national register of citizens
-
కేంద్రం కీలక నిర్ణయం.. అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం
ఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి పౌరసత్వ సమరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు కేంద్రం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా 2019 డిసెంబర్ 11న పార్లమెంట్లో సీఐఐ చట్టానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్, బంగ్లాదేష్, పాకిస్తాన్లో హింసకు గురై.. 2014కు ముందు భారత్‌కు వచ్చిన వారందరికీ భారత పౌరసత్వం వర్తించనుంది, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బైద్దులు, పార్మీలకు వర్తించనుంది. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వలస వచ్చిన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్‌కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కల్పిస్తారు. ► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. video courtesy: DD INDIA LIVE -
CAA: నెల రోజుల్లో పౌరసత్వ చట్టం అమలు!
ఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) అమలు అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఏఏను నెల రోజుల్లో దేశమంతటా అమలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్.. రిజిస్ట్రేషన్ల కోసం సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సైతం సీఏఏ అమలుపై డ్రై రన్లను పూర్తి చేసిందని విశ్వనీయవర్గాలు ద్వారా తెలుస్తోంది. గత నెల కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ అతిత్వరలో వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం(సీఏఏ) అమలులోకి వస్తుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అప్పడు మరోసారి వివాదాస్పద పౌరసత్వ చట్టంపై తీవ్ర దుమారం రేగింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఏఏను మళ్లీ తెరమీదకు తీసుకువస్తుందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. దేశవ్యాప్తంగా భారీ నిరసనల మధ్య 2019లో పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇక.. చట్టం అమలు విషయంలో కూడా దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అసోం తదితర రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం అమలు చేయటంలో తాత్కాలికంగా జాప్యం చేస్తూ వచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ప్రవేశపెట్టక ముందే.. సీఏఏను అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వలస వచ్చిన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్‌కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కల్పిస్తారు. ► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. -
మళ్లీ పౌరసత్వ రగడ!
వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) అంశం మరోసారి దుమారం రేపుతోంది. సీఏఏను వారం రోజుల్లో దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ ప్రకటించడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇది లోక్‌సభ ఎన్నికల లబ్ధి కోసం చేసిన ఉత్తుత్తి ప్రకటన అంటూ తృణమూల్ కాంగ్రెస్ కొట్టిపారేసింది. 2019లోనే మోదీ సర్కారు సీఏఏ చట్టం చేసినా దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలతో దాని అమలు వాయిదా పడుతూ వస్తోంది. కానీ సీఏఏ అమలుపై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు పట్టుదలగా ఉందని ఇటీవలి వరుస పరిణామాలు చెబుతున్నాయి. ఎవరేమనుకున్నా దేశమంతటా దాని అమలు తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా గత నెలలోనే స్పష్టం చేశారు. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కలి్పంచడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వలస వచి్చన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్‌కు వలస వచి్చన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కలి్పస్తారు. ► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. ఎందుకు వ్యతిరేకత... ఈశాన్య రాష్ట్రాలు, పశి్చమబెంగాల్తో పాటు దేశ రాజధాని ప్రాంతంలోనూ పాక్, బంగ్లా, అఫ్గాన్ల నుంచి వలస వచి్చన ముస్లిమేతర మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా బెంగాల్లో మతువా సామాజిక వర్గంలో అత్యధికులు బంగ్లాదేశ్‌లో తమపై ముస్లింల అణచివేత, తీవ్ర హింసాకాండను తట్టుకోలేక 1950ల నుంచీ వలస వచి్చన వారే. వీరంతా 1990ల నాటికే బెంగాల్లో ప్రబలమైన ఓటు బ్యాంకుగా స్థిరపడ్డారు. దాంతో వీరి మద్దతు కోసం పార్టీలన్నీ ప్రయతి్నంచడం పరిపాటిగా మారింది. నిజానికి సీఏఏ అమలుతో అత్యధికంగా లబ్ధి పొందేది మతువాలేనంటారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది అక్రమంగా ప్రవేశించారు. సీఏఏ అమల్లోకి వస్తే వీరంతా ఎలాంటి ధ్రువీకరణలతోనూ నిమిత్తం లేకుండా నేరుగా భారత పౌరసత్వం పొందుతారు. అలా చేస్తే వీరంతా మెజారిటీ పౌరులుగా మారతారని స్థానికులంటున్నారు. దాంతో హక్కులు, సంస్కృతీ సంప్రదాయాలకు భంగం కలగడమే గాక ఉపాధి అవకాశాలకూ దెబ్బ పడుతుందన్నది వారి వాదన. పైగా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి మరింత భారీగా వలసలకు ఇది బాటలు వేస్తుందని వారంటున్నారు. దాంతో 2019లో సీఏఏ బిల్లుకు చట్టబద్ధత రాగానే దాని అమలును వ్యతిరేకిస్తూ ఆయా రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. అసోం తదితర రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చెలరేగుతున్నాయి. ముస్లింలలోనూ ఆందోళన... ముస్లింల నుంచి కూడా సీఏఏపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ప్రధానంగా తమనే లక్ష్యం చేసుకుని తెచి్చన చట్టమన్నది వారి అభ్యంతరం. ‘‘ఏ ధ్రువీకరణ పత్రాలూ లేని ముస్లింలపై అక్రమ వలసదారులుగా సీఏఏ సాయంతో ముద్ర వేస్తారు. ఈ కారణంగానే ఇతర దేశాల నుంచి వలస వచి్చన ముస్లిం మైనారిటీలకు సీఏఏను వర్తింపజేయడం లేదు’’ అన్నది వారి వాదన. పాకిస్తాన్లో షియా తదితర ముస్లింలు కూడా తీవ్రమైన అణచివేతకు గురై భారత్ వలస వచ్చారని, సీఏఏ అమలుతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని వారంటున్నారు. సీఏఏను వ్యతిరేకిస్తూ పలు ముస్లిం వర్సిటీల్లో కూడా విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగారు. వాటిని అణచివేసే క్రమంలో జరిగిన ఘర్షణలు ప్రాణ నష్టానికీ దారి తీశాయి. కేంద్రం మాత్రం పాక్, బంగ్లా, అఫ్గాన్ వంటి దేశాల్లో ముస్లింలపై అకృత్యాల వాదనను తోసిపుచ్చుతోంది. మరోవైపు టిబెట్, మయన్మార్, శ్రీలంకల నుంచి వలస వచి్చన మతపరమైన మైనారిటీలకు సీఏఏను వర్తింపజేయకపోవడం అన్యాయమన్న విమర్శలూ ఉన్నాయి. సుప్రీంలో వివాదం: ఈ నేపథ్యంలో మొత్తంగా సీఏఏ చట్టం రాజ్యాంగబద్ధతనే సవాలు చేస్తూ తృణమూల్‌తో పాటు కాంగ్రెస్, ఆర్జేడీ, మజ్లిస్ తదితర పక్షాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. జమాయిత్ ఉలేమా ఇ హింద్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇంప్లీడయ్యాయి. వీటిపై విచారణ తుది దశకు చేరుతోంది. ఎన్ఆర్సీ రగడ... సీఏఏలో భాగంగా తెరపైకి వచి్చన జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ) కూడా వివాదానికి మరింతగా ఆజ్యం పోసింది. అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కు పంపడం దీని ప్రధానోద్దేశం. ఇందులో భాగంగా వలసదారుల నివాస తదితర ధ్రువీకరణ పత్రాలను నమోదు చేయడం తప్పనిసరి. తద్వారా పౌరసత్వానికి చట్టపరంగా అర్హులైన జాబితాను రూపొందిస్తారు. సరైన పత్రాలు లేనివారిని అక్రమ వలసదారులుగా నిర్ధారిస్తారు. 2020లో అసోంలో మాత్రమే అమలు చేసిన ఎన్ఆర్సీని దేశవ్యాప్తం చేస్తామని మోదీ సర్కారు ప్రకటించింది. దీనిపైనా రగడ కొనసాగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిజమైన భారతీయులను రక్షిస్తాం: బీజేపీ మేనిఫెస్టో
గుహవాటి: అస్సాం క్షేమం కోసం ‘జాతీయ పౌర పట్టిక’ (ఎన్నార్సీ)ని పటిష్టంగా అమలు చేస్తామని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. నిజమైన భారతీయులను కాపాడుకుంటాం.. చొరబాటుదారులను తరిమేస్తామని వ్యాఖ్యానించారు. అసోంవాసులు సురక్షితంగా ఉండండి అని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్, ముఖ్యమంత్రి సరబనందా సోనోవల్‌తో కలిసి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అసోం రాజకీయ హక్కులు కాపాడుతామని, చొరబాట్ల కట్టడిని వేగవంతం చేస్తామని జేపీ నడ్డా ప్రకటించారు. బ్రహ్మపుత్ర నదిపై అతి పెద్ద రిజర్వాయర్లు కడతామని మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. రిజర్వాయర్‌తో వరదల నుంచి విముక్తి లభిస్తుందని తెలిపారు. 30 లక్షల కుటుంబాలకు రూ.3 వేల చొప్పున నెలకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. అసోం స్వయం సమృద్ధి కోసం సూక్క్ష్మ, స్థూల ప్రణాళికలు అమలు చేస్తామని చెప్పారు. రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటన. వారిలో 2022 మార్చి 1లోపు లక్ష ఉద్యోగాలు ఇస్తామని ప్రధానంగా బీజేపీ మరో హామీ ఇచ్చింది. ప్రైవేటు రంగంలో 8 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి. భూమి లేనివారికి పట్టా పద్ధతి అమలు చేస్తామని వెల్లడి. 126 స్థానాలు ఉన్న అసోం అసెంబ్లీకి మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 27, ఏప్రిల్ 1, 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు మే 2వ తేదీన వెల్లడవుతాయి. -
ఎన్ఆర్సీపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్)ని అమలు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే విధంగా ఈ అంశానికి సంబంధించి గతంలో ప్రకటించిన విధానానికే కట్టుబడి ఉన్నామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్ఆర్సీ, ఎన్పీఆర్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బుధవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భోజన విరామం తర్వాత సభలో ఈ తీర్మానాన్ని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్పీఆర్–2020 (నేషనల్ పాపులేషన్ ఆఫ్ రిజిస్టర్)లో కొత్తగా చేర్చిన అంశాలతో ముస్లింలలో భయాందోళనలు పెరిగాయని అన్నారు. అందువల్ల 2010 నాటి ఫార్మట్ ప్రకారమే ఎన్పీఆర్ అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఆ మేరకు ఎన్పీఆర్–2020లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయాలని స్పష్టం చేశారు. మైనారిటీలలో నెలకొన్న అభద్రతా భావం తొలగించి, వారిలో మనోధైర్యం నింపేందుకు సీఎం వైఎస్ జగన్ ఎన్నో మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అంజాద్‌బాషా కొనియాడారు. అందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్సీని అమలు చేయబోమని గతంలో సీఎం అన్నారని ఆయన ప్రస్తావించారు. అభ్యంతరకర అంశాలు గతంలో కూడా 2010, 2015లో ఎన్పీఆర్ నిర్వహించారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. అయితే ఇప్పుడు 2020లో నిర్వహిస్తున్న ఫార్మట్‌లో కొన్ని అభ్యంతర అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వివరాలు, వారు పుట్టినతేదీ, ప్రదేశానికి సంబంధించిన వివరాలతో పాటు, ఇంకా మాతృభాషకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని అంజాద్‌బాషా అన్నారు. అందుకే మార్చి 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా తీర్మానం చేశామని అంజాద్‌బాషా తెలిపారు. దాని ఆధారంగా ఇప్పుడు సభలో మరో తీర్మానం ప్రవేశపెడుతున్నామని తెలిపారు. -
పౌరసత్వ నిరూపణకు మతం ఆధారమా?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద, చిన్న మతాలన్నీ శాస్త్ర విజ్ఞానం బాగా అభివృద్ధి చెందక ముందు, ఈ భూగోళం ఎలా ఏర్పడిందో తెలియకముందు, సృష్టి రహస్యం తెలియకముందు పుట్టినవే. మతాన్ని కారల్‌మార్క్స్ మత్తుమందు అన్నాడు. మతాలు ఎందుకు పుట్టినా ప్రపంచవ్యాప్తంగా హింసాయుత సంఘటనలకు దారితీశాయి. మతాల కోసం యుద్ధాలు, రక్తపాతాలు జరిగాయి. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం వచ్చి సృష్టి రహస్యాన్ని ఛేదించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక్క మతమూ పుట్టుకు రాలేదు. మతాల స్థానంలో బాబాలు పుట్టుకొచ్చారు. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం, ఐన్ స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఖగోళ శాస్త్ర పరిశోధనలు, ఇతర గ్రహాలకు పోయేంత టెక్నాలజీ, సృష్టికి ప్రతి సృష్టి చేయగల శాస్త్ర విజ్ఞానం, కంప్యూటర్, ఇంట ర్నెట్, ఐటీ, సెల్‌ఫోన్ లాంటి ఆవిష్కరణలు జరిగిన తర్వాత కూడా మతాలు తమ ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి. మానవ జాతిని ‘మనుషులు, మనీ షులు’గా ఐక్యం చేయకుండా మతాలుగా విభజిస్తున్నాయి. మానవ జాతినంతా కలిపి ఉంచే మానవత్వం అనే భావనకు దూరంగా ఉండటం వల్లనే మనుషుల్లో మత, కుల, జాతి, దేశ పరంగా విభజ నలు, విభేదాలొస్తున్నాయి. ప్రపంచంలో ఎంత వైవిధ్యం, బహుళత్వముందో మతాలననుసరించడంలోనూ అంతే బహుళత్వముంది. ఉండాలి. గ్రహాంతర సీమల్లోకి వెళ్ళి బతకగలిగే విషయాల గురించి పరిశోధనలు జరుగుతున్న సమయంలోనూ ఇంకా మతాలంటూ మానవజాతి విడిపోవడం, కుమ్ములాడుకోవడం, ఏ సంస్కృతికి నిదర్శనం? ఫలానా మతం వాళ్లే తమ దేశంలో ఉండాలని దేశాలన్నీ ప్రకటిస్తే ఆయా దేశాల్లోని మిగతా మతస్తుల పరిస్థితేంటి? ఓ వైపు వాతావరణ కాలుష్యం, మరోవైపు ప్రపంచ యుద్ధ భయం, ఇంకో వైపు తీవ్రవాదంతో ప్రపంచం ప్రమాదపుటంచులో ఉంటే మతం పేరు మీద వివక్షతో మరీ ప్రమాదంలోకి నెట్టడం సరైందేనా? ప్రపంచవ్యాప్తంగా చూసినా ఏ ఒక్కదేశంలోనైనా వలసపోయిన వారు లేకుండా ఆదేశానికి సంబంధించినవారు మాత్రమే ఉన్నారా? భారతదేశానికి వలసవచ్చిన వారిలో మొదటివారు ఆర్యులు. ఆ తర్వాత ముస్లింలు, ఆంగ్లేయులు పాలనాధికారులుగా వచ్చారు. అమెరికాలో ఉన్నవాళ్ళంతా యూరోపియన్ దేశాలు, ఇతర ఖండాల నుంచి వచ్చిన వారే కదా! భారతీయులు పాశ్చాత్య దేశాల్లోనూ, అన్ని ఖండాల్లోనూ ఉన్నారు కదా! వీళ్ళందరికీ పౌరసత్వం విషయంలో మతం, జాతి, కఠిన నిబంధనలు పెడితే అది ఎలా లభి స్తుంది? పౌరసత్వం పేరు మీద ఓ మతం వారిని, చిరునామాలు కూడా నిరూపించుకోలేని దీనులను ఏరివేయడం న్యాయమేనా? ధర్మసమ్మతమా? సవరణ చట్టంలో ఏ మతలబు లేకుంటే దేశ వ్యాప్తం గానూ, విదేశాల్లోనూ ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? మతమేదైనా మానవత్వ పరి మళం విరజిమ్మినప్పుడే మానవజాతి మనుగడ భూగోళంపై సార్థకం అవుతుంది. సర్వమత సమానత్వాన్ని కోరుకునే భారతదేశంలో అనేక మతాలు, విభిన్న సంస్కృతులు, అనేక భాషలు ఉన్నా భిన్నత్వంలో ఏకత్వంగా మనిషితనాన్ని కోరుకునే దేశంలో ఏ వివక్షా తగదని సీఏఏ గురించి అసెంబ్లీలో వ్యతిరేక తీర్మానం చేసింది తెలం గాణ ప్రభుత్వం. కులాతీత, మతాతీత రాజ్యాంగం అమలులో ఉన్న భారతదేశంలో పౌరసత్వ సవరణ చట్టంలో ముస్లింలను మినహాయించి అని పేర్కొనడం చట్ట విరుద్ధమని ధైర్యంగా చెప్పిన నాయకుడు కేసీఆర్. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడంలో అనేక కష్టాలకు గురయ్యే ఈ దేశ మూలవాసులకు, ముస్లిం, బౌద్ధ, క్రైస్తవ మత మైనారిటీలకు, చిరునామాలే లేని సంచార జాతులకు, తెలంగాణ పౌరులందరికీ అండదండగా నిలిచినందుకు తెలంగాణ సీఎం అభినందనీయులు. అలాగే జాతీయ పౌరపట్టికను రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తి లేదని ముస్లిం మైనారిటీలకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇవ్వడం ఎంతైనా సంతోషించదగిన విషయం. ఈ అంశంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు బహిరంగంగానే విస్పష్టంగా హామీ ఇవ్వడంద్వారా ముస్లిం మైనారిటీలకు కొండంత అండగా నిలిచారు. మతం కంటే మానవత్వం ముఖ్యమని భావిం చాయి కాబట్టే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరపట్టికల గురించి సముచిత నిర్ణయం తీసుకున్నాయి. వ్యాసకర్త: డా. కాలువ మల్లయ్య, రచయిత, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 91829 18567 -
కేంద్రానికి కేజ్రీవాల్ ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిల్లుపై మాట్లాడుతూ.. తనతో పాటు తన మంత్రివర్గంలోని చాలామందికి బర్త్ సర్టిఫికెట్లు లేవని అన్నారు. తమలాంటి వారికే సరైన పత్రాలు లేనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. 70 మంది సభ్యులు గల ఢిల్లీ అసెంబ్లీలో కేవలం 7గురికి మాత్రమే బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని తెలిపారు. పత్రాలు లేనందున తమను కూడా నిర్బంధ కేంద్రాలకు పంపుతారా? అని ప్రశ్నించారు. పౌరుల పౌరసత్వాన్ని ప్రశ్నించే వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేజ్రీవాల్ కోరారు. కాగా ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఇదివరకే పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ కేరళ తొలుత తీర్మానం చేసింది. -
ఎన్నార్సీపై ఎప్పుడైనా బాబు నోరు తెరిచాడా?
సాక్షి, నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ప్రజల్లో అనేక సందేహాలున్న ఎన్నార్సీపై ఎప్పుడైనా చంద్రబాబు నోరు తెరిచి మాట్లాడాడా..? అని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ ప్రశ్నించారు. నగరంలోని మూలాపేటలో శనివారం మంత్రి పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. శంబడి వారితోట , రాజారామమోహన్‌రాయ్ పార్కుసెంటర్లలో రూ.3.62కోట్లతో నిర్మిస్తున్న సీసీరోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రం అమలు చేసిన ఎన్నార్సీ, ఎన్‌ఆర్పీలు దేశంలోని ముస్లింల్లో అభద్రతా భావాన్ని నెలకొల్పొయన్నారు. రాష్ట్రంలోని ముస్లింలు ఆందోళన చెందుతున్న క్రమంలో ఎన్నార్సీ, ఎన్పీఆర్పై ఒక్కమాట కూడా చంద్రబాబు మాట్లాడకపోవడం సిగ్గు చేటన్నారు. తమ నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి ఈ అంశంపై క్యాబినెట్లో తీర్మానం చేశారన్నారు. ఈ నెల 20న అసెంబ్లీలో ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారని తెలిపారు. చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు ఎవరైనా ఈ అంశంపై నోరు విప్పారా అని నిలదీశారు. అమరావతి, ఆస్తులపై మాట్లాడుతున్న టీడీపీ నాయకులు ముస్లింలను భయాందోళనలకు గురిచేస్తున్న అంశాలపై ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పి తీరాలన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై మతాలను అడ్డుపెట్టుకుని రెచ్చగొట్టే పనులను టీడీపీ నాయకులు మానుకోవాలని హితవుపలికారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోనే వైఎస్సార్సీపీ 151 సీట్లు గెలిచిందన్నారు. అలాంటి వారికి ఇబ్బందులు కలిగితే స్పందించని మనస్తత్వం సీఎం జగన్మోహన్రెడ్డికి లేదన్నారు. ఏ పార్టీకి అండగా ఉండాలో ఇప్పటికైనా కొందరు ముస్లింలు తెలుసుకోవాలన్నారు. కార్పొరేషన్ పరిధిలో 14వ ఆర్థిక సంఘం నిధులతో పూర్తి స్థాయిలో రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తున్నామన్నారు. త్వరలో మరికొన్ని పనులను ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి పార్టీలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. ఉగాది నాడు రాష్ట్రంలోని 26 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందజేసే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. కార్పొరేషన్ పరిధిలో 17వేల మందికి నివేశన స్థలాలు ఇస్తున్నామన్నారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలపై కొందరు టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారన్నారు. టీడీపీకి ఓట్లు వేసే ఆలోచన ప్రజలకు ఉంటే స్టే తెచ్చుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చిత్తు, చిత్తుగా ఓడిపోతామనే భయంతోనే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటుతుందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, చాట్ల నరసింహారావు, నూనె మల్లికార్జునయాదవ్, దార్ల వెంకటేశ్వర్లు, మిద్దె మురళీ కృష్ణయాదవ్, వేలూరు మహేష్, అల్లంపాటి జనార్దన్‌రెడ్డి, తాటిపర్తి సునీల్, జంగాల కిరణ్ కుమార్,సీహెచ్ కుమార్, సుదీర్(చిట్టి), లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కిన్నెర ప్రసాద్, ధనుంజయ, కిన్నెర ప్రసాద్, గంగరాజుయాదవ్, గోగుల నాగరాజు, వడ్లమూడి చంద్ర, తాటిపర్తి సునీల్, తదితరులు పాల్గొన్నారు. -
బతికున్నా.. లేకున్నా పేర్లు రాయాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: మీ పుట్టిన రోజు గుర్తులేదా? ఏ సంవత్సరమో తెలీదా..? ఏ నెలలో, ఏ తేదీన పుట్టారో మీ తల్లిదండ్రులు నమోదు చేయలేదా? మీరు చదువుకోకపోవడంతో సర్టిఫికెట్లలోనూ పుట్టిన తేదీ పేర్కొన లేదా..? అయినా ఫర్వాలేదు.. త్వరలో జరగనున్న జాతీయ పౌర పట్టిక(ఎన్పీఆర్) నమోదు చేయడానికి వచ్చే ఎన్యూమరేటర్లు మీ పుట్టిన తేదీ నిర్ధారించేందుకు అన్ని అవకాశాలనూ పరిశీలిస్తారు. ఎలాగో తెలుసా.. వర్షాకాలంలో పుట్టారా? ఎండాకాలం తర్వాత జన్మించారా అని తెలుసుకుం టారు. అప్పుడు ఏ పండుగలున్నాయో చూస్తారు.. పండుగల ఆధారంగా మీ పుట్టిన తేదీ నిర్ధారించేందుకు ప్రయత్నిస్తారు. అప్పటికీ తేలకపోతే మీ కుటుంబ వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన వారే మీ శారీరక పరిస్థితి, మీ కుటుంబసభ్యుల వయసు, మీ పిల్లల వయసు ఆధారంగా మీ పుట్టిన తేదీ ఖరారు చేసి నమోదు చేస్తారు. ఈ మేరకు కేంద్రం ఎన్పీఆర్ మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఎప్పుడైనా నిర్ణీత షెడ్యూల్లో జనగణనతో పాటు ఎన్పీఆర్ను ఏకకాలంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. జాతీయ పౌరపట్టిక (ఎన్పీఆర్) మీ మూలాలను తేల్చనుంది. మీ తల్లిదండ్రులు ఎక్కడి వారో నమోదు చేయనుంది. వారు బతికున్నా లేకపోయినా వారి పేర్లనూ రికార్డు చేయనుంది. మీ కుటుంబసభ్యులు ఇంట్లో లేకపోయినా, ఏదైనా ప్రాంతంలో ఉద్యోగం, ఉపాధి నిమిత్తం వెళ్లినా, అక్కడ నమోదు చేసుకోకపోతే మీ దగ్గరే వారి పేర్లు, వివరాలను నమోదు చేసుకోనుంది. ఈసారి కొత్తగా సొంత ఇళ్లు లేని వారి జాబితాను కూడా ప్రత్యేకంగా రూపొందించనుంది. ఎన్పీఆర్ తయారీ మార్గదర్శకాల్లో కొన్ని.. ప్రతి కుటుంబానికి తాత్కాలిక ధ్రువీకరణ సంఖ్య (టీఐఎన్) కేటాయిస్తారు. అందులో రాష్ట్రం, జిల్లా, మండలం, పట్టణం లేదా గ్రామాలకు కోడ్ నంబర్లు ఉంటాయి. ఆ తర్వాత 2010, 2015లో రూపొందించిన డేటా ప్రకారం ఇంటి అడ్రస్ సరిచూస్తారు. అవసరమైతే చిరునామా మారుస్తారు. ఇందులో పిన్‌కోడ్ తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇంట్లో ఉంటున్న వారి సంఖ్య నమోదు చేసి, ప్రతి ఒక్కరికి సీరియల్ నంబర్ కేటాయిస్తారు. ఈ సంఖ్య ఆధారంగా ప్రతి వ్యక్తి పూర్తి పేరు (ధ్రువపత్రాల్లో ఉన్న పేర్లతో పోల్చి), యజమానితో బంధుత్వం, ఎన్యూమరేటర్ వెళ్లినప్పుడు ఆ వ్యక్తి ఇంట్లోనే ఉన్నారా.. లేదా.. ఎక్కడికి వెళ్లారనే విషయాలను నమోదు చేస్తారు. ప్రతి వ్యక్తికి సంబంధించి వివాహమైందా? లేదా అనే అంశాన్ని వయసుతో సంబంధం లేకుండా నమోదు చేసుకుంటారు. అలాగే కుటుంబంలో అందరి పుట్టిన రోజులు ఇంగ్లిష్ క్యాలెండర్ ప్రకారం నమోదు చేస్తారు. కుటుంబంలోని ప్రతి వ్యక్తి ఎక్కడ పుట్టారనే నే విషయాన్ని విడివిడిగా రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం లేదా పట్టణం లాంటి వివరాలను నమోదు చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి భారతీయుడా? కాదా అనేది నిర్ధారిస్తారు. జాతీయత విషయంలో కుటుంబంలోని అందరిని అడిగి రికార్డు చేసుకుంటారు. పాస్‌పోర్టు నంబర్, విద్యార్హతల వివరాలు, వృత్తి, మాతృ భాషలాంటి సమాచారాన్ని కోడ్ ఆధారంగా నమోదు చేస్తారు. మీతో పాటు మీ నివాసంలోనే పనిమనిషులు శాశ్వతంగా ఉంటే వారి పేర్లను కూడా మీ కుటుంబ వివరాల్లోనే నమోదు చేసుకుంటారు. మిలిటరీ ఏరియాలు, బయటప్రాంతాల్లో నివసించే రక్షణ సిబ్బంది వివరాలను ప్రత్యేకంగా తీసుకుంటారు. వారి వివరాలను సంబంధిత విభాగాలతో చర్చించిన తర్వాతే జాబితాలో పొందుపరుస్తారు. యాచకులు, వలసజీవులు, సంచార జీవులు, ప్లాట్‌ఫారాలు, బస్స్టేషన్లు, పార్కుల్లో ఉండేవారి వివరాలను కూడా ఈసారి ఎన్పీఆర్లో నమోదు చేయనున్నారు. – కుటుంబ శాశ్వత చిరునామా, ఆ ఇంట్లో ఎంత కాలం నుంచి ఉంటున్నారు. గతంలో ఆ కుటుంబ వివరాలు ఎన్పీఆర్లో నమోదయ్యాయా? లేదా అనే విషయాలను కూడా రాసుకుంటారు. ఆధార్, మొబైల్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్లను లభ్యతను బట్టి తీసుకుంటారు. ఈ వివరాలన్నింటినీ కలిపి ప్రతి కుటుంబానికి ఒక సంగ్రహ నివేదికను ఇంటికొచ్చిన ఎన్యూమరేటర్ తయారు చేస్తారు. -
ఆ సీఎం పౌరసత్వ వివరాలు లేవు
చండీగర్ : హరియాణా ముఖ్యమంత్రి పౌరసత్వానికి సంబంధించి ఒక వ్యకి ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం) ద్వారా అడిగిన సమాచారానికి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్, కేబినెట్ మంత్రులు, గవర్నర్ల పౌరసత్వానికి సంబంధించిన వివరాలు కావాలంటూ పానిపట్క చెందిన ఓ వ్యక్తి లేఖ రాశాడు. పౌరసత్వ లేఖకు సమాధానంగా హరియాణాకు చెందిన ప్రజా సంబంధాల అధికారి (పీఐఓ) స్పందిస్తూ..తమ రికార్డులలో సీఎం, మంత్రుల పౌరసత్వానికి సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని తెలిపారు. పౌరసత్వానికి సంబంధించిన రికార్డులు ఎలక్షన్ కమిషన్ వద్ద లభ్యమవ్వచ్చని హరియాణాకు చెందిన పీఐఓ అధికారి పేర్కొన్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఎన్ఆర్సీని (జాతీయ పౌర పట్టిక) అమలు చేస్తామని సీఎం ఖత్తర్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన ప్రజలు మతపరమైన హింస వల్ల హరియాణాలో నివసిస్తున్నారని..వారికి సీఏఏ ద్వారా పౌరసత్వం ఇవ్వవచ్చని గతంలో ఖత్తర్ మీడియాలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చదవండి: వినూత్న నిరసన తెలిపిన పెళ్లికొడుకు -
ఎంతటి వారైనా చర్యలు తప్పవు: గంభీర్
-
ఎంతటి వారైనా చర్యలు తప్పవు: గంభీర్
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక ఘటనలకు బీజేపీ నేత కపిల్ మిశ్రా కారణమని ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో.. హింసను ప్రేరేపించేలా ప్రవర్తించిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని గంభీర్ స్పష్టం చేశారు. రెచ్చగొట్టే ప్రసంగం చేసినవారు తమ పార్టీకి చెందినవారైనా మరెవరైనా సరే కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహాలకు స్థానం లేదంటూ స్పష్టతనిచ్చారు. ఒకవేళ తమ పార్టీకి చెందిన కపిల్ మిశ్రా ప్రమేయం ఇందులో ఉంటే అతనిపై కూడా చర్యలు ఉంటాయన్నారు. ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్‌పూర్ తదితర ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు చేసిన నిరసన.. ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏడుగురు చనిపోగా.. అందులో హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. చదవండి: అమిత్ షా సానుకూలంగా స్పందించారు : కేజ్రీవాల్ ‘వెనక్కి వెళ్లిపో లేదంటే.. కాల్చిపడేస్తా!’ -
ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా బిహార్ అసెంబ్లీ తీర్మానం
పట్నా : ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన క్రమంలో బిహార్‌లో ఎన్ఆర్సీ అమలు చేయబోమని నిర్ణయిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ మంగళవారం తీర్మానం ఆమోదించింది. జాతీయ పౌరపట్టిక (ఎన్పీఆర్)ను 2010లో ఉన్న రూపంలో అమలు చేస్తామని బిహార్ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. స్పీకర్ విజయ్ కుమార్ చౌధరి ఈ తీర్మానాన్ని సభ ముందుంచగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిహార్‌లో ఎన్ఆర్సీ అవసరం లేదని, ఎన్పీఆర్ను 2010 ఫార్మాట్లో కేంద్రం అమలుచేయాలని ఈ తీర్మానంలో పొందుపరిచారు. తీర్మానం ఆమోదానికి ముందు బిహార్ అసెంబ్లీలో పాలక ఎన్డీయే సభ్యులు, విపక్ష సభ్యుల మధ్య ఎన్పీఆర్, ఎన్ఆర్సీ అంశాలపై తీవ్ర వాగ్యుద్ధానికి దిగడంతో సభలో గందరగోళం చెలరేగింది. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను విపక్ష నేత తేజస్వి యాదవ్ నల్ల చట్టాలుగా అభివర్ణిస్తూ వీటిపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. నూతన చట్టాలు దేశాన్ని మతపరంగా విభజిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. తేజస్వి యాదవ్ వ్యాఖ్యలను పాలక సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. విపక్ష నేత రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. చదవండి : ఎన్ఆర్సీ తప్పనిసరి -
ప్రధాని మోదీ హామీ ఇచ్చారు: ఉద్ధవ్ ఠాక్రే
సాక్షి, ముంబై: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్నార్సీ)లపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. వాటి కారణంగా ఎవరినీ దేశం నుంచి బయటకు పంపబోరని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఉద్ధవ్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలుకాబోదని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. ‘‘మహారాష్ట్ర అవసరాలను మోదీకి వివరించాను. మహారాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ గురించి మేం చర్చించాం. సీఏఏపై నా వైఖరి స్పష్టం చేశాను. సీఏఏ కారణంగా ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. అణచివేతకు గురైన మైనార్టీలకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. ఎన్నార్సీ అమలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. కాబట్టి ఇప్పటివరకు ఎటువంటి సమస్యాలేదు. ఒకవేళ సీఏఏ, ఎన్నార్సీ కారణంగా ఏవైనా ఇబ్బందులు తలెత్తితే.. అప్పుడు మేం కచ్చితంగా వాటిని వ్యతిరేకిస్తాం’’అని భేటీ అనంతరం ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. ఇక మహారాష్ట్రలోని అధికార కూటమి మహా అఘాడిలో చీలకలేం రాలేదని.. కాంగ్రెస్, ఎన్సీపీలతో కూడిన తమ కూటమి అధికారంలో ఐదేళ్లు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)ని తమ రాష్ట్రంలో అమలు చేయబోనివ్వమని ఉద్ధవ్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక ఎన్నార్సీకి తాము వ్యతిరేకమన్న ఉద్ధవ్ ఠాక్రే.. పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి మాత్రం మద్దతు ప్రకటించారు. సీఏఏ వల్ల దేశంలోని పౌరుల హక్కులకు భంగం కలగదని... ఇక్కడి పౌరులు తమ పౌరసత్వం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గతంలో ఆయన పేర్కొన్నారు. శివసేన అధికారిక పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘పౌరసత్వాన్ని నిరూపించుకోవడం హిందువులు, ముస్లింలకు కష్టమే. అయితే సీఏఏ ఇతర దేశాల నుంచి శరణార్థులుగా వచ్చే మైనార్టీల కోసం. అది భారత పౌరుల పౌరసత్వాన్ని దూరం చేయదు’’ అని అభిప్రాయపడ్డారు. -
ఆ అంశాల గురించి ట్రంప్ చర్చిస్తారు: అమెరికా
వాషింగ్టన్: భారత పర్యటనలో భాగంగా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మతపరమైన స్వేచ్ఛ గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధికారులు తెలిపారు. భారత రాజ్యాంగం అక్కడి ప్రజలకు మతస్వేచ్ఛను ప్రసాదించిందని.. అక్కడ అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. నాలుగు ప్రధాన మతాలకు భారత్ పుట్టినిల్లు అని, మత, భాషా, సాంస్కృతికంగా పరంగా ఉన్నతస్థాయిలో ఉన్న దేశమని కొనియాడారు. ట్రంప్ తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 24న ట్రంప్ భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో ఆందోళనలకు కారణమవుతున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్నార్సీ గురించి ట్రంప్.. మోదీతో చర్చిస్తారా అన్న విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. (ట్రంప్ వెంటే ఇవాంకా కూడా..) ఈ విషయాలపై స్పందించిన శ్వేతసౌధ అధికారులు... ‘‘భారత్ ప్రజాస్వామ్యం, మతపరమైన స్వేచ్ఛ గురించి సభలోనూ.. ఆ తర్వాత అంతరంగిక చర్చల్లోనూ అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడతారు. భారత ప్రజాస్వామ్య విలువలు, సంప్రదాయాలు, వ్యవస్థలపై అమెరికాకు అపారగౌరవం ఉంది. అయితే మతస్వేచ్ఛ విషయంలో ప్రపంచవ్యాప్తంగా అవలంబిస్తున్న విధానాలు, విలువలకు మేం కట్టుబడి ఉంటాం. సీఏఏ, ఎన్నార్సీ తదితర అంశాలపై మాకు అవగాహన ఉంది. ప్రజాస్వామ్య విలువలు, మైనార్టీల హక్కులకు భంగం కలగకుండా భారత్ తన సంప్రదాయాలను కొనసాగించాలని ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. మతపరమైన మైనార్టీలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తారో మోదీ తన మొదటి ప్రసంగంలోనే స్పష్టం చేశారు’అని పేర్కొన్నారు.(గుజరాత్ మోడల్‌పై గోడలెందుకు?) కాగా కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ పలుమార్లు ప్రకటించగా.. ఆయన ప్రతిపాదనను భారత్ తిరస్కరించిన విషయం తెలిసిందే. కశ్మీర్ తమ అంతర్గత విషయమని అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేసిన భారత్... సీఏఏ, ఎన్నార్సీల గురించి ఒకవేళ ట్రంప్ చర్చలో ప్రస్తావిస్తే ఎలా స్పందిస్తుందోనన్న విషయం చర్చనీయాంశమైంది. సీఏఏను పోలి ఉండే బడ్జెట్ బిల్లు(కొన్ని వర్గాలను మినహాయించి.. ఇరాన్ నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయిం ఇవ్వడం)పై ఇటీవల సంతకం చేసిన ట్రంప్.. మోదీతో మతపరమైన స్వేచ్ఛ గురించి మాట్లాడతారనడం హాస్యాస్పదమే అవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ట్రంప్ తాజా పర్యటనలో భాగంగా వాణిజ్యపరంగా బ్రహ్మాండమైన డీల్ కుదిరే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. (ట్రంప్ భారత్ టూర్లో రాజభోగాలు) -
షహిన్‌బాగ్ : సుప్రీం కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద చట్టాలు సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న ఆందోళనలపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. నిరసనలు తెలిపే హక్కు ప్రజలకుందని, అయితే రోజుల తరబడి రోడ్లను బ్లాక్ చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. షహిన్‌బాగ్ ప్రాంతాన్ని ఖాళీ చేసేలా ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది అమిత్ సైనీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ‘‘నిరసనలు తెలిపే హక్కు ప్రజలకుంది. అయితే, కీలకమైన అలాంటి ప్రాంతంలో సుదీర్ఘకాలం ఆందోళనలు సాగించడం తగదు. ప్రభుత్వ రహదారులు, పార్కుల వద్ద కాకుండా ప్రత్యేకించిన ప్రాంతాల్లోనే వారు నిరసనలు చేపట్టాలి. షహిన్‌బాగ్ ఆందోళనల పట్ల ఓ వర్గం ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతరులకు ఇబ్బంది కలిగకుండా నిరసన తెలిపిందుకు మరో ప్రాంతాన్ని ఎంచుకోండి’ అని సుప్రీం స్పష్టం చేసింది. అలాగే నిరసనకారులతో మట్లాడేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సంజయ్ హేగ్డే, సాధన రామచంద్రన్‌లను మధ్యవర్తులుగా ఏర్పాటు చేసింది. షహిన్‌బాగ్‌ను ఖాళీ చేసే విధంగా వారితో సంప్రదింపులు జరపాలని న్యాయస్థానం కోరింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకోకపోతే దేశంలో మరో 5వేల షహిన్‌బాగ్ కేంద్రాలు ఏర్పాటు అవుతాయంటూ.. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై కూడా ధర్మాసనం స్పందించింది. వాటితో తమకు ఎలాంటి ఇబ్బందిలేదని కానీ పౌరుకుల అసౌకర్యం కలగకుండా నిరసన తెలుపుకోవాలని అభిప్రాయపడింది. -
కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రగతి భవన్లో జరుగుతోంది. పట్టణ ప్రగతితో పాటు సీఏఏ, ఎన్నార్సీ, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులో వివక్ష తదితర అంశాలు ప్రధాన ఎజెండాగా రాష్ట్ర మంత్రిమండలిలో చర్చ జరగనుంది.అలాగే పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల్లో ఖాళీల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. కాగా, సోమవారం సీఎం కేసీఆర్ 66వ జన్మదినం నేపథ్యంలో కేబినెట్ సమావేశం జరుగుతుండటంతో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
నేడు కేబినెట్ భేటీ..
-
నేడు కేబినెట్ భేటీ.. సీఏఏ, ఎన్నార్సీపై తీర్మానం?
సాక్షి, హైదరాబాద్ : పట్టణ ప్రగతితో పాటు సీఏఏ, ఎన్నార్సీ, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులో వివక్ష తదితర అంశాలు ప్రధాన ఎజెండాగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. జనవరి మూడో వారంలో మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో పల్లె ప్రగతి తరహాలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి మొదటి వారంలో ప్రారంభమవుతాయని భావిస్తున్న నేపథ్యంలో.. ఆలోగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ముగించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 5 వరకు నిర్వహించాల్సిన పట్టణ ప్రగతికి సంబంధించిన పూర్తి వివరాలపై ఆదివారం కేబినెట్లో చర్చ జరిగే అవకాశముంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర కార్యక్రమాల జోలికి వెళ్లకుండా పూర్తిగా పట్టణ ప్రగతిపై దృష్టి కేంద్రీకరించేలా ఈ సమావేశంలో మార్గనిర్దేశనం చేసే అవకాశముంది. రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటై పాలక మండళ్లు కొలువుదీరిన నేపథ్యంలో పట్టణ సమస్యలకు పల్లె ప్రగతిలో పరిష్కారం చూపాలని సీఎం భావిస్తున్నారు. మున్సిపాలిటీల్లో పారిశుధ్యం, మొక్కల పెంపకం, విద్యుత్ సమస్యల ఏర్పాటుకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశముంది. సీఏఏ, ఎన్నార్సీపై తీర్మానం? పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) తదితరాలపై ప్రభుత్వ వైఖరి ప్రకటిస్తామని కొంత కాలంగా సీఎం కేసీఆర్ చెబుతూ ఉన్నారు. అవసరమైతే వీటిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని కూడా గతంలో కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆదివారం జరిగే భేటీలో ఈ అంశంపై చర్చించి ప్రభుత్వపరంగా నిర్ణయం వెల్లడించే అవకాశముంది. కాగా, ఇటీవలి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీఎం.. నిధుల కేటాయింపులో కేంద్రం చూపుతున్న వివక్షను అసెంబ్లీ వేదికగా ఎండగట్టే యోచనలో ఉన్నారు. ఆదివారం జరిగే కేబినెట్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు, ఇతరాలకు సంబంధించిన నోట్‌ను ప్రవేశ పెట్టి చర్చిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం రాష్ట్ర పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడనున్నారు. ఆమె వ్యాఖ్యల్లో నిజానిజాలపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. కొత్త పాలసీలపైనా ప్రస్తావన.. ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లి ఇబ్బందులు పడుతున్న తెలంగాణ వాసుల కోసం ప్రత్యేకంగా ‘ఎన్ఆర్ఐ పాలసీ’రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న ఎన్ఆర్ఐ పాలసీలను కూడా అధ్యయనం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. కేరళ నమూనాను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్ బృందం పర్యటించింది. అసెంబ్లీ సమావేశాలకు ముందే సీఎం కేసీఆర్ గల్ఫ్ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ పాలసీ విధివిధానాలపై కేబినెట్ భేటీలో ప్రస్తావనకు రానుంది. కొత్త రెవెన్యూ చట్టం, పీఆర్సీ అమలు, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పాటించాల్సిన పొదుపు చర్యలపైనా కేబినెట్లో చర్చించే అవకాశముంది. పాలన సంస్కరణలపైనా చర్చ.. పాలన సంస్కరణలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్.. ఇటీవల జాయింట్ కలెక్టర్ పోస్టులను రద్దు చేస్తూ జిల్లాకు ఇద్దరు అదనపు కలెక్టర్లను నియమించిన విషయం తెలిసిందే. పాలన పరంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేబినెట్ భేటీలో ప్రవేశ పెట్టి ఆమోదించే అవకాశముంది. కాగా, సోమవారం సీఎం కేసీఆర్ 66వ జన్మదినం నేపథ్యంలో కేబినెట్ సమావేశం జరుగుతుండటంతో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. -
జన సంద్రమైన ‘ఆజాద్’ మైదాన్!
ముంబై: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ను నిరసిస్తూ మహారాష్ట్రలో వేలాది మంది ఒక్కచోటకు చేరారు. ‘‘హమ్ దేఖేంగే’’ అంటూ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ పద్యాల్లోని పంక్తులను ఉటంకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ’’పౌరసత్వ సవరణ చట్టం, ప్రతిపాదిత జాతీయ పౌర జాబితా, జాతీయ జనాభా పట్టిక జాతీయ వ్యతిరేక కూటమి’’ ... మహా-మోర్చా పేరిట ముంబైలోని చరిత్రాత్మక ఆజాద్ మైదాన్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమం జనసంద్రాన్ని తలపించింది.(డేటింగ్‌లకూ రాజకీయ చిచ్చు) నవీ ముంబై, థానే తదితర ప్రాంతాలు, రాష్ట్రం నలుమూల నుంచి మైదానానికి చేరుకున్న నిరసనకారులు.. త్రివర్ణ పతాకాలు, ప్లకార్డులు చేతబూని... ‘మోదీ, షా సే ఆజాదీ’ (మోదీ, షా నుంచి స్వాతంత్ర్యం కావాలి) అంటూ నినాదాలు చేశారు. ఇక మహిళా నిరసనకారులు..‘‘ఝాన్సీ రాణీ కుమార్తెలం’’ అంటూ ఆందోళనకు దిగారు. అదే విధంగా సీఏఏకు ప్రత్యామ్నాయంగా కొత్త చట్టాన్ని తీసుకురావాలని.. ఈ మేరకు పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. రిటైర్డు జడ్జి కోల్సే పాటిల్, సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్, నటుడు సుశాంత్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అబూ అసీం అజ్మీ తదితర ప్రముఖులు సైతం ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. (అలాంటి మాటలు వాడకుంటే బావుండేది: షా) ఎన్పీఆర్పై త్రిపుర కీలక నిర్ణయం! ఎన్పీఆర్ అంటే ఏమిటి? -
డేటింగ్‌లకూ రాజకీయ చిచ్చు
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల పట్టిక (ఎన్నార్సీ) లాంటి వివాదాస్పద అంశాలు ఈ తరం యువతీ యువకుల మధ్య చిచ్చు పెడుతున్నాయి. వారి మధ్య డేటింగ్‌కు కొంత మేరకు అడ్డు గోడలుగా నిలుస్తున్నాయి. ఈ చట్టాలతో విభేదిస్తున్న వారితో డేటింగ్ చేస్తారా? అని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న డేటింగ్ ఆప్ ‘ఓకేకుపిడ్’ ప్రశ్నించగా నిరభ్యంతరంగా డేటింగ్ చేస్తామని మెజారిటీ మగవాళ్లు చెప్పగా, చేస్తామని చాలా తక్కువ మంది మహిళలు చెప్పారు. ప్రస్తుతం దేశ రాజకీయాలు యువతీ, యువకుల డేటింగ్‌లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు ‘ఓకేకుపిడ్’ సంస్థ రెండు లక్షల మంది యువతీ యువకుల అభిప్రాయాలను సేకరించింది. సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకించేవారితో డేటింగ్ చేస్తారా ? అన్న ప్రశ్నకు 56 శాతం మంది యువకులు చేస్తామని చెప్పగా, 20 శాతం మంది చెప్పలేమని, 24 శాతం మంది ఏదని కచ్చితంగా చెప్పలేమని చెప్పారు. అదే ప్రశ్న యువతులను అడగ్గా చేస్తామని 39 శాతం మంది, చేయమని 30 శాతం మంది, చెప్పలేమని 31 శాతం మంది తెలిపారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై చర్య తీసుకోవడం సమంజసమా ? అని ప్రశ్నించగా, 18 శాతం మంది మగవాళ్లు సమంజసమని, 21 శాతం మంది కాదని, కొన్ని కేసుల్లో మాత్రమే చర్య తీసుకోవచ్చని 37 శాతం మంది, ఏం చెప్పలేమని 18 శాతం మంది చెప్పారు. అదే యువతుల్లో 14 శాతం మంది సమంజసమని, 31 శాతం మంది కాదని, కొన్ని కేసుల్లో సమంజసమని 36 శాతం మంది, ఎటూ చెప్పలేమని 19 శాతం మంది చెప్పారు. డేటింగ్ సమయంలోగానీ, డిన్నర్ టేబుల్పైగానీ, బెడ్ రూముల్లో గానీ తమ భాగస్వామితో రాజకీయాలు మాట్లాడమని సహస్రాబ్ద యువతీ యువకుల్లో 60 శాతానికి పైగా చెప్పారు. రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తారా, సెక్స్‌కు ప్రాధాన్యత ఇస్తారా? అని ప్రశ్నించగా, మెజారిటీ యువతీ యువకులు ‘గుడ్ సెక్స్’కు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అమెరికాకు చెందిన యువతీ, యువకులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా చెప్పారు. రాజకీయాల విషయమై ఏకీభావం కుదిరితేనే డేటింగ్ అయినా, పెళ్లయినా అని 70 శాతం మంది చెప్పారు. రాజకీయ విభేదాలుంటే కలిసి ఉండడం కష్టమని వారు చెప్పారు. -
పెళ్లికూతురుకు వినూత్న గిఫ్ట్
తిరువంతనంతపురం: నిరసనలు రోజుకో రూటు మారుతున్నాయి. మౌనదీక్ష, రాస్తారోకో, రైల్‌రోకో, వంటావార్పు, బైఠాయింపు, నిరాహార దీక్ష, ర్యాలీ ఇలా ఎన్నోరకాలుగా జనాలు తమ వ్యతిరేకతను తెలుపుతూ ఉంటారు. కానీ ఓ పెళ్లికొడుకు వినూత్న నిరసనతో పెళ్లిమండపానికి హాజరైన ఘటన సోమవారం కేరళలో జరిగింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)లను వ్యతిరేకిస్తూ కొన్నినెలలుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కేరళకు చెందిన వ్యాపారి హజా హుస్సేన్ సైతం వీటిని తీవ్రంగా వ్యతిరేకించేవాడు. కాగా ఆయనకు సోమవారం వివాహం జరగనుంది. (కేరళ: నల్లాల్లో మద్యం వరద..!) ఈ నేపథ్యంలో పెండ్లి కొడుకుగా ముస్తాబైన హుస్సేన్.. తిరువంతనపురం నుంచి వాజిముక్కు(వివాహం జరిగే ప్రాంతం) వరకు సుమారు 20 కిలోమీటర్లు ఒంటెపై ఊరేగింపుగా బయలుదేరాడు. ఆ సమయంలో ‘సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లను వ్యతిరేకిద్దాం’ అన్న ప్లకార్డును చేతపూని నిరసన తెలిపాడు. అతనితోపాటు స్నేహితులు, బంధుగణం అంతా కలిసి వెళ్లడంతో రహదారులపై స్వల్ప రద్దీ కనిపించింది. ఈ వినూత్న నిరసనపై ఆయన మాట్లాడుతూ.. సీఏఏపై తన వ్యతిరేకతను ప్రదర్శించడానికే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని తెలిపాడు. ఈ చట్టాన్ని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాడు. ఈ పెండ్లికొడుకు తన భార్యకు కట్నకానుకలతోపాటు రాజ్యాంగం ప్రతిని కూడా అందించడం విశేషం. (‘భారత్ ఇష్టం లేదంటే.. పాకిస్తాన్ ఉందిగా’) -
సీఏఏ, ఎన్నార్సీలపై నిరసనలెందుకు?
ముంబై: అక్రమంగా భారత్‌లో నివాసముంటున్న పాకిస్తానీయులు, బంగ్లాదేశీలను తిప్పి పంపాల్సిందేనని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరపట్టిక (ఎన్నార్సీ)లకు మద్దతుగా ఆదివారం ముంబైలో గిర్గావ్ చౌపట్టి నుంచి ఆజాద్ మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం ఆజాద్ మైదానంలో ఆయన మాట్లాడుతూ.. సీఏఏ, ఎన్నార్సీలపై నిరసనలు ఎందుకు చేస్తున్నారంటూ సీఏఏ వ్యతిరేక నిరసనకారులను ప్రశ్నించారు. నిరసనలు ఇలాగే కొనసాగితే.. నిరసనలకు నిరసనలతో, రాళ్లకు రాళ్లతో, ఖడ్గాలకు ఖడ్గాలతోనే జవాబిస్తామని హెచ్చరించారు. పుట్టినప్పటి నుంచి భారత్‌లోనే ఉన్న ముస్లింలను ఎవరూ వెలివేయబోవడంలేదని, వారెందుకు నిరసనలు చేస్తున్నారో అర్థంకావడంలేదన్నారు. సీఏఏ, ఎన్నార్సీ నిరసనకారులు తమ బలాన్ని ఎవరికి, ఎందుకు చూపించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. సీఏఏను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే నిరసనలు జరుగుతున్నాయన్నారు. చొరబాటుదారులకు ఆశ్రయం ఇవ్వడానికి భారత్ ఏమైనా ధర్మసత్రమా అని ఆయన ప్రశ్నించారు. -
రుజువులు చూపకపోతే పౌరులు కారా?
ఈ దేశవాసిని అనడానికి తగిన రుజువులు చూపలేకపోతే విదేశీయులమవుతామా? సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ సమస్య ఇది. దీన్ని హిందూముస్లిం సమస్యగా చర్చలోకి తెచ్చి, హిందూ ఓట్లను కొల్లగొడదామని అధికార పార్టీ పన్నిన వ్యూహం. ఈ దేశంలో పుట్టిన వారందరూ, వారి పిల్లలూ భారతపౌరులే అనే సార్వజనిక విశ్వజనీన నియమం ప్రకారం రాజ్యాంగం వారికి పౌరసత్వం లభిస్తుందని నిర్దేశించింది. రాజ్యాంగం, 1955 పౌరసత్వ చట్టం, దానికి చేసిన అన్ని సవరణలలో కూడా ఆ అధికారాన్ని ప్రభుత్వానికి, పార్లమెంటుకు ఇవ్వలేదు. కానీ దాన్ని చట్టంద్వారా కాకుండా, రూల్స్ ద్వారా కేంద్రం చేజిక్కించుకుని రెవెన్యూ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు అప్పగించడం దారుణం. కేంద్రానికి సహజీకరణ రిజిస్ట్రేషన్ ద్వారా కొందరు విదేశీయులకు, వలసదారులకు, శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే విచక్షణాధికారం ఉంది. దాన్ని 1955 చట్టం స్పష్టంగా గుర్తించింది. ప్రపంచంలో ఏ ప్రభుత్వానికైనా బయటనుంచి వచ్చే వారి పౌరసత్వాన్ని నిర్ధారించే, నిరాకరించే అధికారం పూర్తిగా ఉంటుంది. కానీ, రాజ్యాంగాన్నే ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా సవరించిన ప్రభుత్వం నియమాలు మార్చడం ద్వారా చట్టం లక్ష్యాలను అతిక్రమించే ప్రయత్నం చేస్తున్నది. ముస్లింలను మతం ప్రాతిపదికన మినహాయించడం రాజ్యాంగ వ్యతిరేకమే. ఎన్ఆర్సీ జనపట్టిక వివరాలతో పౌరసత్వానికి ప్రమాదం వస్తుందని ఊహించలేం. ఆ ప్రమాదాన్ని చాలా జాగ్రత్తగా రూల్స్ రూపంలో ప్రవేశపెట్టారు. ఈ లంకె 2003లోనే పెట్టారు. జనపట్టిక వివరాలు సరిచూసి, దాని ప్రాతిపదికగా పౌరపట్టిక తయారవుతుందని చాలా స్పష్టంగా రూల్స్‌లో ప్రకటించి, అదేమీ లేదని, ప్రచారం చేస్తున్నారు. నిజానికి జనపట్టికలో వచ్చిన వివరాలను సరిపోల్చినపుడు అనుమానం వస్తే పౌరుడిని సందేహాస్పద పౌరుడుగా వేరు చేసి రిజిస్టర్ చేయకుండా ఆపే అధికారం కిందిస్థాయి వరకు ఇచ్చారు. అనుమానిత పౌరుడు జిల్లా మేజిస్ట్రేట్ ముందు అప్పీలు చేసుకోవాలి. అతను కూడా కింది అధికారుల నిర్ణయాన్ని ఆమోదిస్తే ఆ పౌరుడి గతి అధోగతే. ఇక్కడ కేంద్రం ఇంకో వల పన్నింది. అదేమంటే పౌరసత్వం చట్టం కింద చేసిన నియమాలలో సందేహంతో ఆపివేసి, మిగతా పరిణామాల గురించి ఫారినర్స్ ఆర్డర్ కింద రూల్స్‌లో కొత్త చేర్పులు చేసింది. దాంతో సీఏఏకు, ఎన్ఆర్సీకి కొత్త లంకె వేశారు. మామూలుగా బయటపడని ఈ లంకెను ఫారినర్స్ చట్టం 1946లో చేశారు. దీనికింద 1964లో ఫారినర్స్ ట్రిబ్యునల్ ఆర్డర్ రూపొందించారు. అనుమానించిన ప్రతి పౌరుడిపై విదేశీయుడుగా ముద్రపడే ప్రమాద స్థలం ఈ ట్రిబ్యునల్. దీని కారణంగా ఎన్నో దశాబ్దాలనుంచి దేశంలో ఉన్న పౌరులు మతంతో పనిలేకుండా వలసవచ్చిన వారితో సమానంగా, చొరబాటుదారులుగా లేదా శరణార్థులుగా భావింపబడే ప్రమాదానికి గురి అవుతారు. దేశంలో ఎంత మంది ప్రజల దగ్గర తాము పౌరులమని రుజువు చేసుకోగల పత్రాలు ఉన్నాయి? ఉన్నా తుఫాన్ లోనో మరో కారణం వల్లో కోల్పోతే వారి గతి ఏమిటి? వీరంతా విదేశీయులైపోతారు కదా? కనుక ఇది ముస్లింలు, సెక్యులరిస్టులు, వామపక్షాలు అనుకుంటున్నట్టు కేవలం ముస్లింల వేర్పాటు సమస్య కాదు. విదేశీ ముస్లింల సమస్య కూడా కాదు. ఇది ఈ దేశంలో పుట్టి ఈ దేశంలోనే దశాబ్దాల నుంచి ఉంటున్న ప్రతి వ్యక్తి ఎదుర్కోవలసిన గడ్డు సమస్య.} మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్madabhushi.sridhar@gmail.com -
షహీన్ బాగ్‌పై మరో నకిలీ వీడియో!
సాక్షి, న్యూఢిల్లీ : ‘సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా షహీన్ బాగ్‌లో ధర్నా చేస్తున్న ఆడవాళ్లంతా డబ్బులు తీసుకుంటున్నారు. 500, 700 రూపాయలు తీసుకొని షిప్టుల పద్ధతిలో ధర్నాకు కూర్చుంటారు...అవును బాయ్’ అని ఇద్దరు హిందీలో మాట్లాడుకుంటుండగా, ‘సబ్ కాంగ్రెస్ కా ఖేల్ హై (అదంతా కాంగ్రెస్ పార్టీ డ్రామా) ’ అని మూడో వ్యక్తి వ్యాఖ్యానించిన ఓ వీడియోను బీజేపీ సోషల్ మీడియా హెడ్ అమిత్ మాలవియా జనవరి 15వ తేదీన ట్వీట్ చేశారు. అంతా కాంగ్రెస్ డ్రామా అంటూ ఆయన కూడా నొక్కి చెప్పారు. (షహీన్ బాగ్ శిశువు మృతి) ఆ వీడియోలో ఉన్న వాస్తవాస్తవాలను తెలుసుకోకుండానే ‘టైమ్స్ నౌ’ టీవీ ఆ వీడియోను ప్రసారం చేసింది. ‘ఇది స్టింగ్ ఆపరేషన్ లా ఉంది. షహీన్ బాగ్‌లో డబ్బులు తీసుకొని ధర్నా చేస్తున్న ఆడవాళ్ల గురించి అక్కడ మాట్లాడుకుంటున్న గుర్తుతెలియని వ్యక్తులను రహస్యంగా చిత్రీకరించినట్లుంది. వాస్తవం ఏదో మనకు స్పష్టంగా తెలియదు. బీజేపీ చేతికి ఈ వీడియో ఎలా వచ్చిందో తెలియదు. బీజేపీయే స్వయంగా ఈ స్టింగ్ ఆపరేషన్ చేసిందా? ఎవరైనా చేసి బీజేపీ చేతికి ఇచ్చారా? తెలియదు’ అంటూ జర్నలిస్ట్ మెఘా ప్రసాద్ వ్యాఖ్యానంతో ఆ వీడియోను ‘టైమ్స్ నౌ’ పూర్తిగా ప్రసారం చేసింది. ‘ప్రొటెస్ట్ఆన్హైర్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో ‘రిపబ్లిక్ టీవీ’ చర్చా కార్యక్రమాన్ని చేపట్టగా, ‘డబ్బులకు ఆందోళన చేస్తున్నారా?’ అంటూ ‘ఇండియా టుడే’ టీవీ కూడా చర్చా కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. బీజేపీ గుజరాత్ ఎమ్మెల్యే హర్ష్ సాంఘ్వీ, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ప్రీతీ గాంధీ, మాజీ శివసేన సభ్యులు రమేశ్ సోలంకి, బీజేపీ ఢిల్లీ ఐటీ సెల్ హెడ్ పునీత్ అగర్వాల్, సినీ నిర్మాత అశోక్ పండిట్లు తమ తమ వ్యాఖ్యానలతో ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. నకిలీ వీడియోలను, వార్తలను ఎప్పటికప్పుడు కనిపెట్టే ‘ఆల్ట్ న్యూస్, లాండ్రీన్యూస్’లు వీడియోను ఫ్రేమ్, ఫ్రేమ్ తనిఖీ చేయగా, ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్న వెనకాల ఓ షాపు అద్దం మీద స్పష్టంగా ‘9312484044’ అనే నెంబర్ కనిపించింది. ఆల్ట్ న్యూస్, లాండ్రీ న్యూస్‌కు చెందిన ఇద్దరు రిపోర్టర్లు ఆ నెంబర్ పట్టుకొని గూగుల్ సర్చ్ ద్వారా వెళ్లగా ‘కుస్మీ టెలికమ్ సెంటర్’ అనే మొబైల్ షాప్ కనిపించింది. ఆ ఫోన్ నెంబర్ ఆ షాపుదే. వీడియోలో కనిపించే గోడ, దాని మీద పోస్టర్లు కూడా అచ్చం అలాగే షాపు రెక్క మీద ఉన్నాయి. షహీన్ బాగ్‌కు 8 కిలోమీటర్ల దూరంలో పూల్ ప్రహ్లాద్‌పూర్‌లో ఆ షాపు ఉంది. తుగ్లకాబాద్ మెట్రో స్టేషన్‌కు సమీపంలో 134 నెంబర్ షాపది. అశ్వని కుమార్ అనే 38 ఏళ్ల వ్యక్తి ఆ షాపు యజమాని. ఆయనకు 70 ఏళ్ల తండ్రి కూడా ఉన్నారు. 8–10 చదరపు గజాల వెడల్పుతో ఉన్న ఆ షాపులో సిగరెట్లు, గుడ్లు, డేటా ప్లాన్స్, చిప్స్ అమ్ముతున్నారు. ఆ షాపుకు ఎయిర్టెల్, వొడాఫోన్ అడ్వర్టయిజ్ బోర్డులు కూడా ఉన్నాయి. (ఇర్ఫాన్ పఠాన్‌పై ఫేక్ వీడియో!) ఆ షాపులో సిగరెట్లు కొనుక్కున్న ఇద్దరు రిపోర్టర్లు అశ్వని కుమార్‌తో పిచ్చాపాటిగా రాజకీయాలు మాట్లాడుతు వచ్చారు. ఆ షాపు గోడలకు మోదీ, ఇతర బీజేపీ నేతల ఫొటోలు ఉన్నాయి. బీజేపీలో పనిచేస్తారా? అని ప్రశ్నించగా, తనను తాను సిన్సియర్ కార్యకర్తనని చెప్పుకున్నారు. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియో తన షాపు ముందు తీసిందే అని మాటల సందర్భంలో అంగీకరించారు. అయితే తాను తీయలేదని, ఎవరో తీశారని చెప్పారు. ‘మీ వృద్ధులకు ప్రభుత్వం ఏం చేస్తోంది’ అని అశ్వని కుమార్ తండ్రిని ప్రశ్నించగా బీజేపీ ఏమీ చేయడం లేదు, ఆప్ ఏమీ చేయడం లేదని చెప్పారు. ‘సబ్ కాంగ్రెస్ కా ఖేల్ హై’ అని వీడియోలో ఉన్న గొంతను పోలినట్టే ఆయన స్వరం ఉంది. (సీఏఏకు వ్యతిరేకం.. ఇది మరో షాహీన్ బాగ్) మరోసారి వీడియో ఫ్రేమ్‌లను ఆ ఇరువురు రిపోర్టర్లు పరిశీలించగా, షాపు బయటి నుంచి కాకుండా షాపు లోపలి నుంచే తీసినట్లు తెలుస్తోంది. రిపోర్టర్లు సిగరెట్ తాగుతున్నప్పుడే అశ్వని కుమార్ తన సెల్ ఫోన్‌తో వారిని వీడియోతీసి ‘నా అనుమతి లేకుండా సిగరెట్లు తాగుతున్నారు’ అని కాప్షన్ పెడితే ఎలా ఉంటుందని కూడా వారిని ప్రశ్నించారు. ఆ తర్వాత స్థానిక బీజేపీ నాయకులు బన్వర్ సింగ్ రాణాను రిపోర్టర్లు పరిచయం చేసుకొని షహీన్ బాగ్ గురించి ‘స్టింగ్ ఆపరేషన్’ ఎవరు చేశారని ప్రశ్నించగా, తమ పోరగాడేనని, సమీపంలో మొబైల్ షాపు నడుపుతున్నారని చెప్పారు. పరిచయం చేయమని అడగ్గా ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ ఎన్నికలయ్యాక వస్తే పరిచయం చేస్తానని చెప్పారు. (ఆ ‘వీడియో’ చైనా మార్కెట్‌ది కాదు!) -
NRC ఆన్ హోల్డ్
-
సీఏఏకు మద్దతు.. ఎన్నార్సీకి వ్యతిరేకం!
ముంబై: మతం పేరిట అధికారం చేజిక్కించుకోవడం హిందుత్వ విధానం కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. బీజేపీ భావజాలంతో తమకు ఎలాంటి సారూప్యాలు లేవని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా నిరసనలకు కారణమవుతున్న జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)ని తమ రాష్ట్రంలో అమలు చేయబోనివ్వమని ఉద్ధవ్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ‘‘శాంతియుతంగా లేనటువంటి హిందూ దేశం నాకు అక్కర్లేదు. మతం పేరు చెప్పి అధికారం పొందడం నా హిందుత్వ విధానం కాదు. ఒకరిని ఒకరు చంపుకోవడం, దేశంలో కల్లోలం సృష్టించడం హిందుత్వ విధానం కానే కాదు’’ అని ఉద్ధవ్ ఠాక్రే మాజీ మిత్రపక్షం బీజేపీ తీరును ఎండగట్టారు.(ఎన్నార్సీ అమలుపై కేంద్రం కీలక ప్రకటన!) ఇక ఎన్నార్సీకి తాము వ్యతిరేకమన్న ఉద్ధవ్ ఠాక్రే.. పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి మాత్రం మద్దతు ప్రకటించడం గమనార్హం. సీఏఏ దేశంలోని పౌరుల హక్కులకు భంగం కలిగించదని... ఇక్కడి పౌరులు తమ పౌరసత్వం గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన పేర్కొన్నారు. శివసేన అధికారిక పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘పౌరసత్వాన్ని నిరూపించుకోవడం హిందువులు, ముస్లింలకు కష్టమే. అయితే సీఏఏ ఇతర దేశాల నుంచి శరణార్థులుగా వచ్చే మైనార్టీల కోసం. అది భారత పౌరుల పౌరసత్వాన్ని దూరం చేయదు’’ అని చెప్పుకొచ్చారు. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన బీజేపీ- శివసేన మధ్య ముఖ్యమంత్రి పీఠంపై విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.(‘మర్యాదగా వెళ్తారా.. గెంటెయ్యమంటారా?’) -
ఎన్నార్సీ అమలుపై కేంద్ర హోం శాఖ వివరణ
-
ఎన్నార్సీ అమలుపై కేంద్రం కీలక ప్రకటన!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమవుతున్న జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ) అమలు విషయంపై కేంద్రం మంగళవారం వివరణ ఇచ్చింది. ప్రస్తుతానికి దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ అమలు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ... ‘‘ఇప్పటి వరకు ఎన్నార్సీపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని లోక్‌సభలో విపక్షాలకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. జాతీయ స్థాయిలో ఎన్నార్సీ చేపట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కాగా బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్నార్సీపై చర్చ జరగాలంటూ విపక్షాలు సోమవారం పట్టుబట్టిన విషయం తెలిసిందే. (పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?) ఈ రెండు అంశాలపై కేంద్రం సమాధానం చెప్పాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. వీటిపై పూర్తిస్థాయిలో చర్చ జరిగేంత వరకు బడ్జెట్‌పై చర్చింబోమంటూ కాంగ్రెస్ పార్టీ సహా డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు నోటీసులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో హోం శాఖ ఎన్నార్సీపై వివరణ ఇచ్చింది. ఎన్నార్సీ అమలుపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక సీఏఏ తర్వాత దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ అమలు చేస్తామంటూ కేంద్రం హోం మంత్రి అమిత్ షా గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో... మాట మార్చారు. ఇప్పటికిప్పుడు ఎన్నార్సీ అమలు చేయబోమని తెలిపారు.(ఎన్పీఆర్కు, ఎన్నార్సీకి సంబంధం లేదు: అమిత్ షా) ఇదిలా ఉండగా.. జాతిపిత మహాత్మా గాంధీపై బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు లోక్‌సభలో దుమారానికి దారి తీశాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. కాగా కేంద్ర ప్రభుత్వంపై తీసుకువచ్చిన సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్పై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.(కేంద్రం కీలక నిర్ణయం: ఎన్పీఆర్ అంటే ఏమిటి?) -
‘అలా ఎందుకు జరుగుతోందో ఆలోచించాలి’
సాక్షి, న్యూఢిల్లీ : ‘పార్లమెంట్లో ఆమోదించిన బిల్లులను వ్యతిరేకిస్తూ ప్రజలకు రోడ్లపైకి వస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్)లను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి’ అని టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కే కేశవరావు(కేకే) అన్నారు. గురువారం ఆయన టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావుతో కలిసి ఢిల్లీ పార్లమెంట్ లైబ్రరీ హాల్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. (చదవండి : ఆజాదీ కావాలా అంటూ తెగబడిన ఉన్మాది) సమావేశాననంతరం కేకే మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏ ఆందోళనపై సభలో చర్చ జరగాలని సూచించామన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్పై ఏ ముఖ్యమంత్రి చెప్పనట్టుగా తమ అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారన్నారు. అసెంబ్లీలో తీర్మాణం కూడా చేస్తామని పేర్కొన్నారు. సీఏఏ బిల్లును గతంలోనే తమ పార్టీ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. సీఏఏ అంశంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశం నిర్వహించాలని కేంద్రం ప్రభుత్వానికి సూచించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాల హక్కులను ఒక్కొక్కటిగా కేంద్ర తీసుకుంటుందని, ఫెడరల్ స్ఫూర్తికి ఇది విరుద్దమని కేకే మండిపడ్డారు. విభజన హామీలపై ఒక రోజు మెత్తం పార్లమెంట్లో చర్చించాలని ప్రధాని మోదదీని కోరామని కేకే పేర్కొన్నారు. సీఏం కేసీఆర్ ఆనాడే చెప్పారు సీఏఏ బిల్లు పాస్ అయితే దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడే చెప్పారని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. సీఏఏను దేశ ప్రజలతో పాటు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయి ఆరు ఏండ్లు అయినా విభజన హామీలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై సభలో చర్చించాలని అఖిపక్ష సమావేశంలో చెప్పినట్లు నామా పేర్కొన్నారు. -
ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లపై వైఎస్సార్సీపీ కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలను తాము వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్సీపీ లోక్‌సభపక్ష నేత మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ చట్టాల ద్వారా దేశంలోని మైనార్టీల్లో అభద్రతా భావం పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. మైనార్టీలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. ఎన్పీఆర్లో అడుగుతున్న సమాచారం గతం కంటే భిన్నంగా ఉందని, ఈ అంశాల అన్నింటిపై పార్లమెంటులో విసృతంగా చర్చ జరగాలని ఆయన పేర్కొన్నారు. జాతీయ బడ్జెట్ నేపథ్యంలో పార్లమెంట్ లైబ్రరీ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి మిథున్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్ఆర్సీ, ఎన్ఆర్పీలకు తమ పార్టీ వ్యతిరేకమని ఈ భేటీలో తెలిపినట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కూడా హజరైయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అఖిలపక్ష భేటీలో వారు ప్రస్తావించారు. సమావేశం అనంతరం అఖిలపక్షంలో డిమాండ్ చేసిన అంశాలను ఎంపీ విజయసాయి రెడ్డి మీడియా ముందు వెల్లడించారు. ‘విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. కాగ్ ఆడిట్ ప్రకారమే రెవెన్యూ లోటు నిధులు విడుదల చేయాలి. రాజధానిలో మౌలిక వసతులకు తగిన నిధులు కేటాయించాలి. రాజ్ భవన్, సెక్రటేరియట్, హైకోర్టు సహా మౌలిక వసతుల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని కోరాం. రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.18, 969 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని కోరాం. వెనకబడిన జిల్లాలకు రూ. 23 వేల కోట్ల రూపాయలు డిమాండ్ చేశాం. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 3,283 కోట్ల రూపాయలను తిరిగి ఇవ్వాలని వారి దృష్టికి తీసుకెళ్లాం. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 55,548 కోట్లను కేంద్ర ఆమోదించాలి. హోంశాఖకు మండలి రద్దు బిల్లు.. క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ గ్రాంట్ కింద రూ. 47,424 కోట్లు ఇవ్వాలి. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి. రాష్ట్రానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు కల్పించాలి.. వీటన్నింటిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాం. మండలి రద్దు తీర్మానం ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని త్వరలోనే కేంద్రహోం శాఖకు అందుతుంది. ఆ తర్వాత న్యాయ శాఖ నుంచి కేబినెట్‌కు వెళుతుంది. ఆ తర్వాత బిల్లు పార్లమెంట్ ఉభయ సభలకు చేరుతుంది. అక్కడ ఆమోదం పొంది.. రాష్ట్రపతి దగ్గరకు చేరనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చైనాలో ఉన్న భారతీయును తిరిగి స్వదేశానికి రప్పించేందుకు విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తోంది’ అని తెలిపారు. -
సీఏఏకు వ్యతిరేకం.. ఇది మరో షాహీన్ బాగ్
ముంబై: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలోని షాహీన్ బాగ్‌లో ముస్లింలు, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆదివారం సాయంత్రం ముంబైలోరి మదన్‌పురా రహదారిపై కొంతమంది విద్యార్థులు, మహిళల బృందం సీఏఏ, ఎన్ఆర్సీలపై నిరసన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం సీఏఏను ఉపసంహరించుకునే వరకు తాము రోడ్డుపై నుంచి వెళ్లమని భీష్మించుకున్నారు. సుమారు 60 నుంచి 70 మంది విద్యార్థులు, మహిళలు సీఏఏను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసనలకు నాయకత్వం వహించిన న్యాయ విద్యార్థిని ఫాతిమా మాట్లాడుతూ.. ‘కేంద్రప్రభుత్వం నియంతలా ప్రవర్తిస్తోంది. సీఏఏపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ అజాద్‌ను అడ్డుకోవడం సరైనది కాదు. అదేవిధంగా సీఏఏకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ మహిళలు నిరసన కార్యక్రమల్లో పాల్గొనకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం’ అని ఆమె మండిపడ్డారు. (షాహీన్‌బాగ్‌లో జెండా ఎగురవేసిన బామ్మలు) పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్ బాగ్‌లో నిరవధికంగా జరుగుతున్న నిరసనలను స్ఫూర్తిగా తీసుకొని సీఏఏను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించే వరకు తాము నిరసనలు కొనసాగిస్తామని మరో విద్యార్థిని తెలిపారు. అదే విధంగా సుప్రీంకోర్టు ఈ చట్టంపై సరైన నిర్ణయం తీసుకునే వరకు తమ నిరసనలను ఎట్టిపరిస్థితుల్లో ఆపమని ఆమె పేర్కొన్నారు. గత 40 రోజుల నుంచి సీఏఏ, ఎన్ఆర్సీపై వ్యతిరేకంగా షాహీన్ బాగ్‌లో ప్రజలు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. -
ఇంతకూ ఎన్ఆర్సీకి చట్టబద్ధత ఉందా !?
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నేటికీ ఎన్ఆర్సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్–జాతీయ పౌరుల పట్టిక)కి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎన్ఆర్సీ పట్ల ప్రజలు అపోహలు పెట్టుకొని అనవసరంగా ఆందోళనలు చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఎన్ఆర్సీ అంటే ఏమిటో, అది ఎందుకో అటు ఆందోళనలు చేస్తున్న ప్రజలకుగానీ, వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ పెద్దలకుగానీ సరైన అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు. మోదీ ప్రభుత్వ హయాంలో ఎన్ఆర్సీగా వ్యవహరిస్తున్న జాతీయ జనాభా లెక్కలను గతంలో ఎన్పీఆర్ (నేషనల్ పాపులేషనల్ ఆఫ్ రిజిస్టర్–జాతీయ జనాభా పట్టిక) అని వ్యవహరించేవారు. దేశ జనాభాను లెక్కించడంతోపాటు దేశంలోని పలు సామాజిక వర్గాల అభ్యున్నతిని అంచనా వేసేందుకు పదేళ్లకోసారి ఈ జనగణను నిర్వహిస్తారు. క్రితం సారి 2011లో నిర్వహించిన జన గణనకు 2010లోనే కసరత్తు ప్రారంభం కాగా, 2021లో నిర్వహించేందుకు 2019, డిసెంబర్లోనే మోదీ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఎన్ఆర్సీకి ఎన్పీఆర్కి తేడా ఏమిటీ? ఎన్పీఆర్లోలేని ఎనిమిది కొత్త అంశాలను ఎన్ఆర్సీలో చేర్చారు. అందులో ఒకటి తల్లిదండ్రులు పుట్టిన స్థలం, పుట్టిన తేదీ–సంవత్సరం, ఆధార్ నెంబర్, పాస్‌పోర్ట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఓటరు ఐడీ కార్డు నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, పౌరుడి మాతృ భాష. ఓ మతాన్ని లక్ష్యంగా పెట్టుకొనే ఈ వివరాలన్నీ సేకరిస్తున్నారని, రేషన్ కార్డుకు లింకైన ఆధార్ కార్డు బయోమెట్రిక్ డేటాను ఉపయోగించి ముందుగా ఓ మతస్తులకు రేషన్ రద్దు చేస్తారని, ఆ తర్వాత శాశ్వతంగా వారిని దేశం నుంచి బహిష్కరిస్తారన్నది ఆందోళనకారుల వాదన. పరస్పర విరుద్ధ ప్రకటనలు ఎన్ఆర్సీకి సంబంధించి పలువురు కేంద్ర మంత్రులు, అధికారులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండటం కూడా ఓ వర్గం ప్రజల ఆందోళనలను పెంచింది. ‘ఆధార్ నెంబర్ చెప్పడం, చెప్పక పోవడం పౌరుడి చిత్తం (ఐచ్ఛికం)’ అని డిసెంబర్ 24వ తేదీన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఎన్ఆర్సీలోని అన్ని అంశాలు స్వచ్ఛందంగా వెల్లడించాల్సినవేనని అదే రోజు హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇక ‘ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ వెల్లడించడం తప్పనిసరని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారి ఒకరు జనవరి 16వ తేదీన మీడియాకు స్పష్టం చేశారు. తల్లిదండ్రులు పుట్టిన స్థలం వెల్లడించడం పౌరుడి ఐచ్ఛికమంటూ జనవరి17వ తేదీన అదే శాఖకు చెందిన మరో అధికారి పేర్కొన్నారు. అవును, అది నిజమేనంటూ జనవరి 22వ తేదీన కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ ప్రకటించారు. ఒక్క ఆధార్ నెంబర్ మినహా మిగతా అన్ని వివరాలను వెల్లడించడం పౌరులకే శ్రేయస్కరమన్న విషయాన్ని ఎన్యూమరేటర్లు వారితో ఒప్పించాలంటూ ‘ఎన్ఆర్సీ ట్రైనింగ్ మాన్యువల్’ తెలియజేస్తోంది. ప్రభుత్వంలోనే ఇంత గందరగోళం ఉందంటే ఇంక ప్రజల్లో ఎంత గందరగోళం ఉంటుంది? అసలు చట్టబద్ధతే లేదు అసలు ఎన్ఆర్సీలో కొత్తగా చేర్చిన ఎనిమిది అంశాలకు సంబంధించి ఎలాంటి చట్టబద్ధత ఇప్పటి వరకు లేదంటే ఆశ్చర్యం వేస్తోంది. ఎన్పీఆర్కు సంబంధించి 2003లో అప్పటి అటల్ బిహారి వాజపేయ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ‘పౌరసత్వ నిబంధనలు’ తీసుకొచ్చింది. కుటుంబ సభ్యుల సంఖ్య, పేర్లు, ఇతర వివరాలు వెల్లడించడం ప్రతిపౌరుడి బాధ్యతని, తప్పుడు వివరాలను వెల్లడించినట్లయితే అందుకు కుటుంబం పెద్ద బాధ్యత వహించాల్సి ఉంటుందని, దానికి జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని ఆ చట్టం తెలియజేస్తోంది. ఐచ్చికం అన్న పదం అందులో ఎక్కడా లేదు. ఆ చట్టం ప్రకారం పౌరుడి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, లింగం, పుట్టిన తేదీ, పుట్టిన స్థలం, శాశ్వత, ప్రస్తుత చిరునామా, పుట్టుమచ్చ, పౌరసత్వ నమోదు తేదీ, సీరియల్ నెంబర్, జాతీయ గుర్తింపు నెంబర్‌ను కోరారు. కొత్త అంశాలకు కూడా చట్టబద్ధత రావాలంటే ‘2003 పౌరసత్వ చట్టం’ను సవరించక తప్పదు. -
షహీన్‌బాగ్‌లో జెండా ఎగురవేసిన బామ్మలు
న్యూఢిల్లీ: గత నెల రోజులుగా జాతీయ పౌరపట్టిక (ఎన్నార్సీ), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లపై నిరసనలు తెలుపుతున్న బామ్మలు సహా 1,000 మంది ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో ఆదివారం జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ యూనివర్సిటీలో చదువుతూ ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తల్లి రాధికా వేముల, గుజరాత్‌కు చెందిన ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీలు కూడా పాల్గొన్నారు. సీఏఏ, ఎన్నార్సీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు జాతీయ గీతాన్ని ఆలపించారు. బామ్మల్లో శర్వారి (75), బిల్కిస్ (82), ఆస్మా ఖాటూన్ (90)లు ఉన్నారు. తమ గోడును పట్టించుకోని ప్రధాని తమకెందుకని ప్రశ్నించారు. -
విదేశీ పత్రిక కథనంపై ‘ట్వీట్ల’ హోరు!
న్యూఢిల్లీ : ‘ఇంటాలరెంట్ ఇండియా–హౌ మోదీ ఈజ్ ఎన్‌డేంజరింగ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీ (అసహన భారత దేశం–ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి మోదీతో ముచ్చుకొస్తున్న ముప్పు)’ అన్న శీర్షికతో లండన్ నుంచి వెలువడుతున్న ప్రముఖ ఆర్థిక అంశాల విశ్లేషణ పత్రక ‘ది ఎకనమిస్ట్’ జనవరి 23 నాటి సంచికలో కవర్ పేజీ వార్త రాయడం భారత్‌లో అలజడి రేపింది. ప్రధానంగా ఆ పత్రికను తిడుతూ ట్వీట్లు వెలువడుతున్నాయి. (తినే అలవాట్లు బట్టి ఏ దేశమో చెప్పొచ్చు..) ‘మందిర్, సీఏఏ, ఎన్ఆర్సీ తదితర అంశాలపై కాకుండా దేశ ఆర్థిక పరిస్థితులపై దష్టి సారించాల్సిందిగా వీరంతా ఎందుకు కోరుకుంటున్నారంటే, వచ్చే ఎన్నికల్లో మోదీ ఓడిపోవాలని’ అంటూ పంకజ్ మిశ్రా స్పందించారు. ‘దేశం పెద్దదా ? దేశ ఆర్థిక వ్యవస్థ పెద్దదా? ఆర్థిక పరిస్థితితి అడ్డం పెట్టుకొని ప్రపంచం ముందు భారత్ పరువు ఎందుకు తీస్తారు? మనం దీన్ని సహించ వద్దు!’ అంటూ పంకజ్ మిశ్రా మరో ట్వీట్ చేశారు. ‘ఆర్థిక అంశం పాశ్చాత్యుల దక్పథం. ఆ మాయలో భారతీయులు పడకూడదు’ అంటూ నిర్మలా థాయ్ హల్వేవాలీ ట్వీట్ చేశారు. ‘మోదీ వద్దు, రాహుల్ గాంధీ కావాలని ది ఎకనమిస్ట్ చెప్పింది. రాహుల్ గాంధీయే వద్దు, మోదీ కావాలని భారత్ చెప్పింది. వారెందుకు రైటో, భారత్ ఎందుకు తప్పో వారు ఇప్పటికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు’ అంటూ రామ్ ట్విట్టర్లో స్పందించారు. ‘పండోరా బాక్స్ తెరచుకుంది. యాంటీ నేషనల్ ఎకనమిస్ట్ నోరు మూసుకోవడానికి ఏం తీసుకుంటుందో’ అని సుమన్ జోషి స్పందించారు. (హసీనా వ్యాఖ్యల అంతరార్థం) 2010లో మన్మోహన్ సింగ్ నేతత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే ది ఎకనమిస్ట్ పత్రిక ‘హౌ ఇండియాస్ గ్రోత్ విల్ అవుట్పేస్ చైనాస్ (భారత్ పురోగతి చైనా ప్రగతిని ఎలా అధిగమిస్తుంది)’ అనే శీర్షికతో కవర్ పేజీ వార్తా రాసింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని రామ్ స్పందించినట్లున్నారు. మోదీని లేదా మోదీ ప్రభుత్వాన్ని విదేశీ పత్రికలు విమర్శించడం ఇదే మొదటి సారి కాదు. మోదీని ఉద్దేశించి ‘ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్’ అంటూ ‘టైమ్’ మాగజైన్ ఇంతకు ముందు ఓ వార్తను ప్రచురించింది. అప్పుడు ‘బాయ్కాట్టైమ్’ అనే హాష్‌ట్యాగ్‌తో భారతీయులు స్పందించారు. ఈ సారి కూడా అలాంటి ట్యాగ్‌తో స్పందించబోయి తప్పులో కాలేశారు. బాయ్‌కాట్ ది ఎకనమిస్ట్ అనబోయి ‘బాయ్కాట్ఎకానమి’ హ్యాప్‌ట్యాగ్‌తో స్పందించారు. ‘ఎకానమి వేరు ది ఎకనమిస్ట్ వేరనే విషయాన్ని దయచేసి గ్రహించండి, బాయ్‌కాట్ ఎకానమిని ట్రెండ్ చేయకుండా మోదీకి మంచి ఆర్థిక సలహాలు ఇవ్వండి’ అంటూ మెల్విన్ లూయీ ట్వీట్ చేశారు. (సీఏఏ : హింస చల్లారంటే అదొక్కటే మార్గం!) ‘ఈ టేల్ ఆఫ్ టూ కవర్స్ 2010–2020... అంతకన్నా చెప్పేదేమీ లేదు. ఏమన్నంటే యాంటీ నేషనల్ అనే ప్రదం ఉంది’ అంటూ ఇండియా టుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ స్పందించారు. ఆయన దశాబ్దం కిందటి, ఇప్పటి ‘ది ఎకనమిస్ట్’ కవర్ పేజీలను ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. చార్లెస్ డికెన్స్ రాసిన ‘టేల్ ఆఫ్ టు సిటీస్’ చారిత్రక నవలను దష్టిలో పెట్టుకొని రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది. (సీఏఏపై కేంద్రానికి సుప్రీం నోటీసులు) -
ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తొలి సంతకం నాదే: సీఎం
న్యూఢిల్లీ: జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ఛత్తీస్‌ఘఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పోల్చారు. బీజేపీని ఏదైనా అనండి కానీ, భారత్‌ను విడగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం జైలుకు పంపుతామంటూ ఇటీవల అమిత్ షా హెచ్చరించిన విషయం తెలిసిందే. అమిత్ షా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఛత్తీస్‌ఘడ్ సీఎం.. హిట్లర్ సైతం తనను ఎవరేమన్నా పర్వాలేదని, జర్మనీని మాత్రం అనడానికి వీళ్లేదని తన ప్రసంగాల్లో చెప్పేవారని, 'మోటా భాయ్, ఛోటా భాయ్' సైతం అదే స్వరంతో, అదే భాషలో మాట్లాడుతున్నారని అన్నారు. జాతీయ పౌర రిజిస్టర్ అమలు చేస్తామని ఒకరు లేదని మరొకరు.. ఇందులో ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తేల్చాలన్నారు. ఎన్ఆర్సీని అమలు చేస్తే మాత్రం వ్యతిరేకంగా సంతకం చేసే మొదటి వ్యక్తిని తానే అవుతానని బఘేల్ పునరుద్ఘాటించారు. ఎన్ఆర్సీ అమలు చేయడం వల్ల భూముల్లేని నిరుపేదలు, నిరక్షరాస్యులు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. (మోదీ-షా ఇద్దరిలో ఎవరు నిజం : బాఘేలా) -
సీఏఏ అవసరం లేదు
దుబాయ్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) ఈ రెండూ భారత్ అంతర్గత వ్యవహారాలని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు సీఏఏ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ‘సీఏఏ ఇప్పుడు చేయాల్సిన పని లేదు. మరి భారత ప్రభుత్వం ఎందుకు ఈ చట్టం చేసిందో అర్థం కావడం లేదు’’అని యూఏఈ రాజధాని అబూధాబిలో హసీనా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. భారత్ నుంచి ఎలాంటి తిరుగు వలసలు లేవని, అయితే దేశంలో ప్రజలే బాగా సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. సీఏఏకి పార్లమెంటు ఆమోద ముద్ర వేసిన తర్వాత ముగ్గురు బంగ్లాదేశ్ మంత్రులు భారత పర్యటన రద్దు చేసుకున్నారు. బంగ్లాదేశ్, పాక్, అప్ఘానిస్తాన్‌లో ముస్లిమేతరులకు పౌరసత్వాన్ని వీలు కల్పించే ఈ చట్టంపై భారత్‌లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
సీఏఏపై బంగ్లా ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఢాకా : పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) భారత ప్రభుత్వం ఎందుకు తెచ్చిందో తనకు అర్థం కావడంలేదని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా అన్నారు. దాని అవసరం ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, ఇది భారత దేశ అంతర్గత వ్యవహారమని వ్యాఖ్యానించారు. దుబాయ్‌లో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌరుల పట్టిక (ఎన్ఆర్సీ) అనేవి భారత దేశ అంతర్గత వ్యవహారాలని పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎన్ఆర్సీ కేవలం భారత దేశ అంతర్గత వ్యవహారమని తనకు చెప్పారన్నారు. 2019 అక్టోబరులో తాను ఢిల్లీకి వెళ్లినపుడు తనకు మోదీ వ్యక్తిగతంగా హామీ ఇచ్చారన్నారు. భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు మతపరమైన పీడన కారణంగా బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు ఎవరూ వలస పోలేదని ఆ దేశం స్పష్టం చేసింది. మతపరమైన పీడన కారణంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల నుంచి వసల వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు భారత ప్రభుత్వం సీఏఏను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు సీఏఏను అమలు చేయబోమని ప్రకటించాయి. -
సుప్రీంకోర్టు చెప్తే.. రాష్ట్రాలు వ్యతిరేకించడం అసాధ్యం
తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేరళ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ కేరళలోని కొజికోడ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ఆర్సీకి రాష్ట్రాలు సహకరించేది లేదని చెబుతున్నాయంటే కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర అధికారులు సహకరించరని చెప్పడమేనని ఇది అంత సులువు కాదని ఆయన అన్నారు. చదవండి: అహంకారం.. అనిశ్చితి.. డోలాయమానం! రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు చేసిన చట్టాలను రాష్ట్రాలు అనుసరించాల్సిందేనని.. కాదని చెప్పడం సాధ్యమయ్యే పని కాదని ఆయన పేర్కొన్నారు. సీఏఏ అనేది జాతీయ అంశమని.. దీన్ని జాతీయ స్థాయిలోనే ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సిబాల్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోణంలో దీన్ని చూడరాదని కాంగ్రెస్ నేతృత్వంలో అన్ని పార్టీలు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. సీఏఏ అనేది రాజ్యాంగ విరుద్ధమని ఈ ఉదయం ఆయన మరో ట్వీట్ చేశారు. సీఏఏను విరమించుకోవాలంటూ తీర్మానం చేసే రాజ్యాంగబద్దమైన హక్కు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఉంటుందని చెప్పారు. అయితే సీఏఏ రాజ్యాంగబద్దమైనదేనని సుప్రీంకోర్టు చెబితే మాత్రం దాన్ని వ్యతిరేకించడం అసాధ్యమవుతుందని సిబాల్ పేర్కొన్నారు. I believe the CAA is unconstitutional Every State Assembly has the constitutional right to pass a resolution and seek it’s withdrawal When and if the law is declared to be constitutional by the Supreme Court then it will be problematic to oppose it The fight must go on ! — Kapil Sibal (@KapilSibal) January 19, 2020 -
అందుకే.. భారత్‌లో మా రాయబారి: హంగేరీ
న్యూఢిల్లీ: భారత అంతర్గత వ్యవహారాలపై ఇతర దేశాల జోక్యం తగదని హంగేరీ విదేశాంగ మంత్రి పీటర్ సిజార్టో హితవు పలికారు. భారత ప్రభుత్వం అవలంబించే విధానాలను అనుసరించి ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో భారతీయులదే తుది నిర్ణయం అని వ్యాఖ్యానించారు. పీటర్ సిజార్టో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌరపట్టిక(ఎన్నార్సీ), కశ్మీర్ తదితర అంశాలు భారత అంతర్గత విషయాలని పేర్కొన్నారు. అలాంటప్పుడు తామెందుకు వాటి గురించి వ్యాఖ్యలు చేయాలని ప్రశ్నించారు. ‘‘అవన్నీ పూర్తిగా భారత అంతర్గత విషయాలు. వీటిని మేం భారతీయులకే వదిలేస్తాం. తమ దేశంలో సమర్థవంత పాలన అందించలేకపోయినా ఇతర దేశాలకు ఉద్భోద చేసే రకం కాదు మేము. నిజానికి ఒక ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు వారినే తిరిగి ఎన్నుకుంటారు. లేనట్లయితే అధికారానికి దూరం చేస్తారు. కాబట్టి వీటన్నింటిపై స్పందించే హక్కు భారతీయులకే ఉంటుందని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అదే విధంగా... కశ్మీర్‌కు రానున్న యూరోపియన్ యూనియన్ బృందంలో హంగేరీ ప్రతినిధి కూడా ఉంటారన్న ప్రశ్నకు బదులుగా... ‘‘ కశ్మీర్‌కు వెళ్తామని మేం ఎవరికీ చెప్పలేదు. భారత్‌తో ద్వైపాక్షిక బంధాలు మెరుగుపరచడానికే మా రాయబారి ఇక్కడ ఉన్నారు. ఇక కశ్మీర్ పర్యటన అందులో భాగం కాదు కదా’’ అని పీటర్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కాగా చైనా సహాయంతో ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో కశ్మీర్ అంశాన్ని మరోసారి లేవనెత్తేందుకు ప్రయత్నించి.. దాయాది దేశం పాకిస్తాన్ భంగపడిన విషయం తెలిసిందే. ’‘ ఐక్యరాజ్య సమితి వేదికగా పాక్ ప్రతినిధులు పదేపదే చేసిన నిరాధార ఆరోపణలకు మద్దతు లభించలేదు’’అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. ఈ నేపథ్యంలో యూరోపియన్ దేశం హంగేరీ విదేశాంగ మంత్రి పీటర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐరాసలో పాక్‌కు మళ్లీ భంగపాటు -
కంపెనీలకు నిరసనల సెగ..
న్యూఢిల్లీ: వివాదాస్పద అంశాలపై చెలరేగే నిరసనల్లో అప్పుడప్పుడు అనుకోని విధంగా కంపెనీలు కూడా ఇరుక్కుంటున్నాయి. దీంతో వ్యతిరేకత సెగ వాటికి కూడా గట్టిగానే తగులుతోంది. తాజాగా సీఏఏ–ఎన్ఆర్సీ అంశం, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థులపై దాడులు, ఆరెస్సెస్ కార్యక్రమాలు తదితర అంశాలపై బ్రాండ్ అంబాసిడర్లు, తమ సంస్థల చీఫ్‌ల వైఖరులు .. టెక్ కంపెనీలకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. పాలసీబజార్, జోహో, యాక్సెంచర్ వంటి సంస్థలు ఎవరో ఒకరి పక్షం వహించక తప్పని పరిస్థితుల్లో చిక్కుకుంటున్నాయి. దీంతో వ్యాపార అవకాశాలు కూడా కోల్పోయే సందర్భాలు ఎదురవుతున్నాయి. దీపిక బ్రాండ్‌పై జేఎన్‌యూ ఎఫెక్ట్.. వివాదాస్పద అంశాలపై బ్రాండ్ అంబాసిడర్లు వ్యవహరించే తీరు కంపెనీలకే కాకుండా.. స్వయంగా వారికి కూడా సమస్యలు తెచ్చిపెడుతోంది. ఆగంతకుల చేతిలో దెబ్బలు తిన్న జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావంగా నిర్వహించిన ఓ నిరసన ప్రదర్శనకు బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె కూడా హాజరు కావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కొన్ని బ్రాండ్స్.. ఆమెతో రూపొందించిన పలు ప్రకటనలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలని నిర్ణయించుకున్నాయి. వివాదం సద్దుమణిగే దాకా ఓ రెండు వారాల పాటు ఆమె ప్రకటనలు ఆపేయాలంటూ తమ క్లయింట్ నుంచి సూచనలు వచ్చినట్లు ఓ మీడియా ఏజెన్సీ వెల్లడించింది. దేశీయంగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణుల్లో పదుకొణె కూడా ఒకరు. ఒకో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు ఆమె రూ. 8 కోట్లు, సినిమాకు రూ. 10 కోట్ల పైగా తీసుకుంటారని టాక్. ఆమె లోరియల్, తనిష్క్, యాక్సిస్ బ్యాంక్ తదితర 23 బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. పాలసీబజార్‌కు బ్రాండ్ అంబాసిడర్ కష్టం.. ఇక, కంపెనీలపరంగా చూస్తే.. ఆన్లైన్లో బీమా పథకాలు మొదలైనవి విక్రయించే పాలసీబజార్‌కు బ్రాండ్ అంబాసిడర్ కారణంగా కష్టం వచ్చిపడింది. ఈ సంస్థ రాజకీయంగా రెండు భిన్న వర్గాలకు చెందిన నటులైన అక్షయ్ కుమార్, మొహమ్మద్ జీషన్ అయూబ్‌లను తమ ప్రచారకర్తలుగా నియమించుకుంది. అయితే, జేఎన్‌యూ, షహీన్ బాగ్ తదితర నిరసన ప్రదర్శనలకు అయూబ్ బాహాటంగా మద్దతు పలకడం పాలసీబజార్‌ను చిక్కుల్లో పడేసింది. అయూబ్ వైఖరిని పాలసీబజార్ సమర్ధిస్తోందా అన్నది బీజేపీ నేతల ప్రశ్న. ఈ వివాదంతో బాయ్కాట్పాలసీబజార్ హ్యాష్‌టాగ్ బాగా ట్రెండింగ్ అయ్యింది. అయితే, దీనిపై కంపెనీ ఎటువంటి వైఖరీ వెల్లడించలేదు. ఆరెస్సెస్ వివాదంలో జోహో, యాక్సెంచర్.. ఫిబ్రవరి 2న జరగబోయే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యక్రమం.. జోహో, యాక్సెంచర్ ఇండియాకు సమస్యలు తెచ్చిపెట్టింది. రెండు సంస్థల చీఫ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొంటుండటమే ఇందుకు కారణం. చెన్నైలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలన్న తన నిర్ణయాన్ని జోహో సీఈవో శ్రీధర్ వెంబు సమర్ధించుకున్నారు. అయితే, దీన్ని వ్యతిరేకిస్తున్న నిఖిల్ పహ్వా, ఎ లదఖ్, సచిన్ టాండన్ వంటి çపలువురు యువ వ్యాపారవేత్తలు .. జోహోతో వ్యాపారానికి తెగదెంపులు చేసుకుంటామని స్పష్టం చేశారు. ‘మిగతా వారంతా బాయ్‌కాట్ చేయాలని నేనేమీ పిలుపునివ్వడం లేదు. అది ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. కానీ ఆ కార్యక్రమంలో వెంబు పాలుపంచుకుంటున్నందున.. నేను మాత్రం జోహోతో వ్యాపార లావాదేవీలను ఆపేసే పరిస్థితిలో ఉన్నాను‘ అంటూ టాండన్ .. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో పోస్ట్ చేశారు. మరోవైపు, యాక్సెంచర్ ఇండియా సీఈవో రామ ఎస్ రామచంద్రన్ తీరుపై సొంత సంస్థలోని ఉద్యోగుల నుంచే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. యాక్సెంచర్ నైతిక నియమావళి ప్రకారం ప్రొఫెషనల్ హోదాలో ఉద్యోగులెవరూ ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనరాదని కొందరు సిబ్బంది చెబుతున్నారు. తమ ఉద్యోగులు నిర్దిష్ట సిద్ధాంతాల పక్షం వహించడాన్ని యాక్సెంచర్ ఎంతవరకూ సమర్థిస్తుందన్న దానిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చర్యలు.. యాక్సెంచర్‌లోని మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన ఉద్యోగులకు ఎలాంటి సంకేతాలు పంపిస్తాయని ట్విట్టర్ యూజర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఏకంగా యాక్సెంచర్ గ్లోబల్ సీఈవో జూలీ స్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. వారు పోస్ట్‌లు చేశారు. అయిదేళ్ల క్రితం స్నాప్‌డీల్ ఉదంతం.. కంపెనీలు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. 2015లో ఈకామర్స్ సంస్థ స్నాప్‌డీల్ కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొంది. అప్పట్లో ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆమిర్‌ఖాన్.. దేశంలో నెలకొన్న పరిస్థితులను తనను భయాందోళనలకు గురిచేస్తున్నాయని వ్యాఖ్యానించడం స్నాప్‌డీల్‌కు చిక్కులు తెచ్చిపెట్టింది. ఆమిర్‌ఖాన్‌తో పాటు స్నాప్‌డీల్‌ను కూడా బాయ్‌కాట్ చేయాలంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆ దెబ్బతో మళ్లీ ఆమిర్‌ఖాన్‌తో కాంట్రాక్టును స్నాప్‌డీల్ .. రెన్యూ చేసుకోలేదు. ఇటీవలే ఆన్లైన్ ఫుడ్ సర్వీసుల యాప్ జొమాటోకూ ఇలాంటి సమస్యే ఎదురైంది. హిందువేతర డెలివరీ బాయ్‌ని పంపించారనే కారణంతో ఓ యూజరు.. ఆర్డరును క్యాన్సిల్ చేశారు. అయితే, జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్.. తమ డెలివరీ బాయ్‌కు మద్దతిచ్చారు. కొన్ని వివాదాలు.. నవంబర్, 2015: భారత్‌లో అభద్రతాభావం పెరిగిపోయిందంటూ బాలీవుడ్ నటుడు, స్నాప్‌డీల్ బ్రాండ్ అంబాసిడర్ ఆమిర్‌ఖాన్ వ్యాఖ్యానించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఆయనతో స్నాప్‌డీల్ తెగదెంపులు చేసుకోక తప్పలేదు. ఏప్రిల్, 2018: కథువా రేప్ బాధితురాలికి న్యాయం చేయాలంటూ సాగిన ఉద్యమంలో నటి స్వరభాస్కర్ వివాదాస్పద ట్వీట్స్ చేశారు. దీంతో ఈకామర్స్ సంస్థ అమెజాన్.. ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా తప్పించింది. ఏప్రిల్, 2018: డ్రైవర్ ముస్లిం అనే కారణంతో వీహెచ్‌పీ కార్యకర్త ఒకరు.. ఓలా ట్యాక్సీ రైడ్‌ను రద్దు చేసుకున్నారు. తాము మతసామరస్యానికి ప్రాధాన్యమిస్తామంటూ ఓలా సంస్థ .. సదరు డ్రైవరు పక్షాన నిల్చింది. జూలై, 2019: ముస్లిం డెలివరీ బాయ్ వచ్చారనే కారణంతో జొమాటోలో చేసిన ఆర్డరును ఒక యూజరు క్యాన్సిల్ చేశారు. జొమాటో, దాని వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ .. డెలివరీ బాయ్ పక్షాన నిల్చారు. -
సీఏఏ-ఎన్నార్సీ-ఎన్పీఆర్ వద్దు
కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై పునరాలోచన చేయాలని, జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)లను వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీని కోరినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనకుగాను శనివారం కోల్‌కతా వచ్చిన మోదీతో రాజ్‌భవన్‌లో మమత సమావేశమయ్యారు. అనంతరం మమత నేరుగా టీఎంసీ చేపట్టిన సీఏఏ వ్యతిరేక ధర్నాలో పాల్గొన్నారు. ప్రధాని వచ్చిన సమయంలో కోల్‌కతా విమానాశ్రయం వెలుపల, మార్గమధ్యంలోని ఫ్లై ఓవర్ వద్ద జాతీయ పతాకాలు, నల్ల జెండాలతో ఆందోళనకారులు సీఏఏ వ్యతిరేక నినాదాలు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వామపక్ష సంఘాల కార్యకర్తలు ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళనల నేపథ్యంలో నగరంలోని కీలకప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. సీఏఏ వెనక్కి తీసుకోవాలని కోరా ‘ఇది మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశం. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన రూ.28 వేల కోట్ల ఆర్థిక సాయం గురించి ప్రధానితో చర్చించాను. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల గురించి ఆయనకు తెలిపాను. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లకు మేం వ్యతిరేకమని చెప్పాను. ఈ విషయంలో కేంద్రం కూడా పునరాలోచన చేయాలని, సీఏఏను వెనక్కి తీసుకోవాలని కోరాను. సామాన్యులపై వివక్ష, వారిని వేరుగా చూడటం, వేధించ డం తగదని చెప్పా’ అని మమత అన్నారు. ‘ఢిల్లీకి వస్తే చర్చిద్దాం’ అని అన్నారని మమత చెప్పారు. బేలూరు మఠంలో ప్రధాని బస మోదీ శని, ఆదివారాల్లో జరిగే కోల్‌కతా పోర్ట్ 150వ వార్షికోత్సవం తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ప్రధానితోపాటు గవర్నర్ ధన్కర్, సీఎం మమత ఒకే వేదికపై కనిపించనున్నారు. శనివారం రాత్రి ఆయన హౌరా జిల్లాలో ఉన్న రామకృష్ణ మిషన్ ప్రధానకార్యాలయం బేలూర్ మఠంలో బస చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, తదితర ప్రముఖులు ఎందరో ఈ మఠాన్ని గతంలో పలుమార్లు సందర్శించినప్పటికీ ఎవరూ కూడా అక్కడ బస చేయలేదని మఠం అధికారులు తెలిపారు. మమతకు వ్యతిరేకంగా సీపీఎం ఆందోళన ప్రధాని మోదీతో సీఎం మమతా బెనర్జీ సమావేశం కావడంపై వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చూస్తూ టీఎంసీ విద్యార్థి విభాగం ధర్నా జరుగుతుండగా అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను విరగ్గొట్టారు. మోదీతో భేటీపై మమతా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోదీతో భేటీ.. ఆ వెంటనే ధర్నా.. ప్రధానితో సమావేశం అనంతరం సీఎం మమత నేరుగా అక్కడికి సమీపంలోనే టీఎంసీ విద్యార్థి విభాగం చేపట్టిన సీఏఏ వ్యతిరేక ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లారు. సీఏఏ అమలుపై హోం శాఖ జారీ చేసిన గెజిట్‌పై ఆ ధర్నాలో ఆమె మాట్లాడారు. ‘రాష్ట్రంలో సీఏఏ చట్టం కాగితాలపైనే ఉంటుంది. దీనిని అమలు చేసే ప్రసక్తే లేదు. పార్లమెంట్లో మెజారిటీ ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్లు చేయడం కుదరదు’అని తెలిపారు. -
అధ్యక్ష తరహా ఎన్నికపై చర్చ జరగాలి
సాక్షి, రాయదుర్గం: స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిని, అధ్యక్ష తరహాలో ప్రధానిని ప్ర త్యక్షంగా ఎన్నుకోవాలనే ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా తాము సానుకూలమేనని బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పేర్కొన్నారు. దామాషా పద్ధతిన ఎన్నికల నిర్వహణపై కూడా చర్చ జరగాలన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్, ఐఎస్బీ, హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్– మనీ పవర్ ఇన్ పాలిటిక్స్’ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకే దేశం, ఒకేసారి ఎన్నికల నిర్వహణపై కూడా అన్ని రాజకీయపార్టీలు చర్చించి ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాల్లోని అధ్యక్షతరహా, దామాషా ఎన్నికల వంటి మార్పుల కోసం ప్రయత్నిస్తూనే, ఇప్పటికే ఉన్న వ్యవస్థను సరిదిద్దే పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సిన అవసరం ఉందని, పార్లమెంటులో 1,000 స్థానాలు ఉండాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అభిప్రాయపడ్డారని గుర్తు చేశారు. చట్టవిరుద్ధం కాకూడదు రాజకీయాల్లో డబ్బు అవసరమేరనని, అయితే అది చట్టవిరుద్ధం కాకూడదని కేంద్ర ఎన్నికల కమిషనర్ అ««శోక్ లావాసా పేర్కొన్నారు. సెలబ్రిటీల ప్రచారం, పార్టీలకు సొంత మీడియా దగ్గుర్నుంచి అనేక కోణాల్లో ఎన్నికల్లో వ్యయంపై చర్చ జరగాలన్నారు. ఎన్నికల సంస్కరణల గురించి సీఎంలు ఎన్నడూ మాట్లాడినట్లు తాను చూడలేదన్నారు. ఎన్నికల్లో నమోదైన కేసుల గురించి హోంమంత్రులు పట్టించుకోవటం లేదన్నారు. ఒక పరిధి దాటి ఎన్నికల్లో డబ్బు వ్యయాన్ని కట్టడి చేసే శక్తి ఈసీకి లేదన్నారు జమిలి ఎన్నికలతో మార్పు రాదు స్థానిక స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఒకేసారి(జమిలి) ఎన్నికలు నిర్వహించటం వల్ల పెద్ద మార్పురాదని ఎఫ్డిఆర్ ప్రధాన కార్యదర్శి జయప్రకాశ్‌నారాయణ్ అన్నారు. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రిని ప్రత్యక్షంగా ఎన్నుకునే విధంగా ఎన్నికల వ్యవస్థను సవరించాలన్నారు. కాలిఫోర్నియా యూనివర్శిటీ ప్రొఫెసర్ ప్రదీప్చిబ్బర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐఎస్బీ అసోసియేట్ ప్రొఫెసర్ అశ్వినిచాత్ర, హెచ్‌సీయూ ప్రొఫెసర్ కె.సి.సూరి, అంతకుముందు సమావేశంలో శివసేన ప్రతినిధి ప్రియాంకా చతుర్వేది,స్వరాజ్య ఎడిటోరియల్ డైరెక్టర్ ఆర్ జగన్నాథన్ తదితరులు ప్రసంగించారు. 4 అంశాలతో ‘హైదరాబాద్ డిక్లరేషన్’ ‘ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్– మనీ పవర్ ఇన్ పాలిటిక్స్’పేరిట రెండ్రోజులపాటు నిర్వహించిన సదస్సు ముగింపు వేడుకల్లో జయప్రకాశ్ నారాయణ నాలుగు అం«శాలతో కూడిన హైదరాబాద్ డిక్లరేషన్‌ను ప్రకటించారు. అందులో... రాజకీయాల్లో డబ్బు వల్ల కలిగే పరిణామాలపై పౌరుల్లో అవగాహన పెంచాలి. పౌరులు, పౌరసమాజ సంఘాలు, ఎన్నికల సంఘం సమిష్టిగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీల ప్రజాస్వామ్య పనితీరును నిర్ధారించడానికి, రాజకీయరంగంలోకి డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి బలమైన చట్టపరమైన వ్యవస్థ అవసరం. పార్టీలు తమ వార్షిక ఆదాయ,వ్యయాలను సకాలంలో ప్రకటించాలి. ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస ఆర్థిక సహాయం ఉండాలి. రాజకీయాల్లో చట్టవిరుద్ధమైన డబ్బు శక్తి, బహుమతులు ఇవ్వడాన్ని తగ్గించడానికి ఉత్తమ మార్గాలు అవసరం. దేశంలో పెద్ద మొత్తంలో నగదు, మద్యం పంపిణీ, ప్రచార వ్యయానికి మించి జరుగుతోంది. దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. -
ఒంటరిగానే పోరాడతాం
కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా తాము ఒంటరిగానే పోరాడతామని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కలవబోమని పశ్చిమ బెంగాల్ సీఎం మమత చెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా పోరాడే అంశంపై ఈ నెల 13న కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ప్రతిపక్షాలతో నిర్వహిస్తున్న సమావేశానికి తాను వెళ్లట్లేనన్నారు. బెంగాల్లో బుధవారం ట్రేడ్ యూనియన్లు చేపట్టిన సమ్మెలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు పలు హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడ్డాయని ఆమె ఆరోపించారు. ఈ రెండు పార్టీలు పశ్చిమబెంగాల్లో ఒకలా, ఢిల్లీలో మరోలా ప్రవర్తిస్తున్నాయని విమర్శించారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ తరహా ధోరణిని తాను సహించబోనని తేల్చిచెప్పారు. ఈ కారణంతోనే తాను సోనియా గాంధీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై ఆమె స్పందించారు. గత సెప్టెంబర్‌లో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన నేపథ్యంలో మరోసారి ఆమోదించాల్సిన అవసరం లేదని ఉద్ఘాటించారు. సోనియా సమావేశానికి హాజరుకాకపోవడానికి సంబంధించి ఆమె ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో మాట్లాడారని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. -
దుష్ట ఆలోచనలో భాగమే ఎన్నార్సీ
న్యూఢిల్లీ: జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ) అమలు చేయాలనే నిర్ణయం దేశాన్ని విభజించాలనే దుష్ట ఆలోచనలో భాగమేనని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం దుయ్యబట్టారు. హిందూ రాష్ట్ర విభజన ఎజెండాను ముందుకు తీసుకురావాలన్న ఆర్ఎస్ఎస్–బీజేపీ ప్రణాళికలో భాగంగానే ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ల అమలు నిర్ణయమని ఆరోపించారు. వీటి వల్ల ప్రత్యక్షంగా ప్రభావితమయ్యేది ఎవరన్నా ఉన్నారంటే వారు భారత ముస్లింలు మాత్రమేనని అన్నారు. వేరే మతాలను ఎన్నార్సీ కింద మినహాయించి సీఏఏలో చేర్చారని, అయితే ఎన్నార్సీ కింద అక్రమ వలసదారులుగా గుర్తించే ముస్లింలను మాత్రం సీఏఏ నుంచి మినహాయించారని విమర్శించారు. దీంతో భారతీయ ముస్లింలలో భయం, ఆందోళన నెలకొని ఉన్నాయని అన్నారు. ఎన్పీఆర్–2010కి ఎన్పీఆర్–2020కి అసలు పొంతనే లేదని, దీనిని వ్యతిరేకించాలని వ్యాఖ్యానించారు. -
నేటి ప్రజా ఆందోళనల్లో విశేషాలెన్నో!
సాక్షి, న్యూఢిల్లీ : సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజా ఆందోళనలు చూస్తుంటే ఒకప్పటి నవ నిర్మాణ ఉద్యమం, జయ ప్రకాష్ నారాయణ్ ఉద్యమాలు గుర్తొస్తున్నాయి. ఆ రెండు ఉద్యమాలకు యువకులు, విద్యార్థులు నాయకత్వం వహించగా, నేటి ఉద్యమానికి కూడా ఆ ఇరు వర్గాలు నాయకత్వం వహించడంతోపాటు యువతులు కూడా పెద్ద సంఖ్యలో వీధుల్లోకి రావడం విశేషం. నాటి నవ నిర్మాణ్ ఉద్యమం ఎక్కువగా గుజరాత్ రాష్ట్రానికే పరిమితం కాగా, జేపీ ఉద్యమం గుజరాత్, బిహార్, హిందీ భాషా రాష్ట్రాలకు కూడా విస్తరించింది. ఎన్ఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ఆందోళనలు ఈశాన్య రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు కూడా విస్తరించడం గమనార్హం. దేశవ్యాప్తంగా నగరాల నుంచి పట్టణాలు, గ్రామాల నుంచి వీధుల వరకు విస్తరించాయి. ఇలాంటి ఆందోళనలను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం గతేడాది వందకన్నా ఎక్కువ సార్లు ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసింది. ఇంటర్నెట్ వినియోగంలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉన్న విషయం తెల్సిందే. ఈ ప్రజా ఆందోళనలకు కేంద్ర నాయకత్వం అంటూ ఒకటి లేదు. ఎక్కడికక్కడ ప్రజలు సంఘటితం అవుతున్నారు. అందుకనే పండుగలు, పబ్బాలప్పుడు, పెళ్లిళ్లు పేరంటాలప్పుడు, పట్టభద్రుల్లా వేడకలప్పుడు కూడా ఆందోళనలకు కొనసాగుతున్నాయి. గతంలో రాజకీయ ఉద్యమాలన్నీ ప్రజలకు బోరు కొట్టేవి. రొటీన్ నినాదాలు చీకాకు కలిగించేవి. ఈసారి అలా కాకుండా సృజనాత్మకతతో సాగుతున్నాయి. వ్యంగ్య కార్టూన్లు, వంగ్య నినాదాలతో హోరెత్తడమే కాకుండా సినిమా క్లిప్పింగ్‌ల వీడియోలతో మారుమ్రోగుతున్నాయి. కళాత్మక రూపాల్లో కొనసాగుతున్నాయి. ఒక్క ముస్లింలే కాకుండా వివిధ వర్గాల ప్రజలు కూడా ఈ ఆందోళనలో పాల్గొనడానికి కారణం దేశ ఆర్థిక పరిస్థితి పతనం కావడం. దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుదిద్దాల్సిన కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా సీఏఏ, ఎన్నార్సీ లాంటి కొత్త సమస్యలను తీసుకరావడం ఏమిటన్నది వారి వాదన. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ముస్లింల ప్రార్థనల సందర్భంగా వారికి రక్షణగా వారి హిందూ మిత్రులు మానవ హారంలా నిలబడుతుండడం మరో విశేషం. చదవండి: దేశ భద్రత కోసమే ఎన్ఆర్సీ బిల్లు: ప్రహ్లాద్ మోదీ సీఏఏ, ఎన్నార్సీ వద్దే వద్దు ఆ చట్టాలతో మూలవాసులకు ఆ కాస్త చోటూ కరువే! ఆందోళనకు ఊపిరి పోస్తున్న ‘పాటలు’ ఆ నేతల ఇంటి ముందు ‘ముగ్గు’లు ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ బొమ్మా బొరుసే -
మత ప్రాదిపదికన దేశాన్ని విభజిస్తున్నారు
-
దేశ భద్రత కోసమే ఎన్ఆర్సీ బిల్లు: ప్రహ్లాద్ మోదీ
సాక్షి, కూకట్పల్లి: ఎన్ఆర్సీ బిల్లు పట్ల ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ తెలిపారు. శనివారం కూకట్‌పల్లిలోని బీజేపీ సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి డాక్టర్ కొరడాల నరేష్ నివాసానికి వచ్చిన ఆయన పలువురు కార్యకర్తలతో కలిసి విందు భోజనంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ఆర్సీ బిల్లు పట్ల ప్రతిపక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా ప్రజలు అర్థం చేసుకొని దేశ భద్రత కోసం బిల్లును అంగీకరిస్తారని ఆయన వివిరించారు. దేశంలో శరణార్థుల పేరుతో ఎంతోమంది అక్రమ చొరబాటుదారులు దేశంలో ఉండి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆయన వివరించారు. కార్యక్రమంలో నాయకులు హరీష్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, పద్మయ్య, హరికృష్ణ, అరుణ్, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను ప్రహ్లాద్ మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు. -
సీఏఏ, ఎన్నార్సీ వద్దే వద్దు
సాక్షి,హైదరాబాద్/కవాడిగూడ/ముషీరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనకారులు కదం తొక్కారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగ సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా తెచ్చిన ఈ చట్టాన్ని రద్దు చేయాలని ముక్త కంఠంతో నినదించారు. ఈ ర్యాలీ తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన మిలియన్ మార్చ్‌ను తలపించింది. ఎంబీటీ, తెహ్రీక్, ముస్లిం షబ్బాన్, జమాతే ఇస్లామీ, జామియతే ఉలేమా, జమాతే ఇస్లామీ, ఆహెలే హదీస్, తామిరే మిల్లత్‌తో పాటు పలు ప్రజా, దళిత, విద్యార్థి సంఘాలు, సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాల నేతలు, సామాజిక, ధారి్మక, స్వచ్ఛంద సంస్థలతో కూడిన 48 సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) పిలుపునిచి్చన విషయం తెలిసిందే. ఈ మేరకు లక్షలాది మంది ముస్లిం లు, నిరసనకారులు ‘మిలియన్ మార్చ్’లో పాల్గొనేందుకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కుకు తరలివచ్చారు. నగరం నలుమూలల నుంచి కుటుంబసభ్యులతో సహా తరలిరావడంతో ఇందిరాపార్కు పరిసరప్రాంతాలు జనసంద్రాన్ని తలపించాయి. ఓ చేతిలో జాతీయ జెండా, మరో చేతిలో సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ప్లకార్డులను పట్టుకొని ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా ఇందిరాపార్కు, ఎన్టీఆర్ స్టేడియం, ధర్నా చౌక్, లోయర్ ట్యాంక్‌బండ్‌లోని కట్టమైసమ్మ దేవాలయం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు, తదితర ప్రాంతాలు పూర్తిగా జనంతో నిండిపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నిరసనకారులు చేసిన నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. మహిళలు, చిన్నారులు సైతం అధిక సంఖ్యలో హాజరై ఆందోళనలో భాగస్వాములయ్యారు. అంచనాలకు మించిన జనం.. పౌరసత్వ సవరణకు వ్యతిరేకంగా ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద మాత్రమే నిరసన సభ జరుపుకొనేందుకు పోలీసులు అనుమతిచ్చారు. కానీ, ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో జనం తరలిరావడంతో అటు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి ఇటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు నలువైపులా జనంతో నిండిపోయింది. మధ్యాహ్నం 3 గంటలు దాటే సరికి తెలుగు తల్లి ప్లైఓవర్, లోయర్‌ట్యాంకు బండ్ కిక్కిరిసింది. దీంతో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. అయితే ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ట్రాఫిక్ చక్రబంధంలో వాహనదారులు.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, హోటల్ మారియట్, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లిబర్టీ, బషీర్‌బాగ్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లోని వాహనదారులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. జనాలతో రోడ్లన్నీ జనసంద్రంగా మారడంతో వాహనదారులు, బస్సులు ముందుకు, వెనక్కి కదలలేని పరిస్థితి. మరికొన్ని వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించడంతో అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సందర్భంగా వందల సంఖ్యలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమైంది.. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, ఇది పార్లమెంటులో నెగ్గడం దేశచరిత్రలో దౌర్భాగ్యకరమని పలువురు ప్రజా సంఘాల నేతలు, ముస్లిం సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ఈ బిల్లును తీసుకురావడం తీవ్ర విషాదకరమని మండిపడ్డారు. దేశ సమగ్రతకు, సమైక్యతకు ఈ బిల్లు విఘాతం కలిగించేలా ఉందని ఆరోపించారు. సభలో మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, అజీజ్‌బాషా, జేఏసీ కనీ్వనర్ ముస్తాక్ మాలిక్, ప్రొ.విశ్వేశ్వర్రావు, జస్టిస్ చంద్రకుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి సయ్యద్ నిజాముద్దీన్, అమ్జాదుల్లా ఖాన్, షబ్బీర్ అలీ, మౌలానా నసీరుద్దీన్, ఫిరోజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సీఏఏను కేంద్రం ఉపసంహరించుకునేదాకా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎక్కడికక్కడ ఆందోళనలు ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. ఈ బిల్లు మతంపై ఆధారపడిన బిల్లు అని, సుప్రీంకోర్టులో ఈ బిల్లు నిలబడదని జోస్యం చెప్పారు. ‘హిందువు అయితే ఎన్నార్సీలో పౌరసత్వం నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు.. కానీ ముస్లిం అయితే పౌరసత్వం నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇది దారుణమైన మతపరమైన వివక్ష’అని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ చట్టం హిట్లర్ చట్టాల కన్నా దారుణమైందని తీవ్రంగా దుయ్యబట్టారు. -
ఆ చట్టాలతో మూలవాసులకు ఆ కాస్త చోటూ కరువే!
జాతీయ జనాభా పట్టిక (ఎన్నార్సీ) అనేది అధికారంలో ఉన్న పార్టీ తన హిందుత్వ సిద్ధాంతానికి అనువుగా ఏర్పాటు చేసుకున్న సంకుచిత వ్యవస్థ. ఇది అతి క్రూరమైన వైపరీత్యం. లౌకిక స్వభావాన్ని విధ్వంసం చేసే అసమాన ప్రక్రియ. ఇది అంపశయ్య మీదున్న ఆదివాసుల మనుగడను ఇంకా ప్రమాదపు అంచుకు నెట్టివేస్తోంది. ఇప్పటికే అమల్లో ఉన్న ఆటవిక చట్టాలతో అటు అడవికి, ఇటు మైదానానికి కాకుండా పోతున్న మూలవాసులను పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్నార్సీ) కలిసి భూమ్మీదే చోటు లేకుండా చేయబోతున్నాయి. యురేనియం అన్వేషణ, వజ్రాల తవ్వకాలు, పులుల సంరక్షణ కేంద్రాలకు అడవి ప్రాంతాన్ని విభజన చేసుకొని ఆయా ప్రాంతాల పరిధిలోకి వచ్చే గిరిజన గూడేలకు గుర్తింపులు రద్దు చేసి అడవి నుంచి బలవంతంగా బయటికి నెట్టివేయాలని చూస్తున్న కేంద్ర పాలకులకు జాతీయ జనాభా పట్టిక మరింత బలాన్ని ఇవ్వబోతోంది. అడవిలో ఆధారంలేక, అనువుగాని మైదానంలో గుర్తింపులేక గిరిజనులు పుట్టి పెరిగిన చోటనే అక్రమ వలసదారులు కాబోతున్నారు. దేశం మొత్తమ్మీద ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్షిప్’ (ఎన్నార్సీ) అమలు చేస్తే... తాము గిరిజనులమని గిరిజనులే రుజువు చేసుకోవాలి. రుజువు చేసుకోలేకపోతే... పుట్టి పెరిగిన నేలకు పరాయివాళ్లు అవుతారు. అడవిలోకి అక్రమంగా చొరబడిన విదేశీ యులు అవుతారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు జాతులు, తూర్పు కనుమల్లోని సహ్యాద్రి కొండల్లో నివసించే కోయ, గోండు, కోలాన్, విశాఖ మన్యంలోని కోయ, కొండరెడ్లు తదితర గిరిజన జాతుల మీద అటవీ అధికారులు దాడులు చేసి వెళ్లగొట్టే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్న వేళ ఎన్నార్సీ చట్టం ముచ్చెమటలు పోయిస్తోంది. అడవిలోని గూడెలను అధికారికంగా రద్దు చేసి, రేషన్, ఇతర సంక్షేమ పథకాలు అందకుండా చేసి అడవి నుంచి బలవంతంగా బయటికి తీసుకువచ్చి మైదాన ప్రాంతంలో ఏదో ఒక చోట వారిని కట్టడి చేస్తారు. తమది కాని కొత్త ప్రాంతంలో తాము అడవి బిడ్డలమని రుజువు చేసుకుంటే భారతీయ పౌరసత్వం ఉంటుంది. లేకుంటే ఆక్రమణదారులుగా గుర్తించే ప్రమాదం ఉంది. ఇక ఈశాన్య రాష్ట్రాలలోని ఆదివాసుల పరి స్థితి మరీ అన్యాయం కానుంది. అసోం సహా ఈశాన్య రాష్ట్రాలు ప్రధానంగా నాగా, అంగమి, ఆవో, రెంగ్మా, జిలాంగ్, శంతల, సౌర, గ్వాండియ, ఖాసీలు సంతాల్ తదితర ఆదివాసీ తెగలతో తమదైన ప్రత్యేక జాతుల అస్తిత్వం కలిగి ఉంది. పౌరసత్వ సవరణ చట్టం స్థానిక గిరిజన జాతుల సంస్కృతిపై దాడి చేయనుంది. కొత్త పౌరసత్వ సవరణ చట్టం వల్ల బెంగాలీ హిందువులకు చట్టబద్ధత వస్తుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చి స్థిరపడిన అసంఖ్యాక హిందువులకు చట్టబద్ధ పౌరసత్వం లభిస్తే రాష్ట్ర జనాభాలో వారి ఆధిక్యత నెలకొంటుంది. ఈశాన్య భారతం మొత్తం మీద ప్రభావం చూపిస్తుంది. క్రైస్తవులు అధికంగా ఉన్న మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్‌లలో మతపరంగా జనాభాలో పెనుమార్పులు రానున్నాయి. చివరగా చేరిన సిక్కింతో కలిపి ఈశాన్య భారతంలో ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి. నాలుగు రాష్ట్రాల్లో (అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్) ఆదివాసీ జనాభా ఎక్కువ. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో 20 నుంచి 30 శాతం ఆదివాసీ జనాభా ఉంది. ఆరవ షెడ్యూల్ లోని జాబితా ఆదివాసీ జాతుల మీద తీవ్ర ప్రభావం చూపించనుంది. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం 2014 కన్నా ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ నుండి భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందూ, బుద్ధిస్ట్, సిక్కు జైన, పార్సీ, క్రైస్తవ మతాలకు చెందిన వారికి భారత పౌరసత్వం వస్తుంది. దీనిని జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ బిల్ (సిఎబి) రూపంలో ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. లోకసభ, రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొంది దీని మీద రాష్ట్రపతి కూడా సంతకం చేశారు. అందువల్ల ఇది చట్ట రూపం పొంది, సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్‌గా (సీఏఏ) అమలుకు సిద్ధంగా ఉంది. ఈ చట్టం ముస్లింలకు తప్ప అన్ని మతాలకు చెందిన వలస ప్రజలకు మన దేశ పౌరసత్వం ఇస్తుంది. ఇలా మత ప్రాతిపదికన హక్కులు కల్పించడం భారతదేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలకే విరుద్ధం. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి వలసవచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులను అక్రమ వలసదారుల నిర్వచనం నుంచి మినహాయించింది. ఈ మూడు ముస్లిం దేశాల్లో మైనారిటీలు (అన్యమతస్థులు) వేధింపులకు గురవుతున్నందువల్ల వారికి ఆశ్రయం కల్పించి పౌరసత్వం ఇవ్వాలన్న ఆలోచనే హిందూ మత మార్పిడిలకు ప్రోత్సాహకంగా ఉంది. ఇలా మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం ఇజ్రాయెల్‌లో తప్పితే ప్రపంచంలో మరెక్కడా ఉన్న దాఖలాలు లేవు. దేశంలో స్థాయికి మించి పెరిగిపోయిన నిరుద్యోగం, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ, రైతుల ఆత్మహత్యలు, పర్యావరణ విధ్వంసం వంటి తీవ్రమైన సమస్యల వలయం నుంచి యువత, ప్రజల దృష్టి మరల్చి అధికార పీఠాన్ని పదిలపరుచుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ఈ వ్యూహాన్ని అమలుచేస్తోంది. ఇది రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధం. బలమైన హిందుత్వ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటంలో భాగమిది. కర్ర పెత్తనం చేసి రాష్ట్రాల్లో బలవంతంగా అమలు చేయచూస్తోంది. ఈ ఉపద్రవాన్ని ఆదిలోనే తుంచివేయాలి. దేశంలోని బీజేపీ ప్రభుత్వేతర రాష్ట్రాలు ఏకమై ఫెడరల్ ఫ్రంట్ స్ఫూర్తితో ముందుకు రావాలి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకు ధర్మ యుద్ధం చేయాలి. వ్యాసకర్త : సోలిపేట రామలింగారెడ్డి , సీనియర్ జర్నలిస్టు, శాసనసభ అంచనాలు, పద్దుల కమిటీ ఛైర్మన్ మొబైల్ : 94403 80141 -
హైదరాబాద్ మిలియన్ మార్చ్
-
కదం తొక్కిన హైదరాబాదీలు
-
హైదరాబాద్; ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికలను వ్యతిరేకిస్తూ ధర్నా చౌక్ వద్ద ప్రజాస్వామ్య వాదులు, మైనార్టీలు ఆందోళన చేపట్టారు. మైనార్టీలను వేధింపులకు గురిచేసేలా ఉన్న పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ పతకాలు చేబూని వేలాది మంది పౌరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన జనంతో ఇందిరాపార్క్ పరిసర ప్రాంతాలు జనసంద్రాన్ని తలపించాయి. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. ‘హిందూ-ముస్లిం భాయీ-భాయీ, చౌకీదార్ చోర్’ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ మిలియన్ మార్చ్ తరహాలో ఆందోళనకారులు కదం తొక్కారు. భారీగా సంఖ్యలో తెలుగుతల్లి ఫ్లైఓవర్ పైకి చేరుకుని సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, ఇందిరాపార్కు, ఎల్బీ స్టేడియం, మెహదీపట్నం ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పలుచోట్ల ఆందోళనకారులన పోలీసులు చెదరగొట్టారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆందోళన కార్యక్రమంలో ఇంత భారీ స్థాయిలో ప్రజలు పాల్గొనడం ఇదే మొదటిసారి అని నగరవాసులు అంటున్నారు. ఆందోళన కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్ చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో సిఏఏ,ఎన్ఆర్సీ వ్యతిరేక నిరసనలు
-
ఆందోళనకు ఊపిరి పోస్తున్న ‘పాటలు’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ మీరు అన్ని పుష్పాలను తుంచి వేయవచ్చు. కానీ రానున్న వసంతాన్ని మాత్రం ఆపలేవు’ ఈ కవిత గానమై ఎన్నార్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలో మారుమ్రోగిపోతోంది. పాబ్లో నెరుడా రాసిన ఈ కవిత నాడు చిలీలో జరిగిన విద్యార్థి ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. నాడు ఆయన దేశంలో నియంతత్వ పాలనకు వ్యతిరేకంగా 20కిపైగా కవితలు రాశారు. కవితలు, పాటలు ఉద్యమాలు, విప్లవాల నుంచి పుడతాయి. మళ్లీ అలాంటి ఉద్యమాలకే ఊపరిపోస్తాయి. అందుకే ‘పాట ఉద్యమం అవుతుంది. ఉద్యమం పాట అవుతుంది’ అంటూ గొంతెత్తిన కళాకారులు ఎంతో మంది ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కూడా పాటే ఆయుధమైంది. నేడు ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలో ఆయా ప్రాంతాలకు చెందిన పాటలు, కవితలు ఆయా ప్రాంతాల్లో మారుమ్రోగుతున్నాయి. ఆందోళనకు కొత్త ఊపునిస్తున్నాయి. వరుణ్ గోవర్ హిందీలో రాసిన తిరుగుబాటు కవిత ‘హమ్ కాగజ్ నహీ దిఖాయింగే’కు మంచి స్పందన కనిపిస్తోంది. ఇది సోషల్ మీడియాలో లక్షలసార్లు చెక్కర్లు కొడుతోంది. అస్సాంలో ‘ఐయామ్ మియా, మై ఎన్ఆర్సీ నెంబర్ సో అండ్ సో, ఐ గాట్ టూ చిల్డ్రన్, అనదర్ ఈజ్ కమింగ్ నెక్స్›్ట సమ్మర్, విల్ యు హేట్ హిమ్ యాజ్ యూ హేట్ మీ’ కవిత కూడా పాటై ప్రజలను ఆందోళన బాటలో నడిపిస్తోంది. 2017లో వచ్చిన డాక్యుమెంటరీ చిత్రం ‘న్యూటన్’లోని ‘చల్ తూ అప్నా కామ్ కర్’ అనే పాట కూడా ఆందోళనకారులకు ఎంతో స్ఫూర్తినిస్తోంది. నక్సలైట్ల బెడద ఎక్కువగా ఉన్న చత్తీస్‌గఢ్‌లోని ఓ మారుమూల పర్వత ప్రాంతంలో ముగ్గురు ఓటర్ల కోసం ఆరుగురు ఎన్నికల సిబ్బంది అడవుల గుండా కాలి నడకన కిలీమీటర్ల దూరం నడిచి పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని ఇతివృత్తంగా ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. ఎవరి పని వారు కచ్చితంగా చేయాల్సిందే అనే అర్థమిచ్చే ఈ పాటను ఆ చిత్రంలో నటుడు రఘుబీర్ యాదవ్ పాడారు. -
సీఏఏ, ఎన్ఆర్సీలతో దివ్యాంగులకు నష్టం
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల పట్టిక (ఎన్ఆర్సీ)లకు వ్యతిరేకంగా, అనుకూలంగా నేడు దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ చట్టాల వల్ల ఎక్కువగా నష్టపోనున్న ‘దివ్యాంగులు’ గురించి మాత్రం ఇటు ప్రజలుగానీ, అటు ప్రభుత్వంగానీ అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ రెండింటి వల్ల దివ్యాంగులే ఎక్కువగా భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న శరణార్థులు అవుతారని ‘నిప్మన్ ఫౌండేషన్’ సీఈవో, ‘వీల్స్ ఫర్ లైఫ్’ వ్యవస్థాపకులు నిపుణ్ మల్హోత్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 2.21 శాతం మంది మాత్రమే దివ్యాంగులు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 15 శాతం మంది దివ్యాంగులు ఉంటారు. ఆ లెక్కన భారత దేశంలో కూడా దాదాపు ఆ దరిదాపుల్లోనే ఉంటారు. సరైన సామాజిక స్పృహ లేనందున 2011 జనాభా లెక్కల సందర్భంగా చాలా కుటుంబాలు తమ కుటుంబంలోని దివ్యాంగుల గురించి వెల్లడించలేదు. జనాభా గణన అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు దివ్యాంగులను గదుల్లో బంధించిన సంఘటనలు కూడా ఆ తర్వాత వెలుగు చూశాయని నిపుణ్ మల్హోత్ర తెలిపారు. 2018, జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వం ‘యూనివర్శల్ డిసేబుల్డ్ ఐడీ కార్డ్’ స్కీమ్‌ను ఢిల్లీలో ప్రారంభించగా ఆ సంవత్సరం కేవలం 22 కార్డులను మాత్రమే కేంద్రం జారీ చేసింది. ఢిల్లీలో 2.3 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. ఇలా దేశంలో ఎంతో మంది దివ్యాంగులకు ఐడీ కార్డులు లేవని, వారందరిని కొత్త చట్టాల కింద అక్రమంగా దేశానికి వలసవచ్చిన శరణార్థులుగా పరిగణించే ప్రమాదం ఉందని మల్హోత్ర ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆ నేతల ఇంటి ముందు ‘ముగ్గు’లు
సాక్షి, చెన్నై: కేంద్రం తీసుకొచ్చిన పౌర సవరణ చట్టానికి వ్యతిరేకంగా తమిళనాడులో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇళ్ల ముందు ‘రంగోలి’ తో నిరసన తెలిపిన యువతులను పోలీసులు అరెస్ట్ చేసి, కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ చర్యను నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, డీఎంకే అధినేత స్టాలిన్, తుత్తుకుడి ఎంపీ కనిమొళి ఇళ్ల ముందు కూడా ‘వేండం (వుయ్ డోంట్ వాంట్) సీఏఏ-ఎన్ఆర్సీ’ అంటూ ముగ్గులు వేశారు. పౌర సవరణ చట్టానికి తాము వ్యతిరేకం అంటూ రంగోలి ద్వారా తమ నిరసన తెలిపారు. కాగా ఇంటి ముందు ముగ్గులు వేసి నిరసన తెలిపినందుకు సోమవారం కూడా అయిదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గులతో నిరసన.. కాగా ఆదివారం చెన్నై బీసెంట్ నగర్లో ఉదయం ఎనిమిది మంది యువతులు వినూత్న నిరసన చేపట్టారు. అక్కడి కొన్ని ఇళ్ల ముందు రంగోలి వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఎన్పీఆర్, ఎన్ఆర్సీ, సీఏఏ తమకు వద్దని, వాటిని వెనక్కు తీసుకోవాలన్న నినాదాలతో ఆ రంగోలి వేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారిపై కేసులు నమోదు చేశారు. వీరి అరెస్టు సమాచారంతో డీఎంకే నేత స్టాలిన్, ఎండీఎంకే నేత వైగో పాటు ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. వారిని విడిచి పెట్టాలని, నిరసనల్ని అణచి వేసే విధంగా కేసుల నమోదును ఆపకుంటే, ఉద్యమం ఎగసి పడుతుందని హెచ్చరించారు. దీంతో ఆ యువతుల్ని కాసేపటి తర్వాత విడుదల చేసినా, కేసుల్ని మాత్రం పోలీసులు ఎత్తి వేయలేదు. నిరసనలు కొనసాగిన పక్షంలో కేసుల మోత మోగుద్దంటూ పోలీసులు హెచ్చరించారు. ఇక, చెన్నైలో కాంగ్రెస్ నేతృత్వంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా సాగిన ర్యాలీని సైతం పరిగణించి ఐదు వందల మందిపై కేసులు నమోదు చేయడం గమనార్హం. రాష్ట్రంలో పౌర చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు రాజుకున్న విషయం తెలిసిందే. తొలుత విద్యార్థులు పోరుబాట పట్టగా, ఆ తదుపరి ప్రజా సంఘాలు, ›ప్రతి పక్షాలు ఆందోళనలు ఉధృతం చేసే పనిలో పడ్డాయి. తాజాగా, ఈ నిరసనలు మైనారిటీల చేతుల్లోకి వెళ్లి ఉన్నాయి. మైనారిటీ సంఘాలు, సంస్థలు, పార్టీలు అంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తుతున్నాయి. ఎక్కడికక్కడ పౌర ఆగ్రహం రాజుకోవడంతో అధికార పక్షం ఇరకాటంలో పడింది. అదే సమయంలో ఈ పౌర చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని సీఎం పళనిస్వామి ప్రకటన చేయాలని లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని, మరో స్వాతంత్య్ర పోరాటం అన్నది తమిళనాడు నుంచే బయలుదేరుతుందన్న హెచ్చరికల్ని మైనారిటీ నేతలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నిరసనలు మరింతగా రాజుకునేలోపు ఉక్కుపాదంతో అణచి వేయడానికి సిద్ధం అయింది. చదవండి: ముగ్గులతో నిరసనలు.. పోలీసుల అదుపులో ఐదుగురు దీంతో పౌర చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నిరసనకారులపై కేసుల మోత మోగించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. శనివారం చెన్నైలో జరిగిన నిరసనలో పాల్గొన్న పిల్లలు, మహిళలు, యువతుల్ని సైతం వదలిపెట్టకుండా పది వేల మందిపై కేసులు పెట్టారు. ఇక, ఆదివారం చెన్నైలో రంగోళితో నిరసన వ్యక్తం చేసిన యువతుల్ని సైతం పోలీసులు వదలి పెట్ట లేదు. వారిని అరెస్టు చేశారు. ఈ అరెస్టుపై సర్వత్రా ఆగ్రహం బయలు దేరడంతో వారిని షరతులతో విడిచి పెట్టారు. కాగా, కేసు మోతపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నాటికి 50 వేల మందిపై కేసులు నమోదు చేయడం గమనార్హం. ఇక, చెన్నైలో శనివారం తౌహిద్ జమాత్ నేతృత్వంలో ఆలందూరులో జరిగిన నిరసనలో అధిక శాతం మైనారిటీ మహిళలు, యువతులు, పిల్లలు తరలి వచ్చారు. ఈ నిరసనకు నేతృత్వం వహించిన నేతలతో పాటుగా తరలి వచ్చిన పది వేల మందిపై కేసుల్ని పల్లావరం పోలీసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా నిరసన చేపట్టడం, చట్ట విరుద్ధంగా వ్యవహరించడం, ట్రాఫిక్‌కు అంతరాయం కల్గించి, వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు కల్గించడం వంటి సెక్షన్లతో ఈ కేసులు నమోదయ్యాయి. -
అవసరమైతే తీసుకుంటాం
న్యూఢిల్లీ: కేంద్ర న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎన్పీఆర్పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎన్పీఆర్ డేటాను ఎన్‌ఆర్‌సీకోసం ఉపయోగించుకునే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ఆయన ఆదివారం ప్రకటించారు. ఎన్పీఆర్కి, ఎన్ఆర్సీకి ఎలాంటి సంబంధం ఉండబోదని గతవారం హోంమంత్రి అమిత్‌షా ప్రకటించిన నేపథ్యంలో రవిశంకర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం లభించింది. ‘జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్) కోసం సేకరించిన డేటాను జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) అవసరాల కోసం ఉపయోగించొచ్చు.. లేదా ఉపయోగించకపోవచ్చు’అని రవిశంకర్ ప్రసాద్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ‘పాస్‌పోర్ట్‌లు, పాన్ కార్డు కోసం డేటా సేకరించినప్పుడు లేని సమస్య ఎన్ఆర్సీకి మాత్రమే ఎందుకు వస్తోంది, ప్రజలు ప్రభుత్వ విధానాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు’అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. -
అరాచకం, అస్థిరతలపై అసహనం
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్దాలన్నీ యువతరానివేనని, వ్యవస్థపై వారికి అపారమైన నమ్మకం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యవస్థలు సరిగా స్పందించకపోతే యువతలో ప్రశ్నించే ధోరణి కనిపిస్తోందని కొనియాడారు. ఆకాశవాణిలో ఆదివారం నాడు ఈ ఏడాది చివరి మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. అరాచకత్వం, అనిశ్చితి పరిస్థితుల్ని నేటి తరం ద్వేషిస్తున్నారని ప్రధాని అన్నారు. కులతత్వం, బంధుప్రీతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించారు. పౌరసత్వ చట్ట సవరణలకు, ప్రతిపాదిత ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఇటీవల యూనివర్సిటీల్లో నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘నాకు తెలిసినంతవరకు నేటి తరం వ్యవస్థలపైనే నమ్మకం ఉంచింది. వాటిని అనుసరించాలనీ భావిస్తోంది. వ్యవస్థలు సరిగా స్పందించనప్పుడు వారిలో అసహనం పెరిగిపోతోంది. ధైర్యంగా ప్రశ్నించే తత్వం కూడా కనబడుతోంది’’అని మోదీ అన్నారు. దేశంలో యువత అరాచకం ఏ రూపంలో ఉన్నా సహించలేరని, పాలనా వైఫల్యాలను, అస్థిరతను తట్టుకోలేకపోతున్నారని అన్నారు. జాతి నిర్మాణంలో పాల్గొనాలి ధైర్యసాహసాలు, ఉత్తేజపూరిత స్వభావం కలిగిన యువతే మార్పుకి బాటలు వేస్తుందని స్వామి వివేకానంద మాటల్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుకు తెచ్చుకున్నారు. జనవరి 12 వివేకానందుడి జయంతిని పురస్కరించుకొని యువత జాతి నిర్మాణంలో తమ వంతు బాధ్యతని తలకెత్తుకోవాలని, దేశ పురోగతికి కావల్సిన ఆలోచనలు చేయా లని పిలుపునిచ్చారు. దేశాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్లే సత్తా యువతకే ఉందన్నారు. దేశీయ ఉత్పత్తులకి ప్రాచుర్యం కల్పించాలి వచ్చే రెండు మూడేళ్లు దేశీయ ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 2022లో భారత్ 75ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను పూర్తి చేసుక్నుంతవరకు స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని అన్నారు. భారత్‌లో భారతీయుల చేతులతో, వారి స్వేదాన్ని చిందించి తయారు చేసిన ఉత్పత్తుల్ని ఒక రెండేళ్లు వాడేలా యువతే ముందుకు రావాలని అన్నారు. -
ముగ్గులు వేసినందుకు నలుగురు మహిళలను..
సాక్షి, చెనై: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) నిరసిస్తూ చెన్నైలోని కొందరు ఆందోళనకారులు వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేశారు. రోడ్లపైనా, కొందరి ఇంటి ముందు ముగ్గులు వేశారు. సీఏఏకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు. దీంతో పోలీసులు నలుగురు మహిళలను, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విడిపించేందుకు వచ్చిన మరో ఇద్దరు లాయర్లను కూడా అదుపులోకి తీసుకుని అనంతరం విడిచిపెట్టారు. బీసెంట్ నగర్‌లోని ఎలిటోస్ బీచ్ ప్రాంతంలో ఆ మహిళలు ఈ ముగ్గులు వేశారు. 'సీఏఏ వద్దు, ఎన్ఆర్సీ వద్దు' అంటూ ఆ ముగ్గుల్లో నినాదాలు రాశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారంటూ అసిస్టెంట్ కమిషనర్ సహా పోలీసు సిబ్బంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. వారు నిరసన తెలిపేందుకు ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. అయితే, నిరసన తెలిపేందుకు చెన్నై పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదని, అందుకే ఈ వినూత్న పంథాను ఎన్నుకున్నామని నిరసనకారుల్లో ఒకరు తెలిపారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని డీఎంకే నాయకుడు స్టాలిన్ ఖండించారు. 'ఏడీఎంకే ప్రభుత్వ అకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా ముగ్గులు వేసి నిరసన తెలిపినందుకు వారిని అరెస్టు చేశారు. నిరసన తెలిపే హక్కును కూడా వారికి ఇవ్వడం లేదు' అంటూ ట్వీట్ చేశారు.సీఏఏ వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నవారిని నియంత్రించేందుకు తమకు అధికారాలున్నాయని.. చిన్న, చిన్న జన సమూహాలు పెద్ద గుంపులుగా పెరిగి తిభద్రతల సమస్యకు దారితీయొచ్చని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. నిరసనలు అదుపు తప్పకముందే కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. -
ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ బొమ్మా బొరుసే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ), జాతీయ జనాభా రిజి స్టర్ (ఎన్పీఆర్)లు నాణానికి బొమ్మా బొరుసులాంటివేనని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఎన్ఆర్సీ, సీఏఏ వల్ల ముస్లింలతోపాటు రానున్న రోజుల్లో క్రైస్తవులు, దళితులకు కూడా ఇబ్బందులు తప్పవని ఆయన ఆందో ళన వ్యక్తం చేశారు. ఎన్నార్సీ, సీఏఏకు వ్యతి రేకంగా ముస్లిం ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నిజామాబాద్ నగరంలోని ఈద్గా మైదానంలో జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్ ప్రసంగించారు. ఎన్పీఆర్ను ఆపాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయగా త్వరలో అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని అసదుద్దీన్ పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందికరమైన చట్టాలను వ్యతిరేకిస్తామని కేసీఆర్ చెప్పారన్నారు. ఆయనకు ముస్లిం సమాజం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై అసద్ ప్రసంశల జల్లు కురిపించారు. కేసీఆర్ బతికున్నంత కాలం ఎంఐఎం ఆయనకు మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీకి ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉందని.. ఇద్దరూ హిందువులే అయినప్పటికీ కేసీఆర్ లౌకిక భావాలున్న నాయకుడని కొనియాడారు. నిజామాబాద్ సభకు మద్దతివ్వాలని కాంగ్రెస్‌ను రెండుసార్లు ఆహ్వానించినా ఆ పార్టీ స్పందించలేదని విమర్శించారు. ఆ రెండు ఎన్పీఆర్లకు ఎంతో తేడా.. యూపీఏ హయాంలో 2010లో జరిగిన ఎన్పీఆర్కు, మోదీ ప్రభుత్వం 2020లో నిర్వహించనున్న ఎన్పీఆర్కు చాలా తేడా ఉందని అసదుద్దీన్ తెలిపారు. తాజా ఎన్పీఆర్లో కొత్తగా తల్లిదండ్రుల పేర్లు, వారు పుట్టిన ప్రాంతం, ఫోన్ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ అధికారులకు సందేహం వస్తే అలాంటి వారి పేర్లను పక్కనబెట్టి వారికి నోటీసులు జారీ చేస్తారని, మూడు నెలల్లో ఆధారాలు చూపకపోతే పౌరసత్వం నిరాకరించే అవకాశాలున్నాయని అసద్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 29 శాతం మంది మాత్రమే జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్నారని, మిగతా వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జనన ధ్రువీకరణ పత్రాన్ని అడిగితే సామాన్యుల ఆత్మగౌరవం దెబ్బతింటుందన్నారు. తామంతా ఇక్కడే పుట్టామని, ఇక్కడే మరణిస్తామని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో చర్చ సందర్భంగా పౌరసత్వ సవరణ బిల్లు (పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం– సీఏఏ) ప్రతులను తాను చింపేయడాన్ని కొందరు ప్రశ్నించారన్న అసద్... మతప్రాతిపదికన తెచ్చే బిల్లులను తాను చింపేస్తానని స్పష్టం చేశారు. మోదీ, అమిత్ షావి అబద్ధపు మాటలు.. ఎన్నార్సీ, సీఏఏల విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షావి అబద్ధపు మాటలని అసదుద్దీన్ విమర్శించారు. ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాన్ని చూసి బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు కంటి మీద కునుకు కరువైందన్నారు. మతం పేరుతో దేశాన్ని విభజించాలని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంబేడ్కర్, గాంధీజీ కలలు కన్న రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ చదివిన ఎంటైర్ పొలిటికల్ సైన్స్ అనే డిగ్రీ ప్రపంచంలో ఎక్కడా లేదని ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ఎస్పైనా ఘాటు వ్యాఖ్యలు.. దేశ రాజ్యాంగంలో తలదూర్చేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని అసదుద్దీన్ మండిపడ్డారు. 90 ఏళ్లపాటు చెడ్డీ వేసుకున్న ఆర్ఎస్ఎస్... ఇప్పుడు ప్యాంటు ధరిస్తోందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు ఇలాంటి సభలను నిర్వహిస్తున్నామన్న ఎంఐఎం అధినేత... రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం దేశంలో అన్ని మతాలకు సమాన హక్కుందని గుర్తుచేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎందరో ముస్లిం వీరులు త్యాగాలు చేశారన్నారు. అస్సాం పునరావాస కేంద్రాల్లో 19 లక్షల మంది ఉన్నారని, వారిలో 5.40 లక్షల మంది ముస్లింలని పేర్కొన్నారు. ‘మిగతా వారికి పౌరసత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి 5.40 లక్షల మంది ముస్లింలు తమ పౌరసత్వం కోసం ఎవరిని ఆశ్రయించాలి?’అని అసద్ ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల నుంచి ఉన్న వారిలో 28 మంది మరణించారని, మిగిలిన వారు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి వస్తోందన్నారు. రాజ్యాంగంలోని ముందుమాటను సభకు హాజరైన వారితో అసదుద్దీన్ చదివించారు. ఈ సభలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షకీల్ అమేర్ (బోధన్), నల్లమడుగు సురేందర్ (ఎల్లారెడ్డి), జెడ్పీ చైర్పర్సన్ దాదన్నగారి విఠల్‌రావు, న్యూడెమోక్రసీ నాయకులు, పలు ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
వాస్తవాలు చెప్పకుండా దుష్ప్రచారం చేస్తున్నారు
సాక్షి, విజయవాడ : జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) చట్టంపై శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సు లో మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు పాల్గొన్నారు. సురేష్ ప్రభు మాట్లాడుతూ.. జనాభా గణనకు, పౌరసత్వ చట్ట సవరణకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అస్సొం మినహా ఎన్నార్సీ మరెక్కడా అమలు కాదని పేర్కొన్నారు. కొన్ని రాజకీయపక్షాలు వాస్తవాలను బయటికి చెప్పకుండా దుష్ప్రచారంతోనే భయాందోళనలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. ఏళ్ల తరబడి వివాదాస్పదంగా ఉన్న పలు కీలకమైన అంశాల్లో బీజేపీ నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా ప్రజలను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడతుందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షాలు ఇప్పటికే ఎన్నార్సీ , సిఎఎ చట్టాలపై ప్రజల్లో అపోహలు తొలగిస్తూ స్పష్టమైన ప్రకటన చేశారన్నారు. పౌరసత్వ సవరణ చట్టం ఏ మతాన్ని, ఏ వ్యక్తిని ఉద్దేశించింది కాదని అందుకే ఈ చట్టం వల్ల దేశంలోని హిందువులకు, ముస్లింలకు ఎలాంటి ముప్పు ఉండదని వెల్లడించారు. -
తెలుగు రాష్ట్రాల్లో ‘పౌరసత్వ’ ప్రకంపనలు
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)లకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం ఆందోళనలు పోటెత్తాయి. మైనారీలను వేధింపులకు గురిచేసేలా ఉన్న ఈ రెండింటినీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు జరిపారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో సీఏఏ, ఎన్ఆర్సీలకు ముస్లింలు కదం తొక్కారు. నమాజ్ అనంతరం భారీ సంఖ్యలో యువత, మహిళలు నిరసన ప్రదర్శన చేపట్టారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ నినాదాలు చేశారు. ప్రజావ్యతిరేక బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఏఏ రద్దు చేసేలా ప్రధాని నరేంద్ర మోదీకి మంచి బుద్దిని ప్రసాదించాలని కోరుకుంటూ ఉయ్యూరు సెంటర్లో ప్రార్ధనలు జరిపారు. గన్నవరం, హనుమాన్ జంక్షన్లలో ర్యాలీ చేపట్టారు. పౌరసత్వ సవరణ చట్టం బిల్లును వెంటనే రద్దు చేయాలంటూ నినదించారు. ఎన్ఆర్సీకి వ్యతిరేకమన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు పిడుగురాళ్లలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. వీరికి మద్దతుగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ర్యాలీలో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీకి నిరసనగా ముస్లింలు మానవహారం పాటించారు. తర్వాత డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. నిడదవోలులోముస్లింలు నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. నిడదవోలు ముస్లిముల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వర రావు, ఎస్ఎఫ్ఐ, ముస్లిం, సెక్యులర్, దళిత, ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలోనూ జనాగ్రహం పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో మైనార్టీలు భారీ ఎత్తున జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. అఖిలపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అంతకుముందు పట్టణములో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ముస్లిం ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో శుక్రవారం సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఎంఐఎం నేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఇతర పార్టీల నాయకులు సభకు హాజరయ్యారు. (చదవండి: ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ రెండూ ఒకటే) -
నిజామాబాద్ సభకు అసదుద్దీన్, ప్రశాంత్‌రెడ్డి
నిజామాబాద్ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)లను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిజామాబాద్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఖిల్లా రోడ్డులోని ఒక ఫంక్షన్ హాల్లో యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. నగరంలోని ఖిల్లా ఈద్గా మైదానంలో సాయంత్రం 6 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సభకు బీజేపీయేతర అన్ని రాజకీయ పార్టీలతో పాటు ముస్లిం సంస్థల ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు రానున్నట్లు చెప్పారు. సభకు హాజరుకానున్న అసదుద్దీన్, ప్రశాంత్‌రెడ్డి ఈ సభకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో పాటు, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వస్తారని నిర్వహకులు చెప్పారు. ఎన్నార్సీ, సీఏఏను ఉపసంహరించుకునేంత వరకు ఐక్యంగా ఉద్యమిస్తామని పేర్కొన్నారు. ఎన్పీఆర్ను కూడా తాము వ్యతిరేకిస్తున్నమని తెలిపారు. మోదీ ప్రభుత్వం ద్వంద్వ విధానాలను అనుసరిస్తుందని విమర్శించారు. సీఏఏ, ఎన్నార్సీలను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. దీనిని అమలు చేయబోమని సీఎం కేసీఆర్ ప్రకటించాలని కోరారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉర్దు అకాడమీ చైర్మన్ మహ్మద్ రహీం అన్సారీ, యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మునీరుద్దీన్ ముక్తార్, జిల్లా కన్వీనర్ హఫిజ్‌లయాఖ్‌న్, మౌలానా వరియుల్లాఖాన్సి, పెద్ది వెంకట్రాములు, భూమయ్య, రఫత్‌ఖాన్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఐక్యకార్యాచరణ సమితి నాయకులు సభకు భారీ బందోబస్తు నిజామాబాద్‌లో శుక్రవారం ఖిల్లా వద్ద ఈద్గాలో జరిగే బహిరంగ సభకు సుమారు వేయి మంది పోలీసులతో బందోబస్తు చేపట్టనున్నారు. గురువారం రాత్రి వరకు సభ నిర్వహణపై పోలీసులతో సీపీ సమావేశం నిర్వహించారు. మెదక్, కామారెడ్డి, సిద్దిపేట నుంచి పోలీసులు బందోబస్తుకు వస్తున్నారు. -
వివక్ష విసిరిన భయోత్పాతం
ఆపత్కాలంలో తన తోక కొసను తానే శరీరం నుంచి విడగొట్టుకోగలిగే ప్రత్యేక లక్షణం బల్లికి ఉంది. అలా విడివడిన తోక భాగం గిలగిలా కొట్టుకుంటుంటే అప్పటి వరకు తనను వెంటాడిన శత్రువు క్షణాల పాటు విస్మయానికి గురౌతుంది. అదే అదునుగా... సదరు బల్లి శత్రువుకి చిక్కే గండం తప్పించుకొని మెల్లగా సురక్షిత ప్రాంతానికి జారుకుంటుంది. మొండి శరీ రానికి మళ్లీ తోక మొలిచి బల్లి మామూలు స్థితికి వస్తుంది, అది వేరే విషయం! పాలకులూ ప్రధానమైన ప్రజాసమస్యలు, తాము నేరుగా బాధ్యత వహించాల్సిన ముఖ్యాంశాల నుంచి జనం దృష్టి మళ్లిం చేందుకు ఇతరేతర విషయాల్ని తెరపైకి తెస్తుంటారు. అది గ్రహించని సాధారణ ప్రజలు, విద్యావంతులు, సమకాలీన ప్రసారమాధ్యమా లతో సహా... అలా తెరపైకి తీసుకువచ్చిన అప్రస్తుత అంశాల చుట్టే తిరుగుతూ, జనాల్ని తిప్పుతూ ఉంటారు. దాంతో అసలు సమస్యలు చర్చకు రాకుండా మరుగున పడిపోతుంటాయి. ఇది మన ప్రజాస్వా మ్యంలో ఇటీవల రివాజుగా మారింది. జాతీయ పౌర నమోదు పట్టి (ఎన్నార్సీ), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో జరుగు తున్న రగడ కూడా అటువంటిదేనేమో! అన్న భావన మొదట కలిగినా, అంతకన్నా ఎక్కువ ప్రమాద సంకేతాలే ఇప్పుడు కనిపిస్తు న్నాయి. మొదట దీన్నొక దృష్టి మళ్లింపు చర్యగా పలువురు భావిం చడానికి బలమైన కారణాలే ఉన్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి దిగ జారడం, వార్షిక ఆర్థికాభివృద్ధి రేటు పడిపోయి 5–4 శాతం మధ్య కొట్టుమిట్టాడటం, నిరుద్యోగ సమస్య జఠిలమవడం, వ్యవసాయం కునారిల్లడం... వంటి వైఫల్యాల నుంచి జనం దృష్టి మళ్లించడానికి కేంద్రం చేపట్టిన చర్యనేమో అనుకున్నారు. కానీ, ఎన్నార్సీ అమలుకు పూర్వ రంగంగా ఇప్పుడు జాతీయ జనాభా నమోదు పట్టి (ఎన్పీఆర్) తయారీకి నడుం కట్టడంతో, ఎన్నార్సీ అమలుకే కేంద్రం కట్టుబడినట్టు రూఢీ అయింది. ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వ పెద్దల మాటలకు, చేతలకు పొంతనలేనితనం సందేహాలకు తావి స్తోంది. మత ప్రాతిపదికన వివక్షాపూరిత విధానాలతో ఈ ప్రక్రియ చేపడుతున్నారనే విమర్శతో దేశవ్యాప్త నిరసనలు చెలరేగుతు న్నాయి. భారతీయ ముస్లీంలలో ఒక విధమైన భయాందోళనలకు ఇది కారణమౌతోంది. ఈ విషయంలో దేశ ప్రజల, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయ ఝరి రెండు పాయలుగా చీలింది. ఎనార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ ఒకటికొకటి సంబంధం లేనివిగా చెబుతున్న కేంద్ర ప్రభుత్వపు మాటలూ నిజం కాదు. చర్చించలేదంటే.....!? రాజకీయాల్లో కొన్నిసార్లు వ్యూహాత్మక వెనుకడుగు సహజమే! పాల కులు తమ ఆలోచనల్ని శైశవ దశలోనే జనబాహుళ్యంలోకి వదిలి, స్పందనను బట్టి ముందుకు సాగటమో, వెనక్కి తగ్గటమో చేస్తుం టారు. ఎనార్సీ విషయంలోనూ బీజేపీ నాయకత్వం ఇదే పంథా అనుసరిస్తోందేమో అనుకున్నారు. అసోమ్‌లో చేసినట్టు, దేశమం తటా అమలు చేస్తామని ముందు పార్లమెంట్ వేదిక నుంచి, బయటా చెప్పిన వారే దేశ వ్యాప్త నిరసనలు చూసి, ‘మేమసలు చర్చించనే లేద’ంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనని ధృవీ కరిస్తూ హోమ్ మంత్రి, బీజేపీ అధినేత అమిత్‌షా మాట్లాడారు. కానీ, స్పష్టత కొరవడింది. ఆలోచించలేదన్నారు కదా! పోనీ, ‘అమలు తలంపు లేదు’ అంటున్నారా? అంటే, అనటం లేదు. అందుకే, నిరస నలు పెల్లుబికి సర్వత్రా నిప్పు రగులుతూ ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు తాము ఎన్నార్సీ అమలు పరిచేది లేదని కరాఖండిగా ప్రకటించాయి. తాజాగా జాతీయ జనాభా నమోదు పట్టి (ఎన్పీఆర్) రూపొందించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టడమే కాకుండా వచ్చే సంవత్సరం ఏప్రిల్– సెప్టెంబరు మధ్య ఈ ప్రక్రియ పూర్తిచేయాలని మంత్రివర్గం ఆమో దించింది. ఈ చర్యలతో సర్కారు వైఖరి స్పష్టమైంది. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకత రాగానే, ఎన్నార్సీకి, సీఏఏకి సంబంధం లేదని ఇన్నాళ్లు చెబుతూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఎన్నార్సీకి, ఎన్పీఆర్కు సంబంధం లేదని చెబుతోంది. ఈ వాదనే విచిత్రం. ఇవన్నీ ఒక తాను (పౌరసత్వ చట్టం–1955) ముక్కలే! కేంద్ర ప్రభుత్వ పెద్దలు, మంత్రులు లోగడ చేసిన అధికారిక ప్రకటనకు తాజా వాదన పూర్తి విరుద్దం! హోమ్ మంత్రిత్వ శాఖవారు లోగడ (2014 కు పూర్వం, తర్వాత కూడా) లోకసభలో పలు సందర్భాల్లో... ఎన్నార్సీ అమలుకు ఎన్పీఆర్ తొలిమెట్టని సెలవిచ్చారు. రెండు వేర్వేరు ప్రక్రియలే అయినా, ఒకదానితో ఒకటి ముడివడి ఉన్న వ్యవ హారాలే! సాపేక్షంగా చెప్పాల్సి వస్తే.... పిండి పిసకటం, రొట్టె కాల్చడం రెండూ ఒకటి కాదు. వేర్వేరనే మాట నిజమే! కానీ, పిండి పిసికేది దేనికి? రొట్టె కాల్చడానికి కాదా? మరి సంబంధం లేదని ఎలా అనగలం? కాంగ్రెస్ సందిగ్దతకు కారణమేంటో! మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ భాగస్వామ్యంతో ఉన్న మహా రాష్ట్ర ప్రభుత్వాధినేతలు... తాము ఎనార్సీ అమలుపరచమని ప్రకటిం చారు. అలా ప్రకటించిన మమతా బెనర్జీ (పశ్చిమబెంగాల్), వైఎస్ జగన్మోహన్రెడ్డి (ఆంధ్రప్రదేశ్), నితీష్‌కుమార్ (బీహార్), నవీన్ పట్నాయక్ (ఒడిశా) తదితర ముఖ్యమంత్రులు వేర్వేరు పార్టీలకు స్వయంగా అధినేతలు. కాంగ్రెస్ విషయానికి వస్తే పరిస్థితి భిన్నం. ఢిల్లీ అధినాయకత్వం విధాన ప్రకటన చేయాలి. ఎన్నార్సీని ఇంతగా ప్రతిఘటిస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వం, తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దీన్ని అమలుపరచబోమని ప్రకటించడం లేదు. ఇది, అదు నుగా బీజేపీ నాయకత్వం కాంగ్రెస్‌పైనే బాణాలు ఎక్కుపెడుతోంది. పౌరసత్వ ప్రస్తుత సవరణ చట్టం మూలాలు 2003 సవరణలోనే ఉన్నాయి. పౌరసత్వ చట్టం–1955ను నాటి వాజ్‌పేయి ప్రభుత్వం సవరించింది. దశాబ్ద కాలం (2004–14) అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకీ సవరణల్ని తొలగించలేదని అడుగుతున్నారు. నాటి యూపీఏ ప్రభుత్వం (2010–11) ఎన్పీఆర్ జరిపినా ఎన్నార్సీకి సాహసించలేదు. 2014 తర్వాత పార్లమెంటులోనే పలు సందర్భాల్లో తాము దేశవ్యాప్త ఎన్నార్సీ, ఎన్పీఆర్లతో వెళతామని ఎన్టీయే పాల కులు విస్పష్టంగా చెప్పినా కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించలేదు? అనే ప్రశ్న సంధిస్తున్నారు. అందుకేనేమో, కాంగ్రెస్ ప్రస్తుత సంకట పరి స్థితి! కానీ, ఇప్పుడు వివాదమంతా వాజ్‌పేయి నేతృత్వంలో (2003) జరిగిన పౌరసత్వ సవరణ చట్టంపైనే అన్నది గుర్తెరగాలి. దాని ప్రకారం, భారత పౌరుల్ని లెక్కించి ఎన్పీఆర్ రూపొందిస్తారు, లెక్కిం చిన పౌరుల పౌరసత్వాన్ని ప్రభుత్వం గుర్తించాలి. అలా గుర్తింపు పొందిన పౌరులంతా మరో అధికారిక పత్రం ‘జాతీయ భారత పౌర నమోదు పట్టి’ (ఎన్ఆర్ఐసీ)లో భాగమవుతారు. దాన్నే మనమిపుడు ఎన్నార్సీ అంటున్నాం. ఈ ప్రక్రియ మధ్యలో, లెక్కించిన పౌరుల గుర్తింపునకు తాజా పౌరసత్వ సవరణ చట్టం–2019 ప్రాతిపదిక అవుతుంది. అదే తాజా వివాదానికి ఆజ్యం పోస్తోంది. ఎందుకంటే, తాజా సవరణల్లో పొందుపరిచిన ప్రాతిపదికలే వివాదాస్పదంగా, వివక్షాపూరితంగా ఉన్నాయి. ఇక, ఒకటికొకటి సంబంధం లేదనే వాదనకు అర్థమే లేదు. సవరణ–ప్రాతిపదికలతోనే తంటాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాం 2010–11లో జరిగిన ఎన్పీఆర్కి, ఇప్పుడు జరుపబోయేదానికి ఎంతో వ్యత్యాసముంది. సవరణ చిన్న దిగా కనిపిస్తున్నా, ఎన్నార్సీ ప్రక్రియకు సీఏఏ చట్ట తాజా సవరణాం శాల్ని అనుసంధానించినపుడు సమస్య జఠిలమౌతోంది. ప్రాతిపదిక లలా ఉన్నాయి. లెక్కించిన పౌరుల్ని గుర్తించి, పౌరసత్వం ఇచ్చే అంశంపైనే (అంటే... మిగిలిన వారికి నిరాకరించే, అనే అర్థం కూడా తీసుకోవాలి) ఈ ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టినట్టు స్పష్టమౌతోంది. ఎలా అంటే, తాజా ఎన్పీఆర్లో, మీవే కాకుండా మీ తలిదండ్రుల పుట్టిన స్థలం, తేదీల ధ్రువీకరణనూ అడుగుతారు. ఉదా: మీరు 26 జనవరి, 1950–1 జులై, 1987 ల మధ్య పుట్టిన భారతీయులైతే, మీ పుట్టిన స్థలం–తేదీ ఉంటే సరిపోతుంది. కానీ, 2 జులై 1987–2 డిసెంబరు 2004 మధ్య పుట్టిన వారైతే, మీ తలిదండ్రుల్లో ఒకరైనా భారతదేశంలో పుట్టిన పౌరులై ఉండాలి. అడిగితే, వారి పుట్టిన స్థలం, తేదీని ధ్రువీకరించాల్సి ఉంటుంది. 2004 డిసెంబర్ 3, లేదా తర్వాత పుట్టిన వారైతే మరింత సంక్లిష్టమైన ప్రక్రియ ఉంది. మీరు భారత్ లోనే పుట్టినా, మీకు ఓటరు–ఆధార్ కార్డు ఉన్నా తలిదండ్రుల పుట్టిన తేదీ–స్థలం ధ్రువీకరణ లేకుంటే మీకు పౌరులుగా గుర్తింపు దక్కదు. మూడు పొరుగు దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లను ఎంపిక చేసుకోవడం, ఆయా దేశాల్లో అల్ప సంఖ్యాకులైన అయిదు మతాల వారిని తీసుకొని, ముస్లింలను పరిగణనలోకి తీసుకోకపోవ డంతో ప్రస్తుత వివక్ష నెలకొందనే వాదన ఉంది. ఇది రాజ్యాంగం కల్పించిన సమానత్వ స్ఫూర్తికి, నిబంధనలకు వ్యతిరేకమని వారం టున్నారు. అసోమ్‌లో అమలైన ఎన్నార్సీ వల్ల స్థానికులు, హిందు వులు, గిరిజనులతో సహా దాదాపు పదిలక్షల మంది పౌరసత్వం దక్కక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అక్కడి సంక్షోభాన్ని పరిష్కరించకుండానే దేశవ్యాప్త ఎన్నార్సీ అమలు లెక్కలేనన్ని చిక్కుల్ని స్వాగతించడమే అని విపక్షాల విమర్శ. ఇంకా చాలా.. సమాధానా ల్లేని సందేహాలు, జవాబులు దొరకని ప్రశ్నలు భారత దేశ లౌకిక మూల సూత్రపు పునాదుల్ని వణికిస్తున్నాయి. -దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
కార్చిచ్చు కాకూడదు
మట్టి ఏ దేశానిదైనా ఒకటే అయినప్పుడు మనుషుల్లో ఇన్ని అంతరాలెందుకు? మాటల్లో మానవత్వాన్ని చాటే మనం మతాలుగా విడిపోవడమెందుకు? అభద్రతా భావమేనేమో..! విభిన్న మతాలను సృష్టించి ఆధిపత్యం కోసం పాకులాడే విష సంస్కృతిని ప్రేరేపించింది ఏదైనా మనదాకా వస్తేనే కదా తెలిసొచ్చేది పక్కోడి ఇల్లు కాలినా, కూలినా మనకేంటి నోట్లో బూడిద కొట్టి ప్రసాదమంటే పరవశించిపోయే మన లాంటి వాళ్ళ కోసం కొత్త చట్టాలు పుడుతూనే ఉంటాయి దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టి లౌకికతత్వాన్ని తుత్తునియలు చేసే సవరణలు జరుగుతూనే ఉంటాయి పెద్దనోట్ల రద్దు నల్లధనం జాడ తీయలేదు ఒకే దేశం – ఒకే పన్ను నినాదం అద్భుతాలూ సృష్టించలేదు సామాన్యుడిని కష్టాల పాలు జేశాయి దేశాన్ని మాంద్యం బారిన పడకుండా ఆపలేకపోయాయి సవరణ జాతిని ఏకం చేసే సంస్కరణ కావాలి కానీ విద్వేషాలను రగిల్చే కార్చిచ్చు కాకూడదు -గుండు కరుణాకర్, వరంగల్ మొబైల్ : 98668 99046 -
ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కొనసాగించండి : మమతా
కోల్‌కతా : పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ)లపై ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కొనసాగించాలంటూ పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. అంతకుముందు సిఎఎ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా రాజబజార్ నుంచి మల్లిక్ బజార్ వరకు మమతా బెనర్జీ బారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ''బీజేపీ ఛీ.. ఛీ.. సిఎఎ.. ఛీ.. ఛీ.. ఎన్నార్సీ.. నహీ చలేంగా'' అంటూ పెద్ద సంఖ్యలో హాజరైన నిరసనకారులతో కలిసి మమతా నినాదాలు చేశారు. (చదవండి : సీఏఏపై కేంద్రానికి మమత సవాలు) -
చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా
-
పౌరచట్టం, ఎన్ఆర్సీలపై బీజేపీ కీలక భేటీ..
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్త ఎన్ఆర్సీపై చర్చ ఉండబోదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసిన అనంతరం దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు తగ్గుముఖం పట్టిన క్రమంలలో ఈ చట్టంపై ప్రజల్లో సానుకూలత పెంచేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలపై అవగాహన చేపట్టడంపై బీజేపీ కార్యనిర్వాహక చీఫ్ జేపీ నడ్డా పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్, ముక్తార్ అబ్బాస్ నక్వీ, కిరణ్ రిజిజు, అర్జున్‌రామ్ మేఘ్వాల్, గజేంద్రసింగ్ షెకావత్‌లతో పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. లడక్ ఎంపీ, మైనారిటీ సభ్యుడు సెరిగ్ నగ్యాల్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే పార్టీ ఎంపీలు రాజీవ్ చంద్రశేఖర్, జీవీఎల్ నరసింహరావు కూడా ఈ భేటీలో పాలుపంచుకున్నారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై పార్టీ వైఖరిని ప్రజలను ఒప్పించేలా బలంగా ముందుకు తీసుకువెళ్లడంపైనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.మరోవైపు పౌర చట్టం, ఎన్ఆర్సీలతో ముస్లింలను నిర్బంధ కేంద్రాలకు పంపుతారన్న విపక్షాల ప్రచారం అవాస్తవమని ప్రధాని చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. అసోంలో నిర్మిస్తున్న నిర్బంధ కేంద్రానికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసిన రాహుల్ దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రధాని మోదీని ప్రశ్నించారు. -
చరిత్ర హీనుడిగా మిగలదల్చుకోలేదు
-
‘మనం బుల్లెట్లు ఎదుర్కోవడానికి పుట్టలేదు’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఎన్ఆర్పీ అనేది ఎన్ఆర్సీకి డేటాబేస్‌గా ఉపమోగపడుతుందని ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతి రాయ్ అన్నారు. దీన్ని దేశప్రజలు వ్యతిరేకించాలని ఆమె తెలిపారు. అరుంధతి రాయ్ ఢిల్లీ యూనివర్సిటీలో ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుంధతి రాయ్ మాట్లాడుతూ.. ఎన్ఆర్సీని ముస్లీంలకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకువచ్చిందని ఆమె మండిపడ్డారు. ఎన్ఆర్పీ పేరుతో అధికారులు మీ ఇళ్లలోకి వచ్చి మీకు సంబంధించిన పేరు, ఫోన్‌నంబర్, ఆధార్‌కార్డు నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్లను అడిగి నమోదు చేసుకుంటారు. ఆ సమయంలో అధికారులకు మీకు సంబంధించిన సరైన వివరాలను వారికి చెప్పవద్దన్నారు. మనం బుల్లెట్లు ఎదుర్కొవడానికి ఇక్కడ పుట్టలేదని అరుంధతి రాయ్ ధ్వజమెత్తారు. కాగా రాంలీల మైదానంలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్రమోదీ అన్నీ అబద్దాలు చెప్పారని ఆమె తీవ్రంగా విమర్శించారు. మోదీ ఎన్ఆర్సీ గురించి ఏం మాట్లాడకుండా.. దేశంలో ఎటువంటి నిర్బంధ శిబిరాలు లేవన్నారని ఆమె దుయ్యబట్టారు. కేంద్రం ప్రభుత్వం ఎన్ఆర్పీ పేరుతో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలను ప్రజలపై రుద్దాలనుకుంటుందని అరుంధతి రాయ్ మండిపడ్డారు. వాటిని ఎదుర్కొవాలంటే అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు పోరాడాలని ఆమె పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింలపై అనేక దాడులకు జరుగుతున్నాయని.. అక్కడ పోలీసులు ముస్లిం ప్రజలను దోపిడి గురి చేస్తున్నారని అరుంధతి రాయ్ తెలిపారు. -
టీడీపీకి గుడ్ బై చెప్పిన రెహమాన్
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ విశాఖ అర్బన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను ప్రతిపాదించడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పిన రెహమాన్.. చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్న భయపడేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ కార్పొరేషన్‌కు కేంద్రం నుంచి నిధులు రాకుండా చేసింది చంద్రబాబేనని ఆరోపించారు. చంద్రబాబు పుత్రరత్నం రాజకీయాల్లోకి ప్రవేశించాక.. తాము చంద్రబాబుకు దూరమయ్యామని తెలిపారు. గురువారం రెహమాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నార్సీ బిల్లు వల్ల కొంతమంది భారతీయుల్లో అభద్రతాభావం ఏర్పడిందన్నారు. ఎన్నార్సీ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడం తమకు సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ఏపీలో ఎన్నార్సీ అమలు చేయటం లేదని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్‌కు తమ మైనార్టీలంతా రుణపడి ఉన్నామన్నారు. ఎన్నార్సీని వ్యతిరేకించిన సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేయాలంటూ చంద్రబాబు తమకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. తమ కోసం అనుకూల నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్ ప్రకటనను తాము ఎలా వ్యతిరేకిస్తామని ప్రశ్నించారు. ఎన్నార్సీ బిల్లుపై చంద్రబాబు తన విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ రాజధాని కావాలని తాము గతంలోనే కోరామని.. అందుకోసం తను పోరాటం కూడా చేశానని చెప్పారు. అమరావతి రైతులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని.. తప్పుడు రాజకీయాలు చేయవద్దని చంద్రబాబుకు హితవు పలికారు. గత ఐదేళ్ల చంద్రబాబు విధానాల వల్ల పార్టీ కార్యకర్తలు సంతోషంగా లేరని.. కొంత మంది నాయకులు మాత్రమే బాగుపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అనేది విశాఖ ప్రాంతవాసుల కల అని చెప్పిన రెహమాన్.. విశాఖ క్యాపిటల్ కావడాన్ని స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు. విశాఖలో రాజధాని ఏర్పాటుపై కులాల ప్రస్తావన తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. చరిత్రలో హీనంగా మిగలదల్చుకోలేదని.. అందుకే చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఇప్పటివరకు చంద్రబాబు ఎన్నార్సీని వ్యతిరేకించనందుకు టీడీపీ విశాఖ అర్బన్ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు, అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
కేసీఆర్‌తో ఓవైసీ భేటీ
-
ఎన్ఆర్పీతో ఎన్పీఆర్కు సంబంధం లేదు
-
‘జాతీయ పౌర రిజిస్టర్‌ను ఆపండి’
సాక్షి, హైదరాబాద్: ‘కేరళ తరహాలో రాష్ట్రంలో సైతం నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్) పనులను నిలుపుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేశాం. ఎన్పీఆర్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ (ఎన్ఆర్ఐసీ)కి ఏమాత్రం సంబంధం లేదని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దేశాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని సీఎంకు తెలిపాం. ఎన్‌ఆర్‌ఐసీకి ఎన్పీఆర్ తొలి అడుగు అని పేర్కొం టున్న కేంద్ర హోంశాఖకు సంబంధించిన వివిధ పత్రాలను రుజువులుగా ఆయనకు అందజేశాం. నిర్ణయం తీసుకోవడానికి కేసీఆర్ రెండు రోజుల సమయం కోరారు. సీఎం సానుకూల నిర్ణయం తీసుకుంటారని భరోసా ఉంది’అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ముస్లిం ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధి బృందంతో కలసి బుధవారం ఆయన ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. రాష్ట్రంలో ఎన్పీఆర్ పనుల నిలుపుదల చేయాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం అసద్ మాట్లాడుతూ.. మూడు గంటలకు పైగా సీఎంతో సమావేశం సాగిందన్నారు. ఆర్టీకల్ 131 ఆధారంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేయవచ్చని సలహా ఇచ్చామన్నారు. ‘ఈ అశంపై ఒకే రకమైన ఆలోచన ధోరణి కలిగిన పార్టీలతో కేసీఆర్ మాట్లాడుతారన్నారు. అవసరమైతే అందరినీ ఆహ్వానించి బహిరంగ సభ కూడా నిర్వహిస్తారు. ఇది కేవలం ముస్లింల సమస్య కాదు.. యావత్ దేశానిది, రాజ్యాంగానిది అని సీఎం పదేపదే అన్నారు. మతాల పేరుతో ఓ చట్టం (సీఏఏ) రావడం దేశంలో ఇదే తొలిసారి’అని అసద్ తెలిపారు. ‘ఈ నెల 27న నిజామాబాద్‌లో తలపెట్టిన బహిరంగ సభకు అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించాలని సీఎం సూచించారు. రాష్ట్ర మంత్రులను ఈ సభకు పంపిస్తామని చెప్పారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలను సభకు ఆహ్వానిస్తాం. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని స్వయంగా ఆహ్వానిస్తా’ఎంఐఎం అధినేత తెలిపారు. సందేహాలు వ్యక్తం చేసే అధికారం... ‘రాష్ట్రంలో 29 శాతం జనాభాకే పుట్టిన తేదీ సర్టిఫికేట్లున్నాయి. ఎన్పీఆర్లో పుట్టిన తేదీ సర్టిఫికేట్ అడుగుతున్నారు. మిగిలిన వారు ఎక్కడి నుంచి తేవాలి?. ఎవరి పౌరసత్వంపై అయినా సందేహాలు వెల్లబుచ్చే అధికారాన్ని కింది స్థాయి అధికారులకు చట్టం కట్టబెట్టింది. ఎవరిదైనా పౌరసత్వానికి ఎవరైనా అభ్యంతరాలు తెలపవచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ సందేహాలు, అభ్యంతరాలకు ప్రమాణాలు ఏమిటి? పౌరుడిని ఎవరు నిర్ణయిస్తారు?. తల్లిదండ్రులు ఎక్కడ పుట్టారో అడుగుతున్నారు. ఆధార్ అడుగుతున్నారు. దేశంలోని వంద కోట్ల ప్రజలు లైన్లలో నిలబడాల్సి వస్తుంది. అస్సాంలో 5.4లక్షల బెంగాలి హిందూవులకు పౌరసత్వం ఇచ్చి 5లక్షల బెంగాలి ముస్లింలకు ఎందుకు ఇవ్వరు?. 1948 చట్టం ప్రకారమే జనగణన జరగాలి’అని స్పష్టం చేశారు. ఇవిగో ఆధారాలు... ‘ఎన్‌ఆర్‌ఐసీకి ఎన్పీఆర్ తొలి అడుగు అని కేంద్ర హోంశాఖ వార్షిక నివేదిక 2018–19లోని చాప్టర్ 15(4) పేర్కొంది. ఇదే విషయాన్ని 2014 నవంబర్ 26న అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు స్వయంగా పార్లమెంట్లో ప్రకటించారు. అదే రోజు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) పత్రికా ప్రకటనలో దీనిని తెలియజేసింది. కేంద్ర హోంశాఖ వెబ్‌సైట్‌లోని సివిల్ రిజిస్ట్రేషన్ డివిజన్‌కు సంబంధించిన రెండో పేజీలో ఈ విషయం స్పష్టంగా రాసి ఉంది. ఇన్ని రుజువులున్నా ఎన్ఆర్ఐసీ, ఎన్పీఆర్కి సంబంధం లేదని కేంద్ర హోంమంత్రి తప్పుదోవపట్టిస్తున్నారు. సీఎంను కలసిన వారిలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఆర్థికవేత్త అమీరుల్లాఖాన్, సినీ నిర్మాత ఇలాహీ, ముస్లిం పర్సనల్‌లా బోర్డు మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ అస్మా తదితరులున్నారు. -
ఎన్నార్సీ లేని ఎన్పీఆర్ ఓకే
భోపాల్/బెంగళూరు/లక్నో/ వాషింగ్టన్: జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ) బదులు జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) అమలు చేయాలని తమ పార్టీ కోరుకుంటోందని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ప్రకటించారు. ఎన్పీఆర్తో కలిపి ఎన్నార్సీని చేపట్టడంపై వెనుక మోదీ ప్రభుత్వ ఉద్దేశాలపై∙అనుమానం వ్యక్తం చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా భోపాల్‌లో బుధవారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారీ ర్యాలీకి ఆయన నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఏఏలో లొసుగులున్నాయి. ఎన్పీఆర్ను మేం కోరుకుంటున్నాం. అయితే, ఎన్నార్సీతో కలిపి కాదు. కేంద్రం రెంటినీ కలిపి తేవడం వెనుక కేంద్రం ఉద్దేశం స్పష్టమవుతోంది. సీఏఏ, ఎన్నార్సీ వంటి చట్టాలు గతంలో ఎన్నడూ లేవు’ అని అన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో సీఏఏను అమలు చేయబోదన్నారు. అపోహలు దూరం చేసేందుకు: దుష్ప్రచారం, అపోహల కారణంగానే భారత్‌లో ఎన్నార్సీ, సీఏఏపై ఆందోళనలు చెలరేగాయంటూ భారతీయ అమెరికన్లు పేర్కొన్నారు. అమెరికాలోని పలు నగరాల్లో ఎన్నార్సీ, సీఏఏ అనుకూల ర్యాలీలు చేపట్టారు. డల్లాస్, షికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, వాషింగ్టన్, అట్లాంటా, శాన్‌జోస్ తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముస్లింలను భారత్ నుంచి వెళ్లగొడతారనే అపోహలు, వామపక్ష సంస్థల ప్రచారం కారణంగా భారత్‌లో నిరసనలు జరుగుతున్నాయని వినీత్ అనే నిర్వాహకుడు తెలిపారు. పథకం ప్రకారం అల్లర్లు: మంగళూరులో పోలీసుల కాల్పుల ఘటనపై దర్యాప్తు నివేదిక అందే వరకు కాల్పుల్లో మృతుల కుటుంబాలకు ప్రకటించిన పరిహారాన్ని నిలిపివేస్తున్నట్లు కర్ణాటక సీఎం యడియూరప్ప చెప్పారు. ‘నేరస్తులకు పరిహారం క్షమార్హం కాని నేరం. మంగళూరు అల్లర్లు పథకం ప్రకారం జరిగాయి. ఆనాడు ఆందోళనకారులు పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. వారిని వదలం’ అని అన్నారు. 60 మందికి యూపీ సర్కారు నోటీసులు సీఏఏకి వ్యతిరేకంగా రాంపూర్, గోరఖ్‌పూర్‌లలో జరిగిన ఆందోళనల్లో హింసకు కారణమైన 60 మందికి యూపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం నియమించిన అధికారులు..అల్లర్ల కారణంగా రూ.25 లక్షల మేర ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు నష్టం వాటిల్లినట్లు తేల్చారు. దీంతో ఇందుకు కారణమైన 28 మందికి బుధవారం నోటీసులిచ్చారు. దీనిపై వారు వారంలోగా వివరణ అయినా ఇవ్వాలి లేదా నష్టాన్ని చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. లేకుంటే వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయన్నారు. గోరఖ్‌పూర్‌లో జరిగిన అల్లర్లకు కారకులుగా గుర్తించిన 33 మందికి పోలీసులు నోటీసులిచ్చారు. -
ఎన్ఆర్సీ అమలుకు అదే తొలి మెట్టు
సాక్షి, హైదరాబాద్: జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ), జాతీయ జనాభా జాబితా(ఎన్పీఆర్) రెండూ ఒకటేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్ఆర్సీ అమలుకు ఎన్పీఆర్ మొదటి మెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ వెబ్సైట్లో పొందుపరిచారని వెల్లడించారు. ముస్లిం ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులతో పాటు బుధవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆయన కలిశారు. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ అమలు చేయవద్దని కేసీఆర్‌ను ఆయన కోరారు. దాదాపు మూడు గంటల పాటు భేటీ జరిగింది. అనంతరం అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. తమ విన్నపాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, రెండు రోజుల్లో పార్టీ నిర్ణయం చెబుతామన్నారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం అవుదామని సూచించినట్టు చెప్పారు. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఈనెల 27న నిజామాబాద్‌లో సమావేశం నిర్వహిస్తున్నామని, అన్ని పార్టీల నాయకులను ఆహ్వానిస్తామన్నారు. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ ఒక్క ముస్లింల సమస్య కాదని.. రాజ్యాంగం, ప్రాంతం సమస్య అని పేర్కొన్నారు. (ఎన్పీఆర్ వర్సెస్ సెన్సస్!) ఎన్పీఆర్, ఎన్ఆర్సీ రెండూ వేర్వేరు అని అమిత్ షా చెప్పడంపై అసదుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ ప్రజలను అమిత్ షా తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. మత పెద్దలు ముక్తి అజీముద్దీన్, రియాజుద్దీన్, గాయజుద్దీన్, ఖుబుల్ పాషా సూతరి, మౌలానా హాసన్ బిన్ హాల్ హుముమీ, నిస్సార్ హుస్సేన్ హైదర్ ఆగా, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ పాషా ఖాద్రి తదితరులు కేసీఆర్‌ను కలిసినవారిలో ఉన్నారు. (ఎన్పీఆర్ అంటే ఏంటి.. ఆ రాష్ట్రానికి ఎందుకు మినహాయింపు?) -
మతప్రాతిపదికన మోదీ చట్టాన్ని రూపొందించారు
-
రాహుల్, ప్రియాంకలను ఆపేశారు
న్యూఢిల్లీ/కోల్‌కతా/బిజ్నోర్/మీరట్: ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో గత వారం ‘పౌర’ ఆందోళనల్లో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలను మీరట్ పోలీసులు అడ్డుకున్నారు. ‘మీరట్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో నిషేధాజ్ఞలు విధించాం. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపాం. దీంతో వారే వెనక్కి వెళ్లిపోయారు’ అని పోలీసులు తెలిపారు. ‘సంబంధిత ఉత్తర్వులను చూపాలని పోలీసులను అడిగాం. అవేమీ చూపకుండా వారు మమ్మల్ని వెనక్కి వెళ్లాలన్నారు’ అని రాహుల్, ప్రియాంక మీడియాతో అన్నారు. ‘పౌర’ చట్టంపై ఏకమైన విద్యార్థి సంఘాలు పౌరసత్వ చట్ట సవరణతోపాటు, కేంద్రం చేపట్టదలచిన జాతీయ పౌర పట్టిక, జనాభా పట్టిక సవరణలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న 70 యువ, విద్యార్థి సంఘాలు ఏకమయ్యాయి. నేషనల్ యంగ్ ఇండియా కో ఆర్డినేషన్ అండ్ కాంపెయిన్ (వైఐఎన్‌సీసీ) ఛత్రం కింద ఈ సంఘాలు మంగళవారం ఏకమయ్యాయి. 71వ గణతంత్ర దినోత్సవాలకు ముందుగానే కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని వైఐఎన్‌సీసీ సభ్యుడు సాయి బాలాజీ డిమాండ్ చేశారు. అతడు మా కాల్పుల్లోనే చనిపోయాడు ‘పౌర’ ఆందోళనల సందర్భంగా ఒక యువకుడి మృతికి తామే కారణమని ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ పోలీసులు అంగీకరించారు. బిజ్నోర్‌లోని నహ్తౌర్లో హింసాత్మకంగా మారిన ఆందోళనలను అదుపు చేసేందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందని ఎస్పీ విశ్వజీత్ శ్రీవాస్తవ మంగళవారం వెల్లడించారు. కాగా, ఎన్నార్సీపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా చేస్తున్న ప్రకటనలు పొంతనలేకుండా ఉన్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బెంగాల్ గవర్నర్‌కు చుక్కెదురు బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంఖర్ మరోసారి భంగపాటుకు గురయ్యారు. కోల్‌కతాలో జాదవ్‌పూర్ వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు బయలుదేరిన ఆయన్ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న టీఎంసీ అనుబంధ విద్యార్థి సంఘం కార్యకర్తలు ఆయన వాహనం వర్సిటీలోకి ప్రవేశించకుండా మెయిన్ గేట్ వద్దే రోడ్డుపై బైఠాయించారు. గో బ్యాక్ అని నినాదాలు చేసుకుంటూ, నల్ల జెండాలు ప్రదర్శించారు. దీంతో యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ అయిన సురంజన్ దాస్‌కు గవర్నర్ ఫోన్ చేశారు. ఆందోళనకారులను శాంతింప జేయాలని సురంజన్‌ను కోరారు. ఫలితం లేకపోవడంతో గవర్నర్ వెనుదిరిగారు. ఈ సందర్భంగా ధంకర్ మమత ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. -
ఎన్పీఆర్ వర్సెస్ సెన్సస్!
సాక్షి, న్యూఢిల్లీ: జనగణన–2021కి, జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)కు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జనగణన(సెన్సస్)కు, ఎన్పీఆర్కు మధ్య కొన్ని తేడాలను గమనిస్తే... జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) ఎన్పీఆర్ అంటే దేశంలోని సాధారణ నివాసుల వివరాలతో కూడిన ఒక రిజిస్టర్. పౌరసత్వం చట్టం–1955 పరిధిలో పౌరసత్వ నిబంధనలు, 2003 ఆధారంగా ఈ ఎన్పీఆర్ను రూపొందించనున్నారు. ప్రతి సాధారణ పౌరుడి వివరాల డేటాబేస్‌ను రూపొందిస్తారు. ఆరు నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు ఒక చోట నివాసం ఉన్న వ్యక్తి లేదా కనీసం రానున్న ఆరునెలలు ఒక ప్రాంతంలో నివాసం ఉండాలని నిర్ణయించుకున్న వ్యక్తిని ‘సాధారణ నివాసి’గా పరిగణిస్తారు. స్థానిక(గ్రామ/మండల), తాలూకా, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఎన్పీఆర్ను అప్డేట్ చేస్తారు. ఎన్పీఆర్లో వ్యక్తి పేరు, నివాస స్థితి, కుటుంబ యజమానితో గల బంధుత్వం, లింగ భేదం, పుట్టిన తేదీ, వైవాహిక స్థితి, విద్యార్హత, వృత్తి, తల్లిదండ్రులు లేదా భాగస్వాముల పేర్లు, జన్మస్థలం, జాతీయత, ప్రస్తుత చిరునామా, ఎంతకాలంగా ప్రస్తుత చిరునామాలో ఉంటున్నారు, శాశ్వత చిరునామా వంటి 14 అంశాలను పూరించాల్సి ఉంటుంది. ప్రతీ పౌరుడు ఈ పట్టికలో నమోదు కావాల్సిందే. వారికి జాతీయ గుర్తింపు కార్డును ఇస్తారు. సాధారణ నివాసుల సమగ్ర వివరాలున్న డేటాబేస్‌ను రూపొందించేందుకు ఎన్పీఆర్ను రూపకల్పన చేశారు. ఈ డేటాబేస్‌లో ఆ నివాసుల ఇతర, బయోమెట్రిక్ వివరాలుంటాయి. జనగణన (సెన్సస్): ఎన్పీఆర్తో పోలిస్తే జన గణనలో మరిన్ని వివరాలను సేకరిస్తారు. వ్యక్తి గృహ వివరాలు, ఇంటి నిర్మాణం, కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, గృహోపకరణాల వివరాలు, పూర్తి ఆదాయ మార్గాలు, వ్యవసాయ– వ్యవసాయేతర వర్గాలు, సాగు, తాగు నీటి లభ్యత, వ్యవసాయ విధానం, వాణిజ్య వర్గాలు, ఎస్సీ, ఎస్టీ వివరాలు, భాష, మతం, దివ్యాంగత.. తదితర పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తారు. జనగణన– 2021ని రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. 2020 ఏప్రిల్– సెప్టెంబర్ మధ్య తొలి దశను పూర్తి చేస్తారు. ఈ దశలో కుటుంబ సమగ్ర వివరాలను నమోదు చేస్తారు. 2021 ఫిబ్రవరి 9 – 28 మధ్య రెండో దశ నమోదు జరుగుతుంది. ఆ దశలో వర్గాల వారీగా మొత్తం జనాభా సంఖ్యను గణిస్తారు. ఎన్నార్సీ అంటే.. చట్ట ప్రకారం భారతీయ పౌరులుగా నమోదైన వారి జాబితాయే జాతీయ పౌర పట్టిక(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఎన్నార్సీ). ఇందులో 1955 పౌరసత్వ చట్టం ప్రకారం..భారతీయ పౌరులుగా అర్హత పొందిన వారి పేర్లతోపాటు వారికి సంబంధించిన ఇతర వివరాలు కూడా పొందుపరచబడి ఉంటాయి. ఈ పట్టికను మొట్టమొదటిసారిగా 1951లో ప్రభుత్వం రూపొందించింది. ఇప్పటి వరకు దానిని మళ్లీ అప్‌గ్రేడ్ చేయలేదు. అయితే, ఇది అస్సాంలో మాత్రమే ఎప్పటికప్పుడు వివిధ కారణాలతో అప్‌గ్రేడ్ అవుతోంది. భారతీయ పౌరుడంటే ఎవరు? 1955 పౌరసత్వ చట్టం ప్రకారం.. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి భారతీయ పౌరుడే. దీని ప్రకారం.. ఎ) 1950 జనవరి 26వ తేదీన కానీ, అంతకుపూర్వం కానీ..1987 జూలై 1వ తేదీకి ముందు జన్మించిన వారు భారతీయ పౌరులు. బి) 1987 జూలై 1వ తేదీన కానీ, అంతకుముందు పుట్టిన వారు. అయితే.. 2003లో సవరించిన పౌరసత్వ నిబంధనలు అమల్లోకి రాకముందు జన్మించిన వారు; తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు ఆ సమయానికి భారత పౌరులై ఉన్నా.. సి) 2003లో సవరించిన పౌరసత్వ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత జన్మించిన వారు; తల్లిదండ్రులిద్దరూ పౌరులై ఉన్నా లేక తల్లిదండ్రులిద్దరిలో ఒకరు అక్రమ వలసదారు కాకున్నా పౌరుడిగానే పరిగణింపబడతారు. -
‘అవును.. ఎన్నార్సీపై చర్చ జరగలేదు’
న్యూఢిల్లీ: దేశవ్యాప్త జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)ను రూపొందించే విషయంపై ఇంతవరకు చర్చ జరగలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. దీనిపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్య వాస్తవమేనన్నారు. ‘2014లో తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేబినెట్లో కానీ, పార్లమెంట్లో కానీ దేశవ్యాప్త ఎన్నార్సీపై చర్చ జరగలేదు’ అని ఆదివారం ఓ బహిరంగ సభలో మోదీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మంగళవారం ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా కూడా అదే విషయాన్ని ధ్రువీకరించారు. పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతుండటంపై స్పందిస్తూ.. ‘ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం కొంత ఉందని ఒప్పుకుంటాను. కొంత సమాచార లోపం కనిపిస్తోంది. అయితే, ఏ ఒక్క మైనారిటీ వ్యక్తి కూడా తన పౌరసత్వాన్ని కోల్పోడు అని పార్లమెంట్‌లోనే నేను చెప్పాను’ అని షా వివరించారు. 2024 లోక్‌సభ ఎన్నికలలోగా దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తామని, ప్రతీ ఒక్క అక్రమ వలసదారుడిని దేశం నుంచి తరిమేస్తామని పార్లమెంట్లోను, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలోనూ అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఎన్పీఆర్కు పచ్చజెండా
ఒకపక్క వివిధ రాష్ట్రాల్లో జాతీయ పౌర నమోదు చిట్టా(ఎన్సీఆర్)కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లు వెత్తుతుండగా మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) ప్రక్రియ అమలు ప్రతిపాదనను ఆమోదించింది. ఇందుకోసం రూ. 3,941 కోట్లు కేటా యించింది. ఎన్సీఆర్ వ్యతిరేక ఆందోళనల నేపథ్యం కావొచ్చు... కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను ప్రక టిస్తూ ఎన్పీఆర్కూ, ఎన్ఆర్సీకీ సంబంధం ఉండబోదని కేంద్ర మంత్రులు ప్రకాష్ జావ్డేకర్, పీయూష్ గోయెల్ తెలిపారు. విధాన నిర్ణయాలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే ఎన్పీఆర్ అమలు చేస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఒక ఇంటర్వ్యూలో వివరించారు. ఆయన కూడా ఎన్పీఆర్–ఎన్ఆర్సీల మధ్య ఏ సంబంధమూ ఉండబోదని హామీ ఇచ్చారు. ఎన్పీఆర్కు సంబంధించిన సమాచార సేకరణ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమై సెప్టెంబర్‌లో ముగుస్తుంది. తొలిసారి దీన్ని 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 2015లో ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని అమలు చేసి ఎన్డీఏ ప్రభుత్వం ఆ ఎన్పీఆర్ను నవీకరించింది. ఎన్పీఆర్ ప్రక్రియ పూర్తయ్యాక 2021లో జనాభా గణన ఉంటుంది. అదే సమయంలో ఆ ఎన్పీఆర్ డేటాను నవీకరిస్తారు. భిన్న అవసరాల కోసం ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించిన డేటా సేకరించడం ఎప్పటినుంచో రివాజుగా వస్తోంది. చరిత్ర తిరగేస్తే ఈ సంగతి తెలుస్తుంది. అంతక్రితం మాటెలా ఉన్నా మన దేశంలో మౌర్యుల కాలంలో జనగణన జరిగిందని కౌటిల్యుని అర్థశాస్త్రం చెబుతోంది. అప్పట్లో ఈ జనగణన జరపడానికి కారణం పన్నుల వసూలు విధానాన్ని పటిష్టపరచడమే. బ్రిటిష్ వలస పాలకులు తొలిసారి 1872లో జనగణన నిర్వహించారు. తొలి జనగణనగా దాన్నే పరిగణిస్తున్నారు. 2021లో జరగబోయే జనాభా లెక్కల సేకరణ ఆ ప్రకారం 16వ జనగణన అవుతుంది. ఈ జనగణన మాట అలావుంచి దేశంలో ఉండే పౌరులు, ఇతర నివాసుల వివరాలు ఆధారాలతోసహా సేకరించి అవసరమైనప్పుడల్లా ఆ వివరాలను భిన్న ప్రయోజనాల కోసం ఉపయోగించాలన్న ఆలోచనకు పెద్ద నేపథ్యమేవుంది. 1999లో కార్గిల్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనికులు పౌర దుస్తుల్లో చొరబడి కొన్ని ప్రాంతాలను ఆక్రమించడం, మన సైనికులు దాన్ని తిప్పికొట్టి విజయం సాధించడం జరిగాక పౌరు లకు గుర్తింపు కార్డు ఇవ్వాలన్న ఆలోచన పుట్టుకొచ్చింది. అప్పటి వాజపేయి ప్రభుత్వం నియమించిన కార్గిల్ సమీక్ష కమిటీ ఈ సూచన చేసింది. సరిహద్దు ప్రాంతాల్లోని వారికి ఈ కార్డులు అంద జేయాలన్న ప్రతిపాదన కాస్తా ఆ తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న నిర్ణయానికి దారి తీసింది. అందుకోసం 1955 నాటి పౌరసత్వ చట్టాన్ని సవరించి బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు (ఎంఎన్ఐసీ) ప్రాజెక్టు, జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)లకు చోటిచ్చారు. అయితే 2002లో ఈ రెండు ప్రాజెక్టుల మాటా ఏమైందని పార్లమెంటులో అడిగినప్పుడు అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విద్యాసాగరరావు ఎంఎన్ఐసీకి చట్టబద్ధత కల్పించడంతోసహా ఇందుకు సంబంధించిన అన్ని అంశాలనూ లోతుగా పరిశీలిస్తున్నామని తెలియజేశారు. ఈ ప్రతిపాదనల్లో ఆధార్ మూలాలు న్నాయి. ఎంఎన్ఐసీపై ఆ తర్వాత చెప్పుకోదగ్గ అడుగులు పడలేదు. యూపీఏ హయాంలో ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో నందన్ నీలేకని చీఫ్‌గా భారత ప్రత్యేక గుర్తింపు వ్యవస్థ (యూఐడీఏఐ) ఏర్పడి, ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే దాన్ని ప్రారంభించిన ఉద్దేశం పెద్దగా నెర వేరలేదు సరిగదా దానివల్ల పౌరుల వ్యక్తిగత వివరాలు బజార్నపడి అనేక సమస్యలు ఏర్పడ్డాయి. ఆ బృహత్తరమైన ప్రాజెక్టుకు చట్టబద్ధత తీసుకురావాలన్న స్పృహ, అది లీకైన పక్షంలో జవాబుదారీ తనం ఎవరు వహించాలో నిర్ణయించాలన్న ఆలోచన కూడా యూపీఏ ప్రభుత్వానికి లేకుండా పోయింది. మరోపక్క కార్డు నమోదు ప్రక్రియకు అనుసరించిన విధానాలవల్ల ఎవరికి పడితే వారికి ఆ కార్డు సంపాదించడం సులభమైపోయింది. వచ్చే ఏప్రిల్‌లో ప్రారంభం కాబోయే ఎన్పీఆర్లో ‘సాధారణ నివాసుల’ వివరాలను సేక రిస్తారు. ఈ నివాసులు మన దేశ పౌరులే అయివుండనవసరం లేదు. ఒక ప్రాంతంలో ఆర్నెల్లుగా నివసిస్తున్నవారు... లేదా వచ్చే ఆరునెలలూ అంతకన్నా ఎక్కువకాలం అక్కడ ఉండదల్చుకున్న ప్రతి ఒక్కరూ ఈ నిర్వచనం పరిధిలోకొస్తారు. వీరంతా ఎన్పీఆర్లో నమోదుకు అర్హులు. అది తప్పని సరని నిబంధనలు చెబుతున్నాయి. ఎన్పీఆర్ కోసం పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, వారి తల్లిదండ్రుల జన్మస్థలం వివరాలు అందజేయాల్సివుంటుంది. ఇవన్నీ ఈసారి కొత్తగా పెట్టిన నిబం ధనలు. అంతక్రితం పేరు, జెండర్, తల్లిదండ్రుల పేర్లు, కుటుంబ యజమానితో ఉండే సంబంధం, పుట్టిన తేదీ, జాతీయత, చేస్తున్న వృత్తి, చిరునామా వివరాలు మాత్రమే అడిగేవారు. ఏతావాతా గతంలో ఆధార్ కార్డు నమోదుకు అందజేసిన వివరాల్లో చాలా భాగం మళ్లీ ఎన్పీఆర్లో కూడా ఇవ్వకతప్పదు. అయితే ఈ రెండింటిలోని వివరాలూ సరిపోల్చడం అంత సులభమేమీ కాదు. వేర్వేరు ప్రాజెక్టుల కింద సేకరించే డేటానంతటినీ ఒకే డేటా బేస్‌లో ఉంచగలిగితే తప్ప ఇది సాధ్యం కాదు. ఇప్పుడు ఎన్ఆర్సీపై సాగుతున్న నిరసన ఉద్యమాల పర్యవసానంగా ఎన్పీఆర్కూ, దానికి సంబంధం లేదని, ఈ డేటాను దానికి వినియోగించబోమని అమిత్ షా చెబుతున్నారు. ఎన్పీఆర్ కింద నమోదు కానట్టయితే అలాంటివారు అనేక విధాల నష్టపోతారంటున్నారు. ఇన్ని రకాల డేటాను సేకరించడం, దాన్ని నిక్షిప్తం చేయడం, వినియోగించడం వంటివి ప్రభుత్వానికి అవసరమే. కానీ ఆ సేకరిస్తున్న డేటా లీక్ కాకుండా చూడటం, అలా అయినపక్షంలో జవాబుదారీతనం ఎవరిదో నిర్ణ యిం చడం అవసరమని గుర్తించాలి. వ్యక్తిగత డేటా పరిరక్షణకు చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కూడా సంకల్పించింది. అయితే ఎన్పీఆర్ ప్రారంభం కావడానికి ముందే అది సాకారం కావాలి. -
పౌర గుర్తింపుల భాగోతం దేనికి?
పౌరసత్వ నిరూపణకు దేశీయులకు ఒక్క ‘ఆధార్’ చాలదట, ఓటర్ కార్డు, పాస్‌పోర్టు, పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఎస్ఎల్సీ సర్టిఫికెట్ వగైరా.. వగైరా కట్టగట్టి చూపాలట. కానీ, భారత ‘ప్రజాస్వామ్య’ వ్యవస్థ దురదృష్టమేమోగానీ సామాన్య పౌరులకు విధిస్తున్న సవాలక్ష షరతుల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా– దేశీయ సంపదను రెండు చేతులా దోచుకుని, దేశీయ పన్నుల చట్టాలను ఉల్లంఘించి కోట్లకు పడగలెత్తి, బ్యాంకులనుంచి పొందిన రుణాలను వేల, లక్షలాది కోట్లను ఎగ్గొట్టి పాలకుల లోపాయికారీ అనుమతితోనే అర్ధరాత్రి దేశం విడిచి రహస్యంగా విమానాలెక్కి విదేశాలకు ఉడాయించి వెక్కిరిస్తున్న బడా కోటీశ్వరులకు ఎందుకు వర్తింపజేయడం లేదు? ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీల వైఖరి దొందూదొందే. ‘‘జాతీయ పౌరచిట్టా (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) గురించి నా ప్రభుత్వం ఇంత వరకు కేంద్ర మంత్రిమండలిలో గానీ, పార్ల మెంటులోగానీ చర్చించనేలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే అస్సాంలో ఎన్నార్సీని అమలు జరిపాం. అయితే దేశ పౌరసత్వ సవ రణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ హింసాత్మక ఆందోళనలకు కారణమైన వారు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు, ఇతర విపక్షాలు, నగరాల్లోని (అర్బన్) నక్సలైట్లు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వచ్చే హిందువులు, సిక్కులకు భారత పౌరసత్వం కల్పించాలని గాంధీయే చెప్పారు. అందుకని మూడు పొరుగు దేశాల్లో మతపరమైన వేధింపు లకు గురై భారత్‌కు వచ్చేవారికి పౌరసత్వ హక్కులు కల్పించేందుకు ఉద్దేశించిన చట్టం ఇక్కడి వారి హక్కుల్ని గుంజేసుకునేది కాదు. శర ణార్థులు వేరు, అక్రమ వలసదార్లు వేరు.’’ – ప్రధాని నరేంద్రమోదీ: ఢిల్లీ బహిరంగ సభలో (22–12–2019) ‘‘జాతీయ స్థాయిలో పౌరుల గుర్తింపు చిట్టా (నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్ – ఎన్నార్సీ) దేశమంతటా అమలులోకి వస్తుందనడంలో మాకు సందేహం లేదు. ఈ వాస్తవాన్ని అంగీకరించి తీరాలి’’ – హోంమంత్రి అమిత్ షా (లోక్‌సభలో 09–12–2019) అంటే ముందు పౌరసత్వ బిల్లును పార్లమెంటు చట్టంగా రూపొం దించిన దరిమిలా, దేశ వ్యాప్తంగా పౌరులకు సంబంధించిన జాతీయ స్థాయి రిజిస్టర్‌ను పార్లమెంటు ఆమోదించబోతుందన్న వాస్తవాన్ని బీజేపీ–ఆర్ఎస్ఎస్–ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం చెప్పక చెప్పినట్ల యింది. దేశవ్యాప్తంగా విభిన్నమతాలు, భిన్న సంస్కృతులు, విభిన్న ఆచార వ్యవహారాలు, అనంతమైన సంఖ్యా బాహుళ్యం గల దళిత బహుజనులు, మైనారిటీలతో కూడిన సెక్యులర్ రిపబ్లిక్లో దేశ పౌరుల గుర్తింపునకు ఎన్నిరకాల ప్రమాణాలు కావాలి? దేశ జనా భాలో 92 శాతం పౌరులు ఇప్పటికే నమోదై ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నప్పుడు కొత్తగా నాలుగు రకాల ప్రమాణాలతో బీజేపీ పాలకులు ప్రజలలో గందరగోళ పరిస్థితిని పనిగట్టుకుని ఎందుకు సృష్టించాల్సి వచ్చింది? జాతీయ జనాభా రిజిస్టరు (ఎన్.పి.ఆర్), భారత పౌరుల జాతీయ రిజిస్టరు (ఎన్ఆర్ఐసి), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), వీటన్నిటికి తలమానికంగా జాతీయ స్థాయిలో, జనాభా లెక్కల (సెన్సెస్) దండకం–– ఇలా పలు దొంతర్ల అవసరం దేనికి వచ్చింది? అంతే కాదు, పౌరుల రిజిస్ట్రేషన్, జాతీయ గుర్తింపు కార్డు (2003) ఉండాలని రూపొందించిన నిబంధనలూ (సిటిజన్‌షిప్ రూల్స్) ఉన్నాయి. దేశ పౌరులందరికీ ఎలాంటి మినహాయింపు లేకుండా 2003 నిబంధనలను పౌరులందరికీ వర్తింపచేశారు. కాగా, మళ్లీ జాతీయ స్థాయిలో వేరే గుర్తింపు (ఐడెంటిటీ) కార్డు ఎందుకు అనే అంశంపై బీజేపీ పాలకులు స్పష్టంగా వివరించారు. ఇక కాంగ్రెస్ నాయకులూ ‘డిటో’ డిటో! బీజేపీ పాలకులు ఎంతటి రహస్య ఎజెం డాతో ప్రజాబాహుళ్యాన్ని బలవంతంగా శాసించడానికి అలవాటు పడ్డారో.. అమలులో ఉన్న జమ్మూ–కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని (370 ప్రత్యేక నిబంధన) అర్ధరాత్రి రద్దు చేసిన తీరు బహిర్గతం చేసింది. అలాంటి ప్రత్యేక ప్రతిపత్తితోనే, రాజ్యాంగ హామీలతోనే ఉసురు నిలుపుకుంటున్న ఈశాన్య రాష్ట్రాల ప్రజల్ని కూడా మోదీ–అమిత్ షాలు వంచించారు. దీంతో వారూ బీజేపీ ప్రభుత్వ పాలసీలను తీవ్రంగా శంకించాల్సి వచ్చింది. నిరంతర ఆందోళనతో ఉద్యమాలు సాగించుకోవలసి వచ్చింది. ఇప్పుడు మొత్తం కథ అంతా పని లేనివాడు పిల్లి తల గొరుగుతూ కాలక్షేపం చేయడానికి అలవాటు పడిన చందంగా పరిపాలన తయారైంది. కనుకనే మోదీ–అమిత్‌షాల మాటలు, చేతలు గమనిస్తున్నవారి దృష్టిలో నోళ్లు నవ్వాల్సిన చోట ‘చెవులు నవ్వుతున్నాయన్న’ సామెత పుట్టుకొస్తోంది. బహుశా చెవిలో పువ్వులు పెట్టడం అంటే ఇదేనేమో! జాతీయతకు, పౌరసత్వ నిరూప ణకు ఉనికిలోకి వచ్చిన ‘ఆధార్’ కార్డు చాలదా? 70 ఏళ్ల తర్వాత కూడా సవాలక్ష సంకెళ్ల మధ్య భారత పౌరులు తమ పౌరసత్వాన్ని అడుగడుగునా పాలకులకు నిరూపించుకోవలసిన అవసరం ఉందా? ప్రజా సమస్యలపై ఆందోళనలు దేశంలో తలెత్తినప్పుడల్లా పాల కపక్షాలు ఇరుగుపొరుగుతో ‘సరిహద్దు ఘర్షణలు’, ఉల్లంఘనలు, మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రైక్స్) తీయటం, దేశ రక్షణకు అపురూ పమైన సైనికులు ప్రాణాలు కోల్పోవడం కాంగ్రెస్, బీజేపీ పాలనా కాలంలో ఒక ప్రత్యేక నైపుణ్యంగా అమలు చేస్తూ వస్తున్నారు. వీటి ఆధారంగా ఎన్నికలలో విజయావకాశాలను మెరుగు పర్చుకోవడా నికి ప్రయత్నించడం చాలా కాలంగా ఒక రివాజుగా మారింది. ఈ పరస్పర ‘హరికిరి’ బాగోతంలో చివరికి దేశ పౌరుడి బతుకును విలువ కోల్పోయిన, రూపు చెడిన రూపాయి కింద దిగ జార్చారు పాలకులు. పౌరసత్వ నిరూపణకు దేశీయులకు ఒక్క ‘ఆధార్’ చాల దట, ఓటర్ కార్డు, పాస్‌పోర్టు, పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఎస్ఎల్సీ సర్టిఫికెట్ వగైరా.. వగైరా కట్టగట్టి చూపాలట. కానీ, భారత ‘ప్రజా స్వామ్య’ వ్యవస్థ దురదృష్టమేమోగానీ సామాన్య పౌరులకు విధి స్తున్న సవాలక్ష షరతుల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా బడా బాబులకు ఎందుకు వర్తించవు? దేశీయ సంపదను రెండు చేతులా దోచుకుని, దేశీయ పన్నుల చట్టాలను ఉల్లంఘించి కోట్లకు పడగ లెత్తి, బ్యాంకులనుంచి పొందిన రుణాలను వేల, లక్షలాది కోట్లను ఎగ్గొట్టి పాలకుల లోపాయకారీ అనుమతితోనే అర్ధరాత్రి దేశం విడిచి విదేశాలకు ఉడాయిస్తున్నవారికి ఎందుకు వర్తించటం లేదు? అలాంటి ప్రశ్నకు సమాధానాన్నే చికాగో సర్వమత సమ్మేళనంలో మహో త్తమ మానవతా సందేశాన్ని ధర్మాన్ని, ధార్మిక దార్శనికతను ప్రవచించి వివేకానందుడు ప్రపంచ దేశాలకు భారత ప్రజా బాహు ళ్యానికీ బోధించాడు. కానీ ధార్మిక దృష్టికి భారతీయులు దూరమై నట్టు ‘హిందూత్వ’ అనే కొత్త చీలుబాట్లకు సావర్కార్, గోల్వాల్కర్ దారులు వేశారు. కాగా మతాతీతంగా అన్ని ధర్మాలకు సమాన పాయలో దివిటీలు పట్టి జీవితమంతా నిలిచిన కబీరు, రూమీ, గాంధీ, మౌలానా ఆజాద్, ఠాగూర్, నిజాముద్దీన్ అవులియా మనకు విద్యా బోధకులుగా, గాయపడిన మనస్సులకు ప్రేమానురాగాలతో ఓదార్పు కల్గించిన మహనీయులు. ఈ దృష్టితోనే వీరంతా సవాళ్లను ఎదిరించి నిలబడటమే జీవశక్తి. ఆ శక్తి నుంచే వీరు ‘హిందూ’ శబ్దానికి అర్థం ‘ధర్మం’ అనీ, ధర్మమే సాధనమనీ చాటారు. కాగా, ‘హిందూత్వ’ అనే శబ్దం ఒక ఇనుప గొలుసు అనీ, అదొక ‘పంజరం’ అనీ, ఈ పంజరాన్ని, ఈ గొలుసును బద్ధలు కొట్టుకుని బయట పడగలవాడే అసలైన హిందువు అనీ, మూఢత్వాన్ని వదిలించుకున్న వాడే మానవుడనీ సోషియాలజీ ప్రొఫెసర్ అవిజిత్ పాఠక్ వివేచన. ఆ ‘పంజరం’లోని తొలి పెద్ద చిలుకలు సావర్కార్, గోల్వాల్కర్లు. భారతదేశంలో హిందూ–ముస్లిం ఐక్యతను పెంపొందించ కుండా స్వరాజ్యం లేదన్నాడు గాంధీజీ. ఇందుకు నిదర్శనం భారత స్వాతంత్య్రోద్యమం హిందూ, ముస్లిం సమైక్య పోరాటాల, త్యాగాల ఫలితమన్నాడు గాంధీ. ఎందుకంటే, ఆయనకు ఒకరు కాదు, పెక్కు మంది ముస్లిం యోధులు ఆయన సహచరులూ, అనుచరులూ. 1892 నుంచీ ఆ తర్వాత భారత స్వాతంత్య్రోద్యమానికి లోకమాన్య తిలక్, గాంధీ నాయకత్వం వహించినప్పటి నుంచీ గాంధీకి మార్గ దర్శకులుగా నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అబ్దుల్లా, కార్యదర్శిగా గాంధీ పనిచేసినవారే. ఇమాం సాహెబ్ అబూదీల్కాదిర్ బవాజీర్, గాంధీ తొలి ఉద్యమ స్థానం చంపారన్ సత్యాగ్రహానికి ఉద్దీపన కల్గించిన వినతిపత్రం రచయిత పీర్ మహ్మద్ అన్సారీ మునీస్. బ్రిటీష్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్, పర్యటనలో ఉన్న గాంధీజీని, ఆయన సహచరులను విందుకు పిలుస్తున్నామని చెప్పి, అతిథికి (గాంధీకి) అందించే ఆహారంలో విషం కలపమని తన వంట మని షిగా ఉన్న బతక్‌మియా అన్సారీకి బాధ్యత పురమాయించాడు. ఆ దుర్మార్గం మనస్కరించని అన్సారీ. ఇర్విన్ తలపెట్టిన హత్యాయత్నం నుంచి గాంధీని రక్షించినవాడు. తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ఈ విషయం తెలిపేవరకు అన్సారీ చరిత్రా తెలియరాలేదు. ఇలా గాంధీజీ సహచరులు ఎందరెందరో ముస్లిం సోదరులు, సోదరీమణులూ ఉన్నారు. అయినా సరే గోల్వాల్కర్ భారతదేశంలోని ‘హిందూయే తరులు హిందూ సంస్కృతికి, భాషకు అలవాటుపడాలి, హిందూ మతాన్ని అనుసరించితీరాలి, హిందూ జాతిని, సంస్కృతిని కీర్తిం చాలి. ముస్లింలు హిందూ జాతికి జీ హుకుం అనాలి, ఇంతకు తక్కువ ప్రవర్తన ఏదైనా వారు పౌర హక్కులకు అర్హులుకారు’’ అని సిద్ధాంతీ కరించాడు. ఈ సిద్ధాంతం పర్యవసానమే నేటి భారత రిపబ్లికన్ రాజ్యాంగానికి క్రమంగా పడుతున్న వరుస తూట్లు అని మరవరాదు. ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఎన్పీఆర్: అమిత్ షా కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ) గురించి దుష్ప్రచారం చేసే వారి వల్ల మైనార్టీలు, పేదలకు నష్టం కలుగుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్(యూపీఏ) ప్రభుత్వ హయాంలోనే ఎన్పీఆర్ రూపొందించారని పేర్కొన్నారు. 2015లో చేపట్టిన ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్పీఆర్)ను నవీకరించే ప్రక్రియకు... కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. కాగా దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ... ఎన్పీఆర్ పూర్తయి, అధికారిక ముద్రణ తర్వాత ప్రభుత్వం.. దీనినే ఎన్నార్సీకి ఆధారంగా చేసుకుంటుందన్న వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్పీఆర్కు, ఎన్నార్సీకి ఎటువంటి సంబంధం లేదని అమిత్ షా స్పష్టం చేశారు.(చదవండి : ఎన్పీఆర్ అంటే ఏంటి.. ఆ రాష్ట్రానికి ఎందుకు మినహాయింపు?) వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘ఎన్నార్సీపై పార్లమెంటులో, కేంద్ర మంత్రివర్గంలో చర్చ జరగలేదు. మీరు దేశ పౌరులా కాదా అనే ప్రశ్నలు ఎన్ఆర్పీలో ఉండవు. నిజానికి యూపీఏ హయాంలోనే ఎన్ఆర్పీ రూపొందించారు. కానీ అప్పుడు ఎవరూ దీనిపై ప్రశ్నించలేదు. ఇప్పుడెందుకు అడుగుతున్నారు. అదే విధంగా పౌరసత్వ సవరణ చట్టం ఎవరి పౌరసత్వాన్ని లాక్కునే ప్రస్తావన లేదు. కేరళ, బెంగాల్ వంటి పేద రాష్ట్రాలకు ఇదెంతో ఉపయోగకరం. సీఏఏను వ్యతిరేకించాలన్న ఉద్దేశాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పునఃపరిశీలించాలి. ఎన్పీఆర్ విషయంలో కాంగ్రెస్ తీసుకువచ్చిన ప్రక్రియనే మేం కొనసాగిస్తున్నాం. ఎన్పీఆర్ కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించాం. ఎన్పీఆర్లో ఆధార్, ఓటరు నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలు సేకరించడంలో ఎలాంటి తప్పు లేదు’ అని అమిత్ షా పేర్కొన్నారు.(చదవండి : పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?) -
కేంద్రం కీలక నిర్ణయం: ఎన్పీఆర్ అంటే ఏమిటి?
సాక్షి, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ నరేంద్ర మోదీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2015లో చేపట్టిన ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా జాతీయ ప్రజా రిజిస్టర్ (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్పీఆర్)ను నవీకరించే ప్రక్రియకు... కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 8500 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఎన్పీఆర్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. అసోం మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్పీఆర్తో పాటు 2021 జనాభా లెక్కల ప్రక్రియ సెప్టెంబరు 2020 వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో అసలు ఎన్పీఆర్ అంటే ఏమిటి... దాని ముఖ్య ఉద్దేశం, ఎన్పీఆర్ను వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు, ఎన్పీఆర్ నుంచి అసోంను ఎందుకు మినహాయించారు తదితర అంశాల గురించి గమనిద్దాం. ఎన్పీఆర్ అంటే ఏమిటి? దేశంలోని ప్రతీ పౌరుడి కచ్చితమైన వివరాలు సేకరించడమే ఎన్పీఆర్ ముఖ్య ఉద్దేశం. ఎన్పీఆర్ ప్రకారం... ఏదైనా ఒక నిర్ణీత ప్రదేశంలో ఒక వ్యక్తి గల ఆరు నెలలుగా నివాసం ఉంటున్నా లేదా మరో ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం అక్కడే నివాసం ఉండాలనుకుంటే అతడిని యూజువల్ రెసిడెంట్(సాధారణ నివాసి)గా పేర్కొంటారు. పౌరసత్వ చట్టం 1955, పౌరసత్వ నిబంధనలు(రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్, జాతీయ గుర్తింపు కార్డుల జారీ) 2003లోని వివిధ ప్రొవిజన్లను అనుసరించి... గ్రామం, పట్టణం, జిల్లా, రాష్ట్రం తదితర విభాగాల్లో దేశంలోని పౌరుల వివరాలను సేకరిస్తారు. ఎన్పీఆర్ డేటాబేస్‌లో జనాభా లెక్కలు, పౌరుల బయోమెట్రిక్ వివరాలు, ఆధార్, మొబైల్, పాన్ నంబర్లు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ ఐడీ వివరాలు.. అదే విధంగా పాసుపోర్టు నంబర్లను నిక్షిప్తం చేస్తారు. అయితే ఇందులో ఆధార్ నంబరు వాలంటీరిగా ఇస్తే మాత్రమే తీసుకుంటారు. ఏయే వివరాలు అడుగుతారు? ఎన్పీఆర్ ప్రక్రియలో భాగంగా వ్యక్తి పేరు, ఇంటి యజమాని, తండ్రి పేరు, తల్లి పేరు, వివాహితులైతే భార్య/భర్త పేరు, లింగం, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశం, జాతీయత, తాత్కాలిక చిరునామా, శాశ్వత చిరునామా, ఈ చిరునామాల్లో ఎంతకాలంగా నివాసం ఉంటున్నారు?, వృత్తి, విద్యార్హతల గురించి ప్రశ్నిస్తారు. డోర్-టూ- డోర్ సర్వే ఆధారంగా... ఎన్పీఆర్ కోసం.. 2011 జనాభా లెక్కల సేకరణలో భాగంగా 2010లో సేకరించిన డేటాను.. 2015లో చేపట్టిన ఇంటింటి సర్వే ఆధారంగా నవీకరించి.. డిజిటలైజ్ చేశారు. ప్రస్తుతం 2021 జనాభా లెక్కల ప్రక్రియ ఆధారంగా అసోం మినహా భారత్‌లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్పీఆర్ ప్రక్రియ చేపట్టనుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎన్పీఆర్ను వద్దన్న రాష్ట్రాలు.. ఎన్పీఆర్, ఎన్పీఆర్ నవీకరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని కార్యకలాపాలకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అడ్డుచెప్పింది. సీఏఏపై రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలును తాము ఆమోదించబోమని స్పష్టం చేశారు. ఎన్పీఆర్ ఆధారంగా ఎన్నార్సీ అమలు ఉంటుందన్న నేపథ్యంలో ఎన్పీఆర్ ప్రక్రియను తమ రాష్ట్రంలో అనుమతించబోమని తెలిపారు. అదే విధంగా కేరళ, రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్పీఆర్ ప్రక్రియకు సహకరించబోమని స్పష్టం చేశాయి.(చదవండి : పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?) అసోంను ఎందుకు మినహాయించారు? ఎన్పీఆర్ పూర్తయి, అధికారిక ముద్రణ తర్వాత ప్రభుత్వం దీనినే భారత జాతీయ పౌరసత్వ(ఎన్ఆర్సీ) రిజిస్టర్‌కు ఆధారంగా చేసుకుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక అసోంలో ఇటీవలే ఎన్నార్సీను అమలు చేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా అక్రమ వలసదారులను గుర్తించి వారిని క్యాంపులకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ నిజమైన పౌరుల వివరాలను సేకరించే ఎన్పీఆర్ ప్రక్రియలో అసోంను మినహాయించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అపోహలు వద్దు.. ఎన్పీఆర్ డేటా పబ్లిక్ డొమైన్లలో కనిపించదు. ప్రొటోకాల్‌ను అనుసరించి కొంతమంది ప్రత్యేక యూజర్లకు మాత్రమే ఈ డేటా అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అర్హులైన లబ్దిదారులను గుర్తించేందుకు ఎన్పీఆర్ డేటాను వినియోగించుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. పౌరుల వ్యక్తిగత డేటా భద్రతపై అపోహలు వద్దని విఙ్ఞప్తి చేసింది. -
వైఎస్ జగన్ ప్రకటనపై ఎమ్మెల్యే హాఫీజ్‌ఖాన్ హర్షం
-
బీజేపీకి మరో ఝలక్ ఇచ్చిన ఉద్ధవ్ థాక్రే
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే బీజేపీకి వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకున్నారు. నెరుల్ ప్రాంతంలో అక్రమ వలసదారుల కోసం నిర్భంద కేంద్రాన్ని అభివృద్ధి చేయాలన్న గత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపాదనను ఉద్ధవ్ థాక్రే మంగళవారం రద్దు చేశారు. మహారాష్ట్రలో నిర్భంద కేంద్రాలకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో జనవరి 22న ఎన్నార్సీపై విచారణ జరగనున్న నేపథ్యంలో ఆ తర్వాతే ఎన్నార్సీ అమలుపై తమ వైఖరి వెల్లడిస్తామని ఉద్ధవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నార్సీ అమల్లోకి వస్తే భారతదేశంలో అక్రమంగా నివాసముంటున్న విదేశీ పౌరులు, చొరబాటుదారులను గుర్తించేందుకు వీలుంటుంది. అలాంటి వారిని వారి స్వదేశానికి పంపిస్తారు. ఒకవేళ ఏదేశమైనా వాళ్లను తమ పౌరులు కాదని తిరస్కరిస్తే, అలాంటి వారిని డిటెన్షన్ సెంటర్లలో ఉంచుతారు. కాగా, ఇప్పటికే సీఏఏపై దేశంలో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే నెల 22న ఎన్నార్సీపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వనుందనే అంశం ఆసక్తికరంగా మారింది. చదవండి : రాహుల్ గాంధీని కొట్టండి -
ఎన్ఆర్సీకి ప్రభుత్వం పూర్తి వ్యతిరేకం
కడప అర్బన్: జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) తమ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని ముస్లిం మైనార్టీలకు భరోసా ఇచ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం ఆయన కడప రిమ్స్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఇదే సందర్భంలో కొందరు ముస్లిం మైనార్టీలు ఎన్ఆర్సీ విషయమై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సీఎం వైఎస్ జగన్.. కడప నగర మైనార్టీ నాయకుడు వలీవుల్లా హుస్సేన్‌ను వేదికపైకి రావాలని పిలిచారు. ఆయన వేదిక వద్దకు రాగానే.. సీఎం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘మన డిప్యూటీ సీఎం, స్నేహితుడు, ముస్లిం మైనార్టీల విషయంలో అన్నీ తెలిసిన అంజాద్ బాషా నాతో ముందుగా మాట్లాడి ఎన్ఆర్సీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితు ల్లోనూ బలపరచదని ప్రకటించారు. ఆ ప్రకారం డిప్యూటీ సీఎం ప్రకటనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీంట్లో అనుమానాలకు తావు లేదని ముస్లిం మైనార్టీలకు భరోసా ఇస్తున్నా’ అన్నారు. -
పోటాపోటీ ప్రదర్శనలు
న్యూఢిల్లీ/కోల్‌కతా/తిరువనంతపురం/ముంబై: పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. చట్టాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో ర్యాలీలు నిర్వహించారు. పౌర చట్టంపై కాంగ్రెస్ సత్యాగ్రహం! పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో సత్యాగ్రహం చేపట్టింది. ‘ఐకమత్యం కోసం సత్యాగ్రహం’పేరుతో నిర్వహించిన ఈ ఆందోళనలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, రాహుల్, ముఖ్య నేతలు పాల్గొన్నారు. విద్వేషాలను పెంచుతూ దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. భరత మాత గొంతు అణచివేసేందుకు, రాజ్యాంగంపై దాడికి చేస్తున్న యత్నాలను ప్రజలు కొనసాగనివ్వబోరని హెచ్చరించారు. చెన్నైలో డీఎంకే ర్యాలీ తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సోమవారం చెన్నైలో భారీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ పక్కన కాంగ్రెస్ నేత పి.చిదంబరం ‘పౌర’చట్టానికి వ్యతికేకంగా ప్లకార్డులు పట్టుకుని నడిచారు. పెళ్లిళ్లు, వేడుకల్లోనూ ‘పౌర’ నిరసనలు కేరళలో పెళ్లిళ్లు, వేడుకలు, క్రిస్మస్ సంబరాలే నిరసన వేదికలుగా మారాయి. ఈ ఒరవడి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుడు, వధువు పెళ్లి విందు సందర్భంగా ఎన్నార్సీకి, పౌర చట్టానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ముందు నడుస్తుండగా వారి బంధువులు నినాదాలు చేసుకుంటూ వస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. రాజకీయ లబ్ధికే బెంగాల్ సీఎం మొగ్గు.. పౌరసత్వ సవరణ చట్టంపై సాధారణ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టిస్తున్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి జాతీయ ప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అన్నారు. ‘పౌర’చట్టానికి అనుకూలంగా కోల్‌కతాలో సోమవారం బీజేపీ చేపట్టిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఆశ్చర్యం కలిగించాయి: పవార్ దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)అమలు చేసే విషయమై పార్లమెంట్లో చర్చే జరగలేదన్న మోదీ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. ఎన్నార్సీ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందంటూ పార్లమెంట్ సంయుక్త సమావేశం సందర్భంగా రాష్ట్రపతిæ వెల్లడించారని గుర్తు చేశారు. మమతా బెనర్జీ లేఖ బీజేపీ ప్రభుత్వం కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కలిసికట్టుగా ఉండి దేశాన్ని రక్షించుకుందామన్న బెంగాల్ సీఎం మమత.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల సీనియర్ నేతలకు లేఖలు రాశారు. అందుకే ఎన్నార్సీపై వెనక్కు! జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాము అధికారంలోకి వచ్చాక ఎన్నార్సీపై కేబినెట్లోగానీ, పార్లమెంట్లోగానీ చర్చించలేదని ఆదివారం ఢిల్లీలో జరిగిన బహిరంగ సభలో మోదీ చెప్పడం తెల్సిందే. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్నార్సీలపై నిరసనలు, హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో కొన్నాళ్లు ఎన్ఆర్సీని పక్కనపెట్టాలన్న వ్యూహాత్మక ఆలోచనలో భాగంగానే ప్రధాని ఆ వ్యాఖ్య చేశారని భావిస్తున్నారు. అందుకే ఎన్నార్సీ, సీఏఏ వేరువేరు అని వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ఆందోళనలు ఇంత తీవ్ర స్థాయిలో జరుగుతాయని ఊహించలేదని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్నార్సీపై ముస్లింల ఆందోళన కూడా ఈ స్థాయిలో నిరసనలు జరగడానికి కారణమని పేర్కొన్నారు. -
ఎన్ఆర్సీపై సీఎం జగన్ కీలక ప్రకటన
సాక్షి, వైఎస్సార్: దేశ వ్యాప్తంగా వివాదానికి కేంద్రబిందువైన జాతీయ పౌరపట్టిక (ఎన్ఆర్సీ) అమలుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఎన్ఆర్సీకి వ్యతిరేకమని, రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని సీఎం ప్రకటించారు. మైనార్టీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో భాగంగా సోమవారం కడప జిల్లాలో పర్యటించిన సీఎం జగన్.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్ఆర్సీ బిల్లు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రభుత్వం తరుఫునే గతంలో వ్యాఖ్యలు చేశారని, ఆయన ప్రకటనకు కట్టుబడి ఉంటామని సీఎం స్పష్టం చేశారు. కాగా వివాదాస్పద ఎన్ఆర్సీపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మైనార్టీల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముస్లిం, మైనార్టీలకు తాము అండగా ఉంటామని, ఏమాత్రం ఆందోళనకు గురికాద్దని డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా భరోసా ఇచ్చారు. -
ఎన్ఆర్సీపై సీఎం జగన్ కీలక ప్రకటన
-
పొరుగుదేశాలపై భారత్ ప్రభావం: బంగ్లా మంత్రి
ఢాకా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ)భారత్ అంతర్గత వ్యవహారమని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్ అన్నారు. అయితే, భారత్‌లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల ప్రభావం పొరుగు దేశాలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఏఏ నిరసనలు తగ్గి త్వరలోనే శాంతియుత పరిస్థితి నెలకొంటుందని ఆకాంక్షించారు. అమెరికాలో ఆర్థిక మాంద్యం నెలకొంటే ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తుంది. దీనికి కారణం ఇప్పుడు ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. అలాగే భారత్‌లో ఏ మాత్రం అనిశ్చితి నెలకొన్నా మాకూ ఆందోళనగానే ఉంటుంది’అని అబ్దుల్ మొమెన్ అన్నారు. -
ఎన్నార్సీపై చర్చించలేదు
న్యూఢిల్లీ: జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)కు సంబంధించి తన ప్రభుత్వం ఇంతవరకు కేబినెట్లో కానీ, పార్లమెంట్లో కానీ చర్చించలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అస్సాంలో మాత్రం ఎన్నార్సీని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిపారని గుర్తు చేశారు. ఎన్నార్సీపై విపక్షాలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా తీవ్రస్థాయి నిరసనలకు, హింసాత్మక ఆందోళనలకు కారణమైన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని మోదీ గట్టిగా సమర్థించారు. ఆ చట్టాన్ని వ్యతిరేకించే ముందు ఆ చట్టంలోని అంశాలపై అవగాహన తెచ్చుకోవాలని సూచించారు. భారతీయ ముస్లింలకు ఆ చట్టంతో ఏ సంబంధం లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులు, సిక్కులకు పౌరసత్వం కల్పించాలని గతంలో మహాత్మాగాంధీయే చెప్పారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని గాంధీ పేరును తమ పేరుకు తగిలించుకున్న వారు తెలుసుకోవాలని పరోక్షంగా కాంగ్రెస్ అగ్రనేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘మూడు పొరుగు దేశాల్లో మతపరమైన వేధింపులకు గురై భారత్‌కు వచ్చిన వారికి పౌరసత్వ హక్కులు కల్పించేందుకు ఉద్దేశించినదే కానీ.. ఇక్కడి వారి హక్కులను లాగేసుకునేది కాదు’ అని పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ఉద్దేశాన్ని వివరించారు. ఈ ప్రతిపాదనను గతంలో కాంగ్రెస్, టీఎంసీలు సమర్థించాయని, ఇప్పుడు ఓటుబ్యాంక్ రాజకీయాల కోసం విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ చట్టం అమలైతే ముస్లింలను నిర్బంధ కేంద్రా(డిటెన్షన్ సెంటర్)లకు పంపించేస్తారని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, పట్టణ నక్సలైట్లు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శాంతి పాటించాలని, హింసకు పాల్పడవద్దని కాంగ్రెస్, తృణమూల్, ఆప్, లెఫ్ట్ పార్టీలు సీఏఏ ఆందోళనకారులకు ఎందుకు విజ్ఙప్తి చేయడం లేదని ప్రశ్నించారు. తమ రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయబోమని పలువురు సీఎంలు చేస్తున్న ప్రకటనలపై స్పందిస్తూ.. వీరు తమ న్యాయాధికారులను సంప్రదిస్తే మంచిదన్నారు. పార్లమెంటు చేసిన చట్టాలను రాష్ట్రాలు అమలు చేసి తీరాల్సిందేనని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందన్నారు. ఢిల్లీలోని అక్రమ కాలనీల క్రమబద్ధీకరణ అనంతరం, వారికి యాజమాన్య హక్కులు కల్పించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞతాపూర్వక సభలో గంటన్నరకు పైగా ప్రధాని ప్రసంగించారు. ఢిల్లీ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సభ ఎన్నికల ప్రచార ప్రారంభంగానే కనిపించింది. శరణార్థులు వేరు.. అక్రమ వలసదారులు వేరు శరణార్థులకు, అక్రమ వలసదారులకు తేడా ఉందని, శరణార్థులు తమ వివరాలను దాచేందుకు ప్రయత్నించరని, అక్రమ వలసదారులు మాత్రం తమ వివరాలేవీ బయటపెట్టరని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము మళ్లీ విజయం సాధించడాన్ని జీర్ణించుకోలేని విపక్షాలు విచ్ఛిన్న రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని విరుచుకుపడ్డారు. మైనారిటీలపై పాకిస్తాన్ చూపే వివక్షను ఎండగట్టే అవకాశం వచ్చిందని, అయితే, ఇక్కడి విపక్షాల విభజన రాజకీయాల వల్ల ఆ అవకాశం కోల్పోయామని వ్యాఖ్యానించారు. భిన్నత్వంలో ఏకత్వం ‘భిన్నత్వంలో ఏకత్వం.. భారతదేశ విశిష్టత’ అని నినదిస్తూ ప్రసంగాన్ని మోదీ ప్రారంభించారు. అభివృద్ధిలో తన ట్రాక్ రికార్డును చూడాలని, విపక్షాల టేప్ రికార్డులను వినవద్దని ముస్లింలకు సూచించారు. నిరసనల సందర్భంగా పోలీసుల తీరును ప్రధాని ప్రశంసించారు. వారెప్పుడు ప్రజలకు సహాయకారులుగానే ఉంటారన్నారు. ‘భయాందోళనలకు కారణం హోంమంత్రే’ సీఏఏపై అపోహలను ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ స్పందించింది. భయాందోళనలకు కారణం తాము కాదని, హోం మంత్రి అమిత్ షానేనని సమాధానమిచ్చింది. సీఏఏ తరువాత ఎన్నార్సీనేనని అమిత్ షా పార్లమెంట్‌లోనే ప్రకటించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ గుర్తు చేశారు. భారత్‌లో డిటెన్షన్ సెంటర్లు లేవని ప్రధాని చెప్పడాన్ని శర్మ తప్పుబట్టారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా దేశ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం ట్విట్టర్లో విమర్శించారు. మోదీ సభకు భారీ భద్రత రామ్‌లీలా మైదానంలో ప్రధాని మోదీ పాల్గొన్న ఈ సభకు అధికారులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. పాత ఢిల్లీలో హింసాత్మక ఆందోళనలు జరిగిన దరియాగంజ్‌కు ఈ ప్రాంగణం ఒక కిలోమీటరు దూరంలోనే ఉండటంతో బలగాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాయి. డీసీపీ ర్యాంక్ అధికారులు 20 మంది, దాదాపు వెయ్యిమంది ఢిల్లీ పోలీసులు, డ్రోన్ నిరోధక దళాలు, ఎన్ఎస్జీ కమాండోలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. -
సీఏఏ : నూతన వధూవరుల వినూత్న నిరసన
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ), పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందిన నాటి నుంచి యావత్ భారత్ ఆగ్రహావేశాలతో ఊగిపోతుంది. సీఏఏకు వ్యతిరేకంగా సాధారణ యువత, యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లమీదకు వచ్చి చేపట్టిన నిరసనలు పలుచోట్ల హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో సైతం సీఏఏకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొత్త కొత్త పద్దతిలో నెటిజన్లు తమ నిరసనను తెలుపుతున్నారు. తాజాగా నూతన వధూవరులు కూడా సీఏఏకు వ్యతిరేకంగా తమదైన శైలిలో నిరసనను తెలుపుతున్నారు. సీఏఏ, ఎన్నార్సిని వ్యతిరేకిస్తూ ఓ నవజంట పెళ్లి మండపంలో ‘నో ఎన్నార్సీ, నో సీఏఏ’ అని ప్లకార్డులు పట్టుకున్నారు. ఈ ఫోటోలను ఓ వ్యక్తితో #IndiaAgainstCAA_NRC" హాష్‌ట్యాగ్‌తో ట్విటర్లో పోస్ట్ చేశాడు. కేరళకు చెందిన ఆ జంట ఎన్నార్సీకి వ్యతిరేకంగా వినూత్న నిరసనను తెలిపింది. అలాగే మరో జంట పెళ్లి దుస్తులు ధరించి చేతుల్లో ‘విత్‌డ్రా క్యాబ్’ పోస్టర్‌ను చూపిస్తూ నిరసనను తెలిపింది. -
విపక్షాలకు ప్రశాంత్ కిషోర్ సూచనలు
పట్నా: నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్( ఎన్ఆర్సీ), పౌరసత్వ సవరణ చట్టంపై రాజకీయ వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ఆర్సీ అడ్డుకోవటం కోసం ప్రజలు, రాజకీయ నాయుకులు రెండు బలమైన మార్గాలను ఎంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ట్విటర్ వేదికగా స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీపై ప్రజలు, నాయకులు వ్యతిరేకంగా అన్ని మాధ్యమాల్లో శాంతియుతంగా నిరసనలు వ్యకం చేయాలని ఆయన సూచించారు. ఆదే విధంగా బీజేపీయేతర 16 మంది ముఖ్యమంత్రులు ఏకమై పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించాలని ప్రశాంత్ కిశోర్ పిలుపునిచ్చారు. ఎన్ఆర్సీ, పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. ఎన్ఆర్సీని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఎన్ఆర్సీని బిహార్‌లో అమలు చేయాల్సిన అవసరం ఏముందని నితీష్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎన్డీయేతర ముఖ్యమంత్రులు కేంద్రంపై తీవ్రంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జేడీయూ పార్లమెంట్ ఉభయ సభల్లోనూ క్యాబ్ బిల్లుకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై పార్టీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2014లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రశాంత్ కిషోర్ విస్తృతంగా కృషిచేసిన విషయం తెలిసిందే. -
నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఇంటింటిపై త్రివర్ణం ఎగరాలి!
సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోదీ నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఇంటింటిపై త్రివర్ణ పతాకాలను రెప రెపలాడించాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరా బాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి హైదరాబాద్ దారుస్సలాం మైదానంలో పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘మహత్మాగాంధీ, అంబేద్కర్, మౌలానా అజాద్, నేతాజీ సుభాస్ చంద్రబోస్‌లు జీవించి లేనప్పటికీ వారి ఆశయాలు సజీవంగా ఉన్నాయి. మనమంతా భారతీయులమని బీజేపీ, సంఘ్పరివార్లకు ఘాటైన సమాధానం చెప్పేందుకు ఇంటింటిపై త్రివర్ణ పతాకాలను ఎగురవేయాలి. ఎన్ఆర్సీ, సీఏఏ ఉపసంహరించే వరకు జెండాలు అలాగే ఉంచాలి’ అని పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రజా స్వామ్యయుతంగా, హింసకు తావివ్వకుండా, శాం తియుతంగా కనీసం ఆరుమాసాలైనా ఆందోళన కొనసాగించాలన్నారు. భారతీయులందరిని రక్షించేందుకే ఈ పోరాటమన్నారు. కేరళలో మాదిరిగా తెలంగాణలో కూడా జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ) అమలు చేయకుండా నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ సీఏఏ, ఎన్ఆర్సీ వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జమాత్–ఇ–ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షుడు హమీద్ మహ్మద్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంతో కేంద్ర పాలకుల మెడలు వంచినట్లు.. అమిత్‌షా మెడలు వంచి చట్టం ఉపసంహరించేలా ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు. అస్సాంకు చెందిన సామాజిక కార్యకర్త అబ్ధుల్ వదూర్ అమాన్ మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలోని సీఎంలు వీటి అమలును నిలిపివేయాలని పలువురు వక్తలు విజ్ఞప్తి చేశారు. ఈ సభలో ఢిల్లీకి చెందిన జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్దులు కూడా పాల్గొన్నారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన బహిరంగ సభలో జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ఈ సభను జాతీయ గీతంతో ప్రారంభించారు. -
అట్టుడుకుతున్న యూపీ
న్యూఢిల్లీ/లక్నో/పుణే: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. నిరసనకారుల దాడిలో 263 మంది పోలీసులు గాయాలపాలు కాగా, వీరిలో 57 మంది బుల్లెట్ గాయాలయ్యాయని రాష్ట్ర ఉన్నతాధికారులు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం, దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలుకు వ్యతిరేకంగా బిహార్‌లో ఆర్జేడీ పిలుపు మేరకు శనివారం బంద్ జరిగింది. ఆందోళనలకు కేంద్ర బిందువుగా ఉన్న అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో శనివారం పరిస్థితులు సద్దుమణిగాయి. పౌరసత్వ సవరణ చట్టంపై సాగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు మూడు కోట్ల కుటుంబాలకు అవగాహన కల్పిస్తామని బీజేపీ తెలిపింది. పోలీస్ ఠాణాకు నిప్పు శుక్రవారం జరిగిన ఆందోళనల్లో ఆరుగురు మృతి చెందడంపై నిరసనకారులు శనివారం రాంపూర్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. అయినప్పటికీ, 12– 18 ఏళ్ల వయస్సున్న బాలురు సహా 500 మంది ఆందోళనకారులు రాంపూర్ ఈద్గా సమీపంలో గుమికూడి పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా పోలీసులతో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు ఆందోళనకారులు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఆందోళనకారుల రాళ్ల దాడిలో డజను మంది పోలీసులు కూడా గాయపడ్డారని చెప్పారు. ఈ ఘర్షణలకు స్థానికేతరులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో నిరసనలు కొనసాగాయి. కాన్పూర్‌లో ఆందోళనకారులు యతీమ్‌ఖానా పోలీస్‌స్టేషన్‌కు నిప్పుపెట్టారు. వాళ్లే కాల్చుకున్నారు: డీజీపీ ఓపీ సింగ్ రాష్ట్రంలో ఎక్కడా పోలీసులు కాల్పులు జరపలేదని, ఆందోళనకారులే అక్రమంగా తెచ్చుకున్న ఆయుధాలతో కాల్చుకున్నారని యూపీ డీజీపీ ఓపీ సింగ్ వ్యాఖ్యానించారు. ‘నిరసనకారులు మహిళలు, చిన్నారులను అడ్డుపెట్టుకున్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల అక్రమంగా ఆయుధాలతో కాల్పులకు దిగుతున్నారు. దీంతో పోలీసులు అంతిమ ప్రయత్నంగా టియర్‌గ్యాస్, లాఠీచార్జీలను వాడాల్సి వస్తోంది. కొన్ని రాజకీయ పార్టీలు, ఎన్జీవోల వారూ నిరసనలకు దిగుతున్నారు. అల్లర్ల వెనుక బంగ్లాదేశీయుల హస్తం ఉందంటూ వస్తున్న వార్తలపైనా దర్యాప్తు జరుపుతాం’ అని ఆయన తెలిపారు. లక్నోలో ఇప్పటి వరకు 218 మందిని అరెస్టు చేసినట్లు డీజీపీ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు లక్నోలో ఆందోళనల్లో సంభవించిన నష్టం వివరాలు సేకరిస్తున్నామని, బాధ్యులకు నోటీసులు జారీ చేసి నష్టాన్ని రాబడతామన్నారు. లక్నోలో ఈ నెల 23 వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ నేరాలకు పాల్పడిన 705 మందిని అరెస్టు చేశామని, 4,500 మందిని నిర్బంధంలోకి తీసుకున్నామని ఐజీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకు 102 మందిని అరెస్టు చేశామన్నారు. రాష్ట్రంలో నిరసనకారుల దాడిలో క్షతగాత్రులైన 263 మంది పోలీసు సిబ్బందిలో 57 మందికి బుల్లెట్ గాయాలయ్యాయని ఐజీ ప్రవీణ్ వెల్లడించారు. ఆందోళనలు జరిగిన ప్రాంతాల నుంచి 405 ఖాళీ బుల్లెట్ కేసులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఫిరోజాబాద్ జిల్లాలో శనివారం జరిగిన వివిధ ఆందోళనల్లో ముగ్గురు మృతి చెందారని ఎస్పీ సచీంద్ర తెలిపారు. మహారాష్ట్ర కూడా వ్యతిరేకించాలి: పవార్ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ కేంద్రాన్ని కోరారు. ఈ చట్టంపై ఇప్పటికే వ్యతిరేకత ప్రకటించిన 8 రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర కూడా చేరాలని ఆయన సూచించారు. ఈ చట్టాన్ని అమలు చేయలేని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం రద్దు చేసే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అవగాహన కల్పిస్తాం: బీజేపీ చట్ట సవరణపై వ్యక్తమవుతోన్న తీవ్రమైన వ్యతిరేకతకు చెక్‌పెట్టాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. దీనిలో భాగంగా వచ్చే పది రోజుల్లో దాదాపు మూడు కోట్ల కుటుంబాలను కలిసి పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన కల్పిస్తామని బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ తెలిపారు. ప్రతి జిల్లాలో ర్యాలీలు చేపడతామని, దేశవ్యాప్తంగా 250 మీడియా సమావేశాలు పెడతామని అన్నారు. ఈ చట్టం వల్ల లబ్ధిపొందిన కుటుంబాల వారిని కూడా ఈ ప్రచారంలో భాగస్వాములుగా చేస్తామన్నారు. భీం ఆర్మీ చీఫ్ అరెస్ట్ ఢిల్లీలోని దార్యాగంజ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలతో సంబంధం ఉందనే ఆరోపణలతో భీం ఆర్మీ ఛీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేసి ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఆజాద్‌ను 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి పంపుతూ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే, ఆజాద్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దార్యాగంజ్ ఘటనకు సంబంధించి మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుభాష్ మార్గ్‌లో పార్కు చేసి ఉన్న ఓ ప్రైవేటు కారుకి ఆందోళన కారులు నిప్పు పెట్టారనీ, అల్లర్లకు పాల్పడ్డారనీ పోలీసులు ఆరోపించారు. ఈ ఘటనలతో సంబంధమున్న 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టానికి 1,100 మంది విద్యావేత్తల మద్దతు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్నవేళ దేశ విదేశీ విశ్వవిద్యాలయాలకు చెందిన పలువురు విద్యావేత్తలు, పరిశోధకులు సవరణ చట్టానికి అనుకూలంగా స్పందించారు. పౌరసత్వ చట్టాన్ని స్వాగతిస్తూ 1,100 మంది తమ సంతకాలతో శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సంతకాలు చేసిన వారిలో షిల్లాంగ్ ఐఐఎం చైర్మన్ శిశిర్ బజోరియా, నలందా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సునైనా సింగ్, జేఎన్‌యూ ప్రొఫెసర్ ఐనుల్ హసన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్, కన్ఫ్లిక్ట్ స్టడీస్ పరిశోధనా సంస్థలో సీనియర్ అధ్యాపకుడు అభిజిత్ అయ్యర్ మిత్ర, పాత్రికేయుడు కంచన్ గుప్తా, రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్‌గుప్తా తదితరులు ఉన్నారు. అనవసరంగా భయాందో ళనలు చెందాల్సిన పనిలేదని, పుకార్ల భ్రమల్లో పడకూడదని ఈ లేఖ ద్వారా మేధావులు సమాజంలోని అన్నివర్గాల ప్రజలను కోరారు. శాంతియుతంగా ఆలోచించాలని సూచించారు. భారతదేశ నాగరికతను కాపాడేందుకు, మైనారిటీల హక్కుల రక్షణకోసం పార్లమెంటు ప్రయత్నిస్తోందంటూ ఈ లేఖలో కొనియాడారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శనివారం పట్నాలో ఆందోళన చేస్తున్న నిరసనకారులు -
సీఎంలు స్పందించకుంటే అర్థం ఉండదు..
నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ)కి సంబంధించిన నిరసనలలో కాంగ్రెస్ పార్టీ పాల్గొనడం లేదని రాజకీయ వ్యూహకర్త, జేడీయు వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కిషోర్ ట్విటర్ వేదికగా శనివారం విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బీజేపీపై విమర్శిస్తూ చేసిన వీడియో స్టేట్మెంట్ను చూశానని అన్నారు. శుక్రవారం సీఏఏ, ఎన్ఆర్సీని సోనియా విమర్శిస్తూ.. బీజేపీ ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలను తీసుకొచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు స్పందించకపోతే సోనియా గాంధీ విమర్శలకు అర్థం ఉండదని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఇటీవలి కాలంలో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలలో ప్రశాంత్ కిషోర్ చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. బీజేపీ అమలు చేస్తామంటున్న ఎన్ఆర్సీ.. పెద్దనోట్ల రద్దు మాదిరిగానే పేదలు, దిగువ తరగతి వారికి తీవ్ర నష్టం చేయనుందని గతంలో ఆయన ట్వీట్ చేసిన విషయం విదితమే. Congress is not on streets and its top leadership has been largely absent in the citizens’ fight against CAA-NRC The least party could do it to make ALL Congress CMs join other CMs who have said that they will not allow NRC in their states. Or else these statements means nothing https://t.co/EWJLyc3kgR — Prashant Kishor (@PrashantKishor) December 21, 2019 -
పౌరసత్వంపై ఆందోళన వద్దు!
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో చట్టంలో పొందుపర్చిన పౌరసత్వం నిబంధనలపై కేంద్రం వివరణ ఇచ్చింది. జూలై 1, 1987న లేదా ఆ లోపు భారత్‌లో జన్మించిన వారు సహజంగానే భారతీయ పౌరులవుతారని తెలిపింది. అలాగే, ఆ తేదీ(జూలై 1, 1987)లోపు వారి తల్లిదండ్రులు భారత్‌లో జన్మించినట్లైనా కానీ ఆ పిల్లలు చట్టప్రకారం భారతీయ పౌరులేనన్నారు. సీఏఏపై, ఎన్నార్సీపై వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అస్సాం విషయంలో ఈ కటాఫ్ 1971వ సంవత్సరంగా ఉంటుందన్నారు. ï పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం, జూలై 1, 1950 – డిసెంబర్ 3, 2004 మధ్య భారత్‌లో జన్మించిన వారు పౌరసత్వానికి అర్హులు. అలాగే, పిల్లలు జన్మించిన సమయంలో తల్లిదండుల్లో ఏ ఒకరైనా భారతీయ పౌరుడైతే.. ఆ పిల్లలు కూడా ఇక్కడి పౌరులవుతారు. డిసెంబర్ 10, 1992– డిసెంబర్ 3, 2004 మధ్య భారత్‌కు వెలుపల జన్మించిన వారి తల్లిదండ్రులకు భారత పౌరసత్వం ఉంటే.. ఆ పిల్లలను కూడా ఇక్కడివారిగా పరిగణిస్తారు. -
రాష్ట్రాల సహకారం లేనిదే అమలు కుదరదు : పీకే
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం ఏ చట్టం చేసినా రాష్ట్రాల సహకారం లేనిదే అమలు సాధ్యం కాదని ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌కిషోర్ మరోసారి తేల్చి చెప్పారు. శుక్రవారం ఓ ప్రముఖ జాతీయ మీడియాతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమలో ఆయన సీఏఏ, ఎన్నార్సీలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రశ్న : సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా మీరు ట్వీట్ చేశారు. మీ పార్టీ ఏమో పార్లమెంటులో మద్దతిచ్చింది. దీనిపై మీరేమంటారు? జవాబు : పౌరసత్వ సవరణ బిల్లుపై పార్లమెంటులో ఓటింగ్ జరగక ముందే నా అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించాను. మా పార్టీ కూడా మొదట సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. కానీ తర్వాత వైఖరిని మార్చుకుంది. దీనిపై మా అధ్యక్షుడు నితీష్‌కుమార్‌ను అడిగాను. ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించిందేంటంటే సీఏఏ, ఎన్నార్సీలను వారు వేర్వేరుగా చూస్తున్నారు. సీఏఏకు మద్దతిచ్చినా, ఎన్నార్సీకి మద్దతివ్వనని, అది బీహార్‌కు అవసరం లేదని ఆయన నాకు భరోసానిచ్చారు. సీఏఏ, ఎన్నార్సీలు దేశానికి మంచిది కాదని నా అభిప్రాయం. నాతో ఏకీభవించేవాళ్లంతా ఈ చట్టాలను వ్యతిరేకించాలని కోరుతున్నా. ప్రశ్న : ఈ చట్టాలను బీజేపీయేతర ముఖ్యమంత్రులు వ్యతిరేకించాలని మీరు పిలుపునిచ్చారు. కానీ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తప్ప మిగతా ముఖ్యమంత్రులెవరూ ఇప్పటి వరకు స్పందించలేదు. వారంతా మీ సూచనను పాటిస్తారని అనుకుంటున్నారా? జవాబు : దేశంలోని 16 రాష్ట్రాల్లో బీజేపీయేతర ముఖ్యమంత్రులున్నారు. ఈ రాష్ట్రాల్లో దేశ జనాభా 65 శాతం ఉంది. గత లోక్‌సభ ఎన్నికలల్లో బీజేపీకి అత్యధిక మెజార్టీ స్థానాలు వచ్చినా ఓట్ల శాతం చూసుకుంటే వారికి వచ్చిన ఓట్లు 39 శాతమే. అంటే బీజేపీని దేశంలో 61శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారనేగా అర్థం. ఇప్పుడు బీజేపీ దేశ ప్రజలు మాకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు కాబట్టి, ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ 61 శాతం మంది మీకు వ్యతిరేకంగా ఓటు వేశారు కదా. వారి సంగతేంటి? ఈ 61 శాతం మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకే నేను వ్యతిరేకించమని చెప్పేది. ప్రశ్న : కానీ, కేంద్రం చేసిన చట్టాలను వ్యతిరేకించే అధికారం రాష్ట్రాలకు లేదు కదా? జవాబు : వ్యతిరేకించే అధికారం రాజ్యాంగం ప్రకారమైతే లేదు. కానీ రాష్ట్రాల సహకారం లేకుండా కేంద్రం ఈ చట్టాన్ని దేశంలో అమలు చేయగలదా? ఒక్క అస్సాంలోనే ఎన్నార్సీ చేపడితే రేయింబవళ్లు కష్టపడినా మూడేళ్లు పట్టింది. అలాంటిది దేశం మొత్తం అమలు చేయాలంటే ఎంతకాలం పడుతుంది. అది కూడా కేంద్రం మాత్రమే చేయాలంటే ఎంత సమయం పడుతుందో ఊహించండి. ప్రశ్న : మరి పార్లమెంటులో మీ పార్టీ సీఏఏకు అనుకూలంగా ఓటు వేయడం ద్వంద వైఖరి కాదా? జవాబు : ఇది ద్వంద వైఖరి కాదు. పైన చెప్పినట్టు సీఏఏ, ఎన్నారర్సీలకు మధ్య లింకు ఉంటుందని వారు బహుశా ఊహించి ఉండరని అనుకుంటున్నాను. ప్రశ్న : బీజేపీ నేతృత్వంలోని ఏన్డీయే కూటమిలో మీ పార్టీ జేడీయూ భాగస్వామి కదా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జవాబు : మా పార్టీ ఎన్డీఏలో భాగస్వామియే. కాదనను. కానీ చరిత్ర చూస్తే కొన్ని కీలక సమస్యలపై ఈ రెండూ పార్టీల వైఖరి పరస్పరం విరుద్ధంగా ఉంటుంది. అలాగే ఎన్నార్సీపై కూడా మా పార్టీ వైఖరి ఏంటో ఇప్పటికే మా నాయకుడు స్పస్టం చేశారు. -
ఏం మాట్లాడుతున్నారో.. మీకైనా తెలుస్తోందా?
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)కి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీసీఏకు సంబంధించి నిబంధనలు, విధివిధానాలు పూర్తిగా ఖరారు కాలేదని పేర్కొన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ విద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత చట్టం నిబంధనలపై ప్రతీ ఒక్కరితో చర్చించి.. అర్హులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదే విధంగా దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ అమలు గురించి కేంద్రం సత్వరమే ఎటువంటి చర్యలు తీసుకోబోవడం లేదని స్పష్టం చేశారు. ఆమెకైనా తెలుసా అసలు.. బీజేపీకి దమ్ముంటే సీఏఏ, ఎన్నార్సీపై ఐకరాజ్య సమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనపడటం.. కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న కారణంగా మమత భయపడిపోతున్నారన్నారు. అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసలు మమత ఏం మాట్లాడుతున్నారో ఆమెకైనా తెలుసా. ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. అదే విధంగా సీసీఏకు దేశ పౌరుల ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలిగించదని.. కాబట్టి ఆందోళనకారులు నిరసన విరమించాలని ఆయన కోరారు. ప్రజలను విభజించేందుకు, తప్పుదోవ పట్టించేందుకు మతాన్ని ఉపయోగించుకుంటున్నారా అంటూ మేధావులు, ప్రతిపక్షాలను ప్రశ్నించారు.(సీఏఏపై కేంద్రానికి మమత సవాలు) -
నిరసన జ్వాలలు: డీసీపీపై ప్రశంసలు!
-
నిరసన జ్వాలలు: మీకు సెల్యూట్ సార్.. !
బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కర్ణాటకలో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. బెంగళూరు, మంగళూరులో ఆందోళనకారులు పలుచోట్ల టైర్లు మండిస్తూ నిరసనకు దిగారు. పౌరసత్వ సవరణ చట్టంతో పాటు జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల 144 సెక్షన్ విధించినప్పటికీ రోడ్లపైకి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. కాగా బెంగళూరు టౌన్‌హాల్ వద్దకు చేరుకున్న నిరసనకారులను.. అక్కడి నుంచి పంపించేందుకు బెంగళూరు సెంట్రల్ డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ చేసిన ప్రయత్నంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. శాంతియుత నిరసనలో అరాచక, అసాంఘిక శక్తులు ప్రవేశిస్తే పరిస్థితి చేజారుతుందంటూ తొలుత ఆయన మైకులో హెచ్చరించారు. అయినప్పటికీ ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లకపోవడంతో.. ఆయన జాతీయ గీతం ఆలపించడం మొదలుపెట్టారు. దీంతో ఆయనతో పాటు గొంతు కలిపిన నిరసనకారులు.. ఒక్కొక్కరుగా ఆ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు.(దేశవ్యాప్తంగా ఆందోళనలు.. అరెస్ట్‌లు) ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ‘దేశంలోని చాలా చోట్ల.. ముఖ్యంగా ఢిల్లీలోని జామియా యూనివర్సిటీ విద్యార్థుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును మనం చూశాం. మరికొన్ని చోట్ల నిరసనకారులపై విరుచుకుపడ్డ పోలీసులను కూడా చూశాం. అయితే మీరు ఇందుకు భిన్నంగా ఆలోచించారు. ఎవరికీ హాని కలగకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించారు. మీకు సెల్యూట్ సార్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
షాహి ఇమామ్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని సహా వివిధ రాష్ట్రాల్లో నిరసనలు పెల్లుబుకుతున్న వేళ ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారి కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం భారత్‌లో నివసిస్తున్న ముస్లింలకు ఎటువంటి నష్టం చేయదని పేర్కొన్నారు. అది కేవలం ముస్లిం శరణార్థులకు ఇచ్చే పౌరసత్వానికి మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా నిరసనలకు కారణమవుతున్న పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ) గురించి సయ్యద్ మంగళవారం మీడియాతో మట్లాడారు. ‘నిరసన తెలపడం అనేది భారత ప్రజలకు ఉన్న ప్రజాస్వామ్యపు హక్కు. మనకు నచ్చని అంశంపై నిరసన తెలియజేయడాన్ని ఎవరూ ఆపలేరు. అయితే అది శాంతియుతంగా జరగాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్నార్సీకి చాలా తేడా ఉంది. ఎన్నార్సీ ఇంకా చట్టరూపం దాల్చలేదు. ఇక పౌరసత్వ సవరణ చట్టం అనేది... పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముస్లిం శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే వ్యతిరేకం. భారతీయ ముస్లింలకు దాంతో ఎటువంటి నష్టం జరగదు’ అని పేర్కొన్నారు. అదే విధంగా జామియా యూనివర్సిటీ రణరంగంగా మారిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ సంయమనం పాటించాలని సయ్యద్ విఙ్ఞప్తి చేశారు. కాగా పార్లమెంటు ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేయడంతో చట్టరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు పొరుగు దేశాలైన.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే వీలు కలుగుతుంది. Shahi Imam of Delhi's Jama Masjid, Syed Ahmed Bukhari: There is a difference between Citizenship Amendment Act (CAA) & National Register of Citizens (NRC). One is CAA that has become a law, and the other is NRC that has only been announced, it has not become a law. (17.12.19) pic.twitter.com/Eo9bjd8YTp — ANI (@ANI) December 18, 2019 -
ఎన్ఆర్సీ అంటే ఏమిటి.. నష్టం ఎవరికి?
న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణ బిల్లు కాస్తా పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టమైంది మొదలు.. దేశవ్యాప్త ఎన్ఆర్సీపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే ఈ అంశంపై తన వైఖరిని స్పష్టం చేయగా, ప్రతిపక్షాలు సైతం ఈ అంశంపై పోరుకు సన్నద్ధమవుతున్నాయి. ఎన్ఆర్సీ అంటే..? జాతీయ స్థాయిలో అర్హులైన పౌరులదరితో కూడిన జాబితాను నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్.. క్లుప్తంగా ఎన్ఆర్సీ అంటారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ వలసదారుల ఏరివేత కోసం ఇటీవలే ఈ ఎన్ఆర్సీ ప్రక్రియను ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పూర్తి చేశారు కూడా. ప్రత్యేక జాతులపై ప్రభావం పడరాదన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియను అస్సాంలో చేపట్టారు. అయితే అక్కడ ఎన్ఆర్సీ పూర్తయినప్పటి నుంచి జాతీయ స్థాయిలో అమలుకు డిమాండ్లు పెరుగుతున్నాయి. హోం మంత్రి అమిత్ షాతోపాటు బీజేపీ అగ్రనేతలు పలువురు ఇందుకు బహిరంగంగానే మద్దతిచ్చారు. ఈ మేరకు జాతీయ స్థాయిలో ఓ చట్టం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నట్లు అంచనా. దేశవ్యాప్త ఎన్ఆర్సీ చట్టం అమల్లోకి వస్తే.. ప్రభుత్వం ఈ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తించడంతోపాటు అదుపులోకి తీసుకునేందుకు అవకాశముం టుంది. వారిని స్వదేశాలకు తిప్పి పంపేందుకూ అధికారాలు లభిస్తాయి. నష్టం ఎవరికి? ప్రస్తుతానికి ఎన్ఆర్సీ చట్టం అనేది ఓ ప్రతిపాదన మాత్రమే. అమల్లోకి వస్తే అక్రమ వలసదారులే లక్ష్యంగా మారతారు. అయితే అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైన్, పార్శీలకు పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. మతపరమైన హింసను స్వదేశాల్లో ఎదుర్కొన్నందుకే ఇక్కడకు వచ్చామని వారు చెప్పుకుంటే సరిపోతుంది. ఇంకోలా చెప్పాలంటే ఎన్ఆర్సీ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే పైన చెప్పుకున్న మూడు దేశాలు మినహా మిగిలిన ఏ దేశపు అక్రమ వలసదారు కూడా ఇక్కడ ఉండేందుకు అవకాశం ఉండదు. అంతేకాకుండా.. ఈ దేశాల నుంచి వచ్చిన ముస్లింలూ చిక్కుల్లో పడతారు. ఎందుకంటే వీరు పౌరసత్వ చట్ట సవరణ నిబంధనల్లో లేరు కాబట్టి. దీంతో వీరందరినీ అదుపులోకి తీసుకుని డిటెన్షన్ కేంద్రాలకు తరలించాల్సి వస్తుంది. అస్సాంలో ఇప్పటికే గుర్తించిన 19 లక్షల మంది అక్రమ వలసదారులను ఇలాగే డిటెన్షన్ కేంద్రాల్లోనే ఉంచారు. దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులను ఇలా డిటెన్షన్ కేంద్రాలకు తరలించిన తరువాత విదేశీ వ్యవహారాల శాఖ ఆయా దేశాలకు సమాచారం ఇస్తుంది. ఆయా దేశాలు అంగీకరిస్తే వారిని తిప్పి పంపుతారు. దేశవ్యాప్త ఎన్ఆర్సీకి కట్టుబడి ఉన్నామని అమిత్ షా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెడతారా? అన్నది ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశం అవుతోంది. ఎన్ఆర్సీపై ప్రశాంత్ కిషోర్ భగ్గు! అక్రమ వలసదారులను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ నిర్వహిస్తామన్న అధికార బీజేపీ ప్రకటనలపై ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ భగ్గుమంటున్నారు. ఈ చర్య పెద్దనోట్ల రద్దు మాదిరిగానే పేదలు, దిగువ తరగతి వారికి తీవ్ర నష్టం చేయనుందని ఆయన ట్వీట్ చేశారు. -
మనోళ్లు గూగుల్‌ను ఏమడిగారో తెలుసా?
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 అంటే ఏమిటి ?, అయోధ్య కేసు ఏమిటి ?, జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) అంటే ఏమిటి ? ఇవీ గూగుల్‌ను భారతీయులు ఎక్కువగా అడిగిన ప్రశ్నలు. 2019ఏడాదికిగాను వీటి గురించే అత్యధికంగా వెదికారని గూగుల్ 2019 నివేదిక తెలిపింది. ఎగ్జిట్ పోల్స్, బ్లాక్‌హోల్, హౌడీ–మోడీలను శోధించారు. క్రికెట్ వరల్డ్ కప్‌తోపాటు లోక్‌సభ ఎన్నికల గురించి అత్యధిక మంది సెర్చ్ చేశారు. ఓటేయడం ఎలా ? ఓటరు లిస్టులో పేరును ఎలా చూసుకోవాలి వంటి ప్రశ్నలను గూగుల్‌ను అడిగారు. చంద్రయాన్–2, నీట్ ఫలితాలు, పీఎం కిసాన్ యోజన, కబీర్ సింగ్, అవెంజర్స్ ఎండ్ గేమ్, కెప్టెన్ మార్వెల్ గురించీ వెదికారు. వ్యక్తుల గురించి చేసిన శోధనలో.. ‘ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్’ తొలిర్యాంక్ సాధించారు. తర్వాత లతా మంగేష్కర్, యువరాజ్ సింగ్, ‘సూపర్ 30’ ఆనంద్‡ వంటివారు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగాచూస్తే గేమ్ ఆఫ్ థ్రోన్స్ టీవీ షో గురించి వెదికారు. -
మరో అయోధ్య కానున్న ‘పౌరసత్వం’
ఆర్థిక కారణాలతో అస్సాంలోకి ముస్లింల వలస ప్రారంభం కాగా, విభజన తర్వాత హిందువుల వలస దానికి తోడైంది. 1947కి ముందే వచ్చిన ముస్లింలు చాలావరకు అస్సాంలోనే ఉండిపోగా, తర్వాత హిందువులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి చేరారు. దీంతో మొత్తం భూభాగంలోని జాతుల సమతూకం మారిపోయింది. జాతీయ పౌర పట్టిక ప్రకారం అనర్హులుగా తేలిన 19 లక్షలమందిలో 60 శాతం వరకు ముస్లిమేతరులే. ఈ చిక్కుముడిని విప్పడం కష్టమే కాబట్టి పౌరసత్వ సవరణ బిల్లును బీజేపీ ప్రజ లను విభజించే ఎత్తుగడతో తీసుకొస్తోంది. ప్రత్యర్థులు వెంటనే ఈ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తారు. ముస్లింలను బుజ్జగిస్తున్నవారిగా బీజేపీ వారిపై ఆరోపణలకు దిగుతుంది. అంటే వచ్చే మూడు దశాబ్దాల్లో పౌరసత్వ సవరణ అంశం మరొక రామ మందిరం, లేక ఆర్టికల్ 370గా మారిపోతుంది. దీని వెనుక ఉన్న విభజన రాజకీయాలివే. గత కొన్ని రోజులుగా పౌరసత్వ చట్టం, 1955 లేక పౌరసత్వ సవరణ బిల్లు, 2019 (సీఏబీ)కు తాజా సవరణలపై అనేకమంది మద్దతిస్తూ దేశవిభజనను తిరిగి సమీక్షించాలని కోరుతున్నారు. పూర్తికాని వ్యవహారాన్ని మళ్లీ సమీక్షించాలి అనే మాట చెప్పనప్పటికీ, పూర్తి న్యాయం, ముగింపు, ముస్లిమేతర మైనారిటీలకు న్యాయం చేయడం అని చెప్పడంలో వీరు వెనుకాడటం లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని మైనారిటీలకు చేసిన వాగ్దానాన్ని పౌరసత్వ సవరణ బిల్లు నెరవేరుస్తుందని వీరు నొక్కి చెబుతున్నారు. ఆ వాగ్దానం చర్చనీయాంశమే. ఉపఖండంలోని ముస్లింలకు మాతృభూమి కావాలనే ఊహను ప్రతిపాదించి, దాని కోసం పోరాడి, చివరకు పాకిస్తాన్‌ని సాధించడంలో విజయం పొందారనడంలో సందేహమే లేదు. విభజనకాలంలో మతపరంగా ప్రజలను అటూ ఇటూ మార్పిడి చేసుకున్నారన్నదీ వాస్తవమే. అయితే ప్రజల మార్పిడి ప్రక్రియ రక్తపాతంతో, మారణ కాండతో, అత్యాచారాలతో సాగింది. కొన్నేళ్లలోపే ఉపఖండం పశ్చిమప్రాంతంలో ఈ ప్రజల మార్పిడి ప్రక్రియ పూర్తయింది, దాదాపు ముగిసిపోయింది. భారత్ భూభాగంలోని పంజాబ్‌లో, ముస్లింలు, పాకిస్తాన్ భూభాగంలో హిందువులు, సిక్కులు చాలా తక్కువమంది మాత్రమే ఉండిపోయారు. 1960ల మధ్య వరకు విభజనకు సంబంధించి కొన్ని వింత ఘటనలు కొనసాగాయి. పాకిస్తాన్ కెప్టెన్‌గా వ్యవహరించిన క్రికెటర్ అసిఫ్ ఇక్బాల్ 1961లో మాత్రమే పాకిస్తాన్‌కు వలస వెళ్లాడు. అప్పటివరకు అతడు హైదరాబాద్ జట్టు తరపున ఆడేవాడు. 1965 యుద్ధ కాలంలో చిన్న అలజడి చెలరేగింది కానీ త్వరలోనే అది ముగిసిపోయింది. కానీ తూర్పు భారత్‌లో విభిన్న చిత్రం చోటు చేసుకుంది. అనేక సంక్లిష్ట కారణాల రీత్యా తూర్పు పాకిస్తాన్, భారత్‌కి చెందిన పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపురల మధ్య జనాభా మార్పిడి పూర్తి కాలేదు. బెంగాల్‌లోని అనేక వర్గాలకు చెందిన ముస్లింలు.. అలాగే తూర్పు బెంగాల్(పాకిస్తాన్)లోని హిందువులు భారత్‌లోనే ఉండిపోయారు. కానీ ఎత్తుకు పైఎత్తులు చోటు చేసుకోవడంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణలు కొనసాగాయి. అందుకే ఇలాంటి ఘటనలను నిలిపివేయడానికి 1950లోనే జవహర్లాల్ నెహ్రూ, నాటి పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ ఆలి ఖాన్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే చారిత్రాత్మకమైన నెహ్రూ–లియాఖత్ ఒప్పందం. ఈ ఒప్పందంలో అయిదు ప్రధాన అంశాలున్నాయి 1. ఇరుదేశాలూ తమ భూభాగంలోని మైనారిటీలను పరిరక్షిస్తూనే.. ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయాలు, సాయుధ బలగాల్లో చేర్చుకోవడంతోపాటు అన్ని హక్కులు, స్వేచ్ఛలను వారికి కల్పిం చాలి. 2. దాడుల కారణంగా తాత్కాలికంగా గూడు కోల్పోయి, వలసపోయినప్పటికీ, తిరిగి తమ ఇళ్లకు చేరుకోవాలని భావిస్తున్నవారికి ఇరుదేశాలూ ఆశ్రయం కల్పించి, పరిరక్షించాలి. 3. అలా వెనక్కు తిరిగి రాని వారిని రెండు దేశాలూ తమతమ పౌరులుగానే భావిం చాలి. 4. ఈలోగా, ఇరు దేశాల్లో ఉండిపోయిన వారు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చు, ఇప్పటికీ తామున్న దేశం నుంచి మరొక దేశంలోకి వలస వెళ్లాలని కోరుకుంటున్నవారికి ఇరుదేశాలూ రక్షణ కల్పించి సహకరించాలి. 5. ఇరుదేశాలు శాంతిభద్రతలను కాపాడటానికి నిజాయితీగా ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే ప్రజలు తాము కోరుకున్న భూభాగాలపై సురక్షితంగా ఉన్నట్లు భావించగలరు. ఈ ఒప్పంద సూత్రాలను బట్టే, భారత్ తన జనాభా గణనను చేపట్టి, 1951లో ప్రథమ జాతీయ పౌర పట్టికను (ఎన్ఆర్సీ) రూపొం దించింది. భారత్‌లో ముస్లిం జనాభా శాతం.. హిందువులు, సిక్కుల జనాభా కంటే కాస్త అధికంగానే పెరుగుతూవచ్చిందని, అదే సమయంలో తూర్పు, పశ్చిమ పాకిస్తాన్లో మైనారిటీలుగా ఉంటున్న హిందువుల జనాభా వేగంగా తగ్గుతూ వచ్చిందని ఇరుదేశాల జనగణన డేటా సూచిస్తోంది. అంటే హిందూ మైనారిటీలు పాక్‌ను, బంగ్లాదేశ్‌ను వదిలిపెట్టి భారత్‌లో స్థిరపడ్డారని చెప్పవచ్చు. దేశవిభజన సమయంలో పూర్తి చేయని కర్తవ్యానికి సమాధానంగా పౌరసత్వ సవరణ బిల్లును తీసుకురావడానికి కారణం ఇదేనని బీజేపీ చెబుతుండవచ్చు. పాకిస్తాన్ నెహ్రూ–లియాఖత్ ఒడంబడికలోని సూత్రాలను పాటించి గౌరవించడంలో విఫలమైందని, దీంతో భారత్ మైనారిటీల సహజ నిలయంగా మారిందని పాక్‌లో మైనారిటీలను నేటికీ పీడిస్తున్నారని బీజేపీ వాదన. ఇక్కడే మనం సంక్లిష్టతల్లోకి కూరుకుపోవడం ప్రారంభిస్తాం. మొదట, భారత్ నిర్మాతలు తమ లౌకిక రిపబ్లిక్ ఇలా ఉండాలని కోరుకున్న చట్రంలో జిన్నా రెండు దేశాల థియరీ ఇమడలేదు. రెండు, ఏ దశవద్ద పాత చరిత్ర ముగిసి కొత్త చరిత్ర ప్రారంభం కావాలి? ఇక మూడోది, దేశీయతతో కూడిన జాతీయ సమానార్థకమైనది ఏది? మతం జాతి, భాషతో సమానమైనదా? తూర్పు భారత్‌లో ప్రత్యేకించి అస్సాంలో వలసల స్వభావం, సంక్లిష్టతను అర్థం చేసుకోవడానికి మనం కొన్ని దశాబ్దాల వెనక్కు వెళ్లడం అవసరం. అస్సాం సాపేక్షికంగా తక్కువ జనసాంద్రత కలి గిన విశాలమైన సారవంతమైన భూములతో, సమృద్ధిగా జలవనరులతో కూడిన ప్రాంతం. అందుకే ఈ రాష్ట్రంలోకి 20వ శతాబ్దిలో తూర్పు బెంగాల్ నుంచి తొలి దశ వలసలకు దారితీసింది. వీరిలో చాలామంది ఆర్థిక కారణాలతో వచ్చినవారే. భూములకోసం, మంచి జీవితం కోసం వీరొచ్చారు. ఇలా మన దేశంపైకి వలసరూపంలో చేసిన ఆక్రమణ గురించి ప్రస్తావించిన తొలి వ్యక్తి బ్రిటిష్ సూపరెంటెండెంట్ సీఎస్ ముల్లన్. 1931లో అస్సాంలో జనగణన కార్యకలాపాలను ఈయనే పర్యవేక్షించారు. తన మాటల్లోనే చెప్పాలంటే.. ‘బహుశా, గత 25 ఏళ్లలో అస్సాం ప్రావిన్స్‌లో జరిగిన అత్యంత ముఖ్యమైన ఘటన, అస్సామీయుల సంస్కృతి, నాగరికతలను పూర్తిగా ధ్వంసం చేసి అస్సాం భవిష్యత్తునే శాశ్వతంగా మార్చివేయగలిగిన ఘటన ఏమిటంటే, తూర్పు బెంగాల్ జిల్లాల నుంచి ప్రత్యేకించి మైమెన్సింగ్ జిల్లా నుంచి భూదాహంతో వలసవచ్చిన ముస్లింల భూ ఆక్రమణే’ అని సీఎస్ ముల్లాన్ పేర్కొన్నారు. ‘ఎక్కడ శవాలు ఉంటే అక్కడికి రాబందులు వచ్చి కూడతాయి. ఎక్కడ బీడు భూములుంటే అక్కడికల్లా మైమెన్సింగ్ జిల్లా నుంచి వలస వచ్చినవారు గుమికూడతార’ని ఆయన ముగించారు. మరి అస్సాం ప్రజల జాతి, భాషా పరమైన ఆందోళనలు దీన్ని చూస్తే ఏమౌతాయో మరి. ఆర్థిక కారణాలతో అస్సాంలోకి ముస్లింల వలస ప్రారంభంలోనే సమస్య కాగా, విభజన తర్వాత హిందువుల వలన దానికి మరింత తోడైంది. కాగా 1947కి ముందే వచ్చిన మైమెన్సింగ్ జిల్లాకు చెందిన ముస్లింలు చాలావరకు అస్సాంలోనే ఉండిపోగా, తర్వాత హిందువులు కూడా గుంపులు గుంపులుగా వచ్చి చేరారు. దీంతో మొత్తం భూభాగంలోని జాతుల సమతూకం మారిపోయింది. ఇదే సమస్యకు ప్రధాన కారణం. అస్సాం ఆందోళనలకు సమాధానం ఇవ్వడంలో పౌరసత్వ సవరణ చట్టం విఫలమవుతుండటానికి ఇదే ప్రధాన కారణం. మతంపై కాకుండా, జాతి, సంస్కృతి, భాష, రాజకీయ అధికారం వంటి అంశాల్లోనే అక్కడ అధిక ఆందోళనలు చోటుచేసుకుం టున్నాయి. గత మూడు దశాబ్దాలుగా దీన్ని మార్చడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీలు ప్రయత్నిస్తూ వచ్చాయి. పైగా ముస్లిం వలసప్రజలు దేశ విభజనకు ముందే వచ్చారు వీరికి పౌరసత్వాన్ని నిరాకరించలేరు. బెంగాలీ హిందువులు ఇటీవలి కాలంలో వచ్చినవారు. అందుకే జాతీయ పౌర పట్టిక ప్రకారం అనర్హులుగా తేలిన 19 లక్షలమందిలో 60 శాతం వరకు ముస్లిమేతరులే ఉండటం ఈ నిజాన్ని సూచిస్తోంది. ఇక్కడే బీజేపీ ఇరుక్కుపోతోంది. పౌరసత్వ చట్టాన్ని అమలు చేసినట్లయితే, ముస్లింల కంటే హిందువులనే ఎక్కువగా దేశం నుంచి పంపించేయాల్సి ఉంటుంది. తాజా పౌరసత్వ సవరణ చట్టంతో దీన్ని పరిష్కరించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ దీనికి అస్సామీయులు అంగీకరించడం లేదు. తాజాగా తీసుకొస్తున్న జాతీయవ్యాప్త పౌరసత్వ సవరణ పట్టికతో పౌరసత్వ చట్టాన్ని కలిపినట్లయితే ప్రారంభంలోనే అది చచ్చి ఊరుకుంటుందని బీజేపీకి తెలుసు. అందుకే దీన్ని ప్రజలను విడదీసే సాధనంగా బీజేపీ ఎక్కుపెట్టింది. ప్రత్యర్థులు వెంటనే ఈ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తారు. ముస్లింలను బుజ్జగిస్తున్నవారిగా వారిపై బీజేపీ ఆరోపణలకు దిగుతుంది. అప్పుడేం జరుగుతుంది? వచ్చే మూడు దశాబ్దాల్లో జాతీయ పౌరసత్వ సవరణ అంశం మరొక రామ మందిరం, లేక ఆర్టికల్ 370గా మారిపోతుంది. ఈ అంశం వెనుక దాగిన విభజన రాజకీయాలు ఇవే మరి. వ్యాసకర్త, శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, twitter@shekargupta -
మెరుగైన భవిష్యత్తుకే!
న్యూఢిల్లీ: మెరుగైన భవిష్యత్తును కల్పించే ఉద్దేశంతోనే విదేశాల్లో వేధింపులు ఎదుర్కొన్న వారికి భారత పౌరసత్వం కల్పిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు, హింస ఎదుర్కొన్న ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిన తరువాత తొలిసారి ప్రధాని ఈ విధంగా స్పందించారు. భరతమాతపై విశ్వాసమున్న, విదేశాల్లో వేధింపులు ఎదుర్కొన్న వారికి మెరుగైన భవిష్యత్తును హామీ ఇస్తూ భారత్‌కు స్వాగతం పలుకుతున్నాం’ అని హిందూస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో శుక్రవారం మోదీ వ్యాఖ్యానించారు. అయోధ్య తీర్పుపై స్పందిస్తూ.. ‘తీర్పు వల్ల సమాజంలో అశాంతి నెలకొనే అవకాశముందని తీర్పునకు ముందు చాలామంది అనుమానించారు. కానీ వారి అనుమానాలు తప్పని ప్రజలు నిరూపించారు’ అన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై.. ‘అది రాజకీయంగా కష్టమైన చర్యగా కనిపించవచ్చు, కానీ ఆ నిర్ణయం జమ్మూ, కశ్మీర్, లద్దాఖ్ ప్రజల అభివృద్ధికి ఒక ఆశాకిరణంగా మారింది’ అని స్పందించారు. మారిషస్ ప్రధానితో భేటీ భద్రమైన, స్థిరమైన, ప్రగతిశీల మారిషస్ నిర్మాణానికి తమ సహకారం ఎల్ల వేళలా ఉంటుందని భారత్ హామీ ఇచ్చింది. ప్రధాని మోదీ శుక్రవారం మారిషస్ ప్రధాని ప్రవింద్ జగనాధ్తో భేటీ అయ్యారు. మారిషస్ పార్లమెంట్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రవింద్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్, మారిషస్ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించారు. తమ దేశంలోని అనేక అభివృద్ధి ప్రాజెక్టుల్లో భారత్ భాగస్వామ్యం ఉందని మారిషస్ ప్రధాని గుర్తు చేశారు. మోదీకి ఉద్ధవ్ స్వాగతం పుణె: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి ప్రధాని మోదీని కలిశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ), ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ)ల జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన మోదీకి ఉద్ధవ్ ఠాక్రే పుణె విమానాశ్రయంలో స్వాగతం పలికారు. గవర్నర్ కోశ్యారీ, మాజీ సీఎం ఫడ్నవీస్ కూడా ఉన్నారు. -
ఆ బిల్లుకు నేను పూర్తి వ్యతిరేకం: మాజీ కెప్టెన్
గ్యాంగ్‌టక్: వివాదాస్పద పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లు 'అత్యంత ప్రమాదాకారి' అని భారత పుట్‌బాల్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా(43) అన్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి భారత్‌కు తరలి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు తాను పూర్తి వ్యతిరేకిని అని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లు సిక్కిం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేయలేదని సిక్కింకు చెందిన ఈ ఫుట్‌బాల్ దిగ్గజం అభిప్రాయపడ్డారు. ‘బంగ్లాదేశ్‌కు దగ్గరగా ఉన్న కారణంగా ఇప్పటికే బెంగాల్, ఇతర ఈశాన్య రాష్ట్రాలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇక సిక్కిం రాష్ట్రం కూడా బంగ్లాదేశ్‌కు చాలా దగ్గరగా ఉన్న కారణంగా దీర్ఘకాలంలో ప్రభావితమవుతుంది’ అని 'హమ్రో సిక్కిం పార్టీ' అధినేత భైచుంగ్ భూటియా పేర్కొన్నారు. సిక్కిం క్రాంతికారి మోర్చా, బీజేపీ సారథ్యంలో నడుస్తున్న సిక్కిం ప్రభుత్వం.. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇతర ఈశాన్య బీజేపీ మిత్రపక్షాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అంతేకాక శాసనసభలో ఈ అంశానికి సంబంధించి తాను, తన పార్టీ వ్యతిరేకంగా వాదిస్తామన్నారు. సిక్కిం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు హమ్రో సిక్కిం పార్టీ సిద్ధంగా ఉందని, అవసరమైతే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు, ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసేందుకు సిద్ధమని భైచుంగ్ అన్నారు. సిక్కింలో ఆర్టికల్ 371 (ఎఫ్)లో సిక్కిం సబ్జెక్ట్ యాక్ట్, రాజ్యాంగం ఉందన్నారు. కాగా ముస్లింలపై వివక్ష చూపేందుకు బీజేపీ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తుందని, ఈ మతతత్వ బిల్లుకు వ్యతిరేకమని ప్రతిపక్షాలు వాదిస్తున్న విషయం తెలిసిందే. -
భారత్‌లో ముస్లింలకు చోటెక్కడ?
శ్రీనగర్: వివాదాస్పద పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లుపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మతపరమైన వేధింపులు, వివక్షను ఎదుర్కొంటూ భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు బుధవారం కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దీనిపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తి కూతురు సనా ఇల్తిజా జావేద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముస్లింలపై వివక్ష చూపేందుకే బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిందని, భారత్‌లో ముస్లింలకు చోటులేకుండాపోతోందని ఆవేదన చెందారు. ముస్లింలకు రెండో తరగతి జనాభాగా చూపేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా ఆర్టికల్ 370 రద్దు అనంతరం ముఫ్తి పోలీసులచే నిర్బంధించబడిన విషయం తెలిసిందే. దీంతో ఆమె తల్లి సోషల్ మీడియా ఖాతాను జావేద్ ఉపయోగిస్తున్నారు. భారత్ లౌకికత్వానికి ఈ మతతత్వ బిల్లు వ్యతిరేకమని విపక్షాలు వాదిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వలసలు అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ ప్రతిపాదనపై ఆగ్రహంతో ఉన్నారు. ఇస్లామిక్ దేశాల నుంచి శరణార్ధులుగా వచ్చిన వారిలో హిందువులే అత్యధికంగా ఉంటారు. ముస్లిమేతరులకు పౌరసత్వమిచ్చి వారికి ఎన్నార్సీ నుంచి రక్షణ కల్పించాలని బీజేపీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి, దేశం నుంచి పంపించేందుకు వీలుగా జాతీయ పౌరపట్టిక (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్–ఎన్నార్సీ)ను సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దేశ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పౌరసత్వ బిల్లు రూపకల్పన సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ బిల్లును నేడు కానీ, రేపు కానీ సభలో ప్రవేశపెట్టి, వచ్చే వారం సభ ఆమోదం పొందేలా చూడాలని కేంద్రం ఆలోచిస్తోంది. -
పౌరసత్వ బిల్లుకు కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మతపరమైన వేధింపులు, వివక్షను ఎదుర్కొంటూ భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. భారత్ లౌకికత్వానికి ఈ మతతత్వ బిల్లు వ్యతిరేకమని అవి వాదిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వలసలు అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ ప్రతిపాదనపై ఆగ్రహంతో ఉన్నారు. మూడు ఇస్లామిక్ దేశాల నుంచి శరణార్ధులుగా వచ్చిన వారిలో హిందువులే అత్యధికంగా ఉంటారు. ముస్లిమేతరులకు పౌరసత్వమిచ్చి వారికి ఎన్నార్సీ నుంచి రక్షణ కల్పించాలని బీజేపీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి, దేశం నుంచి పంపించేందుకు వీలుగా జాతీయ పౌరపట్టిక (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్–ఎన్నార్సీ)ను సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దేశ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పౌరసత్వ బిల్లు రూపకల్పన సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ బిల్లును నేడు కానీ, రేపు కానీ సభలో ప్రవేశపెట్టి, వచ్చే వారం సభ ఆమోదం పొందేలా చూడాలని కేంద్రం ఆలోచిస్తోంది. తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్, టీఎంసీ ఈ బిల్లున వ్యతిరేకిస్తున్నాయి. మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం భారత లౌకిక భావనకు వ్యతిరేకమని కాంగ్రెస్ నేత శశి థరూర్ విమర్శించారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని కాంగ్రెస్ నేత, అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ తెలిపారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 12 మంది ఎంపీలు మోదీకి లేఖ రాశారు. లోక్‌సభలో బీజేపీకి ఉన్న మెజారిటీ దృష్ట్యా అక్కడ ఈ బిల్లు ఆమోదం పొందడం సమస్య కాబోదుగానీ, రాజ్యసభలో విపక్షం ఈ బిల్లును అడ్డుకునే అవకాశముంది. గత ప్రభుత్వం ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టింది. అప్పుడు లోక్‌సభలో గట్టెక్కింది. కానీ, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో నిరసనలు చోటు చేసుకోవడంతో రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టలేదు. ఆ తరువాత ఆ ప్రభుత్వ పదవీకాలం ముగిసింది. కేబినెట్ నిర్ణయాల్లో మరికొన్ని.. ► వ్యక్తిగత డేటా ప్రొటెక్షన్ బిల్లుకు ఆమోదం. డేటా సేకరణ, నిల్వ, వినియోగం, సంబంధిత వ్యక్తుల ఆనుమతి, ఉల్లంఘనలకు జరిమానా, శిక్ష.. తదితరాలకు సంబంధించిన సమగ్ర విధి, విధానాలతో బిల్లును రూపొందించారు. ► కేంద్ర సంస్కృత యూనివర్సిటీల ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం. మూడు డీమ్డ్ సంస్కృత యూనివర్సిటీలను సెంట్రల్ యూనివర్సిటీలుగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ► ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 3.7 ఎకరాల స్థలాన్ని ఐటీడీసీ(ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్), ఐటీపీఓ(ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్)లకు రూ. 611 కోట్లకు 99 ఏళ్ల పాటు లీజుకు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం. ఈ స్థలంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్, ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్మిస్తారు. 2021లోగా ఈ నిర్మాణం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ► జమ్మూకశ్మీర్‌లో ఆర్థికంగా వెనకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఉపసంహరించేందుకు ఆమోదం. ఇటీవలి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆ అంశం ఉండటంతో ఈ బిల్లును వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. లోక్‌సభ, అసెంబ్లీల్లో రిజర్వేషన్ల పొడిగింపునకు ఆమోదం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు(ఎస్సీ, ఎస్టీ) రిజర్వేషన్లను పొడిగించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు జనవరి 25, 2020తో ముగియనుండగా, వాటిని జనవరి 25, 2030 వరకు పొడిగించేందుకు నిర్ణయించారు. అయితే, ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లను పొడిగించే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ప్రస్తుతానికి వారికి రిజర్వేషన్లను పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది. ఈ విషయమై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను మీడియా ప్రశ్నించగా, బిల్లును సభలో ప్రవేశపెట్టినప్పుడు అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ప్రస్తుతం పార్లమెంట్లో ఎస్సీ సభ్యులు 84 మంది, ఎస్టీ సభ్యులు 47 మంది ఉన్నారని జవదేకర్ వెల్లడించారు. రాష్ట్రాల శాసనసభల్లో 614 ఎస్సీ, 554 ఎస్టీ సభ్యులున్నారన్నారు. ఏమిటీ బిల్లు? పౌరసత్వ చట్టం, 1955కి తాజాగా కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ కొత్త బిల్లు ప్రకారం పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లలో నివసిస్తూ మత పరమైన హింస, వేధింపుల్ని ఎదుర్కొంటున్న ఆరు వర్గాలకు భారత పౌరసత్వాన్ని కల్పించడానికి వీలుగా చట్టానికి సవరణలు చేస్తున్నారు. హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్సీలు, జైనులు, బుద్ధులకు ఈ కొత్త సవరణ చట్టం ప్రకారం మన దేశ పౌరసత్వం లభిస్తుంది. వీరంతా భారత్‌లో ఉంటూ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, ఆ పత్రాల గడువు తేదీ ముగిసిపోయినా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆరు వర్గాల్లో ముస్లింలు లేకపోవడం మైనారిటీల్లో అసంతృప్తి రాజేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో.. బంగ్లాదేశ్ నుంచి భారీ సంఖ్యలో హిందువులు కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా దేశంలోని ఈశాన్యరాష్ట్రాల్లో ప్రవేశించారు. ఇప్పుడు వారందరికీ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా పౌరసత్వం వస్తుంది. ఇప్పటికే అసోం పౌర రిజిస్టర్ ద్వారా ఎందరో దేశ పౌరసత్వాన్ని కోల్పోయారు. దశాబ్దాల తరబడి ఈ రాష్ట్రాల్లో ఉంటున్న మైనారిటీల భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన నెలకొంది. పార్లమెంటులో బిల్లు గట్టెక్కుతుందా? లోక్‌సభలో ఈ బిల్లుని మొదట 2016లో ప్రవేశపెట్టారు. అధికార బీజేపీకి అసోంలో మిత్రపక్షమైన అసోం గణ పరిషత్(ఏజీపీ) అప్పట్లో దీనిని వ్యతిరేకించింది. కొన్ని సవరణలతో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో ఎన్డీయే ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నందున దీనిపై వ్యతిరేకత వచ్చినా ఆమోద ముద్ర పడుతుంది. ఇక రాజ్యసభలో మాత్రం జేడీ(యూ), అకాలీదళ్ వంటి పార్టీల మద్దతు లేకుండా బిల్లు గట్టెక్కలేదు. రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసుకునేందుకు హోంమంత్రి అమిత్ పలు పార్టీలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. బిల్లుకు అనుకూలం బీజేపీ, అకాలీదళ్, ఏఐఏడీఎంకే బిల్లుకి ప్రతికూలం కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు, మరికొన్ని ప్రాంతీయ పార్టీలు -
వారిని 2024లోపు దేశం నుంచి పంపించేస్తాం: అమిత్‌షా
రాంచీ: దేశంలోకి చట్ట విరుద్ధంగా వలస వచ్చిన ప్రతి ఒక్కరినీ బయటకు పంపించేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశమంతటా నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)ను అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. జార్ఖండ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో అక్రమంగా నివసిస్తున్న చొరబాటు దారులందరినీ 2024లోపు దేశం నుంచి బయటికి పంపించివేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్‌గాంధీ గురించి ప్రస్తావిస్తూ.. చొరబాటుదారులు ఎక్కడికి వెళ్తారు..? ఏం తింటారు..? అంటూ ఆయన అమితమైన ప్రేమ చూపిస్తున్నారని అమిత్‌షా మండిపడ్డారు. కానీ, నేను మీకు హామీ ఇస్తున్నాను. 2024లోపు క్రమక్రమంగా దేశంలోని చొరబాటు దారులందరినీ సరిహద్దు బయటకు పంపించేస్తామని అమిత్‌షా అన్నారు. -
ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా బెంగాల్ తీర్పు
న్యూఢిల్లీ : అస్సాం తరహాలోనే దేశవ్యాప్తంగా జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్ఆర్సీ) కార్యక్రమాన్ని నర్విహిస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పార్లమెంట్ ముఖంగా ప్రకటించడం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలపై ఎంతో ప్రభావాన్ని చూపింది. పర్యవసానంగానే ఖరగ్‌పూర్, కరింపూర్, కలియాగంజ్ నియోజక వర్గాల్లో పాలకపక్ష తృణమూల్ కాంగ్రెస్ చేతుల్లో బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం భారీగా పడిపోయింది. కలియాగంజ్, కరీంపూర్ అసెంబ్లీ స్థానాలను బంగ్లా సరిహద్దుల్లో ఉన్నాయి. వారిలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలతోపాటు హిందువులు కూడా గణనీయంగా ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారిని, ముఖ్యంగా ముస్లింలను వెనక్కి పంపించడం కోసమే అస్సాంలో ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ)’ నిర్వహించిన విషయం తెల్సిందే. వలసవచ్చిన వారిని పక్కన పెడితే స్థానిక భారతీయులు కూడా తమ పౌరసత్వాన్ని నిరూపించుకోలేక పోవడం వల్ల అస్సాంలో ఎన్ఆర్సీ వివాదాస్పదమైంది. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ కార్యక్రమాన్ని చేపడతామంటూ అమిత్ షా ప్రకటించిన వెంటనే తమ రాష్ట్రంలో మాత్రం అందుకు అనుమతించే ప్రసక్తే లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. ఎన్ఆర్సీ కారణంగానే తాను ఓడిపోయినట్లు కలియాగంజ్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కమల్ చంద్ర సర్కార్ తెలిపారు. అస్సాంలో నిర్వహించిన ఎన్ఆర్సీ వేరు, దేశవ్యాప్తంగా నిర్వహించే ఎన్ఆర్సీ వేరని చెప్పడంలో, ఎన్ఆర్సీ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమని, బీజేపీకి సంబంధం లేదని వివరించడంలో విఫలం అవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. మూడు చోట్ల తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో ఓటర్లు గెలిపించడం అంటే ఎన్ఆర్సీని వారు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లే లెక్క! -
ఎన్నార్సీపై పునరాలోచన అవసరం
కొన్నేళ్లుగా అస్సాం పౌరులను హడలెత్తిస్తున్న జాతీయ పౌర నమోదు చిట్టా(ఎన్ఆర్సీ) ‘జాతీయం’ కాబోతోంది. ఈ దేశ పౌరులెవరో, కానివారెవరో ఆరా తీయడానికి త్వరలో అన్ని రాష్ట్రాల్లోనూ దాన్ని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం రాజ్యసభలో చేసిన ప్రకటన సారాంశం. ఆయన అలా ప్రకటించిన కొద్దిసేపటికే అస్సాం ఆర్థికమంత్రి హిమంత బిశ్వ శర్మ రాష్ట్రంలో రూపొందిన ఎన్ఆర్సీ తమకు సమ్మతం కాదని ప్రకటించారు. దాన్ని రద్దు చేసి జాతీయ స్థాయిలో చేపట్టాలనుకుంటున్న ప్రక్రియలో తమనూ చేర్చాలని కోరారు. దీన్నిబట్టే ఎన్ఆర్సీ అక్కడ ఎలాంటి పోకడలకు పోయిందో బోధపడుతుంది. స్థూలంగా చూస్తే ఇరుగు పొరుగు దేశాల నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడుంటున్నవారిని ఏరి పారేయడానికి ఇదొక అద్భుత మైన ప్రక్రియ అనిపిస్తుంది. కానీ లోతులకుపోయి గమనిస్తే ఇందులోని లోపాలు అర్థమవుతాయి. దేశవ్యాప్తంగా అమలు చేయబోయే ఎన్ఆర్సీ ప్రక్రియ రూపురేఖలెలా ఉంటాయో ఇంకా ప్రకటిం చవలసే ఉన్నా, అస్సాంలో అదెంత సొగసుగా జరిగిందో తెలుసుకుంటే దాంతో వచ్చిన సమస్య లేమిటో తెలుస్తాయి. ఆ రాష్ట్రంలోని 3 కోట్ల 30 లక్షలమందికిపైగా పౌరుల పుట్టుపూర్వోత్తరాలను వడబోసి అందులో 40.07 లక్షలమంది ఇక్కడి పౌరులు కారని నిరుడు జూలైలో విడుదల చేసిన తుది ముసాయిదా తేల్చిచెప్పింది. దీనిపై తీవ్ర కల్లోలం చెలరేగిన తర్వాత ఇది తుది ముసాయిదా తప్ప తుది జాబితా కాదని, ఇందులో చోటు దక్కనివారు మళ్లీ తగిన పత్రాలతో కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. వాటన్నిటి ఆధారంగా మరోసారి వడబోత చేసి మొన్న ఆగస్టులో విడుదల చేసిన తుది జాబితా ప్రకారం 3 కోట్ల 11 లక్షల 21 వేలమందికి ఎన్ఆర్సీలో స్థానం దక్కింది. మిగిలిన 19 లక్షల 6వేల 657మంది ఇక్కడి పౌరులు కాదని నిర్ధారించారు. ఈ ప్రక్రియ జనాభా గణన కాదు. ఇంటింటికీ వచ్చి పౌరుల వివరాలడిగి, అవసరమైన పత్రాలు చూపమని ఎవరూ అడగరు. ఎవరికి వారు తాము ఈ దేశ పౌరులమని నిరూపించు కోవాలి. అందుకు అవసరమైన పత్రాలేమిటో తెలుసుకుని వాటిని ఎన్ఆర్సీ సేవా కేంద్రాలకు తీసు కుపోవాలి. అధికారుల అనుమాన దృక్కుల నుంచి తప్పించుకోవాల్సిన బాధ్యత పౌరులదే. ఇది అచ్చంగా అస్సాంలో అమలు చేసిన విధానం. అస్సాంలో 1971 మార్చి 24ను కటాఫ్ తేదీగా లెక్కేసి, ఆ తేదీనాటికి నివాసం ఉన్నట్టు చూపే పత్రాలను సమర్పించమని పౌరుల్ని కోరారు. అలా చూపలేనివారిని ఈ దేశ పౌరులుగా ప్రకటించడం సాధ్యం కాదని ప్రకటించారు. జాబితాకెక్కని పౌరుల వివరాలు చూస్తే ఏ వర్గాలు ఇందువల్ల చిక్కుల్లో పడ్డాయో తెలుస్తుంది. నిరుపేదలు, నిరక్షరాస్యులు, మహిళలు వీరిలో అధికంగా ఉన్నారు. ఇంకా లోతులకు పోయి చూస్తే బిచ్చగాళ్లు, ఇల్లూ వాకిలీ లేనివారు ఎక్కువ. చిత్రమేమంటే ఒకే కుటుంబంలో భార్య ఎన్ఆర్సీలో ఉంటే... భర్తకు అందులో చోటు దక్కలేదు. అన్నదమ్ముల్లో కొందరు జాబితాలోకెక్కితే మరికొందరికి ఆ అదృష్టం దక్కలేదు. సైన్యంలో రిటైరై, అస్సాం సరిహద్దు పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసే మహమ్మద్ సనావుల్లా ఉదంతం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన పేరు గల్లంతు కావడంతో అరెస్టు చేసి నిర్బంధ శిబిరానికి తరలించగా, జాబితాలో చోటు సంపాదించుకున్న కుటుంబసభ్యులు లబోదిబోమంటూ గువాహటి హైకోర్టును ఆశ్రయించాక బెయిల్ దొరికింది. ఇప్పుడు జాబితాలో చోటుదక్కని వారంతా వేర్వేరు నిర్బంధ శిబిరాల్లో ఉన్నారు. వీరి విషయంలో ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవాలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఖరారు చేయాల్సి ఉంది. ‘కాలు తొక్కిన్నాడే కాపురం తీరెలా ఉందో తెల్సింద’న్నట్టు 2010లో ఈ ప్రక్రియకు సంబం ధించిన పైలెట్ ప్రాజెక్టును అస్సాంలోని బార్పేట, కామ్రూప్ జిల్లాల్లోని రెండు తహసీళ్లలో అమలు చేసినప్పుడే ఇదెలాంటి విద్వేషాలు రగులుస్తుందో అధికారులకు అర్ధమైంది. అప్పట్లో ఆగ్ర హావేశాలతో రగిలిపోయిన గుంపు బార్పేట డెప్యూటీ కమిషనర్ కార్యాలయంపై దాడిచేసి హింసకు పాల్పడినప్పుడు పోలీసు కాల్పుల్లో నలుగురు మరణించారు. ఆ తర్వాత ఆ ప్రక్రియను అటకెక్కించారు. బహుశా 2013లో సుప్రీంకోర్టు ఒత్తిడి చేయకపోయి ఉంటే అదింకా ఆ స్థితిలోనే ఉండేది. కానీ అస్సాంలో ఎన్ఆర్సీ అమలు చేసి తీరాల్సిందేనంటూ సుప్రీంకోర్టు పట్టుబట్టడంతో దానికి కదలిక వచ్చింది. 2015 జూలైలో ధర్మాసనం మార్గదర్శకాలు విడుదల చేశాక ఈ ప్రక్రియ రాష్ట్రమంతటా మొదలైంది. మొదటినుంచీ దీనిపై పట్టుదలగా ఉన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ ఎన్ఆర్సీని ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించిన మౌలిక పత్రమని ప్రశంసించి ఉండొచ్చు... కానీ అస్సాంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలకే ఆ జాబితా మింగు డుపడటం లేదు. ఉండకూడని వాళ్లంతా ఆ జాబితాకెక్కగా, అర్హులైనవారెందరో దానికి వెలుపల ఉండిపోయారని హిమంత బిశ్వశర్మ ఆక్రోశిస్తున్నారు. ఈ జాబితాను అస్సాం సర్కారే తయారు చేసిందని దేశమంతా అనుకుంటుండగా, ఎన్ఆర్సీ రాష్ట్ర సమన్వయకర్తగా పనిచేసి రిటైరైన ప్రతీక్ హలేజా ప్రభుత్వానికి ఏ దశలోనూ, ఏమీ చెప్పలేదని ఆయన ఆరోపిస్తున్నారు. బిశ్వశర్మ కోరు కున్నట్టు ప్రభుత్వ ప్రమేయం ఉంటే ఆ జాబితా ఎవరిని ఒడ్డుకు చేర్చేదో... ఎవరిని వీధులపాలు చేసేదో! అనుభవం గడించాకైనా తత్వం బోధపడాలి. అస్సాంలో జరిగిన గందరగోళ పర్వం గమ నించాకైనా, జాబితాలో చోటు సంపాదించలేనివారి బాధామయ గాధలు చూశాకైనా దేశవ్యాప్తంగా దీని అమలు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో పాలకులు గ్రహించాలి. సాక్షాత్తూ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక చిన్న రాష్ట్రంలో సాగిన ప్రక్రియే ఇంత లోపభూయిష్టంగా ఉంటే... దేశమంతా ఎన్ని సంక్లిష్ట సమస్యలు తలెత్తుతాయో ఊహించుకోవాల్సిందే. ఈ బృహత్తర కార్యక్రమం విష యంలో ఎన్డీఏ పాలకులు ఆచి తూచి అడుగేస్తారని ఆశిద్దాం. -
కొండను తవ్వి ఎలుకను పట్టి, ఇప్పుడు మళ్లీ..
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ) తయారు చేస్తామన్న కేంద్రం ప్రకటనపై ఏఐఎంఐఎం చీఫ్, ఎపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఎన్ఆర్సీ పేరుతో అస్సాంలో హడావుడి చేసిన మోదీ ప్రభుత్వం... చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అదే పనిని దేశవాప్తంగా చేసేందుకు సిద్దమయ్యారని విమర్శించారు. ‘ఎన్ఆర్సీ కారణంగా అస్సాం ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అయినప్పటీకి కేంద్రం సాధించిందేమి లేదు. 40లక్షల మంది అక్రమంగా చొరబడ్డారని చెప్పిన అమిత్ షా.. చివరకు 19లక్షల మందిని మాత్రమే ఎన్ఆర్సీ జాబితా నుంచి తొలగించారు. అదీ కూడా అక్రమంగా తొలగించారు. ఎన్ఆర్సీలో నమోదు కానీ భారతీయులను అదుపులోకి తీసుకొవాలని కేంద్రం యోచిస్తుంది. మైనార్టీలను దయతో వదివలేయాలని భావిస్తోంది. ప్రపంచంలోని ఏ దేశ ప్రజలు ఇలాంటి కష్టాలను ఎదుర్కొనలేదు’ అని ఓవైసీ పేర్కొన్నారు. (చదవండి : ఇక దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ) ఇక అస్సాం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వాశర్మ కూడా ఎన్ఆర్సీని వ్యతిరేకించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ఆర్సీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అమిత్‌షాను కోరుతున్నానని తెలిపారు. ‘ అస్సాం ప్రభుత్వం ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తోంది. ఎన్ఆర్సీని తొలగించాల్సింది కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రాష్ట్ర ప్రభుతం, బీజేపీ కోరుతోందని తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం రాజ్యసభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితా రూపకల్పనలో మతపరమైన వివక్షలు ఉండవని ఆయన పేర్కొన్నారు. -
ఇక దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం రాజ్యసభలో ప్రకటించారు. ఈ జాబితా రూపకల్పనలో మతపరమైన వివక్షలు ఉండవన్నారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా అమిత్ మాట్లాడారు. ‘అస్సాం తరహాలో జాతీయ పౌర రిజిస్టర్‌ను దేశవ్యాప్తంగా తీసుకువస్తాం. ఏ మతం వారూ భయపడాల్సిన పని లేదు. ఎన్ఆర్సీ గొడుగు కిందకి అందరినీ తీసుకురావడమే దీని ఉద్దేశం. సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ సాగుతుంది’ అని అన్నారు. ‘ఏ మతానికి చెందిన వారైనా భారతీయ పౌరులందరికీ ఈ జాబితాలో స్థానం లభిస్తుంది. ఈ అంశంలో ఎలాంటి వివక్షలకు తావు లేదు’ అని అమిత్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ రిజిస్టర్‌ను రూపొందిస్తే అస్సాంను అందులో కలుపుతామన్నారు. ఎన్ఆర్సీ, పౌరసత్వ సవరణ బిల్లు వేర్వేరు జాతీయ పౌర రిజిస్టర్‌కు, పౌరసత్వ సవరణ బిల్లుకు మధ్య తేడా ఉందన్నారు. హిందువులు, బౌద్ధులు, జైన్లు, క్రిస్టయన్లు, సిక్కులు, పార్సీలు ఎవరైనా కానివ్వండి ఆశ్రయం కోరి వచ్చిన వారిని భారత్ అక్కున చేర్చుకుంటుందన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్‌లలో మతపరమైన అరాచకాలను భరించలేక భారత్‌కు శరణార్థులుగా వచ్చినవారికి జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు కింద పౌరసత్వం ఇస్తామని స్పష్టం చేశారు. జాతీయ పౌరసత్వ బిల్లుని లోక్‌సభ ఆమోదించిందని, సెలెక్ట్ కమిటీ ఆమోదించాక సభ రద్దయిందని, త్వరలో ఈ బిల్లు మళ్లీ సభ ముందుకు వస్తుందని వివరించారు. పౌరసత్వ సవరణ బిల్లుకి, జాతీయ పౌర రిజిస్టర్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు. బెంగాల్లో అనుమతించం: మమత దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్‌ను తయారు చేస్తామన్న కేంద్రం ప్రకటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ మండిపడ్డారు. ‘ నేను అధికారంలో ఉన్నంత వరకు ఎన్ఆర్సీకి అనుమతించను’ అని సగార్దిఘిలో ఒక బహిరంగ సభలో చెప్పారు.‘మీ పౌరసత్వాన్ని ఎవరూ లాక్కోలేరు. మిమ్మల్ని శరణార్థులుగా మార్చలేరు’ అని బెంగాలీలకు హామీ ఇచ్చారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు: అమిత్ షా జమ్ము కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు యధావిధిగా పనిచేస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. అస్సాం ఎన్ఆర్సీ ప్రక్రియపై ఆందోళన వాషింగ్టన్: అస్సాంలో రూపొందించిన జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) ప్రక్రియపై అమెరికాకు చెందిన కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్సీఐఆర్ఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియతో భారత్‌లో ఏళ్ల తరబడి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న 19 లక్షల మంది పౌరసత్వాన్ని కోల్పోనున్నారని పేర్కొంది. సరైన నియంత్రణ , పారదర్శకత లేకుండా ఎన్ఆర్సీ ప్రక్రియను చేపట్టడం వల్ల అసలు సిసలు భారతీయులకే దేశంలో చోటు లేకుండా ప్రమాదం ముంచుకొస్తోందని తన నివేదికలో పేర్కొంది. అస్సాంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని, వారిని రాష్ట్రం నుంచి పంపించేయడానికే ఎన్ఆర్సీ ప్రక్రియను నిర్వహించారని యూఎస్సీఐఆర్ఎఫ్ కమిషనర్ అనురిమ భార్గవ ఆరోపించారు. -
దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేస్తాం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పౌరసత్వ నమోదు (ఎన్నార్సీ) కార్యక్రమాన్ని చేపడతామని.. కుల, మత, వర్గాలకు అతీతంగా అందరికీ ఎన్నార్సీ వర్తింపజేస్తామని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం పార్లమెంట్లో స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఏ మతానికి చెందిన వారైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన రాజ్యసభలో పేర్కొన్నారు. భారత పౌరులను గుర్తించే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్నార్సీ) జాబితాలో పేరు లేని వారు తహసీల్ స్థాయిలో ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. ఎన్నార్సీ ప్రకారం 1971 తర్వాత దేశంలోకి వచ్చిన అక్రమ వలసదారులను వెనక్కి పంపనున్నారు. ఇక పౌరసత్వ విషయమై విజ్ఞప్తి చేయలేని నిస్సహాయ పేదవారికి వెసులుబాటు కల్పించి.. అసోం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుందని వివరించారు. అంతేకాక పిటిషన్లు దాఖలు చేయడానికి డబ్బు లేని వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని అమిత్ షా తెలిపారు. కాగా అసోం ప్రభుత్వం ఆగస్టు 31న విడుదల చేసిన తుది ఎన్నార్సీ జాబితాలో 19 లక్షల మందిని అక్కడి పౌరులుగా గుర్తించలేదు. -
పౌరసత్వ బిల్లులో కీలక మార్పులు
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లులో కొన్ని మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. గత లోక్‌సభ రద్దైన నేపథ్యంలో ఆ బిల్లుకు కూడా కాలం చెల్లిన విషయం తెలిసిందే. దాంతో, కొత్తగా కొన్ని కీలక మార్పులతో ఆ బిల్లును మళ్లీ సభ ముందుకు తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా, ‘అక్రమ వలసదారులు’ అనే పదానికి నిర్వచనాన్ని కూడా బిల్లులో చేర్చనున్నారని సోమవారం అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులకు తట్టుకోలేక భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లు, పార్శీలకు.. వారివద్ద సరైన పత్రాలు లేనప్పటికీ.. భారతీయ పౌరసత్వం కల్పించే దిశగా పౌరసత్వ చట్టం, 1955లో సవరణ చేపట్టేందుకు ఉద్దేశించిన బిల్లు అది. ఇది బీజేపీ ప్రచారాస్త్రాల్లో ఒకటి. -
మోదీ అజెండాలో ముందున్న అంశాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ రెండోసారి లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచే పార్టీ ఎజెండాలో పేర్కొన్న ఒక్కొక్క అంశాన్నే ప్రజల ముందుకు తీసుకొచ్చి పరిష్కరిస్తుందని రాజకీయ పండితులు ముందుగానే భావించారు. దాన్ని నిజం చేస్తూ మోదీ ప్రభుత్వం, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఊహించిన దానికన్నా ముందే అయోధ్య వివాదాన్ని తీసుకొచ్చి కోర్టు సహకారంతో పరిష్కరించింది. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తామని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ అది ఇంత సులభంగా సాధ్యం అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇక ఇప్పుడు బీజేపీ అజెండాలోని ఏ అంశాలు పరిష్కారానికి ముందుకు రానున్నాయి. అసోం నుంచి బంగ్లాదేశ్ ముస్లిం శరణార్థులను వెనక్కి పంపించేందుకు చేపట్టిన కసరత్తు గత రెండు, మూడేళ్లుగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. దాదాపు 20 లక్షల మంది ప్రజలు బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా అస్సాంలో ఉంటున్నట్లు ‘జాతీయ పౌరసత్వం నమోదు’ కార్యక్రమం తేల్చింది. అంటే వారంతా అసోం స్థానిక పౌరులమని నిరూపించుకోలేక పోయారు. వారి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలే కాకుండా బెంగాల్ నుంచి వచ్చిన ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు కూడా ఉన్నారు. ముస్లింలకు మినహా మిగతా మతస్థులకు భారత పౌరసత్వం కల్పించి, ముస్లింలను బంగ్లాదేశ్‌కు పంపించాలన్న బీజేపీ అజెండా. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ సిద్ధం చేసింది. దాన్ని ఆమోదించి, ముస్లింలను వెనక్కి పంపించే ప్రక్రియను ఇప్పుడు చేపట్టాల్సి ఉంది. ముస్లిం మహిళల కోసం ‘ట్రిపుల్ తలాక్’ను నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశంలోని అన్ని మతాల వారికి వర్తించే ‘ఉమ్మడి పౌర స్పృతి’ని తీసుకురానుంది. అప్పుడు ఇప్పుడున్నట్లుగా ముస్లింలకు ప్రత్యేక వివాహ చట్టాలు ఉండవు. ఆ తర్వాత పటిష్టమైన మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకరానుంది. ప్రస్తుతం రాష్ట్రాల వారిగా ఈ చట్టాలు ఉన్నాయి. కేంద్ర స్థాయిలో లేదు. హిందువులైన దళితుల్లో ఎక్కువ మంది క్రైస్తవంలోకి మారుతున్నందున దాన్ని నివారించడం కోసం ఈ చట్టాన్ని తీసుకొస్తానని బీజేపీ మొదటి నుంచి చెబుతోంది. ఇది సరే, పార్టీ అజెండా అమలు చేయడంపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించిన బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక దుస్థితిపై దృష్టిని కేంద్రీకరించక పోవడంతో అది మరింతగా దిగజారుతోంది. దేశంలో గత 49 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 6.1 శాతంతో గరిష్ట స్థాయికి చేరుకుందని నివేదికలు పేర్కొన్నాయి. అయినా సరైన చికిత్సా చర్యలు లేకపోవడంతో ఆ సమస్య ఇప్పుడు దాదాపు 8 శాతానికి చేరుకుంది. -
హజేలాను వెంటనే పంపండి: సుప్రీం
న్యూఢిల్లీ: అస్సాం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) సమన్వయకర్తగా పనిచేస్తున్న ప్రతీక్ హజేలాను వెంటనే మధ్యప్రదేశ్‌కు పంపాలని కేంద్రానికి, అస్సాం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. సాధ్యమైనంత ఎక్కువ కాలం అతడిని పంపేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం సూచించింది. 1995 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన హజేలా మధ్యప్రదేశ్‌కు చెందినవారు. ఆయన స్వరాష్ట్రానికి ఆయన్ను డిప్యుటేషన్ మీద పంపాలని కోర్టు సూచించింది. ప్రస్తుతం ఆయన అస్సాంలో ఎన్నార్సీ జాబితా మీద పనిచేస్తున్నారు. బదిలీ వెనుక కారణమేమిటని కేంద్రం తరఫున వాదిస్తున్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ప్రశ్నించారు. కారణం లేకుండా చర్యలు తీసుకుంటామా ? అని కోర్టు తిరిగి ప్రశ్నించింది. ఆయన్ను పంపడానికి గల కారణాన్ని మాత్రం సుప్రీంకోర్టు వెల్లడించలేదు. ఈ క్రమంలో ఆయనకు ప్రమాదం ఉందంటూ పలు ఊహాగాలను ఊపందుకున్నాయి. అస్సాం ఎన్నార్సీ చివరి దశకు చేరుకోవడంతో ఆ అంశం సున్నితత్వం రీత్యా దాడులు జరిగేందుకు అవకాశం ఉందని అందుకే బదిలీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించిందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. అస్సాం ఎన్నార్సీ పిటిషన్‌ను నవంబర్ 26న మళ్లీ విచారించనుంది. అస్సాం నుంచే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీకాలం నవంబర్ 17తో ముగియనుంది. -
భయాందోళనలు సృష్టించేందుకే ఎన్నార్సీ
కోల్‌కతా: దేశ లౌకిక విలువల్ని ధ్వంసం చేసి, ప్రజల్లో భయాందోళనలను సృష్టించేందుకే కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నార్సీ, పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. భారత జాతీయతా భావం స్థానంలో హిందూ జాతీయతా భావాన్ని చొప్పించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. సీపీఐ 100వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘విద్వేషాలను రెచ్చగొట్టేందుకు మత శక్తులు పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ ప్రభుత్వం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ), పౌరసత్వ (సవరణ)బిల్లును తీసుకువచ్చింది. కొన్ని వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని విభజనలు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’అని ఆరోపించారు. భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు చేస్తున్న ఈ కుట్ర రాజ్యాంగ విలువలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. కాగా, ఒకప్పటి యూఎస్ఎస్ఆర్లో భాగంగా ఉన్న ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో 1920 అక్టోబర్ 17వ తేదీన భారతీయ నాయకుల నేతృత్వంలో ఇండియన్ కమ్యూనిస్టు పార్టీ(ఐసీపీ)అవతరించింది. -
‘2024 నాటికి వారిని దేశం నుంచి పంపిస్తాం’
చండీగఢ్: అస్సాంలో ఎన్ఆర్సీని విజయవంతంగా అమలు చేసిన బీజేపీ.. త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న అమిత్ షా ఎన్ఆర్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గెంటేస్తామని తెలిపారు. హరియాణా కథియాల్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ.. ‘ఆర్టికల్ 370ని రద్దు చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. అది మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మెండుగా ఉంది. 2024లో మరోసారి ఓట్ల కోసం మీ ముందుకు వస్తాం. కానీ ఆ లోపే బీజేపీ ప్రభుత్వం దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని దేశం నుంచి పంపించి వేస్తుంది. దాదాపు 70 ఏళ్లుగా ఈ అక్రమ వలసదారులు మన ప్రజలకు అందుతున్న అన్ని సౌకర్యాలను అనుభవిస్తూ.. ధైర్యంగా ఉంటున్నారు. బీజేపీ, మోదీ ప్రజలకు మాట ఇచ్చారు. ఇక మీదట ఈ అక్రమ వలసదారులు దేశంలో ఉండబోరు’ అన్నారు. అలానే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు అమిత్ షా. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, అక్రమ వలసదారుల గెంటివేత వంటివి దేశానికి మేలు చేసే అంశాలని.. కానీ అవి కాంగ్రెస్‌కు రుచించడం లేదని అమిత్ షా మండిపడ్డారు. (చదవండి: దేశమంతటా పౌర రిజిస్టర్) -
బంగ్లాదేశ్‌తో మరింత సహకారం
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు భారత్, బంగ్లాదేశ్ అంగీకరించాయి. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం రెండు దేశాల అధికారులు ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. తీరం ప్రాంతంలో ఉమ్మడి గస్తీ సహా మూడు ప్రాజెక్టుల ప్రారంభానికి అంగీకరించారు. కాగా, చర్చల సందర్భంగా అస్సాం ఎన్నార్సీ అంశాన్ని బంగ్లాదేశ్ ప్రధాని ప్రస్తావించారు. నాలుగు రోజుల పర్యటనకు ఈ నెల 3వ తేదీన భారత్ చేరుకున్న ప్రధాని హసీనా 3, 4 తేదీల్లో ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు. చర్చల సందర్భంగా ఇద్దరు ప్రధానులు వీడియో లింకేజీ ద్వారా.. బంగ్లాదేశ్ నుంచి ఎల్పీజీ గ్యాస్‌ను ఈశాన్య రాష్ట్రాలకు తరలించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టును, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నిర్మించిన వివేకానంద భవన్‌ను, ఖుల్నాలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించారు. అనంతరం ఇద్దరు ప్రధానులు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఏడాది కాలంలో రెండు దేశాలు 12 ఉమ్మడి ప్రాజెక్టులను ప్రారంభించడం మైత్రీబంధాన్ని ప్రతిఫలిస్తోందని వారు పేర్కొన్నారు. ఎన్నార్సీపై ప్రధాని హసీనా ఆరా అక్రమంగా వలస వచ్చిన బంగ్లా దేశీయులను గుర్తించేందుకు ఉద్దేశించిన అస్సాం ఎన్నార్సీ విషయాన్ని ప్రధాని మోదీతో చర్చల సందర్భంగా హసీనా ప్రస్తావించారు. అయితే, అస్సాంలో ఎన్నార్సీ ప్రచురణ ప్రక్రియ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సాగుతున్న కార్యక్రమమని, దీనిపై తుది ఫలితం ఏమిటనేది తేల్చాల్సి ఉందని ప్రధాని వివరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే, మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం నుంచి వచ్చిన రొహింగ్యా శరణార్థుల సమస్యను కూడా ప్రధానులిద్దరూ చర్చించారు. శరణార్థులను వీలైనంత ఎక్కువ మంది, సత్వరమే, సురక్షితంగా వెనక్కి పంపించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. తీస్తా జలాల పంపిణీపై 2011లో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై తొందరగా సంతకాలు తాము కోరుకుంటున్నామని హసీనా పేర్కొనగా ఇందుకు సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారని అధికారులు వెల్లడించారు. భారత్ నుంచి సరుకు రవాణాకు వీలుగా చట్టోగ్రామ్, మోంగ్లా నౌకాశ్రయాలను వాడుకునేందుకు బంగ్లాదేశ్ అంగీకరించింది. త్రిపురలోని సబ్రూమ్ పట్టణానికి అవసరమైన 1.82 క్యూసెక్కుల తాగు నీటిని బంగ్లా దేశంలోని ఫెని నది నుంచి తీసుకునేందుకు కూడా ఒప్పందం కుదిరింది. తీరప్రాంత భద్రతకు సంబంధించిన ఒప్పందం కీలకమైందని, ఇందులో భాగంగా భారత్ తీరం వెంబడి 25 వరకు రాడార్ స్టేషన్లను ఏర్పాటు చేయనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్, బంగ్లాదేశ్ మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకునే విషయమై అధ్యయనం చేసేందుకు కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా అంగీకారానికి వచ్చారని తెలిపారు. -
శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తాం : షా
కోల్‌కతా : దేశ వ్యాప్తంగా త్వరలోనే జాతీయ పౌరసత్వ నమోదు(ఎన్నార్సీ)ను చేపడతామని కేంద్ర హోం మంత్రి అమిత్ అన్నారు. చొరబాటు దారులను ఎట్టి పరిస్థతుల్లో దేశంలో ఉండనివ్వమని.. శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని షా తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంత వ్యతిరేకించినా.. బీజేపీ కచ్చితంగా ఎన్నార్సీని అమలు చేసి తీరుతుందని అన్నారు. మంగళవారం కోల్‌కతాలో జరిగిన దుర్గా పూజలో అమిత్ షా పాల్గొన్నారు. ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎన్నార్సీపై జరిగిన సెమినార్లో పాల్గొన్న షా.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఎంసీ ఓటు బ్యాంక్‌ను పెంచుకోవడానికే చోరబాటుదారులకు మమత మద్దతుగా నిలుస్తుందని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 300కు పైగా స్థానాలు సాధించడంలో బెంగాల్ కీలక భూమిక పోషించిందని అన్నారు. బెంగాల్లో బీజేపీ బయటి పార్టీ కాదని షా అన్నారు. దేశ విభజన సమయంలో బెంగాల్ మొత్తం పాకిస్తాన్‌తో కలవాలని చూస్తే.. శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోరాడి పశ్చిమ బెంగాల్ భారత్‌లోనే ఉండేలా చేశారని తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా కశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగం చేశామని.. తద్వారా శ్యామ ప్రసాద్ ముఖర్జీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారని చెప్పారు. చొరబాటుదారులు వామపక్షాలకు ఓటు వేసిన సమయంలో మమత వారిని వ్యతిరేకించారని.. ఇప్పుడు వారు టీఎంసీకి మద్దతు తెలుపడంతో ఆమె వారికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని మండిపడ్డారు. అలాగే పశ్చిమ బెంగాల్లో ఎన్నార్సీ అమలు కాకుండా చూస్తామని మమత చేసిన వ్యాఖ్యలపై స్పందించిన షా.. బెంగాల్లో ఒక్క చొరబాటు దారున్ని కూడా ఉండకుండా చూస్తామని హామీ ఇచ్చారు. బీజేపీలో చేరిన టీఎంసీ ఎమ్మెల్యే.. టీఎంసీ ఎమ్మెల్యే సవ్యాసాచి దత్తా మంగళవారం బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. -
నన్ను తరిమేయడానికి ఆయన ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్సీ) అంశంపై సీఎం కేజ్రీవాల్, బీజేపీ నేత మనోజ్ తివారీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఢిల్లీలో ఎన్ఆర్సీ అమలు చేస్తే మనోజ్ తివారీనే ముందుగా ఢిల్లీ వదిలిపోవాల్సి వస్తుందని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై తివారీ తాజాగా విరుచుకుపడ్డారు. ఇదే కేజ్రీవాల్ ఉద్దేశమైతే ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని అనుకోవాల్సి వస్తుందని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పూర్వాంచల్ నుంచి ఒక వ్యక్తి ఢిల్లీ వస్తే అతను చొరబాటుదారు అవుతారని, అతన్ని ఢిల్లీ నుంచి తరిమికొట్టాలని ఆయన చెప్పదలుచుకున్నారా? ఇతర రాష్ట్రాల నుంచి వలసవచ్చిన వారంతా విదేశీయులని ఆయన అభిప్రాయమా?. ఒక ఐఆర్ఎస్ అధికారిగా ఆయనకు ఎన్ఆర్సీ అంటే తెలియదా? అని తివారీ తీవ్ర స్థాయిలో సీఎంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముందు తివారినే వెళ్లిపోవాలి ఢిల్లీలో ఎన్ఆర్సీ అమలు చేయాలంటున్న ఢిల్లీ బీజేపీ చీఫ్ తివారీ అభిప్రాయంపై కేజ్రీవాల్‌ను మీడియా అడిగినప్పుడు ఆయన సూటిగా స్పందించారు. అదే జరిగితే ముందుగా ఢిల్లీని వదిలి పెట్టాల్సింది తివారీయేనని వ్యాఖ్యానించారు. జర్నలిస్టుపై దాడికి చొరబాటుదారులే కారణమని, ఢిల్లీలో ఎన్ఆర్సీ అమలు చేయాలని మనోజ్ తివారీ చెబుతున్నారని, ఎన్ఆర్సీ అమలు చేస్తే ముందుగా ఢిల్లీని వదిలి పెట్టాల్సింది ఆయనేనని అన్నారు. ఢిల్లీలో స్థిరపడిన అక్రమ వలసదారులతో ప్రమాదం ఉన్నందున ఢిల్లీలో ఎన్ఆర్సీ అవసరం ఎంతైనా ఉందని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల పార్టీ మేనిఫెస్టేలో ఇది కూడా ఉండబోతోందని ఇటీవల తివారీ చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాగా, కేజ్రీవాల్ తాజా వ్యాఖ్యలపై బీజేపీ నేత కపిల్ మిశ్రా ఘాటుగా స్పందించారు. సీఎం వ్యాఖ్యలు కలవరపెట్టే విధంగా ఉన్నాయని అన్నారు. ఢిల్లీలో ఎన్ఆర్సీ అమలు చేస్తే బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రజలు ఢిల్లీ వదలిపెట్టాలని కేజ్రీవాల్ చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఎన్ఆర్సీలో ‘ఎన్’ అంటే ‘జాతీయుడు’ (నేషనల్) అని అర్ధమని, కొందరికి ఇది అవగాహన కావడం లేదని కేజ్రీవాల్‌ను పరోక్షంగా విమర్శించారు. -
‘అదే జరిగితే ముందు వెళ్లేది ఆయనే’
న్యూఢిల్లీ: ఒక వేళ దేశ రాజధానిలో గనక భారత పౌరులను గుర్తించే ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్’ను అమలు చేస్తే.. బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీనే తొలుత ఢిల్లీ నుంచి వెళ్లి పోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అసోం తరహాలోనే ఢిల్లీలో కూడా అక్రమ వలసదారులను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని మనోజ్ తివారీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో అద్దెకుంటున్న వారికి కూడా వర్తించే పవర్ సబ్సిడీ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు కేజ్రీవాల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఒకవేళ రాష్ట్రంలో ఎన్ఆర్సీని వర్తింపజేస్తే.. మనోజ్ తివారీనే ముందుగా ఢిల్లీ నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు. (చదవండి: మిమ్మల్ని టచ్ చేయాలంటే నన్ను దాటాలి!) అసోంలో ఎన్ఆర్సీ అమలు చేసిన సందర్భంగా ఢిల్లీలో కూడా అమలు చేయాలని మనోజ్ తివారీ డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అక్రమంగా ఢిల్లీలో ప్రవేశించారని.. వారి వల్ల రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయన్నారు మనోజ్ తివారి. వారిని రాష్ట్రం నుంచి పంపించడానికి ఢిల్లీలో కూడా ఎన్ఆర్సీ అమలు చేయాలని మనోజ్ తివారి డిమాండ్ చేశారు. ఎన్ఆర్సీ అమలు రాజకీయ పార్టీల మధ్య విబేధాలు సృష్టిస్తోంది. విపక్షాలు ఎన్ఆర్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టి పరిస్థితుల్లోను తమ రాష్ట్రాల్లో ఎన్ఆర్సీని అమలు చేయమని.. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
మిమ్మల్ని టచ్ చేయాలంటే నన్ను దాటాలి!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జాతీయ పౌరజాబితా (ఎన్నార్సీ)ని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. బెంగాల్ ప్రజలను బీజేపీ టచ్ చేయాలనుకుంటే.. తనను దాటాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ ఓటర్ల జాబితాలో తమ పేర్లు చేర్చుకోవాలని ఆమె సూచించారు. బెంగాల్లో ఎన్నార్సీని తెస్తామని స్థానిక బీజేపీ నేతలు వందతులు ప్రచారం చేస్తున్నారని మమత మండిపడ్డారు. ‘బెంగాల్ ప్రజలు ఎంలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు నాపై విశ్వాసం ఉంచండి. బెంగాల్ నుంచి ఎవరూ వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లు నివసిస్తున్న మీరు ఇక్కడ ఉండొచ్చు. వాళ్లు మిమ్మల్ని టచ్ చేయాలనుకుంటే.. నన్ను దాటి రావాల్సి ఉంటుంది’ అని మమత స్పష్టం చేశారు. ఎన్నార్సీ అసోంకే పరిమితం అవుతుందని, అసోంలో ఎన్నార్సీ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలను ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి వివరించానని ఆమె తెలిపారు. -
ఎన్నార్సీ వస్తే ముందు వెళ్లేది యోగినే: అఖిలేష్
లక్నో: బీజేపీ నాయకులు జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) ని రాజకీయంగా ప్రతిపక్షాలను భయపెట్టేందుకు వాడుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఒకవేళ ఎన్నార్సీ ఉత్తర్‌ప్రదేశ్‌లో అమలైతే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రాన్ని వీడాల్సి వస్తుందన్నారు. శుక్రవారం అఖిలేష్ విలేకరులతో మాట్లాడుతూ గతంలో పాలకులు విభజించి పాలించేవారని, ఇప్పుడు భయపెట్టి పాలిస్తున్నారని మండిపడ్డారు. విభజన శక్తులను దేశం నుంచి తరిమికొట్టామని, ఇప్పుడు ప్రజలను చైతన్యపరుస్తూ బీజేపీని గద్దె దించుతామని పేర్కొన్నారు. జమ్మూ–కశ్మీర్ పరిస్థితుల గురించి మాట్లాడుతూ అక్కడ ప్రజలు జబ్బు పడుతున్నారా, చికిత్స పొందుతున్నారా, పిల్లలు పాఠశాలలకు వెళుతున్నారా అనేవి ప్రశ్నలుగానే మిగిలాయన్నారు. అక్కడి పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని కేంద్రం చెబుతున్నప్పుడు ఇంకా అక్కడ ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. పాకిస్తాన్ పేరుతో ఓట్లు దండుకుందామని బీజేపీ చూస్తోందన్నారు. -
దేశమంతా ఎన్నార్సీ : అమిత్ షా
రాంచీ/జమ్తారా : కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)ని తాము దేశమంతా అమలుచేస్తామని ప్రకటించారు. భారత్‌లో అక్రమంగా ఉంటున్న విదేశీయులను వెళ్లగొడతామన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అఖండ మెజారిటీ కట్టబెట్టడం ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలుకు ప్రజలు ఆమోదం తెలిపారని వ్యాఖ్యానించారు. జార్ఖండ్‌లోని రాంచీలో బుధవారం అమిత్ షా మాట్లాడుతూ..‘అస్సాంలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలుచేస్తామని మా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. ఎన్నార్సీని దేశవ్యాప్తంగా చేపట్టి ప్రజల పేర్లను రిజిస్టర్లో నమోదుచేస్తాం. అక్రమ వలసదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఈ జాబితాలోని వారిని తరిమేస్తాం’ అని తెలిపారు. అమెరికాలో సెటిలవ్వగలరా? 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రతీ బహిరంగ సభ, ర్యాలీలో తాను ఎన్నార్సీని ప్రస్తావించానని అమిత్ తెలిపారు. ‘ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలావెళ్లిపోయి అలా స్థిరపడలేరు. నేను మిమ్మల్ని(సభికుల్ని) అడుగుతున్నా. మీరిప్పుడు అమెరికాకు వెళ్లి స్థిరపడగలరా? వీలుకాదు కదా. మీరు రష్యా, నెదర్లాండ్స్, ఇంగ్లండ్.. ఇలా ఎక్కడకు వెళ్లి స్థిరపడేందుకు ప్రయత్నించినా కుదరదు. మరి భారత్‌లో ఎవరైనా ఎలా స్థిరపడగలరు? దేశాలు ఇలా నడవవు. భారత ప్రజల కోసం జాతీయ పౌర రిజస్టర్(ఎన్నార్సీ) అమలు చేయాల్సిన సమయం వచ్చేసింది’ అని షా వెల్లడించారు. ఎన్నార్సీలో పేర్లు లేని నిరుపేదలు అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఉచిత న్యాయసాయం అందిస్తున్నట్లు షా పేర్కొన్నారు. అస్సాంలో ఇటీవల విడుదల చేసిన ఎన్నార్సీలో 19 లక్షల మందిని విదేశీయులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. హిందీని రుద్దట్లేదు హిందీ దినోత్సవం సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై అమిత్ స్పందించారు. భారత్‌లో ఎక్కడా హిందీని బలవంతంగా అమలుచేయాల్సిందిగా తాను చెప్పలేదన్నారు. మాతృభాష తర్వాత హిందీని రెండో భాషగా నేర్చుకోవాలని కోరానన్నారు. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని తాను ప్రస్తావించానన్నారు. ‘నేను హిందీయేతర రాష్ట్రం నుంచే వచ్చాను. నా మాతృభాష గుజరాతీ. నన్ను విమర్శిస్తున్నవారు ఎవరైనా ముందు నేనిచ్చిన ప్రసంగాన్ని పూర్తిగా వినాలి. అలాకాకుండా ఎవరైనా దీన్ని రాజకీయం చేయాలనుకుంటే, అది వాళ్లిష్టం’ అని షా వ్యాఖ్యానించారు. మాతృభాషలో విద్యాబోధన సాగితేనే పిల్లల మనోవికాసం సరైనరీతిలో ఉంటుందని హోంమంత్రి అభిప్రాయపడ్డారు. కానీ దేశంలో ఒకే జాతీయ భాష ఉండాల్సిన అవసరముందనీ, ప్రజలు మరో భాషను నేర్చుకోవాలంటే అందుకు మాధ్యమంగా హిందీయే ఉండాలని షా స్పష్టం చేశారు. -
అస్సాంలో విదేశీయులపై ఆంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ : అస్సాంలో చేపట్టిన జాతీయ పౌరసత్వ తుది జాబితా (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్–ఎన్ఆర్సీ)పై వివాదం చెలరేగిన నేపథ్యంలో అస్సాంను కేంద్ర విదేశాంగ, హోం మంత్రిత్వ శాఖల పరిధిలో ‘ప్రొటెక్టెడ్ ఏరియా (రక్షిత ప్రాంతంగా)’ బుధవారం అధికారులు ప్రకటించారని, తక్షణం విదేశీ జర్నలిస్టులను రాష్ట్రం వదిలేసి వెళ్లాల్సిందిగా కూడా ఆదేశించారని ‘అస్సాం ట్రిబ్యూన్’ పత్రిక గురువారం వెల్లడించింది. రాష్ట్రం విడిచి విదేశీ జర్నలిస్టులు వెళ్లాలంటే అర్థం వారు రాష్ట్రంలో ఉండాలన్నా, రాష్ట్రంలో ఏ వార్తలు సేకరించాలన్నా ముందస్తుగా హోం శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం తెలియగానే అస్సాంలోని ‘అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ)’ జర్నలిస్ట్ బుధవారం రాష్ట్రం విడిచి స్వచ్ఛందంగా వెళ్లిపోయినట్లు అస్సాం ట్రిబ్యూన్ తెలియజేసింది. అస్సాం పోలీసులు ఆయన్ని వెన్నంటి విమానాశ్రయం వరకు సాగనంపి ఢిల్లీ విమానాన్ని ఎక్కించినట్లు కూడా పేర్కొంది. అస్సాంలో ఇటీవల ఎఆర్సీని సవరించినప్పటికీ ఇంకా 19 లక్షల మంది పేర్లు గల్లంతయినట్లు తెల్సిందే. అంటే వీరంతా ట్రిబ్యునల్ ముందు హాజరై తాము విదేశీయులం కాదని, భారతీయులమని నిరూపించుకోవాలి. అలా జరగనట్లయితే వారంతా దశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అస్సాంను ‘రక్షిత ప్రాంతం’గా ప్రకటించారు. అస్సాంలో ఎన్ఆర్సీ పట్ల కేంద్రం అనుసరిస్తోన్న విధానాన్ని కొన్ని విదేశీ పత్రికలు విమర్శించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక అధికారులు తెలియజేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న విదేశీ జర్నలిస్టులు స్థానిక వార్తలను కవర్ చేయాలన్నా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న విదేశీ జర్నలిస్టులు అస్సాంలోకి రావాలన్నా ముందస్తుగా విదేశాంగ శాఖ లేదా హోం శాఖ అనుమతి తీసుకోవాలని వారు సూచించారు. అయితే పాప్ (పీఏపీ–ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్)గానీ, రాప్ (ఆర్ఏపీ–రిస్ట్రిక్డెడ్ ఏరియా పర్మిట్)గానీ తాము జారీ చేయడం లేదని కూడా వారు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించినందున విదేశీ జాతీయులు, విదేశీ పర్యాటకులు కూడా రాష్ట్రాన్ని సందర్శించాలంటే ముందస్తు అనుమతి ఉండాల్సిందేనని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా అనుమతి కోరవచ్చని కూడా వారు సూచించారు. ప్రస్తుతం కశ్మీర్లో కూడా ఇలాంటి ఆంక్షలే కొనసాగుతున్నాయి. -
నా పేరు ఉంది.. మా పిల్లల పేర్లేవి?
అసోం: అసోం రాష్ట్రానికి సంబంధించి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్ (ఎన్ఆర్సి) శనివారం ప్రకటించిన చివరి జాబితాలో లక్షల్లో పేర్లు లేకపోవడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ జాబితాలో 19 లక్షల మంది పేర్లు లేకపోవడం గమనార్హం. దీనిపై మీనా హజారికా అనే మహిళ తమ ఇద్దరి కూతుర్లు బర్నాలి, మిథు పేర్లు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి, రెండో జాబితాలో తన పేరు ఉన్నప్పటికీ కుమార్తెల పేర్లు లేకపోవడంతో ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. తన పేరు ఉన్నప్పుడు, కుమార్తెల పేర్లు ఎందుకు లేవని ఆమె ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే పూర్తి చిరునామాలతో కూడిన దృవపత్రాలను(ఎన్ఆర్సి)కి సమర్పించారు. తామేమీ బంగ్లాదేశీయులం కాదంటూ ఆమె అధికారులపై విరుచుకుపడ్డారు. తాము బ్రిటిష్ కాలం నుంచి ఇక్కడే నివసిస్తున్నామని అన్నారు. దృవపత్రాలను సమర్పించినా తమ కుమార్తెల పేర్లలో తపులున్నాయని చెప్పడంతో ఆమె మరోసారి షాక్‌కు గురయ్యారు. అంతకుముందు పేర్లను సరిచేయడంలో భాగంగా డాక్యుమెంటేషన్ రూపొందించడానికి విపరీతంగా ఖర్చయిందని హజారికా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ కోసం తన దగ్గర ఉన్న మొత్తం డబ్బును ఖర్చు పెట్టానని అన్నారు. చివరకు అందులో తమ పిల్లలు పేర్లు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించకుంటే తమకు చావే శరణ్యమన్నారు. తన ప్రపంచం ముగిసిపోయినట్లు ఉందని ఉద్వేగంగా మాట్లడారు. అయితే రీసర్టిఫికేషన్ కోసం సెప్టెంబర్7 వరకూ నిరీక్షించామని అధికారులు చెప్పినట్లు ఆమె తెలిపారు. ఇందుకు తన వద్ద డబ్బులు లేవన్నారు. కాగా, జాబితాలో పేర్లు లేని కొందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని దుమ్మెత్తి పోస్తున్నారు. మరోవైపు జాబితాలో పేర్లు లేనివారు విదేశీ ట్రిబ్యునల్స్ కు అప్పీల్ చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. -
19 లక్షల పేర్లు గల్లంతు
గువాహటి: వివాదాస్పద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ తుదిజాబితా శనివారం విడుదలైంది. అసోంలోని భారతీయ పౌరులను గుర్తించేందుకు చేపట్టిన ఎన్ఆర్సీ జాబితాలో 19 లక్షల మంది చోటు దక్కించుకోలేకపోయారు. అసోం పౌరులైన తమను ఈ జాబితాలో చేర్చాలని 3.30 కోట్ల మంది దరఖాస్తు చేసుకోగా... పలు మార్పులు, చేర్పులు, సవరణల తరువాత 3.11 కోట్ల మందికి చోటు లభించినట్లు ఎన్ఆర్సీ రాష్ట్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. జాబితాలో చోటు దక్కనివారు 120 రోజుల్లోపు ఫారినర్స్ ట్రైబ్యునళ్లలో అప్పీల్ చేసుకోవచ్చునని తెలిపింది. ఎన్నార్సీకి వ్యతిరేకంగా గువాహటిలో హిందూయువ చాత్ర పరిషత్ సభ్యుల ఆందోళన ట్రిబ్యునళ్లు విదేశీయులుగా ప్రకటించేంత వరకూ జాబితాలో లేని వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్బంధించేది లేదని అసోం ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. శనివారం ఉదయం పది గంటలకు ఎన్ఆర్సీ తుదిజాబితాను ఆన్లైన్లో ప్రచురించగా ప్రజల సందర్శనార్థం అన్ని ప్రతులను ఎన్ఆర్సీ సేవా కేంద్రాలు, డిప్యూటీ కమిషనర్, సర్కిల్ ఆఫీసుల్లో అందుబాటులో ఉంచారు. తమ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు శనివారం వందలాది మంది ఈ కార్యాలయాల్లో క్యూ కట్టారు. పేర్లు ఉన్న వాళ్లు విరిసిన ముఖాలతో బయటకు రాగా.. కొందరు నిరాశగా వెనుదిరగడం కనిపించింది. అందరిలోనూ అసంతృప్తి... ఎన్ఆర్సీ తుది జాబితాపై అటు అధికార బీజేపీతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం వలసదారులకు జాబితాలో చోటు దక్కిందని, స్థానికులను మాత్రం వదిలేశారని మంగల్దోయి మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేన్ డేకా వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఎన్ఆర్సీ రూపకల్పన జరిగినప్పటికీ అంత నాణ్యంగా ఏమీ జరగలేదని పెదవి విరిచారు. అర్హులైన వారు చాలామందిని జాబితాలోకి చేర్చలేదంటూ బార్పేట కాంగ్రెస్ నేత అబ్దుల్ ఖాలీక్ విమర్శించారు. ఎన్నార్సీపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకుంటున్న ప్రజలు అక్రమ వలసదారుల బహిష్కరణకు ఆది నుంచి ఉద్యమాలు నడిపిన, ఎన్ఆర్సీ జాబితా సవరణకు సుప్రీంకోర్టుకెక్కిన ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ నేతలు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘మేము ఏమాత్రం సంతోషంగా లేము. జాబితాను సవరించే క్రమంలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఇది అసంపూర్తి జాబితా మాత్రమే. జరిగిన తప్పులన్నింటినీ సరిచేసేందుకు మళ్లీ సుప్రీంకోర్టుకు వెళతాం’’అని సంస్థ జనరల్ సెక్రటరీ లురిన్జ్యోతి గగోయ్ స్పష్టం చేశారు. గతంలో వేర్వేరు సందర్భాల్లో అక్రమ వలసదారులుగా ప్రకటించిన సంఖ్యకు, అధికారికంగా ప్రకటించిన అంకెకు ఏమాత్రం పొంతన లేదని గగోయ్ శనివారం ఒక విలేకరుల సమావేశంలో ఆరోపించారు. 20 శాతం జాబితానైనా సమీక్షించాలి: హిమంతా ఎన్ఆర్సీ తుది జాబితాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అసోం మంత్రి, నారŠ?త్తస్ట్ డెమొక్రటిక్ అలయన్స్ కన్వీనర్ హిమంతా బిశ్వాస్ శర్మ... జాబితాను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి ఉన్న జిల్లాల నుంచి ఎన్ఆర్సీలో చోటు దక్కించుకున్న వారిలో కనీసం 20 శాతం మందినైనా మరోసారి పునః పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అనుమతివ్వాలని ఆయన కోరారు. మిగిలిన జిల్లాల్లో 10 శాతం పునః పరిశీలన ద్వారా కచ్చితమైన జాబితా రూపొందించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘1971 కంటే ముందు బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వచ్చిన వారికి ఎన్ఆర్సీ జాబితాలో చోటు దక్కలేదు. శరణార్థిగా ధ్రువీకరించే పత్రాలను అధికారులు అస్సలు పట్టించుకోలేదు. పాత జాబితాల్లో అవకతవకల కారణంగా కొంతమంది ఎన్ఆర్సీలో చోటు దక్కించుకోగలిగారు’’అని హిమంత ఓ ట్వీట్ కూడా చేశారు. ఎన్ఆర్సీ సవరణకు ముందుగా సుప్రీంకోర్టు తలుపుతట్టిన ‘ద అసోం పబ్లిక్ వర్క్స్’’కూడా తుదిజాబితా లోపభూయిష్టమైందని వ్యాఖ్యానించారు. పునః పరిశీలన చేయాలన్న తమ డిమాండ్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన కారణంగా తుదిజాబితాలో తప్పులు చోటు చేసుకున్నాయని సంస్థ అధ్యక్షుడు అభిజీత్ శర్మ వ్యాఖ్యానించారు. ఎన్నార్సీ అస్సాంకేనా? అస్సాంలో మాదిరిగానే బంగ్లాదేశీయుల వలసలు ఎక్కువగా ఉన్న ఢిల్లీతోపాటు శ్రీనగర్‌లోనూ ఇలాంటి వివరాలు సేకరించాలని విశ్లేషకులు అంటున్నారు. అంతకంటే ముందుగా ఎన్నార్సీ ప్రక్రియను పశ్చిమబెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశాల్లోనూ మొదలుపెట్టాలని, ఈ ప్రక్రియ ఏ ఒక్క మతానికో లేక వర్గానికో పరిమితం కారాదని అంటున్నారు. అసోంతోపాటు చాలా రాష్ట్రాల్లో అక్రమ వలసదారులున్నందున ఇలాంటి ప్రక్రియను మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే తప్పేంటని వాదిస్తున్నారు. ఎన్నార్సీ ప్రక్రియలో నిర్దేశిత విధానాలను పాటించాలని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసింది. పశ్చిమబెంగాల్ అయినా హిమాచల్ ప్రదేశ్ అయినా ఎన్నార్సీ సమీక్షలో ఆయా రాష్ట్రాలు సహకరించాలి. అయితే, కొన్ని రాజకీయ పార్టీలు తమ అనుకూల వలసవాదులను ఎన్నార్సీ జరగని రాష్ట్రాలకు పారిపోయేలా సహకరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. జాతి హితం దృష్ట్యా ఈ వివాదంలోకి పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌లను లాగకుండా పార్టీలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అక్రమ వలసదారులు, కాందిశీకులు కానటువంటి నిజమైన భారతీయులను గుర్తించడమే ఎన్నార్సీ లక్ష్యం కావాలంటున్నారు. రొహింగ్యాలను వెనక్కి పంపేందుకు బంగ్లాదేశ్ ప్రయత్నిస్తుండగా కోట్లాది బంగ్లాదేశీయుల్లో పట్టుమని 50 మందిని ప్రభుత్వం వెనక్కి పంపించలేక పోవడం ఏమిటంటున్నారు. ఎన్నార్సీ పూర్వాపరాలివీ.. ► 1951: స్వాతంత్య్రం తరువాత నిర్వహించిన తొలి జనాభా లెక్కల్లో భాగంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ) తయారైంది ► 1955: భారతీయ పౌర చట్టం అమల్లోకి వచ్చింది. భారతీయ పౌరులు అయ్యేందుకు కావాల్సిన నిబంధనలన్నీ ఇందులో పొందుపరిచారు. ► 1951 1966: తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్) నుంచి వచ్చిన పలువురు ఈ కాలంలో నిర్బంధంగా అసోం వదిలి వెళ్లాల్సి వచ్చింది. ► 1965: భారత పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో అసోంలోకి మళ్లీ పెరిగిన చొరబాట్లు. ► 1971: మరోసారి వెల్లువలా చొరబాట్లు. ► 1979: అక్రమ చొరబాటుదార్లకు వ్యతిరేకంగా అసోంలో ఉద్యమం మొదలు ► 1983: నైలేలీ మారణకాండ. సుమారు మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అక్రమ వలసదారుల వ్యతిరేక చట్టానికి ఆమోదం. ట్రిబ్యునళ్ల ద్వారా వలసదారుల నిర్ధారణ మొదలు. ► 1985 భారత ప్రభుత్వం, ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ల మధ్య కుదిరిన ఒప్పందం. మార్చి 25, 1971రి అక్రమ వలసదారుల నిర్ధారణకు కటాఫ్ తేదీగా నిర్ణయం. ► 1997 అనుమానాస్పద ఓటర్లను ఓటర్ల జాబితాలో ‘డీ’అక్షరం ద్వారా గుర్తించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం ► 2003 పౌర చట్టంలో మార్పులకు ప్రయత్నాలు మొదలు. ► 2005 1983 నాటి అక్రమ వలసదారుల చట్టాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ల మధ్య త్రైపాక్షిక చర్చలు. 1951 నాటి ఎన్ఆర్సీ సవరణకు సూత్రప్రాయ అంగీకారం. ► 2010 బార్పేటలోని ఛాయాగావ్‌లో ఎన్ఆర్సీ జాబితా సవరణ తాలూకూ పైలట్ ప్రాజెక్టు మొదలు.హింసాత్మక ఘటనల్లో నలుగురి మృతి. ప్రాజెక్టు నిలిపివేత. ► 2016 ఎన్ఆర్సీ సవరణకు సుప్రీంకోర్టు పిలుపు ► 2017 డిసెంబరు 31న ఎన్ఆర్సీ తొలి ముసాయిదా జాబితా విడుదల ► 2019 జూలై 31న ఎన్ఆర్సీ రెండో ముసాయిదా జాబితా విడుదల. సుమారు 41 లక్షల మందికి దక్కని చోటు ► 2019 ఆగస్టు 31. ఎన్ఆర్సీ తుది జాబితా విడుదల. జాబితాలో చోటు దక్కని వారి సంఖ్య 19 లక్షలు. -
ఎన్ఆర్సీలో గల్లంతయిన కార్గిల్ వీరుడు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఎన్ఆర్సీ నివేదికపై దేశ వ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. నివేదికలో పలువురు పేర్లు గల్లంతవ్వడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్గిల్ యుద్ధంలో భారత ఆర్మీ తరపున పనిచేసిన అర్మీ రిటైర్డు ఆఫీసర్ మహ్మద్ సనాఉల్లా ఖాన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఎన్ఆర్సీ నివేదికలో సనాఉల్లా ఖాన్ పేరు లేకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నివేదికలో తన పేరు లేకపోవడంపై ఆర్మీ మాజీ అధికారి ఘాటుగా స్పందించారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్న సనాల్లాఖాన్, న్యాయం కోసం పోరాడుతానన్నారు. ప్రస్తుతం స్థానికతపై కేసు విచారణ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని నమ్మకం ఉందన్నారు. జాబితాను రూపొందించిన ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం పోరాటం చేసిన యోధుడు.. సరిహద్దు ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి పోరాడిన సైనికుడి పేరునే తొలగించారంటే నివేదిక ఎలా రూపొందించారో తెలుస్తోంది అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసోంలో మొత్తం 3.29 కోట్ల మంది ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, వారిలో 3 కోట్ల పదకొండు లక్షల మందిని మాత్రమే భారత పౌరులుగా గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు 19 లక్షల మందికి ఎన్ఆర్సీ తుది జాబితాలో చోటు దక్కకపోవడంతో వారు ఇకపై విదేశీయులుగా గుర్తింపబడనున్నారు. -
బీజేపీ టార్గెట్ ఆ రెండు రాష్ట్రాలేనా?
సాక్షి, న్యూఢిల్లీ: భారత పౌరులను గుర్తించేందుకు బీజేపీ ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ) బిల్లు దేశ వ్యాప్తంగా కొత్త చర్చకు దారి తీసింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం ఇచ్చేలా చట్టంలో సవరణలు చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తొలివిడత అసోంలో అమలు చేశారు. అసోంలో మొత్తం 3.29 కోట్ల మంది ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, వారిలో 3 కోట్ల పదకొండు లక్షల మందిని మాత్రమే భారత పౌరులుగా గుర్తించారు. దీంతో దాదాపు 19 లక్షల మందికి ఎన్ఆర్సీ తుది జాబితాలో చోటు దక్కకపోవడంతో వారు ఇకపై విదేశీయులుగా గుర్తింపబడనున్నారు. ఇక్కడా అమలు చేయండి.. ఎన్ఆర్సీని దేశ వ్యాప్తంగా అమలు చేస్తామంటూ బీజేపీ నేతలు బహిరంగ ప్రకటనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో తొలుత అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇది వరకే ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించినట్లు, త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇదిలావుండగా మహారాష్ట్రలో కూడా ఎన్ఆర్సీని అమలు చేయాలని శివసేన ఎంపీ, కేంద్రమంత్రి అరవింద్ సావాంత్ కేంద్ర ప్రభుత్వానికి ఇదివరకే విజ్క్షప్తి చేశారు. అక్రమ వలసదారులు కారణంగా నిజమైన స్థానికులు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దేశ వాప్తంగా అక్రమ వలసదారులు ఎక్కువగా ముంబైలోనే ఆశ్రయం పొందుతున్నారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు అసోం తరహాలోనే ఢిల్లీలో కూడా అక్రమ వలసదారులను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. అక్రమ వలసదారులు ఢిల్లీలో తిష్ట వేశారని.. వారి సంఖ్య రాజధానికి ప్రమాదకరంగా పరిణమించిందని పేర్కొన్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఎన్ఆర్సీని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో కూడా ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయమని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ ఇదిలావుండగా.. బంగ్లాదేశ్ సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో కూడా ఎన్ఆర్సీ ప్రకంపనలు సృష్టిస్తోంది. బెంగాల్లోనూ అక్రమ వలసదారులు రాజ్యమేలుతున్నారని, వారిని దేశం నుంచి పంపిస్తామని ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు ప్రకటించారు. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సహా, విపక్షాల నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్సీపై తీసుకునే నిర్ణయం ఉత్కంఠంగా మారింది. -
ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి..మీరేనా?!
న్యూఢిల్లీ : అసోం తరహాలోనే దేశ రాజధాని ఢిల్లీలో కూడా అక్రమ వలసదారులను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. భారత పౌరులను గుర్తించే ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్’ అసోం పౌర తుది జాబితా నేడు వెలువడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ఢిల్లీలో కూడా ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అక్రమ వలసదారులు ఢిల్లీలో తిష్ట వేశారని.. వారి సంఖ్య రాజధానికి ప్రమాదకరంగా పరిణమించిందని పేర్కొన్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఎన్ఆర్సీని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చదవండి: ఎన్ఆర్సీ అసోం తుది జాబితా; 19.6 లక్షల మంది అవుట్! కాగా మనోజ్ తివారీ వ్యాఖ్యలపై అఖిల భారత మహిళా కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. వలసదారులను ఏరివేయమని వలస వచ్చిన వ్యక్తే చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేసింది. ఈ మేరకు...‘ మనోజ్ తివారీ గారూ.. బిహార్‌లోని కైమూర్‌లో జన్మించి... ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చదివి...మహారాష్ట్రలోని ముంబైలో పనిచేసి, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో పోటీచేసి, మళ్లీ ఢిల్లీలో బరిలో దిగారు. మీరు ఢిల్లీ నుంచి వలసదారులను ఏరివేయాలని కోరుతున్నారు. నిందాస్తుతి తనపేరు మార్చుకోవాలేమో’ అని ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇక అసోంలో మొత్తం 3.29 కోట్ల మంది ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, వారిలో 3 కోట్ల పదకొండు లక్షల మందిని మాత్రమే ఎన్ఆర్సీ భారత పౌరులుగా గుర్తించింది. దీంతో తుది జాబితాలో చోటు దక్కని దాదాపు 19 లక్షల మంది ఇకపై విదేశీయులుగా గుర్తింపబడనున్నారు. So Manoj Tiwari ji Born in Kaimur, Bihar Studied in Varanasi, UP Worked in Mumbai, Maharshtra Contested in Gorakhpur, UP Contested again in Delhi Is talking about throwing immigrants away from Delhi. Irony wants a change of name! https://t.co/aUGfqYIewt — All India Mahila Congress (@MahilaCongress) August 31, 2019 -
ఎన్ఆర్సీ జాబితా: వెబ్సైట్ క్రాష్
గువాహటి : అసోం ఎన్ఆర్సీ తుది జాబితా విడుదల నేపథ్యంలో ఎన్ఆర్సీ అధికారిక వెబ్సైట్ క్రాష్ అయింది. భారత పౌరులను గుర్తించే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ) గురువారం ఉదయం 10 గంటలకు తుది జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జాబితా విడుదల అయిన పది నిమిషాలకే వెబ్సైట్ స్తంభించిపోయింది. మీసేవా కేంద్రాలలో ప్రస్తుతం సైట్‌ను చేరుకోలేం అంటూ చూపిస్తోంది. దీంతో అనేకమంది తుది జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోడానికి క్యూ లైనల్లో నిల్చోని ఉండిపోయారు. కాగా తుది ఎన్ఆర్సీ జాబితాలో మొత్తం 3.11 కోట్ల మందిని అసోం పౌరులుగా గుర్తించగా, 19 లక్షల మందికి ఈ జాబితాలో చోటు దక్కలేదు. జాబితాలో చోటు లేని వారిని చట్టపరమైన ఎంపికలు జరిగే వరకు విదేశీయులుగా ప్రకటించలేమని కేంద్రం తెలిపింది. అంతేగాక జాబితాలో పేరు లేని వారు విదేశీయుల ట్రిబ్యునల్‌కు అప్పీలు చేసుకోవచ్చని వెల్లడించింది. ప్రజలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మీ సేవ కేంద్రాలలో తమ పేర్లను చూసుకోవాలని అధికారులు వెల్లడించారు. చదవండి: ఎన్ఆర్సీ అసోం తుది జాబితా; 19.6 లక్షల మంది అవుట్! -
ఎన్ఆర్సీ తుది జాబితా; 19.6 లక్షల మంది అవుట్!
గువాహటి : భారత పౌరులను గుర్తించే ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ)’ శనివారం ఉదయం 10 గంటలకు 3.11 కోట్ల మందిని అసోం పౌరులుగా గుర్తించినట్లు పేర్కొంది. అసోంలో మొత్తం 3.29 కోట్ల మంది ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, వారిలో 3 కోట్ల పదకొండు లక్షల మందిని మాత్రమే భారత పౌరులుగా గుర్తించింది. దీంతో దాదాపు 19 లక్షల మందికి ఎన్ఆర్సీ తుది జాబితాలో చోటు దక్కకపోవడంతో వారు ఇకపై విదేశీయులుగా గుర్తింపబడనున్నారు. కాగా అసోం ఎన్ఆర్సీ తుది జాబితా విడుదల నేపథ్యంలో రాష్ట్రంలో 144 సెక్షన్ విధించారు. ఆందోళనకర పరిస్థితులు తలెత్తే క్రమంలో రాష్ట్ర పోలీసులతో పాటు దాదాపు 218 భద్రతా బలగాలను కేంద్రం అసోంలో మోహరించింది. ఇక ఎన్ఆర్సీ తుది జాబితా వెల్లడి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు సంయమనం పాటించాల్సిందిగా అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ఎన్ఆర్సీ జాబితాలో పేరు లేని వారికి మరో అవకాశం ఉంటుందని, వారు విదేశీయుల ట్రిబ్యునల్‌కు అప్పీలు చేసుకోవచ్చని వెల్లడించారు. అయితే వారిలో ఎక్కువ మంది ముస్లింలు, అందులోనూ బెంగాలీ మాట్లాడే ముస్లింలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: అక్రమ వలసదారులను పంపిస్తాం: అమిత్ షా భూములు కొల్లగొడుతున్నారని ఆరోపణ! ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలు వలసవచ్చిన విదేశీయులకు వెళుతున్నాయని, స్థానికులైన తమకు రావడం లేదని 1950వ దశకం నుంచే ‘సన్స్ ఆఫ్ సాయిల్’గా పిలుచుకునే 34 శాతం జనాభా కలిగిన అస్సామీ భాష మాట్లాడే అస్సామీలు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. తమ వెనకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొని వలసదారులు తమ విలువైన భూములను కొల్లగొడుతున్నారంటూ 1960వ దశకం నుంచి ఆందోళన తీవ్రం చేశారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలతోపాటు బంగ్లాదేశ్ యుద్ధానంతరం ఆ దేశీయులు అసోంలోకి వలస వచ్చారు. వాస్తవానికి బంగ్లా దేశీయులకన్నా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముస్లింలే అసోంలో ఎక్కువ ఉన్నారని పలు స్వచ్ఛంద సంస్థలు తమ అధ్యయనాల్లో తెలిపాయి. మణిపూర్ నుంచి వలసవచ్చిన వారు కూడా స్థానికంగా భూములు కొనుక్కొని స్థిరపడ్డారని ఆ సంస్థలు వెల్లడించాయి. పెరిగిన ముస్లింల జనాభా వలసలు ఎక్కడి నుంచి అన్న ప్రశ్నను పక్కన పెడితే రాష్ట్రంలో హిందువులకన్నా ముస్లింల జనాభా శాతం పెరుగుతూ వచ్చింది. వారిప్పుడు మెజారిటీ స్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ శక్తులు ఆందోళనల్లో భాగంగా ముస్లింలకు వ్యతిరేకంగా అస్సామీలను రెచ్చ గొడుతూ వచ్చారు. ఆ పర్యవసానంగానే నిల్లీ మారణకాండ, కొక్రాజర్ మారణకాండలు జరిగాయి. ఈ రెండు ఘటనల్లో కూడా ఆరెస్సెస్ నాయకులు అరెస్ట్ అవడం గమనార్హం. హిందువులైనా, ముస్లింలు అయినా తమకు సంబంధం లేదని, విదేశీయులందరిని తమ రాష్ట్రం నుంచి పంపించాలని స్థానిక అస్సామీలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాల తాత్సారం వల్లే! ఓటు బ్యాంకు రాజకీయాలకు విలువనిచ్చే వరుస ప్రభుత్వాలు తాత్సారం చేస్తు రావడంతో సమస్య జటిలమవుతూ వచ్చింది. అఖిల అసోం విద్యార్థుల సంఘం 1979 నుంచి ఆందోళనను తమ చేతుల్లోకి తీసుకొని నడిపించింది. సమ్మెలు, దిగ్బంధనాలు, సహాయ నిరాకరణ వంటి వివిధ రీతుల్లో కొనసాగిన ఆందోళనలో విధ్వంసాలు, ప్రభుత్వ పతనాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రపతి పాలనలో కూడా పౌర జీవితం స్తంభించిపోయింది. ఆరు సుదీర్ఘ సంవత్సరాల ఆందోళన అనంతరం 1985లో అప్పటి కేంద్రంలోని రాజీవ్ ప్రభుత్వం దిగివచ్చి అస్సాం ఆందోళనకారులతో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం1951 నుంచి 1961 లోపు వచ్చిన బంగ్లాదేశీయులకు భారత పౌరసత్వం కల్పించాలి. 1971 తర్వాత వచ్చిన వారిని వెనక్కి పంపించాలి. 1961 నుంచి 1971 మధ్యన వలసవచ్చిన వారికి ఓటింగ్ హక్కు మినహా అన్ని పౌర హక్కులు ఉంటాయి. నాటి ఒప్పందంలో 90 శాతం అంశాలు కూడా ఇప్పటికి అమలు కాలేదన్నది ఉద్యమకారుల ఆరోపణ. బీజేపీ అధికారంలోకి వచ్చాక 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక సమస్య పరిష్కారం దిశగా చర్యలకు ఉపక్రమించింది. 1985 అస్సాం ఒప్పందంలోని అంశాలను మార్గదర్శకంగా తీసుకొని పౌరులను గుర్తించాల్సిందిగా కోరుతూ 2015లో ఓ ఉన్నతాధికార కమిటీని వేసింది. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి ఒక్క రోజు ముందు అంటే, 1971, మార్చి 24వ తేదీ అర్థరాత్రి తర్వాత భారత్‌కు వచ్చిన విదేశీయులందరిని విదేశీయులుగా పరిగణించాలని కమిటీకి కేంద్రం నిర్దేశించింది. దీంతో విదేశాల నుంచి వలస వచ్చిన హిందువులను కాకుండా ముస్లింలనే వెనక్కి పంపించాలంటూ ఆరెస్సెస్ అధినేతలు బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. హిందువులకు అనుకూలంగా చట్టం ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం 2016లో ‘సిటిజెన్షిప్ (అమెండ్మెంట్)బిల్’ను తీసుకొచ్చింది. అందులో బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం ఇచ్చేలా సవరణలు తీసుకొచ్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా కూడా అస్సామీలు చేస్తున్న ఆందోళనను పట్టించుకోకుండా ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్’ అసోంలోని భారత పౌరుల జాబితాను విడుదల చేసింది. పౌరులుగా గుర్తించడంలో ఎన్నో అక్రమాలు జరిగాయని, ఆధార్ కార్డులు కూడా ఉన్న బెంగాలీ ముస్లింలను గుర్తించలేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఇది తమ రాష్ట్రంలో చిచ్చు పెట్టవచ్చని, అశాంతి పరిస్థితులకు దారితీయవచ్చని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌తో పరస్పర దేశ పౌరుల మార్పిడి ఒప్పందం లేనందున ఆ దేశీయులను వెనక్కి పంపించడం సాధ్యం కాదు. అందుకనే దేశంలోని శరణార్థుల శిబిరాలకు వారిని పంపిస్తామని కేంద్రం చెప్పింది. దీంతో వరుసగా రెండోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు నేడు అసోంలోని భారత పౌరుల తుది జాబితాను వెల్లడించింది. -
దేశమంతటా పౌర రిజిస్టర్
న్యూఢిల్లీ: 2020 కల్లా జాతీయ ప్రజా రిజిస్టర్(ఎన్పీఆర్)ను రూపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీని ఆధారంగానే దేశవ్యాప్త పౌరసత్వ రిజిస్టర్‌ను తయారు చేయనుంది. ఎన్పీఆర్ పూర్తయి, అధికారికంగా ముద్రించాక ప్రభుత్వం దీనినే భారత జాతీయ పౌరసత్వ(ఎన్ఆర్ఐసీ) రిజిస్టర్‌కు ఆధారంగా చేసుకుంటుంది. అంటే, ఇది అస్సాంలో చేపట్టిన జాతీయ పౌరసత్వ రిజిస్టర్(ఎన్నార్సీ)కి అఖిల భారత రూపమని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీల మధ్య ఈ కార్యక్రమం అస్సాం మినహా దేశవ్యాప్తంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అధికారులు ఇంటింటికీ వెళ్లి ఆ ప్రాంతంలో ఆరు నెలలుగా నివాసం ఉంటున్న లేదా మరో ఆరు నెలలు, అంతకంటే ఎక్కువ కాలం అక్కడే ఉండాలనుకున్న వ్యక్తుల పేర్లను నమోదు చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. -
అక్రమ వలసదారులను పంపిస్తాం: అమిత్ షా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చట్టాలను అనుసరించి అక్రమ వలసదారులు భారత్‌లో ఎక్కడున్నా, వారిని పంపించివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టంచేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఎన్నార్సీలో పౌరుల వివరాలను నమోదు చేస్తున్నామ న్నారు.బుధవారం రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ నేత జావేద్ అడిగిన ప్రశ్నకు అమిత్ జవాబిచ్చారు. ప్రతి రాష్ట్రంలోనూ ఇదే పద్ధతి అమలు చేస్తామన్నారు. అక్రమ వలసదారులను పంపించేస్తామన్న బీజేపీ మేనిఫెస్టో హామీ కూడా తాము అధికారంలోకి రావడానికి ఓ కారణమన్నారు. ఎన్నార్సీ సేకరణకు అసోంలో సమయాన్ని పొడిగించాలంటూ 25 లక్షల మంది సంతకాలు చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి అందించారని హోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద్ రాయ్ అన్నారు. -
అది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది : అమిత్ షా
న్యూఢిల్లీ : అక్రమ వలసదారులు దేశంలో ఏ మూలన ఉన్నా సరే అంతర్జాతీయ చట్టాలను అనుసరించి వారిని బయటకు పంపివేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్నార్సీ)’ దేశంలోని ప్రతీ రాష్ట్రానికి వర్తింపజేస్తారా అంటూ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జావేద్ అలీ ఖాన్ అడిగిన ప్రశ్నకు అమిత్ షా సమాధానమిచ్చారు. భారత పౌరులను గుర్తించే ఎన్నార్సీ విషయమై ప్రస్తుతం అసోంలో ఆందోళనలు పెల్లుబుకుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలు వలస వచ్చిన విదేశీయులకు వెళుతున్నాయని, స్థానికులైన తమకు రావడం లేదని 1950వ దశకం నుంచే ‘సన్స్ ఆఫ్ సాయిల్’గా పిలుచుకునే 34 శాతం జనాభా కలిగిన అస్సామీ భాష మాట్లాడే అస్సామీలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఎన్నికల హామీలో భాగంగా అక్రమ వలసదారులను దేశం నుంచి వెళ్లగొడతామంటూ బీజేపీ తమ మేనిఫెస్టోలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి బుధవారం రాజ్యసభలో ఎస్పీ ఎంపీ సంధించిన ప్రశ్నకు అమిత్ షా బదులిస్తూ.. ‘చాలా మంచి ప్రశ్న అడిగారు. నిజానికి అసోంలో ఎన్నార్సీ గురించి ఆందోళనలు జరిగిన సమయంలో ఆ సమస్య పరిష్కరిస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాం. దీనిని అనుసరించి అక్రమ వలసదారులను గుర్తించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. అంతర్జాతీయ చట్టాలననుసరించి వారిని దేశం నుంచి వెళ్లగొడతాం. ఇది దేశంలోని ప్రతీ మూలలో, భారతదేశ మట్టిపై అక్రమంగా నివసిస్తున్న ప్రతీ ఒక్కరికి వర్తిస్తుంది’ అని స్పష్టం చేశారు. ఇక జూలై 31లోగా ఎన్నార్సీ ప్రక్రియ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ.. భారత పౌరుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసిన క్రమంలో ఇప్పటికే 25 లక్షల మంది సంతకాలతో కూడిన పిటిషన్ కేంద్రానికి అందిందని.. అయితే ఇందులో ఉన్న బోగస్ అప్లికేషన్లు గుర్తించేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో చివరి తేదీని పొడగించాల్సిందిగా సుప్రీంకోర్టును కోరతామన్నారు. నిజమైన భారతీయ పౌరుడికి అన్యాయం జరుగకూడదనేదే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అదే విధంగా రోహింగ్యా ముస్లిం సంఖ్యకు సంబంధించి సమాధానమిస్తూ... దేశవ్యాప్తంగా వీరు వ్యాపించి ఉన్నారు, కాబట్టి ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి డేటాను సేకరించేందుకు కాస్త సమయం పడుతుందన్నారు. -
బీజేపీకి ఎన్ఆర్సీ ఎదురుదెబ్బ!
సాక్షి, న్యూఢిల్లీ : ‘దేశంలోకి వచ్చిన వలసదారులను తన్ని తరిమేయాలా, లేదా? వారు మన దేశ వనరులను చెదల్లా తినేస్తున్నారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ నమోదు (ఎన్ఆర్సీ) కార్యక్రమాన్ని చేపడతామని, సరైన డాక్యుమెంట్లులేని అక్రమ వలసదారులను దేశం నుంచి పంపిస్తామని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా పేర్కొంది. దీన్ని సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నా సరే, మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రయాణించినప్పుడల్లా చెబుతున్నారు. బీజేపీ ప్రతిపాదించిన ఎన్ఆర్సీ ప్రకారం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ ముస్లిం వలసదారులను గుర్తించి వారిని వెనక్కి పంపించడం, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులకు పౌరసత్వం కల్పించడం ఉద్దేశం. తద్వారా హిందువులందరి మద్దతు కూడగట్టడం బీజేపీ లక్ష్యం. ఈ ప్రచారం ద్వారానే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులను సమీకరించడం ద్వారా బీజేపీ కాస్త బలపడింది. ఈలోగా అస్సాంలో నిర్వహించిన ఎన్ఆర్సీ కసరత్తు పార్టీకి ప్రతికూల ఫలితాలను ఇచ్చింది. ఒక్క ముస్లింలే కాకుండా వేల సంఖ్యలో హిందువులు, ఆదివాసీలకు ఎన్ఆర్సీలో చోటు లభించకుండా పోయింది. ఈ విషయమై అక్కడి ప్రజలు ఇప్పటికీ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అలాంటి భయమే బంగ్లాదేశ్ నుంచి ఎక్కువగా బెంగాల్‌కు వలసవచ్చిన హిందువులకు పట్టుకుంది. సరైన పత్రాలు లేని కారణంగా తమను కూడా దేశం నుంచి పంపించి వేస్తారని వారు భయపడుతున్నారు. ఆ భయాన్ని మమతా బెనర్జీ తనకు సానుకూలంగా మలచుకుంటున్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే అక్రమవసలదారుల్లో హిందువులు కూడా దేశం నుంచి తరిమేస్తారని ఆమె హెచ్చరిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఎన్ఆర్సీ వల్ల ఒక్క ముస్లింలే దేశం నుంచి విడిచి వెళ్లి పోవాల్సి వస్తోందని, హిందువులకు అలాంటి భయం అవసరం లేదని అమిత్ షా చెప్పలేక పోతున్నారు. ఎన్నికల కోడ్ ప్రకారం మతాలను ప్రస్థావిస్తు మాట్లాడరాదు. ఈ కారణంగా బీజేపీకి ఇంతకుముందు ఆశించినన్ని సీట్లు బెంగాల్లో రాకపోవచ్చని రాజకీయ పండితులు అంచనావేస్తున్నారు. -
‘హిట్లర్ బతికుంటే ఆత్మహత్య చేసుకునే వాడు’
కోల్‌కతా : నియంతగా ప్రసిద్ధి చెందిన అడాల్ఫ్ హిట్లర్ గనక ఇప్పుడు బతికి ఉంటే.. మోదీ చర్యలు చూసి ఆత్మహత్య చేసుకునేవాడని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. రాయ్గంజ్లో ఎన్నికల ప్రచారంలో పాల్లొన్న దీదీ.. మోదీపై విమర్శల వర్షం కురిపించారు. హింసావాదులను, మూక హత్యలు చేసేవారిని మోదీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి.. దాని రూపు రేఖలను మార్చేశారని మండిపడ్డారు. దేశంలో ఉన్న అన్ని కేంద్ర ఏజెన్సీలను ప్రతిపక్షాలపై దాడులకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. ‘మోదీ సొంత డబ్బా కొట్టుకునే వ్యక్తి. అందుకే తన గురించి ఏకంగా సినిమానే తీయించాడు. కానీ అతను అల్లర్లను ప్రేరేపిస్తాడు. గుజరాత్ మారణకాండను ఎన్నటికి మర్చిపోర’ని తెలిపారు. జనసమూహాన్ని ఉద్దేశిస్తూ.. ‘బీజేపీ.. బెంగాల్లో జాతీయ పౌరసత్వ రిజిష్టర్‌ను అమల్లోకి తెచ్చి మిమ్మల్ని ఇక్కడ నుంచి తరిమేయాలని చూస్తుంది. ఒక వేళ వారు గనక దాన్ని అమల్లోకి తెస్తే ఎలాంటి తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందో వారికి తెలియద’ని హెచ్చరించారు. మోదీని గద్దె దింపితేనే.. నవ భారత నిర్మాణం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్.. బీజేపీకి గట్టి పోటీ ఇవ్వలేకపోయిందని.. అందుకే కాషాయ పార్టీ రోజు రోజుకు శక్తివంతంగా తయారయ్యిందన్నారు. ఒక వేళ కేంద్రంలో రాహుల్ గాంధీ అధికారంలోకి రావాలంటే ఇతర పార్టీల సాయం కావాలని వెల్లడించారు. అప్పుడు కేంద్రంలో తృణమూల్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. -
‘అస్సాంను మరో కశ్మీర్ కానివ్వం’
లఖింపూర్(అస్సాం): ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. అస్సాంను మరో కశ్మీర్ కానివ్వమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. అందుకోసమే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) తీసుకొచ్చామని అన్నారు. చోరబాటుదారులను గుర్తించటానికి ఎన్ఆర్సీ ఉపయోగపడుతుందని తెలిపారు. ఆదివారం అస్సాంలోని లఖింపూర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘అస్సాంను మరో కశ్మీర్ కానివ్వబోము. అందుకోసమే ఎన్నిసార్లైనా ఎన్ఆర్సీ ప్రక్రియను చేపట్టడానికైనా సిద్ధం. విదేశాల నుంచి వచ్చి అస్సాంలో తలదాచుకుంటున్న వారిని తరిమికొట్టేవరకు ఈ ప్రక్రియను చేపడతామ’ని తెలిపారు. అలాగే కాంగ్రెస్‌తో పాటు గతంలో ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న అస్సాం గణ పరిషత్‌పైన కూడా అమిత్ షా విమర్శల వర్షం కురిపించారు. వివాదస్పద పౌరసత్వ (సవరణ) బిల్లు కేవలం ఈశాన్య ప్రాంతాలకే పరిమితం కాదని.. ఇది దేశవ్యాప్తంగా ఉన్న శరణార్థులకు వర్తిస్తుందని వెల్లడించారు. పౌరసత్వ బిల్లుతో అస్సాం జనాభాలో మార్పు వస్తుందని.. లేకపోతే అస్సాం ప్రజలు ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉందన్నారు. పుల్వామా ఉగ్రదాడిని పాకిస్తాన్ తీవ్రవాదులు జరిపిన పిరికిపంద చర్యగా అమిత్ షా అభివర్ణించారు. జవాన్ల త్యాగం వృథా కాదని.. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం రాజీపడదని వ్యాఖ్యానించారు. -
ఎలాగైనా ఆపాలనుకుంటున్నారా?
న్యూఢిల్లీ: అస్సాంలో జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ) ప్రక్రియను ఎలాగైనా అడ్డుకోవాలని కేంద్రం భావిస్తోందని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్–మే నెలల్లో జరుగుతాయని భావిస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర సాయుధ బలగాలు విధులు నిర్వర్తించాల్సి ఉందని, ఆ సమయంలో ఈ ప్రక్రియను రెండు వారాల పాటు నిలిపేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దాఖలుచేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఎన్ఆర్సీని పూర్తిచేయడానికి గతంలో విధించిన జూలై 31 గడువును పొడిగించేది లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో కేంద్రం సహకరించడం లేదని, ఎన్ఆర్సీ ప్రక్రియను మొత్తం నాశనం చేసేలా హోం శాఖ వ్యవహరిస్తోందని తప్పుపట్టింది. రాష్ట్ర అధికారులకు లోక్‌సభ ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశాల్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల వల్ల ఎన్ఆర్సీ నమోదుకు ఆటంకం కలగకుండా చూడాలని ఇది వరకే అత్యున్నత ధర్మాసనం అస్సాం ప్రభుత్వం, ఎన్ఆర్సీ కోఆర్డినేటర్, ఈసీలకు సూచించింది. గడువులోనే పూర్తిచేస్తాం: రాజ్‌నాథ్ నిర్దిష్ట గడువులోగా ఎన్ఆర్సీని పూర్తిచేయడానికి కట్టుబడి ఉన్నామని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. విదేశీయులకు ఈ జాబితాలో స్థానం కల్పించమని, అలాగే ఒక్క భారతీయుడిని కూడా విస్మరించమని హామీ ఇచ్చారు. ఎన్ఆర్సీ ప్రక్రియ న్యాయబద్ధంగా జరగాలని కోరుకుంటున్నామని, ఇందుకు అవసరమైన అన్ని నిధుల్ని అస్సాంకు సమకూర్చామని చెప్పారు. సుప్రీంకోర్టు కేంద్రానికి చీవాట్లు పెట్టిన కొన్ని గంటల తరువాత రాజ్‌నాథ్ ఈ విధంగా స్పందించారు. -
నిరసనల మధ్యే వివాదాస్పద బిల్లుకు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. కాంగ్రెస్ సహా ప్రధాన విపక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించినా.. సభలో బీజేపీకి పూర్తి మెజార్టీ ఉండడంతో బిల్లుకు ఆమోదం లభించింది. సిటిజన్‌షిప్ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పౌరసత్వ సవరణ బిల్లు కేవలం అసోం రాష్ట్రం కోసం కాదని... పొరుగు దేశాల నుంచి భారత్‌కు వచ్చే శరణార్థులందరి కోసమని స్పష్టంచేశారు. ఈ బిల్లుతో ఎవరూ వివక్షకు గురికారని తెలిపారు. ఈ విషయంలో ఈశాన్య రాష్ట్రాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. అసోం ప్రజల హక్కులను ప్రభుత్వం ఎల్లప్పుడూ కాపాడుతుందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుపై ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఈ సవరణ వల్ల అసోంలో పెద్దఎత్తున అల్లర్లు జరుగుతాయని, దీన్ని మరోసారి సెలెక్ట్ కమిటీకి పంపించాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఇందుకు స్పీకర్ సుమిత్రా మహజన్ నిరాకరించారు. దీంతో ప్రభుత్వం తీరుకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అటు తృణమూల్ కాంగ్రెస్ కూడా పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించింది. బిల్లు ఆమోదం పొందితే అసోం సహా ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటాయని తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ హెచ్చరించారు. అయితే, విపక్షాల ఆందోళన మధ్యే పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో ఈశాన్యరాష్ట్రాల్లో ఆందోళనలు భగ్గుమన్నాయి. -
ఎన్ఆర్సీపై ప్రధాని భరోసా
ఇంఫాల్/సిల్చార్: నిజమైన పౌరులందరికీ జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ)లో చోటు దక్కుతుందనిఅస్సాం ప్రజలకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. పౌరసత్వ బిల్లుకు త్వరలోనే పార్లమెంటు ఆమోదం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఈశాన్య భారతంలో ప్రచారానికి మోదీ శుక్రవారం అస్సాంలో శంఖారావం పూరించారు. మణిపూర్‌లోనూ ఆయన పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అస్సాంలోని సిల్చార్ సమీపంలో నిర్వహించిన ‘విజయ సంకల్ప సమావేశం’లో మోదీ మాట్లాడారు. ‘ఎన్ఆర్సీని రూపొందిస్తున్నప్పుడు అనేకులు ఎదుర్కొన్న ఇబ్బందులు నాకు తెలుసు. కానీ నిజమైన పౌరులెవ్వరికీ అన్యాయం జరగదని నేను మీకు హామీనిస్తున్నా. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లేసినందుకుగాను నేను ఈ రాష్ట్ర ప్రజలకు రుణపడి ఉన్నా’ అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ మొత్తం 100 రోజుల్లో 20 రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. పనితీరును మార్చేశాం.. 2014లో తాము అధికారంలోకి వచ్చాక దేశంలో ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగుల పనితీరును మార్చేశామని మోదీ మణిపూర్‌లో చెప్పారు. ఈ ఈశాన్య రాష్ట్రంలో మోదీ ఎనిమిది కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి మరో నాలుగింటికి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వాలు శంకుస్థాపనలు చేసి వదిలేసిన రూ. 12 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను మేం ముందుకు తీసుకెళ్లాం. గత 4 దశాబ్దాల్లో మణిపూర్‌కు అభివృద్ధి ఫలాలను నాటి ప్రభుత్వాలు దక్కనివ్వలేదన్నారు. త్వరలో ఈశాన్య రాష్ట్రాల రాజధానుల మధ్య రైల్వే అనుసంధానత కల్పిస్తామని మోదీ చెప్పారు. -
బంగ్లాదేశీ ‘చెదల’ను పంపిస్తాం
జైపూర్: బంగ్లాదేశీ వలసదారులు చెదల వంటి వారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. వారందరినీ దేశం నుంచి వెళ్లగొడతామని ఆయన చెప్పారు. అస్సాంలో ఇటీవల ప్రచురించిన జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) గురించి షా మాట్లాడుతూ ‘బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ ద్వారా అస్సాంలో 40 లక్షల మంది అక్రమ వలసదారులున్నట్లు ప్రాథమికంగా తేలింది. వారిలో ఏ ఒక్క చొరబాటుదారుడినీ వదిలిపెట్టం. అందరినీ పంపిస్తాం’ అని రాజస్తాన్‌లో చెప్పారు. చొరబాటుదారులను కాంగ్రెస్ ఓటుబ్యాంకుగా చూసిందనీ, వారందరినీ దేశం నుంచి వెళ్లగొట్టేందుకు బీజేపీ కట్టుబడి ఉందని షా పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గాలిలో మేడలు కడుతున్నారనీ, రాజస్తాన్‌లో బీజేపీ నుంచి అధికారం లాక్కోవడం ఎవ్వరికీ సాధ్యం కాదని షా విశ్వాసం వ్యక్తం చేశారు. -
మమత బెనర్జీకి అమిత్ షా హెచ్చరిక
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో దుర్గాదేవి నిమజ్జనానికి, పాఠశాలల్లో సరస్వతి పూజకు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ మమతా బెనర్జీపై బీజేపీ చీఫ్ అమిత్ షా మండిపడ్డారు. ఇకపై అలాంటి ప్రయత్నాలు చేస్తే.. మమత అధికారాన్ని రోజుకో మెట్టు తగ్గిస్తామని హెచ్చరించారు. కోల్‌కతాలో శనివారం రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసిన ర్యాలీలో షా పాల్గొన్నారు. తృణమూల్‌ను కూకటి వేళ్లతో పెకలించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ‘దుర్గాపూజ తర్వాత విగ్రహాల నిమజ్జనానికి అనుమతివ్వరు. బెంగాల్‌లోని చాలా పాఠశాలల్లో సరస్వతి పూజ జరుపుకోకుండా అడ్డుకున్నారు. ఇలాంటివి జరగాల్సిందేనా? బీజేపీ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటుచేస్తే ఉత్సవాలన్నీ ఘనంగా జరుపుతాం. మమ్మల్ని ఎవరూ ఆపలేరు’ అని పేర్కొన్నారు. చొరబాటుదారులకు స్వాగతమా? మైనారిటీలను తృప్తిపరిచేందుకు, ఓటుబ్యాంకు రాజకీయాలు చేసేందుకు మమత సర్కారు ప్రయత్నిస్తోందని షా ఆరోపించారు. ‘రాష్ట్రంలోకి రోహింగ్యాలు, బంగ్లాదేశీ చొరబాటుదారులకు స్వాగతం పలుకుతారు. దీని ద్వారా ప్రజలకు మీరేం చెప్పదలచుకున్నారు? మైనారిటీ ఓటుబ్యాంకు రాజకీయాలకు పరిమితి ఉంటుంది’ అని షా విమర్శించారు. ర్యాలీలో తన ప్రసంగం ప్రత్యక్షప్రసారం కాకుండా టీవీ చానళ్లకు మమత హెచ్చరికలు జారీచేశారన్నారు. ‘మా పార్టీ కార్యకర్తలపై నాకు అచంచల విశ్వాసముంది. వారు ప్రతి గల్లీ, ప్రతి గ్రామం, ప్రతి ఇంటికీ వెళ్లి తృణమూల్ ఏం చేస్తోందో ప్రజలకు వివరిస్తారు’ అని స్పష్టం చేశారు. ఎన్నార్సీపై నోరు మెదపరే? అస్సాం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ)పై తమ విధానమేంటో మమత, రాహుల్‌లు సమాధానం ఇవ్వాలన్నారు. వీరిద్దరూ దేశం కోసం ఆలోచిస్తున్నారా? లేక ఓటుబ్యాంకు కోసమేనా అని ప్రశ్నించారు. ‘రాహుల్ గాంధీ ఎన్నార్సీపై తన అభిప్రాయాన్ని ఎందుకు వెల్లడించడం లేదు. ఆయనకు దేశభద్రత కన్నా ఓటు బ్యాంకే ముఖ్యమా?’ అని విమర్శించారు. అయితే, షా ర్యాలీ ఫ్లాప్ షో అని తృణమూల్ పేర్కొంది. ఎన్నార్సీ అమలు తీరుపైనే వ్యతిరేకం: కాంగ్రెస్ కోల్‌కతా: జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)కి తాము వ్యతిరేకం కాదని, అస్సాంలో అది అమలైన తీరును మాత్రమే తప్పు పడుతున్నామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఎన్నార్సీపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘ఈ సర్వే గందరగోళంగా జరిగిందనటానికి మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ కుటుంబ సభ్యులతోపాటు ప్రముఖుల పేర్లు జాబితాలో గల్లంతు కావడమే ఉదాహరణ’ అని అన్నారు. ‘మేం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం లేదు. ఎన్సార్సీని అమలు చేస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందని మోదీ ప్రభుత్వమే 2017లో సుప్రీంకోర్టుకు చెప్పింది. ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటి’ అని అన్నారు. -
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన ప్రధాని మోదీ!
న్యూఢిల్లీ: రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. అంబేడ్కర్ కలలుగన్న సమాజాన్ని నిర్మించేంతవరకు రిజర్వేషన్లు తొలగించబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దీనిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొదన్నారు. జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) విషయంలో విపక్షాలు ఆత్మరక్షణలో పడే ఆరోపణలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శనివారం ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాధి కల్పన, జీఎస్టీ, ఎన్నార్సీ, మహిళా సాధికారత, భారత్–పాక్ సంబంధాలు తదితర అంశాలపై మోదీ మాట్లాడారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► దేశంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. రోడ్లు, రైల్వే లైన్లు, సోలార్ పార్కులు తదతర మౌలికవసతుల ప్రాజెక్టులు వేగగతిన రూపుదిద్దుకుంటున్నాయి. వీటి ద్వారా భారీగా ఉపాధి కల్పన జరుగుతోంది. పెరుగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సానుకూల ప్రభావం ఉద్యోగ కల్పన రూపంలో కనబడుతుంది. ► గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు యూపీఏ రూపొందించిన జీఎస్టీని వ్యతిరేకించాననడం అర్థరహితం. అప్పుటి ఆర్థిక మంత్రి (పి.చిదంబరం) రాష్ట్రాల సమస్యలను వినేందుకు విముఖత చూపారు. మేం రాష్ట్రాల అభిప్రాయాలను, ఆందోళనలను పరిగణనలోకి తీసుకునే జీఎస్టీ చట్టాన్ని అమల్లోకి తెచ్చాం. తమ చుట్టూ దోపిడీ ముఠాను పెట్టుకున్న వారే జీఎస్టీని గబ్బర్ టాక్స్ అంటున్నారు. ► సుప్రీంతీర్పు ఆదేశాలతో రూపొందిన ఎన్నార్సీని వ్యతిరేకించడంలో అర్థం లేదు. తమపై తమకు, ఉన్నత రాజ్యాంగ సంస్థలపై నమ్మకం లేనివారంతా ఆత్మరక్షణలో పడి ఈ ఆరోపణలు చేస్తున్నారు. 2005లో పార్లమెంటులో తనేం చెప్పారో మమత గుర్తుతెచ్చుకోవాలి. ఎన్నార్సీపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోంది. ► దేశవ్యాప్తంగా జరుగుతున్న మూకోన్మాద ఘటనలు, మహిళలపై నేరాలు బాధాకరం. కానీ ఈ ఘటనలపై కొందరు రాజకీయాలు చేయడం దురదృష్టకరం. మహిళలపై నేరాలు, మూకోన్మాద చర్యల విషయంలో కఠినమైన చట్టాలు తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ► మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశ ప్రగతినీ ఊహించలేం. అందుకే మహిళల నేతృత్వంలో అభివృద్ధి జరిగేలా మేం చర్యలు తీసుకుంటున్నాం. చాలా పథకాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం. ► అంబేడ్కర్ కలలుగన్న రాజ్యాంగ లక్ష్యాలను ఇంకా చేరుకోలేదు. రిజర్వేషన్లు లేకుండా ఈ లక్ష్యాలను చేరుకోలేం. రిజర్వేషన్లపై ఎవరికీ అనుమానాలొద్దు. అంబేడ్కర్ ఆశయాల సాధనలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. సబ్కాసాథ్, సబ్కా వికాస్ మా నినాదం. బీజేపీ రిజర్వేషన్లు రద్దుచేస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారు. అవన్నీ అసత్య ప్రచారాలే. వీటిని నమ్మొద్దు. ► జమ్మూకశ్మీర్‌లో సుస్థిర ప్రభుత్వం మా అభిమతం. ముఫ్తీ మహ్మద్ సయీద్ ఉన్నంతవరకు పరిస్థితులు బాగానే ఉన్నాయి. తర్వాతే ఇబ్బందులు మొదలయ్యాయి. ► మా ప్రభుత్వానికి ప్రజాదరణ పెరుగుతోందనే విషషయం విపక్ష పార్టీలకు బాగా అర్థమైంది. అందుకే వారిపై వారికి నమ్మకం లేక అంతా కలిసి మాపై పోరాటానికి సిద్ధమయ్యారు. వీరు కుటుంబ పాలన, అవినీతిలో ఒకరిని మరొకరు మించిపోయారు. ఇప్పుడు ప్రజలు ఓటేయరని తెలిసి.. అనవసర అంశాలను వివాదం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. ► పొరుగుదేశాలతో సాన్నిహిత్యాన్ని కోరుకుంటానని చాలాసార్లు చెప్పాను. ఈ దిశగా మేం చాలా చర్యలు తీసుకున్నాం. పాక్ కాబోయే ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను నేను అభినందించాను. సుస్థిర, ఉగ్రవాద రహిత పాకిస్తాన్ ఏర్పాటుకు మా సహకారం ఉంటుంది. యువ మస్తిష్కాలే సృజన కేంద్రాలు న్యూఢిల్లీ: గొప్ప ఆలోచనలు ప్రభుత్వ కార్యాలయాల్లోనో, విలాసవంతమైన భవంతుల్లోనో పుట్టవని, యువ మస్తిష్కాల్లోనే చిగురిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేసిన ఐఐటీలు మార్పునకు చోదకశక్తులుగా వెలుగొందుతున్నాయని కొనియాడారు. సృజన, అంకుర పరిశ్రమలే దేశాభివృద్ధికి మూల స్తంభాలని పేర్కొన్నారు. వినూత్నత, సృజనశీల దృక్పథాన్ని అలవరచుకోని సమాజాలు పురోగమించవని హెచ్చరించారు. శనివారం ఐఐటీ బాంబే క్యాంపస్‌లో జరిగిన 56వ స్నాతకోత్సవంలో మోదీ ప్రసంగించారు. ఐఐటీల వంటి విశిష్ట విద్యా సంస్థల్లో నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని మేధావులు, విద్యావేత్తలను కోరారు. ఈ సందర్భంగా ఐఐటీ బాంబేకు మోదీ రూ.వేయి కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ఐఐటీలు సాధించిన ఘనతలను ప్రశంసించిన మోదీ..దేశవ్యాప్తంగా ఎక్కువగా ఇంజినీరింగ్ కళాశాలలు స్థాపించడానికి ఐఐటీల విజయాలే స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. ‘నేడు ఐఐటీలంటే కేవలం సాంకేతిక విద్యను నేర్పించే విద్యాలయాలే కాదు. దేశంలో మార్పును తీసుకొచ్చే సాధనాలుగా కూడా ఎదిగాయి. ప్రపంచవ్యాప్తంగా దేశానికి బ్రాండ్ ఇమేజ్ కల్పించాయి. ఐఐటీ గ్రాడ్యుయేట్లు నడిపిస్తున్న స్టార్టప్‌లే దేశం ఎదుర్కొంటున్న చాలా సమస్యలను పరిష్కరించడంలో ముందున్నాయి. గొప్ప ఆలోచనలు ప్రభుత్వ కార్యాలయాల నుంచో, విలాసవంతమైన భవనాల నుంచో రావు. మీలాంటి యువ మెదళ్లలోనే అవి పుడతాయి’ అని మోదీ అన్నారు.