Assembly resolution
-
అనుమానాలొద్దు.. సలహాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం ఇంటింటి సర్వే చేస్తూనే బీసీల అభ్యున్నతి లక్ష్యంగా ఆ వర్గానికి సంబంధించిన కుల గణన చేయటానికి శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంలో తమ చిత్తశుద్ధిని ప్రతిపక్షాలు శంకించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పాలితులను పాలకులను చేయడానికే తమ తపన అని వ్యాఖ్యానించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి చేపట్టిన చర్యల తరహాలోనే రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడే గొప్ప నిర్ణయమైనందున దాన్ని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన కులగణన తీర్మానంపై చర్చలో భాగంగా బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తిన సందేహాలపై సీఎం వివరణ ఇచ్చారు. అండగా ఉండాలంటే లెక్కలు తెలియాలని సుప్రీం చెప్పింది ‘ఈ తీర్మానంపై సలహాలు సూచనలు ఇవ్వటం కంటే అనుమానాలు లేవనెత్తడం ద్వారా ఈ అంశాన్ని పక్కదోవ పట్టించటంతో పాటు ప్రజల్లో సందేహాలు రేకెత్తించేలా ప్రధాన ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్నారు. యూపీఏ–1 హయాంలో మైనారిటీల అభ్యున్నతి కోసం చర్యలు చేపట్టాలని నిర్ణయించి జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ వేశారు. దాని సిఫారసుల ఫలితంగా ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పుడు బీసీల సమగ్ర అభ్యున్నతి కోసం, వారికి ప్రభుత్వం అండగా నిలవాలన్న రాహుల్‌గాంధీ ఆలోచన మేరకు మా ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ప్రజలకు వెల్లడించలేదు. పదేళ్లయినా అది ఓ రహస్య నివేదికగానే ఉండిపోయింది. ఒకే ఒక కుటుంబం ఆ వివరాలను అవసరమైనప్పుడు చూసుకుని, ఎన్నికల సమయంలో దాన్ని వాడుకుంది. మాకు అలాంటి ఉద్దేశం లేదు. ఈ తీర్మానం అత్యంత కీలకమైంది. బలహీనవర్గాలకు అండగా నిలబడాలంటే ఆ వర్గం లెక్కలేంటో తెలియాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీన్ని అమలు చేసే క్రమంలో న్యాయ, చట్టపరమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉందనే అనుమానాలు ఏవైనా ప్రతిపక్షానికి ఉంటే వాటిని వెల్లడిస్తూ మంచి సూచనలు చేయాలి..’అని సీఎం కోరారు. అర శాతం ఉన్నోళ్లకు బాధగానే ఉంటుంది.. ‘అర శాతం ఉన్నోళ్లకు కచి్చతంగా బాధ ఉంటుంది. రాష్ట్రాన్ని గుప్పిట్లో ఉంచుకున్నోళ్లకు.. ఇప్పుడు లెక్కలన్నీ బయటకు వచ్చి 50 శాతం ఉన్నోళ్లకు రాజ్యాధికారంలో భాగం ఇవ్వాల్సి వస్తుందన్న బాధ ఉండొచ్చు. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నేత వచ్చి అభిప్రాయం చెప్పాలి. లేదా వారు బాధ్యత అప్పగించిన వారైనా చెప్పాలి. నకలుæ చిట్టీలు అందించినట్టు కడియం శ్రీహరి పక్కన చేరి వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కడియం శ్రీహరి చిత్తశుద్ధిపై మాకు సందేహం లేదు. కానీ, పక్కన కూర్చున్నవారి సావాస దోషం ఆయనను తప్పుదోవ పట్టిస్తోంది. మేనిఫెస్టో, ఎన్నికల హామీలపై చర్చ కావాలంటే ప్రత్యేకంగా పెట్టుకుందాం. 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపక్ష పార్టీ ఏం హామీ ఇచ్చింది, వాటిని ఎంతమేర అమలు చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచి్చన హామీలు, ఈ 70 రోజుల్లో అమలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిద్దాం..’అని రేవంత్ అన్నారు. కేవలం బీసీల కులగణనతో వారికే నష్టం: గంగుల కమలాకర్ బీఆర్ఎస్ సభ్యుడు గంగుల కమలాకర్ తీర్మానంపై చర్చను ప్రారంభించారు. తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని, అయితే దీనిపై కొన్ని సందేహాలున్నాయని అన్నారు. తీర్మానం కాకుండా బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కేవలం బీసీ కుల గణన చేస్తే చివరికి బీసీలే నష్టపోతారని పేర్కొన్నారు. సర్వే ఎప్పట్లోగా చేసి వివరాలు వెల్లడిస్తారో కూడా చెప్పాలన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించారని, వచ్చే జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో దాన్ని అమలు చేయాలని కోరారు. బీసీలకు రూ.20 వేల కోట్ల బడ్జెట్ పెడతామని, బీసీ సబ్‌ప్లాన్ తెస్తామని చెప్పినా బడ్జెట్లో వాటి ఊసు లేదన్నారు. తీర్మానంలో స్పష్టత లేదు: కడియం శ్రీహరి తీర్మానంలో స్పష్టత లోపించిందని, సమగ్ర కుటుంబ సర్వే అని, బీసీ కుల గణన అని ఉందని, ఇందులో ఏది చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని తీర్మానంలో పూర్తి స్పష్టత ఉందని, అన్ని వర్గాలు, అన్ని కులాల ఆర్థిక, సామాజిక ఇతర అంశాల పూర్తి వివరాలను సర్వే ద్వారా సేకరించనున్నట్టు చెప్పారు. బీసీ కులగణన కూడా ఇందులో భాగమేనని స్పష్టం చేశారు. విపక్షం ఒకవేళ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్టైతే ఆ విషయం బహిరంగంగా చెప్పాలని అన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా కులగణన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే (కులగణన) పేరుతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిపేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వెనుకబడిన తరగతులతోపాటు ఎస్సీ, ఎస్టీ ఇతర వర్గాల అభ్యున్నతికి చేపట్టాల్సిన ప్రణాళికలను రూపొందించేందుకు ఉద్దేశించిన ఈ తీర్మానాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం సభ ముందుంచారు. సీఎం ఎ.రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్, గంగుల కమలాకర్, కడియం శ్రీహరి, కాలేరు వెంకటేశ్, కాంగ్రెస్ సభ్యులు వాకాటి శ్రీహరి, శంకరయ్య, ఆది శ్రీనివాస్, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు చర్చలో పాల్గొన్నారు. చట్టం అవసరం లేదు: పొన్నం ప్రభాకర్ జనాభా దామాషా పద్ధతిలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కులగణన ఎలా చేయాలనే దానిపై అందరి అభిప్రాయాలు, సలహాలు తీసుకొని ముందుకు వెళ్తామని, ఇందుకు సంబంధించిన విధివిధానా లు రూపొందిస్తామని చెప్పారు. కులగణన తీర్మానంపై సభలో జరిగిన చర్చకు ఆయన బదులిచ్చారు. కులగణనకు ఎలాంటి చట్టం అవసరం లేదని, 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎలాంటి చట్టం లేకుండానే చేపట్టిందని తెలిపారు. అయితే తర్వాత వచ్చిన మోదీ ప్రభుత్వం దీనిని పక్కన పెట్టడంతో పదేళ్లుగా వెనక్కు పోయిందని అన్నారు. 2014లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరిపినప్పటికీ బయట పెట్టలేదని విమర్శించారు. తాజాగా చేపట్టనున్న సర్వే అణగారిన, వెనుకబడిన వర్గాల ప్రజలు రాజకీయంగా, సామాజికంగా ఎదగడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2014 నుంచి 2023 వరకు అప్పటి ప్రభుత్వం బీసీల కోసం రూ.23 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. ఎంబీసీలకు వెయ్యి రూపాయలు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. న్యాయపరమైన సలహాల మేరకే ముందుకు: భట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, పార్టీ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా రాష్ట్రంలో కులగణనకు అంకురార్పణ చేస్తున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన సలహాలు, సూచనలు తీసుకున్నామన్నారు. ‘ఎవరెంత ఉంటారో వారికి అంత చెందాలి’అని రాహుల్‌గాంధీ చెప్పారని, అందుకు అనుగుణంగానే ఈ నెల 4న కేబినెట్లో చర్చించి కులగణన చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. బీసీలకు సబ్‌ప్లాన్ కూడా తీసుకొస్తామని, సర్వే అనంతరం బీసీల శాతాన్ని కూడా ప్రకటిస్తామని చెప్పారు. చట్టబద్ధత కల్పిస్తేనే మంచిది: కేటీఆర్ రాష్ట్రంలో కులగణనను బీఆర్ఎస్ సంపూర్ణంగా స్వాగతిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చట్టబద్ధత కల్పిస్తేనే ఫలవంతమవుతుందని చెప్పారు. బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ మొదటి నుంచి పనిచేస్తోందన్నారు. 2004లోనే కేసీఆర్.. ఆర్.కృష్ణయ్య, వకుళాభరణం కృష్ణమోహన్ రావుతో కలసి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలసి ఓబీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. 2014 తర్వాత శాసనసభలో రెండుసార్లు ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపించినట్లు తెలిపారు. ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలి: అక్బరుద్దీన్ రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసేందుకు వీలుగా కులగణన చేపట్టేందుకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. జనాభా ప్రాతిపదికన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలతోపాటు మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే నిబంధనలను తొలగించాలన్నారు. కూనంనేని మాట్లాడుతూ.. కులగణనకు సంబంధించిన విధివిధానాలు ఏమిటో తెలపాలని విజ్ఞప్తి చేశారు. బిల్లు రూపంలో తీసుకొస్తే చట్టబద్ధత ఉంటుందని సూచించారు. -
సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన కార్మికులు
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద కార్మిక సంఘాల నేతలు చేపట్టిన రిలే దీక్షలు 100వ రోజుకు చేరుకున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విశాఖ స్టీల్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ తీర్మానం ఉద్యమానికి కొండంత బలం ఇస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం జగన్ రెండు సార్లు లేఖ రాశారని, విశాఖ ఉక్కు ఉద్యమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉందని రాజశేఖర్ అన్నారు. చదవండి: ఆనందయ్య కరోనా మందు: ల్యాబ్ నుంచి పాజిటివ్ రిపోర్ట్ ‘పరిషత్ ఎన్నికల తీర్పుపై డివిజన్ బెంచ్‌కు ప్రభుత్వం’ -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్దం: విజయసాయిరెడ్డి
-
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం..
సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్దంగా ఉన్నామని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రజలు ఎంతమాత్రం ఒప్పుకోరని, త్వరలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేపడతామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాటలో ఎలా నడిపించాలనే అంశంపై సీఎం జగన్ ప్రధాని మోదీకి రెండో సారి లేఖ రాశారని వివరించారు. సీఎం జగన్ అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి, ప్రజల ఆకాంక్షను, సెంటిమెంట్‌ను ప్రధానికి వివరిస్తారని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దీర్ఘకాల పోరాటంతో సాధించుకున్నదని, గతంలో జరిగిన స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు. 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే 20 వేల మంది ఉపాధి కోల్పోతారని హెచ్చరించారు. మొదట్లో స్టీల్ ప్లాంట్ అత్యుత్తమంగా నడిచిందని, చంద్రబాబు హయాం (2014-15) నుంచే నష్టాల బాట పట్టిందని ఆరోపించారు. సొంత గనులు లేకపోవడం ప్లాంట్ నష్టాల బాట పట్టడానికి మరో కారణమని తెలిపారు. కేంద్రం సొంత గనులు కేటాయిస్తే లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని వివరించారు. రుణభారాన్ని మూలధనంగా మార్చాలని కేంద్రాన్ని కోరామని, కేంద్రం కేవలం నష్టాలను మాత్రమే చూపించడం సరికాదని అన్నారు. -
ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా బిహార్ అసెంబ్లీ తీర్మానం
పట్నా : ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన క్రమంలో బిహార్‌లో ఎన్ఆర్సీ అమలు చేయబోమని నిర్ణయిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ మంగళవారం తీర్మానం ఆమోదించింది. జాతీయ పౌరపట్టిక (ఎన్పీఆర్)ను 2010లో ఉన్న రూపంలో అమలు చేస్తామని బిహార్ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. స్పీకర్ విజయ్ కుమార్ చౌధరి ఈ తీర్మానాన్ని సభ ముందుంచగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిహార్‌లో ఎన్ఆర్సీ అవసరం లేదని, ఎన్పీఆర్ను 2010 ఫార్మాట్లో కేంద్రం అమలుచేయాలని ఈ తీర్మానంలో పొందుపరిచారు. తీర్మానం ఆమోదానికి ముందు బిహార్ అసెంబ్లీలో పాలక ఎన్డీయే సభ్యులు, విపక్ష సభ్యుల మధ్య ఎన్పీఆర్, ఎన్ఆర్సీ అంశాలపై తీవ్ర వాగ్యుద్ధానికి దిగడంతో సభలో గందరగోళం చెలరేగింది. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను విపక్ష నేత తేజస్వి యాదవ్ నల్ల చట్టాలుగా అభివర్ణిస్తూ వీటిపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. నూతన చట్టాలు దేశాన్ని మతపరంగా విభజిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. తేజస్వి యాదవ్ వ్యాఖ్యలను పాలక సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. విపక్ష నేత రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. చదవండి : ఎన్ఆర్సీ తప్పనిసరి -
రాష్ట్ర పేరు మార్పునకు అసెంబ్లీ తీర్మానం
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పేరు మార్పులో కీలక ముందడుగు పడింది. గత కొంత కాలంగా బెంగాల్ పేరు మార్పు కోసం సీఎం మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పేరును ‘బంగ్లా’గా మార్చుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ గురువారం తీర్మానం చేసింది. అన్ని భాషల్లోనూ ‘బంగ్లా’ అనే పేరే ఉంటుందని అందులో పేర్కొంది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్ర హోం శాఖ ఆమోదం పొందిన వెంటనే ఈ పేరు అమల్లోకి రానుంది. 2016లో పశ్చిమ బెంగాల్ పేరును బెంగాలీలో ‘బంగ్లా’గా, ఇంగ్లిష్‌లో ‘బెంగాల్’గా, హిందీలో ‘బంగాల్’గా మార్చుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. అప్పుడు దీనిని విషక్ష కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు వ్యతిరేకించాయి. ఈ తీర్మానంపై కేంద్రం స్పందిస్తూ.. మూడు భాషల్లో వేర్వేరు పేర్లు కాకుండా, అన్ని భాషల్లో ఒకే పేరు ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచింది. దీంతో 2017 సెప్టెంబర్ 17న పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగ్లా’ గా మార్చుతూ మమతా క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది. కాగా బెంగాల్లో అక్రమంగా చెలామణిలో ఉన్న ఓ లిక్కర్ బ్రాండ్‌కు బంగ్లా అనే పేరు ఉంది. దీంతో చాలా మంది బెంగాల్ వాసులు ఈ పేరుపై అభ్యంతరం తెలుపుతున్నారు. ప్రస్తుతం బెంగాల్‌ని పశ్చిమ్ బంగా, పశ్చిమ్ బంగ్లా అని పిలుస్తున్నారు. -
పాలన అద్భుతమని అసెంబ్లీలో తీర్మానించాలి
♦ అలా చేస్తే పాదయాత్ర ఆపేస్తాం ♦ సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ♦ సామాజిక న్యాయం అమలుపై ప్రత్యేక అసెంబ్లీ భేటీకి డిమాండ్ సాక్షి, హైదరాబాద్/మంచాల: రాష్ట్రంలో అణగారిన వర్గాలకు అద్భుతంగా సామాజిక న్యాయం అమలు చేస్తున్నామని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తే తమ పాదయాత్ర వెంటనే ఆపేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పినట్లు క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లేవని, అందుకే సామాజిక న్యాయం అమలు తీరుపై చర్చించేందుకు 5 రోజుల పాటు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం-రాష్ర్ట సమగ్రాభివృద్ధిపై ఈ నెల 17న సీపీఎం ప్రారంభించిన 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర శుక్రవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్ గ్రామంలో 100 కి.మీ. దాటింది. సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలని ఈ సందర్భంగా ప్రజ లకు తమ్మినేని పిలుపునిచ్చారు. సంక్షేమ కార్యక్రమాలు సరిగా అమలు కావట్లేదని, డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం మొదలు కాకపోవడంతో కేసీఆర్‌పై , సర్కారుపై ప్రజలు మండిపడుతున్నారన్నారు. దళితులకు మూడెకరాల భూమి కాదు కదా.. చనిపోతే మూడు గజాల స్థలం కూడా ఇవ్వట్లేదని విమర్శించారు. పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన, ఆయా వర్గాల ప్రజలు ఇస్తున్న మద్దతు తమను ఉత్సాహంగా ముందుకు నడిపిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు గ్రామాల్లో అంతిమసంస్కారాలు చేసేందుకు కనీసం శ్మశానాలు కూడా కరువయ్యాయని సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. కాగా, సీపీఎం పాదయాత్రకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. పీసీసీ నేత ఎం.కోదండరెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. -
విభజనకు నోచుకోని హైకోర్టు
తెలంగాణ సర్కారు స్థలం చూపినా ఫలితం శూన్యం ఏపీలో హైకోర్టు ఏర్పాటయ్యే వరకూ విభజన లేనట్టే! హైకోర్టు విభజన ఎటూ తేలలేదు. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసినా, ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపచేసినా, గచ్చిబౌలిలో సర్కారు స్థలం చూపినా హైకోర్టు విభజన మాత్రం జరగలేదు. గచ్చిబౌలిలో హైకోర్టు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం స్థలం చూపడం, దీనిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి స్పందించి హైకోర్టు సీజేకు లేఖ రాయడంతో ఇక విభజన ఖాయమని అందరూ భావించారు. అయితే చట్టంలో నిర్దేశించిన ప్రకారం ఏపీ హైకోర్టు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత హైకోర్టే ఉమ్మడిగా ఉంటుందని సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల స్పష్టంచేసింది. కొత్త రాష్ట్రం ఏర్పాటైన కొంతకాలం తర్వాత హైకోర్టు విభజన కోసం తెలంగాణ న్యాయవాదులు ఉద్యమాన్ని ప్రారంభించారు. అటు హైకోర్టులో ఇటు జిల్లాస్థాయి కోర్టుల్లో ఆందోళన కొనసాగించారు. తెలంగాణ ప్రభుత్వం స్థలం చూపితే మూడు నెలల్లో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటవుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ మార్చి 15న స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత నాలుగు రోజులకు హైకోర్టు విభజన కోసం తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది. అనంతరం సదానంద గౌడ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. కోర్టు విభజన అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రులు, న్యాయశాఖ మంత్రుల సమావేశంలో తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హైకోర్టు విభజనకు డిమాండ్ చేశారు. తెలంగాణ ఎంపీలు పలుమార్లు పార్లమెంట్లో హైకోర్టు విభజన అంశాన్ని లేవనెత్తారు. ఇదిలా ఉండగానే.. హైకోర్టు విభజన కోసం కేంద్రం తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ వ్యాజ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సాధన సమితి, కొందరు లాయర్లు కూడా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. పిల్‌పై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత హైకోర్టు ఉమ్మడిగా కొనసాగుతుందని తేల్చిచెప్పింది. -
ఫీజులు, రుణాలు చెల్లించొద్దు
* ప్రజలకు కాంగ్రెస్ శాసనసభాపక్షం పిలుపు * టీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలి * పోలవరం ఆర్డినెన్సు రద్దుపై అసెంబ్లీ తీర్మానం చేయాల్సిందే * లేదంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులెవరూ ఈ విద్యా సంవత్సరానికి ఫీజులు కట్టొద్దని కాంగ్రెస్ శాసనసభాపక్షం పిలుపునిచ్చింది. అలాగే రైతులెవరూ బ్యాంకు రుణాలు చెల్లించొద్దని కోరింది. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పోలవరం ఆర్డినెన్సును తక్షణమే రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని పేర్కొంది. బుధవారం అసెంబ్లీ కమిటీ హాలులో సీఎల్పీ సమావేశమై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం ఐదు తీర్మానాలు చేసింది. మల్లు భట్టివిక్రమార్క, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఆ వివరాలను వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురికాని గ్రామాలను కూడా ఆంధ్రలో కలపడం వెనుక పెద్ద కుట్ర కనిపిస్తోంది. కేంద్రం నిర్ణయంవల్ల లక్షలాది ఎకరాలకు సాగునీరందించే రుద్రమకోట ప్రాజెక్టును తెలంగాణ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. తక్షణమే పోలవరం ఆర్డినెన్సును ఉపసంహరించుకోవాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. -తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకూ కేజీ నుంచి పీజీ దాకా సీబీఎస్ఈ సిలబస్‌తో ఆంగ్ల మాద్యమంలో ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామని టీఆర్ఎస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అలాగే * లక్షలోపు రైతు రుణాలను రద్దు చేస్తామని పేర్కొంది. పాఠశాల, కళాశాలల అడ్మిషన్లు మొదలయ్యాయి. విద్యార్థులెవరూ ఫీజులు కట్టొద్దు. యాజమాన్యాలేవీ ఫీజులు తీసుకోవద్దు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలి. ఎంసెట్ కౌన్సెలింగ్ సమయంలోనూ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. - రైతులు కూడా రుణాలు చెల్లించొద్దు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున తక్షణమే రుణ వసూళ్లను నిలిపివేయాలి. కొత్త రుణాలిప్పించాలి. ఐకేపీ ధాన్య సేకరణ సందర్భంగా రైతులకిస్తున్న చెక్కులు బ్యాంకుకు వెళితే నగదు విడుదల చేయకుండా రుణాలు చెల్లించాలంటూ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. అందోళనలో రైతులున్నందున వెంటనే రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలి. -ఉద్యోగుల వయోపరిమితిని 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ స్వాతంత్య్ర సమరయోధులుగా ప్రకటించి పెన్షన్ లేదా ఉద్యోగం, ఇళ్లు, భూమి ఇవ్వాలి. -
తీర్మానం అంటే తెలంగాణవాదులకు ఎందుకు భయం: సీఎం
చట్టసభల్లో 80 శాతం బిల్లులు మూజువాణి ఓటుతోనే ఆమోదం పొందుతాయి అని అసెంబ్లీలో విభజన బిల్లుకు వ్యతిరేకంగా చేసిన తీర్మానంపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. గతంలో 3 రాష్ట్రాల ఏర్పాటు మూజువాణి ఓటుతోనే ఆమోదం పొందాయని సీఎం కిరణ్ తెలిపారు. మూజువాణి ఓటును కొందరు తొండి ఆట అని చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. పదవీ కాంక్షతోనే సమైక్యవాదులు విభజనవాదులయ్యారని, విభజనవాదులు సమైక్యవాదులయ్యారు అని సీఎం కిరణ్ అన్నారు. శాసనసభలో తీర్మానం వీగిపోయాక కొత్త రాష్ట్రం ఏర్పడలేదు కిరణ్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు అభిప్రాయాలు మార్చుకుంటున్నారు అని ఆయన విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల కష్టం దాగిఉంది. రాష్ట్రం సమైక్యంగా ఉంచడానికి ఇది బ్రహ్మాస్త్రం. అసెంబ్లీలో తీర్మానం అంటే తెలంగాణవాదులు ఎందుకు భయపడుతున్నారు అని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. -
అసెంబ్లీ తీర్మానంతో విభజన ఆగదు: శ్రీధర్ బాబు
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును తిరస్కరించాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీర్మానంపై బీఏసీలో చర్చించకుండా, అసెంబ్లీ ఎజెండాలో పెట్టకుండా అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి విలువలేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ తీర్మానంతో రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోతుందంటూ జరుగుతున్న ప్రచారంలో హేతుబద్ధత లేదని శ్రీధర్‌బాబు చెప్పారు. ఆర్టికల్ 3కింది ఇచ్చిన విభజన బిల్లుకు, రూల్ 77కింద ఆమోదం పొందిన తీర్మానానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి కుట్రలతో తెలంగాణ ఆగదని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. -
'విభజన బిల్లును పార్లమెంట్ లో పెట్టవద్దు'
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టవద్దని అసెంబ్లీలో ప్రభుత్వ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఉభయసభలు ఆమోదించాయని మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, శైలజానాథ్, ఆనం రాంనారాయణ్ రెడ్డిలు అన్నారు. అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానికి సీమాంధ్రకు చెందిన 159 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటేసి ఉండేవారు, తెలంగాణకు చెందిన 119 మంది తీర్మానాన్ని వ్యతిరేకించేవారు అని వారన్నారు. విభజన బిల్లును తిరస్కరిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానం మూజువాణి నిర్ణయంతొ ఆమోదం పొందింది అని వారన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపిస్తాం మంత్రులు శైలజానాథ్, ఆనం, కన్నా వెల్లడించారు. -
టి.బిల్లు పెడితే రాజకీయ సన్యాసం-కిరణ్
-
రాజకీయాల నుంచి తప్పుకుంటా: కిరణ్
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంచలనల వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి పంపిన బిల్లు ఉన్నది ఉన్నట్టు పార్లమెంట్లో ప్రవేశపెడితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు. బిల్లుపై హోంశాఖ రాష్ట్రపతిని మోసం చేసినట్లుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్టప్రతి నుంచి వచ్చే బిల్లులో లోపాలు లేకుండా చూడాల్సిన బాధ్యత హోంశాఖపై ఉందన్నారు. బిల్లులోని లోపాలను సరిచేయమని కోరడం లేదు బిల్లును తిరస్కరిస్తున్నట్టు అసెంబ్లీలో తీర్మానం చేయమని కోరుతున్నామని వివరించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో సీఎం ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఏకాభిప్రాయంతోనే గతంలో రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. విభజనకు కారణాలు, లక్ష్యాలు ఉన్న విభజన బిల్లు కావాలన్నారు. ఇదే బిల్లు పార్లమెంటులో పెట్టాలని సవాల్ చేశారు. ఇదే బిల్లు పార్లమెంటుకు పంపితే అస్సలు అడ్మిట్ కాదని చెప్పారు. ఒకవేళ అది జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. సభకు అధికారం లేనప్పుడు ఓటింగ్‌పై నాయకులు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. బిల్లుపై మళ్లీ పొడిగింపు అడగడంలో తప్పులేదన్నారు. బిల్లపై క్లాజులవారీగా చర్చ జరిపి తిరస్కరిస్తామన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో నిలిచిన రెబల్ అభ్యర్థులను ఉపసంహరించుకోమని చెప్పామని సీఎం తెలిపారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల అరెస్టుపై జనాగ్రహం
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్రకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని పట్టుబట్టిన వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, ఆ పార్టీ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడంపై నిరసనలు వెల్లువెత్తాయి. అనైతిక పద్ధతిలో బహిష్కరించడమే కాకుండా అక్రమంగా అరెస్టు చేయడాన్ని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సమైక్యవాదులు తీవ్రంగా ఖండించారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే సుబ్బారావు, యువజన విభాగం జిల్లా కన్వీనర్ అనంత ఉదయభాస్కర్‌ల ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు రాస్తారోకో చేశారు. జిల్లా కన్వీనర్ చిట్టబ్బాయి ఆధ్వర్యంలో అమలాపురం లో ధర్నా నిర్వహించారు. జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో సర్పవరం జంక్షన్లో కార్యకర్తలు మానవహారం ఏర్పాటు చేశారు. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆలమూరులో ధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు సీఎం కిరణ్‌కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. పలాసలో కేంద్ర మంత్రి కిల్లి కపారాణి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. విశాఖలో పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ వెంకటరావు ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. అనంతరం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. నల్ల రిబ్బన్లతో నిరసన అనంతపురంలో కళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకుని పార్టీ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోదరుడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మడకశిరలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైసీ గోవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. -
మేము తప్పు చేస్తే దిద్దుకుంటాం: వట్టి
హైదరాబాద్: రాష్ట్ర విజభన జరిగితే కోస్తాంధ్ర 50 ఏళ్లు వెనక్కి పోతుందని మంత్రి వట్టి వసంతకుమార్ అన్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టినట్టినట్లు కనబడుతుందన్నారు. సమాఖ్య స్ఫూర్తిపై కేంద్రానికి గౌరవం ఉన్నట్టు లేదన్నారు. శాసనసభ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. విభజనపై కేంద్రం అత్యుత్సాహం ఎందుకు కనబరుస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఏళ్ల తరబడి విదర్భ డిమాండ్ ఉన్నా పట్టించుకోలేదని తెలిపారు. తాము, తమ పూర్వీకులు తప్పు చేసినట్టు నిరూపిస్తే సరిదిద్దుకుంటామన్నారు. హైదరాబాద్‌తో సమానమైన రాజధానికి నిర్మాణానికి నిధులెవరిస్తారని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రాంతాన్ని బలవంతంగా తెలంగాణలో కలిపారనడం సబబు కాదన్నారు. ఈ బిల్లును చూస్తే కొత్త రాష్ట్రం ఎలా బతికి బట్టకడుతుందో అర్థం కావడం లేదన్నారు. తమపై దోపిడీ ఆరోపణలు తప్పని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని తెలిపారు. తీర్మానం తప్పనిసరి అని సర్కారియా కమిషన్ కూడా చెప్పిందన్నారు. శాసనసభ తీర్మానాన్ని కేంద్రం పొందలేదు కాబట్టి బిల్లును వ్యతిరేకిస్తున్నామని వట్టి వసంతకుమార్ చెప్పారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సరైన ప్రాతిపదిక, విధానం అవలంభించాలని సూచించారు. -
విభజించే హక్కు మీకెక్కడిది?
రాష్ట్రంలో ప్రతి పిల్లాడూ ఇదే ప్రశ్న వేస్తున్నాడు: జగన్ విభజించాలో వద్దో ముందు అసెంబ్లీలో తీర్మానం చేయండి.. తర్వాత ప్రజల్ని అడగండి ప్రజలంతా విడిపోతాం అని చెబితే అప్పుడు విభజన బిల్లుపై చర్చ చేపట్టండి దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలా? విడగొట్టాలా? అనేది ముందు అసెంబ్లీలో తీర్మానం చేయండి.. ఆ తరువాత ప్రజల వద్దకు వెళ్లి వారిని అడగండి. ప్రజలంతా విడిపోతాం అని చెప్పిన తరువాతనే విభజన బిల్లుపై చర్చ చేపట్టండి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ముందు రాష్ట్రాన్ని విడగొట్టి, ఆ తరువాత అసెంబ్లీకి బిల్లు పంపిస్తామని చెప్పడం సాంప్రదాయమే కాదని మండిపడ్డారు. అందరం కలిసి ఒక్కతాటి మీద ఉండాల్సిన సమయంలో.. సోనియా గాంధీ గీసిన గీత కిరణ్‌కుమార్‌రెడ్డి దాటరని, చంద్రబాబేమో.. ప్యాకేజీల కోసం సోనియా గాంధీతో కుమ్మక్కయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నిజంగా రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు ఇవాళ నడి రోడ్డు మీదకు వచ్చారు. రాష్ట్రాన్ని విభజించే హక్కు మీకు ఎవరిచ్చారని ప్రతి పిల్లాడు ప్రశ్నిస్తున్నాడు, ప్రతి రైతన్నా అడుగుతున్నాడు. అయినా వీళ్లకు పట్టదు’’ అని విమర్శించారు. దేశంలోనే మూడో అతిపెద్ద బడ్జెట్‌ను కలిగిన రాష్ట్రాన్ని విడగొట్టి సర్వనాశనం చేయొద్దని కోరారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ జగన్మోహన్రెడ్డి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర చిత్తూరు జిల్లాలో మూడో విడత, మూడో రోజు మంగళవారం పీలేరు నియోజకవర్గంలో కొనసాగింది. వాయల్పాడు(వాల్మీకిపురం), కలికిరిలో జరిగిన బహిరంగ సభలకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే.. విభజన నిర్ణయం తీసేసుకుని బిల్లు పంపారు.. ‘‘దేశ చరిత్రలోనే ఎప్పుడూ కూడా కనీవినీ ఎరుగని విధంగా ఇవాళ మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. దేశంలో ఎక్కడైనా.. ఎప్పుడైనా ఒక రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వచ్చినప్పుడు మొదట ఏం చేస్తారంటే.. రాష్ట్రాన్ని విభజించండి అని చెప్పి మొత్తంగా శాసనసభ అంతా కలిసి ఒక తీర్మానం చేయాలి. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. కేంద్రం దానిమీద యాక్షన్ తీసుకొని ప్రతిని రాష్ట్రపతికి పంపుతుంది. ఆయన ఆ డ్రాఫ్టును మనకు పంపిస్తే దాని మీద తరువాత చర్చ అనేది జరిగితే అప్పుడు ‘ఇలా కాదు, అలా చేయండి’ అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అది అసలు సంప్రదాయం. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ విషయంలో.. ఏకంగా రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసేసుకుని ఆ బిల్లును రాష్ట్రపతి దగ్గర నుంచి మనకు పంపించి ఇక మీరు చర్చించుకోండి అని చెప్తున్నారు. చర్చించడం అంటే దాని అర్థం విభజనకు మనం ఒప్పుకున్నట్టే కదా..! అంటే మాకు డబ్బులు కాస్త ఎక్కువో.. తక్కువో ఇవ్వండి, నీళ్లు కాస్త మాకు అటూ ఇటుగా ఇవ్వండి, మాకు మంచి చెయ్యండి అని చెప్పి మనం బతిమలాడుకోవాలట. దాని పేరు చర్చట. కుమ్మక్కై కేసులు వేసి.. కుమ్మక్కయ్యానంటున్నారు.. అసెంబ్లీ జరుగుతోంది.. కానీ సమావేశాల్లో చంద్రబాబు కనపడరు, కిరణ్‌కుమార్‌రెడ్డి కనిపించరు. చంద్రబాబు గారైతే మరీ అన్యాయం. అసెంబ్లీలోనే.. తన ఏసీ గదిలో కూర్చొని.. సమైక్యానికి అనుకూలంగా వెళ్లి సీమాంధ్ర ఎమ్మెల్యేలను గొడవ చేయమంటారు. తెలంగాణ ఎమ్మెల్యేలను పిలిపించుకొని విభజించాలని గొడవ చేయమంటారు.. కానీ అసెంబ్లీలోకి రారు. ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి కుమ్మక్కై జగన్మోహన్రెడ్డి, ఇంకొకరూ.. ఇంకొకరూ కుమ్మక్కయ్యారని వేలెత్తి చూపిస్తారు. వాళ్లంతా కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేసుకుంటారు. కానీ నింద మాత్రం జగన్మోహన్రెడ్డి మీద వెయ్యాలని ఆరాటపడుతున్నారు. ఒక్క జగన్మోహన్రెడ్డి.. సోనియాగాంధీ దగ్గర నుంచి మొదలు అటు కాంగ్రెస్ పార్టీతో, ఇటు చంద్రబాబు నాయుడితో పోరాటం చేస్తున్నాడు.. మరోవైపు ‘ఈనాడు’తో, ఆంధ్రజ్యోతి, టీవీ-9లతో కూడా పోరాటం చేస్తున్నాడు. కానీ చంద్రబాబేమో కుమ్మక్కు.. కుమ్మక్కు అని అంటారు. వైఎస్సార్ చనిపోయి 18 నెలలు గడిచిన తరువాత, ఆయన కుమారుడు జగన్.. కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టిన 2 నెలల తరువాత కాంగ్రెస్‌తో కుమ్మక్కై కోర్టుల దాకా వెళ్లి కేసులు వేసింది మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదా? అని చంద్రబాబును అడుగుతున్నా. ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మ గౌరవానికి మధ్య ఎన్నికలు.. ఇవాళ చంద్రబాబుకు చెప్తున్నా.. మోసం చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డికి చెప్తున్నా, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న సోనియాగాంధీకి చెప్తున్నా. వీళ్లంతా ఎన్ని కుమ్మక్కులు పన్నినా, ఎన్ని కుయుక్తులు వేసినా మరో నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య జరగబోయే ఎన్నికలు. ఆ ఎన్నికల్లో మనందరం కలుద్దా.. ఒక్కటవుదాం.. ఒక్కటై 30 ఎంపీ స్థానాలను మనంతట మనమే తెచ్చుకుందాం. 30 ఎంపీ స్థానాలు తెచ్చుకున్న తరువాత ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతాం అని చెప్తున్నాం. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం. ఢిల్లీ కోటను మనమే పునర్నిర్మిద్దాం.’’ సీఎం ఇలాకాలో జగన్‌కు బ్రహ్మరథం సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గమైన పీలేరులో జనం జగన్మోహన్రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. నియోజకవర్గం పరిధిలోని వాల్మీకిపురం, కలికిరి మండలాల్లో మంగళవారం నిర్వహించిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రకు అనూహ్య స్పందన లభించింది. వాల్మీకిపురంతో పాటు సీఎం కిరణ్ సొంత మండలమైన కలికిరిలో రహదారులకు ఇరువైపులా జనం బారులుతీరి జననేతకు స్వాగతం పలికారు. ఉదయం వాల్మీకిపురం గంగాదొడ్డిలో ఒలిపి రామచంద్ర కుటుంబాన్ని, తోటవీధిలో ఎస్ రెడ్డిగౌస్ కుటుంబాన్ని జగన్ ఓదార్చారు. వాల్మీకిపురం బస్టాండ్ సర్కిల్లో మధ్యాహ్నం జరిగిన సభలో సమైక్య గళాన్ని బలంగా వినిపించారు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్, జిల్లాకు చెందిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విభజన దోషులని విమర్శించినప్పుడు జనం నుంచి మంచి స్పందన లభించింది. తర్వాత చింతపర్తి, గండబోయినపల్లెలలో జగన్ వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. తర్వాత కలికిరి నాలుగురోడ్ల జంక్షన్లో జరిగిన భారీ సభలో ప్రసంగించారు. అనంతరం అక్కడకు దగ్గరలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాత్రి పది గంటల సమయానికి సోమల మండల ంలోని కందూరుకు చేరుకున్నారు. చలి బాగా ఉన్నా, రాత్రి పది గంటల వరకూ దారిపొడవునా జనం వేచి ఉన్నారు. జగన్ కందూరులోని రవీంద్రనాథరెడ్డి ఇంట రాత్రి బసచేశారు. జగన్మోహన్రెడ్డి వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, పార్టీ నాయకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డ్డి తదితరులున్నారు. వంగపండు ఉష బస్సు అద్దం ధ్వంసం కలికిరి, న్యూస్‌లైన్: ఈ యాత్ర నిమిత్తం కలికిరి వచ్చిన వైఎస్సార్ సీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష బస్సు అద్దాన్ని ఓ యువకుడు పగులగొట్టాడు. రాత్రి కలికిరి క్రాస్ రోడ్డులో సమైక్య శంఖారావం సభ జరగడానికి ముందు ఉష పాటలు పాడుతుండగా, శరత్‌కుమార్‌రెడ్డి అనే యువకుడు బస్సుపై దాడి చేశాడు. ఇతను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డెప్పరెడ్డి అన్న కుమారుడు. ఎస్ఐ అతడిని అరెస్టు చేయకపోగా సముదాయించి పక్కకు తీసుకెళ్లడం గమనార్హం. -
'బీహార్‌లో తీర్మానం చేశాకే విభజన జరిగింది'
-
'బీహార్‌లో తీర్మానం చేశాకే విభజన జరిగింది'
అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవని ప్రభుత్వానికి హితవు పలికారు. మంగళవారం మీడియాతో విజయమ్మ చిట్‌చాట్ చేశారు. విభజన బిల్లుపై చర్చకు తాము వ్యతిరేకం కాదని, అయితే సమైక్య తీర్మానం ముందు ప్రవేశ పెట్టాలని అన్నారు. ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మన మీదా లేదా అని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర విభజన విషయంలో బీహార్‌లో కూడా ముందు అసెంబ్లీలో తీర్మానం పెట్టారని విజయమ్మ గుర్తు చేశారు. ఆ విషయం కూడా మన నాయకులకు తెలియదా అని ఎద్దేవా చేశారు. బీహార్‌లో తీర్మానం పెట్టక ముందు వచ్చిన బిల్లును వెనక్కి పంపారని, బీహార్ అసెంబ్లీ తీర్మానం చేశాకనే రాష్ట్ర విభజన జరిగిందిని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. -
అసెంబ్లీ తీర్మానంపై మాట తప్పారేం?
యూపీఏకు వైఎస్ విజయమ్మ ప్రశ్న విభజనకు ఎందుకు వ్యతిరేకమో చెబుతూ స్పీకర్‌కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో కలసి లేఖ సాక్షి, హైదరాబాద్: విభజన విషయంలో ప్రజాప్రతినిధులెవరికీ సరైన సమాచారం ఇవ్వకుండా, ఎనిమిదిన్నర కోట్ల మందికి ఎలాంటి సమాధానం చెప్పకుండా ఎందుకు హడావుడి చేస్తున్నారని వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష నాయకురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. విభజనకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేస్తామని డిసెంబర్ 9, 2009లో కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించిన విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయనగానే అసెంబ్లీ తీర్మానం ప్రస్తావన లేకుండా యూపీఏ ప్రభుత్వం ఎందుకు మాట తప్పుతోందని మండిపడ్డారు. ఈ విభజన ప్రక్రియను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలతో కలసి విజయమ్మ శనివారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. విభజనను ఎందుకు వ్యతిరేకిస్తున్నామో తెలియజేస్తూ పార్టీ శాసనసభాపక్షం రూపొం దించిన 11 పేజీల లేఖను స్పీకర్‌కు అందించారు. ఈ లేఖపై మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, భూమా శోభానాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, ప్రసన్నకుమార్‌రెడ్డి, గొల్ల బాబూరావు, టి.బాలరాజు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, భూమన కరుణాకర్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులతో కలసి విజయమ్మ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. విభజనకు సంబంధించిన సంప్రదాయాలను, పద్ధతులను యూపీఏ ప్రభుత్వం ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. శాసనసభలో ‘సమైక్య తీర్మానం’ చేసిన తర్వాతే చర్చను చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ హయాంలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా కూడా సంబంధిత రాష్ట్రాల చట్ట సభల్లో తీర్మానాలు ఆమోదించాకే విభజనపై ముందుకెళ్లారని చెప్పారు. అటువంటి విధానాన్ని ఇక్కడెందుకు పాటించడంలేదని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా పదిహేను రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రాల డిమాండ్లు ఉన్నా ఎందుకు పట్టించుకోవడంలేదని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. ఒక ప్రాతిపదిక ఆధారంగా గత సంప్రదాయాల మేరకు ప్రక్రియ జరిగిన తర్వాతే విభజనపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కలిసుంటేనే అభివృద్ధి.. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎయిర్‌పోర్టులు, సీ-పోర్టులు కలిసి ఉన్నప్పుడే సాధ్యమవుతుందని విజయమ్మ అన్నారు. 42 ఎంపీ స్థానాలతో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న మన రాష్ట్రం, విభజన జరిగితే 17 ఎంపీలు ఒకవైపు, 25 ఎంపీలు మరోవైపు ఉండి బలహీనమై ఇరు ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘చిదంబరం గారిని అడుగుతున్నా? తమిళులకు ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉందంటున్నారు. అదేమాదిరిగా తెలుగువారికి కూడా మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అలాంటప్పుడు తెలుగు రాష్ట్రాన్ని ఎందుకు విభజిస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. ‘‘విభజన వల్ల తెలంగాణ కూడా బాగా నష్టపోతుంది. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ను నిలబెట్టుకోవాలన్నా రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే సాధ్యమవుతుంది. తెలంగాణ సస్యశ్యామలం కావాలంటే ప్రాణ హిత నిర్మించాలి. కానీ దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అని చెబుతున్న యూపీఏ ప్రభుత్వం నీళ్లు ఎక్కడి నుంచి ఇస్తారన్నది చెప్పలేదు? సర్కారియా, పూంఛి కమిషన్, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అన్నీ కూడా ఒక సంప్రదాయం ప్రకారం... తీర్మానాలు చేసిన తర్వాతే విభజన చేయాలని చెప్పాయి. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఆధ్వర్యంలో 2010 ఫిబ్రవరిలో భోపాల్‌లో ఏర్పాటైన 74వ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సదస్సులో కూడా రెండో ఎస్సార్సీ పెట్టాల్సిన అవరముందన్నారు’’ అని తెలిపారు. నీటి పంపకాల మాటేమిటి? కలిసి ఉన్నప్పుడే నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంటే ఇక విభజించడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలకు యూపీఏ ఎలాంటి పరిష్కారం చూపిస్తుందని విజయమ్మ ప్రశ్నించారు. దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కర్ణాటక రాష్ట్రం ప్రాజెక్టులు నిర్మించుకుని, ఎత్తు పెంచుకుంటుంటే, ఇక్కడ చంద్రబాబు మాత్రం ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. 2000 సంవత్సరంలోపే మనం కూడా ప్రాజెక్టులను నిర్మించి ఉంటే ఈరోజు ఆల్మట్టి ప్రాజెక్టు మాదిరే మనకు కూడా నికర జలాల కేటాయింపు జరిగేదన్నారు. ‘‘ఈ రోజు మిగులు జలాలపై హక్కును కోల్పోవాల్సి వచ్చింది.. 2056 టీఎంసీలను బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎగువ రాష్ట్రాలకు ఇచ్చిందంటే అది చంద్రబాబు చేసిన పాపమే. ఇలాంటి పరిస్థితుల్లో విభజన జరిగితే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఉప్పునీరు తప్పితే మంచి నీరు ఎక్కడిది? దీనికి యూపీఏ ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ అని ఆమె అన్నారు. ‘‘మన అదృష్టమో, దురదృష్టమోగానీ ఏ పరిశ్రమ వచ్చినా అన్నీ హైదరాబాద్‌లోనే నిర్మించాం.. 60 ఏళ్లు కలిసి నిర్మించుకున్న హైదరాబాద్ లాంటి మరో రాజధానిని కేవలం పదేళ్లలో నిర్మించుకోవడం సాధ్యమేనా? సీమాంధ్రలో విశాఖ స్టీల్ ప్లాంట్ తప్ప మరేముంది? వారి జీవనాధారానికి ఏ దారి చూపిస్తారు? సీమాంధ్రలో సంక్షేమం, ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఎలా ఇస్తారు?’’ అంటూ కేంద్రంపై విజయమ్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. -
'విభజనకు కిరణ్, బాబు సహకరిస్తున్నారు'
హైదరాబాద్ : సమైక్య తీర్మానానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. బుధవారం ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ సమైక్య ముసుగులో సీఎం, చంద్రబాబు విభజనకు పాల్పడుతున్నారని విమర్శించారు. సమగ్ర సమాచారం లేకుండా బిల్లుపై చర్చ సాధ్యం కాదని శోభా నాగిరెడ్డి స్పష్టం చేశారు. సమైక్య తీర్మానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని ఆమె అన్నారు. ఆదాయం, ఆస్తులు, అప్పుల వివరాలను బిల్లులో తెలియచేయలేదన్నారు. సోనియాగాంధీ ఆదేశాలతో సీఎం కిరణ్ సభను నడిపిస్తున్నారని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. అందుకు ప్రతిపక్షనేత బాబు సహకరిస్తున్నారని అన్నారు. -
'విభజనకు కిరణ్, బాబు సహకరిస్తున్నారు'
-
అసెంబ్లీ తీర్మానంతోనే విభజన జరగాలి:రఘువీరా
అనంత:అసెంబ్లీ తీర్మానంతోనే రాష్ట్ర విభజన జరగాలని మంత్రి రఘువీరా రెడ్డి అభిప్రాయపడ్డారు. విభజనపై అసెంబ్లీ తీర్మానం చేయాల్సిందే నంటూ ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడిన రఘువీరా..టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. సీమాంధ్ర రాజధానికి నాలుగు లక్షల కోట్లు ఇవ్వాలని బాబు డిమాండ్ పై మండిపడ్డారు. అప్పుడేమో రాష్ట్రానికి ప్యాకేజీలిస్తే సరిపోతుందన్న బాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ తీర్మానంతో విభజన జరిగితేనే అది అందరికీ ఆమోదయోగ్యం ఉంటుందన్నారు. లేకపోతే దేశ వ్యాప్తంగా రాష్ట్ర విభజనలు పుట్టుకొస్తాయని రఘువీరా తెలిపారు. ఇదిలా ఉండగా మరో మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీలో ఓడిస్తామన్నారు.రాష్ట్రంలో కొత్తపార్టీ వచ్చే అవకాశం లేదని శైలజానాథ్ తెలిపారు. -
మా పోరుకు మద్దతివ్వండి: వైఎస్ జగన్మోహన్రెడ్డి
* ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకోవాలి: పవార్, ఠాక్రేలకు జగన్ వినతి * దేశంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగనిది ఏపీలో జరుగుతోంది * అసెంబ్లీ తీర్మానం లేకుండానే రాష్ట్ర విభజనకు కేంద్రం సిద్ధమైంది * దీన్ని అడ్డుకోకపోతే.. రేపు ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాగే జరుగుతుంది * భాషాప్రయుక్త రాష్ట్రాల విభజనకు నిర్దిష్ట విధివిధానాలు ఉండాలి * ఏ రాష్ట్ర విభజనకైనా అసెంబ్లీలో, పార్లమెంటు ఉభయసభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ ఆమోదం తప్పనిసరి చేయాలి * ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్-3కు సవరణలు చేయాలి * ప్రజాస్వామ్య పరిరక్షణకు మా పోరాటానికి మద్దతు ఇవ్వాలి * ఎన్సీపీ, శివసేన అధినేతలతో భేటీల్లో విజ్ఞప్తి చేసిన జగన్ సాక్షి, ముంబై: ‘‘కేంద్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్ల కోసం ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా విభజిస్తోంది. అసెంబ్లీలో తీర్మానం చేయటమనే సంప్రదాయానికి నీళ్లొదిలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. దీనిని అడ్డుకోకపోతే రేపు ఏ రాష్ట్రాన్నైనా ఇలాగే విభజించే దుష్ట సంప్రదాయం మొదలవుతుంది. ఏ రాష్ట్ర విభజనకైనా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదించటం తప్పనిసరి చేయాలి. ఏకగ్రీవ తీర్మానం కాకుంటే కనీసం మూడింట రెండొంతుల మెజారిటీ అయినా ఆమోదించాలి. శాసనసభతో పాటు పార్లమెంటు ఉభయసభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ ఉంటేనే రాష్ట్ర విభజన చేపట్టాలి. ఈ దిశగా రాజ్యాంగంలోని మూడో అధికరణను సవరించాలి. ఇందుకు మీ సహకారం కావాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు చేపట్టిన మా పోరాటానికి అందరూ మద్దతివ్వాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం ముంబైలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌కు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ఠాక్రేలను వేర్వేరుగా కలిసి విజ్ఞప్తి చేశారు. అడ్డగోలు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు, ఏకపక్ష విభజనకు అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్-3ను సవరణ కోరుతూ జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్న జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం పార్టీ నేతలు దాడి వీరభద్రరావు, మైసూరారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, బాలశౌరిలతో కలిసి ముంబై చేరుకున్నారు. మధ్యాహ్నం 2:20 గంటలకు నారీమన్ పాయింట్‌లోని ైవె .బి.చవాన్ హాల్‌కు వెళ్లి శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు. సుమారు గంట సేపు ఆయనతో చర్చించారు. అక్కడి నుంచి నేరుగా బాంద్రాలోని ఉద్ధవ్‌ఠాక్రే నివాసం మాతోశ్రీకి వెళ్లి శివసేన అధినేతతో జగన్ సమావేశమయ్యారు. సాయంత్రం 4:15 గంటల నుంచి దాదాపు 45 నిమిషాల పాటు ఠాక్రేతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఏకపక్ష, నిరంకుశ వైఖరి గురించి పవార్, ఠాక్రేలకు జగన్ వివరించారు. ఓట్లు, సీట్ల కోసం రాజ్యాంగంలోని మూడో అధికరణను దుర్వినియోగం చేస్తూ.. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తున్నారని నివేదించారు. దీనికి శరద్‌పవార్ స్పందిస్తూ.. ‘ముంగిట్లో ఎన్నికలు ఉండగా (రాష్ట్ర విభజనకు) కేంద్రానికి ఇంత తొందరపాటు ఎందుకు? రేపు ఎన్నికలు పూర్తయ్యాక ప్రజాభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు కదా!’ అన్న అభిప్రాయాన్ని జగన్ బృందం వద్ద వ్యక్తంచేసినట్లు తెలిసింది. అలాగే.. ఓట్లు, సీట్ల దృష్టితో రాయలసీమను కూడా నిలువునా చీల్చే క్షుద్ర రాజకీయాలు రాష్ట్రంలో జరుగుతున్నాయని ఆ ప్రాంత సీనియర్ నాయకుడొకరు ప్రస్తావించినపుడు.. ‘అలా హేతుబద్ధత లేని విభజన సముచితం కాదు’ అని కూడా పవార్ అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఇక ఉద్ధవ్‌ఠాక్రే అయితే.. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజిస్తోందంటూ జగన్ బృందంతో ఏకీభవించారు. ఆయన పోరాటానికి పూర్తి మద్దతు తెలిపారు. ఈ భేటీల అనంతరం.. పవార్‌తో కలిసి వై.బి.చవాన్ హాల్ వద్ద, ఉద్ధవ్‌తో కలిసి మాతోశ్రీ వద్ద జగన్ మీడియాతో మాట్లాడారు. జగన్ చెప్పిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది... ‘‘ఈ దేశంలో ఎప్పుడూ జరగనిది మొదటిసారిగా జరుగుతోంది. ఎక్కడైనా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసేటప్పుడు సంబంధిత మాతృ రాష్ట్రంలో అసెంబ్లీ తీర్మానాలు ఆమోదించటం ఆనవాయితీ. ఇప్పటివరకూ అలాగే చేశారు. కానీ దేశంలో తొలిసారిగా.. అదీ ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయనగా.. ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తోంది. అసెంబ్లీలో తీర్మానం ఊసే లేకుండా విభజిస్తోంది. ఇంత అన్యాయం జరుగుతున్నపుడు పవార్ వంటి సీనియర్ రాజకీయవేత్తలు చూస్తూ ఊరుకుంటే.. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్తోనే ఆగిపోదు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే ఇదో దుష్ట సంప్రదాయానికి దారితీస్తుంది. మిగతా ప్రాంతాలకూ వ్యాపిస్తుంది. రేపు మహారాష్ట్ర కావచ్చు.. ఎల్లుండి కర్ణాటక కావచ్చు.. ఆ తర్వాత తమిళనాడు కావచ్చు.. ఇలా ఏ రాష్ట్రంలోనైనా అప్రజాస్వామిక విభజనకు కేంద్రం తెగబడవచ్చు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా 272 మంది సభ్యుల మద్దతుంటే చాలు ఇష్టానుసారం ఏ రాష్ట్రాన్నైనా విభజిస్తుంది. ఇక అధికారంలోకి రామని తెలిసిన ఏ పార్టీ అయినా ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాల విభజనకు పూనుకుంటుంది. మాతృ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా విభజనకు పూనుకుంటుంది. ప్రాంతీయంగా ఉన్న భావోద్వేగాలతో ఇలా చెలగాటమాడతారు. ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా ఖూనీ చేయటం తీవ్రమైన నేరం. విభజనకు విధివిధానాలు ఉండాలి... అరవై ఏళ్ల కిందట భాషాప్రయుక్త ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సిఫారసుల ద్వారా ఇవి ఏర్పడ్డాయి. ఇప్పుడు ఒకే భాష మాట్లాడే తెలుగు వారి రాష్ట్రాన్ని విడగొడుతున్నారు. అరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటే.. అందుకు ఒక పద్ధతి, నియమాలు, నిబంధనలు ఉండాలి. రాష్ట్ర విభజనకు అసెంబ్లీలో, పార్లమెంటులో తీర్మానం తప్పనిసరి చేయాలి. ఏకగ్రీవ తీర్మానం సాధ్యం కానపుడు కనీసం మూడింట రెండు వంతుల మెజారిటీతోనైనా ఆయా సభల్లో విభజన తీర్మానం నెగ్గాలనే నిబంధన తప్పక పెట్టాలి. ఈ మేరకు రాజ్యాంగంలోని మూడో అధికరణను సవరించాల్సిన అవసరముంది. ఈ విషయాన్ని శరద్‌పవార్‌కు బలంగా చెప్పాం. ఉద్దవ్‌ఠాక్రే సహా అందరి సహకారం కోరుతున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎలాంటి చర్యలు అవసరమో, ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులేమిటో పవార్ అర్థం చేసుకున్నారు. విభజన ప్రక్రియను స్తంభింపజేసేలా పార్లమెంటులో లోక్‌సభ, రాజ్యసభల్లో మద్దతివ్వాలని ఉద్ధవ్‌ను కోరాను. ఆయన అంగీకరించారు. అందుకు కృతజ్ఞతలు చెప్తున్నా. పొత్తులు, కూటములకన్నా విభజన అనేది చాలా పెద్ద విషయం. దయచేసి ఈ విషయాన్ని పక్కదారి పట్టించవద్దు. అందరూ ఆలోచించాల్సిన సమయమిది.’’ ముంబైలో జగన్‌కు అపూర్వ స్వాగతం... ఒక్క రోజు పర్యటన కోసం సోమవారం ముంబై చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి నగరంలో అపూర్వ స్వాగతం లభించింది. ఠాణే, నవీ ముంబైలతో పాటు నగరంలోని అనేక ప్రాంతాలకు చెందిన తెలుగు ప్రజలు ఉదయం శాంతాక్రజ్ విమానాశ్రయంతో పాటు వై.బి.చవాన్ ఆడిటోరియం వద్ద ఆయనకు ఘనస్వాగతం పలికారు. జగన్‌ను చూసేందుకు ఉదయం నుంచే తెలుగు ప్రజలు శాంతాక్రజ్ విమానాశ్రయం వద్ద బారులు తీరారు. ‘జగన్ జిందాబాద్, జై జగన్, జై సమైక్యాంధ్ర’ అంటూ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్దపెట్టున నినదించారు. చెన్నై వెళ్లేందుకు జగన్‌కు అనుమతి సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చెన్నైకి వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ మేరకు సీబీఐ కోర్టు ప్రధాన న్యాయాధికారి ఎన్.బాలయోగి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మద్దతు కోసం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సోమవారం బాలయోగి విచారించారు. ఈ నెల 26 నుంచి 29వ తేదీ మధ్య ఏదో ఒక రోజు చెన్నై వెళ్లొచ్చునని, జయలలితతో అపాయింట్మెంట్ ఖరారయ్యాక, ఆ వివరాలన్నింటినీ సీబీఐకి తెలియచేయాలని బాలయోగి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ది విభజించు - పాలించు విధానం: ఉద్ధవ్ బ్రిటిష్ వారి తరహాలో కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం ‘విభజించు - పాలించు’ అనే విధానాన్ని అమలు చేస్తోందని, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ విభజనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తే తమ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తంచేస్తుందని స్పష్టంచేశారు. రాజ్యాంగంలోని మూడో అధికరణను దుర్వినియోగం చేయరాదన్నారు. సమైక్యాంధ్రకు మద్దతు కోరుతూ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ నేతల బృందం తనతో భేటీ అయిన తర్వాత.. జగన్‌తో కలిసి ఠాక్రే మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్మోహన్రెడ్డి ముంబైకి ప్రత్యేక విషయమై వచ్చారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సర్వనాశనం చేయటానికి ప్రయత్నిస్తోంది. ఢిల్లీలోని పెద్దలు అక్కడ కూర్చుని ఏమైనా చేయవచ్చని భావిస్తున్నారు. వాళ్లకు ఎలా నచ్చితే అలా చేస్తున్నారు. చివరికి ఓట్ల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ను విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని మేం నిరసిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విభజనను మేం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఒక్క స్థానం కూడా లభించదని భావించిన కాంగ్రెస్ ఈ విధంగా ఎన్నికలకు ముందు ఓట్ల రాజకీయం ప్రారంభించింది. అధికారంలో ఉన్నవాళ్లు ‘విభజించు - పాలించు’ అనే రీతిలో చేస్తున్నారు. బ్రిటిష్ వారి విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానాలను మేం వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తే మేం నిరసన వ్యక్తంచేస్తాం. ఆర్టికల్-3ను కేంద్రం దుర్వినియోగం చేయకూడదు. రాష్ట్ర విభజన అవసరమైతేనే చేయాలి. జగన్మోహన్రెడ్డితో మేం ఏకీభవిస్తున్నాం. మూడో అధికరణలో సవరణలు చేయాలి. ఎక్కడైనా రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే.. తప్పనిసరిగా సంబంధిత రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. అసెంబ్లీలో తీర్మానాన్ని మెజారిటీతో ఆమోదించిన తర్వాతనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి’’ అని ఆయన స్పష్టంచేశారు. జగన్ లేవనెత్తిన అంశాలు చాలా కీలకమైనవి: పవార్ అసెంబ్లీ తీర్మానం లేకుండా ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా విభజించటం, రాజ్యాంగంలోని మూడో అధికరణను సవరించాల్సిన అవసరంపై జగన్మోహన్రెడ్డి లేవనెత్తిన అంశాలు చాలా కీలకమైనవని తాము భావిస్తున్నామని ఎన్సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్ పేర్కొన్నారు. ఈ అంశాలపై తమ పార్టీ కార్యవర్గ భేటీలో నిశితంగా చర్చిస్తామని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ బృందం తనతో చర్చలు జరిపిన అనంతరం జగన్మోహన్రెడ్డితో కలిసి పవార్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని జగన్మోహన్రెడ్డి కోరారు. అయితే ఎన్సీపీ తొమ్మిది నెలల కిందటే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కానీ.. రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి జగన్ చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించారు. కొన్ని న్యాయపరమైన విషయాలను ప్రస్తావించారు. ఏ రాష్ట్రాన్నైనా విభజించే ముందు రాష్ట్ర అసెంబ్లీని విశ్వాసం లోకి తీసుకోవాలన్న అంశాన్ని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీని విస్మరించి ముందుకెళ్లరాదని, అలా వెళ్తే అది తప్పుడు సంప్రదాయం అవుతుందని జగన్ నాతో అన్నారు. రాజ్యాంగంలోని మూడో అధికరణ విషయాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ఈ అధికరణను సవరించాలని, అందులో పునరాలోచనకు ఆస్కారం ఉండాలని చెప్పారు. జగన్ లేవనెత్తిన కీలకమైన ఈ రెండు అంశాలపై ఈ సమయంలో మా పార్టీ అభిప్రాయం కానీ, నిర్ణయం కానీ చెప్పలేను. కానీ మా పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుల ముందు ఈ రెండు అంశాలనూ ఉంచుతాను. వీటిపై సీరియస్‌గా చర్చిస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు గల శాసనసభను, శాసనసభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్న కీలకమైన అంశాలపై నిశితంగా చర్చిస్తాం. అలా అభిప్రాయానికి వస్తాం. ఆ తర్వాత వెల్లడిస్తాం’’ అని ఆయన వివరించారు. జగన్‌తో భేటీ సందర్భంగా ఎన్నికల అవగాహనపై చర్చ జరగలేదని చెప్పారు. -
గొంతెమ్మ కోర్కెలు కుదరవని చెప్పండి: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ‘‘371(డి) పై రోజుకో మాట మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంత మంటారు, సంయుక్త రాజధాని అని, ప్రత్యేక అధికారాలు ఇస్తామని చెప్తూ ప్రజలను అయోమయంలో పడేస్తున్నారు. జటిలమైన ఈ సమస్యను వివాదాస్పదం చేయకుండా ఎలా పరిష్కరిస్తారో చెప్పాలి. ఏ ఇద్దరి మధ్యనైనా వివాదం వస్తే ఇద్దరినీ కూర్చోబెట్టి గొంతెమ్మ కోర్కెలు కోరిన వారికి అవి సాధ్యం కావని చెప్పాలి. అసెంబ్లీ తీర్మానం చేయకుండా రాష్ట్ర విభజన సరికాదు’’ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఎవరివి గొంతెమ్మ కోర్కెలో మాత్రం ఆయన వెల్లడించలేదు. గురువారం తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందన్నారు. గవర్నర్, స్పీకర్లు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన విధులను సరిగా నిర్వర్తించటం లేద ని విమర్శించారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేయాల్సిందిగా సీఎం లేఖ రాసిన వెంటనే స్పీకర్ గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపాలని.. సీఎం నుంచి లేఖ వచ్చినా స్పీకర్ ఎందుకు ఆ పని చేయలేదని ప్రశ్నించారు. యథావిధిగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బాబు తన అక్కసును వెళ్లగక్కారు. జగన్ కోల్‌కతా వెళ్లేందుకు సీబీఐ కోర్టు ఇచ్చిన అనుమతిని తప్పుపట్టారు. ‘జగన్ దేశవ్యాప్తంగా పర్యటించేందుకు అనుమతించాల్సిందిగా కోర్టును కోరతారు. అనుమతించలేమని కోర్టు చెప్తుంది. ఆ వెంటనే ఆయన కోల్‌కతా వెళ్లేందుకు అనుమతి కోరతారు. సీబీఐ తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్తుంది..’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని వస్తున్న వార్తల గురించి ఒక విలేకరి ప్రశ్నించగా.. ఎవరికైనా ఏమైనా చేసుకునే స్వేచ్ఛ ఉంటుందన్నారు. మరో విలేక రి జగన్ కుప్పం నుంచి సమైక్య శంఖారావం చేపడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. వెంటనే మరో విలేకరి ఎన్టీఆర్‌కు వర్తించిన సూత్రమే జగన్‌కు వర్తిస్తుంది కదా అని అన్నారు. తనకు ఒక వైపున కూర్చున్న విలేకరులకు కనుసైగ చేసిన తర్వాత మాట్లాడిన చంద్రబాబు.. జగన్‌ను కుప్పంకు రానీయవద్దని, ఆయన వస్తే అపవిత్రం అవుతుందని చెప్పానంటూ జవాబిచ్చారు. చంద్రబాబు విలేకరుల సమావేశానికి సాక్షిని అనుమతించలేదు. వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వార్త ఇవ్వటం జరిగింది. ఒకవేళ సాక్షిని అనుమతించి ఉంటే ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు కోరేది. 1. గొంతెమ్మ కోర్కెలు సాధ్యం కావని చెప్పాలంటున్నారు. సీమాంధ్రులకు చెప్పాలంటారా? లేక తెలంగాణ వారికా? 2. రాజకీయ పార్టీల నేతలు పలు అంశాల్లో మద్దతు కోసం ఇతర పార్టీల నేతలను కలవడం సర్వసాధారణం. మీరు ఇతర రాజకీయ పార్టీల నాయకులను కలిస్తే తప్పు లేదు కానీ.. జగన్ పశ్చిమ బెంగాల్ సీఎం భేటీ అయితే తప్పవుతుందా? 3. మీరెంతసేపూ ఇతర రాజకీయ పార్టీలపై విమర్శలు చేయడం తప్ప మీ వైఖరి, విధానాలేంటో మాత్రం చెప్పడం లేదెందుకు? -
ప్రోరోగ్ అస్త్రం!
-
అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన అసాధ్యం: వి. లక్ష్మణరెడ్డి
విజయవాడ, న్యూస్‌లైన్ : అసెంబ్లీ తీర్మానం లేకుండా దేశంలో ఏ ఒక్క రాష్ర్టం ఏర్పాటు కాలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ వి. లక్ష్మణరెడ్డి చెప్పారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన వేదిక కృష్ణా జిల్లా శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ఏర్పడిన ఏ రాష్ట్రాన్ని పరిశీలించినా మాతృరాష్ట్ర అసెంబ్లీ తీర్మానాలు ఆమోదించాకే విభజన జరిగిందన్న వాస్తవాన్ని యూపీఏ పెద్దలు గుర్తించాలని హితవు పలికారు. చివరికి ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానాలతోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని గుర్తుచేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3 విభజన ప్రక్రియ ఎలా ఉండాలనే విషయాన్ని మాత్రమే స్పష్టం చేసిందని, రాష్ట్రాల విభజనకు ప్రాతిపదిక ఏమిటనేది నిర్థారించడంలేదని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, వెనుకబడిన ప్రాంతాలు ప్యాకేజీలు ప్రకటించాలని శ్రీకృష్ణ కమిటీ సూచించినప్పటికీ ఆ దిశగా కేంద్రం అడుగులు వేయలేదన్నారు. 1956-2010 మధ్యకాలంలో అత్యంత వేగంగా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని కమిటీ నివేదికలో పేర్కొందని తెలిపారు. శాస్త్రీయపద్ధతిలో రూపొందించిన ఈ కమిటీ నివేదికపై చట్ట సభల్లో చర్చకు రాకుండానే బుట్ట దాఖలైందన్నారు. కేవలం టీఆర్ఎస్.. కాంగ్రెస్‌లో విలీనం కావడమే విభజనకు ప్రాతిపదిక అన్నట్లుగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యలున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా పార్లమెంట్లో బీజేపీ ఓటు వేస్తే అది రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు. రాష్ర్ట విభజనను ఎంఐఎం, సీపీఎం, వైఎస్సార్ సీపీ బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయని, మిగిలిన పార్టీలు విభేదాలు పక్కనబెట్టి అదేబాటలో నడవాలని సూచించారు. -
కేంద్రం అసెంబ్లీ తీర్మానం కోరదు: డీఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల విభజన ప్రక్రియకు సంబంధించి కేంద్రం నుంచి అసెంబ్లీ తీర్మానం లాంటివి అడగడం ఉండదని, రాష్టం నుంచే అలాంటివి చేసి పంపాల్సి ఉంటుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీలచే తీర్మానం చేయించి ప్రక్రియను కొనసాగించారన్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీకి చెందినవారు కానప్పటికీ అప్పటి ప్రధాని వాజ్‌పేయి వారిని పిలిపించుకుని ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో విభజనకనుకూలంగా తీర్మానాలు జరిగేలా ఒప్పించారన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఏపీజేఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో డీఎస్ మాట్లాడారు. విభజనకు సంబంధించి ఆర్టికల్ మూడు ప్రకారం రాష్ట్రపతి అసెంబ్లీకి పంపే విభజన బిల్లుపై ఓటింగ్ జరగదని, రాజ్యాంగంలో ఈ విషయం స్పష్టంగా ఉందని అన్నారు. రాష్ట్రపతి నుంచి విభజనకు సంబంధించి ముసాయిదా బిల్లు మాత్రమే అసెంబ్లీకి వస్తుందన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం చేసి ఎందుకు పంపడంలేదో సీఎంనే అడగాలని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. విభజన ప్రక్రియపై సీఎం... ప్రధాని, రాష్ట్రపతికి లేఖలు రాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆయన చాలా సందర్భాల్లో వారిని క లుస్తుంటారని, అలాంటప్పుడు ఏమీ అడగకుండా, ఈ లేఖలు రాయడం ఏమిటన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చాంపియన్లుగా కచ్చితంగా కాంగ్రెస్, సోనియాగాంధీయే నిలుస్తారని డీఎస్ అన్నారు. ఎవరైనా తనకు బహుమతి ఇచ్చిన వారినే ఆదరిస్తారని, ఎవరు చెబితే ఆ బహుమతిని ఇచ్చారన్నది పట్టించుకోరని పరోక్షంగా టీఆర్ఎస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయమని తెలంగాణ నేతలెవరూ కేసీఆర్‌ను అడగలేదన్నారు. తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానని కేసీఆరే ప్రకటించారని గుర్తుచేశారు. రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నాక ఇప్పుడున్న సమస్యల్లా.. అందరి ఆందోళనలు, అన్ని ప్రాంతాల వారి సమస్యలు, అనుమానాలు, అపోహలు నివృత్తి చేస్తూ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందన్నారు. చంద్రబాబు అడుగుతున్న సమన్యాయం అంటే ఎవరికీ ఏమీ చేయకుండా ఉండడమేనని ఆ పార్టీ నేతలే తనతో చెప్పారన్నారు. ‘ఈ విషయంలో జగన్మోహన్రెడ్డి పిల్లోడు, సీఎం కావాలన్న పట్టుదలతో ఉన్నాడు.. ఆయన్ను గురించి పెద్దగా మాట్లాడను’ అని అన్నారు. సీఎం కిరణ్ కొత్త పార్టీ వార్తలపై తాను మాట్లాడనని, సీమాంధ్రలో కాంగ్రెస్ బలోపేతంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఏపీజేఎఫ్ అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు అధ్యక్షతన జరి గిన ఈ సమావేశంలో సంఘం నేతలు కొమ్మినేని శ్రీనివాసరావు, కందుల రమేష్, వంశీకృష్ణ, సిరాజుద్దీన్, నరసింహారావు పాల్గొన్నారు. -
అసెంబ్లీ అంటే అలుసా?
నేటి కాంగ్రెస్ నాయకత్వానికి ఇవేమీ పట్టవు. విభజనపై శాసనసభ ముందుకు బిల్లు వస్తుందా, తీర్మానం వస్తుందా, లేదా వీటిపైన అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే తీసుకుంటారా, లేక ఓటింగ్ పెడతారా లేక తోకముడవ వలసివస్తుందా అన్న అంశాలపై తలోదారీ తొక్కుతున్నారు! రాష్ట్రానికి చెందిన సొంత ఎంపీలకు, మంత్రులకు కూడా ఏ విషయం చెప్పకుండా కప్పెట్టడమే కాక, ప్రజల్ని వెర్రిబాగుల వాళ్లుగా భావిస్తున్నారు! ‘‘అసెంబ్లీ ఆమోదం లేకుండా విభజన ప్రమాదకరం’’. (సోనియాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హెచ్చరించినట్లు వార్త.) ఘోరమైన విషయమేమంటే - పార్లమెంటు, శాసనసభలలోని లెజిస్లేటర్లు భారత రాజ్యాంగం క్షుణ్ణంగా తెలిసిన వారై ఉంటారన్న భావనలో మనం ఉండిపో వటం! దాని ఫలితమేమైందంటే - ఇదిగో, అదిగో ‘విభ జన’ సమస్యల పరిష్కారానికి అదేదో ‘ఆంటోనీ కమిటీ’ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తుందనీ, అన్ని విషయాలూ పరిశీలిస్తుందని ప్రజల్ని మురిపించడానికి ప్రయత్నించ డం. కానీ, అలాంటి కమిటీ ఏదీ ఇంతవరకూ రాకుండానే ‘నిద్రావస్త’లోకి జారుకుంది. ఆంటోనీ కమిటీ అడ్రస్ గల్లంతైన సమయంలో, అదీ ఇదీ కూడా కాదు, సీమాం ధ్రుల సమస్యల పరిష్కారానికి కేంద్రస్థాయి మంత్రుల కమిటీ సిద్ధమవుతుందనీ, ఫిర్యాదులు ఏమైనా ఉంటే విభ జన బాధిత ప్రాంతాల వారు చెప్పుకోవచ్చునని ముక్తా యింపు విసిరి ‘నత్త’లాగా కేంద్రం ముడుచుపోయి కూర్చోవడం మరో మలుపు! ఇంత వరకూ సమస్యను కొలిక్కి తేవడంలో అడుగుముందుకు వేయలేని అసమర్థ నాయకులు, 3 వేల ఏళ్ల చరిత్ర గలిగిన తెలుగుజాతి ఏక భాషా సంస్కృతులతో పరిచయం లేని వారు, తెలుగుకు శిష్టభాషా ప్రతిపత్తిని రానివ్వకుండా మోకాలడ్డిన వారు సహా ఇతరేతర మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు! మెడలు వంచాలనే... విభజన ప్రతిపాదనను ముందుగానే నిర్ణయించుకుని జాతివ్యతిరేక ప్రకటనకు సాహసించిన అధిష్టానం, ఆ తరువాత తెలుగుజాతి మెడలు వంచాలనే దుస్సాహసా నికే ఒడిగట్టింది. 1920ల నుంచీ పలు పార్టీ మహాసభలలో ప్రజావాంఛకు అనుగుణంగా జాతీయ సమైక్యతను పటి ష్టం చేయటం కోసం భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అనేక తీర్మానాలు చేసింది. అందుకనుగుణంగా స్వాతం త్య్రానంతరం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు తొలి కమి షన్ను (ఫజల్ అలీ కమిషన్) ఏర్పాటు చేసి, ‘ఆంధ్ర ప్రదేశ్’ (విశాలాంధ్ర) అవతరణను సుసాధ్యం చేసింది! ఇప్పుడీ రాష్ట్రాన్ని ఎన్నికలలో రాజకీయ స్వార్థ ప్రయోజ నాల కోసం తెలుగుజాతిని చీల్చే కార్యక్ర మానికి గజ్జెకట్టింది. ఇందుకు మూల్యాన్ని చెల్లించుకోబోతున్నది. వైరుధ్యాల మధ్య... ఈ ‘విభజన’ మంత్రానికి కాంగ్రెస్ అధిష్టానం ఆధార పడింది దేని మీద? రాజ్యాంగంలోని 3వ అధికరణలోని ‘ఎ’ క్లాజుపైన. కాని ఆ క్లాజు భాషాప్రయుక్త ప్రాతిపదిక పైన ఏర్పడిన రాష్ట్రాల్ని ఉద్దేశించి చొప్పించినది కాదు. పైగా 3వ అధికరణలోని ‘ఎ’ నుంచి ‘ఇ’ వరకు ఉన్న క్లాజు ల మధ్య కూడా వైరుధ్యం ఉంది! ఎందుకంటే, సువ్యవస్థి తమైన తెలుగు జాతి సాధించుకున్న ‘ఆంధ్రప్రదేశ్’ నుంచి ఒక భూభాగాన్ని చీల్చి మరొక రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలన్నా, లేదా ఏదేని రాష్ట్రానికి ఈ భూభాగాన్ని తీసు కుపోయి కలిపేయాలన్నా అలాంటి అధికారాన్ని ఈ 3వ అధికరణ కల్పించింది. కాని అదే సమయంలో ఆ అధి కారంతోపాటు ఏ రాష్ట్రపు ‘సరిహద్దులనైనా మార్చేసే అధి కారాన్ని కూడా’ ఆ అధికరణ కేంద్రానికి సంక్రమింప చేసింది. అయితే రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఈ అంశం పలుమార్లు వాదోపవాదాలకు గురికావలసి వచ్చింది. మొట్టమొదటిసారిగా ఈ చర్చ కూచ్-బీహార్ భూభాగాల విషయంలోనూ, బెరుబరి యూనియన్ విభ జన సందర్భంగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య తలెత్తింది. స్వాతంత్య్రానంతరం కూడా ఈ పద్ధతిన ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రాలను విభజించడానికి దీనినే ఆశ్రయిస్తే దేశ సమైక్యతకే ముప్పు వాటిల్లుతుందని అప్పుడు పలువురు రాజ్యాంగ నిపుణులు, రాజనీతి శాస్త్రజ్ఞులు అభిప్రాయప డ్డారు (బెరుబరి ఒపీనియన్ కేసు: 1960 ఎస్ఆర్ రికార్డు). ఈ పూర్వరంగంలోనే సుప్రీంకోర్టు నాటి గౌరవ న్యాయ మూర్తి గజేంద్ర గడ్కర్ రాజ్యాంగంలోని 1వ అధికరణ (3)(సి) ఎలా ఒక భూభాగాన్ని స్వాధీనపరుచుకునే అధి కారాన్ని పార్లమెంటుకు కల్పించలేదో వివరిస్తూ, 3వ అధిక రణ కూడా స్థిరపడిన రాష్ట్ర భూభాగాన్ని చీల్చి మరొక భాగానికి ధారాదత్తం చేసే అధికారాన్ని పాలనా వ్యవస్థకు దఖలు పరచలేదని స్పష్టం చేశారు. (హెచ్ఎం సీరవాయ: ‘కాన్స్టిట్యూషనల్ లా ఆఫ్ ఇండియా’ వాల్యూమ్-1, పేజీ:308)! అంతేగాదు, ఒక రాష్ట్రపు భూభాగాన్ని కోత పెట్టే అధికారాన్ని చట్టం ద్వారా పార్లమెంటుకు సంక్రమిం పజేసే 3వ అధికరణ ‘ఎ’, 3 (సి) క్లాజు సహితం ఒక రాష్ట్ర భూభాగాన్ని విడగొట్టేసి మరొక రాష్ట్రానికి ధారాదత్తం చేయడాన్ని ప్రస్తావించలేదు! సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం 3వ అధికరణ, ఇండియన్ యూనియన్ లక్ష్యంతోనే గాక, ఫెడరల్ (సమాఖ్య) స్వభావంతో కూడిన రాజ్యాంగం తోనూ సంఘర్షిస్తుందని, సమాఖ్య (ఫెడరల్) స్వభావా నికే విరుద్ధమని న్యాయమూర్తి చెప్పారు! చివరికి బెరుబరి ప్రాంతాన్ని భారత్-పాకిస్థాన్ ఒప్పందం ప్రకారం 3వ అధికరణ ప్రకారం ధారాదత్తం చేయడానికి చట్టం అంగీ కరించదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అంతేగాక రాజ్యాం గాన్ని సవరించిన తరువాతే ఆ ఒప్పందాన్ని అమలు చేసుకోవచ్చునని వివరణ ఇచ్చింది. ఒక పొరుగు దేశంతో కుదిరిన ఒప్పందానికే అత్యున్నత న్యాయస్థానం ఎదురు తిరిగింది. అలాగే రాష్ట్ర పునర్విభజన కమిషన్ సిఫారసు లపై భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను చీల్చడానికి కూడా ఉద్యోగ, సద్యోగాల సమస్యపై తలె త్తిన అనుమానాలకు, వివాదాలకు పరిష్కారంగా 371వ అధికరణ (డి) క్లాజు ద్వారా వచ్చిన రాజ్యాంగ సవరణ చట్టానికి మళ్లీ మూడింట రెండు వంతుల మెజారిటీతో సవరణ తెస్తే తప్ప రాష్ట్ర సరిహద్దులను 3వ అధికరణ ద్వారా ముట్టుకోవడానికి వీలులేదు! పైగా 371(డి) సవ రణాధికరణను 1974లో ఇందిరాగాంధీ అమలులోకి తెచ్చి తెలుగు రాష్ట్ర సమైక్యతను, సమగ్రతను సుస్థిరం చేసింది! సరిగ్గా సవరించిన ఈ అధికరణే ఎన్టీఆర్ ప్రభుత్వం అమ లులోకి తెచ్చిన 610 జీఓ! ఈ ఊసు, ఈ ప్రస్తావనలు లేకుండా కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం తన ఉనికి కోసం జాతిని విచ్ఛిన్నం చేసే కార్యక్రమానికి సాహసించింది. నాడే మంత్రాంగం... రాష్ట్ర విభజనకు 1955 డిసెంబర్ 24 నాటికే కాంగ్రెస్‌లో ఒకవర్గం కుట్ర నడిపింది. ఎలా? సమైక్య రాష్ట్రావతరణకు ముందు 1953-1955 మధ్య కాలంలో ‘హైదరాబాద్ స్టేట్’ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు నాయక త్వంలో అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు విశాలాంధ్ర ఏర్పా టుకు అనుకూలంగా తీర్మానం ఆమోదించబోతున్న సమ యంలో ‘ఆంధ్ర మహాసభ’లోని మితవాదవర్గానికి నాయ కులుగా ఉన్న ‘పిడికెడు’ భూస్వామ్య, జాగీర్దారీ వర్గ ప్రతి నిధులు హుటాహుటిన ఢిల్లీకి పరుగుపెట్టి హోంమంత్రి గోవింద వల్లభపంత్తో మంతనాలాడి, ఆ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించకుండా వాయిదా వేయించడం జరి గింది! దీనితో వచ్చిందే రాజ్యంగంలోని 3వ అధికరణకు (1955 డిసెంబర్ 24న) వచ్చిన 5వ సవరణ చట్టం. అంత కుముందు రాష్ట్ర సమస్యలపై కేంద్రం రూపొందించే బిల్లు లను శాసనసభకు రాష్ర్టపతి నివేదించి, అభిప్రాయాలను తెలుసుకోవడమేగాక, బిల్లుపై ఓటింగ్ హక్కును కూడా వినియోగించుకోవడానికి అవకాశం కల్పించడమూ ఉం డేది. కానీ, కొందరి ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం సవరణ ద్వారా అసెంబ్లీలలో సభ్యుల అభిప్రాయం తెలు సుకోగలిగిన ఓటింగ్ హక్కును హరించివేస్తూ, 1955లో 3వ అధికరణకు నర్మగర్భంగా పాత ‘ప్రొవిజో’ను తొలగిం చి సవరణ తెచ్చారు. ఈ తప్పుడు సవరణ చాటునే పం జాబ్ అసెంబ్లీని దాటవేసి ఆ రాష్ట్రాన్ని విభజించారు! అయినా, స్థిరపడిన రాష్ట్రాల భూభాగాలను చెదరగొ ట్టడం, విడగొట్టే రాష్ట్రాల పేర్లను మార్చడం విషయంలో ఆయా రాష్ట్రాలతో విధిగా సంప్రదించాలని కూడా 1955 డిసెంబర్ 24 నాటి 5వ రాజ్యాంగ చట్టం (సెక్షన్-2) శాసిస్తోందని గుర్తించాలి! మళ్లీ అంబేద్కర్ మాటల్లోనే... కానీ, నేటి కాంగ్రెస్ నాయకత్వానికి ఇవేమీ పట్టవు. విభ జనపై శాసనసభ ముందుకు బిల్లు వస్తుందా, తీర్మానం వస్తుందా, లేదా వీటిపైన అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే తీసుకుంటారా, లేక ఓటింగ్ పెడతారా లేక తోకముడవ వలసివస్తుందా అన్న అంశాలపై తలోదారీ తొక్కుతున్నా రు! రాష్ట్రానికి చెందిన సొంత ఎంపీలకు, మంత్రులకు కూడా ఏ విషయం చెప్పకుండా కప్పెట్టడమే కాక, ప్రజల్ని వెర్రిబాగుల వాళ్లుగా భావిస్తున్నారు! రాజ్యాంగ సవర ణలు లేదా ఫెడరల్ స్వభావానికి విరుద్ధమైన అంశాలు చట్టాలలో చేరడం వల్ల ఒకే జాతికి చెందిన ప్రజల మధ్య అంతఃకలహాలు ఎలా వ్యాపిస్తాయో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఇలా హెచ్చరించారు. ‘‘అమెరికన్లు అం తర్యుద్ధానికి ఎందుకు దిగవలసివచ్చింది? రాష్ట్రాలు ఫెడ రేషన్ నుంచి ఎక్కడికక్కడ వేరుపడిపోవడానికి కాదు. అం దుకనే వాళ్ల ఫెడరల్ (సమాఖ్య) వ్యవస్థ అవిచ్ఛిన్నంగా ఉండిపోగలిగింది. కనుకనే భారత ముసాయిదా రాజ్యాం గ రచన బాధ్యతలు చేపట్టిన ఉన్నతస్థాయి సంఘం కూడా ఉత్తరోత్తరా ఊహాగానాలకు (స్పెక్యులేషన్) అవకాశం కల్పించడం కంటే మొదట్లోనే ఈ విషయాన్ని స్పష్టం చేయదలచింది’’ (డిబేట్స్: వాల్యూం-7) ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు -
అసెంబ్లీ తీర్మానానికి జాతీయపార్టీలు సానుకూలం: విజయమ్మ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై అసెంబ్లీ తీర్మానం పెట్టాలని తాము జాతీయ పార్టీలను కోరుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. జాతీయ పార్టీలన్నీ సానుకూలంగా స్పందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈరోజు ఆమె ఇక్కడ తమ పార్టీ ముఖ్యనేతలతో కలిసి డీఎంకే ఎంపీ కనిమొళి, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్, ఆ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి, లను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సహకరించాలని ఆమె వారికి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ముందు నుంచీ తాము సమైక్యాంధ్ర కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజనకు నియమించిన మంత్రుల కమిటీ మరో సైమన్ కమీషన్ లాంటిదని ఆమె విమర్శించారు. వైఎస్ఆర్ సిపి బృందం మరికొందరు జాతీయ పార్టీల నేతలను కలుసుకుంటుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం చేయవలసిన ప్రయత్నాలన్నీ ఆ పార్టీ చేస్తోంది. -
అసెంబ్లీ తీర్మానానికి జాతీయపార్టీలు సానుకూలం: విజయమ్మ
-
‘అసెంబ్లీ తీర్మానం’ భావమేమి?
దిగ్విజయ్, షిండే వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లోనే విస్మయం బాధ్యత నుంచి తప్పుకునేందుకేనని అనుమానాలు వైఎస్సార్సీపీని ఎలాగైనా ఇరుకున పెట్టడమే లక్ష్యం? అసెంబ్లీలో వేసింది రోశయ్య కమిటీ మాత్రమే సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం విషయంలో కాంగ్రెస్ నాయకత్వం పొంతన లేని ప్రకటనలు చేస్తూ గందరగోళం సృష్టిస్తోంది. తీవ్రమైన సమస్యను మరింత జటిలం చేసేందుకే ఈ ఎత్తుగడ వేశారన్న అనుమానాలు పీసీసీ నేతల నుంచే విన్పిస్తున్నాయి. తెలంగాణపై రాష్ట్ర అసెంబ్లీ గతంలోనే తీర్మానం చేసిందంటూ కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ చేసిన ప్రకటనలు తీవ్ర అయోమయం సృష్టిస్తున్నాయి. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయాల్సి ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలే చెబుతుండటం తెలిసిందే. ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి గందరగోళ ప్రకటనలు చేస్తున్నారన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అసలు తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం ఎప్పుడు జరిగిందంటూ కాంగ్రెస్ నేతలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు! తెలంగాణపై అసెంబ్లీలో ఒకట్రెండుసార్లు చర్చ జరిగినా తీర్మానమేదీ చేయలేదని గుర్తు చేస్తున్నారు. అయినా ‘తీర్మానం జరిగింద’ంటూ కేంద్ర పెద్దలు కావాలనే తప్పుదోవ పట్టించజూస్తున్నట్టు కనబడుతోందని అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్సీపీయే లక్ష్యం! తెలంగాణపై కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తర్వాత రాష్ట్రపతి ఆదేశాల మేరకు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తీర్మానంపై అసెంబ్లీలో అసలు సజావుగా చర్చయినా జరుగుతుందా, లేదా అన్న అనుమానాలున్నాయి. ఇలాంటి సమయంలో, ‘అసెంబ్లీలో ఇదివరకే తెలంగాణపై తీర్మానం జరిగింది’ అన్నట్టుగా ఢిల్లీ ముఖ్యులు పదేపదే మాట్లాడుతుండటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని కాంగ్రెస్ ఏకపక్షంగా తీసుకోలేదని, దానిపై అసెంబ్లీ ఇదివరకే తీర్మానం చేసిందనడం ద్వారా నెపాన్ని ఇతరులపైకి నెట్టడమే ఉముఖ్యోద్దేశంగా కన్పిస్తోందంటున్నారు. అందుకే వారు తెలంగాణ అంశానికి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ముడిపెట్టేలా ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ప్రకటన చేస్తున్నారని చెబుతున్నారు. వైఎస్ హయాంలోనే తెలంగాణపై తీర్మానం చేశారనే ప్రచారంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం వారి లక్ష్యమని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. అసలేం జరిగింది తెలంగాణ అంశంపై 2001 అక్టోబర్ 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానం మొదలుకుని ఇప్పటిదాకా జరిగిన ఏ సందర్భంలోనూ తీర్మానమనే ప్రస్తావనే ఎక్కడా కన్పించదు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై ప్రణబ్‌ముఖర్జీ నేతృత్వంలో 2001లో ఓ కమిటీని ఏఐసీసీ ఏర్పాటు చేసింది. తెలంగాణ, విదర్భ రాష్ట్రాల డిమాండ్లతో పాటు చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై రెండో ఎస్సార్సీ ఏర్పాటే మార్గమని అది సూచించింది. ఆ మేరకు 2001లో సీడబ్ల్యూసీలోనే కాంగ్రెస్ తీర్మానం చేసింది. దాన్నే అప్పటి ఎన్డీఏ ప్రభుత్వానికి పంపింది. రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని తీర్మానంలో స్పష్టం చేసింది. తర్వాత 2004 ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. మొదటి ఎస్సార్సీని గౌరవిస్తూ... విదర్భ, తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటుకు సబబైన కారణాలు కనిపిస్తున్నాయని, వీటితో పాటు ఇతర మరిన్ని డిమాండ్లు కూడా ఉన్న తరుణంలో రెండో ఎస్సార్సీ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉందని పేర్కొంటూ టీఆర్ఎస్తో పొత్తుల ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద పత్రంపై నాటి టీఆర్ఎస్ ముఖ్యనేత ఆలె నరేంద్ర సంతకం చేశారు. తరవాత తెలంగాణ అంశం పరిష్కారానికి రెండో ఎస్సార్సీ ఏర్పాటును 2004 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రస్తావించింది. సంప్రదింపులు, ఏకాభిప్రాయ సాధనతో తెలంగాణను ఏర్పాటు చేస్తామని కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కనీస ఉమ్మడి ప్రణాళికలోనూ పొందుపరిచింది. సంప్రదింపులు చేసి సరైన సమయంలో తెలంగాణను ఏర్పాటు చేస్తామని రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొన్నారు. రోశయ్య నేతృత్వంలో కమిటీ 2009 ఫిబ్రవరి 12న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో తెలంగాణపై ప్రకటన చేశారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని, అయితే ఆ విషయంలో ముందుగా భాగస్వాములందరితో విస్తృత సంప్రదింపులు జరపాలని స్పష్టం చేశారు. తెలంగాణపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవలసిన సమయం ఆసన్నమైందని, అంతకు ముందు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజల అభ్యంతరాలను, ఆందోళనలను పరిష్కరించాల్సిన అవసరముందని చెప్పారు. ఇందుకోసం ఉభయసభల సభ్యులతో కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నాడు నిండు సభలో వైఎస్ స్పష్టంగా ఒక ప్రకటన కూడా చేశారు. ‘‘టీడీపీ అధికారంలో ఉండగా అభివృద్ధి అసాధ్యమని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భావించారు. అందుకే సోనియాగాంధీని కలసి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేశారు. అప్పట్లో ఎన్డీఏ ప్రభుత్వం వద్ద రెండో ఎస్సార్సీ ప్రతిపాదన చేయగా అది తిరస్కరించింది. 2001లోనే సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణపై ఏకాభిప్రాయానికి ప్రణబ్‌ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏకాభిప్రాయానికి ప్రయత్నించినా సాధ్యంకాలేదు. కొన్ని పార్టీలు మద్దతివ్వడానికి నిరాకరించాయి. ముస్లిం మైనార్టీలు ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తమ భద్రతకు ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు. దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించాలి. 60 ఏళ్లుగా హైదరాబాద్ రాష్ట్ర రాజధానిగా ఉన్నందునే ఇక్కడ స్థిరపడ్డామని కోస్తా, రాయలసీమ ప్రజలు అంటున్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. రాష్ట్రాన్ని విభజిస్తే రెండు, మూడు, నాలుగు రాష్ట్రాలు చేయాలనే డిమాండ్లూ వస్తున్నాయి. సీమ, ఉత్తరాంధ్ర, కోస్తా రాష్ట్రాలు ఏర్పాటుచేయాలని అంటున్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించి తెలంగాణ ఏర్పాటుకు తీసుకోవలసిన చర్యలను సూచించడానికి అసెంబ్లీ, శాసనమండలి సభ్యులతో సంయుక్త కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. ఈ సంయుక్త కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత దాని ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుంది’’ అని ఆయన వివరించారు. అంతే తప్ప ఆనాడు సభలో ఎలాంటి తీర్మానమూ జరగలేదు. తరవాత అప్పటి ఆర్థిక మంత్రి కె..రోశయ్య అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీకి టీడీపీ స్పందించలేదు. వామపక్షాలు, బీజేపీ, టీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. 2009 డిసెంబర్ 7న అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య అఖిలపక్షాన్ని నిర్వహించి తెలంగాణపై అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నారు. సీపీఎం, ఎంఐఎం మినహా తక్కిన పార్టీలన్నీ తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైందని, ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని పేర్కొంటూ డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ప్రకటన చేశారు. దానిపై పార్టీల్లో భిన్నాభిప్రాయాలు రావడంతో, ‘పార్టీలు రెండుగా విడిపోయినందున దీనిపై మరింత విస్తృత స్థాయిలో చర్చలు చేయాల్సి ఉంద’ంటూ డిసెంబర్ 23న చిదంబరం మరో ప్రకటన చేశారు. 2010 ఫిబ్రవరి 3న కేంద్రం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని వేసింది. తరువాత కేంద్ర హోం శాఖ రెండుసార్లు అఖిలపక్షాన్ని నిర్వహించింది. షిండే హోం మంత్రిగా చివరిసారిగా అఖిలపక్షాన్ని నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నుంచి తెలంగాణ, సీమాంధ్ర ప్రతినిధులిద్దరూ హాజరై వాదన విన్పించారు. అయితే తెలంగాణ ప్రతినిధి వాదననే పార్టీ వాదనగా తీసుకుంటున్నట్టు షిండే పేర్కొన్నారు. ఈ పరిణామ క్రమంలో ఎక్కడా ‘అసెంబ్లీలో తీర్మానం, చర్చ, ఆమోదం’ అనే అంశాలే కానరావు. అయినా ‘అసెంబ్లీలో తీర్మానం జరిగింది’ అన్నట్టుగా దిగ్విజయ్, షిండే పదేపదే ప్రకటిస్తూ వస్తున్నారు!