విదేశీ పత్రిక కథనంపై ‘ట్వీట్ల’ హోరు! | Twitter Reacts to the Anti-national Economist | Sakshi
Sakshi News home page

విదేశీ పత్రిక కథనంపై ‘ట్వీట్ల’ హోరు!

Published Fri, Jan 24 2020 2:43 PM | Last Updated on Fri, Jan 24 2020 2:59 PM

Twitter Reacts to the Anti-national Economist - Sakshi

న్యూఢిల్లీ : ‘ఇంటాలరెంట్‌ ఇండియా–హౌ మోదీ ఈజ్‌ ఎన్‌డేంజరింగ్‌ వరల్డ్స్‌ బిగ్గెస్ట్‌ డెమోక్రసీ (అసహన భారత దేశం–ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి మోదీతో ముచ్చుకొస్తున్న ముప్పు)’ అన్న శీర్షికతో లండన్‌ నుంచి వెలువడుతున్న ప్రముఖ ఆర్థిక అంశాల విశ్లేషణ పత్రక ‘ది ఎకనమిస్ట్‌’ జనవరి 23 నాటి సంచికలో కవర్‌ పేజీ వార్త రాయడం భారత్‌లో అలజడి రేపింది. ప్రధానంగా ఆ పత్రికను తిడుతూ ట్వీట్లు వెలువడుతున్నాయి. (తినే అలవాట్లు బట్టి దేశమో చెప్పొచ్చు..)

‘మందిర్, సీఏఏ, ఎన్‌ఆర్‌సీ తదితర అంశాలపై కాకుండా దేశ ఆర్థిక పరిస్థితులపై దష్టి సారించాల్సిందిగా వీరంతా ఎందుకు కోరుకుంటున్నారంటే, వచ్చే ఎన్నికల్లో మోదీ ఓడిపోవాలని’ అంటూ పంకజ్‌ మిశ్రా స్పందించారు. 

‘దేశం పెద్దదా ? దేశ ఆర్థిక వ్యవస్థ పెద్దదా? ఆర్థిక పరిస్థితితి అడ్డం పెట్టుకొని ప్రపంచం ముందు భారత్‌ పరువు ఎందుకు తీస్తారు? మనం దీన్ని సహించ వద్దు!’ అంటూ పంకజ్‌ మిశ్రా మరో ట్వీట్‌ చేశారు. 

‘ఆర్థిక అంశం పాశ్చాత్యుల దక్పథం. ఆ మాయలో భారతీయులు పడకూడదు’ అంటూ నిర్మలా థాయ్‌ హల్వేవాలీ ట్వీట్‌ చేశారు. ‘మోదీ వద్దు, రాహుల్‌ గాంధీ కావాలని ది ఎకనమిస్ట్‌ చెప్పింది. రాహుల్‌ గాంధీయే వద్దు, మోదీ కావాలని భారత్‌ చెప్పింది. వారెందుకు రైటో, భారత్‌ ఎందుకు తప్పో వారు ఇప్పటికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు’ అంటూ రామ్‌ ట్విట్టర్‌లో స్పందించారు. ‘పండోరా బాక్స్‌ తెరచుకుంది. యాంటీ నేషనల్‌ ఎకనమిస్ట్‌ నోరు మూసుకోవడానికి ఏం తీసుకుంటుందో’ అని సుమన్‌ జోషి స్పందించారు. (హసీనా వ్యాఖ్యల అంతరార్థం)

2010లో మన్మోహన్‌ సింగ్‌ నేతత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే ది ఎకనమిస్ట్‌ పత్రిక ‘హౌ ఇండియాస్‌ గ్రోత్‌ విల్‌ అవుట్‌పేస్‌ చైనాస్‌ (భారత్‌ పురోగతి చైనా ప్రగతిని ఎలా అధిగమిస్తుంది)’ అనే శీర్షికతో కవర్‌ పేజీ వార్తా రాసింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని రామ్‌ స్పందించినట్లున్నారు. 

మోదీని లేదా మోదీ ప్రభుత్వాన్ని విదేశీ పత్రికలు విమర్శించడం ఇదే మొదటి సారి కాదు. మోదీని ఉద్దేశించి ‘ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌’ అంటూ ‘టైమ్‌’ మాగజైన్‌ ఇంతకు ముందు ఓ వార్తను ప్రచురించింది. అప్పుడు ‘బాయ్‌కాట్‌టైమ్‌’ అనే హాష్‌ట్యాగ్‌తో భారతీయులు స్పందించారు. ఈ సారి కూడా అలాంటి ట్యాగ్‌తో స్పందించబోయి తప్పులో కాలేశారు. బాయ్‌కాట్‌ ది ఎకనమిస్ట్‌ అనబోయి ‘బాయ్‌కాట్‌ఎకానమి’ హ్యాప్‌ట్యాగ్‌తో స్పందించారు. ‘ఎకానమి వేరు ది ఎకనమిస్ట్‌ వేరనే విషయాన్ని దయచేసి గ్రహించండి, బాయ్‌కాట్‌ ఎకానమిని ట్రెండ్‌ చేయకుండా మోదీకి మంచి ఆర్థిక సలహాలు ఇవ్వండి’ అంటూ మెల్విన్‌ లూయీ ట్వీట్‌ చేశారు. (సీఏఏ : హింస చల్లారంటే అదొక్కటే మార్గం!)

‘ఈ టేల్‌ ఆఫ్‌ టూ కవర్స్‌ 2010–2020... అంతకన్నా చెప్పేదేమీ లేదు. ఏమన్నంటే యాంటీ నేషనల్‌ అనే ప్రదం ఉంది’ అంటూ ఇండియా టుడే గ్రూప్‌ కన్సల్టింగ్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ స్పందించారు. ఆయన దశాబ్దం కిందటి, ఇప్పటి ‘ది ఎకనమిస్ట్‌’ కవర్‌ పేజీలను ట్వీట్‌కు ట్యాగ్‌ చేశారు. చార్లెస్‌ డికెన్స్‌ రాసిన ‘టేల్‌ ఆఫ్‌ టు సిటీస్‌’ చారిత్రక నవలను దష్టిలో పెట్టుకొని రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ట్వీట్‌ చేసినట్లు కనిపిస్తోంది. (సీఏఏపై కేంద్రానికి సుప్రీం నోటీసులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement