
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ), పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందిన నాటి నుంచి యావత్ భారత్ ఆగ్రహావేశాలతో ఊగిపోతుంది. సీఏఏకు వ్యతిరేకంగా సాధారణ యువత, యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లమీదకు వచ్చి చేపట్టిన నిరసనలు పలుచోట్ల హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో సైతం సీఏఏకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొత్త కొత్త పద్దతిలో నెటిజన్లు తమ నిరసనను తెలుపుతున్నారు.
తాజాగా నూతన వధూవరులు కూడా సీఏఏకు వ్యతిరేకంగా తమదైన శైలిలో నిరసనను తెలుపుతున్నారు. సీఏఏ, ఎన్నార్సిని వ్యతిరేకిస్తూ ఓ నవజంట పెళ్లి మండపంలో ‘నో ఎన్నార్సీ, నో సీఏఏ’ అని ప్లకార్డులు పట్టుకున్నారు. ఈ ఫోటోలను ఓ వ్యక్తితో #IndiaAgainstCAA_NRC" హాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. కేరళకు చెందిన ఆ జంట ఎన్నార్సీకి వ్యతిరేకంగా వినూత్న నిరసనను తెలిపింది. అలాగే మరో జంట పెళ్లి దుస్తులు ధరించి చేతుల్లో ‘విత్‌డ్రా క్యాబ్’ పోస్టర్‌ను చూపిస్తూ నిరసనను తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment