
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లులో కొన్ని మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. గత లోక్‌సభ రద్దైన నేపథ్యంలో ఆ బిల్లుకు కూడా కాలం చెల్లిన విషయం తెలిసిందే. దాంతో, కొత్తగా కొన్ని కీలక మార్పులతో ఆ బిల్లును మళ్లీ సభ ముందుకు తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా, ‘అక్రమ వలసదారులు’ అనే పదానికి నిర్వచనాన్ని కూడా బిల్లులో చేర్చనున్నారని సోమవారం అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులకు తట్టుకోలేక భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లు, పార్శీలకు.. వారివద్ద సరైన పత్రాలు లేనప్పటికీ.. భారతీయ పౌరసత్వం కల్పించే దిశగా పౌరసత్వ చట్టం, 1955లో సవరణ చేపట్టేందుకు ఉద్దేశించిన బిల్లు అది. ఇది బీజేపీ ప్రచారాస్త్రాల్లో ఒకటి.
Comments
Please login to add a commentAdd a comment