
అసెంబ్లీ తీర్మానంతోనే విభజన జరగాలి:రఘువీరా
అనంత:అసెంబ్లీ తీర్మానంతోనే రాష్ట్ర విభజన జరగాలని మంత్రి రఘువీరా రెడ్డి అభిప్రాయపడ్డారు. విభజనపై అసెంబ్లీ తీర్మానం చేయాల్సిందే నంటూ ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడిన రఘువీరా..టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. సీమాంధ్ర రాజధానికి నాలుగు లక్షల కోట్లు ఇవ్వాలని బాబు డిమాండ్ పై మండిపడ్డారు. అప్పుడేమో రాష్ట్రానికి ప్యాకేజీలిస్తే సరిపోతుందన్న బాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ తీర్మానంతో విభజన జరిగితేనే అది అందరికీ ఆమోదయోగ్యం ఉంటుందన్నారు. లేకపోతే దేశ వ్యాప్తంగా రాష్ట్ర విభజనలు పుట్టుకొస్తాయని రఘువీరా తెలిపారు. ఇదిలా ఉండగా మరో మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీలో ఓడిస్తామన్నారు.రాష్ట్రంలో కొత్తపార్టీ వచ్చే అవకాశం లేదని శైలజానాథ్ తెలిపారు.