![Bihar Assembly Passes Resolution Against NRC - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/25/-nrc.jpg.webp?itok=MBkfnXnP)
పట్నా : ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన క్రమంలో బిహార్‌లో ఎన్‌ఆర్‌సీ అమలు చేయబోమని నిర్ణయిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ మంగళవారం తీర్మానం ఆమోదించింది. జాతీయ పౌరపట్టిక (ఎన్‌పీఆర్)ను 2010లో ఉన్న రూపంలో అమలు చేస్తామని బిహార్ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. స్పీకర్ విజయ్ కుమార్ చౌధరి ఈ తీర్మానాన్ని సభ ముందుంచగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిహార్‌లో ఎన్‌ఆర్‌సీ అవసరం లేదని, ఎన్‌పీఆర్‌ను 2010 ఫార్మాట్‌లో కేంద్రం అమలుచేయాలని ఈ తీర్మానంలో పొందుపరిచారు.
తీర్మానం ఆమోదానికి ముందు బిహార్ అసెంబ్లీలో పాలక ఎన్డీయే సభ్యులు, విపక్ష సభ్యుల మధ్య ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ అంశాలపై తీవ్ర వాగ్యుద్ధానికి దిగడంతో సభలో గందరగోళం చెలరేగింది. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను విపక్ష నేత తేజస్వి యాదవ్ నల్ల చట్టాలుగా అభివర్ణిస్తూ వీటిపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. నూతన చట్టాలు దేశాన్ని మతపరంగా విభజిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. తేజస్వి యాదవ్ వ్యాఖ్యలను పాలక సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. విపక్ష నేత రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment