
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రగతి భవన్‌లో జరుగుతోంది. పట్టణ ప్రగతితో పాటు సీఏఏ, ఎన్నార్సీ, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులో వివక్ష తదితర అంశాలు ప్రధాన ఎజెండాగా రాష్ట్ర మంత్రిమండలిలో చర్చ జరగనుంది.అలాగే పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల్లో ఖాళీల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. కాగా, సోమవారం సీఎం కేసీఆర్ 66వ జన్మదినం నేపథ్యంలో కేబినెట్ సమావేశం జరుగుతుండటంతో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.