ఏపీలో పంటలకు మద‍్దతు ధర ఏదీ?
Published Tue, May 9 2017 11:45 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
గుంటూరు: రాష్ట్రంలో ఏ పంటకూ మద్దతు ధర లేదని ఏపీసీసీ అధ‍్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. మంగళవారం స్థానికంగా ఉన్న మిర్చి మార్కెట్ యార్డును రఘువీరారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ‍్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్రంగా మండిపడ్డారు.
చంద్రబాబు ఇచ్చిన ధరల స్థిరీకరణ నిధి హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. 90 లక్షల క్వింటాళ్ల మిర్చి ఉండగా 2 శాతం కూడా కొనుగోలు కాలేదని అన్నారు. కోల్డ్ స్టోరేజీల్లో దోపిడీ జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని, జిల్లాల్లో మార్క్‌ఫెడ్, నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement