
షహీన్‌బాగ్‌లో నిరసన ప్రదర్శన
న్యూఢిల్లీ: గత నెల రోజులుగా జాతీయ పౌరపట్టిక (ఎన్నార్సీ), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లపై నిరసనలు తెలుపుతున్న బామ్మలు సహా 1,000 మంది ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో ఆదివారం జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ యూనివర్సిటీలో చదువుతూ ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తల్లి రాధికా వేముల, గుజరాత్‌కు చెందిన ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీలు కూడా పాల్గొన్నారు. సీఏఏ, ఎన్నార్సీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు జాతీయ గీతాన్ని ఆలపించారు. బామ్మల్లో శర్వారి (75), బిల్కిస్ (82), ఆస్మా ఖాటూన్ (90)లు ఉన్నారు. తమ గోడును పట్టించుకోని ప్రధాని తమకెందుకని ప్రశ్నించారు.