'5 కోట్ల ఆంధ్రులను మోసం చేశారు'
హైదరాబాద్: బీజేపీ, టీడీపీ కలిసి ఐదు కోట్ల ఆంధ్రులను మరోసారి మోసం చేశారని ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. హోదా ఇవ్వకుండా ప్యాకేజీ ప్రకటించి చేతులు దులుపుకున్న కేంద్ర వెఖరిని నిరసిస్తూ.. రేపటి నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ద్రోహం చేసిన టీడీపీ-బీజేపీలను ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. హోదాతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ అమలు అయ్యేంత వరకు దీర్ఘకాలికంగా పోరాడతామని తెలిపారు.