శాతం (మొత్తం 12%), గిరిజనులకు 4 శాతం (మొత్తం 10%) చొప్పున రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వేషన్లు పెంచుకునేందుకు తమిళనాడు తరహాలో రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరనుంది. ఈ మేరకు ముసాయిదా బిల్లు రూపొందించింది. వీటిపై చర్చించి రిజర్వేషన్ల పెంపునకు ఆమోద ముద్ర వేసేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన కేబినెట్ శనివారం సమావేశమవనుంది. కేబినెట్ భేటీలో తీసుకునే తుది నిర్ణయం మేరకు రిజర్వేషన్ల శాతం ఖరారవుతుంది. మూడ్రోజుల కిందట బీసీ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించి రిజర్వేషన్ల పెంపుపై మంత్రివర్గం విధాన నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ ఆమోదించిన బిల్లును ఆదివారం జరిగే అసెంబ్లీ, మండలి సమావేశంలో ప్రవేశపెడతారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెంచుకునేందుకు తమిళనాడు తరహాలో రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరే తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రిజర్వేషన్లను పెంచేందుకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ముస్లింలకు (బీసీ–ఈ కోటా) 4 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. తాజా పెంపుతో ముస్లింల రిజర్వేషన్లు 12 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతానికి చేరతాయి. కేబినేట్లో తీసుకునే నిర్ణయం మేరకు ఒక శాతం అటుఇటుగా ముసాయిదా బిల్లును ఆమోదించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సిఫారసు 9 నుంచి 12 శాతం ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్లు పెంచాలని ఈ నెల 12 జరిగిన భేటీలోనే మంత్రివర్గం తీర్మానించింది. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పొందుపరచినట్లుగా ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్లను పెంచి తీరుతామని ముఖ్యమంత్రి అదే రోజున స్పష్టం చేశారు. బీసీ కమిషన్, చెల్ల్లప్ప కమిషన్, సుధీర్ కమిషన్ నివేదికలను పరిశీలిస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్టీలకు 12 శాతం, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొంది. రాష్ట్రంలోని ముస్లింల సామాజిక స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన సుధీర్ కమిషన్ ముస్లింల రిజర్వేషన్లను కనీసం 9 నుంచి 12 శాతం పెంచాలని సిఫారసు చేసింది. ఎస్టీల సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసిన చెల్లప్ప కమిషన్ వారి రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలని కోరింది. ఈ నేపథ్యంలో ముస్లింలు, ఎస్టీలకు ప్రభుత్వం ఎంత శాతం రిజర్వేషన్లను పెంచనుంది? న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఎలాంటి వ్యూహం అనుసరిస్తుంది? అన్న ఉత్కంఠ నెలకొంది. 62 శాతానికి రిజర్వేషన్లు..! ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలకు మొత్తం 50 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. తాజా ముసాయిదా ప్రకారం ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్ల పెంపుతో ఇది 62 శాతానికి చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో ఎస్సీలకు, బీసీలకు సైతం త్వరలోనే రిజర్వేషన్లను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీలకు ఒక శాతం రిజర్వేషన్ పెంచే అవకాశమున్నట్లు ముఖ్యమంత్రి ఇటీవలే సూచనప్రాయంగా వెల్లడించారు. బీసీలకు ఎంత మేరకు రిజర్వేషన్లను పెంచాలనే అంశంపై అధ్యయనం చేసే బాధ్యతలను బీసీ కమిషన్‌కు అప్పగించారు. 2011 జనాభానే ప్రాతిపదిక రిజర్వేషన్ల పెంపునకు కేంద్రం పరిగణనలోకి తీసుకునే 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం సూచనల మేరకు తమిళనాడు అనుసరించిన వ్యూహాన్ని పక్కాగా అనుసరించనుంది. ప్రస్తుతం తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తం జనాభాలో 12.7 శాతం ముస్లింలున్నారు. వీరిలో 81 శాతం వెనుకబడిన కేటగిరీలో ఉన్నారు. రాష్ట్ర జనాభాలో ఎస్టీలు 9.08 శాతం ఉన్నారు. తమను కూడా ఎస్టీల్లో చేర్చాలని వాల్మీకి బోయ, కాయితీ లంబాడాలు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు కులాలను ఎస్టీల్లో చేరిస్తే వీరి జనాభా 10 శాతానికి చేరనుంది. ఆరేళ్ల కిందటి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల పెంపు జరుగుతుందా? ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా..? అనేది కేబినెట్లో తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఎజెండాలో 40 అంశాలు ముస్లింలకు, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపుతో సహా దాదాపు 40 అంశాలు శనివారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్నాయి. గతేడాది జూలై నుంచి ఉద్యోగులకు చెల్లించాల్సిన 3.68 శాతం డీఏ ఫైలుకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. మత్స్య కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను రూ.లక్ష నుంచి రూ.4 లక్షలకు పెంచే ప్రతిపాదనపై చర్చించనున్నారు. సాయిసింధ్ కేన్సర్ హాస్పిటల్‌కు భూ కేటాయింపు అంశం, హోంశాఖలో కొద్ది రోజులుగా పెండింగ్ లో ఉన్న 105 మంది పోలీస్ అధికారుల పదోన్నతుల ప్రతిపాదనలను మంత్రివర్గం పరిశీలించనుంది. కేంద్ర ప్రభుత్వం పంపిన జీఎస్టీ బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. -
సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ
-
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధి
ముసాయిదా చట్టానికి కేబినెట్ ఆమోదం - జనాభా నిష్పత్తి ప్రకారం నిధుల కేటాయింపు - ఒక ఏడాది ఖర్చు కాకుంటే వచ్చే ఏడాదికి బదిలీ - మూడు నెలలకోసారి అసెంబ్లీకి వ్యయ నివేదిక - భూదాన్ చట్టానికి ఐదు సవరణలు - నియమిత పదవులు, జీతాల చెల్లింపులకూ సవరణ - ఈ సమావేశాల్లోనే బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక (సబ్‌ప్లాన్)లకు ప్రత్యామ్నాయంగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు చేసే చట్టం ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతోపాటు భూదాన్ చట్ట సవరణ, జీతాల చెల్లింపు చట్ట సవరణ బిల్లులను ఆమోదించింది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లులను అసెంబ్లీ, శాసన మండలిలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయింది. గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుతెన్నులతో పాటు సభలో ప్రవేశపెట్టాల్సిన మూడు బిల్లులపై ప్రధానంగా చర్చించారు. బడ్జెట్ రూపకల్పనలో మార్పులు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు బదులు కొత్త చట్టం అనివార్యమని ప్రభుత్వం భావించింది. ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండాలి.. నిధులెలా ఖర్చు చేయాలన్న అంశాలపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్ అధ్వర్యంలో సీఎం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. సబ్‌కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు కొత్త చట్టం ముసాయిదాను తయారు చేశారు. దీని ప్రకారం ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు బడ్జెట్లో జనాభా నిష్పత్తి ప్రకారం విధిగా నిధులు కేటాయిస్తారు. ఈ నిధులు ఒక ఏడాది ఖర్చు కాకపోతే.. వాటిని తదుపరి సంవత్సరానికి బదిలీ చేసే పద్ధతిని (క్వారీ ఫార్వర్డ్) అనుసరిస్తారు. సబ్‌ప్లాన్‌లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు ఖర్చు చేయటం లేదని, దారి మళ్లిస్తున్నారనే విమర్శలుండేవి. అందుకే కొత్త చట్టం ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి ఎస్టీ, ఎస్టీ అభివృద్ధి నిధికి సంబంధించిన ఖర్చుల నివేదికలను అసెంబ్లీ, మండలి ముందుంచుతారు. పథకాల వారీగా వ్యయాన్ని వెల్లడిస్తారు. జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయిస్తే సరిపోదని, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఆ నిధులను పూర్తి స్థాయిలో ఉపయోగించే లక్ష్యంతోనే ప్రభుత్వం కొత్త చట్టానికి రూపకల్పన చేసింది. భూదాన్ చట్ట సవరణకు ఓకే ప్రస్తుతం అమల్లో ఉన్న భూదాన్ చట్టాన్ని సవరించేందుకు మంత్రివర్గం అమోదం తెలిపింది. కొత్తగా ప్రతిపాదించిన ఐదు సవరణల ప్రకారం.. భూదాన్ ట్రస్ట్‌లోని సభ్యత్వాన్ని సమీక్షించేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం తొమ్మిది మందితో ఉన్న భూదాన్ బోర్డులోని సభ్యుల సంఖ్యను అనుకున్నప్పుడు.. అవసరం మేరకు ప్రభుత్వం తగ్గించే వెసులుబాటు ఉంటుంది. బోర్డు కాల పరిమితి ముగిసిన తర్వాత మూడేళ్ల వ్యవధిలో కొత్త బోర్డు నియామకం చేపట్టాలి. ఆక్రమణకు గురైన భూదాన్ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం తహసీల్దార్లు/ఆర్డీవోల పరిధిలో ఉంటుంది. నిరుపయోగంగా ఉన్నవి, ఇప్పటికీ పంపిణీ కాని భూములన్నీ భూదాన్ బోర్డు అధీనంలోకి వస్తాయి. వీటిని తిరిగి పంపిణీ చేస్తారు. జీతాల చెల్లింపుల సవరణ బిల్లు నియామక పదవులు, జీతాల చెల్లింపులకు (ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్ట్) సంబంధించిన చట్టాన్ని ప్రభుత్వం సవరించింది. ప్రభుత్వ సలహాదారులు, నామినేటేడ్ హోదాల్లో ఉన్న వారికి చెల్లించే జీతాలతోపాటు రెండేసి పదవుల్లో ఉన్న వారికి చెల్లించే వేతనాలకు స్వల్పంగా మార్పులు చేసినట్లు తెలిసింది. -
ఏప్రిల్ 27న ప్లీనరీ.. ఇవే కేబినెట్ కీలక నిర్ణయాలు!
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం స్థానంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకాభివృద్ధి నిధి యాక్ట్‌ను తేవాలని కేబినెట్ నిర్ణయించింది. భూదాన్ బోర్డు చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సవరణల మేరకు భూదాన్ బోర్డు నిర్మాణంలో ప్రభుత్వం కీలక సవరణలు తేనుంది. భూదాన ఉద్యమ రూపశిల్పి వినోభా బావే నామినీలు భూదాన్ బోర్డులో ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం తొలగించనుంది. ప్రభుత్వమే ఎంతమందితోనైనా కొత్త బోర్డు ఏర్పాటుచేసేలా చట్ట సవరణలు తీసుకురానుంది. ఆక్రమణకు గురైన భూదాన భూములను రక్షించేందుకు తహశీల్దార్‌కు అధికారాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక వచ్చేనెల 27న అధికార టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని ఘనంగా జరుపాలని కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అదేరోజు భారీ ర్యాలీకి ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. వరంగల్ ప్లీనరీ వేదికగా తెలంగాణ ప్రభుత్వ విజయాలపై ప్రజలకు సంపూర్ణ సందేశాన్ని ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించారు. -
ఉద్యోగాల భర్తీకి తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో వివిధ శాఖల్లో ఉద్యోగాల నియామకాలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కేబినెట్ సమావేశం మూడు గంటల పాటు జరిగింది. బడ్జెట్ ప్రతిపాదనలు, సమావేశాల తేదీలపై చర్చ జరిగింది. హోంశాఖలో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మిషన్ భగీరథలో 480 పోస్టులు, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో 360 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్, తాజా పరిస్థితిపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 7,800 కోట్ల రూపాయలు బ్యాంక్ రుణం తీసుకోవాలని నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల్లో మైనార్టీల రిజర్వేషన్ల బిల్లును ప్రవేశ పెట్టాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. రాజీవ్ సాగర్, ఇంద్ర సాగర్ ప్రాజెక్ట్‌లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నాయిని అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ: జైళ్లల్లో తీసుకురావాల్సిన సంస్కరణలపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. -
రేపు కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గురువారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అవుతోంది. సీఎం కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సచివాలయంలో మధ్యా హ్నం 2 గంటలకు ఈ భేటీ జరుగుతుంది. ప్రధానంగా ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్ల శాతా న్ని పెంచే అంశంపై ఈ సమావేశంలో చర్చించ నున్నారు. మైనారిటీల సామాజిక ఆర్థిక స్థితి గతులపై అధ్యయనం చేసిన సుధీర్ కమిషన్, ఎస్టీల జీవన స్థితిగతులపై అధ్యయనం చేసిన జస్టిస్ చెల్లప్ప కమిషన్ ఇప్పటికేæ తమ నివేదిక లను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలి సిందే. రిజర్వేషన్ల పెంపునకు కట్టుబడి ఉన్నట్లు ఇటీవల అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల పెంపు, అవసరమైన చట్టసవరణ కోరుతూ కేంద్రానికి పంపే ప్రతి పాదనలపై చర్చిస్తారు. మరో 15 అంశాలతో ఎజెండాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. బడ్జెట్ తయారీపై పరిశీలన.. 2017–18 బడ్జెట్ తయారీతో పాటు బడ్జెట్ సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలి, బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. బడ్జెట్ రూప కల్పనలో నూతన నిబంధనలకు అనుగుణం గా ఈసారి ప్రణాళికా, ప్రణాళికేతర వ్యయాన్ని విలీనం చేయనున్న విషయం తెలిసిందే. అంతే గాకుండా కేంద్రం ఈసారి నెల రోజుల ముం దుగా బుధవారమే పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లు, పన్నుల వాటా, కేంద్ర ప్రాయో జిత పథకాల నిధులపై స్పష్టత వస్తుంది. దీని ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌ను పక్కాగా రూపొం దించుకునే వీలు కలుగనుంది. ఫిబ్రవరి మూడో వారంలో లేదా మార్చి మొదటి వారం లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభించా లని ప్రభుత్వం యోచిస్తోంది. గురువారం జరుగనున్న భేటీలో బడ్జెట్ సమావేశాల తేదీల ను ఖరారుతో పాటు కొత్తగా ప్రవేశపెట్టే ఆకర్షణీయ పథకాలు, వాటి ప్రయోజనాలపై చర్చించే అవకాశముంది. ఇప్పటికే వివిధ శాఖలు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఈ సందర్భంగా సీఎం సమీక్షించనున్నారు. భవనాల అప్పగింతపై చర్చ! హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భవనాలపై గవర్నర్ సమక్షంలో బుధవా రం ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు సమావేశంకానున్నారు. సచివాల యంతో పాటు అసెంబ్లీ, కౌన్సిల్, వివిధ కార్యాలయాలు తమకు అప్పగించాలని తెలం గాణ మంత్రివర్గం ఇప్పటికే తీర్మానం చేసి గవర్నర్‌కు లేఖ రాసింది. అందులో తీసుకునే నిర్ణయాలు, తీర్మానాలు సైతం గురువారం జరిగే కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. వీటితోపాటు గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలనుకున్న ప్రైవేటు వర్సిటీల బిల్లు, మూసీ రివర్ అథారిటీ, కొత్త నియామకాలు, హోంగార్డుల జీతాల పెంపు, పురపాలక, హోంశాఖలకు సంబంధించిన పలు చట్ట సవరణలు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. సబ్‌ప్లాన్ నిధుల బదిలీకి చట్ట సవరణ ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్ నిధులు, సబ్‌ప్లాన్ చట్ట సవరణపై ఇటీవల అఖిలపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమీక్షిం చిన సీఎం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశా రు. బడ్జెట్లో సబ్‌ప్లాన్‌కు కేటాయించే నిధులు ఖర్చు కాకపోతే వచ్చే ఏడాదికి బదిలీ అయ్యే పద్ధతి అమలు చేయాలని, సబ్‌ప్లాన్ పేరు మార్చాలనే ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ‘క్యారీఫార్వర్డ్ (తర్వాతి ఏడాదికి బదిలీ)’ చేయాలా, వద్దా.. దీనికి చట్టసవరణ చేయాల్సి ఉంటుందా.. అనే అంశాలపై కేబినెట్ భేటీలో చర్చ జరుగనుంది. కమిటీలు ఇచ్చే సిఫారసులు ఈ సందర్భంగా కీలకం కానున్నాయి. -
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు విధివిధానాల కోసం విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శాసనసభ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం భేటీ అయిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నగదు రహిత లావాదేవీలపై మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇకపై ప్రభుత్వ లావాదేవీలన్నీ నగదురహిత విధానంలోనే చేపట్టాలని నిశ్చయించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీల దిశగా ప్రజలను మళ్లించాలని సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీలో పేర్కొన్నారు. ఇక కృష్ణ ట్రిబ్యునల్ తీర్పుపై అప్పీల్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే కొత్త భూసేకరణ చట్టానికి ఆమోదం తెలిపింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు సభ ముందుకు రానుంది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు కోసం ఆర్థికశాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలని కేబినెట్ నిర్ణయించింది. -
క్యాష్‌లెస్ లావాదేవీలే పరిష్కారం: కేసీఆర్
-
నగదు ర‘హితం’
క్యాష్‌లెస్ లావాదేవీలే పరిష్కారం: కేసీఆర్ ♦ మొబైల్ యాప్‌లు, స్వైప్ మిషన్లు, ఆన్లైన్ చెల్లింపులకు పెద్దపీట ♦ బ్యాంకు లావాదేవీలను ప్రోత్సహించేందుకు చర్యలు ♦ రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు ♦ ఢిల్లీతో సంప్రదింపులకు అనుసంధాన కమిటీ ♦ నల్లధనం లేని, అవినీతి రహిత దేశంగా మార్చేందుకు పూర్తి మద్దతిస్తాం ♦ నోట్ల రద్దు.. ఓ పెద్ద సంస్కరణ.. కానీ అంతటితో ఆగిపోవద్దు ♦ వివిధ రూపాల్లోని నల్ల డబ్బు.. నల్ల జబ్బును వదిలించాలని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్ నల్లధనం లేని, అవినీతి రహిత దేశంగా భారత్‌ను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా మద్దతిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దుతోనే ఆగిపోవద్దని, వివిధ రూపాల్లో విస్తరించిన నల్లధనానికి సమూలంగా అడ్డుకట్ట వేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘‘నోట్ల రద్దు చర్యను గుడ్డిగా వ్యతిరేకించాల్సిన పనిలేదు. మద్దతివ్వాల్సిన పని లేదు. ఇదో పెద్ద సంస్కరణగా గుర్తించాలి. నగదు రహిత లావాదేవీలతో భవిష్యత్తులో ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ వ్యూహాన్ని అర్థం చేసుకునేందుకు సమయం పడుతుంది’’ అని పేర్కొన్నారు. ఆస్తులు, అంతస్తులు, భూములు, వజ్రాలు, బంగారం, వెండి, షేర్ మార్కెట్, హవాలా, విదేశీ మారకద్రవ్యం, విదేశాల్లో హవాలా సొమ్ము.. రూపంలో ఉన్న నల్లధనాన్ని అరికట్టేందుకు చర్యలు చేపడితే తమ ప్రభుత్వం తరఫున కేంద్రానికి సంపూర్ణ మద్దతుంటుందని వెల్లడించారు. ‘‘ఎవరు ఎవరినీ లంచం అడగొద్దు.. ఎవరు ఎవరికి లంచం ఇవ్వొద్దు.. అలాంటి రోజులు రావాలి. అంతకు మించిన సంస్కరణ ఇంకేం కావాలి. మళ్లీ కొందరు నల్లదొంగలు బతికి ఉండకూడదు. అన్ని రకాల నల్లడబ్బు.. నల్ల జబ్బును వదిలిస్తేనే ఈ నిర్ణయం సఫలమవు తుంది. లేదంటే విఫల ప్రయోగంగా మిగిలి పోతుంది. ఇది స్వాగతించదగ్గ పరిణామం. దీనికి వంద శాతం మద్దతిస్తాం. ఇదే విషయాన్ని ప్రధానితో చెప్పాను’’ అని సీఎం అన్నారు. నోట్ల రద్దు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమైంది. నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి వీల్లేదన్నారు. ప్రజలను చైతన్యపరచాలి ఇటీవల ఢిల్లీకి వెళ్లి ప్రధానితో దాదాపు గంటసేపు జరిగిన భేటీలో నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులనే చర్చించానని, పలు పరిష్కారాలను సూచించినట్లు సీఎం చెప్పారు. తర్వాత రాష్ట్రానికి వచ్చిన ప్రధానితోనూ రెండుసార్లు మాట్లాడానని, ప్రధాని కార్యాలయానికి పలు సిఫారసులను పంపించినట్లు వివరించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంలో కానీ.. అమలులో కానీ రాష్ట్రాల పాత్ర లేదన్నారు. కానీ నిర్ణయం అమలులో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర పోషించటం సరైంది కాదన్నారు. ‘‘పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను చైతన్యపరచాల్సి ఉంది. ప్రజల్లో అవగాహన కల్పించి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే చర్యలు చేపట్టాల్సి ఉంది. అందుకే రాష్ట్ర మంత్రివర్గంలో ఇదే అంశాన్ని సుదీర్ఘంగా చర్చించాం. దేశంలో 25 కోట్ల బ్యాంకు ఖాతాలుంటే.. రాష్ట్రంలో 82 లక్షల ఖాతాలున్నాయి. ఉపాధి హామీ చెల్లింపులు కూడా బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా జరుగుతున్నాయి. కానీ మన దేశంలో నగదుతో కూడిన ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. కూరగాయలు, పండ్లు మొదలు నిత్యావసరాలన్నీ చెక్కులు, ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేయటం కనిపించదు. రూ.140 లక్షల కోట్లు ఉన్న దేశ ఆదాయంలో 12 శాతమే నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. కానీ మిగతా 88 శాతంపై దీని ప్రభావం ఉంటుంది. అందుకే తాత్కాలికంగా అన్ని రాష్ట్రాల ఆదాయం పడిపోతుంది’’ అని సీఎం వివరించారు. నగదు రహిత లావాదేవీలకు టాస్క్‌ఫోర్స్ నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ సాఫీగా ముందుకు సాగాలంటే.. రాష్ట్ర జీవిక కొనసాగాలంటే నగదు రహిత లావాదేవీలే పరిష్కారమని సీఎం స్పష్టంచేశారు. లేకుంటే కొనుగోళ్లు, అమ్మకాల వ్యవస్థ అచేతనంగా మారిపోయే పరిస్థితి ఉందన్నారు. ‘‘ప్రజల అవసరాలు తీర్చటంతో పాటు కొనుగోళ్లు, అమ్మకాలతో వ్యాపారాలు నిలబడాలంటే మొబైల్ యాప్, స్వైపింగ్ మిషన్లు, చెక్కులు, ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరగాలి. అన్నీ బ్యాంకు ఆధారిత లావాదేవీలు జరిగేలా చూడటం తప్ప గత్యంతరం లేదు. రాష్ట్రానికి తగిన ఆదాయం రావాలంటే కూడా ఇదొక్కటే పరిష్కారం. బ్యాంకు లావాదేవీలు పెంచుకున్న రాష్ట్రం దేశంలో ముందుకుపోయే ఆస్కారముంటుంది. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యల్ని అధిగమించేందుకు రాష్ట్రస్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశాం. ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా సారథ్యంలో జయేశ్‌రంజన్, నవీన్‌మిట్టల్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్, సూర్యాపేట కలెక్టర్ సురేంద్రమోహన్, సీఏంవో నుంచి శాంతికుమారి సభ్యులుగా నియమించాం. రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ ఫీజులన్నీ నెట్ బ్యాంకింగ్ ద్వారా, వ్యాట్ డీలర్ల నుంచి పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర స్వైపింగ్ మిషన్లు, రైతులకు చేసే చెల్లింపులన్నీ బ్యాంకుల ద్వారా జరిగేలా చూడటం, రేషన్ షాపులు, మిల్క్ ఫెడరేషన్లు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్లన్నింటా నగదు రహిత చెల్లింపులకు ఈ కమిటీ సిఫారసులు చేస్తుంది. నోట్ల రద్దు తదనంతర పరిణామాలతో ఢిల్లీతో సంప్రదింపులు జరిపేందుకు, రాష్ట్ర పరిస్థితులను నివేదించేందుకు నలుగురు అధికారులతో అనుసంధాన కమిటీని నియమిస్తాం’’ అని సీఎం వివరించారు. ఐదారు రోజుల్లో కలెక్టర్లతో భేటీ అయిదారు రోజుల్లో జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించి జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు, అక్కడ చేపట్టాల్సిన చర్యలను చర్చిస్తామని సీఎం వెల్లడించారు. ఖాతాలున్న వారందరూ బ్యాంకుల ద్వారా లావాదేవీలు నిర్వహించేలా చూడటం, లేని వారిని ఖాతాలు తెరిపించేందుకు ప్రోత్సహిస్తామన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను విస్తరించాలని, మూడు, నాలుగు గ్రామాలకు ఒక బ్యాంకు ఉండాలని, వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామాల్లో ఒక ఏటీఎం ఉండేలా చూడాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 14.5 లక్షల స్వైపింగ్ యంత్రాలుంటే రాష్ట్రంలో 85 వేల నుంచి లక్ష స్వైపింగ్ మిషన్లు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు జరగాలంటే పది కోట్ల యంత్రాలు అవసరమవుతాయన్నారు. అందుకే రెండు వ్యూహాలపై దృష్టి సారిస్తామని, స్వైపింగ్ యంత్రాలను సమకూర్చుకోవటంతో పాటు మొబైల్ యాప్‌ల ద్వారా చెల్లింపులను ప్రోత్సహిస్తామని వివరించారు. ‘డబుల్’ ఇళ్లతో ఉపాధి కల్పిస్తాం నోట్ల రద్దు నిర్ణయం స్థిరాస్తి రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో దాదాపు పది లక్షల మంది నిర్మాణ రంగంపై ఆధారపడ్డ శ్రామికులు ఉన్నారని, వారిలో ఎక్కువ మంది పని కోల్పోయే ప్రమాదముందని చెప్పారు. అందుకే జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని శరవేగంగా చేపట్టాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. దానివల్ల ఈ రంగంలో ఉన్న కార్మికులకు ఉపాధి దొరకడంతోపాటు పేదలకు రెండు పడక గదుల ఇళ్ల కల నెరవేరుతుందన్నారు. త్వరలో టీఎస్ వ్యాలెట్ రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు టీఎస్ వ్యాలెట్ పేరుతో మొబైల్ యాప్‌ను త్వరలోనే ఆవిష్కరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఐటీ శాఖ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. నగదు రహిత లావాదేవీలపై ఎక్కువ చార్జీలు పడకుండా మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ను ఎత్తివేయాలని ఇటీవలే ప్రధానిని కోరామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర మనుగడ కీలకమని, మీడియా ప్రజలకు సహాయ సహకారిగా నిలబడాలని పేర్కొన్నారు. సిద్దిపేటలో పైలెట్ ప్రాజెక్టు నగదు రహిత లావాదేవీలను సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. ‘‘మున్సిపాలిటీతో పాటు మూడు మండలాల్లోని ప్రజలకు రూ.500 వరకు నగదుకు అవకాశమిచ్చి.. మిగతా లావాదేవీలన్నీ నగదు రహితంగా చేసే అవకాశం కల్పిస్తాం. బ్యాంకులు చెప్పినంత వేగంగా సహకరిస్తే నెలన్నర రోజుల్లోనే ఈ ప్రాజెక్టు అమలవుతుంది. అక్కడ ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందుకెళుతాం. గుజరాత్ రాష్ట్రంలో అకోదర గ్రామంలో నగదు రహిత విధానం ఎప్పట్నుంచో అమల్లో ఉంది. అదే స్ఫూర్తిగా ఈ విధానం అమలు చేస్తాం..’’ అని సీఎం వివరించారు. మరిన్ని రూ.5 భోజన కౌంటర్లు ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు అమల్లో ఉన్న రూ.5 భోజనం అందించే కౌంటర్లను 150కి పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం 50 కౌంటర్ల ద్వారా రోజుకు 15 వేల మందికి భోజనం అందిస్తున్నారు. వీటిని పెంచి 45 వేల మందికి భోజనం అందించనున్నారు. -
నోట్ల రద్దు: సీఎం కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాలు
-
నోట్ల రద్దు: సీఎం కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాలు
హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అని, ఇందులో రాష్ట్రాల పాత్ర ఏమీలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అయినా ఈ విషయంలో రాష్ట్రాలు ప్రేక్షకపాత్ర వహించరాదని పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయంతో బిత్తరపోయి.. డంగైపోవాల్సిన అవసరంలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పంచుకున్నట్టు తెలిపారు. పెద్దనోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని కొనియాడారు. పెద్దనోట్ల రద్దు అనంతరం పరిణామాలపై తెలంగాణ కేబినెట్ సోమవారం భేటీ అయి సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాకు వివరాలు తెలిపారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తెలంగాణలోని పరిస్థితిని అంచనా వేసేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేసినట్టు తెలిపారు. నల్లధనం ఏ రూపంలో ఉన్నా.. దానిని అరికట్టవచ్చునని అన్నారు. ఈ వ్యవస్థ మారాలని తాను ఎప్పటినుంచో అనుకునేవాడినని, పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధాని మోదీతో తన అనుభవాలు, అవగాహనను పంచుకున్నానని చెప్పారు. పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన సమస్యలు, వాటి పరిష్కారాలపై ప్రధానికి నివేదిక ఇచ్చానని తెలిపారు. తన అభిప్రాయాలతో ప్రధాని కూడా ఏకీభవించారని తెలిపారు. 100శాతం నల్లధనం రహిత, అవినీతి రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు కృషిచేస్తే యావత్ తెలంగాణ మోదీకి అండగా ఉంటుందని అన్నారు. కేబినెట్లోని కీలక నిర్ణయాలు 100శాతం నగదు రహిత లావాదేవీలను చేయాలనే లక్ష్యంతో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించాం. నగదురహిత లావాదేవీల కోసం టీఎస్ వాలెట్‌ను ప్రవేశపెట్టబోతున్నాం పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో జీహెచ్ఎంసీలో కార్మికులు ఉపాధి కోల్పోకుండా చర్యలు తీసుకున్నాం ఇందుకోసం నగరంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించాం రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, పౌర సరఫరా కార్యాలయాలు, ఇతర అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్వైపింగ్ మిషిన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఖాతాలు ఉన్న ప్రతి ఒక్కరూ బ్యాంకుల ద్వారానే లావాదేవీలు నిర్వహించాలి కొనుగోళ్లు, అమ్మకాలు బ్యాంకుల ద్వారానే జరగాలి. సీఎం కేసీఆర్ చెప్పిన కీలక విషయాలు కేంద్రం నిర్ణయాన్ని అమలుచేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదు చెక్కుల ద్వారా అరటిపండ్లు, కూరగాయాలు కొనే పరిస్థితి లేదు. కాబట్టి నగదు రహిత లావాదేవీలపై కేబినెట్లో చర్చించాం. తెలంగాణ రాష్ట్రంలో 85 లక్షల జన్‌ధన్ ఖాతాలు ఉన్నాయి. పెద్దనోట్ల రద్దుతో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ చాలా పెద్దది. కొంతమేర స్తంభించిపోయే అవకాశముంది. -
తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం
-
తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారమిక్కడ సమావేశమైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. కొత్త సచివాలయం నిర్మాణం, కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ఈ కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. నీటి పారుదల శాఖలో 63 ఇంజినీరింగ్ పోస్టులు, వైద్య ఆరోగ్య శాఖలో 13, అగ్నిమాపక శాఖలో 18 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.అలాగే వ్యాట్ సవరణ, వినోద పన్ను అంశాలపై కేబినెట్ చర్చించనుంది. -
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
-
కొత్త ఉద్యోగులను నియమించండి: సీఎం కేసీఆర్
హైదరాబాద్: కొత్త జిల్లాలకు అవసరమైనంత మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి శాఖలవారీగా, జిల్లాల వారీగా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. కొత్త జిల్లాల్లో పరిపాలనా విభాగాలు ఎలా ఉండాలనే విషయంపై అన్ని ప్రభుత్వ శాఖలు రెండు రోజుల్లో తమ ప్రతిపాదనలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించాలని సూచించారు. కొత్త జిల్లాల్లో పని విభజన, కొత్త ఉద్యోగుల నియామకం, పరిపాలనా విభాగాల ఏర్పాటు తదితర అంశాలను పర్యవేక్షించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన టాస్క్ ఫోర్సు్ను కూడా సీఎం ఏర్పాటు చేశారు. దసరా నుంచే కొత్త జిల్లాలను మనుగడలోకి తేవాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఆలోపు లేదా కొద్దిగా అటుఇటుగా ఉద్యోగుల నియామకాలను కూడా ప్రకటిస్తే అది తెలంగాణలోని నిరుద్యోగులకు మంచి అవకాశంలానే భావించాలి. సోమవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన ముసాయిదాపై, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రభుత్వం రూపొందించిన ముసాయిదాపై మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రజలు నుంచి వస్తున్న సూచనలు, అభ్యంతరాలు, సలహాలు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. దసరా నుంచే కొత్త జిల్లాలతో పాటూ, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు కూడా ప్రారంభం కావాలన్నారు. దీనికి సంబంధించి పాలనా విభాగాల కూర్పు వేగవంతం కావాలని సీఎం ఆదేశించారు. తెలంగాణలో జిల్లా, రాష్ట్ర స్థాయి క్యాడర్ మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నందున, ప్రస్తుతం జోనల్ అధికారులకు అన్యాయం జరగకుండా వారిని పోస్టుల్లో సర్దుబాటు చేయాలని కోరారు. వ్యవసాయం, వైద్యం, విద్య తదితర విభాగాల విషయాల్లో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా, అవసరాల ప్రాధాన్యతతో ఉద్యోగుల సర్దుబాటు జరగాలన్నారు. సూపర్ వైజరీ పోస్టుల కన్నా క్షేత్రస్థాయిలో పని చేసే ఉద్యోగులే ఎక్కువ అవసరం కాబట్టి, మండల స్థాయి అధికారులు, సిబ్బంది నియామకానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఒకే రకమైన పనితీరు కలిగిన విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి ఒకే అధికారిని నియమించడం సబబుగా ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. సీఎస్ నాయకత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీ జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పరిపాలన విభాగాల కూర్పును పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శార్మ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీ వేయాలని కేసీఆర్ నిర్ణయించారు. సి.సి.ఎల్.ఎ. రేమండ్ పీటర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, వరంగల్, మెదక్ కలెక్టర్లు కరుణ, రోనాల్డ్ రాస్, సీఎంఓ అధికారులు శాంతికుమారి, స్మితా సభర్వాల్‌లు కమిటీ సభ్యులుగా ఉంటారు. -
ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ భేటీ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సమావేశమైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 5 గంటలకు సచివాలయంలోని సీ బ్లాక్‌లో మంత్రివర్గం భేటీ అయ్యింది. మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సమావేశాల ప్రాధాన్యం, ఆమోదించాల్సిన కీలక అంశాలను భేటీలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బిల్లు ప్రాధాన్యాన్ని చర్చించి అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఈ సమావేశంలో ఆమోదం తెలుపనుంది. అలాగే గతంలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ పాలక మండళ్లలో సభ్యుల సంఖ్య పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను, సైబరాబాద్ కమిషనరేట్ విభజనకు సంబంధించిన ఆర్డినెన్స్‌నూ చట్టంగా మార్చేందుకు ఈ సమావేశంలోనే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మంత్రి వర్గ భేటీలో ప్రధానంగా ఈ మూడు అంశాలను ఎజెండాగా చేర్చినట్లు సమాచారం. -
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే...
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గం శుక్రవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు మూడు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో కేబినెట్ పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టుల రీడిజైన్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్యాకేజీల్లో మార్పు చేర్పులకు ఆమోదం వేసింది. అలాగే వరంగల్ జిల్లాలో వ్యవసాయ యూనివర్శిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. వరంగల్ జిల్లా మామునూరులో వెటర్నరీ కళాశాల, మహబూబ్ నగర్ జిల్లాలో ఫిషరీస్ సైన్స్ కాలేజ్, మెదక్ జిల్లాలో నిమ్జ్, హైదరాబాద్ లో ఫార్మానిమ్జ్ కోసం టీఎస్ఐఐసీ రూ. 784 కోట్ల హడ్కో రుణం పొందడానికి గ్యారంటీ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక దేవాదాయ, ధర్మాదాయ, ధార్మిక సంస్థల్లో ట్రస్ట్ మెంబర్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టులపై మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాలకు ఆమోదం తెలిపింది. అసైన్డ్ భూములను నిగ్గు తేల్చేందుకు, కమతాల ఏకీకరణకు, భూముల క్రమబద్ధీకరణకు, నిరుపయోగంగా ఉన్న భూముల వినియోగానికి అవసరమైన విధానం రూపొందించాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. ప్రాణహిత, చేవెళ్ల, దేవాదుల ప్రాజెక్టుల పునరాకృతికి మంత్రివర్గం ఆమోదించింది. కంతనపల్లి, సీతారామ, భక్తరామదాసు, రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్, ఎస్ఆర్ఎస్పీ వరద వరద కాలువ రీడిజైన్ పనులకు ఆమోదం తెలిపింది. మొత్తం 19 ప్యాకేజీల్లో మార్పులు చేర్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణం కోసం మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందాలను కేబినెట్ ఆమోదించింది. -
రేపు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ
హైదరాబాద్: రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ల పాలన, పథకాలపై సమీక్షించనుంది. అలాగే వివిధ చట్టాలను తెలంగాణకు అన్వయించుకోవడాన్ని ఈ భేటీలో తెలంగాణ కేబినెట్ ఆమోదించనుంది. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై కూడా తెలంగాణ కేబినెట్ ప్రత్యేక చర్చ జరుపనున్నట్టు సమాచారం. -
కేటీఆర్‌కు ప్రమోషన్... తలసానికి డిమోషన్...
హైదరాబాద్: మంత్రుల శాఖల మార్పుల్లో భాగంగా తలసాని శ్రీనివాస యాదవ్ ను కీలకమైన శాఖ నుంచి తప్పించడంపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అత్యంత కీలకమైన వాణిజ్య పన్నుల శాఖ నుంచి తప్పించి ఆయనకు అంతగా ప్రాధాన్యత లేని పశు సంవర్ధక, ఫిషరీస్, డెయిరీ డెవలప్ మెంట్ శాఖకు మార్చారు. శాఖల మార్పుపై గత కొంతకాలంగా చర్చ జరుగుతుండగా అందుకు సంబంధించి సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. తలసాని నుంచి తప్పించిన వాణిజ్య పన్నుల శాఖను కేసీఆర్ తన వద్దే పెట్టుకున్నారు. తలసానికి పశు సంవర్థక శాఖతో పాటు గతంలో ఉన్న సినిమాటోగ్రఫీ శాఖను అలాగే కొనసాగించారు. ఇకపోతే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమల శాఖలను కేసీఆర్ మార్చారు. పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యవసాయశాఖతో పాటు అదనంగా సహకార శాఖను కూడా అప్పగించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం తర్వాత పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తున్న కేటీఆర్ కు అదనంగా మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలను కేటీఆర్ కు అదనంగా కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ కేటీఆర్ నుంచి తప్పించి దాన్ని జూపల్లి కృష్ణారావుకు అప్పగించారు. అలాగే జూపల్లి ఇప్పటివరకు నిర్వహిస్తున్న వాణిజ్యం పరిశ్రమల శాఖను కేటీఆర్ కు అప్పగించారు. అంటే వీరి శాఖలను అటుఇటుగా మార్చారు. వాణిజ్య పన్నుల శాఖతో పాటు కేటీఆర్ మున్సిపల్ వ్యవహారాల శాఖ కూడా నిర్వహిస్తారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన పరిశ్రమల శాఖతో పాటు గనులు, భూగర్భ వనరుల శాఖ, ఎన్ఆర్ఐ శాఖలను కూడా కేటీఆర్ కు అప్పగించారు. ఒక రకంగా కేటీఆర్ కు కేటాయించిన అదనపు శాఖలను విశ్లేషిస్తే ఆయనకు మరోసారి ప్రమోషన్ లభించినట్టేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే, రాష్ట్రానికి వాణిజ్య పన్నుల శాఖ నుంచే అత్యధిక ఆదాయం లభిస్తుంది. అలాంటి కీలక శాఖ నుంచి తప్పించి అంతగా ప్రాధాన్యత లేని పశు సంవర్ధక శాఖ కేటాయించడం ద్వారా మంత్రి తలసానికి కేసీఆర్ పరోక్ష హెచ్చరికలా పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తలసానికి ఈ మార్పు డిమోషన్ కాగా అందుకు బలమైన కారణాలే ఉంటాయని ఆ వర్గాలు భావిస్తున్నాయి. తలసాని శాఖ మార్చనున్నట్టు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. చివరకు పశుసంవర్ధక శాఖకు పరిమితం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే వాణిజ్య పన్నుల శాఖను తన వద్దే ఉంచుకోవడంతో కేసీఆర్ పరోక్షంగా మరో సంకేతం కూడా ఇచ్చారన్న అభిప్రాయం వినిపిస్తోంది. వాణిజ్య పన్నుల శాఖతో పాటు గ్రామీణ నీటి సరఫరా శాఖను కూడా కేసీఆర్ తనవద్దే పెట్టుకున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారిలో ఎవరికైనా ఆ శాఖలు కేటాయించేందుకే అలా చేసి ఉంటారన్న అభిప్రాయం కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. -
తెలంగాణ మంత్రుల శాఖల్లో మార్పులు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో మంత్రుల శాఖల మార్పుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. మంత్రుల శాఖల మార్పులపై సోమవారం రాత్రి జీవో వెలువడింది. నాలుగు శాఖల మార్పుకు కేసీఆర్ పచ్చజెండా ఊపారు. ఇక పని భారం పెరిగినందున మైనింగ్ శాఖ నుంచి తనను తప్పించాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరినట్లు సమాచారం. కేటీఆర్‌కు-పరిశ్రమలు, మైనింగ్ శాఖలు జూపల్లి కృష్ణారావు- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పోచారం శ్రీనివాసరెడ్డి-సహకార శాఖ తలసాని శ్రీనివాస్ యాదవ్-బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక డెయిరీ డెవలప్మెంట్ శాఖలు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దే వాణిజ్య పన్నులు, గ్రామీణ నీటి సరఫరా (వాటర్ గ్రిడ్) శాఖలు తన వద్దే ఉంచుకున్నారు. -
తెలంగాణ మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు
హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో మరోసారి స్వల్ప మార్పులు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్‌కు పరిశ్రమల శాఖ, జూపల్లి కృష్ణారావుకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేటీఆర్ ఇప్పటికే పంచాయితీరాజ్, ఐటీతో పాటు మున్సిపల్ శాఖలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా రెండు, మూడు రోజుల్లో శాఖల మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇక గతంలోనూ మంత్రుల శాఖల్లో మార్పులు జరిగిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరికి విద్యా శాఖ కేటాయించి, అప్పటి వరకు విద్యా శాఖ మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డికి విద్యుత్ శాఖను, మంత్రి లక్ష్మారెడ్డికి వైద్య, ఆరోగ్య శాఖను కేటాయించారు. -
నిఘా నీడలో జంటనగరాలు
హైదరాబాద్: నూతన ఐటీ పాలసీకి కేబినెట్ తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 44 జాతీయ మార్కెట్ల విధివిధానాలకే కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్కెట్ కమిటీల ఏర్పాటు, రిజర్వేషన్ల ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. జంట నగరాల్లో లక్ష సీసీ కెమెరాలు అమర్చాలని నిర్ణయించారు. ఈ 14న రాష్ట్ర ఆర్థికశాక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం, ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించారు. మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ కు తెలంగాణ మంత్రులు అభినందనలు తెలిపారు. -
సమావేశం కానున్న తెలంగాణ కేబినెట్
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని సీఎం గవర్నర్ ను కోరినట్లు సమాచారం. కాగా మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ ఆమోదం, ప్రాజెక్టుల రీ డిజైన్ సహా పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. -
త్వరలో సినిమా అవార్డుల వేడుక: తలసాని
హైదరాబాద్ : త్వరలో సినిమా అవార్డుల వేడుకను ఏర్పాటు చేస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ భేటీలో తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ... నంది అవార్డుల పేరు మార్చే ప్రతిపాదన ఉందని తెలిపారు. 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న అవార్డులను అందిస్తామన్నారు. సినిమా షూటింగ్‌లకు సింగిల్ విండో అనుమతులు ఇస్తామని తలసాని స్పష్టం చేశారు. చిత్రపురి కాలనీలో 10 వేల మందికి ఇళ్లు నిర్మించనున్నట్లు చెప్పారు. థియేటర్లలో రోజుకు 5 సినిమాల అంశాన్ని పరిశీలిస్తున్నామని తలసాని పేర్కొన్నారు. ఈ భేటీలో మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావుతోపాటు సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, కేఎస్ రామారావు, రాజేంద్ర ప్రసాద్, అశోక్ కుమార్, ఆర్ నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఇక శ్రీరామ సాగునీటి పథకం..
- పండ్లు, పూల తోటలు 10 లక్షల ఎకరాలపైగా సాగు పెంచాలి - దుమ్ముగూడెం ప్రాజెక్ట్ రీడిజైన్‌కు.. శ్రీరామ సాగునీటి పథకంగా నామకరణం - తెలంగాణ కేబినెట్, హార్టీ కల్చరల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం - తెలంగాణ ఉద్యోగులకు 3.14 శాతం డీఏ పెంపునకు నిర్ణయం - వివిధ శాఖల్లో కొత్త పోస్టుల నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్: తెలంగాణ హార్టికల్చర్ కార్పొరేషన్(ఉద్యానవన శాఖ) ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. పండ్లు, పూల తోటలు, 10 లక్షల ఎకరాలపైగా పెంచాలని నిర్ణయించింది. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు అంశాలపై తెలంగాణ కేబినెట్ చర్చించింది. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ రీడిజైన్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్.. శ్రీరామ సాగునీటి పథకంగా నామకరణం చేసింది. సినీ పరిశ్రమల సమస్యల పరిష్కారానికి మంత్రి తలసాని యాదవ్ నేతృత్వంలో ఉపసంఘం ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ ఉద్యోగులకు 3.14 శాతం డీఏ పెంపునకు నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల్లో కొత్త పోస్టుల నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపుపై కేబినెట్ నిర్ణయాన్ని వెల్లడించింది. -
తెలంగాణ ఉద్యోగులకు తీపి కబురు
► బడ్జెట్ కేటాయింపులు, గవర్నర్ ప్రసంగంపై చర్చ ► ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపుపై నిర్ణయం ► దుమ్ముగూడెం రీ డిజైన్ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం ► తెలంగాణ ఉద్యోగులకు 3.14 శాతం డీఏ పెంపుపై నిర్ణయం హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీ ఆదివారం ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా బడ్జెట్ కేటాయింపులు, గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై చర్చ జరుగ నున్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకుగానూ తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఈ సందర్భంగా కేబినెట్ అభినందించింది. తెలంగాణ ఉద్యోగులకు 3.14 శాతం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రైగ్యులరైజ్ కోసం కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యాక్ట్‌ను తెలంగాణకు అన్వయించుకునే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దుమ్ముగూడెం రీ డిజైన్ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్థిక, ఆరోగ్య శాఖలతో పాటు వివిధ శాఖల్లో కొత్త పోస్టుల నియమకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మరొక స్లాబ్‌ను ఏర్పరిచే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
నెలాఖరులోగా ‘కాంట్రాక్టు’ క్రమబద్ధీకరణ
-
నెలాఖరులోగా ‘కాంట్రాక్టు’ క్రమబద్ధీకరణ
- రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం - ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల పెంపు - 15,628 టీచర్ పోస్టుల భర్తీకి ఆమోదం - ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం కాలుష్య భత్యం - దరఖాస్తు చేసుకున్న వారంలో కారుణ్య నియామకాలు - చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు, భద్రత - 40 టీఎంసీల సామర్థ్యంతో ‘గ్రేటర్’కు రెండు తాగునీటి జలాశయాలు, ఆస్తి పన్ను రాయితీ, నల్లా బిల్లు బకాయిల మాఫీ - సుదీర్ఘంగా 11 గంటలపాటు కేబినెట్ సమావేశం సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన మాటను తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంది. కొత్త పంథాలో బడ్జెట్ తయారీకి రూపకల్పన చేయటంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలపై వరాల జల్లు కురిపించింది. శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెలాఖరులోగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేబినేట్ ఆదేశించింది. ప్రభుత్వ పరిధిలోని అన్ని శాఖల్లో ఈ ప్రక్రియ అమలు కానుంది. దాదాపు 18 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారని సీఎం కేసీఆర్ ఉజ్జాయింపుగా వెల్లడించారు. ‘తొలిసారిగా జరిగిన కాంట్రాక్టు నియామకాల్లో రిజర్వేషన్లను పాటించలేదు. ఆ తర్వాత పాటించారు. అందుకే ఈ రెగ్యులరైజేషన్‌తో రిజర్వేషన్ రోస్టర్ నిబంధనలకు ఇబ్బంది కలిగితే సంబంధిత కేటగిరీలో అవసరమైనన్ని బ్యాక్లాగ్ పోస్టులు సృష్టించి తర్వాత వాటిని భర్తీ చేస్తాం. అవినీతి, పైరవీలకు ఆస్కారం లేకుండా అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. శాఖల వారీగా ఉద్యోగులు, విధివిధానాలు త్వరలోనే ఖరారవుతాయి’ అని సీఎం వెల్లడించారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. జనవరి ఒకటి నుంచే పెరిగిన వేతనం అమల్లోకి రానుంది. మూడు కేటగిరీలుగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో రూ.6,700 జీతం పొందుతున్న వారికి రూ.12 వేలు, రూ.8,400 వేతనం ఉన్న వారికి రూ.15 వేలు, రూ.10,900 వేతనం పొందుతున్న వారికి రూ.17 వేలకు పెంచింది. ప్రభుత్వానికి దాదాపు రూ.400 కోట్ల అదనపు భారమైనప్పటికీ సరిపడేంత వేతనం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలు, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాలు, ఆదర్శ పాఠశాలల్లో 15,628 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అందులో 1,225 ఉర్దూ పాఠశాలల పోస్టులున్నాయి. శనివారం ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు సుదీర్ఘంగా పదకొండు గంటల పాటు కేబినెట్ సమావేశమైంది. ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణలోనూ ఇంత సుదీర్ఘంగా కేబినేట్ సమావేశం కావటం ఇదే మొదటిసారి. మారియట్ హోటల్లో మధ్యాహ్న భోజనానికి, డిప్యూటీ సీఎం మనుమరాలి వివాహానికి సీఎం సహా మంత్రులు వెళ్లటంతో కేబినేట్ మధ్యలో రెండుసార్లు దాదాపు గంట పాటు విరామం ఇచ్చారు. కేబినేట్లో చర్చించిన అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని, పోచారం, పద్మారావు సీఎం వెంట ఉన్నారు. దాదాపు అరవై అంశాలకుపైగా ఇందులో చర్చించారు. సీఎం వెల్లడించిన ముఖ్యాంశాలివీ.. రాష్ట్ర వ్యాప్తంగా 18 వేలకు పైగా ఉన్న హెయిర్ సెలూన్స్‌కు వాణిజ్య కేటగిరీ కింద విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నారు. వాటిని గృహాల కేటగిరీకి మార్చాలని ఎన్నో ఏళ్లుగా నాయి బ్రాహ్మణులు కోరుతున్నారు. బీసీ సంక్షేమ శాఖ విజ్ఞప్తి మేరకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే సెలూన్లను గృహ కేటగిరీ కిందకి మార్చాలని నిర్ణయించాం. అందుకు సంబంధించిన రూ.144 కోట్లను ప్రభుత్వం రూ.144 కోట్లు సబ్సిడీగా చెల్లిస్తుంది. ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ చట్టాలు, సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం భద్రత కల్పిస్తాం. వారికి గుర్తింపు కార్డులు జారీ చేయడంతో రుణాల మంజూరీలో సహకరిస్తాం. వారిపై వేధింపులు లేకుండా చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ పోలీసులు కాలుష్యం బారిన పడి తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. వీరికి చెల్లిస్తున్న మూల వేతనంపై 30 శాతం అదనంగా కాలుష్య భత్యం చెల్లించాలని నిర్ణయించాం. నేటి నుంచే (జనవరి 3) దీన్ని అమలు చేస్తాం. హైదరాబాద్ నగరానికి ఎప్పుడో నిజాం నవాబు నిర్మించిన హిమాయత్‌నగర్, గండిపేట జలాశయాలే ఇప్పటికీ దిక్కు. హైదరాబాద్‌ను గొప్పగా అభివృద్ధి చేశామని చెప్పుకునే గత పాలకులు నగరానికి తాగునీటి రిజర్వాయర్లను నిర్మించలేకపోయారు. దేశంలోని ఏ చిన్న నగరాన్ని చూసినా దానికి సమీపంలోనే తాగునీటి జలాశయం కనిపిస్తుంది. హైదరాబాద్ నగర శివార్లలో సైతం 40 టీఎంసీల సామర్థ్యంతో కేవలం తాగునీటి అవసరాల కోసం రెండు జలాశయాలను నిర్మిస్తాం. ఒకటి రామోజీ ఫిల్మ్‌సిటీకి దగ్గరగా రాచకొండ గుట్టల్లో, రెండోది శామీర్‌పేట వద్ద నిర్మిస్తాం. ఇందుకు ఐఎల్ఎఫ్ఎస్ సంస్థ రూ.7,500 కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేబినేట్ ఆమోదించింది. జీహెచ్ఎంసీ పరిధిలో వార్షిక ఆస్తి పన్ను రూ.1,200 లోపు ఉన్న గృహ యజమానుల నుంచి కేవలం రూ.101 మాత్రమే వసూలు చేయాలన్న నిర్ణయాన్ని కేబినేట్ ఆమోదించింది. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. దీంతో 3.12 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో గత 15 ఏళ్లుగా పేరుకుపోయిన నీటి చార్జీల బకాయిలను మాఫీ చేయాలని నిర్ణయించాం. ఇకపై కచ్చితంగా బిల్లులు వసూలు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం. మాఫీ వల్ల రూ.455 కోట్ల బాకాయిలు మాఫీ కానున్నాయి. మైనారిటీల సంక్షేమ శాఖలో ఒక్క రెగ్యులర్ పోస్టు లేదు. ఉన్నవారంతా డిప్యూటేషనే. ఇకపై ప్రతి జిల్లాలో ఆరుగురు అధికారులు, రాష్ట్ర స్థాయిలో మైనారిటీల డెరైక్టరేట్ కార్యాలయంలో 20 మంది అధికారులు ఉండేలా మైనారిటీల సంక్షేమ శాఖ డెరైక్టరేట్‌కు 80 పోస్టులను మంజూరు చేశాం. నీటిపారుదల శాఖకు 108 కొత్త పోస్టులు, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి 147 పోస్టులు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు కానున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు 462 పోస్టులు మంజూరు చేశాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మైనారిటీ బాలికలకు 30, బాలురకు 30... మొత్తం 60 మైనారిటీల రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తాం. జీహెచ్ఎంసీలో స్థలా భావంతో పేదలకు బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నాం. 9 అంతస్తులుండే భవనాల్లో లిఫ్టులు అవసరం. అందుకే జీహెచ్ఎంసీలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం వ్యయాన్ని రూ.5.30 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచాలని నిర్ణయించాం. నిర్ణీత సమయంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు 1.5 శాతం ప్రోత్సాహకంగా అందజేస్తున్నాం. ఈ ప్రోత్సాహకాలను మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు సైతం వర్తింపజేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలోని 97 పట్టణ ఆరోగ్య కేంద్రాలను పీహెచ్‌సీల స్థాయికి తగ్గట్లు అభివృద్ధి పరుస్తాం. ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలంలో ఇండియన్ రిజర్వు పోలీసు బెటాలియన్‌కు 115 ఎకరాలను కేటాయించాలని నిర్ణయించాం. ఉద్యోగ విరమణ రోజే ఉద్యోగులకు పెన్షన్ ప్యాకేజీని అందించటంతో పాటు ప్రభుత్వ వాహనంలో వారిని ఇంటికి గౌరవంగా సాగనంపుతాం. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల దరఖాస్తులు వెంటనే పరిష్కరిస్తాం. కారుణ్య నియామకాలు పెండింగ్‌లో ఉంచకుండా 7 రోజుల్లోనే ఉద్యోగాన్ని కల్పిస్తాం. సంబంధిత శాఖ ఖాళీలు లేకపోయిన ఇతర ఏ శాఖలోనైనా అవకాశాన్ని కల్పిస్తాం. -
తెలంగాణ మంత్రి మండలి నిర్ణయాలు
హైదరాబాద్: దాదాపు మూడు నెలల తర్వాత శనివారం భేటీ అయిన తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదయం 11:30 నుంచి రాత్రి 9:30 వరకు సుదీర్ఘంగా సాగిన సమావేశం వివరాలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మీడియాకు వెల్లడించారు. బడ్జెట్ కేటాయింపులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, హైదరాబాద్ నగరంలో మంచినీటి సరఫరాకు మరో రెండు కొత్త రిజర్వాయర్ల నిర్మాణం సహా పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయాలను తెలియజేశారు. సీఎం తెలిపిన వివరాల్లో కొన్ని ముఖ్యాంశాలు.. తెలంగాణలో అన్నిరంగాల్లో ఆదాయం వృద్ధి చెందింది గత బడ్జెట్ కంటే ఈసారి అదనంగా 15 శాతం బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జనవరిలోనే పూర్తి చేస్తారు. ఇందులో రిజర్వేషన్ పద్ధతిని అమలుచేస్తారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు కూడా ఈ నెల నుంచే అమలు ట్రాఫిక్ పోలీసులకు కాలుష్య భృతి ఇచ్చేందుకు కేబినెట్ ఓకే డీఎస్సీ ద్వారా 15,628 టీచర్ పోస్టుల భర్తీ జీహెచ్ఎంసీలో గత 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రూ. 405 కోట్ల నీటి పన్ను మాఫీ మహబూబ్ నగర్ వైద్యకళాశాలలో ఖాళీగా ఉన్న 462 పోస్టుల భర్తీ హైదరాబాద్ దాహార్తిని తీర్చేందుకు రాచకోండ, శామీర్ పేటల వద్ద ఒక్కోటి 40 టీఎంసీల సామర్థ్యంగల నూతన రిజర్వాయర్ల నిర్మాణానికి మంత్రిమండలి పచ్చజెండా మిషన్ కాకతీయ పనులు సకాలంలోపూర్తిచేసిన కాంట్రాక్ట్ సంస్థలకు 1.5 శాతం ప్రోత్సాహకాలు ఉండి ఉద్యోగి మరణించిన వారంలోగా కారుణ్య నియామకం పూర్తిచేయాలని నిర్ణయం 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే చిన్న తరహా సెలూన్ షాపులను కమర్షియల్ పర్సర్ గా పరిగణించే విధానానికి చెల్లు. ఇకపై వాటిని డొమెస్టిక్ పర్పస్ గా పరిగణిస్తారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ ఏర్పాటుకు 115 ఎకరాల భూమి కేటాయింపు -
అధికారుల కమిటీ నివేదికకు ఆమోదం
-
కేబినెట్ సుదీర్ఘ సమావేశం ప్రారంభం
-
కేబినెట్ సుదీర్ఘ సమావేశం ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అద్యక్షతన కేబినెట్ సమావేశం సచివాలయంలో శనివారం ఉదయం ప్రారంభమైంది. మూడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతుండటంతో దీనికి భారీ ఎజెండా సిద్ధం చేశారు. కొత్త సంవత్సరంలో తొలి భేటీ కావడంతో పండుగ వాతావరణం నెలకొంది. రెండు మూడు రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూలు జారీ కానుండటంతో పీఠాన్ని చేజిక్కించుకోడానికి ఏం చేయాలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశానికి సీనియర్ నేత కేకేను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు మరికొన్ని రాయితీలను, తాయిలాలను ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త బడ్జెట్ గురించి కూడా చర్చించబోతున్నారు. మధ్యాహ్నం సీనియర్ అధికారులకు ఓ ప్రైవేటు హోటల్లో విందు ఏర్పాటుచేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. మిషన్ కాకతీయ, భగీరథలకు తోడు ఈ సంవత్సరం నుంచి సాగునీటి ప్రాజెక్టులకు ఏటా రూ. 25వేల కోట్లు కేటాయించాలని సర్కారు భావిస్తోంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 50 వేల పోస్టుల భర్తీకి ఆమోదం లభించాల్సి ఉంది. అన్ని శాఖలకు సంబంధించిన విషయాలను చర్చించి, అన్ని వర్గాలను దగ్గరకు చేర్చుకోడానికి కావల్సిన పథకాలను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. -
బీసీ 'ఏ' కేటగిరిలోకి అనాథలు: టీ-సర్కార్
-
బీసీ 'ఏ' కేటగిరిలోకి అనాథలు: టీ-సర్కార్
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ శనివారం మధ్యాహ్నం సమావేశమైంది. ఈ సందర్భంగా కేబినెట్ సమావేశంలో పలు అంశాల గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, నష్టపరిహారంపై కేబినెట్లో చర్చించారు. వరంగల్ జిల్లా ములుగులో ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా అనాథలను బీసీ 'ఏ' కేటగిరీలో చేరుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పలు శాఖల్లో కొత్తగా పోస్టుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో పట్టణాభివృద్ధి అధ్యయనం కోసం అధికారుల బృందాన్ని చైనాకు పంపాలని.. దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కోసం అధికారుల బృందం చైనాలో పర్యటించనుంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6 లక్షల పరిహారం ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయించారు. కేబినెట్ సమావేశం దాదాపు నాలుగు గంటలకు పైగా కొనసాగింది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో వర్షపాతం తక్కువగా నమోదు కావడంతోనే రైతుల వ్యవహారం కేబినెట్ దృష్టికి వచ్చింది. కల్తీ కల్లుతో ఆస్పత్రుల బారిన పడుతున్న వారిని దృష్టిలో ఉంచుకుని కొత్త ఎక్సైజ్ విధానాన్ని తెస్తున్నామని టీ సర్కార్ తెలిపింది. వ్యవసాయ శాఖ విభాగంలో నియామకాలు చేపడతామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన ట్వీట్ చేశారు. అగ్రి ఎక్స్టెన్షన్కు సంబంధించి 1000, అగ్రోనామిస్ట్లు 438 ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. -
ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 23 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. 23, 24న రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశముంది. 25, 26, 27 సెలవు దినాలు. మళ్లీ 28, 29, 30న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ సమావేశాల నిర్వహణపై సీనియర్ మంత్రులతో సీఎం కేసీఆర్ గురువారం తన ఫామ్ హౌస్ లో చర్చించినట్టు తెలుస్తోంది. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ప్రతిపక్షం ఇరుకునపెట్టే అవకాశముండడంతో సమర్థ వ్యూహంతో ముందుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా రైతు ఆత్మహత్యలపై చర్చించే అవకాశముంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహారం లక్షన్నర నుంచి రూ. 5 లక్షలకు పెంచే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. -
ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
-
68 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు
హైదరాబాద్: చీప్ లిక్కర్ ప్రవేశపెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. మొత్తం 43 అంశాలపై చర్చించారు. చీప్ లిక్కర్ విషయంలో సమాజం నుంచి వ్యతిరేకత వస్తున్నందున పాతవిధానాన్ని కొనసాగించనున్నట్టు కేసీఆర్ చెప్పారు. కేబినెట్ సమావేశ నిర్ణయాలను కేసీఆర్ వెల్లడించారు. ఏం చెప్పారంటే.. ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 3900 కోట్ల రూపాయలతో 60 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి రూ. 5.30 లక్షలు తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం ప్రధాక కార్యదర్శి నుంచి నివేదిక రాగానే కొత్త జిల్లాల ఏర్పాటు జీహెచ్ఎంసీలో ఆర్టీసీ విలీనం.. నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఈ నిర్ణయం హైదరాబాద్‌లో 3800 బస్సులు తిరుగుతున్నాయి నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వ్యవసాయ కాలేజీలు ఏర్పాటు కరీంనగర్ జిల్లా జిమ్మికుంటలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు త్వరలో తెలంగాణ జలవిధానం ప్రకటిస్తాం రాబోయే మూడేళ్లలో ప్రతిఏటా సాగునీటి ప్రాజెక్టులకు రూ. 25 వేల కోట్లు ప్రాజెక్టుల రీడిజైన్‌పై ప్రతిపక్షాలది అవగాహనరాహిత్యం ఈ ఏడాదికి చీప్ లిక్కర్ ప్రతిపాదన ఉపసంహరణ -
కొత్త ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
-
కొత్త ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు డీఏ మంజూరు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ శాఖల్లో కొత్త పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. కొత్త మద్యం విధానంపై కేబినెట్లో చర్చించారు. దీనిపై కాసేపట్లో కేసీఆర్ ప్రకటన చేసే అవకాశముంది. తెలంగాణ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు.. ఏపీ ఎక్సైజ్ యాక్ట్‌ను తెలంగాణ వర్తింపు వివిధ శాఖల్లో కొత్త పోస్టుల భర్తీకి ఆమోదం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, కార్పొరేట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ తెలంగాణ వ్యాట్ చట్టంలో మార్పులకు ఆమోదం ఏపీ ప్రొఫెషనల్ ట్యాక్స్ యాక్ట్ తెలంగాణకూ వర్తింపు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ ఏర్పాటుకు ఆమోదం తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అనువుగా ఏపీ డిస్ట్రిక్ట్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ అన్వయించుకునేందుకు ఆమోదం -
2న తెలంగాణ కేబినెట్ సమావేశం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం బుధవారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సచివాలయంలో ఆరోజు సాయంత్రం నాలుగు గంటలకు భేటీ జరగనున్నట్లు సమాచారం. సెప్టెంబరు రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేబినెట్ భేటీకి ప్రాధాన్యం ఉంది. ఇప్పటికే, ఓ సారి జూలైలో కేబినెట్ సమావేశం వాయిదా పడింది. వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చతో పాటు, ప్రభుత్వం తీసుకోవాల్సిన మరికొన్ని నిర్ణయాలపైనా చర్చ ఉంటుందని సమాచారం. సెప్టెంబరు తొలి వారంలో సీఎం కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్తున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆహ్వానం మేరకు చైనా వెళ్తున్న సీఎం 8వ తేదీ నుంచి 16 వరకు అక్కడ పర్యటిస్తారు. సీఎం తిరిగి వచ్చాక వెంటనే అసెంబ్లీ సమావేశాలు జరపాల్సి ఉన్నందున ముందుగానే కేబినెట్ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. -
తెలంగాణ కేబినెట్ నుంచి ఎవర్ని తొలగిస్తారు?
-
ఉండేదెవరు ? పోయేదెవరు ?
-
త్వరలో తెలంగాణ కేబినెట్ పునవ్యవస్థీకరణ!
-
అనాథ పిల్లల బాధ్యత ప్రభుత్వానిదే
- వారి చదువులు, బాగోగులన్నీ చూసుకుంటాం: కేసీఆర్ - పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలకు ఆమోదం - జూలై నుంచి 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు.. కేబినెట్ నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అనాథ బాలబాలికలకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా నిలబడుతుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. ఇకపై తెలంగాణలో అనాథలెవరూ ఉండబోరని.. అలాంటి పిల్లల ఉన్నత చదువులు, బాగోగుల బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని ప్రకటించారు. ‘‘పదో తరగతి వరకు అనాథ పిల్లలను చదివించేందుకు కస్తూర్బా పాఠశాలలున్నాయి. ఆ తర్వాతేం చేయాలో, ఎక్కడికి పోవాలో తెలియని దిక్కుతోచని, దయనీయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడం సామాజిక బాధ్యతగా ప్రభుత్వం తీసుకుంటుంది. దేశం మొత్తం అనుసరించే గొప్ప కార్యక్రమంగా ఇది ఉండాలని భావిస్తున్నాం. అనాథ పిల్లలను ఎక్కడ చేర్పించాలి, ఎక్కడ చదివించాలి, ఏమేం ఏర్పాట్లు చేయాలనే విధివిధానాలు ఖరారు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాం. మంత్రులు ఈటల, జోగు రామన్న, చందూలాల్, లక్ష్మారెడ్డి కమిటీలో సభ్యులుగా ఉంటారు. వారం పది రోజుల్లో నివేదిక అందిస్తారు..’’ అని కేసీఆర్ ప్రకటించారు. బుధవారం జరిగిన మంత్రివర్గ భేటీలో తీసుకున్న పలు కీలకమైన నిర్ణయాలను సీఎం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. - పాలమూరు జిల్లా ప్రజలకు తాగు, సాగునీటిని అందించేందుకు 35,250 కోట్లతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు. ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం చూపేలా 6,190 కోట్లతో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచే పాలమూరుకు 70 టీఎంసీలు, డిండి ఎత్తిపోతలకు 30 టీఎంసీలు నీటి తరలింపు. అదనంగా హైదరాబాద్‌కు 20 టీఎంసీలు. - గీత కార్మికులు, మత్స్యకారులకు రూ.5 లక్షల బీమా పథకం అమలు. ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. రిజిస్టర్డ్ సొసైటీల్లోని కార్మికులకే ఇది వర్తిస్తుంది. - విదేశాల్లో ఉన్నత విద్య కోసం మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వ ఆర్థిక సాయం. బడ్జెట్లో రూ.25 కోట్లు కేటాయింపు. మైనారిటీ విద్యార్థులకు 10 గురుకుల పాఠశాలలు, 10 వసతి గృహాల ఏర్పాటు. హా పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు కడుపు నిండా భోజనం, రోజు విడిచి రోజు కోడిగుడ్డు. - నిజామాబాద్ జిల్లా రుద్రూరులో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ ఏర్పాటు. - ఈనెల 12న లాంఛనంగా టీఎస్ ఐపాస్ ప్రారంభం. ప్రపంచంలో ఎక్కడా లేనంత సరళంగా ఉండేలా ఖరారుకు నిర్ణయం. - జూలై నుంచి 25 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీ. వయోపరిమితి సడలింపుపై సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం. - కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు స్క్రీనింగ్. స్థానికులైన కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే క్రమబద్ధీకరణ వర్తింపు. -
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త
హైదరాబాద్: నూతన పారిశ్రామిక విధానానికి తెలంగాణ కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్ ఇతర నిర్ణయాలు * పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి * ఆధీనంలోని లేని భూములు వేలం వేయాలని నిర్ణయం * గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానం భర్తీకి నిర్ణయం * నిజామాబాద్ జిల్లా రుద్రారంలో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కాలేజీ ఏర్పాటుకు పచ్చజెండా * సర్వీసు కమిషన్ ద్వారా నియామకాలకు అనుమతి * ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అభ్యర్థుల వయసు సడలింపు పదేళ్లకు పెంపు -
ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం
హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ సమావేశం బుధవారమిక్కడ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశంలో ఓటుకు నోటు వ్యవహారంతో పాటు, ఏసీబీ కేసులుతో పాటు పలు కీలక అంశాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశం అనంతరం కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడతారు. అదే విధంగా ఏపీ కేబినెట్ తీర్మానాలపై కౌంటర్ కూడా సిద్ధం చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ శాంతిభద్రతలపై గవర్నర్ అధికారాల అంశంపైనా చర్చించనున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ, పాలమూరు ఎత్తిపోతలు, నిరుద్యోగ యువత కోసం నియామకాలపై చర్చిస్తారు. నిరుద్యోగ యువతికి వయోపరిమితి సడలింపుపై నిర్ణయాన్ని కూడా ఈ కేబినెట్లోనే తీసుకుంటారు. -
ఏపీ తీర్మానాలకు కౌంటర్‌గా టీ కేబినెట్ సమావేశం
హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి బుధవారం సాయంత్రం ఆరుగంటలకు సమావేశం కానుంది. ఓటుకు నోటు వ్యవహారంలో తాజా పరిస్థితులపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీ కేబినెట్ తీర్మానాలకు తెలంగాణ మంత్రిమండలి కౌంటర్ సిద్ధం చేయనుంది. హైదరాబాద్ శాంతి భద్రతలపై గవర్నర్ అధికారాల విషయాన్ని కేబినెట్లో చర్చించనున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ, పాలమూరు ఎత్తిపోతలు, నిరుద్యోగ యవత రిక్రూట్మెంట్ల విషయాలను కేబినెట్ సమావేశంలో ప్రస్థావించనున్నారు. నిరుద్యోగ యవతకు వయోపరిమితి సడలింపుపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. శుక్రవారం ప్రకటించనున్న నూతన పారిశ్రామిక విధానం, టీఎస్ ఐపాస్లపై కేబినెట్లో చర్చించనున్నారు. -
తెలంగాణ కేబినెట్ భేటి ప్రారంభం
హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ భేటి మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ భేటీలో 12 అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ భేటీలో ప్రధానంగా డబుల్ బెడ్రూం ఇళ్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు, పారిశ్రామిక విధానం, పోలీసు అమర వీరులకు పరిహారం పెంపు, హరితహారం మొదలైన అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. -
'ఆర్టీసీ సమ్మె విరమణకు చర్యలు'
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ సబ్ కమిటీకి తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. ఆర్టీసీని సంరక్షించి, స్వయం సమృద్ధి సాధించే దిశగా కార్యాచరణ ఉండాలని అన్నారు. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. కార్మికుల సంక్షేమం, ప్రభుత్వ పరిమితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుని సమ్మె విరమింపజేయాలని ఈ సందర్భంగా సబ్ కమిటీకి సూచించారు. ఉపసంఘంలో జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్ లకు చోటు కల్పించారు. కేసీఆర్ సూచనలతో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపారు. -
తెలంగాణ కేబినెట్లో మళ్లీ మార్పులు?
-
గురువారం సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ కేబినెట్ గురువారం సాయంత్రం అయిదు గంటలకు భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి మంత్రివర్గం ఈ భేటీలో ఆమోదం తెలపనుంది. కాగా మార్చి 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థికశాఖ అధికారులు భేటీ అయ్యారు. గవర్నర్ ప్రసంగం, ఏపీ బడ్జెట్ తుదిరూపుపై సమీక్ష జరిపారు. -
మారథాన్... కేబినెట్ భేటీ
ఏడు గంటల సుదీర్ఘ చర్చ ఒకవైపు కేబినె ట్ ఆమోదం.. వెనువెంటనే జీవో జారీ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన రికార్డును తానే అధిగమించారు. కొంతకాలం కిందట ఆరున్నర గంటలపాటు మంత్రివర్గ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ భేటీని ఏకంగా ఏడు గంటలపాటు (మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు) నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా ఉన్నతాధికారులు సైతం ఒకటికి రెండు సార్లు తమ కార్యాలయాలకు, కేబినెట్ సమావేశానికి తిరగడం కనిపించింది. ప్రభుత్వ సలహాదారు రమణాచారి రెండు మూడుసార్లు తిరిగగా, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె. జోషీ, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌లు ఫైళ్లతో తమ పిలుపు కోసం సుమారు గంటన్నర వరకూ ఎదురు చూశారు. కేబినెట్ ఆమోదం పొందిన భూముల క్రమబద్దీకరణ అంశానికి సంబంధించి వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. 17 పాయింట్ల ఎజెండా, మూడు టేబుల్ ఐటెమ్స్‌తో సమావేశం జరిగింది. కొత్త సచివాలయ నిర్మాణం, ఛాతీ ఆసుపత్రి తరలింపు, భూముల క్రమబద్ధీకరణ, రియింబర్స్‌మెంట్, దేవుళ్లకు మొక్కులు, మాంసం, చేపల మార్కెట్ల ఆధునీకరణ వంటి అంశాలపై తీసుకున్న నిర్ణయాలనే బయటకు ప్రకటించారు. వ్యతిరేక వార్తలపై పరువునష్టం దావా! విపక్షాలకు ఆయుధంగా మారుతున్న ‘ఇసుక’ మాఫియా వ్యవహారం కేబినెట్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా ఓ పత్రికపై (సాక్షి కాదు) పరువు నష్టం దావా వేయాలని ఓ ఇద్దరు మంత్రులకు సీఎం సూచించినట్లు తెలిసింది. అలాగే ఇటీవల ఉద్వాసనకు గురైన మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య వ్యవహారం ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో ‘ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని సహించను. ఇక ఎవరి ఇష్టమున్న రీతిలో వారు మాట్లాడొద్దు’ అని సీఎం మంత్రులతో పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం గురించి సవివ రంగానే చర్చించినట్లు తెలిసింది. గత ప్రభుత్వాలు ఈ స్కీమ్‌లో అవినీతికి పాల్పడ్డాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం సొంత పార్టీ కార్యకర్తలనైనా ఉపేక్షించదన్న సంకేతం కిందికి వెళ్లాలని సీఎం సూచించారు. కేబినెట్ సమావేశంలో సాయంత్రం 7 వరకే 20 అంశాలకు సంబంధించి ర్యాటిఫికేషన్లు పూర్తి చేశారని, సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల దాకా పూర్తిగా రాజకీయపరమైన అంశాలపైనే చర్చ జరిగిందని తెలిసింది. విద్యార్థుల పీజు రీయింబర్స్‌మెంట్‌పైనా చాలా సేపు చర్చ జరిగిందని, ముందు అనుకున్నట్లుగా ‘ఫాస్ట్’ పథకాన్నే కొనసాగించాలని మొన్నటి దాకా విద్యా మంత్రిగా ఉన్న జగదీశ్‌రెడ్డి సూచించగా, ఈ విధానంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ముప్పు ఉన్నందువల్ల పాత విధానాన్నే కొనసాగించాలంటూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సూచించారు. దీంతో కడియం వైపే సీఎం మొగ్గు చూపారు. డెరైక్టరేట్ ఆఫ్ ఇన్సూరెన్సులో ఉద్యోగాల వివాదాల పరిష్కారం కోసం జేడీ పోస్టును ఆమోదించారు. వైద్య, ఆరోగ్య శాఖలో పారా మెడికల్ రూల్స్కూ సవరణలు తీసుకు వచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ర్యాటిఫికేషన్ , మార్కెటింగ్ శాఖ నిబంధనల మార్పులపై కూడా నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. -
‘ఫాస్ట్’గా వాపస్
పాత పద్ధతిలోనే విద్యార్థుల ఫీజు చెల్లింపు ఫాస్ట్ పథకాన్ని ఉపసంహరించుకున్న ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగింపు విడతలవారీగా నిధులు చెల్లిస్తాం: ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానికత నిర్ధారణకు ‘371డి’ పాటిస్తామని వెల్లడి ఛాతీ ఆస్పత్రి స్థలంలో 150 కోట్లతో కొత్త సచివాలయం, ఏడాదిలో నిర్మాణాలు పూర్తి వెంకన్నసహా దేవుళ్లకు తెలంగాణ మొక్కులు ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణలో వెసులుబాటు ఏడు గంటల సుదీర్ఘ కేబినెట్ భేటీలో నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు ఫీజుల చెల్లింపు కోసం తీసుకొచ్చిన ‘ఫాస్ట్’ పథకాన్ని రాష్ర్ట ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పాత ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్నే కొనసాగిస్తామని ప్రకటించింది. పేద విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో ఉదారంగా వ్యవహరించాలని భావించి.. కేబినెట్ సమావేశంలో సుదీర్ఘ చర్చ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఈ ఏడాదికి సంబంధించిన ఫీజులను విడతలవారీగా విడుదల చేస్తామని, త్వరలోనే కొన్ని నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చెందాల్సిన పని లేదని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ‘గత ప్రభుత్వం నాలుగేళ్ల బకాయిలను మా నెత్తిన పెట్టి వెళ్లిపోయింది. దాదాపు రూ. 1800 కోట్ల బకాయిలున్నాయి. ఇప్పటికే కొంత చెల్లించాం. ఇప్పటికే రూ. 862 కోట్ల బకాయిలున్నాయి. వాటిని వెంటనే విడుదల చేస్తున్నాం. పాత బకాయిలన్నీ కడిగేసినం’ అని కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఏడు గంటలకుపైగా ఈ భేటీ జరిగింది. అనంతరం కేబినేట్లో తీసుకున్న నిర్ణయాలను కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, జగదీష్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. వివాదాలకు తావులేకుండా చూసేందుకే ‘ఫాస్ట్’ ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో విద్యార్థుల స్థానికత నిర్థారణ కోసం 371డీ నిబంధనను మాత్రం పాటిస్తామన్నారు. అందులో ఎలాంటి వివాదం లేదన్నారు. మరింత చేరువగా క్రమబద్ధీకరణ ‘నిరుపేదలతో పాటు మధ్యతరగతి వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన క్రమబద్ధీకరణ విషయంలో మరింత వెసులుబాటు ఇచ్చాం. 125 గజాల వరకు ఉచితంగా పట్టాలిచ్చేందుకు జారీ చేసిన జీవో నెంబర్ 58 కింద దాదాపు 1.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. జీవో 59 కింద తక్కువ సంఖ్యలో వచ్చాయి. దాదాపు రూ. 60 కోట్ల ఆదాయం వచ్చింది. 125 గజాల కంటే కొంత విస్తీర్ణం ఎక్కువగా ఉన్న నిరుపేదలు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఐదు, పది గజాలు ఎక్కువ ఉన్నంత మాత్రాన వారేం ధనవంతులైపోరు. ఈ పరిధిని 150 గజాల వరకు పెంచాం. 125 గజాల వరకు ఉచితంగానే పట్టాలిస్తాం. అంతకు మించి ఉన్న స్థలానికి మాత్రమే మురికివాడల్లో అయితే 10 శాతం, లేకపోతే 25 శాతం విలువ చెల్లించాలి. దరఖాస్తుకు శనివారంతో గడువు ముగియనుంది. కానీ మరో రెండు మూడు రోజులు అవకాశమిస్తాం. ఫిబ్రవరి 20 నుంచి పట్టాల పంపిణీ ప్రారంభిస్తాం. మార్చి 10లోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. జీవో 59కు సంబంధించి రేటు ఎక్కువగా ఉందని మధ్యతరగతి వర్గాల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. అందుకే ఈ రాయితీలో వెసులుబాటు ఇచ్చాం. కొత్త మార్పుల ప్రకారం 250 గజాల వరకు 25 శాతం, 500 గజాల వరకు 50 శాతం, అంతకుమించి 75 శాతం భూముల విలువ చెల్లించాల్సి ఉంటుంది. వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటు ఇచ్చాం. ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులకు గడువు ఉంది. ఏప్రిల్ నెలాఖరులోగా వాయిదాలన్నీ చెల్లించాల్సి ఉంటుంది’ అని కేసీఆర్ వెల్లడించారు. దేవుళ్లకు తెలంగాణ మొక్కులు ‘తెలంగాణ రాష్ట్ర సాధనకు మేం ఎక్కని కొండ లేదు.. మొక్కని బండ లేదు. పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు మొక్కులు మొక్కుకున్నాం. తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామికి రూ.5 కోట్లతో ఆభరణాలు చేయిస్తామని మొక్కినం. వాటిని చేయించాలని నిర్ణయం తీసుకున్నాం. వాటిని నేనే స్వయంగా వెళ్లి స్వామి వారికి సమర్పిస్తాం. అజ్మీర్ షరీఫ్ దర్గాలో కూడా మొక్కినం. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే అజ్మీర్ యూత్రికులకు రూ.5 కోట్లతో వసతి గృహం ఏర్పాటు చేస్తామన్నాం. అక్కడి ప్రభుత్వం స్థలం కేటాయించగానే అక్కడ హైదరాబాద్ భవన్‌ను నిర్మిస్తాం. వక్ఫ్‌బోర్డు ద్వారా రూ.2.50 కోట్లతో ఛాదర్ తయారు చేయిస్తున్నాం. నేనే స్వయంగా అక్కడికి తీసుకెళ్తా. వీటితో పాటు వరంగల్‌లో భద్రకాళి అమ్మవారికి స్వర్ణ కిరీటం, కొరివి వీరభద్రస్వామికి బంగారు మీసాలు, విజయవాడ కనక దుర్గమ్మకు ముక్కుపుడక, తిరుపతి పద్మావతి అమ్మవారికి ముక్కుపుడక సమర్పించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ ప్రభుత్వం తరఫున అధికారికంగా సమర్పిస్తాం’ అని సీఎం చెప్పారు. మార్కెట్లను తీర్చిదిద్దుతాం ‘రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో రూ.100 కోట్లతో కొత్తగా ఆరోగ్యకర వాతావరణంలో శాఖాహార(కూరగాయల), మాంసాహార(మాంసం, చేపల) మార్కెట్లు నిర్మిస్తాం. శాస్త్రీయ విధానంలో కనీసం 3 అడుగుల ఎత్తులో వీటిని ఉంచితే సూక్ష్మ జీవుల వ్యాప్తిని నిరోధించగలుగుతాం. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో సురక్షిత ఆహార పదార్థాల విక్రయాల కేంద్రాలుగా రాష్ట్రంలోని రైతు బజార్లు, మార్కెట్లను తీర్చిదిద్దుతాం. నిజాం నవాబులు నిర్మించిన మోండా మార్కెట్ ఎంతో అద్భుతంగా ఉంది. ఇప్పటికీ మాంసాహార పదార్థాలపై ఈగ సైతం వాలకుండా అప్పుడు వాడిన జాలీలే ఉన్నాయి. శనివారం నగరంలోని మంత్రులతో పాటు అధికారులతో కలిసి నేనే మోండా మార్కెట్‌ను పరిశీలిస్తా. అనంతరం సచివాలయంలో హైదరాబాద్ నగరాభివృద్ధిపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాం. మెహదీపట్నం రైతు బజార్‌తో పాటు ఇతర మార్కెట్ల అభివృద్ధిపై చర్చిస్తాం. ఇక వరంగల్ కార్పొరేషన్‌కు గ్రేటర్ హోదా కల్పించడంతోపాటు కొత్త పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుకు నిర్ణయించాం. తెలంగాణ సంసృ్కతికి ప్రచారం కల్పించేందుకు తెలంగాణ సాంసృ్కతిక సారథి విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా 558 మంది కళాకారులను నియమిస్తాం. ఉద్యమంలో ఎన్నో కష్టనష్టాలకు గురై పని చేసిన వాళ్లున్నారు. అవసరమైతే అర్హతలపై కొన్ని మినహాయింపులు ఇచ్చి ఈ నియామకాలు చేపడుతాం’ అని కేసీఆర్ వెల్లడించారు. సచివాలయానికి వాస్తుదోషం తెలంగాణకు రూ. 150 కోట్లతో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామని సీఎం ప్రకటిం చారు. సనత్‌నగర్‌లోని ఛాతీ ఆస్పత్రిని వికారాబాద్‌కు తరలించి.. అక్కడ నూతన సచివాలయం నిర్మిస్తామన్నారు. అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. పది ఇరవై రోజుల్లోనే ఆసుపత్రిని తరలిస్తామన్నారు. అనంతరం సచివాలయ నిర్మాణాలకు సర్వ మత ప్రార్థనలు చేయించి.. భూమి పూజ చేస్తామన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే అన్ని విభాగాల కార్యాలయాలను ఒకే చోటకు తేవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న సచివాలయాన్ని ఏం చేయాలనే విషయంపై తదుపరి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. కాగా, ఇంతకాలం లేని అవసరం ఇప్పుడెందుకు వచ్చిందని విలేకరులు ప్రశ్నించడంతో స్పందించిన సీఎం.. ‘నిజంగా చెప్పాలంటే సచివాలయానికి భయంకరమైన వాస్తుదోషం ఉంది. దీని చరిత్ర కూడా గలీజ్‌గా ఉంది. ఇక్కడున్నోళ్లు ఎవరూ ముందరపడలేదు. తెలంగాణకు అథోగతి పట్టకుండా ఉండాలనే ఈ ఆలోచన చేశాం. ఇప్పటికే ఛాతీ ఆసుపత్రిని మార్చాలని నిర్ణయించాం. స్వచ్ఛమైన గాలి.. కాలుష్యంలేని వాతావరణంలో ఉండాల్సిన క్షయ రోగులకు ఇప్పుడున్న స్థలం శ్రేయస్కరం కాదు. వికారాబాద్‌లో ఉన్న టీబీ శానిటోరియం పరిస్థితి మరో తీరు. అక్కడ 8 మంది రోగులుంటే... 296 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. అందుకే అక్కడికి ఈ ఆసుపత్రిని తరలించాలని నిర్ణయం తీసుకున్నాం. టీబీ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందికి ఇబ్బంది తలెత్తకుండా.. పీజీ సీట్లు నష్టపోకుండా వారిని ఇక్కడే సర్దుబాటు చేస్తాం. వికారాబాద్‌లో ఉన్న టీబీ శానిటోరియంను అభివృద్ధి చేసేందుకు రూ.7 కోట్లు మంజూరు చేశాం. సెక్రెటరీయట్కు స్థలాల పరిశీలన అంశం వచ్చినప్పుడు ఈ ఆసుపత్రి స్థలం అనువుగా ఉంటుందని భావించాం’ అని వివరించారు. ఫీజులకు 4 వేల కోట్లు! ఇప్పటివరకూ అమల్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాన్ని యథాతథంగా అమలుచేస్తే... ఈ ఏడాదికి దాదాపు రూ. 4 వేల కోట్లు అవసరమవుతాయని అధికారుల అంచనా. కానీ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులు రూ. 2,700 కోట్లే. అందులోనూ పాత బకాయిల కిందే సగానికిపైగా నిధులు చెల్లించాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో ఈ ఏడాది మొత్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ పరిధిలోకి వచ్చే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగుల విద్యార్థులు మొత్తం 15,67,000 మంది వరకు ఉన్నారు. -
తిరుమల శ్రీవారికి రూ.5 కోట్ల కానుకలు: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సమయంలోని మొక్కులన్నీ చెల్లించాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తిరుమల శ్రీవారికి కానుకలు ఇస్తానని మొక్కుకున్నానని వెల్లడించారు. త్వరలోనే శ్రీవారికి రూ. 5 కోట్లు విలువ చేసే కానుకలు స్వయంగా సమర్పిస్తానని తెలిపారు. విజయవాడ కనకదుర్గ, తిరుపతి పద్మావతి అమ్మవారికి ముక్కుపుడకలు చేయిస్తామని ప్రకటించారు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి స్వర్ణకంకణం చేయిచేస్తామని చెప్పారు. అజ్మీర్ దర్గాను సందర్శించే భక్తుల కోసం రూ. 5 కోట్లతో వసతి గృహం నిర్మిస్తామన్నారు. రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. -
ఇకపై ఫాస్ట్ పథకం ఉండదు : కేసీఆర్
-
ఫాస్ట్ పథకం ఇక లేదు: సీఎం కేసీఆర్
హైదరాబాద్: ఫాస్ట్ పథకాన్ని రద్దు చేస్తున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. పాత ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. శుక్రవారం కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల ఫీజు బకాయిలకు రూ 862 కోట్లు విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలులో 371డి నిబంధన పాటిస్తామన్నారు. ఫీజు బకాయిలు గత ప్రభుత్వం తమ నెత్తిన రుద్దిందని ఆవేదన వ్యక్తం చేశారు. చెస్ట్ ఆస్పత్రి స్థలంలో సచివాలయం నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అన్ని కార్యాలయన్నీ ఒకచోట ఉండాలన్న ఉద్దేశంతోనే కొత్తగా సచివాలయం కట్టాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుత సచివాలయానికి భయంకరమైన వాస్తు దోషం ఉందన్నారు. అక్రమ భూముల క్రమబద్దీకరణలో మార్పులు చేశామన్నారు. 125 గజాల వరకు ఉచితంగా క్రమబద్దీరిస్తామని చెప్పారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేసీఆర్ చెప్పారు. సాంస్కృతిక సారథి ద్వారా 550 మంది కళాకారులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.