
తెలంగాణ మంత్రి మండలి నిర్ణయాలు
హైదరాబాద్: దాదాపు మూడు నెలల తర్వాత శనివారం భేటీ అయిన తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదయం 11:30 నుంచి రాత్రి 9:30 వరకు సుదీర్ఘంగా సాగిన సమావేశం వివరాలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మీడియాకు వెల్లడించారు.
బడ్జెట్ కేటాయింపులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, హైదరాబాద్ నగరంలో మంచినీటి సరఫరాకు మరో రెండు కొత్త రిజర్వాయర్ల నిర్మాణం సహా పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయాలను తెలియజేశారు. సీఎం తెలిపిన వివరాల్లో కొన్ని ముఖ్యాంశాలు..
- తెలంగాణలో అన్నిరంగాల్లో ఆదాయం వృద్ధి చెందింది
- గత బడ్జెట్ కంటే ఈసారి అదనంగా 15 శాతం బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి
- కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జనవరిలోనే పూర్తి చేస్తారు. ఇందులో రిజర్వేషన్ పద్ధతిని అమలుచేస్తారు
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు కూడా ఈ నెల నుంచే అమలు
- ట్రాఫిక్ పోలీసులకు కాలుష్య భృతి ఇచ్చేందుకు కేబినెట్ ఓకే
- డీఎస్సీ ద్వారా 15,628 టీచర్ పోస్టుల భర్తీ
- జీహెచ్ఎంసీలో గత 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రూ. 405 కోట్ల నీటి పన్ను మాఫీ
- మహబూబ్ నగర్ వైద్యకళాశాలలో ఖాళీగా ఉన్న 462 పోస్టుల భర్తీ
- హైదరాబాద్ దాహార్తిని తీర్చేందుకు రాచకోండ, శామీర్ పేటల వద్ద ఒక్కోటి 40 టీఎంసీల సామర్థ్యంగల నూతన రిజర్వాయర్ల నిర్మాణానికి మంత్రిమండలి పచ్చజెండా
- మిషన్ కాకతీయ పనులు సకాలంలోపూర్తిచేసిన కాంట్రాక్ట్ సంస్థలకు 1.5 శాతం ప్రోత్సాహకాలు
- ఉండి ఉద్యోగి మరణించిన వారంలోగా కారుణ్య నియామకం పూర్తిచేయాలని నిర్ణయం
- 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే చిన్న తరహా సెలూన్ షాపులను కమర్షియల్ పర్సర్ గా పరిగణించే విధానానికి చెల్లు. ఇకపై వాటిని డొమెస్టిక్ పర్పస్ గా పరిగణిస్తారు.
- ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ ఏర్పాటుకు 115 ఎకరాల భూమి కేటాయింపు